మహానంది: ఉగాది ఉత్సవాలకు శ్రీగిరికి చేరుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు మహానందికి తరలివస్తున్నా రు. స్థానిక రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుంటున్నారు. కాగా ఆలయ ప్రాంగణంలో సరైన వసతులు లేకపోగా, గదులు తీసుకోవడానికి ఆర్థిక స్థోమత లేని భక్తులు చేసేదేమిలేక ఆలయం ముందు భాగంలో, సుపథ మండపాల్లో సేద తీరుతున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వచ్చే పేద భక్తులకు అధికారులు వసతి కల్పించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు.


