వీరభద్రా.. శరణు.. శరణు !
తుగ్గలి: ఎదులదొడ్డిలో వెలిసిన వీరభద్రస్వామి రథోత్సవం వైభవంగా సాగింది. గురువారం వేకువజామున వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ కాళికామాతా సమేత శ్రీ వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. స్థానికులతో పాటు వివిధ గ్రామాల పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించు కున్నారు. సాయంత్రం స్వామి ఉత్సవమూర్తులను పూలతో అలంకరించిన రథంలో ఉంచి భక్తులు రథాన్ని లాగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్ పర్యవేక్షణలో తుగ్గలి ఎస్‌ఐ కృష్ణమూర్తి, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


