● రవాణా రంగం కార్మికులకు కూటమి మొండి చేయి ● ఎన్నికల ముందు ఏటా రూ.15 వేల హామీ ● పది నెలలు అవుతున్నా ఊసే లేదు ● గత వైఎస్సార్‌సీపీ హయాంలో వాహనమిత్ర ద్వారా ఏటా రూ. 10 వేల సాయం
నంద్యాల(న్యూటౌన్): ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం, అధికారం వచ్చిన తర్వాత వాటిని అటకెక్కించడం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుకి పరిపాటిగా మారింది. ప్రజలను పదేపదే మోసం చేయడంలో తనకు తానే సాటి అని ప్రతీసారి నిరూపించుకుంటు న్నారు. 2014లో ఆరు వందలకు పైచిలుకు హామీలు ఇచ్చి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలకు మోసం చేశారు. 2024లోనూ అదే రీతిలో హామీలు ఇచ్చి తనదైన తీరులో ఎగనామం పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రమాద బీమా, ఆరోగ్యబీమా, డ్రైవర్ల పిల్లలకు విద్యా రుణాలు, తదితర హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి పదినెలలు గడిచిపోతున్నా వీటిలో ఏ హామీ కార్య రూపం దాల్చలేదు. తాజా గా ప్రవేశపెట్టిన 2025–26. వార్షిక బడ్జెట్లో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం పథకానికి రూపాయి కూడా కేటాయించ లేదు. సంక్షేమ బోర్డు, ఇతర హామీలను పరిగణనలోకి తీసుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం ఇవ్వాల్సిందేనని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సాయం అందించక పోగా అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రకరకాల పేర్లతో ఆపరాధ రుసుములు విధిస్తూ తమపై బాదుడు మొదలు పెట్టారని ఆటో కార్మికులు మండిపడుతున్నారు.
ఐదేళ్లలో రూ. 8.89 కోట్లు
2019MýS$ Ð]l¬…§ýl$ {糆{糄ýS ¯ól™èlV> OÐðlG‹Ü fVýS¯ŒS-Ððl*-çßæ¯ŒSÆð‡yìlz ´ë§ýlĶæ*{™èl ^ólçÜ$¢¯]l² çÜÐ]l$Ķæ$…ÌZ BĶæ$°² BsZ {OyðlÐ]lÆý‡$Ï MýSÍíÜ çÜÐ]l$çÜÅ-ÌS¯]l$ ^ðl糚-MýS$-¯é²Æý‡$. A«¨-M>-Æý‡…-ÌZMìS Ð]lõÜ¢ Ý÷…™èl…V> BsZ E¯]l²-Ðé-Ç™ø ´ër$ sêÅMîSÞ {OyðlÐ]l-Æý‡ÏMýS$ Hyé-¨MìS Æý‡*.10 ÐólË$ CÝë¢Ð]l$° B çÜÐ]l$Ķæ$…ÌZ fVýS¯]l¯]l² Ð]l*r C^éaÆý‡$. 2019ÌZ A«¨M>-Æý‡…-ÌZMìS Ð]l_a¯]l Ððl…r¯ól Ðéçßæ-¯]l-Ñ${™èl ç³£ýlMýS… õ³Æý‡$™ø Æý‡*.10 ÐólÌS BÇ-®MýS ÝëĶæ$… A…¨…-^éÆý‡$. AƇ$$-§ólâýæÏ ´ër$ Hsê D BǦMýS ÝëĶæ$… A…¨çÜ*¢ Ð]l^éaÆý‡$. D yýlº$¾-ÌS¯]l$ BsZ Ð]l$Æý‡-Ð]l$Ã-™èl$Ë$, C¯]l*ÞÆð‡¯ŒæÞ,-ె¯ŒSÞ, íœsñæ²‹Ü çÜÇtíœ-MðSsŒæ Ð]l…sìæ Ðésìæ MøçÜ… Eç³-Äñæ*-W…-^èl$-MýS$¯ól ÐéÆý‡$. ¯]l…§éÅÌS hÌêÏÌZ Ðéçßæ¯]l Ñ${™èl ç³£ýlMýS… §éÓÆ> 2019 ¯]l$…_ 2023 Ð]lÆý‡MýS$ §é§éç³# 8,892 Ð]l$…¨ ÌS¼-®-§é-Æý‡$-ÌSMýS$ Æý‡*.8.89 Mør$Ï ÝëĶæ*°² A…¨…-^éÆý‡$.
కూటమి మేనిఫెస్టోలో ఇలా..
బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ. 15 వేలు ఆర్థిక సాయం. డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు, డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు రూ. 4 లక్షల వరకు పొందే రుణాలపై 5 శాతం పైబడిన వడ్డీ సబ్సిడీ.


