జిల్లాలో ఎంఎల్‌ఎస్ పాయింట్లు: 10 రేషన్‌షాపుల సంఖ్య: 1,
పేదల రేషన్ కార్డులను ఏరివేసేందుకు అంతా సిద్ధం అయ్యింది. తెరపైకి ఈకేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) వచ్చింది. ఏప్రిల్ నెలాఖరు వరకు గడువునూ రాష్ట్ర ప్రభుత్వం విధించింది. వ్యవసాయ కూలీలకు కష్టం వచ్చింది. బంగారు భవిష్యత్తు కోసం పాఠశాలకు వెళ్లే విద్యార్థులకూ అవస్థ ఎదురొచ్చింది. సరిగ్గా నడవలేని వృద్ధులు సైతం తడబడాల్సి వస్తోంది. వేలి ముద్రలు సరిగ్గా పడటం లేదు. ప్రభుత్వ చౌకదుకాణాల ద్వారా ఇక రేషన్ అందని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి.
ఇవీ కష్టాలు..
● ఈకేవైసీ చేయించుకోకపోతే రేషన్, నిత్యావస సరుకులు అందుతాయో లేదోనని కార్డుదారులు సచివాలయాలు, డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక సమస్య కారణంగా సర్వర్లు మొరాయిస్తుండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రేషన్ షాపులకు అనుసంధానంగా ఎండీయూ(మోబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్) ఏర్పాటు చేసింది. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి బియ్యం, కందిపప్పు, చక్కెరతోపాటు రా గులు, జొన్నలు, ఇతర నిత్యావసర సరుకులను ఇంటిముంగటకే అందజేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి ఉంచుకుని మధ్యస్త సన్నరకం బియ్యాన్ని సార్టెక్స్ చేసి ప్లోరిఫైడ్ బి య్యంగా మార్చి సరఫరా చేసింది. కూటమి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ సరుకు ల్లో కోత పెడుతూ పేదల కడుపుకొడుతోంది.
● జిల్లాలోని కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన్, ఆత్మకూరు, శ్రీశైలం, రుద్రవరం, నందికొట్కూరు, నంద్యాల, ప్యాపిలి మండలాల్లో ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఆయా ఎంఎల్‌ఎస్ పాయింట్ల పరిధిలో 1,204 రేషన్ షాపులు ఉండగా 351 ఎండీయూ వాహనాల ద్వారా ప్రతి నెలా ప్రజా పంపిణీ కొనసాగుతోంది. ఆయా స్టాక్ పాయింట్ల పరిధిలో 15.77 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎండీయూ వాహనాలను తగ్గించారు.
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల వర్తింపుకు రేషన్‌కార్డు ప్రామాణికం. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తకార్డులు ఇవ్వడం లేదు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం లేకుండా పోయింది. ఈకేవైసీలో నెలకొన్న అడ్డంకులు తొలగించాలని, కొత్తరేషన్‌కార్డులు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
● ఈకేవైసీ కాక అవస్థల్లో పేదలు
● ఏప్రిల్ నెలాఖరు వరకు గడువు
● జిల్లాలో 15.77 లక్షల రేషన్‌కార్డులు
● 1.71 లక్షల కార్డుదారుల
ఈకేవైసీ పెండింగ్
● ఆందోళనలో లబ్ధిదారులు
పేదల కడుపుకొట్టొద్దు
రేషన్‌షాపుల ద్వారా బియ్యం, చక్కెర మాత్రమే ఇస్తున్నారు. కందిపప్పు, జొన్నలు, రాగులు, ఇతర నిత్యావసరాలు ఇవ్వడం లేదు. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వం ఇచ్చే రేషన్‌తో కడుపు నింపుకుంటున్నారు. ఈకేవైసీ పేరుతో రేషన్ కార్డులు తొలగించి పేదల కడుపుకొట్టొద్దు.
– ఓబులేసు, కార్డుదారుడు, కోవెలకుంట్ల
కూలీలకు మినహాయింపు ఇవ్వాలి
రేషన్‌కార్డులకు ఏప్రిల్ 30వ తేదీలోగా ఈకేవైసీ చేయించుకోవా లని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ పనులు లేక కొందరు ఉపాధి పనులకు వెళుతున్నారు. మరికొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసు కుని ఈకేవైసీలో ఉపాధి, వ్యవసాయ కూలీలకు మిన హాయింపు ఇవ్వాలి. – సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు, కోవెలకుంట్ల
కోవెలకుంట్ల/నంద్యాల (అర్బన్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పదినెలలు పూర్తయినా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. గతంలో ఉన్న పలు పథకాలను నిలిపివేశారు. కొత్తవి ఇవ్వకపోగా ఉన్న వాటికి ఎసరు పెట్టారు. తాజాగా ఈకేవైసీ పేరుతో పేదలకు రేషన్ అదించకుండా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో 1.71 లక్షల మంది కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. గతంలో వేలిముద్రలు లేకున్నా ఫొటోల ఆధారంగా రేషన్‌కార్డుల్లో ఐదు సంవత్సరాల్లోపు పిల్లలను చేర్పించారు. వీరందరూ ఆధార్‌కార్డులు అప్‌డేట్ చేయించుకుని ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. తొలుత మార్చి నెలాఖరులోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వర్లు మొరాయిస్తుండటంతో నమోదు గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడగించినట్లు అధికారులు ప్రకటించారు.
ఇదీ దుస్థితి..
● ఐదు సంవత్సరాల నుంచి పదేళ్ల పిల్లలకు ఆధార్ అప్‌డేట్ చేయించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం, అరకొరగా ఉన్న సర్వర్లు పనిచేయక పిల్లలతో కేంద్రాలకు వెళ్లిన తల్లిదండ్రులకు తిప్పలు తప్పడం లేదు. కొందరు వేసవికాలం పనులు మానుకుని కోవెలకుంట్ల, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, తదితర పట్టణాలకు వెళ్లి ఆధార్‌అప్‌డేట్ చేసుకుంటున్నారు.
● గతంలో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వేలిముద్రలు పడకపోతే ఐరిస్ తీసుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోగా రేషన్ తీసుకోవాలంటే తప్పని సరిగా వేలిముద్రలు వేయాల్సి ఉంది. వృద్ధులు కావడంతో ఈకేవైసీ నమోదు చేసుకున్నా పలు కారణాలతో వేలిముద్రలు పడని పరిస్థితి నెలకొంది. ఎక్కువశాతం మంది వృద్ధులు ఇప్పటి వరకు ఆధార్, మోబైల్‌నంబర్ అప్‌డేట్ చేయించుకోలేదు. కొందరికి సరైన మోబైల్‌ఫోన్లు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో అధికారులు ఈకేవైసీ హడావిడి చేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు.
● జిల్లాలో చాలా మంది పనులు లేక వలసలు వెళ్లారు. చదువు నిమిత్తం కొందరు విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. వీరందరికి ఆధార్ అప్‌డేట్ అయితేకాని ఈకేవైసీ పూర్తయ్యే పరిస్థితి లేదు. ఎవరెవరికి ఈకేవైసీ నమోదు కాలేదో వారి జాబితాను రేషన్ డీలర్లకు అప్పగించారు. కేవలం పేర్లుమాత్రమే ఇవ్వడంతో వివరాలు తెలుసుకోవడం రేషన్ డీలర్లకు కష్టతరంగా మారింది.
● అద్దె ఇళ్లలో ఉండేవారు ఈకేవైసీ చేయించుకునేందుకు ఏ రేషన్‌షాపుకు వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఒక సచివాలయ పరిధిలో మ్యాపింగ్ అయి వేరే ప్రాంతానికి వెళ్లినవారి రేషన్‌షాపు నంబర్ మారిపోతుంది. ఇలా జాబితాలో కొందరి పేర్లు కనుక్కోవడం కష్టమైంది. ఈకేవైసీ చేయించుకోవాలనే విషయంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదు. దీంతో ఈ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది.
జిల్లాలో ఎంఎల్‌ఎస్ పాయింట్లు: 10 రేషన్‌షాపుల సంఖ్య: 1,
జిల్లాలో ఎంఎల్‌ఎస్ పాయింట్లు: 10 రేషన్‌షాపుల సంఖ్య: 1,
జిల్లాలో ఎంఎల్‌ఎస్ పాయింట్లు: 10 రేషన్‌షాపుల సంఖ్య: 1,
జిల్లాలో ఎంఎల్‌ఎస్ పాయింట్లు: 10 రేషన్‌షాపుల సంఖ్య: 1,
జిల్లాలో ఎంఎల్‌ఎస్ పాయింట్లు: 10 రేషన్‌షాపుల సంఖ్య: 1,


