జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించండి
కర్నూలు: జాతీయ లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి కోరారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కర్నూలు న్యాయ సేవా సదన్‌లో శుక్రవారం కర్నూలు పోలీసు అధికారులతో కబర్ధి జాతీయ లోక్ అదాలత్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 10వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎకై ్సజ్ మెజిస్ట్రేట్ సరోజమ్మ మాట్లాడుతూ రాజీ అయ్యే కేసులన్నీ ప్రతిరోజూ కోర్టుకు తీసుకురావాలని సూచించారు. ట్రైనీ మెజిస్ట్రేట్‌లు లక్ష్మి కర్రి హేమ, అపర్ణ, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, ఎకై ్సజ్ సీఐలు రాజేంద్రప్రసాద్, చంద్రహాస్, సివిల్ సీఐలు రామయ్య నాయుడు, నాగరాజరావు, శేషయ్య, మధుసూదన్ గౌడ్, శ్రీధర్‌తో పాటు పలువురు ఎస్‌ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ అయ్యే సివిల్, క్రిమినల్, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించుకోవాలని కబర్ధి, లీలా వెంకటశేషాద్రి ఈ సందర్భంగా పోలీసు అధికారులకు సూచించారు. కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలన్నారు.


