
జూపాడుబంగ్లా పీహెచ్‌సీలో తొలి ప్రసవం
జూపాడుబంగ్లా: స్థానిక ప్రాథమిక వైద్యకేంద్రంలో శనివారం వైద్యురాలు డాక్టర్ సభా అధ్వర్యంలో వైద్యసిబ్బంది మొట్టమొదటి ప్రసవం చేశారు. జూపాడుబంగ్లాలో పీహెచ్‌సీ ఏర్పాటుచేసి 45 ఏళ్లు అవుతున్నా 2023 వరకు సొంత భవనాలు లేవు. అప్పటి ముఖ్యమంత్రి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడులో భాగంగా 2023లో రూ.1.80కోట్లు నిధులు ఇవ్వడంతో నూతన వైద్యకేంద్రాన్ని నిర్మించారు. అవసరమైన వైద్యపరికరాలు మంజూరు చేశారు. జూపాడుబంగ్లాలోని కాసానగర్ కాలనీకి చెందిన మీనాక్షి అనే మహిళ శనివారం పీహెచ్‌సీలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డలకు ఆరోగ్యం బాగున్నట్లు డాక్టర్ సభా తెలిపారు.
సాయంత్రం మరో ప్రసవం
శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తరిగోపుల గ్రామానికి చెందిన నసీమూన్ అనే గర్భవతి పురిటినొప్పులతో జూపాడుబంగ్లా పీహెచ్‌సీకి వచ్చారు. ఆమెను వైద్యసిబ్బంది పరీక్షించి సుఖ ప్రసవం చేశారు.
గత ప్రభుత్వం చేపట్టిన
‘నాడు– నేడు’ పనులే కారణం