రైల్వే సామగ్రి చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్
● 1.5 టన్నుల బరువైన 240 ఇనుప రాడ్లు స్వాధీనం
● పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు
మహానంది: గాజులపల్లె రైల్వేస్టేషన్ సమీపంలో ఇటీవల రైల్వే ఇనుప సామగ్రిని చోరీ చేసిన కేసులు శుక్రవారం ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గత నెల 31న గాజులపల్లె ఆర్‌ఎస్ సమీపంలో కిలో మీటర్ మేరకు రైల్వేట్రాక్‌కు సపోర్టుగా ఏర్పాటు చేసిన ఇనుప బారికేడ్‌లను తొలగించి అపహరించారు. వీటి విలువ సుమారు రూ. 1.10 లక్షలు ఉంటుంది. సైట్ ఇంజనీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం సీతారామాపురం సమీపంలో కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద అనుమానాస్పదంగా ఉన్న గోపవరం గ్రామానికి చెందిన పిన్నాపురం తిరుమలేసు, నాగసరపు అశోక్, మాచర్ల ఆదికేశవ, షేక్ సద్దాంహుసేన్, శివను అదుపులోకి విచారించగా చోరీ వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి 1.5 టన్నుల బరువున్న 240 ఇనుపరాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వారిని నంద్యాల జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారన్నారు. మరో నిందితుడు విక్రమ్‌ను పరారీలో ఉన్నాడని, త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.


