
వినతుల పరిష్కారంపై అభిప్రాయాలు సేకరించండి
నంద్యాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారంపై ప్రజల అభి ప్రాయాలు సేకరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను కలెక్టర్‌తో పాటు ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చి పరిష్కరించిన దరఖాస్తుల ఎండార్స్‌మెంట్లు సంబంధిత ఫిర్యాదుదారులకు వెళ్లడం లేదన్నారు. సమస్యలు పరిష్కారమైన ప్రజల అభిప్రాయ సేకరణ 44 శాతమే పూర్తయిందని మిగిలిన అర్జీదారుల అభిప్రాయాలను సేకరించాలన్నారు. వారి సెల్ఫీ ఫొటో, వీడియో క్లిప్పింగులను సంబంధిత యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. గ్రామ, పట్టణ ప్రాంతాలలో చెత్తకుప్పలు పేరుకపోతున్నాయని పంచాయతీ సెక్రటరీలు, ఈవోఆర్డీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో 220 వినతులు వచ్చాయని, వీటన్నింటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ రాజకుమారి