ఎన్నికల ముందు ఎన్నో అమలు కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. పది నెలలు కావస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను దగా చేస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ముందు ఎన్నో అమలు కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. పది నెలలు కావస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను దగా చేస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి

Published Mon, Mar 24 2025 5:59 AM | Last Updated on Mon, Mar 24 2025 5:58 AM

కోవెలకుంట్ల: అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు 20 లక్షల ఉద్యోగాలు/ నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాది కూ. 15 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 20 వేలు పెట్టుబడి సాయం, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్ల సరఫరా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ కూటమి నేతలు హామీ ఇచ్చారు. వీటిలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ హామీని అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకుంది. సూపర్‌సిక్స్‌ హామీలు అటుంచితే 50 ఏళ్లకు పింఛన్‌ అందుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆశపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి జిల్లాలోని 29 మండలాల పరిధిలో 2.22 లక్షల మంది పింఛన్‌ దారులున్నారు. పింఛన్లకు అర్హత ఉండి మరో 4,500 మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గడిచిన పది నెలల కాలంలో వివిధ కారణాలు సాకు చూపి దాదాపు 7 వేల పింఛన్లు తొలగించారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపు 2 లక్షల మంది ఉన్నట్లు ప్రాథమిక అంచనా. వీరంతా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆహార అలవాట్ల కారణంగా 50 ఏళ్లకే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. బీపీ, షుగర్‌, కాళ్లనొప్పులు, తదితర దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో వ్యవసాయ, ఉపాధి పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నెలకు రూ. 4 వేలు పింఛన్‌ వస్తే కుటుంబ పోషణ, మందులకు ఆసరాగా ఉంటుందని భావించిన వారికి నిరాశే మిగిలింది. ఒకవైపు పనులు చేతకాక, మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. 50 ఏళ్ల వారికి పింఛన్లు ఎప్పుడిస్తారని అర్హత ఉన్న వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

కొత్త పింఛన్ల ఊసే లేదు

2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల ప్రస్తావననే పక్కన పెట్టింది. గత ఏడాది జనవరి నెల నుంచి ఎన్నికల కోడ్‌ వచ్చే నాటికి జిల్లాలో 4,500 మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, చేనేత, తదితర పింఛన్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి గత ఏడాది జూన్‌ నెలలో కొత్త పింఛన్లు అందాల్సి ఉంది. వీరందరూ 14 నెలల నుంచి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పింఛన్‌ వస్తుందని ఆశగా గత పది నెలల నుంచి సచివాలయాల వద్ద వెళ్లి అడిగితే కొత్త పింఛన్లు విడుదల కాలేదని సిబ్బంది చెబుతుండటంతో ఉసురుమంటూ వెనుదిరుగుతున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారే కాకుండా గత ఏడాది జూన్‌ నెల నుంచి పింఛన ్లకోసం అర్హత ఉండి దరఖాస్తు చేసుకునేందుకు వందల మంది ఉన్నారు. డిసెంబర్‌ నెల నుంచి కొత్త పింఛన్‌దారులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు సచివాలయల్లో పింఛన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం పింఛన్‌ పొందుతూ అనారోగ్యం, వివిధ కారణాలతో పింఛన్‌ లబ్ధిదారుడు మృతి చెందితే అలాంటి పింఛన్లు మాత్రమే ఆ మరుసటి నెల ఇస్తున్నారు. గత జనవరి నుంచి మార్చి నెల వరకు ఇలాంటి పింఛన్ల కోసం వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నా వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం విచారకరం.

జగనన్న పాలనలో ఇలా..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న విప్లవాత్మక మార్పులు చేపట్టారు. గ్రామ సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు పింఛన్‌ డబ్బులు ఠంచన్‌గా అందాయి. మొదట్లో పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఒకటి, రెండు నెలల్లో పింఛన్‌ చేతికందేది. తర్వాత ఏటా జూలై నుంచి డిసెంబర్‌ వరకు పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి నెలలో, జనవరి నుంచి జూన్‌ నెల వరకు దరఖాస్తు చేసుకున్న వారికి జూలై నెలలో కొత్త పింఛన్లు మంజూరు చేసి పేదలను ఆదుకుంది.

50 ఏళ్లకే పింఛన్‌ అమలులో

కూటమి ప్రభుత్వం కాలయాపన

పది నెలలు అవుతున్నా కార్యాచరణ

అంటూ జాప్యం

జిల్లాలో 2 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ,

బీసీ, మైనార్టీల ఎదురుచూపు

వృద్ధాప్య, వితంతు కొత్త పింఛన్ల

ఊసేలేదు

సూపర్‌

సిక్స్‌కు

నిధుల్లేవ్‌

జిల్లాలో ఇదీ పరిస్థితి..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి పింఛన్ల సంఖ్య: 2.22 లక్షలు

ఇప్పటి వరకు కోత పెట్టినవి: 7 వేలు కొత్త పింఛన్ల దరఖాస్తుల సంఖ్య: 4,500

జిల్లాలో 50 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న వారు: 2 లక్షల మంది

ఎన్నికల ముందు ఎన్నో అమలు కాని హామీలను గుప్పించి అధికారం1
1/1

ఎన్నికల ముందు ఎన్నో అమలు కాని హామీలను గుప్పించి అధికారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement