
ఏపీ టీఏఎస్‌ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సునీల్‌కుమార్
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అసోసియేషన్(ఏపీ టీఏఎస్‌ఏ) నూతన కార్యవర్గం ఎన్నికలు సోమవారం విజయవాడలో జరిగాయి. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కర్నూలు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఎస్‌టీఓగా పనిచేస్తున్న పలనాటి సునీల్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి ఈయన అసోసియేషన్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై నట్లుగా ఎన్నికల అధికారి పి.కిరణ్‌కుమార్ ధ్రువపత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గంలో తనకు ప్రాతినిధ్యం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ట్రెజరీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఐటీఐలో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రంలో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రసాద్ సోమవారం తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలో చేరాల్సిన విద్యార్థులు మే 24వ తేదీలోపు iti.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని, 26వ తేదీలోపు నంద్యాల ప్రభుత్వ ఐటీలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకుని, జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు డోన్ ప్రభుత్వ ఐటీఐలో జరిగే కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. మరింత సమాచారం కోసం 9866022451 నంబరును సంప్రదించాలన్నారు.
సరిహద్దు చెక్‌పోస్ట్‌లపై నిఘా పెంచుతాం
ఎమ్మిగనూరురూరల్: రాష్ట్రాల సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద నిఘా పెంచుతామని రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక మద్యాన్ని అక్రమ రాష్ట్రాంలోకి రాకుండా నిఘా ఉంచామన్నారు. మద్యం దుకాణాల పక్కన అనుమతులు లేకుండా షెడ్లు ఏర్పాటు చేసుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. కర్ణాటక మద్యంతో పాటు బెల్టుషాపులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సరిహద్దు చెక్‌పోస్ట్‌లను పరిశీలించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎకై ్సజ్ సీఐ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
బదిలీలకు మాన్యువల్
కౌన్సెలింగ్ నిర్వహించాలి
నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్ శాచేరు. సోమవారం ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి శివయ్య, ఉపాధ్యక్షుడు జాకీర్‌హుసేన్‌లతో కలిసి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఆన్‌లైన్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. 8 ఏళ్లు పూర్తయిన ఎస్‌జీటీలు 1,500పైగా ఆప్సన్లు ఇచ్చుకోవాల్సి వస్తోందన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ నాయకులు వీరేశ్వరరెడ్డి, పుల్లయ్య, రాజేష్, మల్లికార్జున, మధు, తదితరులు పాల్గొన్నారు.

ఏపీ టీఏఎస్‌ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సునీల్‌కుమార్

ఏపీ టీఏఎస్‌ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సునీల్‌కుమార్