ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారికి పింఛన్లు ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. పదినెలలు గడస్తున్నా ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదు. ఇప్పటి వరకు 50 ఏళ్ల పింఛన్ రాకపోగా నాకు 60 ఏళ్ల వయస్సు వచ్చింది. కనీసం వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకుందామనుకున్నా కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు.
– నాగయ్య, కోవెలకుంట్ల
ఇంకెన్నాళ్లు కాలయాపన
వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని దాదాపు రెండేళ్లు కావస్తోంది. నా భర్త నాగరాజుకు ప్రతి నెల వృద్ధాప్య పింఛన్ వచ్చేది. అనారోగ్యంతో మృతి చెందగా భర్త పింఛన్ భార్యకు వస్తుందన్నారు. గత ఏడాది జనవరి నెలలోనే పింఛన్ రావాల్సి ఉంది. వివిధ కారణాలతో ఆ నెలలో రాకపోగా తర్వాత ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చినా ఇప్పటి వరకు పింఛన్ అందలేదు. పింఛన్ మంజూరు చేసి అధికారులు ఆదుకోవాలి.
– లీలావతమ్మ, కోవెలకుంట్ల
పేదలకు ఆసరాగా నిలవాలి
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 50 ఏళ్ల నుంచి 59 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు మంజూరు చేయాలి. ఈ వయస్సులో వివిధ రోగాలతో బాధపడుతూ ఎంతో మంది వ్యవసాయ, ఉపాధి పనులు చేయలేకపోతున్నారు. అలాంటి వారికి ప్రతినెలా వచ్చే 4 వేల రూపాయలు ఎంతో ఆసరాగా ఉంటుంది. 50 ఏళ్లు వయస్సు నిండి పింఛన్ వస్తుందని ఎదురు చూస్తున్నాను.
– దేవరత్నం, అవుకు
ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి