
‘ఉగాది’ ఆదాయం రూ. 47 లక్షలు
మహానంది: మహానందీశ్వరుడి దర్శనార్థం వేలాది సంఖ్యలో తరలివచ్చిన కన్నడిగులు కాసులు కురిపించారు. ఈ ఏడాది ఉగాది సందర్భంగా మహానంది దేవస్థానానికి రూ. 47,31,792 ఆదాయం వచ్చినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 ఉగాది సందర్భంగా రూ. 42,24,818 వచ్చిందని, ఈ ఏడాది అదనంగా రూ. 5,06,974 పెరిగిందన్నారు.
హమ్మయ్యా..
పరీక్షలు ముగిశాయి
నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పరీక్షలు మంగళవారం ముగియడంతో విద్యార్థుల సంతోషానికి అవధుల్లేవు. హమ్మయ్యా.. అన్ని ప రీక్షలు ప్రశాంతంగా రాశామని చెప్పారు. గత నెల 17వ తేదీ నుంచి మంగళవారం వరకు జిల్లాలో 130 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మంగళవారం సోషల్ పరీక్షకు 24,855 మంది విద్యార్థులకు గాను 24,474 మంది హాజరు కాగా.. 381 మంది గైర్హాజరయ్యారు.
రేపటి నుంచి మూల్యాంకనం
జిల్లాకు 1.90 లక్షల పదోతరగతి జవాబు పత్రాలు వచ్చాయని, ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు ఎస్‌డీఆర్ ఉన్నత పాఠశాలలో మూ ల్యాంకనం నిర్వహిస్తున్నట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
రేపటి నుంచి
అక్కడక్కడా వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గే అవకాశం ఏర్పడింది. ఈ నెల 3, 4 తేదీల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త నారాయణస్వా మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
సీపీఆర్‌కు గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శుల జాబితా
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈఓఆర్‌డీ పదోన్నతులకు అర్హులైన గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శుల జాబితాను కమిషన ర్ ఆఫ్ పంచాయతీరాజ్(సీపీఆర్)కు పంపారు. ఈ జాబితాలో బాల ఆంజనేయులు (నంద్యాల),ఎ.నాగరాజు(ఆదోని), జి.శ్రీనివాసులు (జెడ్పీ),కె.నాగరాజు(ఆదోని), వై.ప్రభాకర్ (ఆలూరు), హరిలీల(నంద్యాల), విజయలక్ష్మి (ఆదోని), జాకీర్‌హుసేన్(కర్నూలు), జేమ్స్ కృపావరం(డీపీఆర్‌సీ), మల్లీశ్వరి(డీపీఆర్‌సీ), అబ్దుల్ రహీం(దేవనకొండ) ఉన్నారు. సీపీఆర్ కోరిన నేపథ్యంలో అర్హులైన గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన ఏసీఆర్స్‌ను ఎంపీడీఓల ద్వారా సేకరించారు.