ఒలింపిక్స్‌లో షేక్ జఫ్రీన్ రాణించాలి
● జాయింట్ కలెక్టర్ నవ్య
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు డివిజన్ కో– ఆపరేటివ్ అధికారిణిగా విధులు నిర్వహిస్తున్న షేక్ జఫ్రీన్ ఈ ఏడాదిలో జరిగే ఒలింపిక్స్ పోటీల్లో బంగారు పతకం సాధించాలని జాయింట్ కలెక్టర్ నవ్య ఆకాంక్షించారు. గత నెల 20 నుంచి 23 వరకు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగిన నేషనల్ గేమ్స్ (నేషనల్ డెఫ్ సీనియర్ టెన్నిస్ చాంపియన్ షిప్–2025)లో రెండు బంగారు పతకాలు సాధించిన షేక్ జఫ్రీన్‌ను అభినందించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా సహకార కేంద్రబ్యాంకులో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీ, డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీ చైర్‌పర్సన్ నవ్య హాజరై ప్రసంగించారు. సహకార శాఖలో కర్నూలు డివిజన్ అధికారిగా జఫ్రీన్ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూనే నేషనల్ గేమ్స్‌లో కూడా ప్రతిభ కనబరచడం హర్షనీయమన్నారు. ఒలింపిక్స్‌లో రాణించేందుకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ఎన్.రామాంజనేయులు, డీసీసీబీ సీఈవో విజయకుమార్, జనరల్ మేనేజర్ పి.రామాంజనేయులు, డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌కుమార్, నాగిరెడ్డి, ఏజీఎంలు త్రినాథ్‌రెడ్డి, గీత, షేక్ జాఫ్రిన్ తండ్రి జాకీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


