
చిరు వ్యాపారి కుమార్తె ప్రతిభ
ఆత్మకూరు: పట్టణంలోని కేజీ రోడ్డులోని ఎస్‌బీఐ బ్యాంక్ ఎదుట గోనె సంచుల వ్యాపారం చేసే జిలానీ కుమార్తె సబియా ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చాటింది. స్థానిక ఓ ప్రైవేటు కళాశాలలో బైపీసీ చదువుతోంది. శనివారం విడుదలైన ఫలితాల్లో 440 మార్కులకుగానూ 433 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా జిలానీ మాట్లాడుతూ.. ‘నా కుమార్తె బాగా చదువుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రెండో సంవత్సరం కూడా మంచి మార్కులు సాధించి స్టేట్ ర్యాంకు పొందాలని ఆశిస్తున్నాను. సబియా డాక్టర్‌గా స్థిరపడాలన్నదే కోరిక’ అన్నారు.