శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మంగళవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన కర్టాటక గవర్నర్‌కు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో గవర్నర్‌కు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఈఓ స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూ ప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు.