మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీమన్ న్యాయసుధా మంగళ మహోత్సవం సోమవారం ముగిసింది. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల నేతృత్వంలో రెండు రోజుల పాటు ఈ ఉత్సవం నిర్వహించారు. వివిధ మఠాధిపతులు సమక్షంలో శ్రీమన్ న్యాయసుధా గ్రంఽథంపై తర్క , సారాంశ ఘోష్టి జరిపారు. మహోత్సవంలో ఉత్తమ ప్రతిభ చాటిన ఎనిమిది మంది విద్యార్థులకు ప్రశంసా పత్రం, అవార్డులు ప్రదానం చేశారు. అంతకు ముందు ఊంజల మంటపంలో రాఘవేంద్రుల విరాట్‌కు పీఠాధిపతులు విశేష పూజలు చేపట్టారు. వేడుకలో వ్యాసరాజ మఠం పీఠాధిపతి విద్యాశ్రీషా తీర్థులు, శ్రీపాదరాజ మఠం పీఠాధిపతి సుజయనిధి తీర్థులు, కృష్ణాపుర మఠం పీఠాధిపతి విద్యాసాగర తీర్థులు, కనియూరు మఠం పీఠాధిపతి విద్యావల్లభతీర్థులు, శిరూర్ మఠం పీఠాధిపతి వేదవర్ధన తీర్థులు, అధమారు మఠం పీఠాధిపతి ఈషాప్రియ తీర్థులు, బందరకెరె మఠం పీఠాధిపతి విద్ద్యేశ తీర్థులు , కన్వమఠం పీఠాదిపతి విద్యాకన్వ విరాజ తీర్థులు, బాలఘర్ మఠం పీఠాధిపతి అక్షోభ్య రామ ప్రియ తీర్థులు , చిత్తాపూర్ మఠం పీఠాధిపతి విద్ద్యేంద్ర తీర్థులు, ఉడిపి మఠం పీఠాధిపతులు బన్నంజే రాఘవేంద్ర తీర్థులు, వామన తీర్థులు పాల్గొన్నారు.
ముగిసిన మంగళ మహోత్సవం