● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి
కల్లూరు: మండలంలోని కె. మార్కాపురం, తడకనపల్లె గ్రామాలకు సంబంధించిన రేషన్ షాపులకు సంబంధించి కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కోరారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ అమలు చేయకుండా కొందరు అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కాటసాని వెంట రేషన్ డీలర్లు, గ్రామ నాయకులు ఉన్నారు.


