పీజీఆర్‌ఎస్‌లో 80 వినతులు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌లో 80 వినతులు

Published Tue, Apr 8 2025 7:41 AM | Last Updated on Tue, Apr 8 2025 7:41 AM

పీజీఆ

పీజీఆర్‌ఎస్‌లో 80 వినతులు

బొమ్మలసత్రం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యాక్రమంలో 80 వినతులు అందాయి. జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా వినతులు అందుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ చట్టపరమైన ఫిర్యాదులపై వెంటనే విచారించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. పీజీఆర్‌ఎస్‌లో తమకు అందిన ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా ఆయా స్టేషన్‌ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు. ఎవరైనా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు రాలేని వారు సమీపంలోని స్టేషన్‌ అధికారులకు వినతులు సమర్పించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ సీఐలు సూర్యమౌళి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేసీ కాల్వలో తగ్గిన నీటి ప్రవాహం

జూపాడుబంగ్లా: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ఓ పంపు ద్వారా మాత్రమే కేసీ కాల్వకు సాగునీటిని సరఫరా చేస్తుండటంతో కేసీ కాల్వలో నీటి ప్రవాహం తగ్గింది. ముచ్చుమర్రి నుంచి కేసికి 245 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తుండగా సుంకేసుల డ్యాం నుంచి 20 రోజుల క్రితమే నీటి విడుదల నిలిచిపోయింది. ప్రస్తుతం లాకిన్స్‌లా వద్దకు 150 క్యూసెక్కుల నీరు చేరుతుండగా తూడిచెర్ల సబ్‌ చానల్‌ కాల్వకు సరఫరా చేస్తున్నట్లు కేసీ కాల్వ అధికారులు తెలిపారు. మరో ఐదారు రోజుల్లో కేసీ కాల్వకు సాగునీటి సరఫరా నిలిచిపోయే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం తనిఖీ

బనగానపల్లె రూరల్‌: బనగానపల్లె సబ్‌ రిజి స్ట్రార్‌ కార్యాలయాన్ని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) కళ్యాణమ్మ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న రికార్డు రూమ్‌తో పాటు సమస్యలను సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. రోజు ఎన్ని రిజిస్ట్రేషన్ల అవుతున్నాయి? ఆన్‌లైన్‌ సమస్యలు ఉన్నాయా? తదితర వివరాలను డీఐజీ ఆరా తీశారు. కార్యక్రమంలో స్థానిక సిబ్బంది తదితరులు ఉన్నారు.

సర్వే ప్రక్రియ పూర్తి చేయండి

నంద్యాల: గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో చేపట్టిన వర్క్‌ ఫ్రం హోం, మిస్సింగ్‌, ఎంప్లాయిస్‌, సిటిజన్స్‌ తదితర సర్వేలు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా 1,27,813 మంది వర్క్‌ ఫ్రం హోం సంబంధించి పెండింగ్‌లో ఉందన్నారు. బేతంచెర్లలో 10 వేలు, నంద్యాల అర్బన్‌లో 11,960, డోన్‌లో 7,553, కొలిమిగుండ్లలో 6,981, కోవెలకుంట్లలో 5,684, ఆళ్లగడ్డ, జూపాడుబంగ్లా, నందికొట్కూరు, అవుకు, పాణ్యం, శిరివెళ్ల, బనగానపల్లె తదితర మండలాలలో వర్క్‌ ఫ్రం హోం సర్వే పెండింగ్‌ ఉందన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్‌ జాయింట్‌ కలెక్టర్‌ రాము నాయక్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.

మరింత పడిపోయిన మిర్చి ధర

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మిర్చి ధరలు మరింత పడిపోయాయి. మిర్చిలో తేజ, బ్యాడిగ, ఆర్మూర్‌ తదితర రకాల్లో ఏ ఒక్క రకం ధర రూ.10 వేలు దాటలేదు. ఎరుపు రకానికి గరిష్ట ధర రూ.9,999, బ్యాడిగ రకానికి రూ.9,411 వరకు ధర లభించింది. మిగిలిన రకాలకు ధరలు మరింత అధ్వానంగా లభించడం గమనార్హం. రెండు నెలల కిత్రం మిర్చి రైతులను ఆదుకుంటామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హంగామా చేశాయి. ధరలు పడిపోయి రైతులు అల్లాడుతున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. మిర్చితో పాటు వేరుశనగ, ఉల్లి, సజ్జలు, కందుల ధరలు మరింత పడిపోయాయి.

పీజీఆర్‌ఎస్‌లో 80 వినతులు 1
1/2

పీజీఆర్‌ఎస్‌లో 80 వినతులు

పీజీఆర్‌ఎస్‌లో 80 వినతులు 2
2/2

పీజీఆర్‌ఎస్‌లో 80 వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement