అక్రమ కేసులతో టీడీపీకి కొమ్ము కాస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులతో టీడీపీకి కొమ్ము కాస్తున్నారు!

Published Fri, Apr 18 2025 1:55 AM | Last Updated on Fri, Apr 18 2025 1:55 AM

అక్రమ కేసులతో టీడీపీకి కొమ్ము కాస్తున్నారు!

అక్రమ కేసులతో టీడీపీకి కొమ్ము కాస్తున్నారు!

● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు ఎలా నమోదు చేస్తారు? ● పోలీసులపై వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆగ్రహం

కల్లూరు: అక్రమ కేసులతో టీడీపీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మండిపడ్డారు.టీడీపీ వారితో ఒక రకంగా.. వైఎస్సార్‌సీపీ నాయకులతో మరో రకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాటసాని మాట్లాడారు. కర్నూలు నగరంలోని నాల్గో పట్టణ సీఐ టీడీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. కల్లూరు అర్బన్‌ పరిధిలోని 31, 34 వార్డులో జరిగిన సంఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఎవరిపై అన్యాయంగా కేసులు బనాయించలేదని గుర్తు చేశారు. టీడీపీ నాయకులకు ఒక న్యాయం, వైఎస్సార్‌సీపీకి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండబోదని గుర్తుపెట్టుకొని పోలీసులు ఉద్యోగాలు చేయాలని హితవు పలికారు.

అన్నీ అబద్ధాలే

ఎన్నికల ముందు తనపై ప్రతిపక్ష నాయకులు అన్నీ అబద్ధాలు ప్రచారం చేశారని కాటసాని అన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్నా నిరూపించలేకపోయారన్నారు. జగన్నాథ గట్టుపై కబ్జా చేశానని నంద్యాల ఎంపీ శబరి అబద్ధపు మాటలు చెప్పారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఎవరూ బియ్యం అక్రమ వ్యాపారాలు చేయడం లేదన్నారు. వైన్‌ షాపులు బార్‌లను తలపిస్తున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు నడుపుకుంటుంటే ఎంపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రేషన్‌ బియ్యాన్ని ఏవిధంగా పట్టుకున్నారో అదే విధంగా ఎకై ్సజ్‌ అధికారులను తీసుకొని పోయి వైన్‌ షాపులపై దాడులు చేయించాలన్నారు. వైన్‌ షాపుల దగ్గర రోడ్లపై మహిళలు, ప్రజలు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు.

మాటమీద నిలబడాలి

టీడీపీ నాయకులు మాటమీద నిలబడాలని కాటసాని అన్నారు. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై టీడీపీ నాయకులు ఇచ్చిన సవాల్‌ను స్వీకరించి టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వస్తానన్నారని, అయితే పోలీసులు ఆయనను హౌస్‌ అరెస్టు చేయడం ఏమిటన్నారు. ఆవులు చనిపోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు చెబుతున్నారని, టీటీడీ ఈఓ మాత్రం 44, టీటీడీ చైర్మన్‌ అయితే 22 ఆవులు చనిపోయా యని చెబుతున్నారని, ఎవరిది నిజమో తెలియ డం లేదని, పొంతన లేని సమాధానాలు చెబు తున్నారన్నారు. కార్పొరేటర్లు చిట్టెమ్మ, వెంకటేశ్వ ర్లు, లక్ష్మీకాంతరెడ్డి, సాన శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement