
మండ్య: బెంగళూరుతో సహా పలుచోట్ల నగలు, నగదు మోసగించిన కేసుల్లో నిందితురాలు ఐశ్వర్యగౌడ సంచలన వ్యాఖ్యలు చేసింది. జిల్లాలోని మళవళ్ళి మాజీ ఎమ్మెల్యే డాక్టర్.కే. అన్నదాని, నా మధ్య ఒక వ్యవహారం జరిగింది. ఇప్పుడాయన నేనెవరో కూడా మరిచిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయి డిప్రెషన్‌లో నన్ను మరిచిపోయారేమో అని హేళన చేశారు. మండ్యలో సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు. తరువాత మీడియాతో మాట్లాడారు.
నాకు– అన్నదానికి కొన్ని వ్యవవహారాలు జరిగాయి. అన్నదాని మంచివారు అని ఆయన అనుచరులు చెప్పుకోనివ్వండి. క్రిమినల్స్, మోసగాళ్లు తప్పుడు మాటలు చెబుతారు. నేను ఎవరు అనేది ఆయన మరిచిపోయారు. అన్నదాని నాకు ఒంటరిగా దొరకాలి, అప్పుడు నేను ఎవరు, ఎలా పరిచయం అయ్యాను, ఆయనకు– నాకు మధ్య జరిగిన డీల్స్ ఏమిటి అని గుర్తు చేస్తాను అని మండిపడింది. దీనిపై కేసు పెట్టినా భయపడను, ఆయనకు ధైర్యం నా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పండి అని సవాల్ చేసిం