
జైపూర్: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్తారణ అయిన ఆధ్యాత్మిక గురువు ఆశారాం(Spiritual guru Asaram)నకు రాజస్థాన్ హైకోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఆయన ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా ఆశారాం అభ్యర్థన మేరకు రాజస్థాన్ హైకోర్టు ఆయన మద్యంతర బెయిల్‌ను రెండు నెలల పాటు పొడిగించింది.
ఆశారాం తన అనారోగ్య సమస్యల కారణంగా గతంలో కూడా మద్యంతర బెయిల్(Interim bail) పొందిన సందర్భాలున్నాయి. ఈసారి కూడా ఆశారాం ఆనారోగ్య కారణాలతో బెయిల్ పొడిగింపును పొందారు. గుజరాత్ హైకోర్టు ఇటీవల ఆయనకు మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినప్పటికీ, రాజస్థాన్ కేసులో కూడా ఆయన బెయిల్ పొందాల్సి ఉంది. ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు ఇందుకు అనుమతిచ్చింది. ఈ పొడిగింపుతో హైకోర్టు ఆశారాంనకు జైలు వెలుపల ఉండే అవకాశాన్ని కొనసాగిస్తూ, ఆయన వైద్య చికిత్స కోసం మరింత సమయం అందించింది.
ఆశారాంపై 2013లో జోధ్‌పూర్‌లో అత్యాచారం కేసు నమోదయ్యింది. విచారణ అనంతరం ఆయనకు 2018లో జీవిత ఖైదు విధించారు. అదేవిధంగా, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆయనకు మరో అత్యాచార కేసులో 2023లో జీవిత ఖైదు(Life imprisonment) శిక్ష పడింది. ఈ రెండు కేసుల్లోనూ ఆయన దోషిగా తేలడంతో, బెయిల్ పొందినప్పటికీ, రెండు కోర్టుల నుండి ఉపశమనం లభించే వరకు ఆయన బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో సుప్రీం కోర్టు కూడా ఆశారాంనకు వైద్య కారణాలతో తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే ఆశారాంనకు అందుతున్న బెయిల్ పొడిగింపులు బాధితుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. బాధితురాలి తండ్రి గతంలో ఆశారాం బెయిల్‌పై ఉన్న కారణంగా తమకు భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: విమానంలో వృద్దురాలు మృతి.. అత్యవసర ల్యాండింగ్