తల్లీ,బిడ్డల హత్య కేసు.. మాజీ ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష | Chhattisgarh Court Life Imprisonment To Brajrajnagar Ex Mla For Assassination Case | Sakshi
Sakshi News home page

తల్లీ,బిడ్డల హత్య కేసు.. మాజీ ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష

Published Sun, Apr 3 2022 6:17 PM | Last Updated on Sun, Apr 3 2022 9:41 PM

Chhattisgarh Court Life Imprisonment To Brajrajnagar Ex Mla For Assassination Case - Sakshi

రెండేళ్ల క్రితం తల్లీ, బిడ్డలపై ఓ మోటార్‌ వాహనం ఎక్కించి, వారిని అత్యంత అమానుషంగా హతమార్చిన ఘటనలో ఆయనకు వ్యతిరేకంగా కేసు నమోదు కాగా

భువనేశ్వర్‌: బ్రజ్‌రాజ్‌ నగర్‌ మాజీ ఎమ్మెల్యే అనుప్‌ సాయెకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ సెషన్స్‌ కోర్టు శనివారం తీర్పు వెల్లడించింది. రెండేళ్ల క్రితం తల్లీ, బిడ్డలపై ఓ మోటార్‌ వాహనం ఎక్కించి, వారిని అత్యంత అమానుషంగా హతమార్చిన ఘటనలో ఆయనకు వ్యతిరేకంగా కేసు నమోదు కాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మాజీ ఎమ్మెల్యేని దోషిగా పరిగణిస్తూ చర్యలు చేపట్టడం గమనార్హం.

ఇదే కేసులో డ్రైవర్‌ వర్ధన్‌ టోప్నోని నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించి, విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి.. 2000లో యువతి కల్పన దాస్‌కి బీహార్‌కి చెందిన సునీల్‌ శ్రీవాస్తవ్‌తోతో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల పాప ఉండగా, అనివార్య కారణాల రీత్యా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కల్పన దాస్‌తో మాజీ ఎమ్మెల్యే అనుప్‌ సాయెతో అక్రమ సంబంధం ఏర్పడి, అది బలపడింది.

కొన్నాళ్లకు ఆమె తనని పెళ్లి చేసుకుని, ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరడంతో తల్లీపిల్లలను చంపాలని అనుప్‌ సాయె భావించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకుంటానని, ఆమెని నమ్మించాడు. తల్లీబిడ్డలను తీసుకుని, హమిర్‌పూర్‌ అడవులకు వెళ్లాడు. అక్కడ వారిపై నుంచి ఓ వాహనం ఎక్కించి, దారుణంగా చంపేశారు. 2016 మే 7వ తేదీన ఈ ఘటనపై చక్రధర నగర్‌ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం 2020 ఫిబ్రవరి 12వ తేదీన మాజీ ఎమ్మెల్యేని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

చదవండి: సంచలనం రేపిన ప్రణయ్‌ హత్య కేసులోని నిందితుడికి హార్ట్‌ఎటాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement