
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వ్యూహాలకు మరింత పదును పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అందులో భాగంగా కీలకమైన పార్టీ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం సోమవారం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, కీలక నాయకులు ఇందులో పాల్గొంటారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలతో పాటు త్వరలో లోక్‌సభ పోరు కూడా జరగనుండటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎన్నికలు, కులగణన మీదే భేటీలో ప్రధానంగా చర్చ జరగనుందని సమాచారం. పార్టీ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించనున్నారు. జాతీయ స్థాయిలో కులాల వారీగా జనగణనకు కాంగ్రెస్ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే కుల గణన చేపడుతోంది. అయితే దీనిపై పారీ్టలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భేటీలో ఎలాంటి వాదనలు జరుగుతాయోనన్న ఆసక్తి నెలకొంది. పునర్ వ్యవస్థీకరించిన సీడబ్ల్యూసీ తొలి భేటీ సెపె్టంబర్ 16న హైదరాబాద్‌లో జరగడం తెలిసిందే.