
న్యూఢిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో జారీ చేసే కోవిడ్ సర్టిఫికెట్‌పై ప్రధాని మోదీ ఫొటో ఉండదని అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాల అసెంబ్లీ ఎన్నికలకు శనివారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళికి లోబడి చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.
కేంద్ర ఆరోగ్యశాఖ కోవిన్ యాప్‌లో ఈ మేరకు మార్పులు చేపడుతుందని వివరించారు. రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో 2021 మార్చిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లోనూ ఈసీ సూచన మేరకు ఆరోగ్య శాఖ ఇలాంటి చర్యలనే తీసుకుంది.