కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి | JCO And Few Army Soldiers Killed in Encounter in Jammu Kashmir Poonch | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి

Published Mon, Oct 11 2021 2:03 PM | Last Updated on Tue, Oct 12 2021 7:11 AM

JCO And Few Army Soldiers Killed in Encounter in Jammu Kashmir Poonch - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గాలింపు చర్యలు జరుపుతున్న ఆర్మీ అధికారులపైకి ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు.

కశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో బుధవారం చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీ సైనికులు ఐదుగురు మరణించారు. మృతిచెందిన వారిలో నలుగురు జవాన్లు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) ఉన్నారు. ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు.. సూరంకోట్‌లోని డీకేజీకి దగ్గరగా ఉన్న గ్రామంలో ఈ సర్చ్‌ ఆపరేషన్ ప్రారంభమైనట్లు రక్షణ ప్రతినిధి తెలిపారు. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో ఆర్మీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.
(చదవండి: తాలిబన్ల రాజ్యం: ‘పరిణామాలు ఎదుర్కొనేందుకు మేం సిద్ధం’)

గాలింపు చర్యలు జరుపుతున్న ఆర్మీ అధికారులపైకి ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో జేసీఓతో పాటు మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా "తీవ్రంగా గాయపడిన జేఓవీ, నలుగురు జవాన్లను సమీప ఆస్పత్రికి తరలించాము. చికిత్స అందిస్తుండగా వారు మరణించారు. సర్చ్‌ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది" అని ఆర్మీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది.

చదవండి: చదువు కోసం వెళ్తారు.. ఉగ్రవాదులుగా తిరిగొస్తారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement