
ముంబయి:త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో ఎన్సీపీ నేత హత్య కలకలం రేపింది. అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత సచిన్ కుర్మీన్‌ను దుండగులు పొడిచి చంపారు.
గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయధంతో సచిన్ కుర్మిన్‌ను హత్య చేశారని పోలీసులు తెలిపారు.ముంబయిలోని బైకుల్లా ప్రాంతంలో శుక్రవారం(అక్టోబర్4) అర్ధరాత్రి ఈ హత్య జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: అహ్మద్‌నగర్ ఇక అహిల్యానగర్