
న్యూఢిల్లీ: ఆధునిక భారతదేశ చరిత్రపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. ఆ అంశంపై దృష్టి పెట్టాలని పరిశోధకులకు పిలుపునిచ్చారు. అలాగే ప్రఖ్యాత సామాజిక సంస్కర్త స్వామి దయానంద సరస్వతి, 1875లో ఏర్పాటైన ఆర్యసమాజ్ అందించిన సేవలను వెలుగులోకి తీసుకోవాలని కోరారు.
ఈ విషయంలో విద్యా, సాంస్కృతిక సంస్థలు చొరవ తీసుకోవాలని అన్నారు. సోమవారం ఢిల్లీలోని నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీ(ఎన్‌ఎంఎంఎల్) వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. విస్తృత పరిశోధనల ద్వారా ఆధునిక భారతదేశ చరిత్ర గురించి నేటి తరానికి మరిన్ని విషయాలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.