
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela 2025)లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆకాశంలో ఏడు గ్రహాలు బుధ, శుక్ర, మంగళ, బృహస్పతి, శని, యూరేనస్, నెప్ట్యూన్‌లు ఒకే సరళరేఖపై రానున్నట్లు తెలుస్తోంది.
ఈ గ్రహాల సమన్వయం నెగటివ్ గ్రహ ప్రభావాలను తగ్గించి, ప్రపంచంలో శాంతి, సమర్థత, సంపద తీసుకురానుందని ఆధ్యాత్మిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అసాధారణ ఖగోళ సంఘటన కుంభమేళా తుది పవిత్ర స్నానానికి మరింత ప్రత్యేకతను ఇవ్వనుంది.
మహాశివరాత్రిపై గ్రహ ప్రభావం
జ్యోతిష్యులు ఆచార్య హరికృష్ణ శుక్లా గ్రహాల కదలికల ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. సూర్యుడు, చంద్రుడు మకర రాశిలో ఉండగా, శని కుంభ రాశిలో ఉండగా, బృహస్పతి వృషభ రాశిలో ఉండటం మహాకుంభమేళా ప్రారంభమైంది. కుంభమేళా చివరి రోజు ఫిబ్రవరి 26న గ్రహాల శక్తివంతమైన సమన్వయంతో జరగనుంది. ఆరోజు చంద్రుడు, బుధుడు, సూర్యుడు శని కుంభ రాశిలో ఉండగా, శుక్రుడు, రాహు మీన రాశిలో ఉండగానే బృహస్పతి వృషభ రాశిలో ఉండనుంది. ఈ గ్రహాల మార్పుతో ఫిబ్రవరి 28న గ్రహాలు ఒకే సరళరేఖ వైపు పయనిస్తాయని అన్నారు. ఫలితంగా ప్రతికూలతలు తొలిగి శుభపరిణామాలు జరుగుతాయని శుక్లా తెలిపారు.
గ్లోబల్ మార్పు
ఫిబ్రవరి 26, 2025న గ్రహాల సమన్వయంతో ప్రపంచంలో ప్రతికూలతలు తగ్గే అవకాశం ఉందని జ్యోతిష్యులు ఆచార్య హరికృష్ణ మాట్లాడుతూ.. 2019 నుండి ప్రపంచాన్ని అనేక ప్రతికూల పరిస్థితులు పట్టిపీడిస్తున్నాయి. కోవిడ్-19 ,ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచం దేశాల్లో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే, గ్రహాల మార్పులతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు. శాంతి, స్థిరత్వం కొనసాగే అవకాశం ఉందని అన్నారు.