
చెన్నై: తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు డిప్యూటీ సీఎం చేసేందుకు ఇంకా టైమ్ రాలేదని సీఎం స్టాలిన్ అన్నారు. అయితే ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని పార్టీలో డిమాండ్ మాత్రం గట్టిగా ఉందని చెప్పారు.
ఈ విషయమై సోమవారం(ఆగస్టు5) స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఉదయనిధికి ప్రమోషన్ ఇచ్చేందుకు సరైన సమయం రావాల్సి ఉందన్నారు. కాగా, ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వంలో క్రీడా, యువజన సంక్షేమ, ప్రత్యేక కార్యక్రమాల అమలు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.