Stalin
-
అందుకే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రాలేదు: సీఎం స్టాలిన్
చెన్నై: శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అద్భుత కానుకను అందించారు. తమిళనాడులోని రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన పంబన్ రైలు వంతెన(Pamban Railway Bridge)ను ప్రధాని మోదీ దేశానికి అంకితం చేశారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హాజరుకాలేదు. దీని వెనుక కారణం ఏమై ఉంటుందా? అని పలువురు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. దీనికి సీఎం స్టాలిన్ స్వయంగా సమాధానమిచ్చారు.2019లో రూ.700 కోట్ల వ్యయంతో పంబన్ వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. నేడు ప్రధాని మోదీ పంబన్ వంతెనను ప్రారంభించడంతో పాటు, రామేశ్వరం-తాంబరం (చెన్నై) మధ్య నడిచే నూతన రైలు సర్వీసుకు కూడా పచ్చ జెండా చూపారు. తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnav), తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తేనరసు తదితరులు పాల్గొన్నారు.తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, ‘రామేశ్వరంలో జరిగే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరు కాలేనని ముందుగానే ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశానని, రాష్ట్రంలోని నీలగిరిలో ఇంతకు ముందే నిర్ణయించిన కార్యక్రమాలకు తాను హాజరు కావాల్సి ఉందని వివరించానన్నారు. అందుకే తాను వంతెన ప్రారంభోత్సవానికి రాలేనని తెలియజేశానన్నారు. అయితే తమ ప్రభుత్వం తరపున మంత్రులు తంగం తెన్నరసు, రాజకన్నప్పన్ ప్రధానమంత్రిని స్వాగతిస్తారని ముందుగానే తెలియజేశానని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.తమిళనాడు సీఎం స్టాలిన్(Tamil Nadu CM Stalin) ఆదివారం (ఏప్రిల్ 6) ఉదగమండలంలో రూ.494.51 కోట్లతో నిర్మించిన 1,703 ప్రభుత్వ నిర్మాణాలను ప్రారంభించారు. ఇందులో కొత్తగా నిర్మించిన ఉదగమండలం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి కూడా ఉంది. దీనితో పాటు, నీలగిరి జిల్లాలో రూ. 130.35 కోట్ల విలువైన 56 కొత్త ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు.ఇది కూడా చదవండి: ఫేర్‌వెల్‌లో స్పీచ్ ఇస్తూ.. గుండెపోటుతో 20 ఏళ్ల విద్యార్థిని మృతి -
భాషా రాజకీయాల ఆట
తమిళనాడు తన బడ్జెట్ ప్రమోషనల్ లోగోలో భారత కరెన్సీ సింబల్‌కు బదులుగా తమిళ అక్షరం ‘రూ’ వాడి దేశవ్యాప్తంగా దుమారం లేవనెత్తింది. ఈ చర్య కేవలంసింబల్ వివాదం కాదనీ, ఇది భారత సమైక్యతను బలహీనపరుస్తుందనీ, ప్రాంతీయ అభిమానం మాటున వేర్పాటువాద సెంటిమెంటును రెచ్చగొడుతుందనీ విమ ర్శిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే మాజీ చట్టసభ్యుడి తనయుడు, గువాహటి ఐఐటీలో డిజైనర్ అయిన ఒక తమిళ వ్యక్తి రూపకల్పన చేసిన సింబల్‌ను తిరస్కరించడం డీఎంకే ‘మందబుద్ధి’ని బయటపెడుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అభివర్ణించారు. తమిళంలో రూపాయి గుర్తుకు తమిళ అక్షరం ‘రూ’ వాడటం సహజమే. మూడు భాషలను ప్రతిపాదించిన ఎన్ఈపీ 2020 పట్ల అసమ్మతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే బడ్జెట్ పత్రాల్లో రూపాయి సింబల్‌కు బదులుగా తమిళ ‘రూ’ అక్షరం వాడటం వెనుక డీఎంకే ఉద్దేశం. ఏడాదిలో రాష్ట్ర ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి స్టాలిన్ భాషాదురహంకారాన్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. తమిళ సెంటిమెంట్ ఆందోళనహిందూ అహంకారం పతాకస్థాయికి చేరిన తరుణంలో అస్తిత్వ పోరుకు నడుం బిగించిన రాజకీయ నాయకుడు నిజానికి డీఎంకే అధినేత ఒక్కరే కాదు. అయితే ఒక్క డీఎంకే మీద మాత్రమే బీజేపీ నేతలు శ్రుతి మించిన ఆగ్రహావేశాలు ప్రదర్శించడం చూస్తే, ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారని అనుకోవాలి. మతం ప్రాతిపదికగా వ్యక్తులను అవమానించడం, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం దేశ సమైక్యతకు ముప్పుగా భావించే రోజు ఎప్పుడు వస్తుంది? రెండోసారి అధికారం చేజిక్కించుకోవడానికి స్టాలిన్ సన్నద్ధం అవుతున్నారు, వాస్తవమే! ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం తమిళనాడు అలవాటు. ఈ సింగిల్ టర్మ్ ఆనవాయితీని భగ్నంచేసింది జయలలిత ఒక్కరే! 2016లో ఆమె ఏఐఏడీఎంకేను రెండో టర్మ్ అధికారంలోకి తెచ్చారు. ఈ సెంటిమెంటుతో పాటు నటుడు విజయ్ నాయకత్వంలో ఏర్పడిన తమిళగ వెట్రి కళగం పార్టీ సైతం డీఎంకేకు ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ లేదా మరో ఇతర పార్టీ రానున్న ఎన్నికలకు అజెండా సెట్ చేసేవరకూ డీఎంకే వేచి చూడదలచుకోలేదు. భాష, నియోజకవర్గాల పునర్విభజన అస్త్రాలను బయటకు తీసింది. రాష్ట్రంలో ఏ మూలైనా ఈ అంశాల మీదే మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, విజయ్‌లు... ఈ రెండు అంశాల మీద డీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రహస్థితులు అనుకూలిస్తే, రానున్న ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ కూటమి కట్టే అవకాశాలున్న ఏఐఏడీఎంకే ఇప్పుడు పులుసులో పడింది. 2020లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఈపీకి వ్యతిరేకంగా తొలి శంఖం పూరించిన పార్టీ ఇదే. హిందీని నిర్దేశించకపోయినా...హిందీ వ్యతిరేక రాజకీయాల్లో తమిళనాడుకు వందేళ్ల చరిత్రఉంది. మూడు భాషల సూత్రానికి అంగీకరిస్తేనే రాష్ట్రానికి కేంద్ర విద్యానిధులు విడుదల చేస్తామని ప్రకటించి, నిద్రాణంగా పడి ఉన్న ఒక జటిల సమస్యకు బీజేపీ ఎందుకు తిరిగి ప్రాణం పోసింది? ఇది అంతుచిక్కని విషయం. ‘హిందీకరణ’ ఇండియా పట్ల తన మక్కు వను వెల్లడిస్తూ ఆ పార్టీ సంకేతాలపై సంకేతాలు ఇస్తోంది. వలసవాద అవశేషాలు తుడిచిపెట్టాలన్న మిషతో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పేర్లను హిందీలోకి మార్చడం ఇందుకు ఉదాహరణ. ఇంతా చేసి ఇప్పుడు వెనకడుగు వేస్తే రాజకీయ బలహీ నత అవుతుందేమో అన్నది బీజేపీ డైలమా. మూడో భాష హిందీయే అవ్వాలని ఎన్ఈపీ ఆంక్ష పెట్టని మాట నిజమే. ఆచరణలో మాత్రం మూడో భాష హిందీనే అవుతుంది. లెక్కలేనన్ని మూడో భాషలను బోధించే టీచర్లను నియమించడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా తలకు మించిన భారం. పైగా ఎక్కడెక్కడి నుంచో వారిని తీసుకురావడం మరీ కష్టం. స్కూళ్లలో హిందీ బోధించడం తప్ప గత్యంతరం లేదు. ఇదో దుఃస్థితి. తమిళనాడులో కూడా మలయాళం, కన్నడం, తెలుగు టీచర్ల కంటే హిందీ బోధించేవారిని నియమించుకోవడం సులభం.సరికొత్త ప్రచారకర్తఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘వాళ్లు ఆర్థిక లాభాలు ఆశించి ఎందుకు తమిళ చిత్రాలను హిందీలోకి డబ్ చేస్తు న్నారు?’ అంటూ ఒక తప్పు ప్రశ్న వేస్తున్నారు. దక్షిణాదిన హిందీకి, హిందుత్వకు సరికొత్త ప్రచారకర్తగా మారిన ఈయన డీఎంకేది ‘హిపో క్రసీ’ అని కూడా నిందిస్తున్నారు. ఒక్కమాటలో ఈ ప్రశ్నకు సమా ధానం చెప్పవచ్చు. తమిళనాడు హిందీకి వ్యతిరేకం కాదు. దాని వ్యతిరేకత అంతా హిందీని బలవంతంగా రుద్దడం మీదేఆశ్చర్యం ఏమిటంటే, తమిళనాడులో లక్షల మంది స్వచ్ఛందంగా హిందీ నేర్చుకుంటారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడూ వారిని అడ్డుకోడు. హిందీ తప్ప మరో భాష మాట్లాడని లక్షల మంది ఉత్తర భారతీయలు ఉపాధి కోసం తమిళనాడు రావడం నాణానికి రెండో పార్శ్వం. ఉత్తరప్రదేశ్ లేదా బిహార్ స్కూళ్లలో తమిళం నేర్చుకోరు. తమిళనాడులో ఉపాధి కోసం తమిళం నేర్చుకోవాలని వారిని ఎవరూ ఒత్తిడి చేయరు. హిందీ మాట్లాడటానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆంక్షా లేదు. అందరూ వారికి అర్థమయ్యేలా చెప్పడానికి వచ్చీరాని హిందీలో ప్రయత్నించి సహకరిస్తారు.చెన్నైలో ఏ రెస్టారెంటుకి వెళ్లినా మీకో దృశ్యం కనబడుతుంది. ఉత్తరాది వెయిటర్, తమిళ కస్టమర్ పరస్పరం ఎదుటి వారి భాషలో మాట్లాడుతారు. ఆ సంభాషణ ఎలా ఉన్నా ఆర్డర్ చేసిన ఆహారం రాకుండా పోదు. అదే తరహాలో హిందీ, తమిళ సినిమా పరిశ్రమల నడుమ విలసిల్లుతున్న చిరకాల సహకారం పవన్ పేర్కొంటున్నట్లు హిపోక్రసీ కాదు. ఆర్థికం కావచ్చు, సామాజిక కారణాలు కావచ్చు... ప్రజలు స్వచ్ఛందంగా చేరువ అవుతారనడానికి ఇదో ఉదాహరణ.దొడ్డిదారినో మరో అడ్డదారినో ఒక భాషను బలవంతంగా రుద్దడం ఎప్పుడూ, ఎక్కడా సుఖాంతం కాలేదు. తమిళనాడు హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఈ విషయంలో తగినంత గుణపాఠం నేర్ప లేదు. పొరుగు దేశాల పరిణామాలు దీన్ని రుజువు చేస్తాయి. ఒకే భాష ద్వారా జాతీయ సమైక్యత సాధించాలన్న రాజకీయాలు చావు దెబ్బ తిన్నాయి. పాకిస్తాన్ ఇందుకు చక్కటి ఉదాహరణ. 1947లో ఏర్పాటై సంబరాలు జరుపుకొన్న కొద్ది నెలల్లోనే ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది. ఆనాడే వాస్తవంగా ఆ దేశం తన తూర్పు ప్రాంతాన్ని కోల్పోయింది. ఉర్దూకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం 1971లో, ఇండియా తోడ్పాటు లభించి, దేశవిభజనతో సమసింది. ‘సింహళ ఒక్కటే’ శాసనంతో... సింహళీయులకు తమిళు లకు నడుమ ఉన్న విభేదాలు ఒక్కసారిగా పతాకస్థాయికి చేరాయి. అదే 30 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీసింది. డీఎంకే అన్ని అంశాల్లోనూ, ఎన్ఈపీతో సహా, కేంద్రంతో సంప్ర దింపుల ధోరణితోనే వ్యవహరిస్తోంది. ‘రూ’ తమిళ అక్షరం వాడిందన్న సాకుతో ఆ పార్టీని ‘వేర్పాటువాది’గా అభివర్ణించడంతో బీజేపీ నైజం వెల్లడైంది. సర్వం కేంద్రం అధీనంలోకి తెచ్చుకోవాలన్న వీరావేశం, తనను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల పట్ల దాని వైఖరి బట్టబయలు అయ్యాయి. చరిత్ర పట్ల ఆ పార్టీ నిర్లక్ష్య భావం కూడా బయటపడింది. ఇదే అన్నిటి కంటే ప్రమాదకరం.-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-నిరుపమా సుబ్రమణియన్ -
ఐక్యంగా పోరాడుదాం.. బీజేపీని అడ్డుకుందాం
సాక్షి, చెన్నై: నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడుదామని, అసమగ్ర పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకుందామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా చెన్నైలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అంశంపై అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్‌ను అభినందించారు. సమావేశంలో రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రస్తుతం దేశం పెద్ద సవాల్ ఎదుర్కొంటోంది. జనాభాను నియంత్రించాలని 1971లో దేశం నిర్ణయించినప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తే.. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు విఫలమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్ధి సాధించాయి. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయి. ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ నిధులు దక్షిణాది రాష్ట్రాలు దేశ ఖజానాకు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ కూడా తక్కువ మొత్తాన్ని తిరిగి పొందుతున్నాయి. తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే.. 29 పైసలే వెనక్కి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు రూపాయికి రెండు రూపాయల 73 పైసలు అందుతున్నాయి. బిహార్‌కు ఆరు రూపాయల ఆరు పైసలు, మధ్యప్రదేశ్‌కు రూపాయి 73 పైసలు వెనక్కి పొందుతున్నాయి. అదే కర్ణాటక కేవలం 14 పైసలు, తెలంగాణ 41 పైసలు, కేరళ 62 పైసలు మాత్రమే వెనక్కు పొందుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు, పన్నుల వాటా చెల్లింపులు క్రమంగా తగ్గుతున్నాయి. చివరికి జాతీయ ఆరోగ్యమిషన్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకే 60– 65 శాతం నిధులు దక్కుతున్నాయి. అలా పునర్విభజనను ఒప్పుకోం.. మనది ఒకే దేశం.. దానిని గౌరవిస్తాం.. కానీ జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించం. అది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అధికారాన్ని కుదిస్తుంది. మంచి ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలకు శిక్షగా మారుతుంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న జనాభా దామాషా పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ గళం కోల్పోతాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిపత్యం చెలాయిస్తాయి. ఈ అసమగ్రమైన పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకుందాం. దక్షిణాది ప్రజలు, పార్టీలు, నాయకులు ఏకం కావాలి. వాజ్‌పేయి విధానాన్ని అనుసరించండి.. ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర కూడా ఉంది. ఈ దృష్ట్యా ప్రొరేటా విధానం కూడా దక్షిణాది రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది. 1976లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీట్ల సంఖ్యను పెంచకుండా ఏ విధంగా పునర్విభజన ప్రక్రియ జరిపిందో.. ఆ విధానాన్నే ఇప్పుడు అనుసరించాలి. 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను అదే తరహాలో ప్రారంభించింది. ఇప్పుడు అదే విధానాన్ని పాటించేలా.. మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లలో, సంఖ్యలో ఎటువంటి మార్పు తీసుకురాకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. ఈ అంశంపై తర్వాతి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిద్దాం. పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళదామనే అంశంపై ఆ సమావేశంలో చర్చిద్దాం. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తాం..’’అని రేవంత్ చెప్పారు.చెన్నై శ్రీకారం.. హైదరాబాద్ ఆకారం: రేవంత్ ట్వీట్ సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిని గౌరవిస్తామని.. రాజకీయాల్లోనైనా, విద్యావ్యవస్థలోనైనా పెత్తనాన్ని మాత్రం సహించబోమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తి ప్రకారం హక్కుల సాధనలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’వేదికగా పోస్టు చేశారు. ‘‘ఈ పుణ్యభూమి అంబేడ్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది. కేవలం రాజకీయ ప్రయోజన కాంక్షతో పునర్విభజనను అస్త్రంగా ప్రయోగించి ఆ హక్కులను విచ్చిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేం. ఉత్తరాదిని గౌరవిస్తాం.. దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం. ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టింది. ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుంది’’అని పేర్కొన్నారు. -
‘డీలిమిటేషన్ మీటింగ్.. కోడిగుడ్డుపై ఈకలు పీకడం అంటే ఇదే’
సాక్షి, ఢిల్లీ: తమిళనాడు ఎన్నికలలో డీఎంకే పార్టీ ఓడిపోబోతుందని.. అందుకే డీలిమిటేషన్‌పై ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన దక్షిణ భారత దేశం వెనుకబడి పోతుందంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని మాట్లాడుతున్నారు. డీలిమిటేషన్ వలన తమిళనాడుకు కొద్దీమేర మాత్రమే నష్టం జరుగుతుంది. తమిళనాడు మినహా దేశంలో, ఏ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదు’’ అని అరవింద్ పేర్కొన్నారు.‘‘తమిళనాడు రాష్ట్ర అంశాన్ని మాత్రమే బూచిగా చూపి దక్షిణాదికేదో జరుగుతున్నట్టు స్టాలిన్ ప్రచారం చేస్తున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటారు. 1971 దేశ జనాభా 41 కోట్లు ఉంటే, ఇప్పుడు సుమారు 140 కోట్లకు పెరిగింది. దేశంలో ముస్లిం జనాభా ఏడువందల శాతం పెరిగింది. హిందువుల జనాభా 300 శాతం పెరిగింది, అసలు సమస్య ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు కాదు.. దేశంలో ముస్లింల సంఖ్య పెరగడమే’’ అంటూ అరవింద్ వ్యాఖ్యానించారు.‘‘ఈ సమస్యను పరిష్కరించేందుకు కామన్ సివిల్ కోడ్, ఎన్ఆర్సీకి సపోర్ట్ చేస్తారా?. స్టాలిన్, ఉదయ్ నిధి స్టాలిన్ లాంటి దుర్మార్గులు ఏ కమ్యూనిటిలో ఉండకూడదు. తెలంగాణలో 80 శాతం మైనార్టీలను బీసీల్లో కలిపారు. మేం అధికారంలోకి వచ్చాక బీసీల నుంచి మైనారిటీలను తొలగిస్తాం. మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయం’’ అని అరవింద్ చెప్పారు. -
దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్ జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తమిళనాడు పీడబ్ల్యూడీ శాఖ మంత్రి ఈవీ వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్ కలిశారు. ఈనెల 22న చెన్నైలో నిర్వహించే దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్ జగన్‌ను ఆహ్వానిస్తూ తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్‌కు అందజేసి, దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి ఆహ్వానించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ వివిధ రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు. దీన్లోభాగంగా తమిళనాడు డీఎంకే నేతలు వైఎస్ జగన్‌ను కలిశారు. -
‘నాగపూర్ ప్లాన్’ అంగీకరించం
చెన్నై: జాతీయ విద్యా విధా నం అనేది విధ్వంసకర నాగ పూర్ ప్లాన్ అని తమి ళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పరోక్షంగా ఆర్ ఎస్‌ఎస్‌పై మండిపడ్డారు. దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పా రు. హిందీ, సంస్కృత భాషలను ఆమోదిస్తే రూ.2 వేల కోట్లు ఇస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు ఇచ్చినా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయబోమని స్టాలిన్ స్పష్టంచేశారు.మంగళవారం చెంగల్‌పేటలో ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యా విధానం తమిళనాడులో విద్యాభివృద్ధిని పూర్తిగా దెబ్బతీస్తుందని తెలిపారు. విద్యార్థులను విద్య నుంచి దూరం చేసేలా ఈ విధానం తీసుకొచ్చారని విమర్శించారు. విద్యా రంగంపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఏమిటని నిలదీశారు.విద్యలో మతతత్వాన్ని పెంచడం, ప్రైవేటీకరణను ప్రోత్సహించడం సరైంది కాదని స్పష్టం చేశారు. కేవలం సంపన్న వర్గాల పిల్లలే ఉన్నత విద్య అభ్యసించాలా? పేదలకు చదువుకొనే అవకా శాలు లభించకూడదా? అని ప్రశ్నించారు. తమిళ నా డు ప్రయో జనాల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాడుతూనే ఉంటామని స్టాలిన్ పునరుద్ఘాటించారు. -
అడ్వకేట్ బిల్లుపై స్టాలిన్ ఫైర్.. కేంద్రానికి వార్నింగ్
చెన్నై: ఇప్పటికే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)పై ఫైరవుతున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా అడ్వకేట్ బిల్లుపై కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం తీసుకువస్తున్న అడ్వకేట్ బిల్లు న్యాయవాద వృత్తిపై దాడి అని అన్నారు. ఈ మేరకు స్టాలిన్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు,పుదుచ్చేరిని బార్ కౌన్సిల్ ఆఫ్ మద్రాస్‌గా కేంద్రం మార్చాలనుకుంటోంది. తమిళనాడు అనేది కేవలం పేరు కాదు. మా గుర్తింపు. తమిళులపై బీజేపీ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఎన్‌జేఏసీని తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు మళ్లీ అడ్వకేట్ బిల్లు ద్వారా బార్ కౌన్సిళ్లపై పెత్తనం చెలాయించాలనుకుంటోంది. అడ్వకేట్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి’అని స్టాలిన్ డిమాండ్ చేశారు. కాగా, బిల్లుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసకుంది. ముసాయిదాలో సవరణలు చేయనున్నట్లు ప్రకటించింది. -
ఉదయనిధికి ప్రమోషన్ అందుకే: స్టాలిన్ వివరణ
చెన్నై: తన కుమారుడు ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. డీఎంకే ప్రభుత్వ పాలనను మరింత మెరుగుపరిచేందుకే ఉదయనిధికి డిప్యూటీసీఎం పదవి ఇచ్చినట్లు తెలిపారు. సీఎంగా ఉన్న తనకు సహాయంగా ఉండేందుకు డిప్యూటీ సీఎంను చేయలేదని క్లారిటీ ఇచ్చారు. క్రీడా శాఖ మంత్రిగా ఉదయనిధి దేశమే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడని కొనియాడారు. తమిళనాడు అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పతకాలు తీసుకువచ్చే దిశగా క్రీడాశాఖలో ఉదయనిధి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడని ప్రశంసలు కురిపించారు. డీఎంకే శ్రేణులు, తమిళనాడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉదయనిధి పనిచేయాలని స్టాలిన్ సూచించారు. ఆదివారం(సెప్టెంబర్29) డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన ఉదయనిధి క్రీడాశాఖను తన వద్దే ఉంచుకున్నారు. అదనంగా ప్లానింగ్, డెవలప్మెంట్ పోర్ట్‌ఫోలియో నిర్వహించనున్నారు. ఇదీ చదవండి: సిద్ధూపై ఈడీ కేసు -
నిర్మలాసీతారామన్‌పై స్టాలిన్ మండిపాటు
చెన్నై: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఆమెది అహంకారమని,ఆమె తీరు సరిగా లేదని విమర్శించారు. ఇటీవల కోయంబత్తూరులో జీఎస్టీపై జరిగిన సమావేశంలో ఓ రెస్టారెంట్ చైన్ యజమాని శ్రీనివాసన్ నిర్మలాసీతారామన్‌ను ప్రశ్నించారు.జీఎస్టీలోని లోపాలను ఎత్తి చూపేందుకు బన్, క్రీమ్, క్రీమ్ బన్‌లపై విధిస్తున్న జీఎస్టీ పన్నును సోదాహరణంగా వివరించారు.ఇది అక్కడ సమావేశంలో ఉన్నవారికి నవ్వు తెప్పించింది. దీంతో అక్కడున్నవారంతా విరగబడి నవ్వారు. ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత జరిగిన ప్రైవేట్ భేటీలో శ్రీనివాసన్ నిర్మలకు క్షమాపణ చెబుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దీనిపై ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీతో సహా దేశవ్యాప్తంగా పలువురు విపక్ష నేతలు నిర్మలపై విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి.. ఆకాశవీధిలో రోజు 4.3లక్షల మంది -
ఉదయనిధి ప్రమోషన్‌పై స్టాలిన్ క్లారిటీ
చెన్నై: తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు డిప్యూటీ సీఎం చేసేందుకు ఇంకా టైమ్ రాలేదని సీఎం స్టాలిన్ అన్నారు. అయితే ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని పార్టీలో డిమాండ్ మాత్రం గట్టిగా ఉందని చెప్పారు. ఈ విషయమై సోమవారం(ఆగస్టు5) స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఉదయనిధికి ప్రమోషన్ ఇచ్చేందుకు సరైన సమయం రావాల్సి ఉందన్నారు. కాగా, ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వంలో క్రీడా, యువజన సంక్షేమ, ప్రత్యేక కార్యక్రమాల అమలు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
డీఎంకే మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే..
సాక్షి, చైన్నె: సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో క్లీన్ స్వీపే లక్ష్యంగా డీఎంకే మెగా కూటమి వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. మిత్రపక్షాలకు పుదుచ్చేరితో పాటు తమిళనాడులోని 19 స్థానాలను అధికార డీఎంకే కేటాయించింది. మిగిలిన 21 స్థానాలలో తమ అభ్యర్థులను రంగంలోకి దించింది. ఇందులో భాగంగా బుధవారం తేనాంపేటలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితాను సీఎం స్టాలిన్ ప్రకటించారు. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కనిమొళి నేతృత్వంలోని కమిటీ రూపొందించిన మేనిఫెస్టోలోని అంశాలను స్టాలిన్ మీడియాకు వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చే వాగ్దానాలే కాదు. అధికారంలోకి వచ్చినానంతరం ఇవ్వని వాగ్దానాలనూ కూడా అమలు చేసిన ఘనత ద్రవిడ మోడల్ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకునే తమ మేనిఫెస్టోను రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలతో రూపొందించామని వివరించారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు ● రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించే విధంగా చట్ట సవరణకు తొలి ప్రాధాన్యత. ● అనవసరంగా ఉన్న గవర్నర్ పదవి వ్యవహారంలో మార్పులు, సీఎం సలహాలను తప్పని సరిగా స్వీకరించాలనే నిబంధన రూపకల్పనకు కృషి. గవర్నర్‌కు ప్రత్యేక అధికారులు కల్పించే సెక్షన్ 361 రద్దు. ● చైన్నెలో సుప్రీంకోర్టు శాఖ ఏర్పాటు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పనకు ప్రణాళిక. ● కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షలన్నీ తమిళంతో పాటు ఇతర ప్రాంతీయ భాషలలో నిర్వహణ. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో తమిళం తప్పనిసరి. అన్ని భాషల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు. జాతీయ గ్రంథంగా తిరుక్కురల్ ప్రకటన. ● శ్రీలంక నుంచి తమిళనాడులోకి వచ్చి స్థిరపడ్డ తమిళులకు భారత పౌరసత్వం కేటాయింపు. ● రైల్వే శాఖకు ప్రత్యేక బడ్జెట్, చైన్నెలో మూడవ అతిపెద్ద రైల్వే టెర్మినల్ ఏర్పాటు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తక్షణం అమలు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడులలో అల్పాహార పథకం అమలు చేసేందుకు చర్యలు. ● దేశవ్యాప్తంగా గృహిణులకు నెలకు రూ. 1000 నగదు పంపిణీ పథకం అమలు. ● నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు. అన్ని రాష్ట్రాలలో సీఎంల నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి మండలి ఏర్పాటు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం పంపిణీ. ● బీజేపీ తీసుకొచ్చిన కొన్ని అసంబద్ధ కార్మిక చట్టాలు, ఇతర చట్టాలు, పథకాలు రద్దు, మరికొన్నింటిపై పునర్ సమీక్ష. జమిలీ ఎన్నికల రద్దు. జాతీయ రహదారులలో టోల్గేట్ల ఎత్తివేత. బ్యాంక్‌లలో కనీస నగదు నిల్వ నిబంధన ఎత్తివేత. సీఏఏ చట్టం రద్దు. దేశవ్యాప్తంగా కులగణన. రైతులకు మద్దతు ధర కల్పన, దేశవ్యాప్తంగా విద్యార్థుల విద్యారుణాల రద్దు. కొత్తగా రూ. 4 లక్షలు రుణాల పంపిణీ. తమిళనాడులో జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు. విమాన చార్జీల క్రమబద్ధీకరణ. ● ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 500, లీటరు పెట్రోల్ రూ. 75, లీటరు డీజిల్ ధర రూ. 65గా నిర్ణయం. ఉపాధి హామీ పథకం 100 రోజుల నుంచి 150 రోజులకు పెంపు. రోజు వారీ కూలి రూ. 400కు పెంపు. 21 మంది అభ్యర్థుల ప్రకటన మేనిఫెస్టో విడుదల తర్వాత తమ పార్టీ పోటీ చేసే స్థానాలలో 21 మంది అభ్యర్థుల జాబితాను స్టాలిన్ ప్రకటించారు. ఇందులో 10 మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం కల్పించారు. మరో 11 మంది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. అయితే సిట్టింగ్ ఎంపీలలో ధర్మపురి సెంథిల్‌కుమార్, కళ్లకురిచ్చి సీనియర్ నేత పొన్ముడి వారసుడు గౌతం శిఖామణి, సేలం పార్తీబన్, తంజావూరు నాలుగు సార్లు గెలిచిన ఎస్ఎస్ పళణి మాణిక్యం, తెన్కాశి ధనుష్‌కుమార్, పొల్లాచ్చి షణ్ముగసుందరం తదితరులకు ఈసారి సీటు కేటాయించలేదు. పొన్ముడి వారసుడిపై కోర్టులలో కేసులు ఉండటం ఓ కారణమైనా, నాలుగు సార్లు గెలిచిన ఎస్ఎస్ పళణి మాణిక్యంకు సీటు ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది. తంజావూరులో పోటీ చేసే మురసోలి అనే అభ్యర్థి పేరును పలుమార్లు సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం. ఈరోడ్‌లో కొత్తగా పోటీ చేస్తున్న కె. ప్రకాష్ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సన్నిహితుడు కాగా, పెరంబలూరులో పోటీ చేయనున్న అరుణ్ నెహ్రూ, సీనియర్ నేత, మంత్రి కేఎన్ నెహ్రూ వారసుడు కావడం గమనార్హం. అలాగే మాజీ మంత్రి సెల్వ గణపతికి ఈసారి సేలం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. కాగా 21 మంది అభ్యర్థుల్లో 19 మంది పట్టభద్రులు, ముగ్గురు మహిళలు ఉండడం గమనార్హం. -
‘అక్కడ రాముడుంటే.. ఇక్కడ మురుగన్’.. డీంఎంకే కొత్త ప్లాన్?
భారతీయ జనతా పార్టీ అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రారంభించి, తన ఖ్యాతిని పెంచుకుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్న వేళ.. తమిళనాట అధికార డీఎంకే ‘మురుగన్’ను ఆశ్రయిస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో విశేషంగా పూజలు అందుకునే మురుగన్ (కుమారస్వామి)ని ఆరాధిస్తూ డీఎంకే ప్రభుత్వం రాబోయే జూన్ లేదా జూలైలో అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో మురుగన్ చిత్రాలతో కూడిన ఎగ్జిబిషన్, సదస్సులు నిర్వహిస్తామని హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. తమిళనాడులో రాజకీయ పార్టీలు ‘మురుగన్’ వైపు మొగ్గు చూపడం కొత్తేమీ కాదు. 2020లో ఎల్ మురుగన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ ‘వేల్ యాత్ర’ నిర్వహించింది. డీఎంకే కొంత వరకు నాస్తిక భావజాలాన్ని కలిగివుందని అంటుంటారు. అయితే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం దేవుణ్ణి ఆశ్రయించడం ఇదే తొలిసారి. హిందుత్వంపై తనదైన ముద్రను పెంచుకుంటున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకే డీఎంకే ఈ ఎత్తుగడ వేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మురుగన్ సదస్సు ద్వారా ఎన్నికల్లో లాభపడాలని డీఎంకే భావిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. కాగా డీఎంకే సారధ్యలో మురుగన్ సదస్సు నిర్వహణపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీనివాసన్ మాట్లాడుతూ మొదట డీఎంకే పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టిందని, ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని, రాజకీయాలను కాపీ కొడుతున్నదని ఆరోపించారు. మురుగన్‌ను తమిళనాడుకు మాత్రమే పరిమితం చేయలేమని, మురుగన్‌ను దేశవ్యాప్తంగా పూజిస్తారని, డీఎంకే మాయలో ప్రజలు ఎప్పటికీ పడిపోరని పేర్కొన్నారు. బీజేపీ నేతల ఆరోపణలపై రాష్ట్ర మంత్రి శేఖర్‌బాబు స్పందిస్తూ, మురుగన్ అంతర్జాతీయ ఉత్సవ నిర్వహణలో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మురుగన్ ఆలయాల కోసం ఖర్చు చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని చేర్చామని, ఆలయ పునరుద్ధరణకు రూ.300 కోట్లు కేటాయించామని తెలిపారు. అలాగే పళని మురుగన్ ఆలయ పునరుద్ధరణకు రూ.100 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. -
ఇండియా కూటమిలో చేరికపై కమల్ హాసన్ స్పందన
చెన్నై: స్వార్థరహితంగా ఆలోచించే ఏ కూటమితోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడుకు చెందిన ఎమ్ఎన్ఎమ్ పార్టీ చీఫ్ కమల్‌హాసన్ తెలిపారు. ఇండియా కూటమిలో చేరతారా? అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఇప్పటివరకైతే ఇండియా కూటమిలో తాము భాగస్వాములం కాదని స్పష్టం చేశారు. ఏ కూటమిలో చేరినా స్థానిక ఫ్యూడల్ శక్తులతో కలిసి మాత్రం పనిచేయబోమని చెప్పారు. స్టాలిన్‌కు చెందిన డీఎంకే పార్టీతో కమల్‌హాసన్ కలిసి పనిచేయబోతున్నారన్న పుకార్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కమల్ ఇచ్చిన సమాధానం చర్చనీయాంశమైంది. స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని కమల్‌హాసన్ ఈ సందర్భంగా స్వాగతించారు. ఇదీ చదవండి.. గగన్‌యాన్‌పై ఇస్రో కీలక అప్డేట్ -
TN: తమిళనాడు సర్కారుకు గవర్నర్ షాక్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ ఆర్.ఎన్ రవి అసెంబ్లీకి వచ్చారు. ప్రారంభించిన కొద్ది నిమిషాలకే గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. సీఎం స్టాలిన్, స్పీకర్, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు చెప్పి అనంతరం తాను ప్రసంగం చదవడం లేదని తెలిపారు. ప్రసంగంలోని అంశాలు సరిగా లేవని, ప్రసంగం ప్రారంభించే ముందు, పూర్తయిన తర్వాత జాతీయ గీతం ఆలపించాలని తాను చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఇందుకే తాను ప్రసంగం చదవ లేదని గవర్నర్ తెలిపారు. #WATCH | Tamil Nadu Governor RN Ravi, who refused to read the address given by the government to him at the Legislative Assembly, leaves from the Assembly https://t.co/9IvBmDvMp6 pic.twitter.com/gYv8RjNmq7 — ANI (@ANI) February 12, 2024 ప్రసంగంలోని చాలా అంశాలపై తనకు అభ్యంతరాలున్నాయని గవర్నర్ చెప్పారు. అసలు నిజాలు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ప్రసంగంలోని అంశాలు ప్రతిబింబించడం లేదని గవర్నర్ చెప్పారు. ఇటీవలే కేరళలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా ప్రసంగంలోని కేవలం లాస్ట్ పేరా చదవి గవర్నర్ ప్రసంగాన్ని ముగించారు. ఇదీ చదవండి.. నేడు బీహార్‌లో ఏం జరగనుంది.. ఎవరి బలం ఎంత -
సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక
చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుకను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 2 కోట్ల రేషన్ కార్డుదారులకు రూ.1000ని పండగ కానుకగా అందజేశారు. దీంతోపాటు చెరకు గడ, కిలో ముడి బియ్యం, చెక్కర, చీర, దోతీలను పంపిణీ చేశారు. వీరితో పాటు తమిళనాడులో శరణార్థులుగా ఉన్న శ్రీలంక తమిళులకు కూడా ఈ కానుకను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని అళ్వార్‌పేటలో ప్రారంభించినట్లు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. Tamil Nadu Chief Minister MK Stalin inaugurates state government's Pongal gift hamper scheme in Chennai; also distributes gift hampers to people pic.twitter.com/kC7AlW82oF — ANI (@ANI) January 9, 2023 రాష్ట్రంలో ఉన్న 2,19,71,113 మంది రేషన్ కార్డుదారులు, శిబిరాల్లో ఉన్న శ్రీలంక తమిళ శరణార్థులకు దాదాపు రూ. 2,436.19 కోట్ల అంచనా వ్యయంతో సంక్రాంతి కానుకను అందజేశారు. ఈ పంపిణీలో జనం రద్దీని నివారించేందుకు టోకెన్ విధానాన్ని అమలుపరిచారు. 1.77 కోట్ల దోతి, చీరలను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎదుట కుటుంబం ఆత్మాహుతి యత్నం -
విజయకాంత్ భౌతికకాయానికి తమిళనాడు సీఎం స్టాలిన్ నివాళి
-
నా వ్యాఖ్యలను బీజేపీ తప్పుదారి పట్టించింది: ఉదయనిధి
చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. తన వ్యాఖ్యలను పెద్దవిగా చేసి దేశమంతా విస్తరించేలా చేశారని ఆరోపించారు. మారణహోమానికి పిలుపునిచ్చానని పేర్కొంటూ తన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తప్పుదారి పట్టించారని విమర్శించారు. సనాతన ధర్మాన్ని కరోనా, డెంగ్యూతో పోలుస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మంపై తాను వ్యాఖ్యలను మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తప్పుదారి పట్టించారని ఆరోపించిన ఉదయనిధి స్టాలిన్.. “నేను మారణహోమానికి పిలుపునిచ్చానని మోదీ అన్నారు. కానీ నేను చెప్పని విషయాలను ఆయన అన్నారు. నేను ఒక సమావేశంలో పాల్గొని మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడాను. ఎలాంటి వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంలో వివక్షను రూపుమాపాలి అని మాత్రమే నేను మాట్లాడాను. కానీ దాన్ని వక్రీకరించి పెద్దది చేసి యావత్ భారతదేశం నా గురించి మాట్లాడుకునేలా చేశారు." అని ఉదయనిధి అన్నారు. “ఓ సాధువు నా తలపై 5-10 కోట్ల రూపాయల బహుమతిని ప్రకటించారు. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. కోర్టులపై నమ్మకం ఉంది. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని నన్ను అడిగారు. క్షమాపణ చెప్పలేనని చెప్పాను. నేను స్టాలిన్ కొడుకుని, కలైంజ్ఞర్ మనవడిని, నేను వారి భావజాలాన్ని కొనసాగిస్తాను." అని ఉదయనిధి తెలిపారు. ‘తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’.. ‘సనాతన నిర్మూలన’ పేరుతో సెప్టెంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కకుండా.. పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. అది తిరోగమన సంస్కృతి అని.. ప్రజలను కులాలు పేరిట విభజించిందని పేర్కొన్నారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు. ఈ క్రమంలోనే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, కరోనాతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఇదీ చదవండి: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్ ఎత్తివేత -
డిప్యూటీ సీఎంగా ఉదయనిధి?
సాక్షి, చైన్నె: డీఎంకే వారసుడు ఉదయ నిధి స్టాలిన్ సోమవారం 46వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఇదే సమయంలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి అప్పగించాలనే నినాదం తెర మీదకు వచ్చింది. డిసెంబరులో జరిగే యువజన మహానాడు అనంతరం ఆయనకు ప్రమోషన్ ఖాయం అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వివరాలు.. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయ నిధి స్టాలిన్ జన్మదినాన్ని డీఎంకే యువజన విభాగం వాడవాడలా సేవా కార్యక్రమాలతో ఘనంగా జరుపుకున్నాయి. ఉదయాన్నే తండ్రి, సీఎం స్టాలిన్, తల్లి దుర్గా ఆశీస్సులను ఉదయ నిధి అందుకున్నారు. అదే సమయంలో డీఎంకే యూత్ నేతృత్వంలో ఉదయ నిధి కోసం ఎంగల్ అన్న ( మా అన్న)పేరిట ఓ పాటల సీడీని సిద్ధం చేసింది. అలాగే ఉదయ నిధి నటించి విజయవంతమైన మామన్నన్ చిత్రంలోని ఓ పాట ఆధారంగా మరో ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేశారు. వీటిని మంత్రి అన్బిల్ మహేశ్ విడుదల చేశారు. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయ నిధి సేవలను మరింత విస్తృతంగా ఉపయోగించుకునేందుకు వీలుగా ఆయనకు ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. తండ్రి బాటలోనే.. తన తండ్రి, పార్టీ అధినేత కరుణానిధి వారసుడిగా డీఎంకే రాజకీయాల్లో ఎంకే స్టాలిన్ చక్రం తిప్పిన విషయం తెలిసిందే. తండ్రి సీఎంగా ఉన్న కాలంలో ఆయన డిప్యూటీ సీఎంగా అధికార వ్యవహారాల్లో దూసుకెళ్లారు. తండ్రి మరణంతో డీఎంకే పగ్గాలు చేపట్టి ప్రస్తుతం సీఎంగా ద్రవిడ మోడల్ పాలన నినాదంతో ముందుకెళ్తున్నారు. అదే సమయంలో తన వారసుడు ఉదయ నిధి స్టాలిన్‌ను సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సినీ నటుడిగా డీఎంకే రాజకీయాల్లోకి వచ్చిన ఉదయ నిధి ప్రజాకర్షణలో ఫలితం సాధించారు. 2021 లోక్ సభ ఎన్నికలలో తండ్రి స్టాలిన్‌తో సమానంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో దూసుకెళ్లడమే కాదు, చేపాక్కం ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పగ్గాలు అందుకున్నారు. ఏడాది తర్వాత ఆయనకు మంత్రి పదవి అప్పగించాలని పలువురు సినీయర్లు నినాదించడంతో క్రీడల శాఖను కేటాయించారు. ప్రస్తుతం డిప్యూటీ నినాదం తెర మీదకు వచ్చిన నేపథ్యంలో ప్రమోషన్ ఉంటుందా..? లేదా..? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. -
సనాతన ధర్మంపై మాట్లాడకండి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ సూచన
చెన్నై: సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని డీఎంకే చీఫ్ స్టాలిన్ పార్టీ నేతలకు తెలిపారు. బీజేపీ అవినీతినే లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు. సనాతన ధర్మంపై దృష్టి మరల్చి కేంద్రం తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం అంశంపై పోరాడాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదేనని అన్నారు. 'సనాతన ధర్మం అంశంపైనే తరచూ మాట్లాడటానికి కేంద్ర మంత్రులు నిత్యం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ లోపాల నుంచి ప్రజలను దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తున్నారు. నేతలందరూ ఈ విశయాన్ని గమనించి సనాతన అంశానికి దూరంగా ఉండాలి.' అని స్టాలిన్ తమ పార్టీ వర్కర్లకు తెలిపారు. మతపరమైన, నిరంకుశ బీజేపీ పాలనను అంతం చేయడానికి నడుం బిగించాలని పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రజస్వామ్యాన్ని, హక్కులను కాపాడాలని సూచించారు. కేంద్ర పథకాలలోని అమలులో లోపాలపై స్పందించాలని చెప్పారు. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తన వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో మతపరమైన వ్యాఖ్యలకు తావివ్వకూడదని సూచించారు. ఇదీ చదవండి: Hindi Diwas: దేశంలో హిందీపై వ్యతిరేకత ఎందుకు? -
అధికారం కోల్పోయినా పర్వాలేదు
సాక్షి, చైన్నె : సనాతన ధర్మం నిర్మూలించే వ్యవహారంలో తమ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినా పర్వాలేదని క్రీడల శాఖ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. వివరాలు.. సనాతన ధర్మం గురించి ఉదయ నిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు, ఫిర్యాదులు, కేసుల మోత మోగుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం రాయపేటలో ఉదయనిధి మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అంబేడ్కర్, పెరియార్, అన్నా వంటి మహానేతలు సనాతనం గురించి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వీరు చేసిన వ్యాఖ్యలను తలదన్నే విధంగా తానేదో గొప్పగా మాట్లాడేసినట్టు కొందరు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. సనాతన ధర్మం వ్యవహారంలో పదవి నుంచి తప్పించినా, తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసినా తగ్గేది లేదన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించే వ్యవహారంలో తమ ప్రభుత్వం అధికారం కోల్పోయినా బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. తమ సిద్ధాంతం ద్రవిడ మార్గం అని అధికారం తమకు ముఖ్యం కాదని, సిద్ధాంతాలే కీలకం అని వ్యాఖ్యలు చేశారు. -
అందుకే దేవాలయానికి వెళ్లలేదు.. సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు..
బెంగళూరు: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు ఇండియా కూటమిని రాజకీయంగా విమర్శలకు గురిచేస్తున్న క్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వివాదాస్పదంగా మాట్లాడారు. చొక్కా తీసేయాలని అడిగినందుకు కేరళలోని దేవాలయానికి తాను వెళ్లలేదని చెప్పారు. ' ఒకానొకసారి కేరళలో ఓ దేవాలయానికి వెళ్లాను. ఆలయంలోకి ప్రవేశించాలంటే తాను చొక్కా తీసేయాలని కోరారు. నేను దేవాలయంలోకి వెళ్లడమే మానేశాను. గుడి బయట నుంచే ప్రార్థించాలని వారు నాకు చెప్పారు. నన్ను ఒక్కడినే చొక్కా తీసేయాలని కోరారు తప్పా అక్కడ ఉన్న ఎవ్వరినీ అడగలేదు. దేవుడి ముందు ఇది చాలా అమానవీయమైన పద్ధతి. భగవంతునికి అందరూ సమానమే.' అని సిద్ధరామయ్య చెప్పారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న నారాయణ గురు 169వ జన్మదిన ఉత్సవాల్లో ఆయన ఈ మేరకు మాట్లాడారు. 'Didn't enter temple when...': #Siddaramaiah sparks controversy amid #Sanatana row | @sagayrajp https://t.co/UuDEVMPAsd — IndiaToday (@IndiaToday) September 7, 2023 దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయంలోకి ప్రవేశించే ముందు చొక్కా తీసివేయడం ఆనవాయితీగా వస్తోంది. శరీరంపై చొక్కాకు బదులు భుజాల మీదుగా అంగవస్త్రాన్ని ధరిస్తారు. సాంప్రదాయంగా ఈ విధానం అమలులో ఉంది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇదీ చదవండి: ఉదయనిధి వ్యాఖ్యలపై మౌనం వీడిన స్టాలిన్.... మోదీతో సహా బీజేపీ నేతలకు కౌంటర్ -
పని చేయండి, మంచి పేరు తెచ్చుకోండి : సివిల్స్ విజేతలతో సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజలే మన బాసులు, వారికోసం నిరంతరం అంకిత భావం, బాధ్యతతో పని చేయాలి’’ అని సివిల్ సర్వీసు ఉత్తీర్ణులకు సీఎం స్టాలిన్ సూచించారు. యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 33 మంది అభ్యర్థులను గురువారం ఆయన అభినందించారు. అనంతరం ఘనంగా సత్కరించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వివరాలు.. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్(యూపీఎస్సీ) పరీక్షలలో రాణించాలన్న తపనతో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ప్రత్యేక శిక్షణకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థులలో 33 మంది 2022 సంవత్సరం సివిల్ సర్వీసు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. మంచి ర్యాంకులతో వివిధ పోస్టులను చేజిక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. వీరందరినీ గురువారం సచివాలయంలో సీఎం స్టాలిన్ కలిశారు. వారిని అభినందించి, సత్కరించడంతోపాటు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ, తమిళనాడు గర్వపడే విధంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉన్నారని అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న లక్షలాది మందిలో విజయాన్ని దక్కించుకున్న అభ్యర్థుల్లో అనేక మంది గ్రామీణులు, మధ్య తరగతి కుటుంబాల వారు కావడం మరింత ఆనందం కలిగిస్తోందన్నారు. తల్లిదండ్రులను మరవొద్దు.. పిల్లల్ని పెంచి ప్రయోజకులను చేయడంలో తల్లిదండ్రుల శ్రమ ఎంతో ఉందని, ఈ స్థాయికి మిమ్మల్ని తీసుకు రావడంతో తల్లిదండ్రుల పాత్ర మరవలేనిదిగా పేర్కొన్నారు. ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు, బాధ్యత గల పోస్టుల్లో చేరినాంతరం తల్లిదండ్రులను మరవొద్దని, గ్రామీణ ప్రజల జీవితాలలో వెలుగు నింపే విధంగా శ్రమించాలని పిలుపు నిచ్చారు. ప్రజలే బాసులు అని, వారికి అంకిత భావం, బాధ్యతతో పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను దరి చేర్చాలని సూచించారు. గొప్ప అధికారులుగా బాధ్యతలు స్వీకరించినానంతరం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే విధంగా పయనం ఉండాలన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా సెప్టెంబరు 15న అమలు కాబోతున్న కలైంజ్ఞర్ మహిళ హక్కు పథకం (రూ.1000 నగదు పంపిణీ) మీదే ఉందన్నారు. ఎందుకంటే ఇది మహిళలకు ఆర్థిక బలానికి ఉపయోగకరంగా ఉండబోయే పథకం అవని వివరించారు. ఈ పథకం అమలు పూర్తి బాధ్యతలు జిల్లాల కలెక్టర్ల భుజాన వేశానని గుర్తు చేస్తూ, అప్పగించిన పనిని ప్రజలి జిల్లాలో సక్రమంగా నిర్వర్తిస్తారనే నమ్మకం ఉందన్నారు. పేద ప్రజల అవసరాలను తీర్చడం, పేద ప్రజల పట్ల దయ చూపించడం ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటూ సేవ చేయడాన్ని ఉద్యోగంగా కాకుండా బాధ్యతగా అలవాటు చేసుకోవాలని సూచించారు. శిక్షణలో చక్కగా రాణించాలని, త్వరలో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. ప్రారంభోత్సవాలు.. అనంతరం సచివాలయం నుంచి పలు కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ ప్రారంభించారు. రూ.13.07 కోట్లతో నిర్మించిన రెండు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, రూ. 3.42 కోట్లతోపునరుద్ధరించిన 7 హాస్టళ్లు ఇందులో ఉన్నాయి. అలాగే కార్మిక సంక్షేమం, స్కిల్ డెవలప్మెంట్ విభాగం నేతృత్వంలో సిద్ధం చేసిన 45 ప్రభుత్వ వృత్తి శిక్షణ, విద్యా కేంద్రాలను, రూ. 1,559 కోట్ల 25 లక్షల వ్యయంతో 4. ఓ ప్రాజెక్టు మేరకు పరిశ్రమలను సీఎం ప్రారంభించారు. ఈ వృత్తి శిక్షణ కేంద్రాల్లో అదనంగా 5,140 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు తీసుకున్నారు. -
బీజేపీకి పతనం తప్పదు! : తమిళనాడు సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: మతపరంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టి రానున్న ఎన్నికల్లో గెలవచ్చన్న ధీమాతో ఉన్న బీజేపీకి జాతీయ స్థాయిలో పతనం తప్పదని సీఎం స్టాలిన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో ప్రజలు పెద్ద గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు. గురువారం డీఎంకే కార్యాలయం అన్నాఅరివాలయంలో పార్టీ నాయకుడు గుమ్మిడిపూండి వేణు ఇంటి శుభకార్య వేడుకలో సీఎం స్టాలిన్ పాల్గొని ప్రసంగించారు. డీఎంకే అంటే ఓ కుటుంబం అన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. మహానాడులైనా సరే, పార్టీ కార్యక్రమాలైనా సరే కుటుంబ సమేతంగా నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చే ఒకే ఒక్క పార్టీ డీఎంకే అని గుర్తు చేశారు. డీఎంకేలో ఉన్న ప్రతి ఒక్కర్ని దివంగత నేత కలైంజ్ఞర్ కరుణానిధి తన కుటుంబంలోని వ్యక్తులుగానే భావిస్తారని పేర్కొన్నారు. డీఎంకేకు ఓటు వేస్తే అది కరుణానిధి కుటుంబ ప్రయోజనానికే ఉపయోగకరం అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. డీఎంకే అంటే కుటుంబం, డీఎంకే అంటే తమిళనాడు, తమిళనాడు ప్రయోజనాలే డీఎంకేకు ముఖ్యం అన్న విషయాన్ని ఆయన బాగానే గ్రహించినట్టున్నారని హితవు పలికారు. ఓటమి తప్పదు.. గత 50 ఏళ్లుగా తమిళనాడు అనే కుటుంబం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా డీఎంకే శ్రమిస్తున్న విషయాన్ని మోదీ గుర్తెరగాలని సూచించారు. ఆధునిక తమిళనాడు రూపకర్త దివంగత నేత కరుణానిధి అని, ఆయన అడుగుజాడల్లో ద్రావిడ మోడల్ పాలన తమిళనాట సాగుతోందన్నారు. కలైంజ్ఞర్ శత జయంతి ఉత్సవాల వేళ గత రికార్డుల గురించి చెబుతూ పోతే సమయం చాలదని పేర్కొన్నారు. మీసా చట్టంలో తాను అరెస్టయిన సమయంలో జైల్లో ముందుగా తనను కాకుండా ఇతర నాయకులు, కార్యకర్తలను దివంగత నేత పరామర్శించారని గుర్తు చేశారు. ఆయనకు కుమారుడి కంటే డీఎంకే కుటుంబం ముఖ్యం అని గుర్తు చేస్తూ, ఇవన్నీ మోదీకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీలో భయం పెరిగిందన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంతో ఓటమి తప్పదన్న ఆందోళనలో ఆయన ఉన్నారని పేర్కొన్నారు. అందుకే ప్రజల మధ్య మత చిచ్చులు పెట్టి, ఆ నీడలో 2024 ఎన్నికల్లో గెలవాలన్న వ్యూహ రచనలో ఉన్నారని ఆరోపించారు. ఆయన పాచికలు ఇక పారబోవని, ప్రజలు మోదీ గురించి సమగ్రంగా అధ్యయనం చేసి ఓడించడం లక్ష్యంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మణిపూర్ ఘటనలను గుర్తు చేస్తూ, ఈ వ్యవహారంలో మోదీ అనుసరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. అల్లర్లు బయలుదేరిన నెలన్నర రోజుల తర్వాత హోంమంత్రి అమిత్‌షా ద్వారా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం శోచనీయమని విమర్శించారు. ఈసారి ఎన్ని కుట్రలు చేసినా మోదీకి ఓటమి తప్పదని, ప్రజలు ఆయనకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. -
కుష్బూపై వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సస్పెండ్
చెన్నై: బీజేపీ నాయకురాలు, తమిళ సీనియర్ నటి కుష్బూపైన, తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవిపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తిని ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుండి ఆయన్ను సస్పెండ్ చేసింది. అనంతరం కొడుంగైయూర్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగ వేదిక మీద సీఎం స్టాలిన్ సమక్షంలోనే శివాజీ కృష్ణమూర్తి బీజేపీ నేత కుష్బూ గురించి ప్రస్తావిస్తూ.. నేను నిన్ను చెప్పుతో కొట్టగలను.. కానీ అది చెప్పులకు అవమానమని అన్నారు.. ఇక తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవి ఇటీవల అసెంబ్లీలో అంబేద్కర్ పేరును ఉచ్ఛరించడానికి కూడా సంకోచిస్తున్నారు.. అలాంటప్పుడు ఆయనపై దాడి చేయడం తప్పే లేదని వెంటనే కాశ్మీర్ వెళ్ళండి, అక్కడ టెర్రరిస్టులు మీపై తుపాకులు ఎక్కుపెడతారని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు శివాజీ కృష్ణమూర్తి. తనపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలైన కుష్బూ తీవ్రంగా స్పందించారు.. ఆయన నన్నే కాదు మీ నాన్నలాంటి గొప్ప నాయకులను కూడా కించపరుస్తున్నారు అర్ధం కావడం లేదా? అని సీఎం స్టాలిన్ ను ప్రశ్నించారు. ఆడవాళ్ళ గురించి ఏది పెడితే అది మాట్లాడొచ్చన్న వారి ధోరణి చూస్తేనే అర్ధమవుతోంది వారి పెంపకం ఎలాంటిదో. నేను దీన్నంత తేలిగ్గా వదలను, IPC సెక్షన్ 509 కింద కేసు నమోదు చేస్తానన్నారు. ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించినందుకు శివాజీ కృష్ణమూర్తి ప్రాధమిక పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది డీఎంకే పార్టీ. అలాగే ఆయన్ను అన్ని పార్టీ పదవుల నుండి సస్పెండ్ చేసింది. ఇది కూడా చదవండి: నా లివర్ ఇనుముతో తయారుకాలేదు.. -
ఎట్టి పరిస్థితుల్లో బిల్లును అడ్డుకుంటాం... అరవింద్ కేజ్రీవాల్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా బలాన్ని కూడగట్టే పనిలో విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసి మద్దతు కోరగా అయన సానుకూలంగా స్పందించినందుకు కేజ్రీవాల్ కృతఙ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం... ఢిల్లీలో ఆధిపత్యం కోసం ప్రయత్నించిన కేంద్రానికి సుప్రీం కోర్టులో చుక్కెదురవడంతో ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని చూస్తోన్న కేంద్రానికి లోక్ సభలో బిల్లు ఆమోదింప చేయడం పెద్ద కష్టం కాదు. కానీ రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడాలంటే మాత్రం 93గా ఉన్న వారి బలం సరిపోదు. ప్రతిపక్షాల మద్దతు కూడా కావాలి. కానీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎలాగైనా కేంద్రానికి అడ్డుకట్ట వేయాలని కృతనిశ్చయంతో ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరినీ కలుపుకుంటూ... ఇప్పటికే ఈ బిల్లుకు వ్యతిరేకంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ల మద్దతును కూడగట్టిన కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మన్ తో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ అయ్యి మద్దతివ్వాలని కోరారు. అందుకు స్టాలిన్ కూడా సుముఖంగా స్పందించడంతో కేజ్రీవాల్ ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. తర్వాతి ప్రయత్నంలో ఢిల్లీ సీఎం జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ను కూడా కలిసి మద్దతు కోరనున్నారు. చదవండి: కర్ణాటక ఫలితాలు ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది.. -
హీరో రేంజ్ లో సీఎం స్టాలీన్
-
తమిళనాడు: స్టాలిన్ బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఐటీ సోదాల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఐటీ అధికారులు సోమవారం ఉదయం నుంచి 50 ప్రాంతాల్లో బృందాలుగా సోదాలు నిర్వహించారు. ఇక, తమిళనాడు సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యుల ఇళ్లలో, అధికార డీఎంకే నేతలు, జీ స్వ్కేర్ కంపెనీ రియల్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అన్నానగర్ డీఎంకే ఎమ్మెల్యే మోహన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరులో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కాగా, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
తమిళనాట హైలైట్ ట్విస్ట్.. స్టాలిన్ దెబ్బకు దిగివచ్చిన గవర్నర్
గతకొద్దిరోజులుగా తమిళనాడులో సీఎం స్టాలిన్ వర్సెస్ గవర్నర్‌్ ఆర్ఎన్ రవి అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. సీఎం స్టాలిన్, గవర్నర్ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై స్టాలిన్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాజాగా అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన ఆన్లైన్ జూదాన్ని నిషేధించే, ఆన్లైన్ గేమ్‌లను నియంత్రించే బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపారు. అయితే, అంతకుముందు.. సీఎం స్టాలిన్ సోమవారం రెండోసారి గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తాము ప్రజల కోసం తీసుకొచ్చిన బిల్లును బహిరంగ వేదికపై గవర్నర్ విమర్శించారని, ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా నిలుస్తున్నారని మండిపడ్డారు. అలాగే, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలిపేలా గవర్నర్‌కు తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములను కోరారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అధికార వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోకూడదని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి.. గవర్నర్ గైడ్‌గా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని అన్నారు. కానీ తమిళనాడు గవర్నర్ మాత్రం ప్రజలకు మంచి చేసేందుకు సిద్ధంగాలేరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ రవి దిగి వచ్చారు. అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన ఆన్లైన్ జూదాన్ని నిషేధించే, ఆన్లైన్ గేమ్‌లను నియంత్రించే బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపారు. మరోవైపు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వద్ద మరో 20 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించాలన్న బిల్లు కూడా ఇందులో ఉన్నది. ఇదిలా ఉండగా.. ఆన్లైన్ జూదంలో డబ్బులు పోగొట్టుకోవడంతో తమిళనాడులో 40 మందికిపైగా వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, గత ప్రభుత్వం ఆమోదించిన ఈ తరహా బిల్లును కోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధికారంలోకి రాగానే ఈ బిల్లుపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. దీంతో, తొలిసారి అసెంబ్లీ ఆమోదించి పంపిన 131 రోజుల తర్వాత గవర్నర్ గత నెలలో ఈ బిల్లును ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మరోసారి ఆమోదించి గవర్నర్‌కు రెండోసారి ఈ బిల్లును ప్రభుత్వం పంపింది. -
సీఎం స్టాలిన్ కు ఖర్గే ఫోన్..!
-
ఏపీ మద్యంపై తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే మద్యం బ్రాండ్లను తమిళనాడులో అమ్మకుండా ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ నిషేధించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న క్లిప్పింగ్ పూర్తిగా అవాస్తవమని డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కమిషనర్, ఎపీఎస్బీసీఎల్ ఎండీ డి.వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యం బ్రాండ్లు తమిళనాడు సహా ఏ రాష్ట్రానికీ ఎగుమతి అవడంలేదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తమిళనాడుకి మద్యం ఎగుమతులే జరగనప్పుడు ఆ రాష్ట్రంలో ఏపీ మద్యాన్ని నిషేధించే అవకాశమే ఉండదని తెలిపారు. ప్రభుత్వంపై బురదజల్లే దురుద్దేశంతోనే ఈ క్లిప్పింగ్‌ను వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో తయారవుతున్న ఐఎంఎఫ్ఎల్, బీరు రాష్ట్రంలో మాత్రమే వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీల మద్యం ఉత్పత్తిపై ప్రభుత్వ కెమికల్ లేబొరేటరీ ఇచ్చిన రిపోర్టులు పరిశీలించిన తర్వాతే వాటిలో ఐఎంఎఫ్ఎల్ ఉత్పత్తికి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. చెన్నై ఎస్జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చి న కెమికల్ రిపోర్టు కేవలం వారి శాంపిల్స్‌ను పరీక్షించి ఇచ్చినవేనని, ఐఎస్ 4449 (విస్కీ), ఐఎస్ 4450 (బ్రాందీ)శాంపిల్స్‌ను ఆ సంస్థ పరీక్షించలేదని గతంలోనే తాము స్పష్టం చేసినట్లు తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యంపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. -
లంక నావికాదళం ఓవరాక్షన్.. సీఎం స్టాలిన్ ఫైర్
సాక్షి, చైన్నె: శ్రీలంక సేనలు తగ్గడం లేదు. మళ్లీ తమిళ జాలర్లపై దాడి చేశారు. ఈ ఘటన తమిళ జాలర్లలో ఆగ్రహాన్ని రేపింది. ఈనెలలో ఇప్పటికే రెండుసార్లు తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీఎం స్టాలిన్ సైతం తీవ్రంగా పరిగణించారు. దాడులు కట్టడి చేయాలని కోరుతూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయ శంకర్‌కు లేఖ కూడా రాశారు. అలాగే శ్రీలంక నావికాదళంపై వేదారణ్యం మైరెన్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయినా, తాము తగ్గేది లేదన్నట్టు శ్రీలంక సేనలు వ్యవహరిస్తున్నారు. కారైక్కాల్‌కు చెందిన అంజప్పర్ పడవలో మైలాడుతురైకు చెందిన 11 మంది జాలర్లు చేపల వేటకు వెళ్లారు. శనివారం రాత్రి కోడికరై వద్ద వేటలో ఉన్న వీరిపై శ్రీలంక సేనలు విరుచుకుపడ్డారు. వలలు, జీపీఎస్ తదితర పరికరాలను స్వాఽధీనం చేసుకున్నారు. అలాగే, సముద్రంలో దూకమని చెప్పి జాలర్లను చిత్రహింసలకు గురిచేశారు. సముద్రంలో ఈదుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జాలర్లు వేదనపడగా, శ్రీలంక సేనలు అనందించి వెళ్లారు. ఆ సేనలు వెళ్లడంతో అతి కష్టంపై ఒడ్డుకు చేరుకున్న జాలర్లు మత్స్యశాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై జరిగిన దాడిని జాలర్ల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. శ్రీలంక సేనలు రోజురోజుకు విరుచుకుపడుతుండడంతో పోరుబాటకు సిద్ధమవుతున్నారు. -
ఉప ఎన్నికల వేళ తమిళనాడులో ట్విస్ట్.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం!
ఎడతెగని వ్యూహాలు.. ఎత్తులకు పైఎత్తులతో ప్రధాన పార్టీలన్నీ ఈరోడ్ ఉప సమరానికి సిద్ధమయ్యాయి. బుధవారం నామినేషన్లను ఎన్నికల అధికారి ఆమోదించడంతో ప్రచార పర్వానికి తెరలేపాయి. ముఖ్యంగా నాలుగు ప్రధాన పారీ్టలకు చెందిన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రజా క్షేత్రంలో నువ్వా..నేనా అన్నట్లు ముందుకు సాగుతున్నాయి. సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కీలక దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీఎండీకే, నామ్ తమిళర్ కట్చిల అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారి శివకుమార్ బుధవారం ఆమోదించారు. పరిశీలనలో మరో 76 నామినేషన్లు కూడా ఓకే అయ్యాయి. ఈ ఎన్నికల రేసుల నుంచి తాము తప్పుకుంటున్నట్లు అన్నాడీఎంకేలో చీలిక కారణంగా ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రకటించడం చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సీఎం ఎంకే స్టాలిన్ నియోజకవర్గంలో ఓట్ల వేటకు సిద్ధమయ్యారు. రసవత్తరంగా.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నిక అన్నాడీఎంకే రాజకీయాలను రసవత్తరంగా మార్చింది. ఆ పార్టీ శిబిరాల అభ్యర్థులుగా తెన్నరసు, సెంథిల్ మురుగన్, ఆ పార్టీలో చీలికతో ఆవిర్భవించిన అమ్మమక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా శివ ప్రశాంత్ నామినేషన్లు వేశారు. చివరకు సర్వసభ్య సభ్యుల మెజారిటీ మద్దతుతో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం తన అభ్యర్థి సెంథిల్ మురుగన్‌ను పోటీ నుంచి తప్పించారు. అదే సమయంలో తాజాగా తమకు కుక్కర్ గుర్తు కేటాయించబోమని ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడాన్ని నిరసిస్తూ అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం కూడా ఎన్నికల నుంచి తప్పుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు ఏ విధంగా పన్నీరు సెల్వం తలొగ్గారో, అదే తరహాలో అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ కూడా వెనక్కి తగ్గినట్టు చర్చ సాగుతోంది. క్షణంలో ఎన్నికల రేసులో నుంచి తప్పుకున్నా, తాము ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గేది లేదని, తమకు అనుకూలమైన గుర్తు కేటాయించక పోవడం వల్లే బరిలో నుంచి తప్పుకున్నట్లు టీటీవీ స్పష్టం చేశారు. దుష్ట శక్తి డీఎంకే, ద్రోహ శక్తి అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి శిబిరం అభ్యర్థి తెన్నరసు మాత్రమే అధికారికంగా ఆ పార్టీ తరపున పోటీలో మిగిలారు. 121లో 80 నామినేషన్లకు ఆమోదం ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వద్ద గత నెల 31 నుంచి ఈనెల 7వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించారు. మొత్తంగా 121 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆరుగురు ఉన్నారు. ఇందులో ఇద్దరు వెనక్కి తగ్గారు. బుధవారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఎన్నికల పర్యవేక్షకుడు రాజ్ మోహన్ యాదవ్, ఎన్నికల అధికారి శివకుమార్ అన్ని నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 121 నామినేషన్లు దాఖలు కాగా, 80 ఆమోదం పొందాయి. ఇందులో తొలి ఆమోదం ఎన్నికల వీరుడు, స్వతంత్ర అభ్యర్థి పద్మరాజన్ది కావడం విశేషం. ఆ తర్వాత కోవైకు చెందిన స్వతంత్ర అభ్యర్థి నూర్ మహ్మద్ నామినేషన్‌ను ఆమోదించారు. మూడో నామినేషన్ కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్. అలాగే అన్నాడీఎంకే డీఎంకే అధికారిక అభ్యర్థి తెన్నరసు, డీఎండీకే అభ్యర్థి ఆనంద్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి మేనక నామినేషన్లకు కూడా ఆమోదం లభించింది. ఇక ఎన్నికల నుంచి తప్పుకున్న పన్నీరు సెల్వం వర్గం అభ్యర్థి సెంథిల్ మురుగన్, టీటీవీ అభ్యర్థి శివ ప్రశాంత్ నామినేషన్లు ఆమోదం పొందినా, వారు గురువారం ఉప సంహరించాలని నిర్ణయించారు. కాంగ్రెస్సా.. డీఎంకేనా..? ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీఎండీకే, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే సమరం కాంగ్రెస్, అన్నాడీఎంకే అభ్యర్థులు ఈవీకేఎస్, తెన్నరసు మధ్య ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎండీకే, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు చీల్చే ఓట్లే కాంగ్రెస్, అన్నాడీఎంకే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. అన్నాడీఎంకే అభ్యర్థికి మద్దతుగా ఆయా కూటమి పక్షాలైన బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్ తదితర పారీ్టలు ప్రచారానికి సిద్ధమయ్యాయి. బుధవారం పళని స్వామి నేతృత్వంలో మిత్ర పక్షాల నాయకులు సమావేశమయ్యారు. ఈనెల 12వతేదీ నుంచి నియోజకవర్గంలో పళని స్వామి ఇంటింటా సుడిగాలి ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు. కాగా అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపు కోసం తమ శిబిరం తరపున కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను పన్నీరు సెల్వం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇప్పటికే డీఎంకే మంత్రులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ కూడా ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఈనెల 24, 25 తేదీల్లో ఈరోడ్‌లో 10 చోట్ల సీఎం ప్రసంగించనున్నారు. అలాగే సీఎం తనయుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ కూడా ఈనెల 19, 20 తేదీల్లో ఇలంగోవన్ కోసం ప్రచారం చేయనున్నారు. -
ఢిల్లీలో ఏం జరిగింది.. గవర్నర్ వెనక్కి తగ్గారా..?
సాక్షి, చెన్నై : రాష్ట్రం పేరు తమిళనాడు, తమిళగం అనే వ్యవహారంలో గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి తగ్గారనే వాదన వినిపిస్తోంది. ఢిల్లీలో ఏం జరిగిందో ఏమో గానీ ఆయన తొలుత సంక్రాంతి సంబరాల ఆహ్వాన పత్రికలో తమిళగం గవర్నర్ అని పేర్కొన్నారు. అయితే శనివారం విడుదల చేసిన సంక్రాంతి శుభాకాంక్షల్లో మాత్రం తమిళనాడు గవర్నర్ అని పేర్కొనడం చర్చనీయాంశమైంది. వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ వ్యవహారం ఏకంగా ఢిల్లీకి చేరింది. డీఎంకే ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము స్పందించారు. విచారణ చేపట్టాలని కేంద్ర హోంశాఖను ఆమె ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ వెళ్లిన గవర్నర్ ఆర్ఎన్ రవి శనివారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోని కీలక అధికారులను, ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత అధికారులను కలిసినట్లు సమాచారం. అక్కడ నుంచి వచ్చిన తరువాత సంక్రాంతి శుభాకాంక్షల ప్రకటనలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్రవి అని పేర్కొన్నారు. ఇక పొరుగు రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో లెప్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సంక్రాంతి వేడుకల్లో తమిళనాడు కావాలి.. తమిళగం కూడా కావాలని వ్యాఖ్యానించడం గమనార్హం. -
గవర్నర్ ప్రసంగాన్ని రాజకీయం చేయదలచుకోలేదు: సీఎం స్టాలిన్
‘తమిళుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకోం.. రాష్ట్ర గౌరవాన్ని కాపాడేందుకు ఎందాకైనా వెళతాం’ అని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు శుక్రవారం ప్రశ్నోత్తరాల అనంతరం సీఎం ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలకు ధన్యవాదాలు తెలుపుతూ, సభలో ఆయన వ్యవహరించిన తీరుకు విచారం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయం చేయదలచుకోలేదని.. ప్రజా సంక్షేమం, తల్లి తమిళనాడును రక్షించడమే తమ ముందున్న అతిపెద్ద బాధ్యత అని ఉద్వేగంగా ప్రసంగించారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర గౌరవాన్ని కాపాడుతూ.. అందరికీ సమ న్యాయం చేయడమే తమ లక్ష్యమని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముందుగా తమిళనాడు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సభలో గవర్నర్ వ్యవహరించిన తీరుకు విచారం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగం గురించి మాట్లాడి రాజకీయం చేయదలచుకోలేదన్నారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమష్టి అభివృద్ధి, సమానత్వం, మహిళల హక్కులు, మత సామరస్యం వంటి సూత్రాలను అనుసరించి ద్రావిడ మోడల్ పాలనను రూపొందించామన్నారు. ప్రజల సంక్షేమం మాత్రమే తమ ఆలోచన అని, అదే ప్రజల హృదయాలను తాము గెలుచుకున్నామని పేర్కొన్నారు. నేను అంటే ఓ వ్యక్తి కాదని, మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన కెబినెట్, ప్రభుత్వం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో అల్పాహార పథకం అమలు చేయనున్నామని ప్రకటించారు. కొత్తగా సీఎం గ్రామీణ రోడ్డు అభివృద్ధి పథకాన్ని ప్రవేశ పెట్టనున్నామని తెలిపారు. శక్తిమంతమైన ఉద్యమం సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం, భాష, తమిళ హక్కులు, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి నినాదాలతో శక్తిమంతమైన ఉద్యమాన్ని సాగిస్తున్నామన్నారు. ఏడాదిన్నర కాలంగా రాజీ లేకుండా ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నామన్నారు. తమిళనాడు సమగ్రాభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించామని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి, సామాజిక మార్పు, విద్యా అభివృద్ధి ఏక కాలంలో జరగాలని, తద్వారా అందరికీ మేలు జరగాలన్న కాంక్షతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంలో తమిళనాడు ప్రభుత్వం ఆశయాలు, జరిగిన అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణను క్లుప్తంగా పేర్కొన్నామని వివరించారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వ గౌరవాన్ని కాపాడేందుకు, బలాన్ని చాటేందుకు, శతాబ్దాల చరిత్ర కలిగిన అసెంబ్లీ విలువలను నిలబెట్టే విషయంలో వెనకడానని, ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధం అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొన్ని సూక్తులు, తమిళ కవిత్వాలను క్రోడీకరించారు. నిరంతరం శ్రమిస్తున్నాం... గడిచిన ఏడాదిన్నర కాలం తమిళనాడుకు సువర్ణ యుగాన్ని తలపించే రోజులు అని పేర్కొన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. కరోనా బారిన ప్రజలను రక్షించేందుకు రేయింబవళ్లు శ్రమించామని, తాను సైతం అనారోగ్య కారణాలతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తన గదిలో ఓ ‘డ్యాష్ బోర్డ్ ‘ ఉందని, ప్రతి రోజు అందులోకి వచ్చే సమాచారాలను, వివరాలను పరిశీలించి ఆయా శాఖల తీరుతెన్నులను పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఏడాదిన్నర కాలంలో తన పర్యటనలు, ప్రభుత్వ ప్రగతి, నిధుల కేటాయింపు, తదితర అంశాలను సభకు సీఎం వివరించారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని, ద్రావిడ మోడల్ పాలనకు లభించిన ఫలితం ఇది అని పేర్కొన్నారు. పథకాల విస్తరణ.. రాష్ట్రంలోని 1,545 పాఠశాలల్లో అల్పాహారం పథకం అమల్లో ఉందని.. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో ఈ పథాకాన్ని అమలు చేస్తామన్నారు. 15 నెలల వ్యవధిలో రైతులకు లక్షా 50 వేల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం సీఎం పేరిట ప్రత్యేక పథకం అమలు చేయనున్నామన్నారు. ఈ పథకం కింద రూ.4 వేల కోట్లతో 10 వేల కి.మీ గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయనున్నామని ప్రకటించారు. మసీదులకు ఇది వరకు రూ. 6 కోట్లు రాయితీలు ఇచ్చామని, ఈ ఏడాది నుంచి ఆ సంఖ్యను రూ. 10 కోట్లకు పెంచుతున్నటు వెల్లడించారు. ప్రపంచ పెట్టుబడిదారుల మహానాడు 2024 జనవరి 10, 11 తేదీల్లో నిర్వహించనున్నామని తెలిపారు. ఇక్కడి పాలసీలు, మౌలిక వసతులను పెట్టుబడిదారులకు తెలియజేయడానికి విదేశీ పర్యటనలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. వందకుపైగా దేశాల నుంచి పెట్టుబడిదారులను ఈ మహానాడుకు ఆహ్వానించనున్నామన్నారు. మరిన్ని ముఖ్యాంశాలు - కృష్ణగిరి, హోసూరు మధ్య వర్తక కేంద్రం ఏర్పాటు చేయనున్నామని మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. - పుదుకోటైను కార్పొరేషన్‌గా మార్చబోతున్నామని మంత్రి కేఎన్ నెహ్రు అన్నారు. - సీఎం బీమా పథకం అమల్లో దేశంలో తమిళనాడు రికార్డు సృష్టించిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ వివరించారు. - ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో రూ.2,37,850 కోట్లతో పనులు చేపట్టామని.. శరవేగంగా జరుగుతున్నాయని ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ పేర్కొన్నారు. - ఈ ఏడాది 316 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని ఆ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. - అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలను ఏర్పాటు చేస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి పేర్కొన్నారు. చివరగా సభలో తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగ చట్టంలో సవరణలతో పాటు మరికొన్ని ముసాయిదాలు ఆమోదం పొందాయి. అనంతరం సభను స్పీకర్ అప్పావు వాయిదా వేశారు. -
మళ్ళీ తెరపైకి సేతు సముద్రం ప్రాజెక్ట్
-
తమిళ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. డీఎంకేతో కమల్ దోస్తీ?
సాక్షి, చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కూటమితో కలిసి ముందుకు సాగాలని మక్కల్ నీది మయ్యం వర్గాలు భావిస్తున్నాయి. అధికార డీఎంకేతో జత కట్టాలంటూ.. పార్టీ అధినేత కమల్‌కు వివిధ జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలు సూచించారు. వివరాలు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను మక్కల్ నీది మయ్యం ఒంటరిగానే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో 2024 లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అవడంతో పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఆపార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం చెన్నైలో జరిగింది. పార్టీ పరంగా ఉన్న 85 జిల్లాల కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ నేతలు, పార్టీ ఉపాధ్యక్షులు మౌర్య, తంగవేలు, కార్యదర్శి సెంథిల్ అర్ముగం, శివ ఇలంగో, స్నేహన్, మూకాంబీకై, మురళీ అబ్బాస్ ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ అధినేత, నటుడు కమల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. కూటమి కోసం పట్టు.. లోక్‌సభ ఎన్నికలను ఈ సారి బలమైన కూటమితో కలిసి ఎదుర్కొంద్దామని, గతంలో చేసిన తప్పులు పునావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడికి నేతలు విజ్ఞప్తి చేశారు. డీఎంకేతో జత కట్టే విధంగా, మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయడానికి సంబంధించిన వివరాలను కొందరు నేతలు అందజేసినట్లు సమాచారం. ఎక్కువమంది మంది డీఎంకే కూటమితో ఎన్నికలను ఎదుర్కొంద్దామని, ఇందుకు సంబంధించిన నిర్ణయం ముందే తీసుకోవాలని కమల్‌ను కోరారు. చివర్లో కమల్ ప్రసంగిస్తూ, కూటమి గురించి పట్టించుకోవద్దని, ఈ వ్యవహారంపై తాను నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొనే విధంగా కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు. ఎవరితో కలిసి వెళ్లాలి..? అనే విషయాన్ని పక్కన పెట్టి, ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. అలాగే చెన్నైలో మక్కల్ నీది మయ్యం కోసం భారీ కల్యాణ వేదికను నిర్మించను న్నట్లు ఈసందర్భంగా కమల్ ప్రకటించారు. -
తమిళనాడులో కుండపోత వర్షం.. హెచ్చరికలు జారీ
సాక్షి, చెన్నై: కుండపోత వర్షాలతో తమిళనాడు ఆగం అవుతోంది. రాజధాని చెన్నైలో కొన్నిప్రాంతాల్లో, కంచీపురం, చెంగళ్పేట, తిరువల్లూరు, మయిలడుతురై, విల్లుపురం జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం మొదలై.. ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెన్నైలోని కొన్ని రోడ్లు.. చెరువుల్ని తలపిస్తున్నాయి. మరోవైపు పలు జిల్లాల్లో శనివారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నైలో గత 24 గంటల్లో.. సగటున 64.5 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణ ద్రోణి ప్రభావం వల్ల.. మరో మూడు, నాలుగు రోజులపాటు వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సహాయక శిబిరాల ఏర్పాటుతో పాటు రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. #ChennaiCorporation #priyarajan #chennaimayor #VelacheryRain #chennairains Please help to clear rain water from my street - location Radhakrishnan street , Indra Gandhi Nagar Velachery (backside of Phoenix mall). Seems drainage is also blocked & water stagnated pic.twitter.com/NckIlJXE5v — Sai shankar (@Sai5590Sai) November 12, 2022 తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలకు భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మొత్తం 19 జిల్లాలకు అతిభారీ వర్షాల సూచన నెలకొంది. ఇదిలా ఉంటే.. చెన్నైలో పలు ప్రాంతాలు జలమయం అయినట్లు తెలుస్తోంది. వరద ముంపు ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించనున్నట్లు సమాచారం. ఇంకోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో.. తీర ప్రాంతాల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: రాజీవ్ హంతకుల విడుదల.. సుప్రీం సంచలన ఆదేశాలు -
రెండోసారి డీఎంకే చీఫ్‌గా స్టాలిన్!...
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం చెన్నైలో పార్టీ జనరల్ అసెంబ్లీ కౌన్సిల్ జరిగింది. ఇటీవలే కొత్తగా ఏర్పడిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో డీఎంకే స్థాలిన్‌ని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. అలాగే పార్టీ నేతలు దురైమరుగన్, టీఆర్ బాలులు కూడా జనరల్ సెక్రటరీ, ట్రెజరీ అధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు నేతలు కూడా వరసగా రెండోసారి పార్టీ అత్యున్నత పదవులను చేపట్టడం విశేషం. అంతేగాదు కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన స్టాలిన్‌కి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డీఎంకే పార్టీ 15వ సంస్థగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీ పదవులకు ఎన్నికలు జరిపిన తర్వాత ఆ ముగ్గురు నేతలని పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అంతేగాదు డీఎంకే పార్టీ పితామహుడు, దివగంత ఎం కరుణానిధిన్ హయాంలో స్టాలిన్ కోశాధికారిగా, యువజన కార్యదర్శిగా పలు పదవులను చేపట్టారు. 2018లో కరుణానిధి మరణాంతరం స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నకయ్యారు. అంతేగాదు 1969లో తొలిసారిగా సృష్టించిన పార్టీ అధ్యక్షుడి పదవికి కరుణానిధే తొలి అధ్యక్షుడయ్యారు. అంతకు ముందు వరకు పార్టీ కార్యదర్శి పదవే అత్యున్నత పదవి. 1949లో ఏర్పాటైన డిఎంకే పార్టీకి అన్నాదురై పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన చనిపోయేంత వరకు ఈ అత్యున్నత పదవిలోనే కొనసాగారు. (చదవండి: రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్: యూపీ కాంగ్రెస్) -
చెన్నైలో డీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్
-
‘శ్రీమతి’ మృతి.. న్యాయం కోసం పాదయాత్ర..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యార్థిని శ్రీమతి (17) అనుమానాస్పద మృతిపై ఆమె తల్లిదండ్రులు అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతూ సీఎంను కలిసేందుకు ఈనెల 26వ తేదీన కడలూరు నుంచి పాదయాత్రగా చెన్నైకి చేరుకోవాలని నిర్ణయించారు. వివరాలు.. కడలూరు జిల్లా వేప్పూరు సమీపం పెరియనేశలూరుకు చెందిన రామలింగం కుమార్తె శ్రీమతి (17) కల్లకురిచ్చి జిల్లా చిన్నసేలంలోని కనియమూర్ శక్తి మెట్రిక్యులేషన్ పాఠశాలలో ప్లస్–2 విద్యార్థిని. గతనెల 13వ తేదీన పాఠశాల ప్రాంగణంలో ఆ యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు, విధ్వంసకాండకు దారితీసింది. ఈ కేసు సీబీసీఐడీ చేతుల్లోకి వెళ్లగా స్కూలు ప్రిన్సిపల్ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం జరిగిన తరువాత మృతదేహాన్ని అప్పగించే ప్రయత్నం చేయగా తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు నిరాకరించాయి. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పుదుచ్చేరి జిప్మర్ ఆసుపత్రి వైద్యుల బృందం పర్యవేక్షణలో మరోసారి పోస్టు మార్టం చేశారు. న్యాయస్థానం జోక్యంతో ఎట్టకేలకూ మృతదహాన్ని తీసుకుని అంతిమ సంస్కారం పూర్తిచేశారు. జిప్మర్ వైద్యులు పోస్టుమార్టం నివేదికను విళుపురం కోర్టుకు ఈనెల 21వ తేదీన సమర్పించారు. జిప్మర్ వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టం వీడియో, నివేదిక నకలను తమకు సమర్పించాలని శ్రీమతి తల్లిదండ్రులు ఈనెల 22వ తేదీన కోర్టును లిఖితపూర్వకంగా కోరగా, న్యాయమూర్తి పుష్పరాణి ఇందుకు సమ్మతించారు. సీఎంను కలిసేందుకు.. ఈ సందర్భంగా శ్రీమతి తల్లి సెల్వి విళుపురంలో మీడియాతో మాట్లాడుతూ, తన కుమార్తె మృతిపై నెలకొన్న అనుమానాలను నెలరోజులు దాటినా నివృత్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో రహస్యంగా ఓ స్నేహితురాలు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసిందని, అయితే ఆమె నిజంగా నా కుమార్తె స్నేహితురాలేనా..? అని నిర్ధారించుకునేందుకు వివరాలు కావాలని కోరారు. సూసైడ్ నోట్లో సంతకం శ్రీమతిది కాదని, అది ఎవరిదో తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం స్టాలిన్ ఫోన్ మాట్లాడినప్పుడు నేరుగా కలుసుకుని తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీన తమ స్వగ్రామమైన కడలూరు జిల్లా పెరియనేశలూరు నుంచి తన భర్తతో కలిసి పాదయాత్రగా చెన్నైకి చేరుకుని సీఎం స్టాలిన్‌ను కలుసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇక శ్రీమతి తల్లిదండ్రులు ఈనెల 27న సీఎంను కలుసుకునే అవకాశం కల్పించినట్లు చెన్నై సచివాలయ వర్గాలు తెలిపాయి. ఇది కూడా చదవండి: ఒకే కుటుంబంలో ఐదుగురిని కాటేసిన పాము -
మదర్ హీరోయిన్ను తెరపైకి తెచ్చిన పుతిన్
మాస్కో: ప్రపంచ జనాభా తగ్గిపోతోంది.. ఇప్పుడు ఇది ఒక ఆందోళనకరమైన అంశంగా సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు.. జనాభాను పెంచే మార్గాలపై దృష్టిసారించాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం రష్యా జనాభాను పెంచేందుకు ఓ పథకం తీసుకొచ్చి.. అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాడు. పదేసి మంది పిల్లలను కని.. వాళ్లను పెంచే తల్లులకు నగదు నజరానా ప్రకటించాడాయన. మదర్ హీరోయిన్.. పుతిన్ నేతృత్వంలో ప్రభుత్వం రష్యాలో తీసుకొచ్చిన పథకం పేరు. ఈ పథకం ప్రకారం.. పది మంది పిల్లలను కని.. వాళ్లను సురక్షితంగా పెంచాల్సి ఉంటుంది తల్లులు. అలా చేస్తే.. వన్ మిలియన్ రూబుల్స్(మన కరెన్సీలో 12 లక్షల 92 వేల రూపాయల)తో పాటు మదర్ హీరోయిన్ గౌరవం ఇచ్చి గౌరవిస్తారు. ఈ విషయాన్ని రష్యా రాజకీయ, భద్రతా దళ నిపుణుడు డాక్టర్ జెన్నీ మాథర్స్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సోమవారం పుతిన్ సంతకాలు చేసినట్లు అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. తగ్గిపోతోంది.. గత రెండున్నర దశాబ్దాలుగా.. రష్యా జనాభా ఆందోళనకరంగా పడిపోతోంది. పైగా కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లాంటి తాజా పరిణామాలతో జనాభా సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో ఈ సంక్షోభం బయటపడేందుకు పుతిన్ తాజా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు మాథర్స్ తెలిపారు. అయితే.. కొత్తదేం కాదు.. పుతిన్ సంతకం చేసిన ‘మదర్ హీరోయిన్’ ఆదేశాలు కొత్తవేం కాదు. గతంలోనూ ఉన్నాయి. ఇంతకు ముందు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ నేత జోసెఫ్ స్టాలిన్.. యుద్ధంలో మరణించిన వాళ్ల సంఖ్యతో జనాభా తగ్గిపోగా ‘మదర్ హీరోయిన్’ రివార్డును ప్రకటించాడు. ఆ స్కీమ్ అప్పట్లో బాగా వర్కవుట్ అయ్యింది. జనాభా క్రమేపీ పెరుగుతూ పోయింది. అయితే.. 1991 సోవియట్ యూనియన్ పతనంతో ఈ టైటిల్ ఇవ్వడం కూడా ఆగిపోయింది. ఇదిలా ఉంటే.. పుతిన్ ‘దేశభక్తి’ ప్రయత్నాలు వర్కవుట్ అయ్యేవి కావని డాక్టర్ మాథర్స్ అంటున్నారు. ఎందుకంటే.. పదవ బిడ్డ పుట్టిన తర్వాతే అదీ మిగతా తొమ్మిది మంది బిడ్డల ఆరోగ్య స్థితి బాగా ఉంటేనే ఈ ప్రైజ్ మనీని, మదర్ హీరోయిన్ ట్యాగ్‌ను సదరు తల్లికి అందిస్తారు. దీంతో ఆ ప్రైజ్ మనీ కోసం అంతమంది పిల్లలను పోషించడం.. కుటుంబాలకు భారం కావొచ్చనే చర్చ నడుస్తోంది అక్కడ. అప్పటి, ఇప్పటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు బేరీజు వేసుకుంటే.. మదర్ హీరోయిన్ ఇప్పుడు విఫలం కావొచ్చనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: కొలీగ్ కౌగిలించుకోవడంతో కోర్టుకెక్కింది! -
‘నా పెళ్లి’కి వేదికనే మార్చేశారు: సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : ‘తన వివాహానికి కామరాజర్ హాజరయ్యేందు గాను.. ఏకంగా వేదికనే మార్చేశారు’ అని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. కొళత్తూరులో ముఖ్యమంత్రి సమక్షంలో గురువారం తొమ్మిది జంటలకు వివాహాలు జరిగాయి. తన నియోజకవర్గం పరిధిలోని కొళత్తూరులో ఆధునీకరించిన దివంగత మాజీ సీఎం కామరాజర్ కమ్యూనిటీ హాల్‌ను ఈ సందర్భంగా సీఎం ప్రారంభించారు. అలాగే, రూ. 2.83 కోట్లతో చేపట్టనున్న పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 9 జంటలకు వివాహాలు జరిగాయి. వధూవరులకు బీరువా, మంచం, మిక్సీ వంటి 33 రకాల వస్తువులను సారెగా సీఎం అందజేశారు. కామరాజర్ కోసం.. తన వివాహం కోసం తేనాంపేట డీఎంకే ప్రధాన కార్యాలయం సమీపంలోని ఓ కల్యాణ మండపాన్ని వేదికగా తొలుత ఎంపిక చేశారని స్టాలిన్ గుర్తు చేశారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లూ జరిగాయని, అయితే చివరి క్షణంలో కామరాజర్ కోసం వేదికను మార్చాల్సి వచ్చిందని తెలిపారు. తన వివాహానికి హాజరు కాలేని పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యంతో కామరాజర్ ఉన్నట్టు పేర్కొన్నా రు. తనకు ఆశీస్సులు అందించాలన్న ఆశగా ఉన్నా, ఆరోగ్యం సహకరించడం లేదన్న ఆవేదనను కామరాజర్ వ్యక్తం చేశారని గుర్తు చేశారు. దీంతో తనకు కామరాజర్ ఆశీస్సులు ఉండాలన్న సంకల్పంతో ఆయన ఇంటికి సమీపంలోని ఉమ్మడియాస్ మైదానంలో ఆగమేఘాలపై తన తండ్రి, దివంగత కరుణానిధి వేదిక సిద్ధం చేయించారని వివరించారు. తన వివాహ వేదికపైకి నేరుగా కారులోనే వచ్చి మరీ కామరాజర్ ఆశీస్సులు అందించారని ఆనందం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ప్రధాని ముందే తమిళనాడు డిమాండ్లను వినిపించిన సీఎం స్టాలిన్ -
బీజేపీ పాలన హిట్లర్, స్టాలిన్ కంటే అధ్వానం: మమతా ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.. కేంద్ర ఏజెన్సీలను అడ్డుపెట్టుకొని రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. మోదీ పాలన హిట్లర్, జోసెఫ్ స్టాలిన్, బెనిటో ముస్సోలినీ కంటే దారుణంగా ఉందని మమతా ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం విలేకరుల సమావేశంలో సీఎం మమతా మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరారు. ఏజెన్సీలను ఉపయోగించి కేంద్రం రాష్ట్రాల పనితీరులో తలదూర్చుతూ సమాఖ్య వ్యవస్ధను ధ్వంసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంపై దీదీ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ చర్చను ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు. ఉజ్వల యోజన కింద బీపీఎల్ దిగువన ఉండే కుటుంబాలకు మాత్రమే గ్యాస్ ధరను తగ్గించారని, ఇది ప్రతి ఎన్నికలకు ముందు చేపట్టే కంటితుడుపు చర్యేనని అన్నారు. పేద ప్రజలు రూ. 800 పెట్టి వంట గ్యాస్ సిలిండర్‌ను ఎలా కొనుగోలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. చదవండి: ఆసుపత్రికి పంజాబ్ కాంగ్రెస్ నేత సిద్ధూ.. స్పెషల్ డైట్‌కు అనుమతిస్తారా? -
సీఎం ఇంటికి బాంబు బెదిరింపు
తిరువొత్తియూరు(చెన్నై): చెన్నై విమానాశ్రయం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇంటిలో బాంబు పెట్టినట్లు బెదిరింపు సమాచారం ఇచ్చిన తిరునల్వేలికి చెందిన యువకుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మంగళవారం మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి విమానాశ్రయం, సీఎం ఇంటికి బాంబు పెట్టినట్లు చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో పోలీసులు సీఎం ఇంటితో పాటు విమానాశ్రయంలో బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీ చేశారు. అక్కడ బాంబు లేదని తెలిసింది. తప్పుడు సమాచారం ఇచ్చిన తిరునల్వేలి జిల్లా సుందమల్లి గ్రామానికి చెందిన తామరై కన్నన్ (25)ను ఫోన్ కాల్ ఆధారంగా అరెస్టు చేశారు. తామరై కన్నన్ ఆకతాయితనంతో బాంబు పెట్టినట్లు ఫోన్ చేశాడని తేలింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకొచ్చి విచారిస్తున్నారు. చదవండి: Hyderabad: కూకట్‌పల్లిలో విషాదం.. విజయ లక్ష్మి ఏం చేసిందంటే..? -
తమిళనాడులో.. ప్రపంచస్థాయి మేధస్సు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచం మొత్తం మీద మేధస్సు, నైపుణ్యం కలిగిన విద్యార్థులు తమిళనాడులోనే ఉండేలా నాన్ ముదల్వన్ అనే పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. చెంగల్పట్టు జిల్లా పయనూరులోని సాయ్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన భవనాలను ప్రారంభించి, మరికొన్నింటికి సీఎం స్టాలిన్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ, తమిళనాడు ప్రభుత్వ అజమాయిషీలో 13 యూనివర్సిటీలు ఉండగా, నేడు ప్రైవేటు విద్యాసంస్థ అయిన సాయ్ యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రి కరుణానిధి ఉన్నతవిద్యకు ప్రవేశ పరీక్షను రద్దు చేశారని గుర్తుచేశారు. అందుకే ప్రస్తుతం తమిళనాడులో 51.4 శాతానికి పైగా విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘనత కరుణానిధికే చెందుతుందన్నారు. ఇంజినీరింగ్, వైద్య విద్యలో ప్రవేశపరీక్ష రద్దును సుప్రీంకోర్టు ద్వారా ఆయన సాధించారని గుర్తు చేశారు. అందుబాటులోకి సంచార వైద్య వాహనాలు పేదల ఆరోగ్య సంరక్షణకై రెండోదశ సంచార వైద్యసేవలను సీఎం స్టాలిన్ మంగళవారం ప్రారంభించారు. తొలిదశలో ఏప్రిల్ 8వ తేదీన 133 సంచార వైద్యవాహనాలను, మలిదశగా మంగళవారం 256 సంచార వైద్య వాహనాలను జెండా ఊపి ఆవిష్కరించారు. ఈసీఆర్ ఇకపై.. కలైంజ్ఞర్ కరుణానిధి రోడ్డు చెన్నై–మహాబలిపురం మధ్యనున్న రహదారి ఈసీఆర్ (ఈస్ట్ కోస్ట్ రోడ్డు)గా పేరుగాంచింది. ఈ రహదారికి స్టాలిన్ ప్రభుత్వం ‘కలైంజ్ఞర్ కరు ణానిధి రోడ్డు’గా నామకరణం చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం జీవో జారీ చేసింది. చదవండి: Karti Chidambaram: కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్ వేసిన ఎంపీ -
తమిళనాడు సీఎంతో రాష్ట్ర బీసీ కమిషన్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో రాష్ట్ర బీసీ కమిషన్ మూడురోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కె.కిశోర్‌గౌడ్‌లు వివిధ అంశాలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో చర్చించారు. శుక్రవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమావేశమయ్యారు. అక్కడ అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లతోపాటు కులగణనకు సంబంధించిన అంశాలను చర్చించారు. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, సమాచార సేకరణలో అవలంబించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై తమిళనాడులో అధ్యయనం చేసినట్లు స్టాలిన్‌కు చెప్పారు. అనంతరం ఆ రాష్ట్ర బీసీ, ఎంబీసీ సంక్షేమ శాఖ మంత్రి రాజకన్నప్పన్, బీసీ, ఎంబీసీ శాఖ ముఖ్య కార్యదర్శి కార్తీక్, పీఆర్ అండ్ ఆర్డీ ముఖ్యకార్యదర్శి ఆముదలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. చివరగా ఈవీ పెరియార్ రామస్వామి స్మారక స్థలాన్ని సందర్శించారు. -
సిటీ బస్సులో సీఎం.. ఆశ్చర్యపోయిన ప్రయాణికులు
సాక్షి ప్రతినిధి, చెన్నై : వినూత్న రీతిలో ప్రజలకు చేరువయ్యేందుకు యత్నిస్తున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం మరో కొత్త పంథాను అనుసరించారు. చెన్నై సిటీ బస్సులో నిలబడి ప్రయాణికులతో కలిసి కొద్దిసేపు పర్యటించారు. సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని గడిచిన ఎన్నికల మేనిఫెస్టోలో స్టాలిన్ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే అమలు చేశారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పడి శనివారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా తన ఇంటి నుంచి తండ్రి కరుణానిధి నివసించిన గోపాలపురంలోని ఇంటికి చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు మేళతాళాలతో స్టాలిన్‌కు స్వాగతం పలికారు. ఇంటిలోని కరుణానిధి చిత్రపటం వద్ద నివాళులరి్పంచారు. తల్లి దయాళుఅమ్మాళ్కు నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతూ స్టెల్లా మెరీస్ కాలేజీ వద్ద కారును నిలపమని చెప్పి అనుసరిస్తున్న మంత్రులను వెంట రావద్దని ఆదేశించారు. అక్కడికి సమీపంలోని బస్‌స్టాండ్ వద్దకు వెళ్లి పెరంబూరు–బిసెంట్‌నగర్ మధ్య ప్రయాణించే 29సి మహిళల ప్రత్యేక బస్సు ఎక్కారు. సిటీ బస్సులో అకస్మాత్తుగా సీఎం స్టాలిన్ ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాలకు లోనై లేచి నిలబడ్డారు. స్టాలిన్ వారిని కూర్చోమని చెప్పి సంభాషణ మొదలు పెట్టారు. తన జీవితంలో 29సి రూట్ బస్సును మరువలేనన్నారు. చిన్నతనంలో గోపాలపురం నుంచి 29సిలోనే స్కూలుకు వెళ్లానని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకం సౌకర్యంగా ఉందా..? అని ప్రశ్నించగా ప్రయాణికులంతో తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. తనకు రూ.9 వేలు జీతం, ఉచిత ప్రయాణం వల్ల నెలకు రూ.900 మిగులుతోందని ఓ ప్రయాణికురాలు బదులిచ్చారు. ఇలా మిగిలిన సొమ్మును ఏం చేస్తున్నారని స్టాలిన్ ప్రశ్నించగా పొదుపు చేస్తున్నట్లు బదులిచ్చారు. అలాగే బస్సులోని విద్యార్థినులను ‘డీఎంకే ఏడాది ప్రభుత్వం ఎలా ఉందని’ అడగ్గా, చాలా తృప్తిగా ఉందని బదులిచ్చారు. మిమ్మల్ని నేరుగా చూడటం ఆనందంగా ఉందని పేర్కొంటూ పలువురు ప్రయాణికురాళ్లు సెల్‌ఫోన్ ద్వారా సెలీ్ఫలు తీసుకున్నారు. సిటీ బస్సులు సమయానికి వస్తున్నాయా..?, ఉచిత టిక్కెట్లను సక్రమంగా ఇస్తున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. సుమారు 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన సీఎం ఆ తరువాత బస్సు దిగి వెనుకనే వస్తున్న కారులో ఎక్కి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్? -
నీట్‌పై రగడ.. మరోసారి హీటెక్కిన తమిళ రాజకీయం
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడులో నీట్(National Entrance-cum-Eligibility Test or NEET)పై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా తమిళనాడులో నీట్ పరీక్షకు బదులుగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సొంత ఎంట్రన్స్ నిర్వహించేందుకు వీలు కల్పించే బిల్లును ఎంకే స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును ఆమోదించాలని గురువారం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం కోసం బిల్లును కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపించారు. మరోవైపు.. ‘‘రాజ్యాంగ నిబంధనలకు లోబడి మాత్రమే నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్.. కేంద్ర హోంశాఖకు పంపారు. కానీ, రాష్ట్రపతి ఈ బిల్లును తిరస్కరిస్తారు’’ అని తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై అన్నారు. కాగా, నీట్ పరీక్షకు కొన్ని గంటల ముందు సేలంలోని తన ఇంట్లో 19 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం నీట్ వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టింది. ఇది కూడా చదవండి: రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంటే కళ్లు మూసుకోం.. తమిళనాడు గవర్నర్ తీరు, కేంద్రంపై ఆగ్రహం -
సీఎం స్టాలిన్ కుమారుడికి భారీ ఊరట
సాక్షి, చెన్నై: డీఎంకే యువజన విభాగం నేత, ఎమ్మెల్యే ఉదయ నిధి స్టాలిన్‌కు హైకోర్టులో మరోమారు ఊరట లభించింది. ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తి భారతీ దాసన్ బెంచ్ తోసి పుచ్చింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేపాక్కం – ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఉదయ నిధి స్టాలిన్ గెలిచారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వారసుడిగా, ఆ పార్టీ యువజన ప్రధాన కార్యదర్శిగా ఉదయ నిధి చక్రం తిప్పుతున్నారు. అయితే, ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ తొలుత దేశీయ మక్కల్ కట్చి నేత ఎంఎల్ రవి కోర్టు తలుపులు తట్టారు. అయితే ఆరోపణలకు సంబంధించి.. ఎలాంటి ఆధారాలు సమర్పించక పోవడంతో ఆదిలోనే పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఆ నియోజకవర్గానికి చెందిన ఓటరు ప్రేమలత పిటిషన్ వేశారు. తన మీదున్న కేసుల వివరాల్ని నామినేషన్లో ఉదయ నిధి చూపించలేదని, నామినేషన్ పత్రాలలోనూ అనేక అనుమానాలు ఉన్నట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన గెలుపు రద్దుచేయాలని కోరారు. కాగా, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించవద్దు అని ఉదయ నిధి కోర్టులో మరో పిటిషన్ వేశారు. గురువారం న్యాయమూర్తి భారతీ దాసన్ బెంచ్‌లో ఈ పిటిషన్లు విచారణకు వచ్చింది. ఉదయ నిధి తరపున సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఇళంగో వాదనల్ని వినిపించారు. అయితే, పిటిషనర్ ప్రేమలత తన ఆరోపణలకు తగిన ఆధారాల్ని కోర్టులో సమర్పించలేదు. దీంతో ఉదయ నిధికి ఊరట కల్గిస్తూ, ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ విచారణార్హం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: భారత్‌లో కరోనా వైరస్.. ఇది కచ్చితంగా ఊరట ఇచ్చే విషయమే! -
తమిళంలో ఎంట్రీ ఇచ్చిన 'ఆహా'.. లాంచ్ చేసిన సీఎం
ఆహా 100 శాతం తమిళ్ ఎంటర్టైన్మెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తమిళ ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నేతృత్వంలో తెలుగులో ప్రారంభమైన ఓటీటీ ప్లాట్‌ఫామ్ విజయవంతమైన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తమిళంలో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభించారు. దీనిని తమిళంలోనూ నెంబర్‌వన్ స్థానంలో నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని అల్లు అరవింద్ పేర్కొన్నారు. 100 శాతం ఎంటర్టైన్మెంట్ సినిమాలు, వెబ్ సిరీస్, టాక్‌షోలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళం ప్రేక్షకులను అలరించే విధంగా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. దీనికి నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్‌ను అంబాసిడర్లుగా నిర్మించారు. కాగా ఈ వేడుకలో తమిళ సినిమా నాయకులుగా విశేష సేవలు అందించిన దర్శకుడు ఎస్.పి.ముత్తురామన్ భారతీరాజా దివంగత నిర్మాత ఎ.వి.మెయ్యప్పన్, ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్, సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్, గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం, నటి శ్రీదేవి సేవలను గుర్తుచేసుకుంటూ.. గౌరవించే విధంగా కలైంజ్ఞర్ పెరుమై అనే అవార్డులను ప్రదానం చేశారు. -
ఢిల్లీ వెళ్లింది పాదాభివందనం చేయడానికి కాదు..
సాక్షి, చెన్నై: ‘‘తమిళనాడు హక్కుల్ని సాధించుకోవడం కోసమే ఢిల్లీ వెళ్లాను గానీ.. ఎవరో ఒకరి కాళ్ల మీద పడి పాదాభివందనాలు చేయడం కోసం మాత్రం కాదు’’.. అని సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తన ఢిల్లీ, దుబాయ్ పర్యటనలకు దురుద్దేశా లను ఆపాదిస్తూ ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి చేసిన విమర్శలను తిప్పి కొట్టారు. ఆదివారం తిరువానీ్మయూరులో తమిళనాడు రైతులు, రైతు కూలీల పార్టీ నేత, భవన నిర్మాణ కారి్మక సంక్షేమ బోర్డు చైర్మన్ పొన్ కుమార్, మైదిలీ దంపతుల కుమారుడు వినోద్‌కుమార్, వేళచ్చేరికి చెందిన ఢిల్లీ, సుమతి దంపతుల కుమార్తె రేవతికి సీఎం స్టాలిన్ సమక్షంలో ఆదర్శ వివాహం జరిగింది. ఈ సందర్భంగా వధువరుల్ని ఆశీర్వదిస్తూ సీఎం స్టాలిన్ ప్రసంగించారు. నిరంతరం శ్రమిస్తూనే ఉంటా.. తమిళనాడులో ఆదర్శ వివాహాలు పెరుగుతుండటం అభినందనీయమని కొనియాడారు. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక, నగర ఎన్నికల్లో గెలుపుతో డీఎంకే కూటమిపై ప్రజలత్లోనమ్మకం పెరిగిందన్నారు. తన వద్ద ప్రజలు ఉంచే ప్రతి కోరికను ఆచరణలో పెడుతానని స్పష్టం చేశారు. కలైంజర్ కరుణానిధి మార్గంలో పయనం సాగిస్తానని, ఆయన కలల్ని సాకారం చేస్తానని తెలిపారు. తన దుబాయ్, ఢిల్లీ పర్యటన గురించి విమర్శలు చేసే వాళ్లకు ఒక్కటే చెబుతున్నానని, ఢిల్లీకి పాదాభివందనాలు చేయడానికి మాత్రం తాను వెళ్ల లేదన్నారు. తమిళనాడు హక్కుల్ని పరిరక్షించడం, సాధించుకోవడం కోసం మాత్రమే వెళ్లానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా మంత్రులందరూ తన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టడాన్ని చూసి ఓర్వలేక ఈ విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏదో సమస్యల వలయంలో చిక్కుకున్నట్టు, అందులో నుంచి బయట పడేందుకు ఢిల్లీకి పరుగులు తీసినట్టుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను సాధారణ స్టాలిన్ కాదు అని, ముత్తు వేల్ కరుణానిధి స్టాలిన్ అని, రాష్ట్రం కోసం, హక్కుల కోసం ఎంత వరకైనా పోరాడేందుకు రెడీ అంటూ ముగించారు. కేరళ మంత్రి భేటీ డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో సీఎం స్టాలిన్‌తో కేరళ రాష్ట్ర ఆదిద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కె. రాధాకృష్ణన్, తమిళనాడు సీపీఎం కార్యదర్శి బాలకృష్ణన్‌లు కలిశారు. ఈనెల ఆరో తేది నుంచి కేరళరాష్ట్రం కన్నూరు వేదికగా జరగనున్న సీపీఎం అఖిల భారత మహానాడుకు హాజరు కావాలని స్టాలిన్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా, ఆదివారం రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి పుట్టిన రోజు కావడంతో ఆయనకు ట్విట్టర్ ద్వారా సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
వర్గాల పేరుతో రెచ్చగొట్టే శక్తులను తరిమికొట్టాలి..
సాక్షి, చెన్నై: కులం, మతం అంటూ చిచ్చు పెట్టడం, ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా చొరబడే శక్తుల్ని తరిమి కొట్టాలని దుబాయ్‌లోని తమిళులకు సీఎం ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం రూ. 2,600 కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు ప్రకటించారు. సీఎం ఎంకే స్టాలిన్ దుబాయ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పెట్టుబడిదారుల్ని ఆకర్షించి తమిళనాడులోకి పెద్దఎత్తున పెట్టుబడుల్ని ఆహ్వానించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇక శనివారం రాత్రి దుబాయ్‌లోని తమిళులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమైనట్లు ఆదివారం ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. పెద్దఎత్తున తమిళులతో కలిసి సాగి న ఈ సమావేశం గురించి స్టాలిన్ ట్వీట్ కూడా చేశా రు. దుబాయ్‌లోని తమిళులు ఏకమైన ‘నమ్మిల్ ఒరువర్...నమ్మ మొదల్వర్’( మనలో ఒక్కడు మన సీఎం ) నినాదంతో జరిగిన ఈ సభ తనను ఆనంద సాగరంలో ముంచిందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో ఉన్నామా..? దుబాయ్‌లో ఉన్నామా..? అన్నది తెలియని పరిస్థితి అని, ఈ మేరకు వేలాదిగా ఇక్కడ తమిళులు సభకు తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. సముద్రాలు దాటి వచ్చి, ఇక్కడ జీవిస్తున్న ప్రతి తమిళుడు ఐక్యతతో ముందుకు సాగాలని, ఇదే అందరికీ బలం అని సూచించారు. అయితే, కులం, మతం అంటూ రాజకీయం చేసే విచ్ఛిన్నకర శక్తుల్ని అనుమతించ వద్దని, తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రూ. 2600 కోట్ల పెట్టుబడులు.. తమిళనాడు పెట్టుబడులకు నెలవు అని, ఈ మేరకు పారిశ్రామికవేత్తలు తరలి రావాలని సీఎం స్టాలిన్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రూ. 2,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక పలు సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలతో సీఎం ఆదివారం భేటీ అయ్యారు. 2030 నాటికి తమిళనాడును అన్ని రంగాల్లో ముందు ఉంచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా ఉద్యోగ, ఉపాధి కల్పనల మెరుగు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు విస్తృతం చేశా మని వివరించారు. ఈ సందర్భంగా రూ. 2,600 కోట్ల పెట్టుబడులకు తగ్గ ఒప్పందాలు జరిగాయని వెల్లడించారు. తద్వారా 4,500 మందికి ఉద్యోగ అవ కాశాలు దక్కనున్నట్లు పేర్కొన్నారు. ఇక, దుబాయ్ పర్యటన ముగించుకుని సాయంత్రం అబుదాబికి స్టాలిన్ బయలు దేరివెళ్లారు. సోమవారం సీఎంకు అబుదాబీలో అభినందన సభ నిర్వహించనున్నారు. కుటుంబ పర్యటన.. సీఎం స్టాలిన్ అధికారిక పర్యటనగా కాకుండా ఫ్యామిలీ టూర్‌గా వెళ్లినట్టుందని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్ పళనిస్వామి విమర్శించారు. అధికారిక పర్యటనగా పైకి చెప్పుకున్నా, ప్రజాధనంతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకుని సీఎం కుటుంబం అంతా దుబాయ్‌కు వెళ్లినట్లుందని ఆరోపించారు. ప్రజలకు ఈ పర్యటనతో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేవలం సీఎం కుటుంబానికి లాభం చేకూర్చే పరిశ్రమల ఏర్పాటుకే ఈ పర్యటన సాగినట్లుందని ధ్వజమెత్తారు. -
బాధితులను ఆదుకో..రివార్డు పొందు! స్టాలిన్ కొత్త స్కీం
సాక్షి చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఆ పథకంలో భాగంగా స్టాలిన్ సోమవారం రాష్ట్రంలో రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సదుపాయాలను అందించడంలో సహాయపడే వ్యక్తులకు నగదు రివార్డులు, ధృవపత్రాలను ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న వారికి గోల్డెన్ అవర్ వ్యవధిలో వైద్య సాయం అందిలే ఆసుపత్రులకు తరలించి సాయం చేసిన వ్యక్తులు ప్రశంసా పత్రం తోపాటు రూ.5 వేల నగదు పారితోషకం ఇస్తాం అని స్టాలిన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గాయపడిన వారికి మొదటి 48 గంటల్లో ఉచిత వైద్యం అందించే 'ఇన్నుయిర్ కాప్పోన్' పథకాన్ని ముఖ్యమంత్రి గతంలోనే ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 609 ఆసుపత్రులు, 408 ప్రైవేట్ ఆసుపత్రులు, 201 ప్రభుత్వ ఆసుపత్రులు గోల్డెన్ అవర్‌లో వైద్యం అందించి ప్రాణాలను రక్షించడానికి నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఇన్నుయిర్ కాప్పోన్ పథకం బాధితునికి గరిష్టంగా సుమారు లక్ష రూపాయల వరకు దాదాపు 81 గుర్తింపు పొందిన ప్రభుత్వాసుపత్రులలో వైద్య భీమాను పొందగలుగుతారు. అయితే మొదటి 48 గంటల్లో తమిళనాడు ప్రమాద బాధితులు లేదా తమిళనాడులో ప్రమాదం బారిన పడిని ఇతర రాష్రల వారికి ఉచిత వైద్యం అందించబడుతుంది. ముఖ్యమంత్రి సమగ్ర భీమా పథకం లబ్ధిదారులు అదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగించడానికి అనుమతిస్తారు. అయితే ఈ పథకం లేదా ఏదైనా భీమా పథకం పరిధిలోనికి రానివారు అతడు లేదా ఆమె ప్రమాదం నుంచి కోలుకునేంత వరకు మాత్రమే ఉచిత వైద్యం అందిస్తారు. (చదవండి: ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన హీరో విశాల్ జట్టు) -
మాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ మెరుపు దాడులు.. భారీగా నగదు సీజ్
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఆస్తులపై ఏసీబీ మరోసారి పంజా విసిరింది. ఆదాయానికి మించి రూ.58.23 కోట్లు కూడబెట్టిన ఆరోపణలపై వేలుమణికి చెందిన 58 చోట్ల అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం దాడులు చేపట్టారు. కేరళతోపాటూ తమిళనాడులోని ఆరు జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గత పదేళ్ల అన్నాడీఎంకే ప్రభుత్వంలో నగరాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేసిన వేలుమణి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది ఆగష్టు 10వ తేదీన ఈయన ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 60 చోట్ల జరిపిన తనిఖీల్లో రూ.2 కోట్ల విలువైన ఆస్తిపత్రాలు, రూ.13లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత గత ఏడాది సెప్టెంబరు 29వ తేదీ పుదుకోటై జిల్లాలోని అనుచరుని ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు జరిపి కేసులు పెట్టారు. మళ్లీ మెరుపు దాడులు.. కోయంబత్తూరు ఏసీబీ ఇన్స్పెక్టర్ ఎళిలరసి ఫిర్యాదుతో వేలుమణి, అతని బంధువులు, స్నేహితులకు చెందిన చెన్నై, కోయంబత్తూరు, సేలం, కృష్ణగిరి, తిరుపత్తూరు, నామక్కల్ జిల్లాల్లోని ఇళ్లు, కార్యాలయాలు, సంస్థలు, బినామీ ఇళ్లలో మంగళవారం ఉదయం దాడులు చేశారు. సుమారు 200 మంది ఏసీబీ అధికారులు ఏకకాలంలో మెరుపుదాడులకు దిగారు. వేలుమణి సొంతూరు కోయంబత్తూరు జిల్లాలోనే 41 చోట్ల తనిఖీలు సాగాయి. అలాగే చెన్నైలో 8, సేలం 4, నామక్కల్, కృష్ణగిరి, తిరుపత్తూరు, తిరుప్పూరు జిల్లాల్లో ఒక్కోచోట దాడులు జరిపారు. కేరళ రాష్ట్రంలోని వేలుమణి బంధువు ఇంటిలో కూడా తనిఖీలు చేశారు. అదనపు డీఎస్పీ అనిత భర్తతో మాజీ మంత్రికి వ్యాపార లావాదేవీలు ఉండడంతో కోయంబత్తూరులోని వారి ఇంట్లో సైతం తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలో వేలుమణి కోయంబత్తూరులోని సుగుణాపురంలో తన ఇంటిలో ఉన్నారు. ఈ దాడుల్లో రూ.58.23 కోట్ల ఆస్తులను గుర్తించి వేలుమణి సహా 10 మందిపై కేసులు పెట్టారు. 2016–21 మధ్యకాలంలో రూ.1.25 కోట్లు ఖర్చుచేసి మంత్రి హోదాలో పలు దేశాలకు వెళ్లివచ్చారు. దీంతో విదేశాల్లో సైతం విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రాజకీయ కక్షపూరిత చర్య– అన్నాడీఎంకే రాజకీయంగా కక్ష సాధించేందుకే ప్రభుత్వం ఏసీబీ చేత దాడులు చేయిస్తోందని అన్నాడీఎంకే కన్వీనర్ ఓ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి ఒక ప్రకటనలో ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే దురాగతాలను వేలుమణి ధైర్యంగా అడ్డుకున్నందన ప్రభుత్వం ఆయనపై కక్ష బూనిందని విమర్శించారు. ఇలాంటి చర్యలకు భయపడమన్నారు. -
ఉక్రెయిన్‌లో వైద్య విద్యార్థి మృతి. వారినైనా కాపాడాలని తండ్రి ఆవేదన ఇదే..
శివాజీనగర(తమిళనాడు): తనయుడు డాక్టర్ అయి తిరిగి వస్తాడని అనుకుంటే విగతజీవిగా మారడంతో కుటుంబం తల్లిడిల్లిపోతోంది. కడసారి చూడాలని తపిస్తోంది. ఉక్రెయిన్‌లో క్షిపణి దాడిలో మరణించిన హావేరి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ గ్యానగౌడర్ (22) కుటుంబానికి వెల్లువలా పరామర్శించారు. బుధవారం రాణి బెన్నూరు తాలూకా చళగేరి గ్రామంలో ఉన్న నవీన్ ఇంట్లో విషాద మౌనం ఆవరించింది. కుమారుడిని కోల్పోయి దిక్కు తోచక తండ్రి శేఖరగౌడ కూర్చొన్నారు. బంధుమిత్రులు పెద్దసంఖ్యలో ఇంటికి చేరుకొన్నారు. ఇంటి ముందు నవీన్ ఫోటోను ఏర్పాటు చేయగా ప్రజలు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. ఇతర విద్యార్థులనైనా కాపాడండి: తండ్రి.. తండ్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ, ప్రముఖులు తనతో మాట్లాడారని, తన కొడుకు ప్రాణాలతో రాలేదు, కనీసం ఇతర విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని తాను మోదీని వేడుకొన్నట్లు చెప్పారు. మరణానికి ముందు తన కుమారుడు ఫోన్లో మాట్లాడేవాడని బంకర్లో ఉండడం కష్టం, బయటికి వచ్చినా కష్టమని చెప్పాడని, యుద్ధం జరగదని, ధైర్యంగా ఉండాలని కాలేజీవారు భరోసా ఇచ్చారన్నారు. ఇక్కడి రాజకీయం, రిజర్వేషన్, విద్యా విధానాలు సరిగా లేక తమ కుమారుడు ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి వచ్చిందని విలపించారు. భోజనాలకు తన వద్ద డబ్బు లేదు. డబ్బు వేయాలని కోరాడు, అదే ఆఖరి మాటైందని స్నేహితుడు శ్రీకాంత్ ఓ టీవీ చానల్‌కు తెలిపారు. భౌతికకాయం తరలింపునకు చర్యలు: సీఎం.. ప్రస్తుతం ఖార్కివ్ నగరంలో నవీన్ మృతదేహం ఉండగా, అక్కడ నుండి విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవీన్ కుటుంబానికి పరిహారం అందిస్తామని సీఎం బొమ్మై చెప్పారు. భౌతికకాయాన్ని తీసుకురావడం ప్రథమ కర్తవ్యమని అన్నారు. కాగా మిగిలిన కన్నడిగులను వేగంగా వెనక్కి రప్పిస్తామని చెప్పారు. నా సోదరుడు రావడం లేదు.. సమాజానికి ఏదో ఒకటి చేయాలని తన తమ్ముడు కలలు కన్నాడని, అతని వెంట వెళ్లినవారంతా వెనుతిరిగి ప్రాణాలతో వస్తున్నారు. అయితే తన తమ్ముడు రావడం లేదని మృతుడు నవీన్ సోదరుడు హర్ష రోదించారు. పేదల కలలపై నీట్ పిడుగు: కుమార పేద, మధ్యతరగతి వర్గాల మెడిసిన్ కలను నీట్ భగ్నం చేస్తోందని, ఇదే విద్యార్థుల, తల్లిదండ్రుల పాలిట మరణశాసనమైనదని మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి ధ్వజమెత్తారు. ఉన్నత విద్యను సంపన్నులకు రిజర్వు చేసి పేదలకు వట్టి చేయి చూపుతున్నారని నవీన్ మరణాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై మండిపడ్డారు. కూతురు ఎలా ఉందో శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని సాగరకు చె ందిన ఎంబీబీఎస్ విద్యార్థిని మనీషా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయింది. సాగర పట్టణం అణలెకొప్పలో ఉంటున్న జాన్ లోబో, త్రిజా లోబో దంపతుల కుమార్తె మనీషా కీవ్ నగరంలో ఎంబీబీఎస్ చదువుతోంది. అక్కడ బంకర్లో తలదాచుకున్నట్లు మనీషా తల్లిదండ్రులకు ఫోన్లో తెలిపింది. తమ కూతురు ఎలా ఉందోనని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కొడగు విద్యార్థిని తిరిగి రాక.. దొడ్డబళ్లాపురం: ఉక్రెయిన్‌లో కొడగుకు చెందిన 16 మంది విద్యార్థులు చిక్కుకుపోగా గోణికొప్పలు గ్రామానికి చెందిన మదీనా (21) అనే విద్యారి్థని బుధవారం ఇంటికి చేరుకుంది. దీంతో తల్లిదండ్రుల సంతోషం అవధులు దాటింది. అలాగే 19 మంది బెళగావి జిల్లాకు చెందిన విద్యార్థుల్లో ఇద్దరు స్వదేశానికి తిరిగి వచ్చారు. మొత్తంగా కర్ణాటక విద్యార్థుల్లో 9 మంది బుధవారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీలో దిగిన విద్యార్థులు సాయంత్రం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఫిబ్రవరి 27 నుంచి ఇప్పటివరకూ 64 మంది కర్ణాటకవాసులు తిరిగి వచ్చారు. ఉక్రెయిన్‌లో మొత్తం 693మంది కన్నడిగ విద్యార్థులు చిక్కుకున్నారని సమాచారం. -
ఆ రోజు పుట్టే శిశువులకు బంగారు ఉంగరం: డీఎంకే నేత
తిరుత్తణి: ముఖ్యమంత్రి స్టాలిన్ జన్మదినమైన మార్చి1వ తేదీన తిరువళ్లూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువులకు బంగారు ఉంగరాన్ని కానుకగా అందజేయనున్నట్లు డీఎంకే జిల్లా కన్వీనర్ భూపతి తెలిపారు. తిరుత్తణిలో ఆదివారం డీఎంకే జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో కన్వీనర్ భూపతి, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి జన్మదినం రోజున భారీగా వేడుకలు నిర్వహించి పేదలకు సహాయకాలు పంపిణీ చేయాలని సూచించారు. మరో ఘటనలో.. కయోజెనిక్ ఇంజిన్ ప్రయోగం విజయవంతం సాక్షి, చెన్నై : తిరునల్వేలి జిల్లా మహేంద్ర గిరి ఇస్రో కేంద్రంలో ఆదివారం క్రయోజెనిక్ ఇంజిన్ ప్రయో గం విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్టుకు ఇస్త్రో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రూ. 10 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 2023లో అమలు చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఉపయోగించే క్రయోజెనియ్ ఇంజిన్‌ను మహేంద్రగిరిలోని ఇస్రో కేంద్రంలో రూపొందించి పరీక్షిస్తున్నారు. సీఈ –20 పేరిట సిద్ధం చేసిన ఈ ఇంజిన్‌ను ఇప్పటికే మూడు విడతలుగా పరీక్షించినట్లు వెల్లడించారు. తాజాగా నాలుగో విడతలో 100 సెకన్ల పాటూ ఈ ఇంజిన్ పనితీరును పరిశీలించారు. -
ఎన్నికల్లో స్టాలిన్ పార్టీ భారీ విజయం.. సంబురాల్లో కార్యకర్తలు
సాక్షి, చెన్నై: తమిళనాడు స్థానిక ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో డీఎంకే కూటమి 19 కార్పొరేషన్లలో ఆధిక్యంలో ఉంది. మొత్తం 21 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగగా ప్రతిపక్ష అన్నాడీఎంకే కేవలం ఒక్క కార్పొరేషన్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు 138 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కూడా డీఎంకే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ 109 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా అన్నాడీఎంకే కేవలం 9 స్థానాల్లో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా 439 పట్టణ పంచాయతీలకు గాను డీఎంకే 268 స్థానాల్లో ఆధిక్యంతో ఉంది. అన్నాడీఎంకే 22 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ ఘన విజయాన్ని అందుకోనున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యక్తరలు సంబురాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని డీఎంకే పార్టీ కార్యాలయాల వద్ద బాణా సంచా కాల్చి వేడుకలు జరుపుకుంటున్నారు. -
ప్రధానికి సీఎం స్టాలిన్ లేఖ
సాక్షి ప్రతినిధి,చెన్నై: శ్రీలంక ప్రభుత్వ చెరలో ఉన్న తమిళనాడు జాలర్ల విడుదలపై జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ ద్వారా బుధవారం విజ్ఞప్తి చేశారు. శ్రీలంక సముద్రతీర రక్షణ దళాలు 29 మంది జాలర్లను, వారికి చెందిన 79 మరపడవలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నాయని అందులో పేర్కొన్నారు. ఈనెల 7వ తేదీన మూడు మరపడవల్లో చేపలవేటకు వెళ్లిన 11 మంది తమిళ జాలర్లను అరెస్ట్ చేసి శ్రీలంకలోని మయిలాట్టి కోస్ట్‌గార్డ్ ప్రదేశానికి తరలించారని, గత కొన్ని వారాలుగా శ్రీలంక కోస్ట్‌గార్డు అధికారాలు భారత్‌కు చెందిన అమాయక మత్స్యకారులపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఇటీవలకాలంలో మూడుసార్లు జాలర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. శ్రీలంక అధికారులు అసంబద్ధ వైఖరి వల్ల జాలర్ల జీవనాధారం దెబ్బతినడమే కాదు, వారి ప్రాణాలకు, హక్కులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం ద్వారా చర్చలు జరిపి మత్స్యకారుల విముక్తికి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఇదిలా ఉండగా, జాలర్ల అరెస్ట్‌కు నిరసనగా రామేశ్వరంలో మాత్రమే కొసాగుతున్న మత్స్యకారుల సమ్మె మరింత విస్తృతం కానుంది. రామనాథపురం జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి ఆందోళనకు దిగనున్నట్లు మత్యకార సంఘాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే తమ కు ఈపరిస్థితి ఏర్పడిందని ఆరోపించాయి. -
వీడిన ఉత్కంఠ.. జల్లికట్టుపై సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం
సాక్షి, చెన్నై: తమిళనాడు సాంప్రదాయ ఆట జల్లికట్టు నిర్వహణపై ఉత్కంఠ వీడింది. జల్లికట్టుపై సీఎం స్టాలిన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టుకు ఈ ఏడాది కూడా అనుమతిస్టున్నట్టు ఆయన ప్రకటించారు. దాంతోపాటు జల్లికట్టు కార్యక్రమ నిర్వహణపై తమిళనాడు ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. పోటీల్లో పాల్గొనేందుకు కేవలం 300 మందికి మాత్రమే అనుమతించింది. అలాగే పోటీలను తిలకించేందుకు 150 మంది ప్రేక్షకులు లేదా 50 శాతం సిట్టింగ్ సామర్థ్యానికి (ఏది తక్కువ అయితే అది) అనుమతి ఇచ్చింది. పోటీదారులు, ప్రేక్షకులు రెండుడోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని, పోటీల ప్రారంభానికి 48 గంటల ముందు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. చదవండి: తమిళనాడులో భర్త ఇంటి ముందు యువతి ధర్నా అయితే రాష్ట్రంలో కోవిడ్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో జల్లికట్టు కార్యక్రమాన్ని టీవీలలో చూడాలని, పెద్దఎత్తున గుమిగూడకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కాగా మధురై జిల్లాలో ఈనెల 14 నుంచి జల్లికట్టు పోటీలు ప్రారంభంకానున్నాయి. కనుమ పండుగ రోజున జల్లికట్టును అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. మదురైకి దగ్గర్లో ఉన్న అలంగనల్లూరు దగ్గర నిర్వహించే ఈ పోటీలను చూడడానికి భారీ సంఖ్యలో జనం హాజరవుతారు. చదవండి: అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం! -
నీట్ రద్దుకు.. ఎందాకైనా!
వైద్య విద్య కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష రద్దు కోసం ఇక చట్టపరంగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ వ్యవహారంలో అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలని, తమిళ విద్యార్థుల భవిష్యత్ కోసం ఎంత వరకైనా వెళ్తామని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. సాక్షి, చెన్నై(తమిళనాడు): నీట్ రద్దు కోసం డీఎంకే ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇక ఈ పరీక్షకు వ్యతిరేకంగా గత ఏడాది అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గవర్నర్.. రాష్ట్రపతికి పంపించకుండా తుంగలో తొక్కడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశానికి అసెంబ్లీ వేదికగా రెండు రోజుల క్రితం సీఎం ఎంకే స్టాలిన్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో నామక్కల్ కవింజర్ మాళిగైలో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. గవర్నర్ తీరుపై.. అసెంబ్లీ తీర్మానాన్ని తుంగలో తొక్కిన గవర్నర్ తీరును తీవ్రంగా పరిగణిస్తూ నీట్‌కు వ్యతిరేకంగా ఇక, చట్టపరమైన చర్యలకు ఈ సమావేశంలో తీర్మానించారు. సీఎం స్టాలిన్ సమావేశంలో మాట్లాడుతూ.. తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించకుండా గవర్నర్ వ్యవహరించడం అసెంబ్లీ హక్కుల్ని కాలరాసినట్టు కాదా..? అని ప్రశ్నించారు. వృథా అవుతున్న.. విద్యార్థుల శ్రమ ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆరోగ్యమంత్రి ఎం. సుబ్రమణియన్ మీడియాకు వివరించారు. నీట్ శిక్షణ కేవలం సంపన్నులకే పరిమితం అవుతోందన్నారు. 12 ఏళ్లు రేయింబవళ్లు విద్యార్థులు పడ్డ శ్రమ, నేర్చుకున్న పాఠాలు నీట్ కారణంగా వృథా అవుతున్నాయని ధ్వజమెత్తారు. ఇది వరకు నీట్ విషయంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసినప్పుడు తమ రాష్ట్రంలో(ఒడిశ్శా) కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, అయితే, తానేమీ చేయలేని పరిస్థితిగా పేర్కొన్నట్టు గుర్తు చేశారు. ఇదే విషయాన్ని నీట్‌కు అనుకూలంగా స్పందించిన బిజేపి ప్రతినిధి దృష్టి ఈ సమావేశంలో తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. అనుమతి రాగానే, రాష్ట్రంలోని ఎంపీలు, శాసన సభా పక్షపార్టీల ప్రతినిధులు అందరూ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి ఒత్తిడి తీసుకు రానున్నట్లు వెల్లడించారు. 13 పార్టీల ప్రతినిధుల హాజరు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీనియర్ మంత్రులు దురై మురుగన్, పొన్ముడి, కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత సెల్వ పెరుంతొగై, అన్నాడీఎంకే తరపున మాజీ మంత్రి, ఎమ్మెల్యే విజయ భాస్కర్, పీఎంకే తరపున ఆపార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీకే మణి, బీజేపీ తరపున ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్, మనిద నేయ మక్కల్ కట్చి తరపున ఎమ్మెల్యే జవహరుల్లా, తమిళర్ వాల్వురిమై కట్చి తరపున ఎమ్మెల్యే వేల్ మురుగన్‌తో పాటుగా ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ తదితర 13 పార్టీల శాసన సభ ప్రతినిధులు హాజరయ్యారు. గంట పాటుగా సాగి న ఈ సమావేశంలో నీట్ గురించి అన్ని పార్టీల అభిప్రాయాల్ని సీఎం స్టాలిన్ స్వీకరించారు. అయితే, బీజేపీ తరపున మాత్రం నీట్‌కు అనుకూలంగా కేంద్రం చర్యలను సమర్థించడం గమనార్హం. అలాగే, సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఇక, మిగిలిన 12 పార్టీల ప్రతినిధులు నీట్ వద్దే వద్దు అని, అడ్డుకుని తీరుదామని, కేంద్రం చర్యలకు ముగింపు పలుకుదామని స్పష్టం చేశాయి. చదవండి: నవ దంపతులపై హత్యాయత్నం -
ఉద్యోగులకు ‘కొత్త’ కానుక
సాక్షి, చెన్నై: ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. డీఏను 14 శాతం మేరకు పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత ప్రభుత్వ హయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు జాక్టో జియో వేదికగా సాగించిన ఉద్యమాలు, సమ్మెల గురించి తెలిసిందే. డీఎంకే సర్కారు అధికా రంలోకి వచ్చిన అనంతరం తమ సమస్యలపై దృష్టి పెట్టాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞపి చేశాయి. ఇందుకు తగ్గట్టుగా అసెంబ్లీలో ఉద్యోగులకు అనుకూలంగా సీఎం స్టాలిన్ ప్రకటన చేశారు. ఈ మేరకు మంగళవారం కొత్త సంవత్సరం కానుకగా డీఏను 14 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 17 శాతంగా ఉన్న డీఏను 31 శాతంగా పెంచారు. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ పెంపును వర్తింప చేశారు. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8,724 కోట్ల అదనపు భారం పడిందన్నారు. అలాగే సీ, డీ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా రూ. 3,000 ప్రకటించారు. పెన్షనర్లకు రూ. 500 ఇవ్వనున్నారు. ఇక, ప్రత్యేక కేటగిరిలో పనిచేస్తున్న గ్రామ అధికారులకు రూ. 1000 రూ, పదవీ విరమణ పొందిన వారికి రూ. 300 ఇవ్వనున్నారు. ఈ కానుకతో రూ. 169 కోట్ల వరకు భారం పడినట్లు అధికారులు వెల్లడించారు. -
Elon Musk: పరాగ్‌పై వివాదాస్పద ట్వీట్.. రచ్చ
ట్విటర్ సీఈవోగా ఒక భారతీయుడు ఎంపిక కావడంపై మన దేశంలోనే కాదు.. మేధావి వర్గం నుంచీ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఉన్నపళంగా జాక్ డోర్సే తప్పుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో స్వతహాగా ఇలాంటి అంశాల్లో తల దూర్చే ఎలన్ మస్క్.. ఓ ట్వీట్ చేసి కాక రేపాడు. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తాజాగా ఓ ఫొటో ట్వీట్ చేశాడు. అది ఒక హిస్టారికల్ అండ్ కాంట్రవర్షియల్ ఫొటో. పై ఫ్రేమ్‌లో యూఎస్ఎస్ఆర్ నియంత జోసెఫ్ స్టాలిన్, స్టాలిన్ అంతరంగికుడు నికోలాయ్ యెజోవ్.. పక్కపక్కనే ఉంటారు. కానీ, కింద ఫ్రేమ్‌లో స్టాలిన్ ఫొటో మాత్రమే ఉంటుంది. అందుకు కారణం ఉంది. తొలినాళ్లలో స్నేహితులుగా ఉన్న నికోలాయ్-స్టాలిన్ మధ్య.. రాజకీయ పరిణామాలతో వైరం మొదలవుతుంది. ఈ తరుణంలో స్టాలిన్ ఆదేశాల మేరకే నికోలాయ్ హత్య కూడా జరిగిందని చెప్తారు. ఈ కారణంతోనే వీళ్లిద్దరూ సరదాగా గడిపిన ఫొటో తర్వాతి రోజుల్లో రష్యాలో సెన్సార్‌షిప్‌కు గురైంది. అలా స్టాలిన్ పక్క నుంచి నికోలాయ్ యెజోవ్ ఫొటోను తొలగించారు. అయితే ఈ సీరియస్ అంశాన్ని.. తర్వాతి రోజుల్లో సరదా కోణంలో వాడేసుకుంటున్నారు కొందరు. ఇక మస్క్ దానిని మరీ మించి వాడేశాడు. స్టాలిన్ బాడీకి ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ అగర్వాల్ తలను, నికోలాయ్ బాడీకి ట్విటర్ మాజీ సీఈవో డోర్సే తలను అంటించాడు. పైగా రెండో టెంప్లేట్లో డోర్సే పక్కనే ఉన్న కాలువలోకి విసిరివేయబడ్డట్లు ఫన్నీ కోణంలో ఉంది. దీంతో నెటిజనులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మస్క్‌ను తిట్టిపోస్తున్నారు. అదే టైంలో మస్క్‌కు తగ్గట్లుగానే కౌంటర్ మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. pic.twitter.com/OL2hnKngTx — Elon Musk (@elonmusk) December 1, 2021 ఇదిలా ఉంటే ఎలన్ మస్క్‌కు, జాక్ డోర్సేకు మాంచి స్నేహం ఉంది. ఇద్దరూ క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేయడమే కాదు.. గంజాయి ప్రియులు కూడా అంటూ గతంలో బోలెడు కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు కిందటి ఏడాది జాక్ ట్విటర్ సీఈవో పదవికి గండం ఏర్పడినప్పుడు.. జాక్కి మద్దతుగా నిలిచాడు కూడా. Just want say that I support @Jack as Twitter CEO. He has a good ❤️. — Elon Musk (@elonmusk) March 3, 2020 pic.twitter.com/IYAQasGJg3 — Patel Meet (@mn_google) December 1, 2021 pic.twitter.com/tUqINMQl8s — evolve (@evolvedzn) December 1, 2021 pic.twitter.com/tUqINMQl8s — evolve (@evolvedzn) December 1, 2021 ఇదీ చదవండి: పరాగ్ ఎంపికపై ఎలన్ మస్క్ ఏమన్నాడంటే.. -
అభిమాని మనస్సు గెలుచుకున్న సీఎం..
చెన్నై: సాధారణంగా తమకు నచ్చిన అభిమాన నాయకులు, సెలబ్రిటీలతో ఫోటోలు దిగడం, కరచాలనం చేయడానికి అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. దీనికోసం ఎంతటి రిస్క్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. తమ ప్రియమైన నాయకుడితో సెల్ఫీదిగే ఏ అవకాశాన్ని వదులుకోరనే విషయం తెలిసిందే. ఒక్కోసారి అభిమానులు ప్రదర్శించే అత్యుత్సాహం వలన నాయకులు, సెలబ్రిటీలు ఇబ్బందిపడుతుంటారు. ఈ క్రమంలో వీరిపట్ల సెక్యురీటి సిబ్బంది కూడా దురుసుగా ప్రవర్తించిన ఘటనలు కొకొల్లలు. అయితే, దీనికి భిన్నంగా.. కొంత మంది నాయకులు తమ అభిమానుల చిన్నపాటి కోరికలను గమనించి తీర్చటానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా, ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో తమిళనాడు.. సీఎం స్టాలీన్ స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమానికి హజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలీన్ను కలవడానికి, ఆయనతో సెల్ఫీ దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. ఈక్రమంలో భద్రత సిబ్బంది అభిమానులందరిని ఒక క్రమపద్ధతిలో సీఎం వద్దకు పంపుతున్నారు. అప్పుడు ఒక ఎరుపు రంగు చొక్క ధరించిన ఒక వ్యక్తి సీఎం స్టాలీన్ను వద్దకు చేరుకున్నాడు. పాపం.. సీఎం తో కరచాలనం కూడా చేశాడు. ఆ తర్వాత.. తన జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీసి సీఎంతో సెల్ఫీ దిగటానికి ప్రయత్నించాడు. అప్పుడు వెనుక నుంచి భద్రత సిబ్బంది ముందుకు తోసేశారు. అభిమాని సెల్ఫీ ప్రయత్నాన్ని గమనించిన సీఎం స్టాలీన్.. అతడిని చేయిపట్టుకుని తనవైపులాగి సెల్ఫీ సరదా తీర్చారు. దీంతో అతను ఆనందంతో ఉబ్బితబ్బైపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘అభిమాని మనస్సు గెలుచుకున్నారు..’, ‘సీఎం .. అన్ని గమనిస్తూ ఉంటారు..’, ‘ మొత్తానికి యువకుడి సెల్ఫీ సరదా తీరింది’, అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ముంపు ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటన
-
రజనీకాంత్ కు సీఎం పరామర్శ ఆరోగ్యంపై ఆరా
-
మా స్కూల్ సమీపంలో మద్యం షాపును తీసేయండి!
చెన్నై: తమిళనాడులోని అరియలూరు జిల్లాలో తమ పాఠశాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని మూసివేసేయండి అంటూ ఇద్దరూ పాఠశాల విద్యార్థులైన అక్కాతమ్ముడు జిల్లా కలెక్టరుకు లేఖ పంపారు. పైగా ఈ విద్యార్థులిద్దరూ రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు విజ్ఞప్తి కూడా చేశారు. అయితే తొబుట్టువులైన ఈ విద్యార్థులు ఇరువురు ఇలంతేంద్రల్ ఆరవ తరగతి, అరివరసన్ నాల్గవ తరగతి చదువుతున్నారు. (చదవండి:అమేజింగ్ ఆర్ట్ .....ఒక చిత్రం ఎన్ని చిత్రాలుగా మారుతుందో!) ఈ క్రమంలో ఈ విద్యార్థులిద్దరూ నవంబర్‌లో స్కూళ్లు తెరవక మునుపే మా స్కూల సమీపంలోని మద్యం దుకాణాన్ని తీసువేయండి అంటూ లేఖలో అభ్యర్థించారు. ఈ మేరకు ఆ విద్యార్థులిద్దరూ మాట్లాడుతూ.....మద్యం సేవించే వాళ్లు ఆ షాపు దగ్గర కూర్చొని అసభ్య పదజాలంతో మాట్లాడుతుంటూరు. అంతేకాదు చాలామంది తల్లిదండ్రులు ఈ మద్యానికి బానిసై పిల్లలను పనికి పంపి వారిని అడుక్కునేలా చేస్తారు. అన్ని మద్యం షాపులు మూసివేస్తేనే ఈ సమస్య ఉండదు" అని అన్నారు. ఈ క్రమంలో ఆ మద్యం షాపు నిబంధనలకు అనుగుణంగా 100 కి.మీ దూరంలో ఉన్నప్పటికీ పిల్లల విజ్ఞప్తి మేరకు ఆ షాపుని తరలించాలని నిర్ణయించామని అరియలూర్ కలెక్టర్ పి రమణ సరస్వతి తెలిపారు. (చదవండి: మేమే నీతో పాటే అంటూ ....చనిపోయిన భర్త, పిల్లలు) -
సిటీ బస్సులో ప్రయాణించిన సీఎం స్టాలిన్
-
నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
-
పెట్రోలుపై రూ. 3 తగ్గింపు.. నష్టాన్ని భరిస్తామన్న ప్రభుత్వం!
చెన్నై: లీటరు ధర వంద రూపాయల మార్క్‌ను దాటేసి వాహనదారులను బెంబేలెత్తిస్తోంది పెట్రోలు. ఆగకుండా పెరుగుతున్న ధరతో ఫ్యూయల్ కోసం బంకు వెళ్లిన ప్రతీసారీ బడ్జెట్ లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. పెట్రోలు ధరలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట పద్దు తయారీ సందర్భంగా ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. లీటరుపై రూ. 3 తగ్గింపు పెట్రోలు ధరలను తగ్గిస్తూ తమిళనాడు సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లినా పర్వాలేదు.. సామాన్యులకు ఊరట కలిగించేందుకు సిద్దమైంది. లీటరు పెట్రోలుపై రూ.3 వంతున ధర తగ్గించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ ప్రకటించారు. సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. లీటరు పెట్రోలుపై రూ.3 ధర తగ్గించడం వల్ల తమిళనాడు రాష్ట్ర ఖజానాకు రూ. 1,160 కోట్ల నష్టం వస్తుందని, అయినా ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వ్యాట్‌లో కోత దేశవ్యాప్తంగా పెట్రోలు ధర లీటరుకు రూ.100 దాటేసింది. పెట్రోలో ధరలో 36 శాతం కేంద్ర ఎక్సైజ్ పన్నులు ఉండగా దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు వాల్యు యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)లను విధిస్తున్నాయి. ఇలా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల పోటుతో పెట్రోలు రేటు సెంచరీ మార్క్‌ని క్రాస్ చేసింది. దీంతో సామాన్యులకు పెట్రోలు ధరల నుంచి కొంత ఉపశమనం కలిగించేందుకు వ్యాట్‌ను తమిళనాడు ప్రభుత్వం తగ్గించింది. వంద దిగువకు ధరల తగ్గింపుకు ముందు చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 102.49గా ఉంది. మూడు రూపాయల తగ్గింపుతో పెట్రోలు ధర వందకు దిగువకు రానుంది. అయితే ధరల తగ్గింపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు. అలాగే డీజిల్ రేట్ల తగ్గింపు ఉంటుందా లేదా అనేదానిపై కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. -
సైకిల్ పై చక్కర్లు కొట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్
-
సీఎం స్టాలిన్‌తో నటుడు అర్జున్ భేటీ
ముఖ్యమంత్రి స్టాలిన్‌ను నటుడు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్టాలిన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు చెబుతున్న విషయం తెలిసిందే. అదేక్రమంలో కరోనా కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు అర్జున్ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు అర్జున్ పేర్కొన్నారు. అలాగే ఇక్కడ మరో విషయం కూడా ప్రచారంలో ఉంది. నటుడు అర్జున్ చెన్నై కెరుగంబాక్కంలోని తన తోటలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ ఆలయ కుంభాభిషేకం కార్యక్రమాన్ని గతంలో నిర్వహించతలపెట్టారు. అయితే కరోనా కారణంగా ఆ ఉత్సవం వాయిదా పడుతూ వచ్చింది. కాగా జులై 1, 2వ తేదీల్లో ఆంజనేయస్వామి దేవాలయ కుంభాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఉత్సవానికి ఆహ్వానించడానికే నటుడు అర్జున్ ఆయన్ని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే శ్రీఆంజనేయ ఆలయ కుంభాభి షేకానికి ప్రజలను భారీఎత్తున ఆహ్వానించాలని భావించినా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అది సాధ్యం కాదని, అయితే భక్తులకు ఆ కొరత లేకుండా కుంభాభిషేక కార్యక్రమాన్ని యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని నటుడు అర్జున్ వెల్లడించారు. చదవండి: తమిళనాడు నూతన డీజీపీగా శైలేంద్రబాబు -
డీఎంకే ఘన విజయం.. ‘కేబినెట్’ రేస్ మొదలు
సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. ముఖ్యంగా తిరువళ్లూరు జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసింది. అందులో సీనియర్లు ఎక్కువమంది గెలుపొందడంతో మంత్రి పదవులపై ఆశావహుల సంఖ్య అధికమైంది. త్వరలోనే కొలువుదీరనున్న స్టాలిన్ కేబినెట్లో బెర్త్ కోసం రేస్ మొదలైంది. సాక్షి, చెన్నై: జిల్లాలో విజయం సాధించిన నలుగురు సీనియర్ నేతలు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డీఎంకే పార్టీ ముఖ్యులు, స్టాలిన్ కుటుంబ సభ్యులను కలిసి అమాత్యులుగా అవకాశమివ్వాలని కోరుతున్న ప్రచారం జోరుగా సాగుతోంది. స్టాలిన్ కేబినెట్లో జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎవరికి పీఠం దక్కుతుందో అనే చర్చ సర్వత్రా సాగుతోంది. పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి డీఎంకేలో మోస్ట్ సీనీయర్. బలమైన దళిత నేత. రెండు సార్లు శ్రీపెరంబదూరు ఎంపీగా, పార్లమెంట్ విప్‌గా పని చేశారు. గత ఉప ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి 60 వేలు, ప్రస్తుతం 93వేల మెజారిటీతో గెలుపొందారు. స్టాలిన్ వద్ద కూడా కృష్ణస్వామికి మంచి పేరుంది. పార్టీ సీనియర్ టీఆర్ బాలుతో పాటు పలువురి ఆశీస్సులు ఉన్నాయి. ఈసారి ఆయనకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగుతోంది. అలాగే మైనారిటీ నేత నాసర్ కూడా మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. ఆయనకు విశ్వాసపాత్రుడిగా పేరుంది. స్టాలిన్‌ను తీవ్రంగా విమర్శించే మంత్రి పాండ్యరాజన్‌పై భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తిరువళ్లూరు నుంచి రెండోసారి విజయం సాధించిన వీజీ రాజేంద్రన్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆయనకు స్టాలిన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్, వీజీ రాజేంద్రన్ భార్య ఇందిర క్లాస్మేట్స్. స్టాలిన్ అల్లుడు శబరీశన్, సీనియర్లు దురైమురుగన్, ఎంపీ జగద్రక్షగన్ ఆశీస్సులు ఉన్నాయి. అలాగే వీజీ రాజేంద్రన్ అల్లుడు పాలిమర్ టీవీ అధినేత. వీరందరితోపాటు ఆంధ్రకు చెందిన పెద్ద నాయకుడి ద్వారా మంత్రి పదవికి సిఫారసు చేయించుకుంటున్నట్లు తెలిసింది. అలాగే మాధవరం ఎమ్మెల్యే సుదర్శనం పేరు కూడా ప్రచారంలో వుంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా కన్వీనర్‌గా పని చేసిన సుదర్శనానికి స్టాలిన్ కుటుంబ సభ్యులతో మంచి సంబందాలు వున్నాయి. ఈ క్రమంలో అదృష్టం ఎవరిని వరిస్తుందో శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే. చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర -
నెరవేరిన స్టాలిన్ కల
-
‘ఉదయనిధిని అనర్హుడిగా ప్రకటించండి’
చెన్నై: బీజేపీ దివంగత నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నాయకుడు, పార్టీ చీఫ్ స్టాలిన్ కుమారుడు ఉదయనిధిపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ కోరింది. ప్రధాని మోదీ ఒత్తిడి తట్టుకోలేక పోవడంతో సుష్మా, జైట్లీ చనిపోయారని ఎన్నికల సభలో ఉదయనిధి అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉదయనిధిని అనర్హుడిగా ప్రకటించాలని, డీఎంకే స్టార్ ప్రచార కర్తల జాబితా నుంచి ఆయన పేరును తొలగించాలంది. చెపాక్ – ట్రిప్లికేన్ స్థానం నుంచి ఉదయనిధి బరిలో ఉన్నారు. ‘ప్రధాని అవుతారనుకున్న అద్వానీని మోదీ పక్కనపెట్టారు. మోదీ టార్చర్ భరించలేక యశ్వంత్‌సిన్హా పార్టీ వీడారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక సుష్మ, జైట్లీ మరణించారు. సీనియర్ నేత వెంకయ్య నాయుడును మోదీ పక్కనపెట్టారు’ అని ఉదయనిధి అన్నారు. ఈ వ్యాఖ్యలపై సుష్మ కూతురు బాన్సురీ,జైట్లీ కూతురు సొనాలీ స్పందించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తమ తల్లి పేరును వాడుకోవద్దని బాన్సురీ సూచించారు. ‘మా అమ్మ అంటే మోదీకి అమిత గౌరవమ’ని పేర్కొన్నారు. అలాగే, ప్రధాని మోదీతో అరుణ్‌జైట్లీకి ప్రత్యేక అనుబంధం ఉండేదని సొనాలీ జైట్లీ పేర్కొన్నారు. చదవండి: స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సంచలన ఆరోపణలు -
‘ఐటీ దాడులా...ఎంకే స్టాలిన్ ఇక్కడ’!
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ముఖ్యంగా డీఎంకే నేతల ఇళ్లపై ఐటీ దాడులు ప్రకంపనలు రేపుతున్నాయి. ఆదాయపన్ను శాఖ సోదాలపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. తన కుమార్తె, అల్లుడు ఇంటిపై శుక్రవారం నాటి ఐటీ దాడులపై ఘాటుగా స్పందించారు. అలాగే తమిళనాడులోని కల్లకూరిచిలో డీఎంకె వ్యవస్థాపకుడు అన్నాదురై విగ్రహానికి నిప్పంటించిన ఘటననుకూడా స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. (ఎన్నికల వేళ, డీఎంకేకు ఐటీ వరుస షాక్స్) పెరంబలూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఐటీ దాడులు చేసిన తమ పార్టీకి భయపడేది లేదని తెగేసి చెప్పారు. అంతేకాదు తాము ఏఐఎడిఎంకె నాయకులు కాదని ప్రధాని మోదీ తెలుసుకోవాలన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏఐఎడిఎంకె ప్రభుత్వాన్ని మోదీ సర్కార్ కాపాడుతోంది. కానీ తాను కలైంగర్ (దివంగత డీఎంకె నేత ఎం కరుణానిధి) కొడుకుననే విషయాన్ని మర్చిపోవద్దని ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను మిసాను, ఎమర్జెన్సీని చూశాను..ఇలాంటి వాటికి భయపడను.. బీజేపీ తప్పుడు విధానాలకు ప్రజలు ఏప్రిల్ 6 న స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని స్టాలిన్ స్పష్టం చేశారు. అలాగే డీఎంకే వ్యవస్తాపకుడు అన్నాదురై విగ్రహాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఐటీ దాడులపై డీఎంకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాగా డీఎంకేనేతలు, సంబంధిత వ్యక్తుల నివాసాలపై వరుస ఐటీ దాడులు తమిళనాట కాక పుట్టించాయి. స్టాలిన్ అల్లుడు శబరీశన్ నివాసంలో ఆదాయ పన్ను శాఖ శుక్రవారం దాడులు చేపట్టింది. చెన్నై నగరానికి సమీపంలోని నీలాంగరాయ్‌లోని శబరీశన్ నివాసం, ఆయనకు చెందిన మరో నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో డీఎంకే నేత సెంథిల్ బాలాజీ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ దాడి నిర్వహించింది. -
అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళునాట ఐటి దాడుల కలకలం
-
ఎన్నికల వేళ, డీఎంకేకు ఐటీ వరుస షాక్స్
సాక్షి చెన్నై: తమిళనాడులోరానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే నాయకులపై వరుస ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అల్లుడి నివాసం ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. స్టాలిన్ అల్లుడి శబరీశన్‌కు చెందిన నాలుగు ప్రదేశాల్లో శుక్రవారనం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. నీలంగరైలో ఉన్న ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. స్టాలిన్ కూతురు సెంతమారై తన భర్త శబరీశన్‌తో పాటు అక్కడే నివసిస్తున్నారు. కాగా ఏప్రిల్ 6 న జరిగనున్న ఎన్నికలకు ముందు డీఎంకే నేతలు, పార్టీతో సంబంధం ఉన్న వారిపై జరిపిన దాడుల్లో ఇది రెండోసారి. ఇళ్లపై ఐటీ దాడులు జరగడం ఇది రెండవసారి.గత నెలలో డీఎంకే నేత ఈ వేలూ నివాసంతోపాటు 10 కి పైగా చోట్ల ఐటీశాఖ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలను బెదిరించేందుకు బీజేపీతో జతకలిసిన కూటమి పన్నిన పన్నాగమని, ఇది రాజకీయ కుట్ర అంటూ డీఎంకే నేతలు ఖండించారు. -
సీఎం ‘అక్రమ సంతానం’ వ్యాఖ్యలపై రాజా క్షమాపణ
చెన్నె: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో వ్యక్తిగత దూషణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ, డీఎంకే నాయకుడు ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పళనిస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్‌పై అక్రమ సంబంధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై రాజా మళ్లీ స్పందించారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరారు. తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం పడుతున్నట్లు రాజా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెపాక్‌లో ఇటీవల జరిగిన ప్రచార కార్యక్రమంలో రాజా మాట్లాడుతూ సీఎం పళని స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంబంధ జంటకు పళనిస్వామి జన్మించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రీమెచ్చుర్‌గా పళని పుట్టాడని, ఢిల్లీకి చెందిన డాక్టర్ నరేంద్ర మోదీ హెల్త్ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అన్నాడీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ వ్యాఖ్యలపై సీఎం పళని ఆదివారం స్పందించారు. తన తల్లిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై భావోద్వేగానికి గురయ్యారు. దేవుడు వారిని శిక్షిస్తారని ప్రచార సభలో పేర్కొన్నారు. అనంతరం సోమవారం ఏ.రాజ ఆ వ్యాఖ్యలపై స్పందించారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం వ్యక్తిగతం కాదు. రాజకీయంగా మాత్రమే విమర్శలు చేశా’ అని రాజా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా క్షమాపణలు ప్రకటించారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసినందుకు అన్నాడీఎంకే నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు కూడా నమోదైంది. దీంతోపాటు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సీఎంని స్టాలిన్ చెప్పుతో పోల్చిన నాయకుడు -
స్టాలిన్ మొత్తం ఆస్తుల విలువ ఇంతేనా
చెన్నై:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలలో నాయకులు తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తన వద్ద రూ.4.94 కోట్ల స్థిరాస్తులు, 2.24 కోట్లు చరాస్తులు ఉన్నట్లు సోమవారం ప్రకటించారు. తన పేరిట ఎలాంటి వాహనం లేదని, నగదు రూపంలో రూ. 50,000 ఉన్నట్లు తెలిపారు. మరో వైపు తన భార్య పేరిట 30,52,854 విలువైన చరాస్తుల ఉన్నాయని , 24.77 లక్షల విలువైన పాత బంగారు ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు ఏవీ లేవని, ఇతర అప్పులు కూడా లేవని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే జీతం, బ్యాంకు డిపాజిట్లు, అద్దెల ద్వారా తన ఆదాయం సమకూరుతున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2016 లో ప్రకటించిన అఫిడవిట్ లో, స్టాలిన్ 80.33 లక్షల విలువైన చరాస్తులు, 3.33 కోట్ల రూపాయల విలువ గల స్థిరాస్తులను చూపించారు. ఒక దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న అన్నాడిఎంకేను గద్దె దించడమే లక్ష్యంత ఏర్పడిన ప్రతిపక్ష కూటమికి స్టాలిన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ సారి తనయుడి రాజకీయ ఆరంగ్రేటం ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి మొదటి సారిగా పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన వద్ద 21.13 కోట్ల చరాస్తులు ,రూ.6.54 కోట్ల విలువవైన స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. నగరంలోని చెపాక్-ట్రిప్లికేన్ సెగ్మెంట్ కు నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో డిఎంకె యూత్ వింగ్ చీఫ్ ఈ విధంగా పేర్కొన్నారు. -
లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4 తగ్గిస్తాం
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) శనివారం తమ మేనిఫెస్టో విడుదల చేసింది. సుమారు ఐదు వందలకు పైగా హామీలతో ప్రజల ముందుకు వచ్చింది. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇచ్చినట్లు డీఎంకే అధినేత స్టాలిన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే, సామాన్యుడి నెత్తిన గుదిబండలా మారిన ఇంధన, వంటగ్యాస్ ధరలు తగ్గిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేశారు. డీఎంకే మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు హిందూ ఆలయాల పునరుద్ధరణకు వెయ్యి కోట్లు మసీదులు, చర్చిల పునరుద్ధరణకు రూ.200 కోట్లు అన్నాడీఎంకే మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4, పాలపై రూ.3 తగ్గిస్తాం పెంచిన ఆస్తిపన్నును రద్దు చేస్తాం వంటగ్యాస్‌పై సిలిండర్‌కు రూ.100 సబ్సిడీ జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్ తమిళనాడులో నీట్ పరీక్షను రద్దు చేస్తాం కోయంబత్తూరు సహాఇతర ప్రధాన పట్టణాల్లో మెట్రోరైలు ప్రాజెక్టులకు శ్రీకారం ప్రముఖ యాత్రా స్థలాలకు వెళ్లాలనుకునే లక్ష మందికి రూ. 25 వేలు శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇచ్చే దిశగా ప్రయత్నాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 40శాతం మహిళలకు అవకాశం ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాది పాటు మెటర్నటీ లీవులు తమిళనాడు వ్యాప్తంగా కలైంజ్ఙర్ క్యాంటీన్లు ఏర్పాటు కరోనాతో నష్టపోయిన బియ్యం కార్డుదారులకు రూ.4వేల సాయం చదవండి: TN Assembly polls : స్టార్ హీరో అరంగేట్రం -
డీఎంకేలో మూడో సూరీడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే అగ్రనేత దివంగత కరుణానిధి కుటుంబంలో మూడో వారసత్వం ఉదయించింది. కరుణానిధి మనవడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. కూటమి చర్చలు, నియోజకవర్గాల కేటాయింపు ముగియడంతో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ 173 మందితో కూడిన పార్టీ అభ్యర్థుల జాబితాను శుక్రవారం ప్రకటించారు. మూడొంతుల మెజార్టీకి తగిన సంఖ్యలో సొంత అభ్యర్థులను పోటీకి దించారు. తొలిసారిగా ఉదయనిధి స్టాలిన్.. కరుణానిధి వంశంలో మూడో తరం తొలిసారిగా ఎన్నికల రంగంలోకి దిగింది. కరుణానిధి మనుమడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నై ట్రిప్లికేన్ నుంచి పోటీ చేస్తున్నారు. తమిళ సినీ రంగంలో తనదైన స్థానం సంపాదించుకున్న ఉదయనిధికి రెండేళ్ల క్రితమే డీఎంకే యువజన విభాగం కార్యదర్శి బాధ్యతలను స్టాలిన్ అప్పగించారు. తన తాత కరుణానిధికి కంచుకోటైన ట్రిప్లికేన్ నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగనున్నారు. యథాప్రకారం కొళత్తూరు నుంచి మూడోసారి స్టాలిన్ పోటీకి దిగుతున్నారు. ఇక పార్టీలోని ప్రముఖులందరికీ సీట్లు దక్కాయి. కూటమిలోని కొన్నిపార్టీలు డీఎంకే ఉదయసూర్యుని చిహ్నంపై పోటీ చేస్తున్నాయి. దీంతో ప్రత్యక్ష, పరోక్ష అభ్యర్థులను కలుపుకుంటే డీఎంకే 187 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లయింది. 178 చోట్ల అన్నాడీఎంకే.. అధికార అన్నాడీఎంకే 178 స్థానాల్లో సొంత పార్టీ అభ్యర్థులను బరిలోకి దించగా రెండాకుల చిహ్నంపై పోటీచేసే అభ్యర్థులను కలుపుకుంటే మొత్తం 191 స్థానాల్లో అన్నాడీఎంకే తలపడుతోంది. 2 జాతీయ పార్టీలతో కమల్ ఢీ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన రెండు జాతీయ పార్టీల అభ్యర్థులను ఢీకొట్టబోతున్నారు. కోయంబత్తూరు సౌత్ స్థానాన్ని పొత్తులో భాగంగా అధికార ఏఐఏడీఎంకే తన మిత్రంపక్షం బీజేపీకి, ప్రతిపక్ష డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్‌కు కేటాయించాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
TN Assembly polls : స్టార్ హీరో అరంగేట్రం
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష ద్రావిడ మున్నేట కజగం(డీఎంకే) తన రేసుగుర్రాలను ప్రకటించింది. ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికలు- 2021 కు మొత్తం 173 మంది అభ్యర్థుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలోని వివరాల ప్రకారం.. పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ కోలాథూర్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలో నిలవనున్నారు. అదే విధంగా స్టాలిన్ తనయుడు, నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ చెపాక్ స్థానంనుంచి అరంగేట్రం చేయనున్నారు. అంతేకాదు మాజీ మంత్రులు, సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించడం విశేషం. డిప్యూటీ సీఎం ఓ పన్నీర్‌సెల్వంపై తంగ తమిళసెల్వన్ పోటీ చేస్తారని, సీఎం ఇ పళనిస్వామితో టీ సంపత్‌కుమార్ తలపడ నున్నారని డీఏంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దురై మురుగన్, కె ఎన్ నెహ్రూ, కె పొన్ముడి, ఎంఆర్‌కె పన్నీర్ సెల్వం లాంటి సీనియర్లతోపాటు మాజీ మంత్రులు అలాడి అరుణ, సురేష్ రాజన్, కన్నప్పన్, మాజీ స్పీకర్ అవుడియ్యప్పన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే డీఎంకే ఐటీ వింగ్ చీఫ్ పీటీఆర్ తియాగరాజన్, టీఆర్ బాలు కుమార్ టీఆర్బీ రాజా పేర్లు సైతం జాబితాలో ఉన్నాయి. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని స్టాలిన్ ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు. కాగా 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 61 సీట్లను ఇప్పటికే కూటమి కేటాయించగా, మిగిలిన 173 స్థానాల్లో డీఎంకే అభ్యర్థులను ప్రకటించింది. హీరోగా, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌తో చిత్ర నిర్మాతగా ఉదయనిధి స్టాలిన్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖంగా ఉన్న సంగతి తెలిసిందే. -
ఎవరి లెక్కలు వారివే!
సాక్షి, చెన్నై: సార్వత్రిక ఎన్నికలకు తమిళ పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీట్ల పంపకాలు, గెలుపు స్థానాల ఎంపిక మీద దృష్టి పెట్టే పనిలో పడ్డాయి. వివాదాలకు చోటు ఇవ్వకుండా తమ మద్దతు దారులకు సమంగా సీట్లను పంచేందుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్, కో కన్వీనర్ పళని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక, తమ గెలుపు ఖాయమన్నట్లు సర్వేలు చెబుతుండటంతో కాంగ్రెస్‌కు సీట్ల సంఖ్య తగ్గించేందుకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కసరత్తులు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. 2021 సార్వత్రిక నగారా మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌లో మోగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగా ఎన్నికల కమిషనర్ సత్యప్రద సాహూ కసరత్తు చేస్తున్నారు. నవంబర్ 16న నమూనా ఓటరు జాబితా, జనవరి 15న తుది ఓటర్ల జాబితాను ప్రకటించ బోతున్నట్లు ప్రకటన చేశారు. డిసెంబరు 15 వరకు ఓటరు జాబితాలో ఆన్లైన్ ద్వారా మార్పులు చేర్పులు చేసుకోవచ్చని సూచించారు. ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉన్నా, తమిళ పార్టీలు ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసుకుని కసరత్తుల వేగాన్ని పెంచాయి. ఇందులో డీఎంకే, అన్నాడీఎంకేలు ముందు ఉండగా, మేము సైతం అంటూ బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. సమానంగానే పంపకాలు.. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఐకమత్యంతో ముందుకు సాగేందుకు అన్నాడీఎంకే నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళని స్వామి శిబిరాలు సమానంగా సీట్లను పంచుకునేందుకు ఓ నిర్ణయానికి వచ్చిన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. బీజేపీకి 20, పీఎంకేకు 20, డీఎండీకేకు ఓ ఐదు, మిగిలిన మిత్రులకు తలా ఒకటి రెండు అప్పగించి, కనీసం 180 స్థానాల్లో పోటీ లక్ష్యంగా అన్నాడీఎంకే నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుంన్నాయి. బీజేపీ కలిసి రాకపోతే పీఎంకేకు మరో ఐదు సీట్లు ఇచ్చి, మిత్రులకు తలా ఓ సీటు కోత పెట్టి, అవసరం అయితే, 200 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోన్నట్లు చర్చ సాగుతోంది. ఏ శిబిరం అయితే, అధిక స్థానాల్లో గెలుస్తుందో, వారే సీఎం అనే ఏకాభిప్రాయానికి సైతం రాబోతున్నారని ఓ నేత పేర్కొనడం గమనార్హం. ఇందు కోసం మరి కొద్ది రోజుల్లో పార్టీ సర్వ సభ్యం సమావేశం కానున్నదని, ఇందులో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పారు. సర్వేలను నిజం చేద్దామంటూ.. డీఎంకే ఉదయ సూర్యుడి గెలుపు ఖాయమని ఓ సర్వేలో తేలింది. ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ బృందం ఓ నివేదికను డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు ఇచ్చినట్టు సమాచారం. ఇందులోనూ అధికారం డీఎంకేకు ఖాయం అన్నట్టుగా ఉండటం గమనార్హం. అయితే డీఎంకే విజయం సాధించాలంటే అధిక స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది. ఆ పార్టీకి మిత్ర పక్షాలు ఎక్కువే అయినా, వారికి సింగిల్ డిజిట్ సీట్లతో సర్దుబాటుకు అవకాశం ఎక్కువే. ఇక్కడ సమస్య అంతా కాంగ్రెస్ రూపంలోనే. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 63, 40 అంటూ సీట్లు కేటాయించినా, గెలిచింది సింగిల్ డిజిట్ మాత్రమే. ఈ దృష్ట్యా, ఈ సారి కాంగ్రెస్ ఆశించిన మేరకు సీట్లను డీఎంకే ఇచ్చే అవకాశాలు లేదన్న సంకేతాలు వెలువడ్డాయి. 30 లోపు సీట్లను కాంగ్రెస్‌కు సర్దుబాటు చేసి, కనీసం 180కు పైగా స్థానాల్లో పోటీ లక్ష్యంగా స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టినట్లు డీఎంకే నేత ఒకరు పేర్కొన్నారు. డీఎంకే కూటమిలో సీఎం అభ్యర్థి స్టాలిన్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి వ్యాఖ్యానించడం గమనార్హం. గెలిపిస్తే...ఇనోవా ఎన్నికల వ్యూహాలకు ఆ పార్టీ నేత మురుగున్ పదునుపెడుతున్నారు. జిల్లాల నేతలతో సమావేశాలు, సమీక్షలు అంటూ వీడియో కాన్ఫరెన్స్‌లతో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థిని గెలిపించే జిల్లా కార్యదర్శికి ఓ ఇన్నోవా కారు బహుకరించనున్నట్టు మురుగన్ ప్రకటించారు. కనీసం 25 మంది ప్రతినిధులు అసెంబ్లీలో ఈ సారి అడుగు పెట్టాల్సిందేనని, అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచి ఎన్నికల కసరత్తుల వేగాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. దీన్ని బట్టి చూస్తే, అన్నాడీఎంకే వద్ద కనీసం 40 నుంచి 50 మేరకు సీట్లను బీజేపీ ఆశించే అవకాశాలు ఉన్నాయి. -
అప్పుడు అక్క.. ఇప్పుడు చెల్లి
చిరంజీవి హీరోగా మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఖుష్బూ నటించనున్నారని తెలిసింది. ‘లూసిఫర్’లో చెల్లెలి పాత్ర కీలకమైనది. ఈ పాత్రకే ఖుష్బూని తీసుకున్నారట. 2006లో విడుదలైన ‘స్టాలిన్’ చిత్రంలో చిరంజీవికి అక్కగా నటించారు ఖుష్బూ. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత ‘లూసిఫర్’ చిత్రంలో ఆయనకు చెల్లెలు పాత్రలో నటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి ‘సాహో’ ఫేం సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు ‘లూసిఫర్’ కథలో పలు మార్పులు చేర్పులు చేశారట. మరోవైపు తమిళంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా అంగీకరించారు ఖుష్బూ. ప్రస్తుతానికి సూపర్ స్టార్ రజనీ పాత్రకు సంబంధించినవి కాకుండా ఇతర పాత్రధారులతో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా, మీనా కీలక పాత్ర చేస్తున్నారు. -
'ఆయన పుణ్యానా ఎమ్మెల్యేను కోల్పోయాం'
సాక్షి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌పై సీఎం పళనిస్వామి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన పుణ్యమా అని ఓ ఎమ్మెల్యేను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. వద్దంటున్నా, ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ఇప్పుడు ఒకరి ద్వారా మరొకరికి వైరస్ వ్యాప్తి పెరిగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కోయంబత్తూరు అధికారుల పనితీరు అభినందనీయమని కొనియాడారు. మెజిస్ట్రేట్ విచారణ నివేదిక మేరకు సాత్తాన్ కులంలో తండ్రి, కుమారుడి మరణంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం పళనిస్వామి గురువారం కోయంబత్తూరులో పర్యటించారు. రూ.238 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధిపనుల్ని ప్రారంభించారు. స్మార్ట్ సిటీ పనులు, వంతెనల నిర్మాణాలు, భారీ ఫ్లైఓవర్ల పనులు, అత్తికడవు అవినాశి ఉమ్మడి నీటి పథకం పనుల పరిశీలన అంటూ పలు పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే, రూ. 779 కోట్లతో చేపట్టనున్న పిల్లూరు తాగునీటి పథకం, సొరంగం తవ్వకాల పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజామణి, మంత్రి ఎస్పీ వేలుమణి, డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి జయరామన్‌లతో కలిసి కరోనా నివారణ చర్యల మీద సమీక్షించారు. అలాగే, చిన్న ,మధ్యతరహా, భారీ పరిశ్రమల యాజమాన్యాలు, ప్రతినిధులతో భేటీ అయ్యారు. స్వయం సహాయక బృందాలు, మహిళా సంఘాలతో సమావేశం అయ్యారు. సాయంత్రం మూడు గంటలకు మీడియా ముందుకు సీఎం వచ్చారు. కోయంబత్తూరు భేష్.. కోయంబత్తూరులో చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ముందుగా సీఎం పళనిస్వామి వివరించారు. కరోనా నివారణ చర్యలను గుర్తు చేస్తూ, వైరస్ కట్టడిలో అధికారుల పనితీరు అభినందనీయమని కొనియాడారు. ఇక్కడ వైరస్ అన్నది కట్టడిలో ఉందని, ప్రస్తుతం 112 మంది మాత్రమే చికిత్సలో ఉన్నట్టు వివరించారు. ఇక్కడున్న పరిశ్రమల్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం ద్వారా రూ. 761 కోట్ల మేరకు రుణాల్ని ఇప్పించామని తెలిపారు. గత 90 రోజులుగా రాష్ట్రంలోని ప్రతి అధికారి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు, వైద్యుల నుంచి నర్సులు, వార్డుబాయ్‌ల వరకు రేయింబవళ్లు కరోనా నివారణ, కట్టడి, బా«ధితుల సేవలో ఉన్నారని వివరించారు. వీరందరికి తాను ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. అయితే, రోగాన్ని అడ్డం పెట్టుకుని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చేస్తున్న రాజకీయం జూస్తుంటే, తీవ్ర ఆవేదన , ఆగ్రహం కల్గుతోందన్నారు. ఓ ఎమ్మెల్యేను కోల్పోయాం.. కరోనా కట్టడి లక్ష్యంగా అందరూ రేయింబవళ్లు శ్రమిస్తుంటే, ప్రభుత్వం చేతులెత్తేసిందని, సీఎంకు మానవత్వం లేదని, అధికారులు అసమర్థులు అన్నట్టుగా స్టాలిన్ వ్యాఖ్యలు చేస్తుండడం విచారకరంగా పేర్కొన్నారు. వాస్తవానికి స్టాలిన్ ఇచ్చిన ఆలోచనల్ని తాను అనుసరించి ఉంటే, ఈ పాటికి రాష్ట్రంలో కరోనా విలయతాండవం, మరణమృదంగం మార్మోగి ఉండేదేమో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే నేతృత్వంలో కరోనా నివారణ చర్యలు, కట్టడి, బాధితులకు సాయం అన్న ప్రకటన చేయగానే, తొలుత ఆక్షేపణను తానే తెలియజేసినట్టు తెలిపారు. ఇందుకు కారణం, వైద్య నిపుణులు, పరిశోధకులు ఇచ్చిన నివేదికేనని వివరించారు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా సేవల్లో నిమగ్నమైన పక్షంలో కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని ఆ నివేదికలో హెచ్చరించారన్నారు. అందుకే తాను అడ్డుకోవడం జరిగిందని, అయితే, కోర్టు ద్వారా వారు సేవల్ని కొనసాగించారన్నారు. ఇందుకు మూల్యంగా ఓ ఎమ్మెల్యేను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల్ని విస్మరించి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో భౌతిక దూరాలు, సామాజిక బాధ్యతల్ని మరిచి ప్రజలు సహాయకాల కోసం తరలివచ్చారని, ఇప్పుడు అదే జనం వైరస్ బారిన పడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ ఒకరి ద్వారా మరొకరికి సంక్రమించినట్టు తాజా నివేదిక స్పష్టం చేసిందని, అయితే, సమాజంలోకి ఇది వ్యాపించ లేదన్నారు. ఇష్టానుసారంగా సేవలు అంటూ దూకుడుగా ముందుకు సాగి వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణం కావడమే కాకుండా, ఓ ఎమ్మెల్యేను కోల్పోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరో అన్నది ప్రజలు గుర్తెరగాలని పిలుపునిచ్చారు. తానో జాతీయ నేతను అని స్టాలిన్ గొప్పలు చెప్పుకుంటున్నారని, అలాంటప్పుడు ముంబై, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో పెరుగుతున్న కేసుల విషయంగా ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. కరోనా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న విషయాన్ని పసిగట్టి, ఏదో ఒక రూపంలో బురద చల్లడం లక్ష్యంగా వ్యక్తిగత ప్రచారం కోసం రోజుకో ప్రకటనలు ఇచ్చుకోవడం ఆయనకు అలవాటుగా మారి ందని మండిపడ్డారు. కాగా, సాత్తాన్ కులం తండ్రి, కుమారుల మరణం గురించి ప్రశ్నించగా, మెజి్రస్టేట్ విచారణ కోర్టు పర్యవేక్షణలో సాగుతున్నదని, మదురై ధర్మాసనం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా తప్పు చేసి ఉంటే, వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. -
24 గంటల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో 24 గంటల్లో డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోయారు. గుడియాథం నియోజకవర్గానికి చెందిన ఎస్. కథవరాయణ శుక్రవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చనిపోయారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కథావరయణ్.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కథావరయణ్.. వేలూరు జిల్లాలోని గుడియథం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీఎంకే ఎమ్మెల్యే మృతిపట్ల రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎంకే పార్టీ మరో ఎమ్మెల్యే తిరువత్తియూరు నియోజకవర్గ ఎమ్మెల్యే (డీఎంకే), మాజీ మంత్రి కేపీపీ స్వామి (58) గురువారం కన్నుమూశారు. శుక్రవారం మధ్యాహ్న 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1962 జూలై 1వ తేదీన జన్మించిన స్వామి చెన్నై కేవీ కుప్పంలో నివసిస్తున్నారు. ఐదు నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తరువాత ఇంటివద్దనే వైద్యసేవలు అందుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఆరోగ్యం మరింత విషమించగా గురువారం ఉదయం 6.10 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. స్వామి మరణవార్త తెలుసుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నేతలు తరలివచ్చారు. ఆయన భౌతికకాయాన్ని పార్టీశ్రేణులు, అభిమానుల సందర్శనార్థం ఇంటి వద్ద ఉంచారు. అంచెలంచెలుగా.. డీఎంకే సీనియర్ నేత, మాజీ కౌన్సిలర్ పరశురామన్ కుమారుడు స్వామి. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువత్తియూరు నియోజకవర్గం నుంచి గెలుపొంది మత్స్యశాఖా మంత్రిగా పనిచేశారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి కుప్పన్ చేతిలో ఓడిపోయారు. 2016 నాటి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. డీఎంకే మత్స్య విభాగం ఇన్చార్జ్గా నియమితులైనారు. డీఎంకే అగ్రనేత కరుణానిధితో ఎంతో సఖ్యతగా మెలిగేవారు. కేపీపీ స్వామి భార్య, మాజీ కౌన్సిలరైన ఉమ, పెద్ద కుమారుడు ఇనియవన్ కొంతకాలం క్రితం మరణించారు. కుమార్తె ఉదయకు వివాహం కాగా భర్తతో ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. చిన్నకుమారుడు పరశు ప్రభాకరన్ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. కేపీపీ స్వామికి ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. స్వామి కుటుంబ సభ్యుల్లో దాదాపుగా అందరూ డీఎంకేలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టినత్తార్ ఆలయం వీధి సమీపంలోని శ్మశానవాటికలో స్వామి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వామి మరణంతో అసెంబ్లీలో డీఎంకే బలం 99కి తగ్గింది. మత్స్యకార కుటుంబాలకు ఎనలేని సేవ : స్టాలిన్ మత్స్యకార సామాజికవర్గానికి స్వామి ఎనలేని సేవలు చేశారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కొనియాడారు. కేవీకుప్పంలోని స్వామి భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. స్వామి మరణం తనను ఎంతో కలచివేసిందని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వర్తించిన స్వామి అన్ని కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా వ్యవహరించేవారని, మత్స్యశాఖామంత్రిగా పనిచేసిన కాలంలో ఆ సామాజిక వర్గానికి ఆయన అందించిన సేవలను మరువలేమన్నారు. మత్స్యకార కుటుంబాల సంక్షేమం కోసం అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తనతో పట్టుబట్టి మరీ పనులు చేయించుకునేవారని గుర్తుచేసుకున్నారు. అనారోగ్యానికి గురైనపుడు స్వయంగా వెళ్లి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నానని, అయితే తన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా నియోజకవర్గ ప్రజల కష్టనష్టాలను వివరించారని అన్నారు. స్వామి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని చెప్పారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు తిరునావుక్కరసర్ సంతాపం ప్రకటించారు. గవర్నర్ సంతాపం డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి కేపీపీ స్వామి ఆకస్మిక మరణం ఎంతో ఆవేదనను కలుగజేసిందని గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. తిరువొత్తియూరు నియోజకవర్గ ప్రజలకు తీరనిలోటని అన్నారు. స్వామిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. -
నాకు హీరోలకన్నా విలన్స్ అంటేనే ఇష్టం
‘‘స్టాలిన్ అనేది నా ఫేవరెట్ పేరు. స్టాలిన్ రష్యన్ నియంత. ‘స్టాలిన్’ పేరుతో చిరంజీవిగారు సినిమా చేశారు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ‘స్టాలిన్’ అనే పేరుని వింటున్నాను. ఈ చిత్రం టైలర్ చాలా బావుంది’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. జీవా, రియా సుమన్, నవదీప్ ముఖ్య పాత్రల్లో రతిన శివ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సీరు’. తెలుగులో ‘స్టాలిన్’ టైటిల్‌తో వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్, నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విట్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘జీవా చాలా ఈజ్‌తో నటించాడు. ఇందులో నవదీప్ లుక్ (నవదీప్‌ది విలన్ పాత్ర) విభిన్నంగా కనిపిస్తోంది. నాకు హీరోలకన్నా విలన్స్ అంటేనే ఇష్టం. దర్శకుడు సినిమాను బాగా హ్యాండిల్ చేశారు’’ అన్నారు. ‘‘జీవా తండ్రి ఆర్.బి. చౌదరిగారి బ్యానర్లో రాజశేఖర్‌గారు సింహరాశి, గోరింటాకు వంటి పెద్ద హిట్ సినిమాలు చేశారు. వాళ్ల నాన్నగారి పేరు నిలబెట్టాలని జీవా మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ‘రంగం’ కంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు జీవితా రాజశేఖర్. ‘‘మొదటి నుంచి తెలుగు ప్రేక్షకులతో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను ‘రంగం’ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వర్మగారి సినిమాలంటే నాకు ఇష్టం. ఆయన దగ్గర డైరెక్షన్ నేర్చుకోవాలని అనుకున్నాను. త్వరలో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాను’’ అన్నారు జీవా. ‘‘తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథ రాశాను. మంచి సందేశం ఇవ్వబోతున్నాం’’ అన్నారు రతిన శివ. ‘‘తెలుగు ప్రేక్షకులకు తెలుగు, తమిళం అనే భేదాలు ఉండవు. అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తారు. తొలిసారి ఇందులో పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటించాను’’ అన్నారు నవదీప్. ‘‘నట్టి ఫ్యామిలీకి ఈ సినిమా మంచి విజయం తీసుకురావాలి’’ అన్నారు టి. అంజయ్య. ‘‘మంచి పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు నట్టికుమార్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రియా సుమన్, నిర్మాతలు దామోదర ప్రసాద్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, వేల్స్ శ్రవణ్, శివ బాలాజీ, మధుమిత పాల్గొన్నారు. -
‘స్టాలిన్’ ప్రీ రిలీజ్ వేడుక
-
డీఎంకేకు ప్రశాంత్ కిశోర్ సేవలు
చెన్నై: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకుంటున్న రాజకీయ పార్టీ్టల్లో తాజాగా డీఎంకే కూడా చేరింది. తమిళనాడులో 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిశోర్‌కు చెందిన సంస్థ ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐప్యాక్)’ సహాయం తీసుకోనున్నామని ఆదివారం డీఎంకే అధినేత స్టాలిన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. స్టాలిన్ ట్వీట్‌పై ఐప్యాక్ కృతజ్ఞతలు తెలిపింది. ‘2021లో విజయమే లక్ష్యంగా తమిళనాడులో డీఎంకేతో కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో ఉన్నాం’ అని ట్వీట్ చేసింది. గత పదేళ్లుగా విపక్షంలో ఉంటున్న డీఎంకే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అన్నాడీఎంకే నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. సినీ నటుడు కమల్‌హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ కూడా ప్రశాంత్ కిశోర్ వ్యూహాలను వాడుకోనుందని కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికలను డీఎంకే దాదాపు స్వీప్ చేసింది. మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో 38 సీట్లను డీఎంకే గెలుచుకుంది. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం రెండు అసెంబ్లీ స్థానాలను అన్నాడీఎంకే గెల్చుకుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కోసం, పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కోసం ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐప్యాక్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. -
అందరివాడు
ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమవుతాడు స్టాలిన్. చెడుపై అతను ఎలా పోరాటం చేశాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘స్టాలిన్’. అందరివాడు అనేది ఉపశీర్షిక. ‘రంగం’ ఫేమ్ జీవా హీరోగా రియా సుమన్, గాయత్రీకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నవదీప్ విలన్ పాత్ర చేశారు. రతిన శివ దర్శకుడు. తమిళ నిర్మాణ సంస్థ వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్‌తో కలిసి తెలుగు సంస్థలు నట్టిస్ ఎంటర్టైన్మెంట్ప్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాయి. తమిళంలో ‘సీరు’ పేరుతో రూపొందింది. రెండు భాషల్లోనూ ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నిర్మాతలు డాక్టర్ ఇషారి కె. గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ– ‘‘రంగం’ తర్వాత ఆ స్థాయిలో ఉండే మాస్ సినిమా ఇది. స్టాలిన్ పాత్రను జీవా అద్భుతంగా చేశారు. విలన్ పాత్రలో నవదీప్ ఒదిగిపోయారు. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందించాం. వచ్చే నెల 2న హైదరాబాద్‌లో ఆడియో ఫంక్షన్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీ సాయి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, గురుచరణ్, సంగీతం: డి.ఇమ్మాన్, కెమెరా: ప్రసన్నకుమార్. -
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా డీఎంకే మిత్రపక్షాలు భారీ ర్యాలీ
-
ఆ రోజే రాజీనామా చేద్దామనుకున్నా
సాక్షి, చెన్నై: డీఎంకేకు పల కరుప్పయ్య రాజీనామా చేశారు. తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు లేఖ రాశారు. కార్పొరేట్ ఏజెన్సీ, సంస్థల చేతికి పార్టీ చేరినట్టుగా కరుప్పయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో ఏళ్ల తరబడి కొనసాగి 2016లో అమ్మ జయలలితను ఢీకొట్టి పార్టీ నుంచి పల కరుప్పయ్య బయటకు వచ్చారు. అన్నాడీఎంకే నుంచి బయటకు రావడమే కాదు, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హార్బర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ తదుపరి పరిణామాలో డీఎంకేలో చేరారు. అధికార ప్రతినిధి హోదాతో ముందుకు సాగుతూ వచ్చిన ఆయన.. కొన్ని చిత్రాల్లోనూ నటనపై దృష్టి పెట్టారు. విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో సీనియర్ నేతగా, సీఎం పాత్రలో పరోక్షంగా దివంగత డీఎంకే నేత కరుణానిధిని తలపించే దిశగా అందర్నీ మెప్పించారు. సినిమాలు, రాజకీయపయనం అంటూ సాగుతూ వచ్చిన కరుప్పయ్య గురువారం ఓ ప్రకటన చేశారు. తాను డీఎంకే నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేస్తూ లేఖను స్టాలిన్‌కు పంపించారు. బై..బై.. మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాలు, పార్టీలపై విమర్శలు గుప్పించే రీతిలో కరుప్పయ్య స్పందించారు. పరోక్షంగా డీఎంకేను ఉద్దేశించి ఆయన మాటల తూటాల్ని పేల్చారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన తనను ఓ వివాహ వేదికపై.. కరుణానిధి తనను చూశారని గుర్తు చేశారు. ఆయన పిలుపుమేరకు తాను బలవంతంగానే డీఎంకేలోకి వచ్చానని పేర్కొన్నారు. ఆయన మరణం తదుపరి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నా, పరిస్థితులు అనుకూలించలేదన్నారు. అయితే, ప్రస్తుతం కార్పొరేట్ సంస్థ అన్నట్టుగా పరిస్థితులు మారి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి అనుసరించిన రాజకీయవ్యూహాలు, సిద్ధాంతాలను గుర్తు చేస్తూ, ఇప్పుడు అవన్నీ ప్రకటనల ఏజెన్సీల సంస్థల గుప్పెట్లోకి చేరి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలు ఇచ్చే సలహాలు సూచనల్ని పాటించే స్థాయికి దిగజారే పరిస్థితి ఒక గొప్ప పార్టీకి రావడం ఆవేదన కల్గిస్తున్నదని, అందుకే బయటకు రావడం మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. తల పండిన నేతలు, సీనియర్లతో చర్చించి వ్యూహాల్ని రచించే కాలం పోయి, ఇప్పుడు కార్పొరేట్ సంస్థల వలే ఏజెన్సీలకు అప్పగించడం ఆయా పార్టీల నేతల చేతగానితనానికి నిదర్శనం అన్నట్టుగా పరిస్థితులు మారుతాయని హెచ్చరించారు. -
హిందీని మాపై రుద్దొద్దు
చెన్నై: దేశమంతటా ఒకే భాష అమలు సాధ్యం కాదని సీనియర్ నటుడు రజనీకాంత్ అన్నారు. ఈ నిర్ణయాన్ని కేవలం దక్షిణాది రాష్ట్రాలే కాదని, ఉత్తరాది రాష్ట్రాలు కూడా తిరస్కరిస్తాయని బుధవారం మీడియాతో అన్నారు. దేశమంతటా హిందీ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హిందీ దివస్ నాడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ దేశ అభివృద్ధికైనా, ఏకత్వానికైనా ఒకే భాష అవసరమని అయితే అది ఏ ఒక్కరో తీసుకురాలేరని అన్నారు. అందుకే హిందీని దేశమంతటా అమలు చేయలేమన్నారు. అమిత్‌షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యలు కూడా గళమెత్తిన సంగతి తెలిసిందే. -
చెన్నైలో డీఎంకే శాంతి ర్యాలీ
సాక్షి, చెన్నై: మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి ప్రధమ వర్ధంతి పురస్కరించుకుని డీఎంకే పార్టీ భారీగా శాంతి ర్యాలి నిర్వహించింది. డీఎంకే ఛీప్ ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్, ఎంపి కనిమొళి, ఇతర కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురయ్యారు. అన్నాసాలైలో అన్నాదురై విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత ప్రారంభమైన శాంతిర్యాలీ మౌనంగా మెరీనాతీరం వైపు కదిలింది. అనంతరం మెరీనాలోని కరుణానిధి సమాధి వద్ద ర్యాలీ ముగిసింది. ర్యాలీ ముగింపులో భాగంగా కరుణానిధి సమాధి వద్ద డీఎంకే నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. -
కలసి నడుద్దాం
‘రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయత, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలి’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.కృష్ణా జలాలను ఒద్దికగా, పొదుపుగా వినియోగించుకుంటూ సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో రెండు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ అభిలషించారు. చిన్న వయసులో ముఖ్యమంత్రిగా చేపట్టిన పెద్ద బాధ్యతను అద్భుతంగా నిర్వహించగలిగే శక్తి, సామర్థ్యం, ధైర్యం, స్థైర్యం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్నాయని, అది గత తొమ్మిదేళ్లుగా ప్రస్ఫుటంగా నిరూపణైందని కొనియాడారు. సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. సాక్షి, అమరావతి/గన్నవరం: ‘నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వకంగా నా పక్షాన, తెలంగాణ ప్రభుత్వ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన అభినందనలు, ఆశీస్సులు. తెలుగు ప్రజల జీవన గమనంలో ఇదో ఉజ్వలమైన ఘట్టం. ఉభయ రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు ప్రేమతో అనురాగంతో పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. వయసుచిన్నదైనా ఆ శక్తి, తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. మీ కార్యనిర్వహణలో, మీ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని మీరు సంపూర్ణ విజయాన్ని సాధించాలని భగవంతుని నేను మనసారా ప్రార్థిస్తున్నాను.రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు చేయవలసింది ఖడ్గ చాలనం కాదు కరచాలనం. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయతతో అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలి. జగన్మోహన్రెడ్డి ముందున్న తక్షణ కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగం. 100 శాతం జరిగి తీరాలి. మీ ఆధ్వర్యంలో జరుగుతుందని విశ్వసిస్తున్నాను.కృష్ణా నదీ జలాల విషయంలో సమస్యలు ఉన్నాయి. అక్కడ నదిలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా ఒద్దికగా ఓపికగా ఉభయ రాష్ట్రాలు వినియోగించుకుంటూనే సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ఉభయ రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ కార్యనిర్వహణలో అవసరమైనటువంటి అన్ని విధాల అండదండలు, సహాయసహకారాలు తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తున్నాను. అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతమైన పాలన అందించి నాన్నగారి పేరు నిలబెట్టి చరిత్రలో నిలిచిపోయేలా కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలని.. ఒక టెర్మ్ కాదు కనీసం మూడు నాలుగు టెర్మ్‌ల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని మనసారా దీవిస్తూ మీకు శుభాశీస్సులు అందిస్తున్నాను.’ అంటూ ముగించారు. వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు: స్టాలిన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పరిపాలనలో విజయవంతం కావాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆకాంక్షించారు. తన తండ్రి ఘన వారసత్వాన్ని నిలబెట్టేలా జగన్ మంచి పరిపాలన అందించాలని శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా స్టాలిన్ అందరికీ నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడారు. ఎయిర్‌పోర్టులో కేసీఆర్, స్టాలిన్‌కు ఘనస్వాగతం తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, డీఎంకే అధినేత స్టాలిన్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. తొలుత చెన్నై నుంచి 10.25 గంటలకు స్టాలిన్ ఇక్కడికి చేరుకున్నారు. ఆయనకు ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమం పూర్తయ్యా సాయంత్రం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరివెళ్లారు. కేసీఆర్ ఉదయం 11.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, పలువురు మంత్రులు విచ్చేశారు. సాయంత్రం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం కేసీఆర్ అదే విమానంలో హైదరాబాద్ వెళ్లారు. -
వైఎస్ జగన్‌కు స్టాలిన్ అభినందనలు
-
విజయవాడకు స్టాలిన్
-
స్టాలిన్‌కు సోనియా ఆహ్వానం
సాక్షి, చెన్నై: ఎన్నికల ఫలితాల రోజున ఢిల్లీలో జరగనున్న ప్రతిపక్ష పార్టీల భేటీకి రావాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు పిలుపు వచ్చింది. స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ ఈ ఆహ్వానాన్ని స్టాలిన్‌కు పంపినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఆ రోజున జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుందామన్నట్టుగా స్టాలి¯Œన్ దృష్టికి సోనియాగాంధీ తీసుకొచ్చి నట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో వేలూరు మినహా తక్కిన 38 లోక్‌సభ స్థానాలకు, 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మరో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో డీఎంకేకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా సర్వేలు మొదటి నుంచి పేర్కొంటున్నాయి. లోక్‌సభలో డీఎంకే కూటమి అధిక స్థానాల్లో పాగా వేయడం ఖాయం అన్న ధీమా నేతల్లో నెలకొంది. ›ప్రధానంగా డీఎంకే పోటీ చేసిన 20 స్థానాల్లో, ఆ పార్టీ చిహ్నంతో పోటీ చేసిన మరో నాలుగు స్థానాల్లో మెజారిటీ సీట్లలో గెలుపు ఖాయం అన్నది స్పష్టం అవుతోంది. అలాగే, కాంగ్రెస్ పోటీ చేసిన పది స్థానాలు కనీసం ఐదు గ్యారంటీ అన్న సంకేతాలు జోరందుకుని ఉన్నాయి. అలాగే, ఉప ఎన్నికల్లో డీఎంకే క్లీన్‌స్వీప్ చేసినా చేయవచ్చన్న ప్రచారం జోరందుకుని ఉండడంతో అన్నాడీఎంకే పాలకుల్లో ఉత్కంఠ బయలుదేరింది. సర్వేలు, ధీమాలు, ప్రచారాలు ఓ వైపు ఉంటే, ఈనెల 23న వెలువడే ఫలితాల మేరకు ఏవరి బలం ఎటో, ఓటరు మద్దతు ఎవరికో అన్నది స్పష్టం కానుంది. ఈ లోపు సర్వేలు, సంకేతాల మేరకు డీఎంకేను తమతో కలుపుకునేందుకు తగ్గట్టుగా కొన్ని పార్టీలు ప్రయత్నాల్ని వేగవంతం చేశాయి. ఆదిశగా దేశ వ్యాప్తంగా గుణాత్మక మార్పు, ప్రాంతీయ పార్టీల ఏకం అన్న నినాదంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో సైతం ఆయన రెండు రోజుల క్రితం చెన్నైలో భేటీ అయ్యారు. ఈ భేటీలో సానుకూలత అన్నది ఉన్నా, రాష్ట్రంలో అన్నాడీఎంకే సర్కారు పతనం లక్ష్యంగా కాంగ్రెస్ మద్దతు తమకు తప్పనిసరి కావడంతో డీఎంకే ఆచితూచి అడుగులు వేసే పనిలో నిమగ్నమైంది. సోనియా ఆహ్వానం కేసీఆర్ ప్రయత్నం ఓ వైపు సాగుతుంటే, మరో వైపు దేశవ్యాప్తంగా ప్రతి పక్ష పార్టీలను ఏకం చేయడానికి తగ్గట్టుగా కాంగ్రెస్ మరో ప్రయత్నం చేపట్టింది. ఇన్నాళ్లు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యూహాలకు పదును పెడుతుంటే, తాజాగా సీనియర్నాయకురాలు సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు. కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారు అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు దేశవ్యాప్తంగా ప్రతి పక్ష పార్టీలకు ఆహ్వానం పలికే పనిలో సోనియాగాంధీ ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో గురువారం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు సోనియాగాంధీ స్వయంగా ఆహ్వానం పలికినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇది లేఖ ద్వారానా లేదా, ఫోన్ ద్వారానో సంప్రదింపులు జరిగినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల 23న ఢిల్లీలో జరగనున్న ప్రతి పక్ష పార్టీల సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని స్టాలిన్‌కు సోనియాగాంధీ ఆహ్వానం పలికి ఉన్నారని, ఈ సమావేశానికి స్టాలిన్ వెళ్తారా లేదా, డీఎంకే తరఫున ప్రతినిధి హాజరవుతారా అన్నది వేచి చూడాల్సి ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు కారణం, అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల మేరకు తదుపరి అడుగులు, వ్యూహాలకు పదును పెట్టే దిశగా స్టాలిన్ చెన్నైలోనే ఉండాల్సిన అవసరం ఉందంటూ డీఎంకే నేత ఒకరు పేర్కొన్నారు. అయితే, జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పడం లక్ష్యంగా ఉన్న స్టాలిన్ ఆ సమావేశానికి పార్టీ నేతలు కనిమొళి, టీఆర్ బాలు, రాజాలతో కలిసి స్టాలిన్ వెళ్లేందుకు ఆస్కారం ఉందని మరో నేత పేర్కొనడం గమనార్హం. -
కేసీఆర్, స్టాలిన్ భేటీపై విమర్శలు.. ఆరోపణలు
సాక్షి, చెన్నై: ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి తగ్గ కసరత్తులపై శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మధ్య భేటీ తమిళనాట చర్చకు దారి తీసింది. ఇది కేవలం మర్యాదే అని స్టాలిన్ ప్రకటించినా, తెర వెనుక రాజకీయం సాగుతోందన్న ఆరోపణలు, విమర్శలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్‌ను ఇప్పటినుంచే బెదిరించి తన గుప్పెట్లో పెట్టుకునేందుకు స్టాలిన్ సిద్ధం అయ్యారంటూ అన్నాడీఎంకే విమర్శలు ఎక్కుబెట్టింది. ఇక, దేశంలో మూడో లేదా ఫెడరల్ ఫ్రంట్‌కో ఆస్కారం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్.అళగిరి వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్‌లో చెన్నైకు వచ్చిన విషయం తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ నినాదంతో ఇక్కడకు వచ్చిన ఆయనకు ఘనంగానే ఆహ్వానం లభించింది. గోపాలపురంలో డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధితో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ తదుపరి అప్పట్లో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్‌తో కేసీఆర్ సమావేశం అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీలతో కూటమి ఏర్పాటు దిశగా కేసీఆర్ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా, ఇందుకు డీఎంకే మద్దతు కోరినట్టుగా అప్పట్లో సంకేతాలు వెలువడ్డాయి. కరుణానిధి మరణం తదుపరి డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ పగ్గాలు చేపట్టినానంతరం రాజకీయ పరిణామాలు అనేక మలుపులు తిరిగాయి. గత నెల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి డీఎంకే ఎదుర్కొంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన స్టాలిన్, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధం అయ్యారు. అలాగే, తమిళనాట అన్నాడీఎంకే సర్కారును కూలదోసి తమ గుప్పెట్లోకి పాలనను తీసుకోవడమా? లేదా, ఎన్నికలకు వెళ్లడమా? అనే దిశగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ఈ సమయంలో కేసీఆర్ మళ్లీ తనతో భేటికి సిద్ధం కావడంతో తొలుత స్టాలిన్ వెనుకడుగు వేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. భేటీతో చర్చ ఈనెల 23న వెలువడే ఫలితాల అనంతరం కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించేందుకు తగ్గట్టుగా కేసీఆర్ వ్యూహాలకు పదును పెట్టి ఉండటంతో ఈ భేటీకి తొలుత స్టాలిన్ వెనక్క తగ్గాల్సి వచ్చింది. ఇందుకు కారణం, తమిళనాట అన్నాడీఎంకే సర్కారును కూలదోయాలన్నా, అవకాశం వస్తే తాము ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవాలన్న కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి కావడమే. దీంతో భేటీ విషయంగా ఆలోచించి చివరకు మర్యాదపూర్వకం అన్నట్టుగా ముందుకు సాగినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. గంటపాటూ రాజకీయం ఆళ్వార్‌పేటలోని తన నివాసానికి చేరుకున్న కేసీర్‌కు స్టాలిన్ పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానం పలికారు. గంట పాటుగా స్టాలిన్ నివాసంలో కేసీఆర్ ఉన్నారు. అక్కడ జాతీయ, రాష్ట్ర రాజకీయాల మీద చర్చ సాగినట్టు తెలిసింది. ప్రాంతీయ పార్టీల ఏకం ప్రస్తావనను ఈ సందర్భంగా స్టాలిన్ ముందు కేసీఆర్ ఉంచినట్టు తెలిసింది. అయితే, ప్రస్తుతానికి జాతీయ రాజకీయాల కన్నా, తమిళనాట అన్నాడీఎంకే సర్కారును కూలదోయడం, అందుకు తగ్గట్టుగా స్పీకర్ మీద తాము జారీ చేసి ఉన్న అవిశ్వాస తీర్మానికి తగ్గ నోటీసు ప్రస్తావనను స్టాలిన్ తీసుకొచ్చినట్టు తెలిసింది. 22 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అలాగే, కాంగ్రెస్‌తో కలసి తమిళనాట తాము ఎన్నికల్ని ఎదుర్కొన్న దృష్ట్యా, తమిళనాట ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం తమకు ఉందని, ప్రస్తుతానికి జాతీయ ప్రస్తావన వద్దన్నట్టు స్టాలిన్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. చివరకు లోక్‌సభ ఎన్నికల ఫలితాల మేరకు తదుపరి చర్చించుకుందామన్నట్టుగా ఇద్దరు నేతలు సంకేతాల్ని ఇచ్చుకున్నట్టుగా డీఎంకే నేత ఒకరు పేర్కొన్నారు. ఈ సమావేశానంతరం కేసీఆర్, స్టాలిన్లు మీడియా ముందుకు వస్తారన్న ప్రచారం సాగింది. దీంతో ఆళ్వార్ పేట నివాసం వద్ద మీడియా హడావుడి పెరిగింది. అయితే, కేసీఆర్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లి పోయారు. స్టాలిన్ సైతం మీడియా ముందుకు రానప్పటికీ కాసేపటి తర్వాత తమ మధ్య సంప్రదింపులు, సమాలోచన కేవలం మర్యాద పూర్వకం మాత్రమేనని స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. విమర్శలు.. ఆరోపణల జోరు కేసీఆర్–స్టాలిన్ల మధ్య భేటీ సమయంలో మీడియాలో విమర్శలు, ఆరోపణలు జోరుగానే సాగాయి. అన్నాడీఎంకే తరఫున మంత్రి జయకుమార్ పేర్కొంటూ, కాంగ్రెస్‌ను బెదిరించి దారిలోకి తెచ్చుకోవడమే కాదు. ఇప్పట్లోనే తన గుప్పెట్లోకి తీసుకునే వ్యూహంతో స్టాలిన్ ఉన్నట్టు ఆరోపించారు. అలాగే, కేసీఆర్ ద్వారా బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నట్టుగా తమకు సమాచారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తే తమకు ఐదు కేబినెట్ సీట్లు ఇవ్వాలన్న డిమాండ్‌ను కేసీఆర్ ద్వారా ఢిల్లీకి చేరవేయడానికి వ్యూహరచన చేసి ఉన్నట్టు వ్యాఖ్యానించారు. బీజేపీ అధ్యక్షుడు తమిళిసై సౌందరరాజన్ పేర్కొంటూ, కేంద్రంలో బీజేపీ సర్కారు మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, అవన్నీ వృథా ప్రయత్నాలేనని వ్యాఖ్యానించారు. ఇక, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి పేర్కొంటూ, మూడో ఫ్రంట్టో, ఫెడరల్ ఫ్రెంటుకో దేశంలో ఆస్కారం లేదన్నారు. డీఎంకే తన స్పష్టతను ఎప్పుడో తెలియజేసి ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలన్నారు. కేసీఆర్ ఓ రాష్ట్రానికి సీఎం అని, ఆయన తనతో భేటీకి వస్తున్నారని చెప్పగానే, తిరస్కరించే మనస్తత్వం స్టాలిన్‌కు లేదన్నారు. ఎవరు వచ్చినా ఆహ్వానించి, గౌరవించడం తమిళనాడు సంప్రదాయం అని అదే స్టాలిన్ చేశారన్నారు. స్టాలిన్‌ను ప్రాంతీయ పార్టీల ఏకం విషయంగా కేసీఆర్ ఆహ్వానించి ఉన్న పక్షంలో, అందుకు తగ్గ సమాధానాన్ని స్టాలిన్ ఇచ్చి ఉంటారన్నారు. రాహుల్‌ను ప్రధాని చేయడానికి తమతో కలిసి రావాలన్న ఆహ్వానాన్ని కేసీఆర్‌కు పలికినా పలికి ఉండవచ్చని చమత్కరించారు. -
డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీకానున్న కేసీఆర్
-
రామేశ్వర ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్
సాక్షి, చెన్నై : ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేపట్టిన తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రస్తుతం రామేశ్వరంలో పర్యటిస్తున్నారు. రామేశ్వరంలో ప్రసిద్ధ గాంచిన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కేసీఆర్ సందర్శించారు. ప్రత్యేక పూజలో స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు ఆలయ నిర్వాహకుల నుండి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈనెల 13న డీఎమ్‌కే అధినేత స్టాలిన్‌ను కేసీఆర్ కలవనున్నట్లు ప్రకటించినా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీరిద్దరి భేటీ సాధ్యపడకపోవచ్చుననే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
స్టాలిన్‌తో భేటీ కానున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నేటి నుంచి సీఎం కేసీఆర్.. మళ్లీ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగా మొదట కేరళ సీఎం పినరయి విజయన్‌తో సంప్రదింపులు జరుపనున్నారు. అటుపై ఈ నెల 13న డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాజకీయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సీఎం కుమారస్వామితో సోమవారం ఉదయం కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. నీరు విడుదల చేసినందుకు కుమారస్వామికి కృతజ్క్షతలు తెలిపారని సమాచారం. -
తాత జయంతి రోజున నాన్న సీఎం కావడం ఖాయం
పళ్లిపట్టు: తాత (కరుణానిధి) జయంతి రోజున నాన్న (స్టాలిన్) కావడం ఖాయమని నటుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు సోమవారం సుడిగాలి ప్రచారం నిర్వహించారు. అరక్కోణం డీఎంకే అభ్యర్థి జగద్రక్షగన్‌కు మద్దతుగా తిరుత్తణి నియోజకవర్గంలోని ఆర్కేపేట, అమ్మయార్‌కుప్పం, అత్తిమాంజేరిపేట, పొదటూరుపేట, తిరుత్తణి ప్రాంతాల్లో స్టాలిన్ తనయుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ రోడ్‌షో చేపట్టారు. డీఎంకే క్యాడర్‌తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు యువత పాల్గొన్నారు. రోడ్‌షోలో ఉదయనిధి మాట్లాడుతూ.. అన్నాడీఎంకే ప్రభుత్వం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పీఎంకేకు ఎన్నికల సమయం వచ్చేసరికి విమర్శలన్నీ కనుమరుగయ్యాయని, అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తున్నట్లు మాటమార్చడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని అన్నాడీఎంకే కూటమిని బహిష్కరించాలన్నారు. నరేంద్రమోదీతో దేశం పాతికేళ్లు వెనుబడిందని ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు జీవనోపాధి కొరవడి ఇబ్బందులు మధ్య అగమ్యగోచరంగా బతుకీడుస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని అవినీతి సొమ్మును వెలికితీసి ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలకు రూ.ఆరువేలు చొప్పున ఏడాదికి రూ.72 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు కాంగ్రెస్ ఎన్నికల హామీ ద్వారా లబ్ధి పొందేందుకు పేద విద్యార్థులు సైతం వైద్య విధ్య అభ్యసించేందుకు వీలుగా నీట్ రద్దుకు డీఎంకే కూటమిని ఆదరించాలన్నారు. ప్రజల మద్దతుతో ఉప ఎన్నికల్లో 22 నియోజకవర్గాల్లో డీఎంకే అభ్యర్థులు విజయం సాధించడం ద్వారా జూన్ 3న తాత జయంతి రోజునే నాన్న సీఎం పదవీ ప్రమాణం చేయడం ఖాయమన్నారు. మండల కన్వీనర్ జీ.రవీంద్ర సహా కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. డీఎంకే కూటమితోనే నీట్ రద్దు– ఉదయనిధి స్టాలిన్వేలూరు: రాష్ట్రంలో డీఎంకే అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో పాటూ కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితేనే నీట్ పరీక్షల రద్దు, విద్యారుణాల మాఫీ అవుతాయని సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. వేలూరు జిల్లా అరక్కోణం పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న డీఎంకే కూటమి అభ్యర్థి జగద్రక్షగన్‌కు మద్దతుగా ఉదయనిధి స్టాలిన్ సోమవారం ఉదయం ప్రచారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే గెలుపు ఖాయమన్నారు. అన్నాడీఎంకే మెగా కూటమి కాదని మానం చెడిన కూటమి అన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే జయలలిత మృతిపై విచారణ జరిపిస్తామన్నారు. గతంలో రాత్రికి రాత్రే కరెన్సీ నోట్లను రద్దుచేసి ప్రజలను బ్యాంకుల వద్ద పడిగాపులు కాచే విధంగా చేసిన నరేంద్రమోదీ ప్రభుత్వానికి స్వస్తి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రజలు అన్నింటికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. నీట్ పరీక్షలను రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేసిన సమయంలో ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రస్తుతం ఉచిత హామీలు చేస్తూ ప్రజల వద్దకు వస్తున్న వారికి ఈనెల 18న జరిగే పోలింగ్‌లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం కాట్పాడి చిత్తూరు బస్టాండ్, వళ్లిమలై రోడ్డు, తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి డీఎంకే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయనతో పాటు పార్లమెంట్ అభ్యర్థి జగద్రక్షగన్, ఎమ్మెల్యేలు నందకుమార్, గాంధీ పాల్గొన్నారు. -
కంటెంట్ ఉన్నోడు!
సామాజిక న్యాయం, మూఢాచారాల నిర్మూలన, భాషా వికాసం వంటి సైద్ధాంతిక పునాదులపై పుట్టిన డీఎంకే పార్టీలో ఆధునికంగా కనిపించినవాడు స్టాలిన్. ద్రవిడ దిగ్గజం కరుణానిధి ముద్దుల కుమారుడు. ఆయనకే అసలు సిసలు వారసుడు. కానీ తండ్రి నుంచి వారసత్వం వస్తుందని ఎన్నడూ ధీమాగా లేరు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. తండ్రి నీడ తనపై పడకుండా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న నాయకుడు. రాజకీయాల్లోకి వచ్చిన 51 ఏళ్ల తర్వాత, కరుణానిధి మరణానంతరం తన 66వ ఏట స్టాలిన్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తండ్రి సహకారం లేకుండా ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు స్టాలిన్‌కు గట్టి సవాల్నే విసురుతున్నాయి. ♦ 1953, మార్చి 1న కరుణానిధి రెండవ భార్య దయాళు అమ్మాళ్కి స్టాలిన్ జన్మించారు. సోవియట్ పాలకుడు స్టాలిన్ నివాళి సభలో కరుణ మాట్లాడుతుండగా తనకు కొడుకు పుట్టాడన్న విషయం తెలియడంతో స్టాలిన్ అని పేరు పెట్టారు. ♦ 14 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. పాఠశాల విద్యార్థిగా ఉండగానే 1967 ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు ♦ 1973లో స్టాలిన్‌కు 20 ఏళ్ల వయసులో డీఎంకే జనరల్ కౌన్సిల్‌కు ఎంపికయ్యారు. ♦ ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద అరెస్ట్ కావడంతో స్టాలిన్ పేరు అప్పట్లో అందరికీ తెలిసింది. ♦ ఆ తర్వాత డీఎంకే యువజన విభాగాన్ని ఏర్పాటు చేశారు. 1984లో కార్యదర్శి పదవిని చేపట్టారు. దాదాపు 40 ఏళ్లపాటు అదే పదవిలో కొనసాగారు. ♦ 1996లో చెన్నై నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే స్టాలిన్‌లో పాలనా సామర్థ్యం వెల్లడైంది. ♦ 1989లో తొలిసారి తౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ♦ 2017లో కరుణానిధి అనారోగ్యం కారణంగా స్టాలిన్ తాత్కాలిక అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టారు. ♦ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ రాజకీయ నేతల ట్రేడ్ మార్క్ దుస్తులు ధోవతికి బదులుగా వెస్ట్రన్ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆకర్షించారు. ♦ ‘మన కోసం మనం’ అన్న నినాదంతో విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లోనూ ర్యాలీలు నిర్వహించి ఓటర్లతో నేరుగా మాట్లాడి ప్రత్యక్ష సంబంధాల్ని ఏర్పాటు చేసుకున్నారు. ♦ కరుణానిధి మరణానంతరం ఆయన అన్న అళగిరి పక్కలో బల్లెంలా మారతారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అళగిరి కూడా తనను విస్మరించి స్టాలిన్‌కు ఎలా పట్టం కడతారంటూ చెన్నై వీధుల్లో నిరసనకు దిగారు. కానీ ఆయన వెంట పట్టుమని పదిమంది కూడా నడవలేదు. ♦ జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే ఎవరికి వారే చీలిపోయినప్పటికీ దానిని స్టాలిన్ ఎంతవరకు క్యాష్ చేసుకోగలరన్న అనుమానాలు కొందరిలో ఉన్నాయి. ♦ కార్యకర్తలే ఆయనకున్న బలం.. క్యాడర్ ఆయనను ఆప్యాయంగా దళపతి అని పిలుస్తూ స్టాలిన్ ఈ ఎన్నికల్లో విజేతగా నిలుస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ♦ ఇప్పుడు స్టాలిన్‌కు పార్టీలో ఎదురులేదు. ఆయన మాటే శాసనం. ప్రత్యర్థి పార్టీ అన్నాడీఎంకే మాదిరిగా అంతర్గత పోరు లేదు. మరి ఎన్నికల్లో స్టాలిన్ తన సత్తా ఎంతవరకు చాటుతారో మరి. -
తమిళనాట డీఎంకే కూటమి ఖరారు
సాక్షి, చెన్నై: తమిళనాట లోక్‌సభ ఎన్నికలకు డీఎంకే మెగా కూటమి ఖరారైంది. మిత్రులకు 20 సీట్లను డీఎంకే కేటాయించింది. మరో 20 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ అ«ధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. పుదుచ్చేరి, తమిళనాడులో 40 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నాడీఎంకే– బీజేపీ నేతృత్వంలో ఓ మెగా కూటమి ఏర్పాటు చివరి దశలో ఉండగా డీఎంకే–కాంగ్రెస్ నేతృత్వంలో మరో కూటమి మంగళవారం రారైంది. సీట్ల సర్దుబాటు వివరాలను స్టాలిన్ ప్రకటించారు. తమ కూటమిలోని కాంగ్రెస్‌కు పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలో 10 స్థానాలు కేటాయించామన్నారు. ఎండీఎంకేకు ఓ ఎంపీ సీటు, ఓ రాజ్యసభ సీటును ఖరారు చేసినట్టు వివరించారు. ఇక, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 2, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ (ఐయూఎంఎల్) 1, కొంగునాడు దేశీయ మక్కల్ కట్చి(కేడీఎంకే)1, ఇండియ జననాయగ కట్చి(ఐజేకే)1లకు ఒకటి చొప్పున సీట్లు కేటాయించినట్టు ప్రకటించారు. మిత్రులకు 20 కేటాయించామని, తమ అభ్యర్థులు 20 స్థానాల్లో పోటీ చేస్తారని వివరించారు. డీఎంకే గుర్తుపై కేడీఎంకే, ఐజేకే అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ అభ్యర్థులు కూడా ఇదే గుర్తుపై పోటీ చేసే అవకాశాలున్నాయన్నారు. -
నేడే విపక్ష మహా ప్రదర్శన
కోల్‌కతా: రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏయేతర పక్షాలను సంఘటితపరచడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగే విపక్షాల మెగా ర్యాలీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ‘ఐక్య విపక్ష ర్యాలీ’ పేరిట శనివారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బీజేపీయేతర ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఆహ్వానాలు అందాయి. కొన్ని పార్టీల అధినేతలే స్వయంగా ఈ ర్యాలీకి హాజరవుతోంటే, మరికొన్ని పార్టీలు తమ ప్రతినిధులను పంపుతున్నాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్(ఎస్పీ), స్టాలిన్(డీఎంకే), కుమార స్వామి, దేవెగౌడ(జేడీఎస్), కేజ్రీవాల్(ఆప్) ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా(ఎన్సీ), శరద్‌పవార్(ఎన్సీపీ), చంద్రబాబు(టీడీపీ), తేజస్వి యాదవ్(ఆర్జేడీ), మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్‌శౌరి, బీజేపీ అసంతృప్త నేత శత్రుఘ్న సిన్హా, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్, దళితనేత జిగ్నేశ్ మేవానిసహా 20 పార్టీల నేతలు హాజరవుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి గైర్హాజరవుతున్నారు. కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకులు ఖర్గే, బీఎస్పీ తరఫున సతీశ్ మిశ్రా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తున్న టీఆర్ఎస్, బిజూ జనతా దళ్(బీజేడీ) నుంచి ఎవరూ హాజరుకావడం లేదు. వామపక్ష పార్టీలు ర్యాలీలో పాల్గొనవద్దని నిర్ణయించుకున్నాయి. కాగా, కోల్‌కతా ర్యాలీని బీజేపీ ఎగతాళి చేసింది. విపక్ష కూటమి తొలుత ప్రధాని అభ్యర్థిని నిర్ణయించుకోవాలని, ఆ తరువాతే ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడం గురించి ఆలోచించాలని హితవు పలికింది. లక్షలాదిగా వస్తున్న టీఎంసీ కార్యకర్తలు కోల్‌కతా విపక్ష ర్యాలీకి తృణమూల్ కార్యకర్తలు లక్షల్లో తరలివస్తున్నారు. బహిరంగ సభలకు సంబంధించి పాత రికార్డులను బద్దలుకొట్టేందుకు ఆ పార్టీ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. శుక్రవారం నాటికే రాష్ట్రం నలుమూలల నుంచి రైలు, రోడ్డు, జల మార్గాల ద్వారా సుమారు 5 లక్షల మంది కోల్‌కతాకు చేరుకున్నట్లు తృణమూల్ వర్గాలు తెలిపాయి. తమ ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలకు భోజనం, వసతి ఇతర సౌకర్యాలను పార్టీ నాయకులే ఏర్పాటుచేస్తున్నారు. ర్యాలీకి అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. సభాస్థలిలో మొత్తం ఐదు పెద్ద వేదికలను సిద్ధం చేశారు. 3000 మంది వలంటీర్లను నియమించారు. సభా ప్రాంగణంలో రెండ్రోజుల ముందే ఎల్ఈడీ లైట్లు, బారికేడ్లు, తోరణాలు పెద్ద సంఖ్యలో అమర్చారు. మమతా బెనర్జీ బలం చాటేందుకేనా? లోక్‌సభ ఎన్నికల తరువాత ఢిల్లీ రాజకీయాల్లో మమతా బెనర్జీని తిరుగులేని నాయకురాలిగా చూపేందుకు ఈ ర్యాలీని ఒక వేదికగా ఉపయోగించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ యోచిస్తోంది. ‘దేశంలోని ప్రముఖ విపక్ష నాయకుల్లో మమతా బెనర్జీ కూడా ఒకరనేది కాదనలేని సత్యం. బీజేపీ వ్యతిరేక పోరులో ఇతర పార్టీలను ఆమె కలుపుకుపోగలరు. కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలే’ అని తృణమూల్ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వం ఆమె నేతృత్వంలోనే ఏర్పడాలని ర్యాలీ ప్రచార సమయంలో ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. కోల్‌కతాలో విపక్షాల భారీ ర్యాలీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు ప్రకటిస్తూ మమతా బెనర్జీకి లేఖ రాశారు. ‘విపక్షాల ఐక్యతా ప్రదర్శన ర్యాలీ విషయంలో మమతా దీదీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. దీని ద్వారా మనం ఐక్యభారతానికి సంబంధించి గట్టి సందేశం ఇస్తామని ఆశిస్తున్నాను’ అని రాహుల్ పేర్కొన్నారు. -
భావి ప్రధాని రాహుల్: తృణమూల్ అభ్యంతరం
సాక్షి, న్యూఢిల్లీ : భావి ప్రధానిగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రతిపాదించడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని అభ్యర్ధి పేరును వెల్లడించడం విపక్ష పార్టీల ఐక్యతను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. స్టాలిన్ ప్రతిపాదనను తాము తీవ్రంగా తీసుకున్నామని, ప్రధాని పదవికి ఏ ఒక్కరి పేరు వెల్లడించడం స్వాగతించదగినది కాదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే ప్రధాని ఎవరనేది నిర్ణయించాలని తాము గతంలోనే స్పష్టం చేశామని తృణమూల్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ సైతం ఎవరి పేర్లనూ ప్రస్తావించని క్రమంలో ఇతర పార్టీలు ఎందుకు ఆ పనికి పూనుకుంటున్నాయని ప్రశ్నించింది. కరుణానిధి విగ్రహావిష్కరణ సందర్భంగా శనివారం చెన్నైలో భావి ప్రధాని రాహుల్ పేరును డీఎంకే చీఫ్ స్టాలిన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ విజయాల నేపథ్యంలో ప్రధాని రేసులో రాహుల్ పేరును స్టాలిన్ ప్రకటించడం గమనార్హం. ఈ దేశాన్ని కాపాడేందుకు మోదీని ఓడించే సత్తా కలిగిన రాహుల్ గాంధీని తాను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తున్నానని స్టాలిన్ పేర్కొన్నారు. సమాజ్‌వాది పార్టీ సైతం రాహుల్ అభ్యర్ధిత్వాన్ని ముందుకు తేవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ ప్రధాని ఎవరనేది ప్రజల తీర్పు ద్వారానే వెల్లడవుతుందని ఆ పార్టీ నేత ఘన్‌శ్యామ్ తివారీ చెప్పుకొచ్చారు. తృణమూల్‌తో పాటు ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీలు సైతం స్టాలిన్ ప్రకటనతో విభేదించాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆయా పార్టీలు పేర్కొన్నాయి. -
ఎన్డీయే ప్రభుత్వానికి రాహుల్ గాంధీ హెచ్చరిక..
సాక్షి, చెన్నై: ఎన్డీయే ప్రభుత్వం స్వతంత్ర వ్యవస్థలపై దాడి చేస్తోందని, ఆ ధోరణిని దేశం అనుమతించదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఒకరి సిద్ధాంతాలే(ఆరెస్సెస్‌ను ఉద్దేశించి) దేశాన్ని పాలించాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. ఆదివారం చెన్నైలో దివంగత డీఎంకే నాయకుడు కరుణానిధి నిలువెత్తు విగ్రహావిష్కరణ వేడుక జరిగింది. తేనాంపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలో ప్రతిష్టించిన కరుణానిధి కంచు విగ్రహాన్ని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ..మోదీ సర్కారు రాజ్యాంగబద్ధ సంస్థల స్వయంప్రతిపత్తి, దేశ సంస్కృతిని నాశనం చేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్ని వర్గాలు, గొంతుకలు కలసి రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దివంగత నాయకుడు కరుణానిధి తమిళ ప్రజల గొంతుకగా నిలిచారని రాహుల్ ప్రశంసలు కురిపించారు. భావి ప్రధానిగా రాహుల్ పేరును ప్రతిపాదిస్తున్నట్లు ఈ సందర్భంగా స్టాలిన్ అనూహ్య ప్రకటన చేశారు. కేరళ,పుదుచ్చేరి, ఏపీ సీఎంలు పి.విజయన్, నారాయణస్వామి, చంద్రబాబు నాయుడు, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం, సినీ నటుడు రజనీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భావి ప్రధాని రాహులే!: స్టాలిన్ దేశానికి ప్రధాని అయ్యే అన్ని అర్హతలు రాహుల్ గాంధీకి ఉన్నాయని, తమిళనాడు నుంచి ఆ పదవికి ఆయన పేరును దివంగత కరుణానిధి వారసుడిగా ప్రతిపాదిస్తున్నట్టు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రకటించారు. జాతీయ స్థాయిలో తన తండ్రి కరుణానిధి పోషించిన పాత్రను గుర్తు చేశారు. 2004లో ఐల్యాండ్ గ్రౌండ్లో జరిగిన సభలో సోనియా గాంధీని ఉద్దేశించి తొలిసారిగా కరుణానిధి ప్రసంగించారన్నారు. ఇందిరావిన్ మరుమగలే వరుగ.. ఇండియావిన్ తిరుమగలే వెల్గ (ఇందిర కోడలా రావమ్మా.. భారత నారీ జయం నీకే) అని ఆహ్వానించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన వారసుడిగా తమిళనాడు నుంచి ప్రధాని పదవికి రాహుల్ పేరును ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. ‘రాహుల్ రావాలి.. దేశంలో సుపరిపాలన రావాలి’ అన్న నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. అలాగే, మోదీ పాలనకు చరమ గీతం పాడేలా అందరం రాహుల్‌కు మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చారు. విగ్రహావిష్కరణ అనంతరం మెరీనా తీరంలో అన్నాదురై, కరుణానిధి సమా«ధుల వద్ద సోనియా, రాహుల్ నివాళులర్పించారు. -
కృషి అంతా నాదే:బాబు
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో ఎన్డీఏ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు తానొక్కడినే కృషి చేస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు శుక్రవారం రాత్రి చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసి చర్చలు జరిపారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తీరుతో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితిలో పడిందన్నారు. దేశంలో వ్యవస్థలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, కేంద్ర ప్రభుత్వం మితిమీరిన జోక్యంతో ఆర్బీఐ గవర్నర్ కూడా వైదొలగాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. సీబీఐ, ఈడీ వ్యవస్థలను సైతం ప్రతిపక్షాలను బెదిరించేందుకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. ఆఖరికి గవర్నర్‌ను కూడా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. మహాకూటమిలో కొన్ని పార్టీల మధ్య అభిప్రాయ భేదాలున్నా దేశ ప్రయోజనాల దృష్ట్యా కలసి నడుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ మహాకూటమిని నడిపించేందుకు ఎందరో సమర్థవంతమైన నాయకులున్నారు. నరేంద్ర మోదీ కంటే స్టాలిన్ ఎంతో సమర్థుడు’ అని అన్నారు. -
కృషి అంతా నాదే..
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో ఎన్డీఏ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు తానొక్కడినే కృషి చేస్తున్నానని సీఎం చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు శుక్రవారం రాత్రి చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసి సుమారు గంటపాటు చర్చలు జరిపారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తీరుతో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితిలో పడిందన్నారు. దేశంలో వ్యవస్థలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, కేంద్ర ప్రభుత్వం మితిమీరిన జోక్యంతో ఆర్బీఐ గవర్నర్ కూడా వైదొలగాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. సీబీఐ, ఈడీ వ్యవస్థలను సైతం ప్రతిపక్షాలను బెదిరించేందుకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. ఆఖరికి గవర్నర్‌ను కూడా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. మోదీ కంటే స్టాలిన్ సమర్థుడు మహాకూటమిలో కొన్ని పార్టీల మధ్య అభిప్రాయ భేదాలున్నా దేశ ప్రయోజనాల దృష్ట్యా కలసి నడుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ‘మాకు 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో విభేదాలుండేవి. వాటిని మరిచి నేను సర్దుకుపోయినట్లే అందరూ సర్దుకుపోతారు. మహాకూటమిని నడిపించేందుకు ఎందరో సమర్థ నాయకులున్నారు. నరేంద్ర మోదీ కంటే స్టాలిన్ ఎంతో సమర్థుడు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఢిల్లీ మీడియా భయపడుతోంది. ఏపీలో నేను, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, కర్ణాటకలో దేవెగౌడ ఎంతో బలమైన నాయకులం. కర్ణాటక, తమిళనాడు మధ్య విబేధాల్లేవు. తమిళనాడుకు అవసరమైన తాగునీటిని కృష్ణా, గోదావరి నుంచి ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కరుణానిధి హయాం నుంచే డీఎంకేతో నాకు మంచి సంబంధాలున్నాయి’ అని పేర్కొన్నారు. పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, కళావెంకట్రావు, ఎంపీ సీఎం రమేష్ తదితరులున్నారు. నేడు బాబుతో అశోక్ గెహ్లాట్ భేటీ సాక్షి, అమరావతి: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ శనివారం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో వీరు సమావేశమవుతారు. రాహుల్ బృందంలో కీలక సభ్యుడిగా ఉన్న గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడి దూతగా అమరావతికి వస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చును చంద్రబాబే భరిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించిన తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను చంద్రబాబుకు చూపించి ఆయన ఆమోదం తీసుకోడానికే గెహ్లాట్ అమరావతికి వస్తున్నట్టు సమాచారం. -
చలి కొరికిన ఆత్మ
రాత్రి భోజనం అయింది. గిలియబొవ్ మనసారా తన గిన్నెనంతా నాకి, టేబుల్ మీద పడిన రొట్టె తుంపులను ఒడుపుగా తన ఎడమ చేతిలోకి ఊడ్చుకున్నాడు. అమాంతం మింగేయకుండా, తన నోటిలో ఊరిన లాలాజలం ఆ రొట్టెలో ప్రతి చిన్న తునకనూ తడపి ముద్దజేయడాన్ని అనుభవించాడు. దాని రుచి బాగుందో, లేదో మాత్రం గిలియబొవ్ చెప్పలేడు. అన్నింటినీ మరిపింపజేసే ఈ తీక్షణమైన అనుభవంతో పోలిస్తే రుచి అనేది చాలా స్వల్ప విషయం. దాన్ని మింగడానికి గిలియబొవ్ ఏమీ తొందర పడలేదు; దానికదే నోట్లో వేగంగా కరిగి కనబడకుండా మాయమైంది. గిలియబొవ్ నోటి నుంచి తన మిణుకుమంటున్న గుంటలుపడిన కళ్లను తిప్పుకోలేకపోయాడు బాగ్రెత్సోవ్. మరొకరి నోటిలోకి మాయమవుతున్న తిండిని చూస్తూ కళ్లు తిప్పుకోగలిగే శక్తి అక్కడ ఎవరికీ లేదు. గిలియబొవ్ తన లాలాజలమంతా మింగేయగానే, దూరంగా ఆకాశం మీదికి పాకుతూ వస్తున్న పెద్ద నారింజరంగు చంద్రుడి మీదకు బాగ్రెత్సోవ్ తన చూపును మార్చుకున్నాడు. ‘‘ఇదే అదును,’’ అన్నాడు బాగ్రెత్సోవ్. మౌనంగా వాళ్లిద్దరూ ఒక పెద్ద రాయి దగ్గరికి కొనిపోయే తోవ వెంట నడిచి, ఒక కొండను చుట్టుకొనివున్న చిన్న దిన్నెను ఎక్కారు. కాసేపటి కిందే పొద్దు మునిగినప్పటికీ, పగటి పూట తమ రబ్బరు బూట్లలోని బిత్తల కాళ్లను మండించిన ఈ రాళ్లు అప్పటికే చల్లబడి ఉన్నాయి. గిలియబొవ్ తన పై జాకెట్ గుండీలు పెట్టుకున్నాడు. నడక కూడా అతడిని వెచ్చబరచలేదు.‘‘అదింకా చాలా దూరమా?’’ గుసగుసగా అడిగాడు. ‘‘బాగా,’’ నెమ్మదిగా బదులిచ్చాడు బాగ్రెత్సోవ్. కాసేపు అలుపు తీర్చుకోవడానికి కూలబడ్డారు. మాట్లాడుకోవాల్సింది గానీ, ఆలోచించవలసింది గానీ ఏమీ లేదు– అంతా స్పష్టంగా, సులువుగా ఉంది. ఆ దిన్నె చివరున్న సమస్థలంలో ఒక రాళ్లకుప్పా, తవ్విపోయగా ఎండిన మట్టికుప్పా ఉన్నాయి. ‘‘ఇదంతా నాకు నేనే చేసుకుందును,’’ వంకరగా నవ్వుతూ అన్నాడు బాగ్రెత్సోవ్. ‘‘కానీ ఇద్దరమూ కలిసి చేస్తే మజాగా ఉంటుంది, పైగా నువ్వు నా పాత స్నేహితుడివాయె...’’ గతేడాది వాళ్లిద్దరూ ఒకే నౌక మీద ఇక్కడికి తేబడ్డారు. బాగ్రెత్సోవ్ మాటలు ఆపేశాడు. ‘‘వంగు, లేదంటే కనబడతాం.’’ ఇద్దరూ వంగునే రాళ్లను పక్కకు విసరసాగారు. ఇక్కడున్న ఏ రాయి కూడా వీళ్లిద్దరూ కలిసి ఎత్తలేనంత, కదల్చలేనంత బరువున్నది కాదు; పొద్దున వాటిని ఇక్కడ కుప్ప బోసిన ఎవరూ కూడా గిలియబొవ్ కన్నా బలమైనవాళ్లేం కాదు. బాగ్రెత్సోవ్ తనను తాను తిట్టుకున్నాడు: అతడి వేలు తెగి నెత్తురు కారసాగింది. గాయం మీద కొంచెం ఇసుక చల్లుకున్నాడు, తన జాకెట్కున్న అతుకులోంచి చిన్నబట్టపేగును చింపి గాయాన్ని ఒత్తుకున్నాడు, అయినా రక్తం ఆగలేదు. ‘‘రక్తం గడ్డకట్టడం లేదు,’’ ఉదాసీనంగా అన్నాడు గిలియబొవ్. ‘‘దీనికి మునుపు నువ్వు డాక్టరా?’’ అడిగాడు బాగ్రెత్సోవ్, రక్తాన్ని నోటితో పీల్చుకుంటూ. గిలియబొవ్ మాట్లాడలేదు. అతడు వైద్యుడిగా ఉండిన కాలం ఎప్పుడో చాలా ఏళ్ల క్రితపు సంగతిలా తోచింది. అసలు వైద్యుడిగా పనిచేశాడా? చాలాసార్లు అతడికి ఈ పర్వతాల, సముద్రాల ఆవలి ప్రపంచం అవాస్తవికంగా, ఒక స్వప్నంలా, కల్పనలా కనబడుతుంది. వాస్తవం ఏమిటంటే, ఈ నిమిషం, ఈ గంట, ఈ రోజు– నిద్ర లేపుతూ వినబడే నగారా ధ్వని మొదలు, ఇక పని ఆపవచ్చని వచ్చే ఆదేశం వరకే. అంతకుమించి అతడు ఏనాడూ యోచించలేదు, ఆలోచించే శక్తి కూడా లేదు, ఇక్కడున్న అందరికి మళ్లేనే. తన చుట్టుపక్కలవాళ్ల ఎవరి గతమూ అతడికి తెలీదు, తెలుసుకోవాలన్న ఆసక్తీ లేదు. కానీ రేపెప్పుడైనా బాగ్రెత్సోవ్ తాను డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనో, విమానయాన సేనాధిపతి అనో వెల్లడిస్తే గనక గిలియబొవ్ మారు మాట్లాడకుండా అంగీకరిస్తాడు. కానీ నిజంగా తాను డాక్టర్‌గా పనిచేశాడా? తన యథాలాప అంచనా శక్తితో పాటు, యథాలాప పరిశీలనా శక్తిని కూడా అతడు కోల్పోయాడు. బాగ్రెత్సోవ్ తన వేలిని చప్పరించడాన్ని గిలియబొవ్ చూశాడుగానీ ఏమీ స్పందించలేదు. పరిస్థితి అతడి చేతనను తాకిందిగానీ తనలోంచి దానికి జవాబును గానీ, ఆ జవాబు ఇవ్వగలిగే సంకల్పబలాన్ని గానీ వెతికే పని పెట్టుకోలేదు. అతడిలో మిగిలిపోయిన చైతన్యం– బహుశా ఇంకేమాత్రం మనిషిది కాని చైతన్యం– కొద్ది పార్శా్వలనే మిగుల్చుకున్నది– దాని మొత్తం దృష్టీ ఒకే లక్ష్యం మీద ఉంది, అక్కడున్న రాళ్లన్నింటినీ సాధ్యమైనంత త్వరగా తొలగించాలి! ‘‘లోతుగా ఉందంటావా?’’ దమ్ము తీసుకోవడానికి ఆగినప్పుడు అడిగాడు గిలియబొవ్. ‘‘లోతుగా ఎలావుంటుంది?’’ బదులిచ్చాడు బాగ్రెత్సోవ్. తన ప్రశ్నలోని అసంబద్ధతను గ్రహించాడు గిలియబొవ్, గొయ్యి లోతుగా ఉండే వీలే లేదు. ‘‘ఇదిగో దొరికాడు,’’ అన్నాడు బాగ్రెత్సోవ్. ఒక మనిషి కాలి బొటనవేలిని అతడు దొరికించుకున్నాడు. రాళ్ల సందుల్లోంచి పెద్ద వేలు వెన్నెల వెలుగులో స్పష్టంగా కనబడింది. ఆ వేలు గిలియబొవ్ వేలిలాగానో, బాగ్రెత్సోవ్దిగానో లేదు– నిర్జీవంగా, బిరుసుగా ఉండటం దానికి కారణం కాదు, ఆ మాటకొస్తే వాళ్లవి కూడా అలాగే ఉన్నాయి. చచ్చిపోయినవాడి కాలిగోరు కత్తిరించి ఉంది, వేలు మృదువుగా, కండపట్టి ఉంది. వాళ్లు వేగంగా మృతదేహం మీద కుప్పగా ఉన్న రాళ్లను తీసేశారు. ‘‘మరీ కుర్రాడు,’’ బాగ్రెత్సోవ్ అన్నాడు. ఇద్దరూ కలిసి కాళ్లను పట్టి శరీరాన్ని బలంగా గోరీ నుంచి బయటికి లాగారు. ‘‘మంచి ఆరోగ్యంగా ఉన్న కుర్రాడు,’’ దమ్ము తీసుకుంటూ అన్నాడు గిలియబొవ్. ‘‘అతడు ఇంత బలంగా ఉండకపోయుంటే,’’ కొనసాగించాడు బాగ్రెత్సోవ్. ‘‘మనందరిలాగే అతణ్నీ పూడ్చేసివుండేవాళ్లూ, మనం ఇంతదూరం ఈరోజు వచ్చివుండేవాళ్లమూ కాదు.’’ వాళ్లు ఆ శవపు చేతుల్ని చక్కగా చాపి, చొక్కా లాగారు. ‘‘చూడు, ఇతడి చెడ్డీ కొత్తదిలా ఉంది,’’ అన్నాడు బాగ్రెత్సోవ్ తృప్తిగా. దాన్ని కూడా పట్టి గుంజారు. గిలియబొవ్ ఆ చెడ్డీని తన జాకెట్ కింద దాచాడు. ‘‘అది తొడుక్కుంటే మంచిది,’’ చెప్పాడు బాగ్రెత్సోవ్. ‘‘వద్దు, వేసుకోను,’’ గొణిగాడు గిలియబొవ్. తిరిగి మృతదేహాన్ని గొయ్యిలోకి లాగి, దాని మీద రాళ్లను పేర్చారు. ఇప్పుడు ఇంకాస్త పైకి ఉదయించిన చంద్రుడి నీలపు కాంతి ఆ రాళ్ల మీద, ఆ కురచ మంచు వనాల మీద పడి, ప్రతి రాతి కొననూ, ప్రతి చెట్టునూ ఒక ప్రత్యేకమైన, పగటికి భిన్నమైన కాంతిలో చూపిస్తోంది. చుట్టూ వున్నవన్నీ వాస్తవంగానే కనిపిస్తున్నాయి, కానీ తమ పగటి స్వభావాన్ని పోగొట్టుకున్నాయి. ప్రపంచానికి ఏదో రెండో ముఖం, చీకటి ముఖం ఉన్నట్టు. చచ్చిపోయినవాడి చెడ్డీ గిలియబొవ్ జాకెట్ కింద వెచ్చగా ఉంది, అది ఇంక ఎంతమాత్రమూ పరాయిదిగా అనిపించలేదు. ‘‘నాకు పొగ తాగాలని ఉంది,’’ కలలో విహరిస్తున్నట్టుగా అన్నాడు గిలియబొవ్. ‘‘రేపు నీకు తప్పకుండా దొరుకుతుంది,’’ నవ్వుతూ బదులిచ్చాడు బాగ్రెత్సోవ్. రేపు వాళ్లు ఆ బట్టలు అమ్ముతారు, బదులుగా రొట్టెను పొందుతారు, ఏమో, కొంత పొగాకు కూడా దొరకొచ్చు... స్టాలిన్ హయాంలో ‘గులాగ్’లుగా పిలిచే సైబీరియా నిర్బంధ క్యాంపుల్లో మైనస్ 60 డిగ్రీల చలిలో, మనుషు లుగా ఇంకేమాత్రం మిగల కుండా బతకాల్సిన దుస్థితిని ఈ 1954 నాటి రష్యన్ కథ చిత్రించింది. రచయిత వర్లామ్ షలమోవ్ (1907–1982) స్వయంగా అందులో ఒక క్యాంపైన కొలీమా బాధితుడు. ఏళ్ల తరబడి రాజకీయ ఖైదీగా శిక్షను అనుభవించి, విడుదలైన తర్వాత తన అనుభవాల సారంతో రాసిన కథలే ‘కొలీమా టేల్స్’గా ప్రసిద్ధి కెక్కాయి. ఈ కథను ‘ఇన్ ద నైట్’ పేరుతో జాన్ రీడ్, ‘ఎట్ నైట్’ పేరుతో డొనాల్డ్ రేఫీల్డ్ ఇంగ్లీషులోకి అనువదించారు. ఆ రెండింటి ఆధారంగా తెలుగు అనువాదం: సాహిత్యం డెస్క్. -
చెన్నైలో అళగిరి శాంతి ర్యాలీ
-
డీఎంకేకు అళగిరి అల్టిమేటం
సాక్షి, చెన్నై : డీఎంకే మాజీ అధినేత కరుణానిధి మరణంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీపై పట్టుకు ఒక్కరికొకరు పోటీ పొడుతున్నారు. డీఎంకే అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరుణానిధి మరో కుమారుడు అళగిరి పార్టీపై తిరుగబాటు జెండా ఎగరవేశారు. స్టాలిన్ తమ నాయకుడు కాదని.. అసలైన డీఎంకే కార్యకర్తలు తన వెంటే ఉన్నారని ఇటీవల పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. దీంతో స్టాలిన్ వర్గానికి హెచ్చరికగా నేడు చెన్నైలో అళగిరి తన మద్దతు దారులతో శాంతి ర్యాలీని నిర్వహించనున్నారు. అళగిరి తలపెట్టిన ర్యాలీకి పార్టీ కార్యకర్తలెవరు హాజరుకావద్దని డీఎంకే ఆదేశాలు జారీ చేసింది. కాగా అళగిరి 2014 లోకసభ ఎన్నికల సమయంలో కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డీఎంకేలో ఉన్న కొందరు కీలక నేతలు అళగిరికి మద్దతుగా ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అళగిరి తలపెట్టిన ర్యాలీతో డీఎంకేలో అందోళన మొదలైంది. మరోవైపు అళగిరి కదలికలను బీజేపీ ఆసక్తిగా గమనిస్తోంది. పార్టీపై తిరుగుబాటు చేసిన అళగిరిని తమవైపుకు తిప్పుకుంటే తమిళనాటలో కొంత బలపడొచ్చని కమళం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీపై పట్టుకోసం స్టాలిన్ ఏలాంటి వ్యూహాలు అమలుచేస్తారో వేచి చూడాలి. -
రసపట్టులో అన్నదమ్ముల సవాల్
పార్టీపై స్టాలిన్ పట్టుకు తిరుగులేదనీ, పార్టీ నాయకత్వంలో అళగిరిని ఆయన వేలుపెట్టనివ్వరనే విషయం పరిశీలకులందరికీ అర్థమైంది. మళ్లీ డీఎంకేలో చేర్చుకోవాలని డిమాండ్ చేసిన అళగిరి విషయంలో కరుకుగానే వ్యవహరించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. స్టాలిన్ పార్టీ మనిషిగానే వ్యవహరిస్తూ, కుటుంబ సంబంధాల ప్రభావం పార్టీపై పడకుండా చూడాలనేది వారి ఆకాంక్ష. సెప్టెంబర్ ఐదున తన మెరీనా యాత్రలో లక్ష మంది తన వెంట నడుస్తారని అళగిరి చెబుతున్నారు. అంత మంది జనం ఆయన వెంట రాకపోవచ్చుగాని, అళగిరి ర్యాలీ విజయవంతమైనట్టు కనిపించేలా చేయడానికి డీఎంకే వ్యతిరే పార్టీలు తమ వంతు పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. చెన్నైలోని మెరీనాలో తన తండ్రి ఎం.కరుణానిధి సమాధి వద్దకు ఆయన రెండో కొడుకు డీఎంకే మాజీ నేత ఎంకే అళగిరి నేడు (బుధవారం) ఊరేగింపుగా వెళుతున్నారు. 1980ల్లో తన ఇద్దరు కొడుకుల మధ్య వైరంతో విసిగిపోయిన కరుణానిధి పార్టీ దక్షిణాది వ్యవహారాలు చూసుకో మని అళగిరిని మదురైకు పంపించారు. ఉత్తర తమిళ నాడులో పార్టీ పనిని చెన్నై నుంచి నడపాలని స్టాలిన్‌కు అప్పగించారు. స్టాలిన్ కార్యక్షేత్రంలోనే ఆయనకు అన్న సవాలు విసురుతున్నారు. కుటుంబ పోరు ఇక బహిరంగమే. తోబుట్టువుల మధ్య ఈ యుద్ధంలో అళగిరే బలహీనుడు. ఆగస్టు చివరి వారం స్టాలిన్ తండ్రికి వారసునిగా డీఎంకే అధ్యక్ష పదవి చేపట్టారు. కరుణ ఈ పదవిలో 49 ఏళ్లున్నారు. 2014లో డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన అళ గిరి ప్రస్తుతం పార్టీ సభ్యుడు కూడా కాకపోవడంతో తమ్ముడిని అడ్డుకోలేకపోయారు. ప్రతి జిల్లాలో అన్ని పదవుల్లో్ల తన మనుషులను నియమిస్తూ గత నాలు గేళ్లలో పార్టీపై స్టాలిన్ పూర్తి పట్టు సాధించారు. ఈ నాలుగేళ్లలో అళగిరి రాజకీయాల్లో చురుకుగా లేరు. తమ్మునితో పోరు సలపకుండా వెనుదిరగడం ఆయ నకు ఇష్టం లేదు. మళ్లీ డీఎంకేలో చేరాలనుకున్న ఆయనకు కుటుంబ సభ్యుల మద్దతు లభించలేదు. దీంతో ఇక బాహాటంగానే స్టాలిన్‌తో తలపడాలను కుని, తన తండ్రికి నిజమైన, విధేయులైన కార్యకర్త లంతా నాతోపాటే ఉన్నారని చెప్పారు. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడైన స్టాలిన్ కార్యసాధకుడు కాదని, పార్టీని ఎన్నికల్లో గెలిపించే సత్తా ఆయనకు లేదని అళగిరి చెప్పారు. స్టాలిన్‌కు ఎక్కడ నొప్పి పుడు తుందో అక్కడే అళగిరి గురిచూసి కొడుతున్నారు. కరుణానిధి బతికుండగానే 2014 లోక్‌సభ, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోనే డీఎంకే పోటీచేసింది. డీఎంకేకు ఒక్క లోక్‌సభ సీటూ దక్క లేదు. రెండేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలితను గద్దె దింపలేకపోయింది. అందుకే, 2019 పార్లమెంటు ఎన్నికలు స్టాలిన్‌కు అగ్నిపరీక్ష వంటివి. మూడోసారి ఎన్నికల్లో డీఎంకేను గెలిపించ లేకపోతే స్టాలిన్‌కు ప్రమాదం ముంచుకొస్తుంది. అళగిరి పార్టీని చీల్చలేక పోయినా, స్టాలిన్‌ను ఇబ్బం దిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్న పేరెత్తని స్టాలిన్! అళగిరి విమర్శలకు స్టాలిన్ స్వయంగా స్పందించ లేదు. పార్టీ నేతలతోనే జవాబు చెప్పించారు. పార్టీపై స్టాలిన్ పట్టుకు తిరుగులేదనీ, పార్టీ నాయకత్వంలో అళగిరిని ఆయన వేలుపెట్టనివ్వరనే విషయం డీఎంకే వ్యవహారాలు గమనిస్తున్నవారందరికీ అర్థమైంది. మళ్లీ డీఎంకేలో చేర్చుకోవాలని డిమాండ్ చేసిన అళగిరి విషయంలో కరుకుగానే వ్యవహరించాలని పార్టీ నేతలు కోరారు. స్టాలిన్ పార్టీ మనిషి గానే వ్యవహరిస్తూ, కుటుంబ సంబంధాల ప్రభావం పార్టీపై పడకుండా చూడాలనేది వారి ఆకాంక్ష. సెప్టెంబర్ ఐదున తన మెరీనా యాత్రలో లక్ష మంది తన వెంట నడుస్తారని అళగిరి చెబుతున్నారు. అంత మంది జనం ఆయన వెంట రాక పోవచ్చుగాని, అళగిరి ర్యాలీ విజయవంతమైనట్టు కనిపించేలా చేయడానికి డీఎంకే వ్యతిరేక పార్టీలు తమ వంతు పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. జయలలిత మరణించాక ఏఐఏడీఎంకేలో వచ్చిన చీలిక, బల హీన నాయకత్వంలో పార్టీ నడవడాన్ని తమకు అను కూలంగా మార్చుకోవడానికి డీఎంకే ప్రయత్నిస్తున్నట్టే, డీఎంకేను నడిపే కరుణానిధి కుటుంబంలోని కీచులాటలను వాడుకోవడానికి కూడా అనేక శక్తులు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతానికి డీఎంకే నేతలు, కార్యకర్తలను చెప్పుకోదగ్గ సంఖ్యలో అళగిరి తనవైపుకు తిప్పుకోలేరు.. రెండేళ్ల క్రితం స్టాలిన్ అడ్డపంచె వదిలి ప్యాంటు, రంగు చొక్కా బదులు తెల్ల షర్టు వేసుకునేలా సలహాదారుల బృందం ఆయనను ఒప్పించింది. ఇలా ‘గెటప్’ మార్చితే తమిళనాడు యువతను వారిలా కనిపిస్తూ ఆకట్టుకోవవచ్చనేది ఈ సలహాబృందం అభిప్రాయం. కొత్త రూపంలోని స్టాలిన్ మీడియా తీసిన ఫొటోల్లో ఆసక్తికరంగానే కనిపించారుగాని ఎన్నికల్లో మాత్రం డీఎంకే గెలిచేస్థాయిలో ఓట్లు పడలేదు. కనీసం కరుణానిధి, జయలలిత లేని తమిళ రాజకీయక్షేత్రంలోనైనా ఎన్నికల్లో కొత్త అంశాలు జోడించి విజయానికి బాటలు వేయాలనే వత్తిడి స్టాలిన్‌పై పెరుగుతోంది. రెండేళ్లకు పైగా అధికారంలో ఉన్న పాలకపక్షమైన ఏఐడీఎంకేపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిపైనే పార్టీ గెలుపునకు పూర్తిగా ఆధారపడితే స్టాలిన్‌కు విజయం గ్యారంటీ అని చెప్పడం కష్టం. తన తండ్రి సీఎంగా అందించిన డీఎంకే పరిపాలన నాణ్యత తన నాయకత్వంలో బాగా మెరుగవుతుందని, సుపరిపాలనకు తన పార్టీ మంచి నమూనాగా నిలుస్తుందని స్టాలిన్ సరికొత్త ఇమేజ్‌తో ప్రజలను నమ్మించగలిగితేనే పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది. గతంలో మాదిరిగా పాలక పక్షంపై జనంలో పేరుకుపోయే వ్యతిరేకత ఈసారి డీఎంకే అధికారంలోకి రావడానికి తోడ్పడకపోవచ్చు. తమిళనాడులో 1984, 2016లో మినహా ప్రజలు అధికారంలో ఉన్న ద్రవిడ పార్టీలను ఓడించారు. డీఎంకే, ఏఐఏడీఎంకేలో ఈ రెండు సందర్భాల్లో తప్ప ప్రతిసారి ఒకదాని తర్వాత ఒకటి ఫోర్ట్ సెయింట్ జార్జిలో (తమిళ అధికారపీఠం ఉండే ప్రాంతం) అధికారం చేపట్టాయి. కరుడుగట్టిన ఏఐఏ డీఎంకే కార్యకర్తకు సీఎం పళనిస్వామి– ఓపీఎస్ నేతృత్వంలోని అసలు ఏఐఏడీఎంకేనుగాని, శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్ నాయకత్వంలోని చీలికవర్గమైన కొత్త పార్టీని(అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం)గాని ఎంచుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఏఐఏడీఎంకేలోని అసంతృప్తి జ్వాలలపైనే తమిళ నాడు ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి స్టాలిన్ పూర్తిగా ఆధారపడలేరనేది వాస్తవం. ఖాయంగా అధికారం లోకి రావాలంటే కొత్త సీసాలో పాత సారా పోసి చూపించకుండా, తమిళనాడు ప్రగతికి కొత్త విజన్ ఏమిటో స్టాలిన్ ప్రజలకు చెప్పగలగాలి. కొత్త పార్టీ పెట్టినా పెద్దగా లాభం ఉండదు! అళగిరి కొత్తగా పార్టీ పెట్టినా ఎన్నికల ఫలితాలపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపించే అవకాశం లేదు. ఎన్నికల్లో దక్షిణ తమిళనాడులో ఓట్లు చీల్చి డీఎంకేను ఓడించగలిగితే అళగిరికి అంతకన్నా ఆనందించే విషయం ఉండదు. ఈ లక్ష్య సాధనకు స్టాలిన్ రాజ కీయ ప్రత్యర్థులతో కలిసి పనిచేయడానికి కూడా ఆయన సిద్ధమే. ప్రస్తుతానికి ఏ రాజకీయ సంస్థతో అనుబంధం లేకుండా కనిపిస్తున్నాగాని కరుణానిధికి ప్రత్యామ్నాయ వారసునిగా అళగిరి తాను జనం ముందు కనిపించేలా ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత తనను తప్పనిసరిగా డీఎంకేలోకి తమ్ముడు స్టాలిన్ తీసుకునే పరిస్థితిని అళగిరి ఈలోగా సృష్టించగలగాలి. అంటే ఎన్నికల్లో తన వల్ల డీఎంకే దెబ్బతినేలా చూడాలి. రాజకీయంగా తన ఉనికి చాటాలనే ఆతృత ఆయనలో కనిపిస్తోంది. తన కొడుకులు, మనవళ్లకు డీఎంకేలో రాజకీయ, ఆర్థిక వారసత్వం, వాటా దక్కించుకోవాలనేది కూడా అళ గిరి కోరిక. భారీగా డబ్బున్న డీఎంకే నిర్వహణలోని ట్రస్టుల్లో అళగిరి కుటుంబసభ్యులెవరికీ సభ్యత్వం లేదు. ఆయనలో అసలు అసంతృప్తికి ఇదో ప్రధాన కారణం. అందుకే ఆయన కొంత తగ్గివచ్చి తమ్ముడికి కొత్త ప్రతిపాదన చేశారు. తనను డీఎంకేలోకి మళ్లీ తీసుకుంటే స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధమేనని ఇటీవల ప్రకటించారు. కరుణానిధి గోపా లపురం ఇంట్లో డీఎంకే ప్రథమ కుటుంబానికి సంబంధించి మరో కథ ప్రచారంలో ఉంది. కరు ణానిధి కన్నుమూసిన కొన్ని రోజులకే డీఎంకేలోకి తనను మళ్లీ చేర్చుకోవడానికి తన కుటుంబసభ్యుల ద్వారా అళగిరి ఒత్తిడి తెచ్చారట. తమ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచే బాధ్యత తనపై ఉందని చెప్పుకునే ఆయన సోదరి సెల్వికూడా తన వంతు ప్రయత్నం చేశారు. తన సోదరులిద్దరూ కలిసి ఉండేలా చూడ డానికి అమె గట్టి కృషి చేశారు. కాని, అళగిరిని మళ్లీ పార్టీలోకి రానిచ్చే ప్రసక్తి లేదని స్టాలిన్ తేల్చి చెప్పారు. ఆయనకు ఈ విషయంలో సవతి చెల్లెలు కనిమొళి, దగ్గర బంధువులైన మారన్ సోదరులు బాసటగా నిలబడ్డారు. తన తండ్రి మంచి ఆరో గ్యంతో ఉన్నప్పుడే మళ్లీ పార్టీలో చేరడానికి తాను గట్టి ప్రయత్నాలు చేయాల్సిందనీ, కాని ఆ పని చేయలేదని మదురైలోని తన మద్దతుదారులతో మాట్లాడుతూ అళగిరి తన బాధ వెళ్లబోసుకుంటు న్నారని తెలుస్తోంది. తన తండ్రి నిర్ణయం మార్చా ల్సిన అవసరం కనిపించడం లేదని స్టాలిన్ అంటు న్నారు. సోషల్ మీడియా అత్యంత చురుకుగా పని చేస్తున్న ఈ రోజుల్లో అళగిరి తరహా దురుసు రాజ కీయాల వల్ల పార్టీకి చేటేగాని లాభం ఉండదని భావి స్తున్నారు. డీఎంకే అగ్రనాయకత్వం కూడా అళగిరి మళ్లీ పార్టీలోకి రావాలని కోరుకోవడం లేదు. 2001లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినం దుకు అళగిరిని సస్పెండ్ చేశారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీకి వ్యతిరేకంగా పని చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. తనకు పలుకుబడి ఉన్న మదురై చుట్టుపక్కల ప్రాంతాల్లో డీఎంకే అభ్య ర్థుల ఓటమికి ఆయన పనిచేశారనే ఆరోపణలు న్నాయి. అళగిరి దెబ్బతో పరాజయం పాలైనవారిలో డీఎంకే సీనియర్ నేత పీటీఆర్ పళనిరాజన్ కూడా ఉన్నారు. ఆయన 1996–2001 మధ్య తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. మదురై పశ్చిమ స్థానంలో ఆయన కేవలం 708 ఓట్ల తేడాతో ఓడి పోయారు. అళగిరి 17 ఏళ్ల క్రితంలా ఇప్పుడు లేకున్నా డీఎంకేను దెబ్బదీయడానికి ఆయనకున్న శక్తియుక్తులను ఎవరూ తక్కువగా అంచనావేయడం లేదు. అళగిరి పొరపాటు చేశారా? అంటే అవుననే చెప్పాలి. తన తండ్రి మరణించాక ఆయన కొంత కాలం వేచి చూడాల్సింది. వారంలోపే దూకుడుగా మాట్లాడారు. ఎన్నికల్లో స్టాలిన్ బోల్తాపడే వరకూ ఆగి తర్వాతే అళగిరి విమర్శిస్తే బావుండేది. తొంద రపడి తన బలహీనత బయటపెట్టుకున్నారు. బుధ వారం ర్యాలీకి తెలిసిన నేతలు, జనం తగినంత మంది హాజరుకాకపోతే అళగిరి రాజకీయ జీవితం ముగిసినట్టేననుకోవచ్చు. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నా
మదురై: తనను డీఎంకే పార్టీలోకి తిరిగి చేర్చుకుంటే స్టాలిన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆ పార్టీ బహిష్కృత నేత, కరుణానిధి కొడుకు అళగిరి ప్రకటించారు. ‘మేం డీఎంకేలోకి రావాలనుకుంటున్నాం. అంటే, స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించినట్లే కదా?. నాతోపాటు నా కొడుకు దురై దయానిధి సైతం పార్టీలో ఎలాంటి స్థానం కల్పించినా పనిచేసేందుకు సిద్ధం’ అని అన్నారు. ‘వచ్చే నెల 5న చెన్నైలో కరుణానిధి సమాధి వద్ద ర్యాలీ తర్వాత కార్యాచరణను నిర్ణయిస్తాం. డీఎంకే అంటే1,500 మంది కౌన్సిల్ సభ్యులు మాత్రమే కాదు. అసలైన కేడర్ అంతా నాతో ఉంది’ అని అన్నారు. -
డీఎంకే చీఫ్ స్టాలిన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ప్రధాన పార్టీల్లో ఒకటైన ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) కొత్త అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు స్టాలిన్ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీని దాదాపు 50 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా నడిపిన కరుణానిధి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. దాంతో పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యమైంది. డీఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. కోశాధికారిగా సీనియర్ నేత దురైమురుగన్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్టాలిన్ ఎన్నికతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాయి. అధ్యక్ష, కోశాధికారి పదవులకు వరుసగా స్టాలిన్, దురైమురుగన్ మాత్రమే నామినేషన్ వేయడంతో వారి ఎన్నికల ఏకగ్రీవమైంది. స్టాలిన్‌కు మద్దతుగా పార్టీ తరఫున మరో 65 నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. స్టాలిన్‌కు ఆయన సోదరి,రాజ్యసభ సభ్యురాలు కనిమొళి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ తదితరులు స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సర్వసభ్య సమావేశంలో నిర్ణయం మంగళవారం ఉదయం పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి హాజరయ్యే ముందు స్టాలిన్ గోపాలపురంలోని కరుణ నివాసానికి వెళ్లి చిత్రపటానికి అంజలి ఘటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ అధ్యక్షతన ఉదయం 9.35 గంటలకు సమావేశం ప్రారంభం కాగా ముందుగా కరుణ మృతికి, కరుణ కన్నుమూయడాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపసూచకంగా మౌనం పాటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు తలా రూ.2 లక్షల చొప్పున రూ.4.96 కోట్లు పంపిణీ చేయాలని తీర్మానం ఆమోదించారు. కరుణానిధికి భారతరత్న బిరుదును ప్రదానం చేయాలని మరో తీర్మానం చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వ స్థానంలో డీఎంకేను అధికారంలోకి తెచ్చి స్టాలిన్‌ను సీఎం చేద్దాం అంటూ మరో తీర్మానం చేశారు. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని వాజ్‌పేయి, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ తదితరులకు సంతాపం తెలిపారు. మోదీ ప్రభుత్వాన్ని తరిమికొడదాం దేశాన్ని కాషాయమయం చేస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే అధ్యక్షుడి హోదాలో చేసిన తొలి ప్రసంగంలో స్టాలిన్ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘డీఎంకే అధ్యక్షునిగా నాకిది కొత్త జన్మ. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ నాకు పెద్దనాన్న వంటివారు. కరుణానిధిలా నేను మాట్లాడలేను, చేతకాదు. అయితే ఆయన ప్రయోగించిన భాషను ఒడిసిపట్టుకునే ధైర్యం, పట్టుదల నాలో ఉంది. అన్నాదురై, కరుణానిధి చూపిన మార్గంలో పయనిస్తూ కష్టపడి పనిచేస్తా. అధికార, విపక్షాల్లో ఎవరు తప్పుచేసినా నిలదీస్తాం’ అని స్టాలిన్ అన్నారు. 14 ఏళ్లకే రాజకీయాల్లోకి... కరుణానిధి వారసుడైనప్పటికీ స్టాలిన్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన 51 ఏళ్ల తర్వాత తన 65వ ఏట స్టాలిన్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. కరుణానిధి కూడా స్టాలిన్‌ను రాత్రికి రాత్రి అందలం ఎక్కించలేదు. 2006లో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పడు కరుణానిధి తలచుకుంటే స్టాలిన్‌కు ఏ ఆర్ధిక శాఖో కట్టబెట్టి ఉండవచ్చు. కానీ కరుణ అప్పుడు స్టాలిన్‌కు స్థానిక పరిపాలనా శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ శాఖ మంత్రిగా స్టాలిన్ విస్తృతంగా పల్లెల్లో తిరగాల్సి వచ్చింది. అదే ఆయనకు రాజకీయాల్లో ఎనలేని అనుభవాన్ని తెచ్చిపెట్టింది. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజాసమస్యలపై అవగాహన పెంచుకునే అవకాశం కలిగింది. ఎదిగింది ఇలా ... 1953, మార్చి 1న కరుణానిధి రెండవ భార్య దయాళు అమ్మాళ్కి స్టాలిన్ జన్మించారు. సోవియెట్ అధినేత స్టాలిన్ నివాళి సభలో కరుణ మాట్లాడుతుండగా తనకు కుమారుడు జన్మించాడన్న విషయం తెలియడంతో స్టాలిన్ అని పేరు పెట్టారు. ♦ 14 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. పాఠశాల విద్యార్థిగా ఉండగానే 1967 ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ♦ 1973లో స్టాలిన్ 20 ఏళ్ల వయసులో డీఎంకే జనరల్ కమిటీకి ఎంపికయ్యారు. ♦ ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద అరెస్ట్ కావడంతో స్టాలిన్ పేరు అందరికీ తెలిసింది. ♦ ఆ తర్వాత డీఎంకే యువజన విభాగాన్ని ఏర్పాటు చేశారు. 1984లో దానికి కార్యదర్శి పదవిని చేపట్టారు. 40 ఏళ్లపాటు అదే పదవిలో కొనసాగారు. ♦ 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ♦1996లో చెన్నై నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. అయితే 2002లో జయలలిత తమిళనాడు పురపాలక చట్టాలకు చేసిన సవరణలతో రెండు రాజ్యాంగబద్ధ పదవులు ఒకరే నిర్వహించకూడదన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో స్టాలిన్ మేయర్ పదవిని వదులుకున్నారు. ♦ 2003లో డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి అయ్యారు. సామాజిక న్యాయం, మూఢా చారాల నిర్మూలన, భాషా వికాసం వంటి సైద్ధాంతిక పునాదులపై పుట్టిన డీఎంకే పార్టీలో ఆధునికంగా కనిపించినవాడు స్టాలిన్. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ రాజకీయ నేతల ట్రేడ్ మార్క్ దుస్తులు ధోవతికి బదులుగా వెస్ట్రన్ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆకర్షించారు. -
డీఎంకేలో చేర్చుకోకుంటే ఖబడ్దార్: అళగిరి
మదురై: డీఎంకేలోకి తనను మళ్లీ చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తన సోదరుడు, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను బహిష్కృత నేత అళగిరి హెచ్చరించారు. మంగళవారం డీఎంకే అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరగనున్న డీఎంకే సర్వసభ్య సమావేశంలో స్టాలిన్ ఎన్నిక లాంఛనమే కానుంది. పార్టీలోకి తనను చేర్చుకోకుంటే సెప్టెంబర్ 5న చెన్నైలో తలపెట్టిన ర్యాలీలో తన సత్తా ఏంటో చూపిస్తానని అళగిరి అన్నారు. కరుణానిధికి నివాళులర్పించేందుకు నిర్వహిస్తోన్న ఈ ర్యాలీకి పార్టీ కార్యకర్తలు తన నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. కరుణానిధి మరణం తర్వాత పార్టీని కాపాడటానికే తాను ఇవన్ని చేస్తున్నానని విలేకరులతో చెప్పారు. -
కరుణ సమాధి పక్కనే నాది ఉండేది!
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరణంతో మంగళవారం చెన్నైలో జరిగిన కార్యవర్గ అత్యవసర సమావేశం ఉద్వేగభరితంగా సాగింది. కరుణ కొడుకు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఈ సందర్భంగా పలుమార్లు తండ్రిని గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ‘చెన్నై మెరీనా బీచ్‌లో కలైజ్ఞర్‌కు సమాధి స్థలం దక్కకుంటే ఏమై ఉండేదని నన్ను చాలామంది అడిగారు, ఏముంది.. కరుణ సమాధి పక్కనే నాదీ ఉండేది. కానీ, ఆ అవసరం రాలేదు’ అని ఈ సందర్భంగా స్టాలిన్ అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బగళన్ సమక్షంలో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి దురైమురుగన్, కనిమొళి, టీఆర్‌బాలు తదితర ముఖ్య నేతలతోపాటు జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు. సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టగానే అందరూ లేచి రెండు నిమిషాలు మౌనం పాటించారు. సంతాప తీర్మానంలో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కరుణానిధి సాధించిన విజయాలు, తీసుకున్న సంచలన నిర్ణయాలు, ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. అధినేతతోపాటు తండ్రిని కోల్పోయా పలువురు పార్టీ నేతల ప్రసంగాల అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ.. ‘మీరంతా పార్టీ అధినేతను మాత్రమే కోల్పోయారు. కానీ, నేను అధినేతతో పాటు తండ్రికి సైతం దూరమయ్యా. గత ఏడాదిన్నరగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నపుడు నన్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. మీ అందరి సహకారంతో పార్టీ కార్యకలాపాలను నెట్టుకొస్తున్నా. పార్టీలో పునరుత్తేజం కోసం ప్రయత్నించా. ఆయనను పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చా. డీఎంకేను మళ్లీ గెలిపించి అధికారం ఆయన చేతిలో పెట్టాలని అహర్నిశలు కృషి చేశా. అన్నా సమాధి పక్కనే కలైజ్ఞర్ సమాధి ఉండాలని నిర్ణయించాం. ఇది మన ఆశ కాదు, కరుణ కోరిక. అయితే కరుణ చివరి కోర్కెను తీర్చేందుకు ఈ ప్రభుత్వం నిరాకరించింది. సీఎం చేతులు పట్టుకుని బతిమాలినా సానుకూలంగా స్పందించకుండా ‘చూద్దాం’ అని మాత్రమే సమాధానమిచ్చారు. దురై మురుగన్‌ను పంపినా స్పందించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించాం. ఒకవేళ మెరీనా బీచ్‌లో సమాధికి స్థలం కేటాయించకుంటే ఏమయ్యేదని అందరూ ప్రశ్నించారు. ఏముంది.. కరుణ సమాధి పక్కనే నన్ను సమాధి చేయాల్సి వచ్చేదని చెప్పా. కానీ, ఆ పరిస్థితి రాలేదు. కరుణ జీవించిఉన్నపుడేకాదు మరణించిన తర్వాతా గెలిచారు. ఆయన పార్టీని కాపాడుకుందాం, కరుణ ఆశయాలు సాధించేలా ప్రతినబూనాలి’ అని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఆయన తన ప్రసంగంలో తరచూ ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సమావేశంలో ప్రసంగించిన నేతలంతా పార్టీ అధ్యక్షుడుగా స్టాలినే ఉండాలని కోరుకుంటున్నామని స్పష్టంచేశారు. -
రజనీకాంత్ పార్టీలోకి అళగిరి?
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి మరణాంతరం ఆ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చీనీయాంశమైంది. నిజమైన డీఎంకే కార్యకర్తలు తన వెంటే ఉన్నారని, డీఎంకేకి తానే అసలైన నాయకుడినని ఇటీవల అళగిరి సంచలన వ్యాఖ్యలకు తెరలేపిన విషయం తెలిసిందే. దీంతో డీఎంకేలో ఎంకే స్టాలిన్, అళగిరి మధ్య వారసత్వం పోరు జరుగుతోందన్న విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలన వార్త వినిపిస్తోంది. డీఎంకేలో నేతలంతా తనకు వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తోన్న అళగిరి.. రజనీకాంత్‌కు చెందిన పార్టీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కరుణానిధి మృతి అనంతరం చెన్నైలోని కావేరి ఆసుపత్రికి వచ్చిన రజనీకాంత్.. అళగిరి, స్టాలిన్‌లతో కూడిన రెండు పోటోలను డీఎంకే సోమవారం విడుదల చేసింది. దానిలో రజనీకాంత్ అళగిరితో ఎంతో సన్నిహితంగా మాట్లాడుతుండగా, మరో ఫోటోలో స్టాలిన్‌తో మాట్లాడడం మాత్రం ఎంతో ఇబ్బందికరంగా ఫీలయినట్లు తెలుస్తోంది. కాగా రజనీకాంత్ పార్టీ ప్రారంభించిప్పుడు కరుణానిధిని కలిసి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్, అళగిరి మధ్య స్నేహం కుదిరిందని, డీఎంకేలో తనకు ప్రాధాన్యత లేనందున రజనీకాంత్‌తో కలిసి వెళ్తారనే వార్తలు తమిళనాట వినిపిస్తున్నాయి. ఇదిలా వుండగా నేడు జరగనున్న డీఎంకే కార్యవర్గ సమావేశంలో పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న స్టాలిన్నే పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే అళగిరి మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. -
డీఎంకేలో ఆధిపత్యం కోసం అన్నదమ్ముల పోరు
-
డీఎంకేలో మళ్లీ అన్నదమ్ముల పోరు
సాక్షి, చెన్నై: పార్టీకి నమ్మకస్తులైన కార్యకర్తలంతా తనతోనే ఉన్నారనీ, తనను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే డీఎంకే తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లేనని కరుణానిధి పెద్ద కొడుకు, బహిష్కృత పార్టీ నేత అళగిరి సోమవారం వ్యాఖ్యానించారు. పార్టీపై ఆధిపత్యం విషయంలో కరుణానిధి మరో కొడుకు స్టాలిన్, అళగిరిల మధ్య గొడవల నేపథ్యంలో 2014లో అళగిరిని, ఆయన మద్దతుదారులను కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం స్టాలిన్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుకాగా, కరుణ మరణంతో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలుచేపట్టే వీలుంది. సోమవారం చెన్నైలో కరుణ సమాధి వద్ద నివాళులర్పించాక అళగిరి మీడియాతో మాట్లాడారు. తాను డీఎంకేలోకి తిరిగి రాకుండా స్టాలిన్ అడ్డుకుంటున్నారన్నారు. ‘కరుణ నిజమైన అభిమానులు, మద్దతుదారులంతా నా పక్షానే ఉన్నారు. సమయమే సమాధానం చెబుతుంది’ అని అన్నారు. దక్షిణ తమిళనాడులో అళగిరికి మంచి పట్టు ఉంది. డీఎంకేలోని అనేక మంది నేతలు సూపర్‌స్టార్ రజినీకాంత్‌తోనూ సంప్రదింపుల్లో ఉన్నారని ఆరోపించారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోతే ఇక పార్టీ నాశనమైనట్లే. అప్పుడు కరుణానిధి ఆత్మ వారిని శిక్షిస్తుంది. ఊరికే వదిలిపెట్టదు’ అని అన్నారు. ఆయన మా పార్టీ మనిషి కాదు ‘అళగిరి మా పార్టీ మనిషి కాదు. ఆయన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు’ అని ఎమ్మెల్యే అన్బళగన్ అన్నారు. డీఎంకేలో అందరూ ఐక్యంగానే ఉన్నారనీ, స్టాలిన్ వెన్నంటే ఉంటామన్నారు. డీఎంకే సీనియర్ నేత దురై మురుగన్ సైతం ఇదే తరహాలో స్పందించారు. -
ఎట్టకేలకు మెరీనా తీరంలోనే..
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కలైంజర్ కరుణానిధి అంతిమ సంస్కారాలు, సమాధి ఎక్కడనే వివాదానికి తెరపడింది. ఈ సందర్భంగా అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్ష డీఎంకే మధ్య హైడ్రామా నడిచింది. ఇరుపక్షాల వాదోపవాదాల అనంతరం చెన్నై మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి పక్కనే స్థలం కేటాయించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు బుధవారం ఆదేశించింది. మెరీనా బీచ్‌లో కరుణ అంతిమ సంస్కారాలకు స్థలం కేటాయించాల్సిందిగా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ మంగళవారం చేసిన వినతిని తమిళనాడు ప్రభుత్వం మొదట తిరస్కరించిన విషయం తెలిసిందే. బీచ్ తీరంలో సమాధులపై మద్రాసు హైకోర్టులో కేసులు, తద్వారా చట్టపరమైన చిక్కులు ఉన్నందున చెన్నై గిండీలోని గాంధీ మండపం పక్కనే రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తున్నట్లు సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రకటించారు. అయితే ఇందుకు డీఎంకే సహా అన్ని ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. చివరకు డీఎంకే నిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతి చేత మంగళవారం రాత్రి 9.20 గంటలకు మద్రాసు హైకోర్టు ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి కే.రమేష్, న్యాయమూర్తి సుందర్ సమక్షంలో స్టాలిన్ అత్యవసర పిటిషన్ దాఖలు చేయించారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. అభ్యంతర పిటిషన్లు వెనక్కు..: బీచ్‌లో సమాధులపై తాను వేసిన నాలుగు పిటిషన్లను కరుణ కోసం వెనక్కు తీసుకునేందుకు సిద్ధమని సీనియర్ న్యాయవాది దురైస్వామి ప్రకటించారు. అలాగే పీఎంకే నేత వేసిన పిటిషన్ సైతం ఉపసంహరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో స్టాలిన్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు మంగళవారం రాత్రి 10.30 గంటలకు విచారణ ప్రారంభించారు. ఈ వివాదంపై బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల వరకు విచారణ జరిపి ఉదయం 8 గంటలకు వాయిదా వేశారు. . అభ్యంతర పిటిషన్లు అన్నింటినీ ఉపసంహరించిన కారణంగా మెరీనాబీచ్‌లో కరుణ సమాధికి అనుమతిస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులిచ్చింది. కన్నీటి పర్యంతమైన స్టాలిన్ మెరీనాబీచ్‌లో కరుణ సమాధికి కోర్టు ఆదేశాలు జారీచేసినట్లు తెలియగానే.. రాజాజీ హాల్లో కరుణ పార్థివదేహం పక్కన నిల్చుని ఉన్న స్టాలిన్ కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే ఉన్న దురైమురుగన్, కనిమొళి తదితర నేతలు స్టాలిన్‌ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అన్నాదురై సమాధి పక్కనే కరుణ సమాధికి అనుమతి వచ్చినట్లు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మైకులో ప్రకటించడంతో కార్యకర్తలు, ప్రజలు శాంతించారు. -
స్టాలిన్‌కు సోనియా లేఖ
న్యూఢిల్లీ : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణం పట్ల యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘కలైంగర్ నా తండ్రి లాంటివారు. అటువంటి గొప్ప నాయకుడిని ఇక ముందు చూడలేం. దేశం కోసం, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. తెలివైన నాయకత్వంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారంటూ..’ కరుణానిధి కుమారుడు స్టాలిన్‌కు సోనియా భావోద్వేగ పూరిత లేఖ రాశారు. కాగా మంగళవారం సాయంత్రం చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరుణానిధి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆయన ఖననానికి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. -
కరుణ మాటే వేదవాక్కు
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబం చాలా పెద్దది. ఆయనకు ముగ్గురు భార్యలు. తొలి భార్య పద్మావతి అమ్మాళ్, రెండో భార్య దయాళు అమ్మాళ్, మూడో భార్య రాజాత్తి అమ్మాళ్. వీరిలో పద్మావతి అమ్మాల్ జీవించి లేరు. పద్మావతి అమ్మాల్, కరుణకు ఓ కుమారుడు.. ముక్కా ముత్తు. ఈయనే కుటుంబానికి పెద్ద కుమారుడు. అయితే, ఈయన కరుణానిధికి పూర్తి వ్యతిరేకం. గాయకుడిగా, డ్యాన్సర్‌గా పేరు సంపాదించిన ముత్తు కరుణ సహా ఇతర కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు. గతంలో అన్నాడీఎంకేలో చేరి వ్యతిరేక ప్రచారం నిర్వహించారు. దయాళు అమ్మాల్‌కు ఎంకే అళగిరి, ఎంకే స్టాలిన్, తమిళరసన్.. ముగ్గురు కుమారులు, సెల్వి కుమార్తె. వీరిలో అళగిరి, స్టాలిన్ రాజకీయంగా అందరికీ సుపరిచితులే. రాజాత్తి అమ్మాల్‌కు ఒకే కుమార్తె కనిమొళి. గారాల పట్టిగా కనిమొళికి కరుణ హృదయంలో ప్రత్యేక స్థానముంది. డీఎంకే మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా, ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఇక, కరుణానిధికి అరివునిధి, దురై దయానిధి, ఉదయనిధిలు మనవళ్లు. వీరిలో అరివునిధి ముత్తు తనయుడు. దయానిధి అళగిరి కుమారుడు. ఇక, డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ కుమారుడే ఉదయనిధి. ఈయన సినీ హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక, అళగిరి కుమార్తె కయల్ వెలి, స్టాలిన్ కుమార్తె సెంతామరైలు కరుణానిధికి మనవరాళ్లు. అలాగే, మేనల్లుడు దివంగత మురసోలి మారన్‌పై కరుణానిధికి ప్రేమ ఎక్కువే. అందుకే ఆయన కుమారులు దయానిధి మారన్, కళానిధి మారన్‌ను తన కుటుంబీకులతో సమానంగానే చూసుకుంటూ వచ్చారు. మనవళ్లు, మనవరాళ్లనే కాదు, మునిమనవళ్లతో ఆడుకున్న కరుణ, ఇటీవల మనోరంజిత్ అనే మునిమనవడి వివాహానికి పెద్దగా వ్యవహరించారు. రాజకీయంగా స్టాలిన్, అళగిరి మధ్య విభేదాలున్నా, కుటుంబ విషయానికి వచ్చేసరికి అందరికీ కరుణ మాటే వేదవాక్కు. -
డీఎంకే పగ్గాలు స్టాలిన్‌కే
సాక్షి, చెన్నై: కరుణానిధి రాజకీయ వారసుడిగా ఆయన చిన్న కుమారుడు ఎం.కె. స్టాలిన్ డీఎంకే పగ్గాలు చేపట్టడం లాంఛనంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ నిర్వాహక అధ్యక్షుడైన స్టాలిన్ డీఎంకేపై ఇప్పటికే పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. పార్టీలో మరోసారి చీలిక ఏర్పడకుండా తన సోదరుడు, కరుణ పెద్ద కుమారుడు అళగిరి వర్గాన్ని తనవైపు తిప్పుకున్నారు. స్టాలిన్‌ను ఢీకొనే నాయకులెవరూ పార్టీలో లేకపోవడంతో ఆయన పగ్గాలు అందుకునేందుకు ఎవరి నుంచీ వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం దాదాపు లేనట్లే. చక్రం తిప్పిన కరుణ... డీఎంకేలో 50 ఏళ్లపాటు కరుణ చక్రం తిప్పారు. దివంగత ఎంజీఆర్ రూపంలో డీఎంకేలో చీలిక వచ్చినా ఆ తదుపరి పరిణామాలతో పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకున్నారు. తన ప్రాణ మిత్రుడు అన్బళగన్‌ను ప్రధాన కార్యదర్శిని చేశారు. అయితే చిన్న కుమారుడు స్టాలిన్‌ను రాజకీయ తెరపైకి తెచ్చిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో 1994లో డీఎంకే మరోసారి చీలింది. ఆ సమయంలో పార్టీలో సీనియర్‌గా ఉన్న వైగో ఎండీఎంకేను ఏర్పాటు చేశారు. డీఎంకే ఎన్నికల చిహ్నం ‘ఉదయించే సూర్యుడి’ కోసం ఇరు పార్టీల మధ్య పెద్ద సమరమే సాగినా చివరకు దాన్ని కరుణ సొంతం చేసుకున్నారు. తద్వారా డీఎంకే కోటను కైవశం చేసుకోవడం ఎవరితరం కాదని చాటారు. క్రమంగా స్టాలిన్‌కు రాజకీయ ప్రాధాన్యతను పెంచుతూ వచ్చిన సమయంలో పెద్ద కుమారుడు అళగిరి రూపంలో ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2006 అసెంబ్లీ ఎన్నికల తదుపరి వయోభారం కారణంగా స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవిని కట్ట బెట్టారు. అదే సమయంలో పెద్ద కుమారుడికి న్యాయం చేసేందుకు ఆయన్ను దక్షిణ తమిళనాడు పార్టీ వ్యవహారాల కార్యదర్శిగా నియమించారు. అయితే అన్నదమ్ముల మధ్య రాజకీయ సమరం ముదురుతూ రావడంతో తన బలాన్ని పెంచుకు నేందుకు స్టాలిన్ అడుగులు వేశారు. ఇందుకు తెర వెనుక నుంచి కరుణ సహకారం అందించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో అళగిరి మదురై ఎంపీగా గెలిచాక ఆయన్ను కేంద్ర మంత్రిని చేసి (యూపీఏ కూటమి ద్వారా) స్టాలిన్‌ను పార్టీలో అందలం ఎక్కించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారంటూ అళగిరిపై బహిష్కరణ వేటు వేయించారు. చివరకు వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలను కరుణానిధి స్టాలిన్‌కు పూర్తిగా అప్పగించారు. -
ఆయన నిజమైన లెజెండ్
ఓ రాజకీయ చాణక్యుడు.. ఓ ద్రవిడ పోరాట యోధుడు.. ఓ సాహితీ దిగ్గజం.. కథకుడు.. కళాకారుడు.. పాత్రికేయుడు.. ఒక్కడిలో ఇన్ని కోణాలా? అవును.. ఆయనది చిన్నతనం నుంచే పోరాట పంథా.. ధిక్కార స్వభావం.. సవాళ్లకు ఎదురొడ్డి నిలిచే తత్వం.. వెరసి తమిళ చరిత్ర పుటల్లో ఓ చెరగని అధ్యాయం! అందుకే ఆయన తమిళుల మదిలో చెరగని ముద్ర వేసిన కలైజ్ఞర్ చిన్నతనం నుంచేధిక్కార స్వభావం అద్భుత వాగ్ధాటితో అందరి మన్ననలు పెరియార్ పరిచయంతోమలుపు తిరిగిన జీవితం.. పేరు దక్షిణామూర్తి.. అందరికీ తెలిసిన పేరు ఎం.కరుణానిధి. ఓ తెలుగు సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించిన కరుణానిధి తమిళుల గుండెల్లో కలైజ్ఞర్‌గా చిరస్థాయిగా నిలిచిపోయారు. తమిళనాడు వంటి సంక్లిష్ట రాజకీయాల్లో పదమూడు సార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన జీవిత ప్రస్థానంలో ఎన్నెన్నో మలుపులు.. మరెన్నో సంఘర్షణలు.. కలైజ్ఞర్‌గా... తన పేరు కంటే కలైజ్ఞర్(నటుడు)గానే అభిమానులకు, ప్రజలకు కరుణానిధి ప్రసిద్ధులు. కలైజ్ఞర్ కరుణానిధి అంటూ ఆయన ఇంటి పేరుగా మారిన ఈ పదం నిజానికి బిరుదు. ఉడన్ పెరప్పు కడిదం (నాతోబుట్టువులకు లేఖ) నినాదంతో కరుణ రాసిన ఓ రచన అప్పట్లో ప్రజల మదిని దోచుకుంది. దీని తర్వాత తూక్కుమేడై (ఉరి కంబం) నాటికను కరుణ రచించి.. నటించారు. ఈ నాటికను చూసి మంత్రముగ్ధుడైన నటుడు ఎంఆర్ రాధా (నటి రాధిక తండ్రి) ఆయనకు కలైజ్ఞర్ బిరుదును ప్రదానం చేశారు. ఆ బిరుదే నేడు కలైజ్ఞర్...కలైజ్ఞర్ అంటూ ప్రజల మదిలో నిలిచిపోయింది. హెడ్మాస్టర్తో కొట్లాట తిరుక్కువలై గ్రామంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్న కరుణానిధి.. తర్వాత తిరువారూరులోని ఉన్నత పాఠశాలలో చేరేందుకు వెళ్లారు. అయితే ఆరో తరగతిలో సీటు ఇచ్చేందుకు ప్రధానోపాధ్యాయుడు కస్తూరి అయ్యంగార్ నిరాకరించారట. దీంతో ఆయనను బెదిరించి మరీ సీటు దక్కించుకున్నారట కరుణానిధి. తన తొలి పోరాటాన్ని ఆనాడే ప్రారంభించారాయన. చచ్చిపోయాడని వదిలేశారు.. 1945లో పుదుక్కోట్టైలో జరిగిన ద్రవిడ మహానాడుకు వెళ్లి.. కవి భారతి దాసన్, కంచి కల్యాణ సుందరంతో కలసి వస్తున్న కరుణానిధిని ఓ ముఠా చుట్టుముట్టింది. శివగురు నాటికలో తమ వారిని కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ కరుణ మీద దాడి చేసింది. స్పృహ కోల్పోయిన కరుణను చూసి మృతి చెందారనుకుంది ఆ ముఠా. ఆయనను తీసుకెళ్లి ఓ బురద కుంటలో పడేసి వెళ్లిపోయింది. మరుసటి రోజు కరుణ మారువేషంలో పెరియార్ వద్దకు వెళ్లి జరిగింది వివరించారు. తర్వాత పుడి అరసు అనే వార పత్రికలో సంపాదకుడిగా పనిచేస్తూ రాజకీయ పోరాటల్లో చురుగ్గా పాల్గొనడం మొదలెట్టారు. మదురైలో జరిగిన ఓ పోరాటంలో ప్రభుత్వ చట్టానికి సంబంధించిన ప్రతులను తగల పెట్టడంతో కరుణ మీద తొలి కేసు నమోదైంది. సొంతూరంటే ప్రాణం నాగపట్నం జిల్లాలోని తిరుకువలైలో కరుణ జన్మించారు. ఒకప్పుడు కుగ్రామమైన ఆ ఊరు.. ఇప్పుడు తాలుకాగా మారింది. చూడటానికి నేటికీ చిన్న గ్రామంగానే కనిపిస్తున్నా అక్కడ అభివృద్ధి ఘనమే. సొంత ఊరిలో ఆస్పత్రులు, విద్యాలయాలు నెలకొల్పారు కరుణ. అన్ని రకాల వసతులే కాదు, తాను పుట్టిన ఇంటినీ గ్రంథాలయంగా మార్చేశారు. అందుకే 2011, 2016 ఎన్నికల్లో సొంత గడ్డ నుంచి పోటీ చేసి అసెంబ్లీ మెట్లెక్కారు. ఆరోగ్యంగా ఉన్నపుడు స్వస్థలానికి ఏడాదిలో ఒకటి రెండు సార్లయినా వెళ్లేవారు. తిరుకువలై నుంచి ఎవరొచ్చినా కరుణ నివాసం గోపాలపురం ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. చిన్నతనం నుంచే అద్భుత వాగ్ధాటి 1924 జూన్ 3న తిరువారూరు జిల్లా తిరుక్కువలై గ్రామంలో ముత్తువేల్, అంజుగమ్మ, దంపతులకు జన్మించిన కరుణానిధి అదే ఊరిలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివారు. తర్వాత తిరువారూరులోని ఉన్నత పాఠశాలలో అడుగుపెట్టారు. ఇక్కడ్నుంచే ఆయన పోరాట పటిమను అలవర్చుకున్నారు. 1938లో సహచర విద్యార్థులను వెంటేసుకుని హిందీ వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఓ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా సహచర విద్యార్థులకు వాక్ చాతుర్యంపై పట్టు సాధించేందుకు శిక్షణ అందించారు. 1942లో తమిళ విద్యార్థి సంఘం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం కోసం తన వద్ద ఉన్న బంగారం చైన్‌ను కుదవపెట్టి మరీ వేడుకల్ని దిగ్విజయం చేశారు. ఇందులో ఆయన చేసిన ప్రసంగంతో యువత, జనం మంత్రముగ్ధులయ్యారు. అదే ఏడాదిలో ద్రవిడనాడు మూడో వార్షికోత్సవానికి కరుణ రాసిన ఓ కవిత అందరి మన్ననల్ని అందుకుంది. రాజకీయ అరంగేట్రానికి ఈ కవితే నాంది పలికిందని చెప్పవచ్చు. తిరువాయూర్లో జరిగిన ఓ వేడుకకు హాజరైన అన్నాదురై ఈ కవితను చూసి అబ్బురపడ్డారు. కరుణను పిలిపించి మరీ అభినందించారు. అదే ఏడాది మురసోలి అనే మాసపత్రికను స్థాపించిన కరుణానిధి ‘చేరన్’ పేరిట వ్యాసాలు రాయడం మొదలెట్టారు. పెరియార్‌తో పయనం.. 1944లో తిరువారూరులోని బేబి టాకీస్‌లో పళనియప్పన్ అనే నాటిక ప్రదర్శనతో కరుణానిధి నాటక రంగంలోకి అడుగుపెట్టారు. ఈ నాటకాన్ని తానే రచించి దర్శకత్వం వహించారు. ఈ సమయంలో ఆరూర్‌లో జరిగిన ‘స్వీయ మర్యాద’ సంఘం వార్షికోత్సవానికి హాజరైన పెరియార్ దృష్టిలో పడ్డారు. మురసోలి పత్రికల్లో వస్తున్న కథనాల్ని చూసిన పెరియార్.. కరుణలో ఉన్న ప్రతిభను గుర్తించారు. అప్పట్నుంచి పెరియార్‌తో కలిసి వేదికలపై కరుణ ప్రసంగాలు సాగాయి. ఇదే రాజకీయాల వైపు అడుగులు పడేందుకు దోహదం చేసింది. అదే ఏడాది ద్రవిడ నటుల సంఘాన్ని ఏర్పాటు చేíయడంతో పాటు విల్లుపురంలో పళనియప్పన్ అనే నాటకాన్ని ప్రదర్శించి, అందులో ముఖ్య పాత్రను కరుణ పోషించారు. అదే ఏడాది పద్మావతి అమ్మాళ్‌ను వివాహం చేసుకున్నారు. డీకే పార్టీలో చురుగ్గా.. 1945లో పుదుకోట్టైలో జరిగిన ద్రవిడ మహానాడుకు వెళ్లి వస్తుండగా ఓ ముఠా కరుణపై దాడి చేసింది. ఈ ఘటన తర్వాత పెరియార్ వద్దకు వెళ్లి కరుణ జరిగిన విషయాన్ని వివరించారు. అదే రోజు నుంచి కరుణ జీవితం పూర్తిగా రాజకీయాలకు అంకితమైంది. పుడి అరసు అనే వార పత్రికలో సంపాదకుడిగా పనిచేస్తూ రాజకీయ ఉద్యమాల్లో దూసుకెళ్లడం మొదలెట్టారు. మదురైలో జరిగిన ఓ ఆందోళనలో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఓ చట్టానికి సంబంధించిన ప్రతులను తగలబెట్టారు. ఇందుకు కరుణపై తొలి కేసు నమోదైంది. 1946లో ద్రవిడ కళగం(డీకే) పార్టీ పతకానికి చిహ్నం రూపొందించిన కరుణానిధి తొలిసారిగా పార్టీ కార్యక్రమాల్లో క్రియా శీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ‘రాజకుమారి’ చిత్రానికి కథ, మాటలు రాసి సినీరంగంపై కూడా దృష్టి పెట్టారు. పద్మావతి అమ్మాళ్ మరణానంతరం 1948లో దయాళు అమ్మాల్‌ను కరుణ రెండో వివాహం చేసుకున్నారు. 1949లో సేలం మోడరన్ థియేటర్లో రికార్డింగ్ సందర్భంగా అప్పటి నటుడు ఎన్ఎస్ కృష్ణన్‌తో ఏర్పడ్డ పరిచయం స్నేహింగా మారి సినీ రంగంలో స్థిరపడేందుకు కరుణకు మార్గాన్ని చూపింది. అదే ఏడాది మైనర్ అయిన మునియమ్మను పెరియార్ పెళ్లి చేసుకోవడంతో ద్రవిడ కళగం పార్టీలో చిచ్చు రగిలింది. డీఎంకే ఆవిర్భావం ద్రవిడ కళగం పార్టీలో వివాదం డీఎంకే ఆవిర్భావానికి దారి తీసింది. పెరియార్‌కు శిష్యుడిగా ఉన్న కరుణానిధి అన్నాదురై వెంట నడిచారు. అన్నాకు తమ్ముడిగా డీఎంకే ఏర్పాటుతో కరుణ పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యారు. పార్టీ ప్రచార కార్యదర్శి బాధ్యతల్ని భుజాన వేసుకుని తిరుచ్చి, తంజావూరుల్లో జరిగిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. నాటి ప్రధాని రాజాజీకి వ్యతిరేకంగా నల్ల జెండా ఎగురవేసి అందరి దృష్టిలో పడ్డారు. తంజావురులో అప్పట్లో తుపాన్ బాధితుల్ని ఆదుకోవడం కోసం ప్రత్యేకంగా నిధుల్ని సేకరించారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగు.. 1957లో జరిగిన ఎన్నికల్లో తిరుచ్చి జిల్లా కులితలై నియోజకవర్గం నుంచి పోటి చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. రామనాథపురంలో జరిగిన డీఎంకే మహానాడులో ‘ఉదయ సూర్యన్’ (ఉదయించే సూర్యుడు) నాటకాన్ని రచించిన కరుణ ఆ తర్వాత ఓటమి అన్నది లేకుండా ముందుకు సాగారు. 1962లో తంజావూరు నుంచి పోటీ చేసి విజయం సాధించిన కరుణ శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. 1963లో కరుణ ఉద్యమ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ అన్నాదురై ‘వీర’ కత్తిని బహూకరించారు. 1965లో అప్పటి భారత రక్షణ చట్టం కేసులో అరెస్టు అయిన కరుణను పాళయం కోట్టై జైల్లో బంధించారు. అక్కడ్నుంచే ఆయన కాంగ్రెస్ అరాచకాల్ని ఎండగడుతూ ‘కాగిత పువ్వు’ నాటకాన్ని రచించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో చెన్నై సైదాపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన్ను మంత్రి పదవి వరించింది. తొలిసారి సీఎంగా.. అన్నాదురై మరణంతో 1969 మార్చిలో తొలిసారి ముఖ్యమంత్రిగా కరుణానిధి పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన పార్టీ రాష్ట్ర మహానాడులో డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. (అప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీకి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు) నాటి పాండిచ్చేరి (పుదుచ్చేరి)లో డీఎంకే పార్టీ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. చెన్నై మెరీనా తీరంలో అన్నాదురై సమాధిని సుందరంగా తీర్చిదిద్దారు. 1971లో బ్రిటన్, ప్రాన్స్, జర్మనీ, రోమ్, అమెరికాలో పర్యటించి అక్కడి సభల్లో ప్రసంగించారు. అదే ఏడాది సైదాపేట నియోజకవర్గం నుంచి మళ్లీ ఎన్నికై, రెండోసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఒకే గూటిలో రెండు సింహాలు కరుణ(vs)ఎంజీఆర్ సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకేను రాజకీయంగా పరుగులు పెట్టించిన కరుణానిధి.. ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) నేతృత్వంలోని అన్నాడీఎంకే పుట్టుకకూ పరోక్షంగా కారణమయ్యారు. డీఎంకేలో అన్నాదురై తర్వాత కరుణానిధికి అంతటి ప్రాధాన్యం ఉండేది. అయితే సినిమా హీరోగా అప్పటికే విపరీతమైన క్రేజున్న ఎంజీఆర్ అన్నాదురై సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై.. 1953లో డీఎంకేలో చేరి కోశాధికారి పదవి నిర్వర్తించారు. ఈ క్రమంలో ఓసారి తిరుచ్చిరాపల్లిలో డీఎంకే బహిరంగ సభ జరిగింది. వేదికపై అన్నాదురై, కరుణానిధి తదితర ప్రముఖులున్నారు. అంతవరకు స్తబ్ధుగా ఉన్న జనం.. ఎంజీఆర్ రాగానే ఉత్సాహం ప్రదర్శించారు. తర్వాత నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు ఎంజీఆర్‌ను ‘ముజీబ్ ఆఫ్ తమిళనాడు’అని కీర్తించడం మొదలైంది. కానీ ఎంజీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టడం కరుణకు ఇబ్బందిగా మారింది. ఒకే బోనులో (పార్టీలో) రెండు సింహాల్లా ఆధిపత్య పోరు మొదలైంది. క్రమేపీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. 1969లో అన్నాదురై మరణం తర్వాత పార్టీ పగ్గాలు కరుణ చేతుల్లోకి రావడంతో మనస్పర్థలు మరింత పెరిగాయి. కరుణపై అవినీతి ఆరోపణలు చేయడమే గాక, 1972లో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించాలని పార్టీ శ్రేణులకు ఎంజీఆర్ పిలుపునివ్వడంతో ఆయనను జనరల్ కౌన్సిల్ నుంచి కరుణ సస్పెండ్ చేశారు. ఇదే అదనుగా డీఎంకే నుంచి బయటకు వచ్చిన ఎంజీఆర్.. 1972 అక్టోబర్ 17న అన్నాడీఎంకేను స్థాపించారు. డీఎంకే పుట్టుకతో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోగా.. అన్నాడీఎంకే ఆవిర్భావంతో డీఎంకేకు గట్టి పోటీ మొదలైంది. ఎంజీఆర్ ఉన్నంత కాలం అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మెజార్టీ సాధించలేకపోయింది. ఎమర్జెన్సీలో కుప్పకూలిన ప్రభుత్వం 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో కరుణ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో కరుణ.. ఇందిర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిసూ పెద్ద ఉద్యమాన్నే నడిపి జైలు పాలయ్యారు. తర్వాత కొత్త ఫ్రంట్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పార్టీ ఓటమి పాలైంది. 1989లో జరిగిన ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించడంతో 3వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1996 ఎన్నికల్లో చెన్నై చేపాక్కం నుంచి గెలుపొంది నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. చివరి రోజుల్లో... కరుణానిధి 2006 ఎన్నికల్లో విజయదుందుభి మోగించి ఐదోసారి సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. ఉచిత పథకాలతో ప్రజల్ని ఆకర్షించారు. 2011, 2016 అసెంబ్లీ ఎన్నికలు మాత్రం కరుణకు నిరాశ మిగిల్చాయి. 2011 ఎన్నికల్లో అయితే ప్రధాన ప్రతి పక్ష హోదా కూడా దక్కలేదు. వయోభారంతో బాధ పడుతున్నా, అధికారం చేతిలో లేకున్నా, పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉండేలా నిత్యం రాష్ట్ర పార్టీ కార్యాలయం అన్నా అరివాలయానికి కరుణ వచ్చేవారు. చివరిసారిగా అక్టోబర్‌లో పార్టీ ఆఫీసుకు వచ్చారు. కరుణ ప్రస్థానమిలా.. ►1924 జూన్ 3 తిరుక్కువలైలో జననం ►1938 జస్టిస్ పార్టీలో చేరిక. తర్వాత ద్రవిడ కజగం పార్టీలోకి. ►1949 అన్నాదురైతో కలసి డీఎంకే స్థాపన ►1957కులితలై నుంచి తొలిసారి తమిళనాడు అసెంబ్లీకి ఎన్నిక. ►1967అన్నాదురై కేబినెట్లో ప్రజాపనుల శాఖ మంత్రిగా బాధ్యతలు. ►1969అన్నాదురై మరణం అనంతరం సీఎంగా .. ►1977అధికారంలోకి వచ్చిన ఏఐఏడీఎంకే. 13 ఏళ్లపాటు ప్రతిపక్షంలోనే కరుణ ►1989ఎంజీఆర్ మరణం. తర్వాతి ఎన్నికల్లో అధికారంలోకి డీఎంకే ►2001అవినీతి ఆరోపణలతో కరుణ, స్టాలిన్, మారన్‌లను అరెస్టు చేసిన జయలలిత ప్రభుత్వం ►2006 ఐదోసారి సీఎంగా ఎన్నిక ►2013తన వారసుడిగా స్టాలిన్‌ను ప్రకటించిన కరుణ -
కరుణకు రాహుల్, రజనీ పరామర్శ
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్యం మంగళవారం మరింత మెరుగుపడింది. నాలుగు రోజులుగా దేశవాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన కరుణ కాసేపు కళ్లు తెరిచారు. కుమారుడు స్టాలిన్ పలకరింపునకు స్పందించారు. వృద్ధాప్య రుగ్మతలతో సతమతం అవుతున్న కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించడంతో గతనెల 28న ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. గొంతుకు అమర్చిన కృత్రిమశ్వాస గొట్టాన్ని మార్చిన కారణంగా ఆయన ఇన్ఫెక్షన్కు గురయ్యారు. ఆనాటి నుంచి స్పృహలేని స్థితిలో ఉండిన కరుణానిధి క్రమేణా కోలుకుంటున్నారు. ఇదిలాఉండగా, కరుణను పరామర్శించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం కావేరీ ఆస్పత్రికి వచ్చారు. కరుణ కుమారుడు స్టాలిన్, కుమార్తె కనిమొళి రాహుల్‌ను కరుణ వద్దకు తీసుకెళ్లారు. ఈ సమయంలో స్టాలిన్.. కరుణ చెవివద్ద ‘రాహుల్ వచ్చారు’ అని చెప్పగా కళ్లు తెరిచి తలతిప్పి చూశారు. అలాగే, నటుడు రజనీకాంత్‌తోపా టు పలువురు తమిళ చిత్రరంగ ప్రముఖులు కావేరి ఆస్పత్రి వచ్చి కరుణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కరుణ ఆరోగ్యం మరింత మెరుగుపడినా మరికొంతకాలం ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని కావేరి ఆస్పత్రి బులెటిన్‌లో పేర్కొంది. -
నిలకడగా కరుణ ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంది. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆదివారం రాత్రి కరుణానిధి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు, అభిమానుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. వైద్యుల చికిత్సతో ఆయన ఆరోగ్యం మెరుగైందని ఆ కాసేపటికి ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించడంతో కొంతవరకు ఆందోళనలు తగ్గాయి. ప్రస్తుతం కరుణ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. సోమవారం రాత్రి ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న రాత్రి ఆసుపత్రి యాజమాన్యం నాన్న ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసినప్పటి పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతోంది. డాక్టర్లు ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు’ అని తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించిందని, అయితే, వెంటనే తక్షణ చికిత్స అందించడంతో సాధారణ స్థాయికి వచ్చిందని ఆదివారం అర్ధరాత్రి కావేరీ ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. సీఎం పరామర్శ మూడురోజుల పర్యటన నిమిత్తం సేలం జిల్లాకు వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అర్ధాంతరంగా పర్యటన ముగించుకుని హడావుడిగా చెన్నైకి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మరికొందరు మంత్రులు వెంటరాగా సోమవారం ఉదయం కావేరి ఆస్పత్రికి వెళ్లి స్టాలిన్‌ను కలుసుకుని కరుణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఎడపాడి మీడియాతో మాట్లాడుతూ, కరుణకు చికిత్స జరుగుతోందని, కోలుకుంటున్నారని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ సోమవారం చెన్నైకి వచ్చి కరుణను చూసి స్టాలిన్‌ను కలుసుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని తరఫున నలుగురు ప్రతినిధులు కావేరి ఆస్పత్రికి వచ్చారు. ఆగిన అభిమానుల గుండెలు తమ అభిమాన నేత కరుణానిధిని తలచుకుంటూ ఆవేదనకు గురై 8 మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. ఓ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి బలవన్మరణానికి ప్రయత్నించాడు. కొందరు డీఎంకే కార్యకర్తలు కరుణ కోలుకోవాలంటూ కావేరి ఆస్పత్రి ముందు గుండు కొట్టించుకుని దేవుళ్లకు మొక్కుకున్నారు. అనేకచోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
ఐసీయూలో కరుణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మూత్రనాళ ఇన్ఫెక్షన్కు చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధికి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రక్తపోటు ఒక్కసారిగా తగ్గింది. దీంతో ఆయన్ని చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్సచేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రక్తపోటు నియంత్రణలోకి వచ్చిందని శనివారం రాత్రి ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కరుణానిధి కుటుంబ సభ్యులు వెద్యులతో చర్చించారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, కరుణానిధి కొడుకు స్టాలిన్, కుమార్తె కనిమొళి తదితరులు ఆసుపత్రిలో ఉన్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురై, కరుణానిధి కుటుంబానికి దూరంగా ఉంటున్న పెద్ద కొడుకు అళగిరి ఆస్పత్రికి తండ్రిని పరామర్శించడానికి వచ్చారు. తమిళనాడు గవర్నర్, రక్షణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ వాస్నిక్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. వైద్య సాయాన్నైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..కరుణానిధి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. కరుణానిధి నివాసానికి భారీగా అభిమానులు తరలివస్తున్న దృష్ట్యా ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇద్దరు కార్యకర్తల మృతి.. కరుణానిధి అనారోగ్యంపై వ్యాపించిన వదంతులతో ఇద్దరు డీఎంకే కార్యకర్తలు మరణించారు. వాట్సాప్‌లో కరుణ అనారోగ్యంపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి విని నామక్కల్ జిల్లా నామగిరిపేటకు చెందిన శివషణ్ముగం (64) గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. అలాగే, తిరువారూరు జిల్లా ముత్తుపేటకు చెందిన తమీమ్ (55) శుక్రవారం రాత్రి టీవీలో కరుణానిధి అనారోగ్యంపై వచ్చిన వార్తలు వింటూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. -
కరుణానిధి కోలుకుంటున్నారన్న కుటుంబ సభ్యులు
-
‘నాన్న బాగానే ఉన్నారు.. ఆందోళన వద్దు’
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి(94) ఆరోగ్యం కుదుటపడుతోందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. జ్వరం, మూత్రనాళ ఇన్ఫెక్షన్తో కరుణానిధి బాధపడుతోన్న విషయం తెలిసిందే. కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు గుప్పుమనడంతో ఆయనను చూసేందుకు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో గోపాలపురంలోని నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ హైడ్రామా నెలకొంది. అయితే కరుణ ఆరోగ్య కుదుటపడటంతో గురువారం అర్ధరాత్రి వరకు గోపాలపురంలోనే వేచి ఉన్న స్టాలిన్, దురైమురుగన్ తమ నివాసాలకు వెళ్లినట్లు సమాచారం. కాగా కరుణ పూర్తిగా కోలుకుంటున్నారని తెలిపిన స్టాలిన్.. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు పార్టీ నేతలెవరూ ఆయన నివాసానికి రావద్దని మనవి చేశారు. ‘నాన్న ఆరోగ్యంగా ఉన్నారు. ఆందోళన చెందకండి. ఇటువంటి సమయంలో దయచేసి అందరూ సంమయనం పాటించాలని’ ఆయన కోరారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరుణానిధి నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. కరుణానిధిని పరామర్శించిన పలువురు నేతలు కరుణానిధి ఆరోగ్యానికి సంబంధించి వార్తలు ప్రసారం కావడంతో తమిళనాడు డిప్యూటి సీఎం పన్నీరు సెల్వం, మంత్రి జయకుమార్, తంగమణి, వేలుమణి, కమల్ హాసన్, శరత్ కుమార్ తదితరులు గురువారం ఆయనను పరామర్శించారు. కాగా శుక్రవారం ఉదయాన్నే తమిళనాడు బీజేపీ అధ్యక్షులు తమిళిసై సౌందర్ రాజన్, సీనియర్ నటుడు రాధారవి, వైగో, పలువురు డీఎంకే పార్టీ నేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు. -
అసలైన డీఎంకే నాదే: అళగిరి
మదురై: తమిళనాడు ప్రధాన ప్రతిపక్షంలో ముసలం పుట్టింది. అసలైన డీఎంకే కేడర్ అంతా తనతోనే ఉన్నారని ఆ పార్టీ అధినేత కరుణానిధి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరి ప్రకటించుకున్నారు. తన సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌ను ‘నాన్‌వర్కింగ్ ప్రెసిడెంట్’ అంటూ పరోక్షంగా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత ఏడు జిల్లాల్లో స్టాలిన్ పార్టీ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన నేపథ్యంలో అళగిరి ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. గురువారం మదురైలో జరిగిన పార్టీ నేత ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. ‘ప్రస్తుతం పార్టీలో వివిధ స్థానాల్లో ఉన్న వారంతా పదవుల కోసమే తప్ప పనిచేసే వారు కాదు. అసలైన కేడర్ అంతా నా వెంటే ఉంది. పార్టీ అధ్యక్షుడు కరుణానిధిని మాత్రమే మా నాయకుడు’ అని అన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ 2014 లోక్‌సభకు ఎన్నికలకు ముందు అధ్యక్షుడు కరుణానిధి ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అయినప్పటికీ దక్షిణ జిల్లాల్లోని పార్టీ క్యాడర్లో ఆయనకు మంచి పట్టుంది. -
జయలలిత ఆడియో క్లిప్పుల విడుదల
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మాట్లాడిన ఆడియో క్లిప్పులు వెలుగులోకి వచ్చాయి. జయ మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ వీటిని శనివారం విడుదల చేసింది. దాదాపు 1.07 నిమిషాల నిడివి ఉన్న తొలి ఆడియో క్లిప్‌లో ‘మీకు రక్తపోటు(బీపీ) ఎక్కువగా ఉంది. సిస్టోలిక్ పీడనం 140గా ఉంది’ అని జయకు డ్యూటీ డాక్టర్ చెప్పారు. ఆమె వెంటనే ‘డయాస్టోలిక్ పీడనం ఎంతుంది?’ అని అడిగారు. దీనికి 140/80 అని డాక్టర్ జవాబిచ్చారు. దీంతో ‘అయితే అది నాకు మామూలే’ అని జయలలిత సంతృప్తి వ్యక్తం చేశారు. శ్వాస తీసుకోవడంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందిని కేఎస్ శివకుమార్ అనే వైద్యుడికి వివరిస్తూ.. ‘శ్వాస తీసుకున్నప్పడు వస్తున్న గురకలాంటి శబ్దం నాకు స్పష్టంగా విన్పిస్తోంది. అది సినిమా థియేటర్లో అభిమానులు వేసే విజిల్స్‌లా ఉంది’ అని జయలలిత చమత్కరించారు. కమిషన్ విడుదల చేసిన మరో 33 సెకన్ల ఆడియో క్లిప్‌లో డా.శివకుమార్ జయతో మాట్లాడుతూ.. గతంతో పోల్చుకుంటే శ్వాస తీసుకుంటున్నప్పుడు వస్తున్న శబ్దం తీవ్రత తగ్గిందని జయలలితకు చెప్పారు. దీంతో ఆమె వెంటనే స్పందిస్తూ.. ‘గురకలాంటి శబ్దం ఎక్కువగా ఉండగానే రికార్డు చేసేందుకు మొబైల్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని మీకు చెప్పాను. మీరేమో కుదరదన్నారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో కుమార్ ‘మీరు చెప్పిన వెంటనే మొబైల్లో డౌన్లోడ్ చేశాను’ అని సమాధానమిచ్చారు. అలాగే ఆస్పత్రిలో భోజనానికి సంబంధించి జయలలిత రాసుకున్న లిస్ట్‌ను కమిషన్ బహిర్గతం చేసింది. కాగా, తూత్తుకుడి కాల్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఈ ఆడియో క్లిప్పులను విడుదల చేయించిందని ప్రతిపక్ష నేత స్టాలిన్ ఆరోపించారు. 2016, సెప్టెంబర్ 22న అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత 75 రోజుల చికిత్స అనంతరం డిసెంబర్ 5న చనిపోయారు. చికిత్స సమయంలో జయను ఎవ్వరికీ చూపకపోవడంతో ఆమె మరణంపై అనుమానాలు తలెత్తాయి. వీటిని నివృత్తి చేసేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్‌ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ విచారణలో భాగంగా జయకు చికిత్స అందించిన వైద్యులు, అపోలో ఆస్పత్రి చీఫ్ ప్రతాప్.సి. రెడ్డి, జయ నెచ్చెలి శశికళ సహా పలువురి వాంగ్మూలాలను నమోదు చేశారు. -
నేడు తమిళనాడు బంద్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తూత్తుకుడి హింసాకాండకు వ్యతిరేకంగా శుక్రవారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. కాల్పులపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో చర్చించేందుకు సీఎం పళనిస్వామి నిరాకరించడంతో డీఎంకే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సచివాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. స్టెరిలైట్ యూనిట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగాయి. మదురై, కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో నిరసనకారులు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు స్టెరిలైట్ కర్మాగారానికి విద్యుత్ సరఫరాను నిలిపేశారు. నిషేధాజ్ఞలను ధిక్కరించి తూత్తుకుడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన స్టాలిన్, వైగో, కమల్ హాసన్ తదితర నాయకులపై కేసులు నమోదయ్యాయి. -
తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌గా తెలుగు వ్యక్తి
సాక్షి, చెన్నై : తమిళనాడు తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌గా తెలుగు వ్యక్తి నండూరి సందీప్ నియమితులయ్యారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాగా తూత్తుకుడిలో జరిగిన హింసాత్మక ఘటనల్లో మృతి చెందినవారి సంఖ్య 13కు చేరగా, 70 మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎన్ వెంకటేశన్, ఎస్పీ పీ మహేంద్రన్లపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తూత్తుకుడిలో అయిదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తూత్తుకుడి పట్టణంలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ (రాగి) యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తోన్న స్థానికులు గడిచిన 100 రోజులుగా నిరసనలు చేపట్టారు. అయితే నిరసనోద్యమం మంగళవారం నాడు ఒక్కసారిగా హింసాయుత మలుపు తిరిగింది. పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా 13 మంది ఆందోళనకారులు చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అలజడిరేపిన ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు సైతం కలుగజేసుకుంది. కాపర్ ప్లాంట్ విస్తరణను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అరెస్ట్.. మరోవైపు తూత్తుకుడి సంఘటనపై ప్రభుత్వ వివరణ డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డీఎంకే ఎమ్మెల్యేలు గురువారం చెన్నైలోని సెక్రటేరియట్‌లోకి దూసుకెళ్లటం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు వారిని అడ్డుకోవటంతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సెక్రటేరియట్ ముందు ఆందోళనకు దిగారు. ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఆందోళన చేస్తున్న స్టాలిన్ తదితరులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ డీఎంకే శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఇక తూత్తుకుడిలో అల్లర్లు సృష్టించారన్న ఆరోపణలతో ఇప్పటివరకూ 67 మందిని పోలీసులు అరెస్టు చేశారు. -
వారు నాకు బలం కాదు!
పెరంబూరు: తాత కరుణానిధి, నాన్న స్టాలిన్ నాకు బలం కాదని, బలహీనతని వారి వారసుడు, నటుడు, నిర్మాత ఉదయనిధిస్టాలిన్ పేర్కొన్నారు. డీఎంకే అధినేత కరుణానిధి మనవడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ కొడుకు ఉదయనిధిస్టాలిన్. ఈయన మంగళవారం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తాను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నానన్నారు. తాతకు, తండ్రికి ఎన్నికల్లో ప్రచారం చేశానన్నారు. సినిమాల్లో నటిస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన తాను రాజకీయాల్లోకి రావడం తప్పెలా అవుతుందని ప్రశ్నిం చారు. తక్కువ సమయంలోనే ప్రజల్లో పేరు సంపాదించుకోవడం ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారన్నారు. తాత కరుణానిధి, నాన్న స్టాలిన్ మీకు బలమా..? అన్న ప్రశ్నకు కచ్చితంగా బలహీనతే అన్నారు. ఒకరు పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం పాటు పడుతుంటే ప్రశంసలు లభిస్తాయన్నారు. తన విషయంలో అలా జరగడంలేదన్నారు. డీఎంకే అంటేనే కుటుంబ పాలన అనే విమర్శ ఉందే? అన్న ప్రశ్నకు దీనికి నాన్న విషయంలోనే సమాధానం ఉందన్నారు. నిరంతర శ్రమతో ఒక్కో మెట్టు ఎదుగుతూ.. కఠిన శ్రమతోనే నాన్నకు అధ్యక్షుడి అర్హత వచ్చిందని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. -
రాజకీయాలు, పాలనలో మార్పు రావాలి
-
ఫెడరల్.. టూర్!
సాక్షి, చెన్నై/హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై వివిధ రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం చెన్నైలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధితో భేటీ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఇది ఆది కాదు.. అంతం కాదు.. దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశ ప్రగతి, ఆర్థిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కోసం వివిధ రాష్ట్రాల్లోని అనుభవజ్ఞులు, అన్ని పార్టీల నాయకులతో చర్చలు కొనసాగుతాయి..’’అని చెప్పారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఉండొద్దని వ్యాఖ్యానించారు. తమది థర్డ్ ఫ్రంట్.. నాలుగో ఫ్రంట్.. ఐదో ఫ్రంట్ కాదని, ప్రజాఫ్రంట్ అని స్పష్టంచేశారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జేడీఎస్ అధినేత దేవెగౌడలతో చర్చలు జరిపిన కేసీఆర్.. కరుణానిధిని కలిసేందుకు ఆదివారం చెన్నైకి వెళ్లారు. నేరుగా గోపాలపురంలోని కరుణ నివాసానికి వెళ్లి పది నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. అక్కడ్నుంచి కేసీఆర్, స్టాలిన్, ఎంపీ కె.కేశవరావు ఒకే కారులో ఆళ్వార్‌పేటకు బయలుదేరి వెళ్లారు. స్టాలిన్ నివాసానికి చేరుకొని అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రులు ఎ.రాజా, బాలులతో రెండు గంటల పాటు చర్చించారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలను సీఎం వారికి వివరించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రాలకు దక్కాల్సిన అధికారాలు, హక్కులపై చర్చించారు. డీఎంకే నాయకులతో జరిగిన చర్చలో ఎంపీ కేకేతోపాటు మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు. చర్చల అనంతరం కేసీఆర్ చెన్నైలోని కపాలేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. చెన్నై పర్యటనలో సీఎం వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మెహన్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, టీఆర్ఎస్ నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు. దక్షిణాదికి అన్యాయమే.. చర్చల అనంతరం కేసీఆర్, స్టాలిన్ కలిసి మీడియాతో మాట్లాడారు. డీఎంకేతో కలిసి యూపీఏ–1లో పనిచేశామని కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రాల ప్రయోజనం, దేశ శ్రేయస్సు, ప్రగతిని కాంక్షించేలా చర్చ సాగిందన్నారు. ‘‘దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్య సాధనలో భాగంగా నా ప్రయాణం సాగుతుంది. ఏకాభిప్రాయం వచ్చేదాకా అందరితో చర్చలు జరుపుతాం. రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని అధికారాలు ఇవ్వాలి. కేంద్రానికి సంబంధం లేని అంశాలను రాష్ట్రాలకు అప్పగించాలి. విద్య, వైద్య, తాగు, సాగునీరు వంటి అంశాలతోపాటు ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైంది’’అని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు దేశాభివృద్ధికి దోహదం చేసేలా లేవని, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఉండకూడదన్నదే తమ అభిమతమని స్పష్టంచేశారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అందులో అనుమానం ఏముంది?’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. స్టాలిన్‌తో అనేక అంశాలపై చర్చించామని, మున్ముందు మరిన్ని చర్చలు జరుగుతాయని వివరించారు. తెలంగాణలో మే 10 నుంచి రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టనున్నామని, ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా స్టాలిన్‌ను ఆహ్వానించినట్టు తెలిపారు. చాలాకాలం తర్వాత చెన్నైకి రావడం ఆనందంగా ఉందని, కరుణానిధి తనకు మంచి పుస్తకాలను కానుకగా ఇచ్చారన్నారు. థర్డ్ ఫ్రంట్ అని ఎక్కడా చెప్పలేదు తాను ఎప్పుడూ, ఎక్కడా థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్పలేదని, ఇదంతా మీడియా సృష్టే అని కేసీఆర్ చెప్పారు. ‘మా ప్రయత్నం కేవలం రాజకీయ పార్టీల ఏకీకరణ కాదు.. దేశ ప్రజలు, యువత, నిరుద్యోగుల ఏకీకరణ’అని అన్నారు. తాము ఎవరితో కలిసి పనిచేస్తామన్నది భవిష్యత్ నిర్ణయిస్తుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తారా అని విలేకరులు అడగ్గా.. ‘‘ఆయన నాకు మంచి మిత్రుడు. ఆయన్ను కూడా కలిసి చర్చలు జరుపుతా’’అని చెప్పారు. అన్ని అంశాలపై మాట్లాడాం: స్టాలిన్ రాజకీయంగా అనేక అంశాలపై కేసీఆర్‌తో చర్చించినట్టు స్టాలిన్ చెప్పారు. ‘‘మాతో ఏకాభిప్రాయం కల్గిన పార్టీలు అనేకం ఉన్నాయి. వారితో ఈ అంశాలపై చర్చించాల్సి ఉంది’’అని తెలిపారు. డీఎంకే ఉన్నత స్థాయి, సర్వసభ్యం, కార్యవర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయమే కీలకం అని పేర్కొన్నారు. నేడు మరికొందరు నేతలతో భేటీ స్టాలిన్‌తో భేటీ తర్వాత సాయంత్రం ఆళ్వార్ పేట నుంచి గిండిలోని స్టార్ హోటల్‌కు చేరుకున్న కేసీఆర్.. అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం మరికొన్ని పార్టీల నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నం ఆయన చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతారు. -
స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు
చెన్నై: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి కాంచీపురం నుంచి ఫోన్ చేసి స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు స్టాలిన్ ఇంటి వద్ద భద్రత పెంచారు. స్టాలిన్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్ధాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఫోన్‌కాల్‌పై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయం గురించి డీఎంకే అధినేత స్టాలిన్‌ను వివరణ కోరగా..ఎలాంటి బాంబు బెదిరింపు కాల్ రాలేదని చెప్పడం గమనర్హం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వండి
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తమిళనాడు అధికార అన్నాడీఎంకే ఎంపీలు మద్దతివ్వాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. నీట్ ప్రవేశ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించేందుకు, కావేరీ జలాల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు విముఖత వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సరైన రీతిలో నిరసన తెలిపేందుకు అవిశ్వాసానికి మద్దతివ్వాలని శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. -
నాతో రండి.. బీజేపీని దింపేద్దాం
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకుగాను బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని ఒకే తాటిపైకి తెచ్చి యునైటెడ్ ఫ్రంట్‌గా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమతో కలిసి రావాలని తమిళనాడు డీఎంకే పార్టీ నేత స్టాలిన్‌ను కోరిన సోనియా ఆ మేరకు తాజాగా ఆమె ఇవ్వనున్న విందుకు ఆహ్వానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యునైటెడ్ ఫ్రంట్‌గా ఏర్పడి ఎన్డీయేని ఎదుర్కొనేందుకు తమతో కలిసి రావాలని సోనియా గత నెలలో అన్ని ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 13న ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడమే ఈ విందు లక్ష్యం అని తెలుస్తోంది. అయితే మార్చి 15 నుంచి తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో స్టాలిన్ ఈ విందుకు హాజరు కాబోరని, పార్టీ తరుపున కనిమొళి వస్తారని డీఎంకే మరోనేత టీకేఎస్ ఇలంగోవన్ తెలిపారు. బీజేపీని ఓడించడానికి అవసరమైన సలహాలు, సూచనలు సోనియా ప్రతిపక్ష నాయలకుల నుంచి ఈ విందులో స్వీకరించనున్నారు. కార్యక్రమంలో బిహార్ నుంచి ఆర్జేడీ నాయకులు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, హిందుస్తానీ ఎవమ్ మోర్చా-సెక్యులర్ (హెచ్ఏఎం-ఎస్) అధిపతి జీతన్‌రామ్ మాంఝీ పాల్గొననున్నారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో జైలు పాలు కావడంతో ఆర్జేడీ బాధ్యతలు తేజస్వీ యాదవ్ చూస్తున్నారు. బిహార్‌లో రెండు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ, హెచ్ఏఎం-ఎస్‌లు మహా కూటమిగా ఏర్పడుతున్నట్లు ప్రకటించాయి. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వ పని తీరుపై, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగిన 12,600 కోట్ల రూపాయల కుంభకోణంపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. -
కలలో కూడా ఆ ఆలోచన రాకూడదు!
సాక్షి, చెన్నై: తమిళులు అమితంగా అభిమానించే పెరియార్ రామస్వామిపై బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా చేసిన అనుచిత వ్యాఖ్యలపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి కలలో కూడా పెరియార్‌పై వ్యాఖ్యలు చేసే ఆలోచన ఎవరికీ రాకూడదన్నారు. పెరియార్ విగ్రహాల జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదని అన్నారు. దమ్ముంటే ఎవడైనా పెరియార్ విగ్రహాన్ని ముట్టుకోమని సవాల్ చేశారు. కొందరి పిచ్చి పరాకాష్టకు చేరి.. పెరియార్‌పై అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేత హెచ్ రాజాపై మండిపడ్డారు. ద్రవిడ జాతి తలుచుకుంటే వారికి ఏ గతి పడుతుందో ఇకపై వారికి బాగా అర్ధం అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వం ఉండటం వల్లే పెరియార్‌పై వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. -
స్టాలిన్‌తో మమత మంతనాలు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు విపక్షాలను ఏకం చేసే పనిలో నిమగ్నమైన తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తో ఫోన్లో చర్చలు జరిపారు. ఎన్డీఏపై పార్లమెంట్ లోపల, వెలుపల సమిష్టి కార్యాచరణతో పోరాడటంపై ఇరువురు నేతలు చర్చించారు. భావసారూప్య పార్టీలతో సంప్రదింపులు జరిపి బీజేపీ ఓటమి లక్ష్యంగా వాటిని ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రక్రియ జరుగుతోందని తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ చెప్పారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఫోన్లో సంప్రదించిన మీదట మమతా బెనర్జీ..స్టాలిన్‌తోనూ మాట్లాడారన్నారు. పార్లమెంట్లో సోమవారం పలు అంశాలపై టీఆర్ఎస్, టీడీపీ, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్, డీఎంకే సభ్యుల మధ్య మెరుగైన సమన్వయం నెలకొందని చెప్పారు. ఈశాన్యరాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
క్రికెట్ ఆడిన కరుణానిధి.. వీడియో వైరల్
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి క్రికెట్ ఆడారు. కరుణానిధి క్రికెట్ ఆడటమేంటీ అనుకుంటున్నారా.. అయితే ఆయన ఆడింది గ్రౌండ్లో కాదు.. తన ఇంట్లో.. అది కూడా మునిమనవడితో కావడం విశేషం. కరుణానిధి వీల్ ఛైర్లో కూర్చొని బౌలింగ్ చేస్తుంటే.. తన 2 ఏళ్ల ముని మనవడు( అరుల్‌నిధి కుమారుడు) బ్యాటింగ్ చేశాడు. ప్లాస్టిక బాల్, బంతితో తాత మనవడు క్రికెట్ ఆడుతుండగా కుటుంబ సభ్యులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు కరుణానిధి ఆరోగ్యంపై వదంతులు వస్తున్న తరుణంలో ఈ వీడియో బయటకు రావడంతో ఆయన అభిమానులు, పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ నేత అరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం కరుణానిధి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. కరుణానిధి ఆరోగ్యంగానే ఉన్నారని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కుమారుడు స్టాలిన్ వెల్లడించారు. -
డీఎంకే అధినేత కరుణానిధి క్రికెట్ ఆడారు.
-
కరుణానిధితో రజనీకాంత్ భేటీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు రజనీకాంత్ బుధవారం డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని కలుసుకున్నారు. చెన్నైలో గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి వెళ్లిన రజనీ ఆయనతో సుమారు 20 నిమిషాలు ముచ్చటించారు. కరుణానిధి వెంట ఆయన కొడుకు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఉన్నారు. ఆ తరువాత రజనీ మీడియాతో మాట్లాడుతూ...కరుణానిధి తనకు స్నేహితుడని, మర్యాదపూర్వకంగా కలిశానని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్నందున ఆయన ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. ఈనెల 14వ తేదీన రజనీకాంత్ తన పార్టీ పేరు, చిహ్నం, జెండా ప్రకటిస్తారని అంచనా వేస్తున్న తరుణంలో కరుణానిధిని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ తనది ఆధ్యాత్మిక పార్టీ అని రజనీకాంత్ చెప్పినట్లు వెల్లడించారు. ద్రవిడ సిద్ధాంతాన్ని నిర్వీర్యం చేసేందుకే రజనీ పార్టీ పెట్టారని కొందరు చిత్రీకరిస్తున్నారని, ఇది ఎవరి వల్లా సాధ్యం కాదని అన్నారు. -
ట్రిపుల్ తలాక్ బిల్లు : స్టాలిన్‌కు థ్యాంక్స్
సాక్షి, చెన్నై: ట్రిపుల్ తలాక్ బిల్లును స్టాండింగ్ కమిటీకి నివేదించాలని కోరిన డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌కు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) కృతజ్ఞతలు తెలిపింది. సజ్జద్ నొమానీ నేతృత్వంలో ఏఐఎంపీఎల్బీ కార్యవర్గ సభ్యులు సోమవారం స్టాలిన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని ధన్యవాదాలు తెలిపారని ఏఐఎంపీఎల్బీ పేర్కొంది. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని, దీనికి పాల్పడిన భర్తకు మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా పార్లమెంట్ ఇటీవల బిల్లును ఆమోదించిన విషయం విదితమే. ట్రిపుల్ తలాఖ్‌ను నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తూ ఈ బిల్లు రూపొందింది. అయితే ఈ బిల్లు లోక్‌సభ ఆమోదంపై కేంద్రం తొందరపాటుతో వ్యవహరించిందని, దీన్ని స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. -
హీరో విశాల్‌కు ఊహించని సపోర్టు..!
సాక్షి, చెన్నై: ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్ది తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ నెల 21న జరగనున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికలో భాగంగా రాజకీయ వేడి రాసుకుంది. ఈ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసేందుకు హీరో విశాల్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు మొదట తిరస్కరించి.. తర్వాత ఆమోదం తెలిపి మరలా తిరస్కరణకు గురి చేశారు. దీనిపై డీఎంకే నేత స్టాలిన్ మాట్లాడుతూ.. విశాల్ నామినేషన్ తిరస్కరణ కుట్రే అని అన్నారు. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా పాలక పక్షంతో కుమ్మక్కైందని ఆయన పేర్కొన్నారు. విశాల్ నామినేషన్‌పై అన్నాడీఎంకే దురాగతాలకు పాల్పడిందని డీఎంకే నేత పేర్కొన్నారు. ఆర్కే నగర్ రిటర్నింగ్ అధికారిని తొలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ విజయం సాధిస్తుందని డీఎంకే నేత స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ మంత్రులే గత ఏప్రిల్‌లో రూ. 89 కోట్లు పంచి పెట్టారన్నారు. ప్రభుత్వం ఆర్కేనగర్ ఉప ఎన్నికను మరోసారి రద్దు చేయడానికి కుట్ర పన్నుతోందని స్టాలిన్ అన్నారు. దాదాపు 70 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీకి దిగడంతో ఉపసమరం ఆసక్తికరంగా మారింది. -
స్టాలిన్‌కు కేసీఆర్ కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం సాధించే విషయంలో రాష్ట్రాల అధికారం కోసం తాము చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించిన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం స్టాలిన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా సామాజిక న్యాయం సాధించడానికి రాష్ట్రాలకు అధికారం అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో కేంద్రాన్ని కోరారు. దీనిపై హర్షం వ్యక్తంచేస్తూ స్టాలిన్ ఆదివారం చెన్నైలో ప్రకటన విడుదల చేశారు. సామాజిక న్యాయం సాధించడానికి.. బడుగు వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలనే విషయంలో డీఎంకే మొదటినుంచీ అవిశ్రాంత పోరాటం చేస్తున్నదని, దీని ఫలితంగానే తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని స్టాలిన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూ డా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలకు, ఈ విషయంలో రాష్ట్రాలకే అధికారం అప్పగించాలనే డిమాండ్‌కు స్టాలిన్ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. -
సీఎం కేసీఆర్‌కు స్టాలిన్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అభినందనలు తెలిపారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్ అమలు పరిచే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో తలపెట్టిన ధర్నాకు డీఎంకే మద్దతు ప్రకటించింది. ఈసందర్భంగా సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలుపుతూ ఆదివారం స్టాలిన్ ఒక లేఖ పంపారు.