Swati Sachdev : కన్నతల్లి గురించి కారుకూతలు .. స్వాతి సచ్‌దేవా వీడియో దుమారం! | Swati Sachdeva Faces backlash For Stand Up Joke | Sakshi
Sakshi News home page

కన్నతల్లి గురించి కారుకూతలు .. స్వాతి సచ్‌దేవా వీడియో దుమారం!

Published Sun, Mar 30 2025 7:29 PM | Last Updated on Sun, Mar 30 2025 7:34 PM

Swati Sachdeva Faces backlash For Stand Up Joke

ఢిల్లీ: కంటెంట్‌ క్రియేటర్లు డార్క్‌ కామెడీ పేరుతో శృతి మించుతున్నారు. లైకులు, వ్యూస్‌ కోసం తల్లిదండ్రులు, సాన్నిహిత్యం గురించి బహిరంగంగా ప్రస్తావిస్తున్నారు. అబాసుపాలవుతున్నారు. తాజాగా, మహిళా స్టాండప్‌ కమెడియన్‌ స్వాతీ సచ్‌దేవా (Swati Sachdev) అదే తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు గాను నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం మాట్లాడారు. 

కొద్ది రోజుల క్రితం ‘ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌’ (India's Got Latent) వేదికగా యూట్యూబర్‌ రణవీర్‌ అల్హాబాదియా (Ranveer Allahbadia) తల్లిదండ్రుల గురించి, శృంగారంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరువక ముందే తాజాగా,స్టాండప్‌ కమెడియన్‌ స్వాతీ సచ్‌దేవా ఇటీవల తనకు, తన తల్లికి మధ్య జరిగిన ఓ సంభాషణ గురించి ప్రస్తావించారు. స్టాండప్‌ కామెడీతో పేరుతో రాయలేని  విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. నెటిజన్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. తల్లిదండ్రుల గురించి ఆ తరహా వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రముఖ హాస్యనటుడు సమయ్‌ రైనా ఇండియా గాట్‌ లాటెంట్‌ పేరుతో ఓ కామెడీ షోని నిర్వహిస్తున్నారు. ఆ షో ముఖ్య ఉద్దేశం.. షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు తమలోని హాస్య కోణాన్ని ప్రదర్శించాలి. అయితే, ఆ షోలో రణవీర్‌ అల్హాబాదియా పాల్గొన్నారు. ఓ కటెంటెస్ట్‌ను ఉద్దేశించి.. ‘నీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొంటే జీవితాంతం చూస్తూ ఉండిపోతావా?. లేకుంటే.. ’ అంటూ అతి జుగుప్సాకరమైన ప్రశ్నను సంధించాడు. ఆ వీడియో నెట్టింటకు చేరడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం అతని తీరును తీవ్రంగా ఖండించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement