
సినీ నటుడు, నిర్మాత ఉదయ్‌నిధి స్టాలిన్ తమిళనాడు మంత్రి కాబోతున్నారు..
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, అధికార డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి(45)కి త్వరలో∙మంత్రి యోగం దక్కనుంది. 14న రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఉదయనిధి మంత్రిగా ప్రమాణం చేయనున్నారని సోమవారం రాజ్‌భవన్ తెలిపింది.
మంత్రివర్గంలోకి ఉదయనిధిని తీసుకోవాలంటూ డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్ పంపిన సిఫారసును గవర్నర్ రవి ఆమోదించారని పేర్కొంది. సినీ నటుడు, నిర్మాత-పంపిణీదారుడు అయిన ఉదయనిధి మొదటిసారిగా 2021 ఎన్నికల్లో చెపాక్–తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
ఉదయనిధికి మంత్రి పదవి కట్టబెట్టాలనే డిమాండ్ పార్టీ వర్గాలతోపాటు మంత్రుల నుంచి ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తోందని డీఎంకే నేతలు అంటున్నారు.