పట్టాలపై సెల్ఫీ.. దూసుకొచ్చిన లోకల్‌ ట్రైన్‌.. క్షణాల్లో! | Two Teenagers Run Over By A Local Train While Clicking Selfie | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై సెల్ఫీ.. లోకల్‌ ట్రైన్‌ ఢీకొని ఇద్దరు మృతి

Published Tue, Nov 8 2022 9:17 PM | Last Updated on Tue, Nov 8 2022 9:17 PM

Two Teenagers Run Over By A Local Train While Clicking Selfie - Sakshi

సెల్ఫీలకు పోజులిస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

కోల్‌కతా: స్మార్ట్‌ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ఫీలకు క్రేజ్‌ పెరిగింది. ‍అయితే, అదే సెల్ఫీ మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రమాదమని తెలిసి కూడా సెల్ఫీలకు పోజులిస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి విషాద సంఘటనే పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. రైల్వే ట్రాక్‌పై ప్రమాదకర రీతిలో సెల్ఫీ తీసుకుంటుండగా ఇద్దరు టీనేజర్లపైకి లోకల్‌ ట్రైన్‌ దూసుకొచ్చింది. క్షణాల్లో వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 

సోమవారం రాత్రి కుల్గాచియా- బగ్నాన్‌ రైల్వేస్టేషన్ల మధ్య మహిష్‌రేఖ వంతెన సమీపంలో ఈ దుర్ఘటన జరిగిందని జీఆర్‌పీ పోలీసులు మంగళవారం తెలిపారు. మృతులను బగ్నాన్‌ ప్రాంతానికి చెందిన షరీఫ్ అలీ ముల్లిక్‌ (18), షరిఫుల్‌ ముల్లిక్‌ (14)గా గుర్తించినట్టు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు వివరించారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. 10సార్లు ఎమ్మెల్యే, కీలక నేత గుడ్‌బై.. బీజేపీలో చేరిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement