Train accident
-
ఊహించని విషాదం.. రిటైర్మెంట్ రోజే అనంతలోకాలకు
ఇది మాటలకందని విషాదం.. ఊహించని ఘటన ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రెండు గూడ్స్ ట్రైన్ల డ్రైవర్లు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో మృతి చెందిన లోకో పైలట్ గంగేశ్వర్ ఏప్రిల్ 1న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. అదే రోజే ఆయన అనంత లోకాలకు పయనమయ్యారు.ఇక తమ కుటుంబంతో ఆనందంగా గడపొచ్చనే ఆయన కలలు ఆవిరైపోవడంతో పాటు కుటుంబ సభ్యులకు ఊహించని విషాదమే మిగిలింది. రిటైర్మెంట్ రోజు ఆయనతో కలిసి విందు చేసుకోవాలని ఎదురు చూస్తున్న కుటుంబానికి కన్నీరే మిగిలింది.విధి నిర్వహణలో చివరి రోజున తోటి ఉద్యోగులతో సరదాగా గడిపి.. ఎన్నో జ్ఞాపకాలతో తిరిగి వస్తాడనుకున్న తన తండ్రి ఇంకెప్పటికీ రాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ ఆయన కూతురు విలపించింది. రేపటి నుంచి ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటానని ఆనందంగా చెప్పి వెళ్లిన తండ్రి.. ప్రమాదంలో మృతి చెందడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు షాక్!
ఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ (Delhi Railway Station) కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి తొక్కిసలాట (stampede) జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.కుంభమేళాకు వెళ్లేందుకు ఢిల్లీ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు భారీ సంఖ్యలో వచ్చారు. కుంభమేళాకు వెళ్లేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది. ఈ క్రమంలో 14వ నంబరు ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలిచి ఉండడంతో భక్తులు అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబరు ప్లాట్‌ఫాంలపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో, 18 మంది మృతిచెందారు.Reportedly 21 people lost lives in the Delhi railway station stampede !who's taking responsibility for this ? This is not mismanagement? #RailwayMinisterResign #STAMPEDE #Delhi#NewDelhiRailwaystation#delhirailwaystation #MahakumbhStampede #trainaccident #Railway pic.twitter.com/oxrtomGkKL— sustainme.in®️ (@sustainme_in) February 16, 2025 See the crowd⚠️Each & every human is stuck to another like a garland woven togetherStampede is bound to happen at the slightest hint of chaos & panicIndian Railways for you 🤷#NewDelhiRailwaystation #STAMPEDE#trainaccident #ResignRailwayMinister pic.twitter.com/DKnrE8TYTS— Sudiksha (@Su_diksha) February 16, 2025ఈ నేపథ్యంలో రైలు ప్రమాదాలపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి అయినప్పటి నుంచే రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రైలు ప్రమాదాల్లో ఇప్పటికే చాలా మంది చనిపోయారని అంటున్నారు. రైలు ప్రమాదాలకు బాధత్య వహించి రైల్వే మంత్రి (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్యాగ్(#ResignRailwayMinister) ట్విట్టర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. भारतीय रेलवे 21वी सदी के सबसे अच्छे दौर से गुजर रही है। और सबसे बड़ा योगदान रील मंत्री का है। #STAMPEDE #ResignRailwayMinister #NewDelhiRailwaystation pic.twitter.com/lUXGTLCF5Y— Sunand Sarkar Kushwaha (@TheSunandSarkar) February 16, 2025 ఇక, ఇదే సమయంలో అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో గత కొన్నేళ్లలో జరిగిన రైలు ప్రమాదాల గురించి కూడా పోస్టులు పెడుతున్నారు. ఆయన రైల్వే శాఖకు మంత్రి అయ్యాకే ప్రమాదాలు ఎక్కువగా జరిగాయని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. 1956లో అరియలూర్‌లో జరిగిన రైలు ప్రమాదం తర్వాత ప్రమాదానికి బాధత్య వహిస్తూ నాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని గుర్తు చేస్తున్నారు. తన హయాంలో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. 1956 :: Ariyalur Train Accident Railway Minister Lalbahadur Shastri Resigned Taking Moral Responsibility ( Photo - The Hindu ) pic.twitter.com/rtUy9TdcGD— indianhistorypics (@IndiaHistorypic) February 15, 2025 Not again Indian Railways 💔Sealdah bound Kanchenjungaa Express hit by a goods train near New Jalpaiguri, More Details awaited, Wishing for everyone's safety 🙏 #trainaccident #indianrailways pic.twitter.com/ALkidHnESb— Trains of India (@trainwalebhaiya) June 17, 2024 Railway Minister Lal Bahadur Resigned Taking Moral Responsibility of The Train Accident In 1956 pic.twitter.com/xJF8PDKPys— indianhistorypics (@IndiaHistorypic) February 15, 2025 ज्यादा लोग बिहार के हैं #AshwiniVaishnawMustResign #AshwiniVaishnawResignNow pic.twitter.com/mh1uW2gpJl— Magadh Updates (@magadh_updates) February 16, 2025 -
హైరిస్క్ జోన్లో వందేభారత్!
కుదుపులు లేని వేగవంతమైన ప్రయాణం, ఆధునిక కప్లింగ్ సిస్టం వల్ల కోచ్‌ల మధ్య సమన్వయం, ‘కవచ్’(Kavach)ఏర్పాటుతో ప్రమాదాలకు అతి తక్కువ ఆస్కారం.. వందేభారత్ రైళ్ల(Vande Bharat) గురించి రైల్వే శాఖ చెప్పే విశేషాలివి. నిజానికి ఈ రైళ్లు హై రిస్క్ జోన్లో పరుగు పెడుతున్నాయి. ఒక్క ప్రాంతంలో తప్ప మరెక్కడా రైలు ప్రమాదాలు నివారించే కవచ్ వ్యవస్థ ఈ రైళ్లలో లేదు. ఢిల్లీ–ఆగ్రా, మధుర–పల్వాల్ సెక్షన్ల మధ్య 86 కి.మీ. నిడివిలో మాత్రమే వందేభారత్ రైళ్లు సురక్షితంగా ప్రయాణిస్తాయి.మిగతా ప్రాంతాల్లో సాధారణ రైళ్లకు ఉన్న ప్రమాద భయం వీటినీ వెంటాడుతోంది. గంటకు 50 – 70 కి.మీ. సగటు వేగంతో ప్రయాణించే సాధారణ రైళ్లు నిరంతరం ‘రిస్క్’లో ఉంటే.. 100 కి.మీ. సగటు వేగం (గరిష్టం 130 కి.మీ.)తో దూసుకెళ్లే వందేభారత్ రైళ్లు హై రిస్కులో ఉన్నాయని స్పష్టమవుతోంది. తెలంగాణ మీదుగా నడుస్తున్న ఐదు వందేభారత్ రైళ్లు ప్రమాదకరంగానే పరుగు పెడుతున్నాయి. పట్టాలపై రైళ్ల అధిక సాంద్రత, సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించకపోవటం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఆ పరికరం నిరుపయోగమే.. ప్రస్తుతం వందేభారత్ రైళ్లలో కవచ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. లోకో పైలట్ నిర్లక్ష్యంగా ఉన్నా, తప్పుడు సిగ్నల్‌తో వేరే రైళ్లకు చేరువగా దూసుకెళ్లినా రైలు తనంతట తానుగా బ్రేక్ వేసుకుంటుందనే భావన చాలా మందిలో ఉంది. కానీ, రైళ్ల లోకోమోటివ్‌లలో మాత్రమే కవచ్ యంత్రం ఉంటే నిరుపయోగమే. కవచ్ వ్యవస్థ పనిచేయాలంటే, రైలు ఇంజిన్లలో కవచ్ పరికరం ఉండటంతో పాటు, ప్రతి స్టేషన్లో కవచ్ వ్యవస్థ ఉండాలి.అక్కడి ట్రాక్ వెంట ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్స్ ఏర్పాటు చేయాలి. ట్రాక్ వెంట ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉండాలి. వీటిని అనుసంధానిస్తూ ఆ మార్గంలో నిర్ధారిత నిడివిలో టెలికం టవర్లు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ అనుసంధానమై పనిచేసినప్పుడే రైళ్లు వాటంతట అవి ప్రమాదాన్ని నివారించుకోగలవు. లోకో పైలట్లను కవచ్ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. మిగతావి ఏవీ లేకుండా కేవలం ఇంజిన్లలో కవచ్ పరికరంతో పరుగుపెట్టే వందేభారత్‌లు ప్రమాదాన్ని నివారించుకోలేవని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఒకే మార్గంలో.. ఢిల్లీ–ఆగ్రా మధ్య దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ పరుగు పెడుతోంది. దీని వేగం గంటకు 160 కి.మీ.. ఈ వేగాన్ని సాధారణ ట్రాక్ తట్టుకోలేదన్న ఉద్దేశంతో ఆ మార్గంలో 125 కి.మీ. ప్రత్యేక ట్రాక్ నిర్మించారు. అదే మార్గంలోని మధుర–పల్వాల్ సెక్షన్ల మధ్య 86 కి.మీ. మేర పూర్తిస్థాయి కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. ఆ మార్గంలో మాత్రమే రైళ్లు కవచ్ రక్షణతో ఉన్నట్టు. ఆ మార్గంలో ఒకే ఒక వందేభారత్ రైలు నడుస్తోంది.దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లింగంపల్లి–వికారాబాద్–వాడీ సెక్షన్ల మధ్య 245 కి.మీ. మేర కవచ్ ఏర్పాటైంది. కానీ ఆ మార్గంలో వందేభారత్ రైలు తిరగటం లేదు. మన్మాడ్–ముధ్ఖేడ్–డోన్ మధ్య 959 కి.మీ... బీదర్–పర్బణి మధ్య 241 కి.మీ. మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. నార్తర్న్ రైల్వే పరిధిలో కూడా కొంతమేర ఉంది. మొత్తంగా 1,548 రూట్ కి.మీ. మేర మాత్రమే ఇది ఏర్పడింది. మరో 3 వేల కి.మీ.లో పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం వందేభారత్ రైళ్లను పెంచటంపై ప్రదర్శిస్తున్న వేగం.. కవచ్ వ్యవస్థ ఏర్పాటులో చూపటం లేదు. -
ప్రయాగరాజ్ వెళ్తున్న ట్రైన్‌పై మధ్యప్రదేశ్‌లో రాళ్ల దాడి
-
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం
-
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి
ముంబై : మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జల్గావ్ జిల్లా పరండా రైల్వేస్టేషన్ సమీపంలో ట్రైన్ ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంపై ప్రయాణికుల తెలిపిన వివరాల మేరకు.. జల్గావ్ జిల్లా పరండా రైల్వేస్టేషన్ సమీపంలోని పాచోరా ప్రాంతంలో వేగంగా వెళ్తున్న పుప్పక్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లోకో పైలెట్ బ్రేకులు వేశారు. బ్రేకులు వేయడంతో ట్రైన్ చక్రాల నుంచి పొగ వ్యాపించింది. దీంతో ఆ పొగను చూసిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పుప్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయంటూ బిగ్గరగా అరుస్తూ ప్రాణభయంతో పరుగులు తీశారు. వారిలో 35-40 మంది ట్రైన్ నుంచి దూకారు. ట్రైన్ చైన్ లాగడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు పుష్పక్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ నుంచి పట్టాలు దాటే ప్రయత్నం చేశారు. పట్టాలు దాటుతుండగా..ఎదురుగా వస్తున్న కర్నాటక ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారని సమాచారం. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. VIDEO | At least six persons were killed after they stepped down from their train on the tracks and were run over by another train coming from the opposite direction in North Maharashtra's Jalgaon district on Wednesday evening. Visuals from the spot near Pachora station, where… pic.twitter.com/EKQU5LE50w— Press Trust of India (@PTI_News) January 22, 2025 -
రైలు ఎక్కుతుండగా జారిపడి...
కోరుట్ల: రైలు ప్రమాదంలో గాయపడిన ఓ యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్లలోని ప్రకాశం రోడ్‌కు చెందిన సామల్ల గణేశ్–నీరజ దంపతులు తమ కూతురు ఉదయశ్రీతో కలిసి, గత సోమవారం తిరుపతి వెళ్లేందుకు వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ రైలు ఎక్కుతుండగా ఉదయశ్రీ ప్రమాదవశాత్తు జారిపడి, తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు వెంటనే ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. ఒక్కగానొక్క కూతురి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో కోరుట్లలో విషాదం నెలకొంది. -
పెద్దపల్లి గూడ్స్ ప్రమాదం: వందేభారత్ సహా రద్దైన రైళ్ల వివరాలివే..
పెద్దపెల్లి, సాక్షి: గూడ్స్ రైలు ప్రమాదంతో కాజీపేట-బలార్ష రూట్(ఢిల్లీ–చెన్నై) రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ మార్గంలో ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. వందేభారత్ సహా పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇంకొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. పునరుద్ధరణకు ఒక్కరోజు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. క్లియరెన్స్‌కు మరో 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన రాఘవాపూర్ స్టేషన్ వద్దకు ఈ ఉదయం దక్షిణ మధ్య రైల్వే అధికారులు చేరుకుని పునరుద్ధరణ పనులను ముమ్మరం చేయించారు.ట్రాక్స్ పునరుద్ధరణకు ప్రత్యేక మిషనరీ తెప్పించారు. బల్లార్షా, కాజీపేట, సికింద్రాబాద్ నుంచి సుమారు 500 మంది సిబ్బందిని తీసుకొచ్చి రైల్వే ట్రాక్స్ పునరుద్ధరణ పనుల్లో స్పీడ్ పెంచారు. ట్రాక్స్ పై అదుపు తప్పి కిలోమీటర్ మేర చెల్లాచెదురుగా పడిన బోగీలను భారీ క్రేన్స్ సాయంతో తొలగిస్తున్నారు.రద్దు.. డైవర్షన్.. రీషెడ్యూల్ఇదిలా ఉంటే.. దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దు చేయడంతో పాటు 10కి పైగా రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. ఇంకొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది. ప్రయాణికులంతా ఇది గమనించాలని.. ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని సూచించింది.నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నాగ్‌పుర్, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-కాగజ్‌నగర్, కాజీపేట-సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్-కరీంనగర్, కరీంనగర్-బోధన్, సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-బల్లార్షా, బల్లార్షా-కాజీపేట, యశ్వంత్‌పూర్-ముజఫర్‌పూర్ రైళ్లను రద్దు చేశారు.అలాగే.. రామగిరి ఎక్స్ ప్రెస్, సింగరేణి ఎక్స్ ప్రెస్, వందే భారత్ ఎక్స్ ప్రెస్, బీదర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్‌లను రద్దు చేశారు.దారి మళ్లించిన రైల్వే వివరాలు జీటీ, కేరళ, ఏపీ, గోరఖ్ పూర్, సంఘమిత్ర, దక్షిణ్, పూణే, దర్భంగా ఎక్స్ ప్రెస్ SCR PR No.610 dt.13.11.2024 on "Railway Helpline Numbers provided in View of Accident Of Goods Train" @drmsecunderabad pic.twitter.com/M7pjbq4GXP— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024 Bulletin No.2 SCR PR No.611 dt.13.11.2024 on "Cancellation/Diversion of Trains due to Goods Train Derailment" @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/cMrk7XTS9d— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024 "Cancellation/PartialCancellation/Diversion/Reschedule of Trains due to Goods Train Derailment" @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/vfOqjCyLvR— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024ఏం జరిగిందంటే..మంగళవారం నిజామాబాద్ నుంచి ఘజియాబాద్ వైపు 43 వ్యాగన్లతో ఐరన్ కాయల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలులోని 11 వ్యాగన్లు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్–కన్నాల గేట్ మధ్యలో 282/35 పోల్ వద్ద పట్టాలు తప్పాయి. రైలు ఇంజిన్, గార్డ్ వ్యాగన్ పట్టాలు తప్పలేదు. దీంతో.. ఈ ప్రమాదం నుంచి లోకోపైలెట్లు ఇద్దరు, గార్డు సురక్షితంగా బయటపడ్డారు. రైలు ఇంజిన్‌వైపు ఉన్న 8 వ్యాగన్లతోసహా గూడ్స్‌ను రామగుండంకు తరలించారు. ప్రమాద తీవ్రతకు పట్టాలు విరిగిపోయి చెల్లాచెదురయ్యాయి. కరెంట్ పోల్స్ సైతం విరిగిపోయాయి. వ్యాగన్లు ఒక్కదానిపైకి ఒక్కటి ఎక్కడంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు కష్టంగా మారాయి. భాగ్యనగర్ రైలు రాఘవాపూర్‌కు చేరుకోగా, దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లిలో ప్రయాణికులను దింపివేశారు. దీంతో మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, ఓదెల, జమ్మికుంట తదితర రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పటికప్పుడు.. వరంగల్ వైపు వెళ్లే మరికొన్ని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. -
సింహాచలం రైల్వే స్టేషన్లో రైలు ప్రమాద మాక్‌డ్రిల్ (ఫొటోలు)
-
నాగ్‌పూర్‌లో పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్
ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోకమాన్య తిలక్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సుభాష్ చంద్రబోస్ రైల్వేషన్ సమీపంలో మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బయలుదేరిన ఈ రైలు షాలిమార్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.రైలులోని S1, S2 కోచ్‌లు, గూడ్స్ కోచ్ పట్టాలు తప్పాయి. అయితే ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో కుట్రకోణం?
చెన్నై: భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనక కుట్రకోణం ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఎన్ఐఏ, రైల్వే అధికారులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైలు ప్రమాదానికి రైల్వే ఉద్యోగులేనన్న అనుమానాలు వస్తున్నాయి.విచారణలో ప్రమాద ప్రాంతంలో స్విచ్ పాయింట్ల బోల్టులు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. లూప్ లైన్లో పట్టాలు ట్రాక్‌గా మారే చోట బోల్ట్‌నట్ విప్పడంతో గూడ్స్ ట్రాక్ మారింది. దీంతో గూడ్స్ ట్రైన్‌ను భాగమతి ఎక్స్ ప్రెస్ ఢీకొట్టినట్లు అధికారులు చెబుతున్నారు.20 మందికి పైగా రైల్వే సిబ్బంది, అధికారులను సౌత్‌జోన్ రైల్వే సేఫ్టీ కమిషనర్ చౌదరి ప్రశ్నించారు. బోల్ట్ విప్పింది బయటి వ్యక్తులు కాదని, రైల్వే ఉద్యోగులేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే దానిపై విచారణ కొనసాగుతుంది. దాని వెనుక కుట్ర కోణంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.కాగా, గత శుక్రవారం (అక్టోబర 11)న రాత్రి 8.27 సమయంలో తమిళనాడులో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) రైలు పొన్నేరి స్టేషన్ దాటింది. తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కవరైపెట్టై స్టేషన్‌కు వస్తున్న సమయంలో ఆ రైలు ప్రధాన లైనుపై నుంచి కాకుండా లూప్లైన్లోకి వెళ్లడం, ఆ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయాయి.ఈ ప్రమాదంలో 13 వరకు కోచ్‌లు పట్టాలు తప్పాయి. పార్సిల్ వ్యానులో మంటలు చెలరేగాయి. రైలు ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు,ఎన్ఐఏ అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా జరిగిన విచారణలో భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై కుట్రకోణం ఉందని సమాచారం. దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది -
అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 8 బోగీలు
-
విద్రోహచర్య కారణంగానే భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం !
న్యూఢిల్లీ: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో అక్టోబర్ 11న జరిగిన మైసూర్–దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం వెనుక విద్రోహుల కుట్ర దాగి ఉందని ముగ్గురుసభ్యుల రైల్వే సాంకేతిక బృందం అనుమానాలు వ్యక్తంచేసింది. ప్రమాదం జరిగిన చోట పట్టాలకు ఎలాంటి బోల్ట్‌లు లేకపోవడం, పట్టాలను ఎవరో బలవంతంగా అపసవ్య దిశలోకి సుత్తితో కొట్టిన గుర్తులు ఉన్నట్లు తెలుస్తోంది. 15 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడిన విషయం తెల్సిందే. సవ్యదిశలో నేరుగా వెళ్లాల్సిన రైలు లూప్లైన్లోకి హఠాత్తుగా వచ్చి ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొనడంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. దీంతో రైల్వే సిగ్నల్, టెలికం, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ బృందం ఆదివారం కవరపేట స్టేషన్‌లోని ఘటనాస్థలిలో దర్యాప్తు మొదలెట్టింది. ‘‘రైల్వేపట్టాల ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలోని భాగాలను విడదీశారు. వీటి గురించి బాగా అవగాహన ఉన్న ఆగంతకులే ఈ పని చేశారు. ఇటీవల కవరపేట స్టేషన్ సమీపంలో ఇలాంటి దుశ్చర్యకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక్కడ మాత్రం సఫలమయ్యారు. ఘటన జరగడానికి నాలుగు నిమిషాల ముందే ఇదే పట్టాల మీదుగా ఒక రైలు వెళ్లింది. అది వెళ్లి మైసూర్–దర్భంగా రైలువచ్చేలోపే బోల్ట్‌లు, విడిభాగాలు విడతీశారు’’ అని అధికారులు వెల్లడించారు. -
రైలు ప్రమాదానికి కారణమేంటీ? దక్షిణ రైల్వే జీఎం స్పందన
తమిళనాడులో శుక్రవారం రాత్రి మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఏకంగా 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్ వద్ద రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై తాజాగా దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ స్పందించారు. మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సిగ్నల్, రూట్ మధ్య అసమతుల్యతే కారణమని తెలిపారు. ‘‘మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌కు మారాలి, కానీ ఏదో తప్పు జరిగింది. గూడ్స్ రైలు నిలిచిన ట్రాక్‌లోని ఎక్స్‌ప్రెస్ రైలు రూట్ మార్చబడింది. సరిగ్గా ఏమి జరిగిందో ఇప్పడే ఏం చెప్పలేం. ఎక్స్‌ప్రెస్ రైలు గూడూరుకు (ఆంధ్రప్రదేశ్‌లోని) వెళుతోంది. ఇది తిరువళ్లూరులోని కవరైప్పెట్టై రైల్వే స్టేషన్లో ఆగింది. అక్కడ గూడూరుకు వెళ్లే గూడ్స్ రైలు కూడా లూప్ లైన్లో ఉంది. అయితే మెయిన్ లైన్‌కు సిగ్నల్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ.. ఎక్స్‌ప్రెస్ రైలు లూప్ లైన్లోకి ప్రవేశించి వెనుక నుంచి గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పడానికి దారి తీస్తుంది.ఇక.. ఈ ప్రమాదంలో 12 కోచ్‌లు పట్టాలు తప్పగా.. 19 మంది గాయపడ్డారు. ఎక్స్‌ప్రెస్ రైలులో 1,300 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎక్స్‌ప్రెస్ రైలులోని ఓ పవర్ కారు కూడా మంటల్లో చిక్కుకుంది. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో రైలు పట్టాలు తప్పడంతో మరమ్మతుల కారణంగా శనివారం షెడ్యూల్ చేసిన 18 రైళ్లు రద్దు చేయబడ్డాయి. కొన్ని రైళ్లను దారి మళ్లించారు.చదవండి: తమిళనాడు రైలు ప్రమాదం.. కేంద్రంపై రాహుల్ మండిపాటు -
తమిళనాడు రైలు ప్రమాదం.. కేంద్రంపై రాహుల్ మండిపాటు
తమిళనాడులో శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఏకంగా 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి.రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్ వద్ద రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.తాజాగా బాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దాదాపు 300 మంది ప్రయాణికుల ప్రాణాలను బలిగొన్న బాలాసోర్ దుర్ఘటనను ప్రస్తావిస్తూ.. గత సంఘటనల నుంచినేర్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.“మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం భయంకరమైన బాలాసోర్ ప్రమాదానికి అద్దం పడుతుంది. ఒక ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. అనేక ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, గుణపాఠాలు నేర్చుకోలేదు. జవాబుదారీతనం లోపించింది. ఈ ప్రభుత్వం మేల్కోకముందే ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి?’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.#WATCH | Tamil Nadu: Latest drone visuals from Chennai-Guddur section between Ponneri- Kavarappettai railway stations (46 km from Chennai) of Chennai Division where Train no. 12578 Mysuru-Darbhanga Express had a rear collision with a goods train, last evening. 12-13 coaches… pic.twitter.com/F7kp7bgLdV— ANI (@ANI) October 12, 2024కాగా ఈ ఘటనలో 19 గాయాలవ్వగా, వారిని సమీపంలోని ఆసుప్రతికి తరలించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. రైలు సేవలను పునరుద్ధరించడానికి మరో 18 గంటలు సమయం పడతుందని పేర్కొన్నారు. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా దెబ్బతిన్న కోచ్‌లు డ్రోన్ ఫుటేజీలో కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ధృవీకరించారు. -
Tiruvallur: సహాయక చర్యలు ముమ్మరం
-
తమిళనాడులో రైలు ప్రమాద ఘటన.. 18 రైళ్ల రద్దు
తమిళనాడులో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్నవిషయం తెలిసిందే. మైసూర్-దర్భంగా భాగమతి ఎకస్ప్రెస్ చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్ వద్ద గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 19 గాయాలయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో 1,360 మంది ప్రయాణికులు ఉన్నారని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ టీ ప్రభుశంకర్ తెలిపారు. 19 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే రైలు మెయిన్‌లైన్‌కు బదులు లూప్ లైన్‌లోనిక ప్రవేశించడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.కాగా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో క్షిణ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. తిరుపతి-పుదుచ్చేరి మెము(16111), పుదుచ్చేరి-తిరుపతి మెము(16112), డా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి ఎక్స్‌ప్రెస్(16203), తిరుపతి-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(16204), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-తిరుపతి(16053), తిరుపతి- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(16054), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-తిరుపతి(16057), తిరుపతి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(16058)అరక్కం-పుదుచ్చేరి మెము(16401), కడప-అరక్కోణం మెము(16402), డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి మెము(06727), , తిరుపతి-డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెము(06728), అరక్కోణం-తిరుపతి మెము(06753), తిరుపతి-అరక్కోణం మెము(06754), విజయవాడ-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్‌ప్రెస్(12711), ఎంజీఆర్ సెంట్రల్-విజయవాడ పినాకిని ఎక్స్‌ప్రెస్(12712) సూళ్లూరుపేట-నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్(06745), నెల్లూరు-సూళ్లూరుపేట మెము ఎక్స్‌ప్రెస్(06746) రైళ్లు రద్దయ్యాయి.The Following Trains are cancelled due to train accident of Train No.12578 #Mysuru – Darbhanga Bagmati Express at Kavaraipettai in #Chennai Division Passengers are requested to take note on this and plan your #travel #SouthernRailway pic.twitter.com/zhgmRo84l3— Southern Railway (@GMSRailway) October 11, 2024Bulletin No.4 PR NO.517 dt. 12-10-2024 @drmvijayawada @drmgnt @drmgtl @drmsecunderabad @drmhyb pic.twitter.com/oOAH0JBgji— South Central Railway (@SCRailwayIndia) October 12, 2024 -
చెన్నై శివారులో ఘోర రైలు ప్రమాదం.. 19 మందికి గాయాలు
సాక్షి, చెన్నై: చెన్నై వైపు వస్తున్న మైసూరు–దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ తిరువళ్లూరు జిల్లా కవరపేట స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొంది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పాక్షికంగా అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం 15 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు వేగం తక్కువగా ఉండడంతో అదృష్టవశాత్తు ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్ నుంచి చెన్నై శివారులోని అరక్కోణం, పెరంబూరు, గుమ్మిడిపూండి మార్గం మీదుగా బిహార్ వైపు ప్రయాణించే దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరింది. ఈ రైలు రాత్రి 8.30 గంటల సమయంలో పొన్నేరి రైల్వేస్టేషన్ దాటి గుమ్మడిపూండి సమీపంలోని కవరపేట వద్ద భారీ కుదుపులకు లోనై లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొంది. ప్రమాదం జరిగిన క్షణాలలో మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. మొత్తం 13 బోగీలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది. #TrainAccident 🚨Visuals from the area where Mysuru - Darbhanga Train collided with a Goods train & derailedMore than 12 Coaches derailed & the condition is worst. Still there's "No Accountability" 😑 pic.twitter.com/UeeOGBGBOt— Veena Jain (@DrJain21) October 12, 2024 ప్రమాదం జరిగిన పరిసరాలు చిమ్మచీకటిగా ఉండడంతో రైలు ప్రయాణికులకు తీవ్ర ఆందోళనతో భీతావహులయ్యారు. ప్రమాద సమాచారంతో గుమ్మిడిపూండి ఎమ్మెల్యే గోవిందరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి ప్రజలతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తిరువళ్లూరు కలెక్టర్ ప్రభుశంకర్,ఎస్పీ శ్రీనివాస పెరుమాల్, రైల్వే పోలీసు ఉన్నతాధికారి ఈశ్వరన్ నేతృత్వంలో బృందం సహాయక చర్యలకు పూనుకుంది. అప్పటికే గ్రామస్తులు రైలు బోగీలలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అరక్కోణం నుంచి వచి్చన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా కట్టడి చేశారు. ›ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చెన్నైకు తరలించారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. Train accident in chennai Tamilnadu near ghumdipundiTrain no. 12578 please help us @AshwiniVaishnaw @PiyushGoyal @PMOIndia @AmitShah @GMSRailway pic.twitter.com/UqPCzaisIE— Rahul (@kumarsankarBJP) October 11, 2024సిగ్నల్ సమస్యే కారణమా? రైలు 109 కిలోమీటర్ల వేగంతో వెళుతూ భారీ కుదుపులకు లోనై లూప్ లైన్లోకి మళ్లింది. గార్డ్ సకాలంలో స్పందించి వేగాన్ని క్రమంగా 90 కి.మీ.కి తగ్గించారు. అప్పటికే ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొంది. ఘటనలో 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఏసీ బోగీలలో స్వల్పంగా మంటలు చెలరేగినా సకాలంలో ఆర్పి వేయడంతో ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాదంలో ఎవ్వరికీ ప్రాణహాని కలగలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. ఘటన కారణంగా ఆంధ్రప్రదేశ్ వైపు చెన్నై నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లు మధ్యలోనే ఆగాయి. అలాగే, గుమ్మిడిపూండి మీదుగా చెన్నైకు రావాల్సిన రైళ్లు ఎక్కడికక్కడ ఆగడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. దక్షిణ రైల్వే యంత్రాంగం 044 25354151, 2435499, అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ హెల్ప్ లైన్ 0866–2571244 నంబర్‌ను ప్రకటించింది. తిరుచి్చ–హౌరా, ఎర్నాకులం–టాటా నగర్, కాకినాడ–దర్బంగా భాగమతి ప్రత్యేక రైలు సేవలను గూడురు మార్గంలో నిలుపుదల చేశారు. వీటిని ప్రత్యామ్నయ మార్గంలో నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. చదవండి: Trichy: ఎయిరిండియా విమానం.. సేఫ్ ల్యాండింగ్ -
మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర..
-
ట్రాక్‌మ్యాన్ సమయస్ఫూర్తి.. రైలుకు తప్పిన పెను ప్రమాదం
న్యూఢిల్లీ: ట్రాక్‌మ్యాన్ సమయస్ఫూర్తి వల్ల పెద్ద రైలు ప్రమాదం తప్పింది. కొంకణ్ రైల్వే డివిజన్ పరిధిలోని కుమటా, హొన్నావర్ మధ్య రైల్వే లైన్లో పట్టాల మధ్య వెల్డింగ్ తొలగిపోయింది. శుక్రవారం విధుల్లో ఉన్న ట్రాక్‌మ్యాన్ మహదేవ్.. ట్రాక్ జాయింట్లో వెల్డింగ్ పోయి ఉండటాన్ని గమనించాడు.అయితే అదే మార్గంలో తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ వస్తుండటాన్నిఆపడానికి మహదేవ్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరగా పట్టాల వెంట పరుగులు తీయడంతో గమనించిన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు.. అతడి సమయస్ఫూర్తిని అభినందించారు. నగదు బహుమతి అందిచారు. -
Paralympics 2024: రైలు ప్రమాదం నుంచి ఒలింపిక్ స్వర్ణం వరకు...
తండ్రి నేవీ ఆఫీసర్... ఆయనను చూసి తానూ అలాగే యూనిఫామ్ సర్వీస్‌లోకి వెళ్లాలనుకున్నాడు... కానీ అనూహ్య ఘటనతో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఐఐటీ వరకు వెళ్లాడు... కానీ శరీరం అక్కడ ఉన్నా మనసు మాత్రం ఆటలపై ఉంది... కానీ అనుకోని వైకల్యం వెనక్కి లాగుతోంది... అయినా సరే ఎక్కడా తగ్గలేదు... అణువణువునా పోరాటస్ఫూర్తి నింపుకున్నాడు. బ్యాడ్మింటన్ క్రీడలోకి ప్రవేశించి పట్టుదలగా శ్రమిస్తూ అంచెలంచెలుగా ముందుకు పోయాడు. ఇప్పుడు పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించి తన కలను పూర్తి చేసుకున్నాడు. పారా షట్లర్ నితేశ్ కుమార్ విజయగాథ ఇది. 2009... నితేశ్ కుమార్ వయసు 15 ఏళ్లు. అప్పటికి అతనికి ఆటలంటే చాలా ఇష్టం. ఫుట్‌బాల్‌ను బాగా ఆడేవాడు. అయితే ఆ సమయంలో జరిగిన అనూహ్య ఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. విశాఖపట్నం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో నితేశ్ తన కాలును కోల్పోయాడు. కోలుకునే క్రమంలో సుదీర్ఘ కాలం పాటు ఆస్పత్రి బెడ్‌పైనే ఉండి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితి మెరుగైనా ఆటలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేయాల్సి వచి్చంది. దాంతో చదువుపై దృష్టి పెట్టిన నితేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), మండీలో సీటు సంపాదించాడు. అక్కడ ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలోనే బ్యాడ్మింటన్ ఆటపై ఆసక్తి పెరిగింది. పారా షట్లర్ ప్రమోద్ భగత్‌ను చూసి అతను స్ఫూర్తి పొందాడు. ఆటగాడిగా ఉండాలంటే ఎంత ఫిట్‌గా ఉండాలనే విషయంలో కోహ్లి నుంచి ప్రేరణ పొందినట్లు నితేశ్æ చెప్పాడు. కోల్పోయిన కాలు స్థానంలో కృత్రిమ కాలును అమర్చుకునే క్రమంలో నితేశ్ పుణేలోని ‘ఆర్టిఫీషియల్ లింబ్స్ సెంటర్’కు చేరాడు. అక్కడ ఎంతో మంది తనకంటే వయసులో పెద్దవారు కూడా ఎలాంటి లోపం కనిపించనీయకుండా కష్టపడుతున్న తీరు అతడిని ఆశ్చర్యపర్చింది. ‘40–45 ఏళ్ల వయసు ఉన్నవారు కూడా కృత్రిమ అవయవాలతో ఫుట్‌బాల్, సైక్లింగ్, రన్నింగ్ చేయడం చూశాను. ఈ వయసులో వారు చేయగా లేనిది నేను చేయలేనా అనిపించింది. ఆపై పూర్తిగా బ్యాడ్మింటన్‌పై దృష్టి పెట్టాను’ అని హరియాణాకు చెందిన నితేశ్ చెప్పాడు. 2020లో జరిగిన పారా బ్యాడ్మింటన్ జాతీయ చాంపియన్‌షిప్‌లో తొలిసారి నితేశ్ బరిలోకి దిగాడు. తను ఆరాధించే భగత్‌తోపాటు మనోజ్ సర్కార్వంటి సీనియర్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకున్నాడు. దాంతో ఈ ఆటలో మరిన్ని సాధించాలనే పట్టుదల పెరిగింది. గత ఒలింపిక్స్‌లో భగత్ స్వర్ణం గెలుచుకోవడం చూసిన తర్వాత తానూ ఒలింపిక్స్ పతకం సాధించగలననే నమ్మకం నితేశ్‌కు కలిగింది. ఈ క్రమంలో గత మూడేళ్లుగా తీవ్ర సాధన చేసిన అతను ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. పారిస్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ విజయాలు అందుకొని స్వర్ణపతకంతో సగర్వంగా నిలిచాడు. –సాక్షి క్రీడా విభాగం -
గజేంద్ర విలాపం
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో వివిధ కారణాల రీత్యా దేశంలోని పలు ప్రాంతాల్లో 528 ఏనుగులు అసహజ రీతిలో మృత్యువాత పడ్డాయంటూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించిన నేపథ్యంలో జంతు ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా విద్యుదాఘాతం కారణంగా గత ఐదేళ్లలో (2019–20 నుంచి 2023–24 వరకు) అత్యధికంగా 392 ఏనుగులు మృత్యువాతపడగా.. ఆ తరువాత రైళ్ల ప్రమాదాల బారిన పడి 73 ఏనుగులు మృతి చెందాయి. వేటాడం ద్వారా 50, విషప్రయోగం చేసి 13 ఏనుగులను హతమార్చారు.విద్యుత్ కంచెలతోనే పెను ముప్పు..అటవీ ప్రాంతం సమీపంలోని పంట పొలాల్లోకి ఏనుగులు రాకుండా రైతులు విద్యుత్ కంచెలను ఏర్పాటు చేస్తుండడంతో అత్యధికంగా ఏనుగులు మృతి చెందుతున్నాయి. విద్యుత్ ఘాతాల నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెలను తొలగించాల్సిందిగా అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ట్రాన్స్మిషన్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. అండర్ గ్రౌండ్ లేదా, పోల్స్ పైన మాత్రమే విద్యుత్ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్రం తెలిపింది.ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కేంద్ర ప్రయోజిత పథకం ద్వారా ఏనుగులు, పరిరక్షణ, వాటి ఆవాసాల్లో చర్యలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. రైలు ప్రమాదాల్లో ఏనుగుల మరణాల నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. రైలు పైలట్లకు స్పష్టమైన వీక్షణను అందించడానికి రైల్వే ట్రాక్‌ల వెంట వృక్ష సంపదను తొలగించడం, ఏనుగు ఉనికి గురించి పైలట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఉపయోగించడం, రైల్వే ట్రాక్‌ల ఎలివేటెడ్ విభాగాలను ఆధునికీకరించడం, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్‌పాస్, ఓవర్‌పాస్‌ను ఏర్పాటు చేయడం, అటవీ శాఖ ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వన్యప్రా ణుల పరిశీలకులు రైల్వే ట్రాక్‌లపై రెగ్యులర్ పెట్రోలింగ్ చేయడం తదితర చర్యలను తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.ఏనుగు దంతాల కోసం.. ఏనుగు దంతాల కోసం అత్యధికంగా ఒడిశా, మేఘాలయ, తమిళనాడులో వేటాడి హతమారుస్తున్నారని, అలాగే అసోం, ఛత్తీస్‌గఢ్‌లో విషప్రయోగం చేస్తున్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రాష్ట్రల్లో ఏనుగుల దంతాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. వేటగాళ్లు, విషప్రయోగాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. విద్యుదాఘాతంతో అత్యధికంగా ఒడిశాలో 71, అసోంలో 55, కర్ణాటకలో 52 మృతి చెందాయి. రైళ్లు ఢీ కొట్టిన ఘటనల్లో అత్యధికంగా అసోంలో 24, ఒడిశాలో 16 మృతి చెందాయి. వేటాడటం ద్వారా ఒడిశాలో అత్యధికంగా 17, మేఘాలయలో 14 ఏనులను చంపేశారు. అసోంలో విషప్రయోగం ద్వారా 10 ఏనుగులను హతమార్చారు. -
విషాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొన్న ఘటనలో తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు. ఈ ఘటన గౌడవెల్లి రైల్వేస్టేషన్ వద్ద జరిగింది.వివరాల ప్రకారం.. రైల్వే లైన్మెన్గా పనిచేస్తున్న కృష్ణ తన ఇద్దరు పిల్లలను తీసుకుని ట్రాక్ వద్ద పనులు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తన కుమార్తెలను ట్రాక్‌పై కూర్చోబెట్టి కృష్ణ పనులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో సడెన్‌గా రైలు రావడంతో ట్రాక్‌పై ఉన్న తన పిల్లలను కాపాడేందుకు కృష్ణ ప్రయత్నించాడు. ఈ క్రమంలో వారిని కాపాడబోయి రైలు తగిలి ముగ్గరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇక, మృతులను రాఘవేంద్రనగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన కూతుర్ల పేరు వర్షిత, వరిణిగా స్థానికులు చెప్తున్నారు. -
Video: రైలు ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న ప్రయాణికుడు
ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గోండా జిల్లాలోని ఝిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైలు పట్టాలు తప్పడంతో.. నాలుగు ఏసీ బోగీలు బోల్తా కొట్టాయి.ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. అనేకమంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 40 మంది సభ్యుల వైద్య బృందం, 15 అంబులెన్స్‌లు సంఘటనా స్థలంలో ఉన్నాయి.కాగా రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఓ ప్రయాణికుడు తృటిలో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మేరకు సంఘటనా స్థలం నుంచే వీడియో రికార్డు చేసి సోషల్ మిడియాలో పోస్టు చేశాడు. ట్రాక్ నుంచి పక్కకు పడిన నాలుగు ఏసీ కోచ్‌ల పక్కన నిలబడి.. తాను తృటిలో ప్రమాదం నుంచి ప్రాణాలతో తప్పించుకున్నట్లు తెలిపాడు. "నేను జీవించి ఉండటం ఒక అద్భుతం. దయచేసి నా గురించి చింతించకండి. నేను సురక్షితంగా ఉన్నాను. అని పేర్కొన్నాడు. వీడియోలో అతని వెనుక ఇతర ప్రయాణికులు అరుస్తూ, ఏడుస్తూ ఉండటం కనిపిస్తుంది.Gonda Train Accident: At least 10 coaches of the #DibrugarhExpress derailed in #UttarPradesh's #Gonda. The train was going from #Chandigarh to #Assam's #Dibrugarh. There is no information on casualties as of now.#TrainAcciden #UPTrainAccident #ChandigarhDibrugarhExpress pic.twitter.com/PgBFhXvUMT— Hate Detector 🔍 (@HateDetectors) July 18, 2024 -
యూపీలో రైలు ప్రమాదం.. నలుగురు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో రైలు ప్రమాదం సంభవించింది. గోండా జిల్లాలో దిబ్రూఘఢ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బ్రజేశ్ పాథక్ తెలిపారు. #WATCH | Visuals from Uttar Pradesh's Gonda, where coaches of the Dibrugarh-Chandigarh Express derailed. Rescue operation underway."One person has died in the incident, 7 injured " says Pankaj Singh, CPRO, North Eastern Railway pic.twitter.com/UyKlUsJFfx— ANI (@ANI) July 18, 2024బుధవారం రాత్రి రైలు నెంబర్ 15904 చండీగఢ్ రైల్వే స్టేషన్ నుంచి దిబ్రూఘఢ్(అసోం)కు బయల్దేరింది. గురువారం మధ్యాహ్న సమయంలో గోండా-మంకాపూర్ సెక్షన్లో మోతిఘడ్ స్టేషన్ దాటాక.. పికౌరా వద్ద ప్రమాదానికి గురైంది. కాసేపట్లో జిలాహి స్టేషన్‌కు రైలు చేరుకోవాల్సి ఉండగా.. రైలు పట్టాలు తప్పింది. ఒక్కసారిగా 12 బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.సమాచారమందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 15 అంబులెన్స్‌లు, మెడికల్ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగు ఏసీ బోగీలు బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. బోగీల నుంచి గాయాలపాలైన ప్రయాణికులు కొందరు.. లగేజీతో కొందరు బయటకు వస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. మరోవైపు.. ప్రమాదం గురించి తెలియగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. అధికారుల్ని సహాయక చర్యల్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. మరోవైపు అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కూడా ప్రమాదం గురించి ఆరా తీశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారాయన. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రమాదం కారణంగా ఈ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కనీసం 13 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని రైళ్లను రద్దు చేశారు. #WATCH | On the Dibrugarh-Chandigarh express derailment, Pankaj Singh, CPRO, North Eastern Railway says, "...medical van of Railways has reached the spot and rescue operation has been started. Helpline numbers have been issued. It happened around 2.37 pm. As per initial info, 4-5… pic.twitter.com/RoYszfPgn3— ANI (@ANI) July 18, 2024In regard with the derailment of 15904 Dibrugarh Express in Lucknow division of North Eastern Railway, the helpline numbers are issued: Indian Railways https://t.co/ggCTJKvOAv pic.twitter.com/jjRp1vgIjB— ANI (@ANI) July 18, 2024Uttar Pradesh: Chandigarh-Dibrugarh train derails in Gonda-Mankapur section. More details awaited pic.twitter.com/uInKCLaY4v— ANI (@ANI) July 18, 2024 -
వేగంగా, క్షేమంగా పట్టాలెక్కితేనే...
ఈ నెలలో పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదం రైల్వేల పనితీరును మరోసారి వార్తల్లోకి తెచ్చింది. కాగ్ నివేదిక ప్రకారం, రైళ్లలో అత్యంత ప్రమాదాలకు కారణం అవుతున్నవి సిగ్నల్ వైఫల్యాలు, పట్టాల్లో బీటలు. భద్రతా ప్రమాణాలకు తోడు, నత్తనడక వేగం వల్ల రైల్వేలు తమ మార్కెట్ వాటాను కోల్పోయాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సగటు వేగం గంటకు 50 – 51 కిలోమీటర్ల మధ్యనే ఉండిపోయిందనీ, ‘మిషర్ రఫ్తార్’ ద్వారా సగటు వేగం 75 కిలోమీటర్లకు పెరిగిందన్నది ప్రచారమేననీ తేలింది. వందే భారత్ రైళ్లు వేగం కంటే హంగులకే ప్రసిద్ధి చెందాయి. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో రైల్వే వ్యవస్థ అన్ని విధాలుగా పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజల అవసరాలు తీరుతాయి.భారతీయ రైల్వే మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ నెల 16న పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి వద్ద ఓ గూడ్సు బండి, ప్యాసెంజర్ రైలును ఢీకొట్టడంతో తొమ్మిది మంది మరణించగా, సుమారు 40 మంది గాయపడ్డారు. 1995 నుంచి తీసుకుంటే దేశంలో కనీసం ఏడు భయంకరమైన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఐదింటిలో 200కు పైగా ప్రాణాలు పోయాయి. ఇంకోదాంట్లో 358 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ వద్ద 1995లో జరిగింది. ఏడాది క్రితం ఒడిశాలోని బాలాసోర్ వద్ద పలు రైళ్లు ఢీకొనడంతో 287 మంది చనిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఏడు ప్రమాదాల్లోనే విలువైన 1,600 ప్రాణాలు గాల్లో కలిసిపోవడం గమనార్హం. 140 కోట్ల జనాభా కలిగిన మనలాంటి దేశంలో రైల్వే వ్యవస్థ పటిష్టంగా ఉండాలనీ, రోడ్డు, వాయు మార్గాలతో పోటీపడేలా ఉన్నప్పుడే ప్రజల అవసరాలు తీర్చగలమనీ రైల్వే ప్లానర్స్ చెబుతారు. రైల్వే బోర్డు లేదా కేంద్ర ప్రభుత్వం రెండూ ఈ ప్రాథమ్యాన్ని కాదని అనలేదు. రైల్వే వేగం రెట్టింపు చేస్తామనీ, మరిన్ని రైల్వే లైన్లతోపాటు భద్రతను కూడా పెంచుతామనీ కేంద్రం తరచూ ప్రకటనలు చేస్తూనే ఉంటుంది. ప్రధానమైన రైల్వే రూట్లలో రద్దీ విపరీతమైన నేపథ్యంలో ఇది అవసరం కూడా. కాకపోతే ఈ మాటలు ఇప్పటివరకూ మాటలకే పరిమితం కావడం గమనార్హం. గూడ్స్, ప్యాసెంజర్ రవాణా రెండింటిలోనూ రైల్వేలు తమ మార్కెట్ వాటాను ఎప్పుడో కోల్పోయాయి. 2010–12 మధ్యకాలంలో ఈ రెండింటిలో వృద్ధి స్తంభించిపోయింది. రోడ్డు, వాయు మార్గాల వాటా ఏటా 6 నుంచి 12 శాతం వరకూ పెరిగాయి. 2014–15 నుంచి 2019 – 20 మధ్యలో ప్రయాణికుల సంఖ్య కిలోమీటర్‌కు 99,500 కోట్ల నుంచి కిలోమీటర్‌కు 91,400 కోట్లకు పడిపోవడం గమనార్హం. అదే గూడ్స్ రవాణా విషయానికి వస్తే, అది కిలోమీటర్‌కు 68,200 – 73,900 టన్నుల మధ్యే నిలిచిపోయింది. 2019–20 నుంచి ఇప్పటి వరకూ ఉన్న కాలంలో ప్యాసెంజర్, గూడ్స్ రవాణా గణాంకాలను రైల్వే శాఖ వెల్లడించలేదు.దేశంలో రవాణాలో రైల్వేది గుత్తాధిపత్యం అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతం అది తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మార్కెట్ వాటా తగ్గుదల ఇప్పటిమాదిరే ఇంకో పదేళ్లు కొనసాగితే రైల్వేలు రెండో తరగతి రవాణా వ్యవస్థలుగా మారిపోతాయి. రైల్వే లైన్లు, వేగం, భద్రతా ప్రమాణాలు పెరగకపోవడాన్ని బట్టి చూస్తే భారతీయ రైల్వే ప్రస్థానం ఈ దిశగానే సాగుతోందని అనాలి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి విశాలమైన, జనాభా తక్కువ ఉన్న దేశాల్లో రైల్వేలు ఇప్పుడు ఇదే దశలో ఉన్నాయి. అయితే భారతదేశంలోని జనాభా సాంద్రత, ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న వైనాలను దృష్టిలో పెట్టుకుంటే రైల్వేల తిరోగమనం మంచిది కాదు.రైళ్లలో భద్రత అంశాన్ని విస్తృత దృష్టికోణంతో చూడాల్సి ఉంటుంది. గత రెండు దశాబ్దాల్లో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే రైల్వే బోర్డు ఒక దిశ, దిక్కూ లేకుండా పని చేస్తోంది. అకస్మాత్తుగా విధానాల మార్పులు జరిగిపోతుండటంతో విస్తరణ, వృద్ధికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. నత్తనడకన నడుస్తున్న రైళ్లను మరింత వేగంగా పరుగెత్తించడంలో బోర్డు ఘోరంగా విఫలమైంది. రైళ్ల రాకపోకలు దైవాధీనమన్న పరిస్థితి ఇప్పటికీ మారలేదు. భద్రతపై ఆందోళనలూ పెరిగిపోతున్నాయి. రైల్వేల భద్రత, వేగం, సమయపాలన విషయాల్లో భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవలే రెండు ముఖ్యమైన నివేదికలు సమర్పించారు. 2014–19 మధ్యలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైల్వేల సగటు వేగంలో పెద్దగా మార్పుల్లేవనీ, గంటకు 50 – 51 కిలోమీటర్ల మధ్యనే ఉండిపోయిందనీ స్పష్టం చేసింది. ‘మిషర్ రఫ్తార్’ ద్వారా సగటు వేగం గంటకు 75 కిలోమీటర్లకు పెరిగిందన్న ప్రచారం వట్టిదేనని తేల్చింది. సరుకు రవాణా రైళ్ల విషయంలో రైల్వే బోర్డు చెప్పుకొంటున్నట్లుగా వేగం రెట్టింపు కాకపోగా, సగటు వేగం కొంత తగ్గినట్లు ఈ నివేదిక తెలిపింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, రైళ్లను గంటకు 110–130 కి.మీ. వేగం నుంచి, గంటకు 160 – 200 కి.మీ. వేగంతో పరుగెత్తించేందుకు కావాల్సిన టెక్నాలజీ, కోచుల తయారీ సామర్థ్యాలను భారత్ 20 ఏళ్ల క్రితమే సముపార్జించుకోవడం! కాగ్ విడుదల చేసిన రెండో నివేదిక ప్రమాదాలకు సంబంధించినది. ప్రమాదాల సంఖ్యలో కొంత తగ్గుదల ఉంది. మనుషుల కావలి లేని గేట్ల దగ్గర మనుషులను పెట్టడం దీనికి ముఖ్య కారణం. కానీ పట్టాలు తప్పిపోవడం, ఢీకొనడం వంటి వాటి విషయంలో పెద్దగా పురోగతి లేదు. సిగ్నల్ వైఫల్యాలు, రైల్ ఫ్రాక్చర్లు(పట్టాల్లో బీటలు) పెరిగిపోతూండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ రైల్వేల్లో అత్యంత భారీ ప్రమాదాలు ఈ రెండు కారణాలతోనే జరగడం గమనార్హం. బాలాసోర్‌లో గత ఏడాది సంభవించిన ప్రమాదానికి సిగ్నల్ వైఫల్యం కారణమన్నది తెలిసిన విషయమే. మొత్తమ్మీద కాగ్ నివేదికలు రెండింటి సారాంశం చూస్తే రైల్వేల్లోని వ్యవస్థల వైఫల్యానికి వేగం, సామర్థ్యం పెంపు వంటివి తోడయ్యాయి. ఫలితంగా భద్రత అంతంత మాత్రంగా మారిపోయింది. సమయపాలన అసాధ్యంగా మారింది. భారతీయ రైల్వేల్లో ప్రస్తుత నెట్వర్క్ తిరోగమన దిశలో ఉంటే... ఏటికేడాదీ భారీ ప్రాజెక్టుల ప్రకటన కొనసాగుతూనే ఉంది. వీటి ఆర్థిక వెసలుబాటు గురించి ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ప్రధాన బ్రాడ్‌గేజ్ లైన్‌తో అనుసంధానం కాకుండా ఉండే ‘స్టాండ్ అలోన్ బుల్లెట్ ట్రైన్లు’ వీటిల్లో ఒకటి. ఈ లైన్లు అన్నీ స్టాండర్డ్ గేజ్‌పై నిర్మించినవి. అలాగే సరుకు రవాణాకు ఉద్దేశించిన కారిడార్ పొడవాటి, బరువైన రైళ్ల కోసం సిద్ధం చేసినది. దేశంలో తొలి బుల్లెట్ రైలు నిర్మాణం 2017లో మొదలైంది. 2012లోనే సరుకు రవాణాకు ప్రత్యేకమైన కారిడార్ల నిర్మాణం మొదలైంది. ఇదిలా ఉంటే... గత మూడేళ్లలోనే దేశంలో సుమారు 50 జతల ‘సెమీ హై స్పీడ్’ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఇవి వేగం కంటే వాటి హంగులకే ఎక్కువ ప్రసిద్ధి చెందాయి. ఒక్క విషయమైతే స్పష్టం. రైల్వే బోర్డు తన ప్రాథమ్యాలను సమగ్రంగా సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి కొత్త ప్రభుత్వం ఈ అంశాన్ని తలకెత్తుకుంటుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం.అలోక్ కుమార్ వర్మ వ్యాసకర్త రైల్వే విశ్రాంత చీఫ్ ఇంజినీర్ -
ప్రమాద రహిత రైల్వేలు కలేనా?
పశ్చిమ బెంగాల్‌లోని రంగపాణి రైల్వే స్టేషన్ సమీపంలో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డౌన్ కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు వెనుక నుండి ఢీకొట్టడంతో చాలా మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. రైల్వేవారు భద్రతా ప్రమాణాల పట్ల సరియైన శ్రద్ధ, చిత్తశుద్ధి కనపరచడం లేదనటానికి ఈ ప్రమాదం ఒక నిదర్శనం. ఈ ప్రమాదం అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. గూడ్స్ రైలు నిర్దేశించిన వేగం కంటే అధిక వేగంతో నడపడానికి ఎందుకు అనుమతించారు? అసలు రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై వెళ్ళటానికి బాధ్యులు ఎవరు?ఈ సంఘటన మానవ తప్పిదమని, దుర్ఘటనకు గూడ్స్‌రైలు డ్రైవర్ కారణమని రైల్వే వర్గాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా మానవ వనరుల కొరత సంగతీ వెలుగులోకి వస్తోంది. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను దాదాపు ఇరవై వేలు ఏళ్లతరబడి నింపకుండా వదిలేశారు. ఈ మానవ వనరుల కొరత... రైలు డ్రైవర్లు ఎక్కువ షిఫ్టులలో పనిచేయడానికి దారితీస్తోంది. ఫలితంగా ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి.2016లో ప్రారంభించిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (కవచ్)ను ఫీల్డ్ ట్రయల్స్ కోసం కేవలం 1,500 కిలోమీటర్ల కంటే తక్కువ రైల్వే ట్రాక్‌లలో మాత్రమే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భారతీయ రైల్వేల మొత్తం ట్రాక్ దాదాపు 70 వేల కిలోమీటర్లు. కాలానుగుణంగా అవసరాలకు తగ్గట్టు కవచ్ వంటి భద్రతా వ్యవస్థల ఏర్పాటుతోపాటు, మౌలిక సదుపాయాల ఆధునికీకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.నాణ్యతతో కూడిన భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలి. ఈ దుర్ఘటనపై న్యాయవిచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించి శిక్షించాలి. అదేవిధంగా ఇటువంటి దుర్ఘటనలు మునుముందు ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ప్రభుత్వం, రైల్వే బోర్డు వారు, రైల్వే శాఖలోని అన్ని విభాగాల ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, సాంకేతిక నిపుణులు, మేధావులు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కూడిన ఒక సంఘాన్ని ఏర్పాటు చే సి; దాని సూచనలతో కఠినమైన భద్రతా నియమ నిబంధనలు రూపొందించాలి.వీటిని కఠినంగా అమలుపరచడానికి అవసరమైతే పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి. రైల్వేలోని అన్ని విభాగాలలో ఖాళీలను వెనువెంటనే భర్తీ చేయాలి. ఆధునిక అత్యంత సాంకేతికతతో వేగంగా నడిచే ‘వందే భారత్’ రైళ్ళతో సమానంగా అదే స్థాయిలో భద్రతతో కూడిన సురక్షితమైన ప్రయాణ పరిస్థితులు కల్పించినప్పుడే భారత రైల్వే పట్ల ప్రయాణికులకు ఒక భరోసా కలుగుతుంది. – దండంరాజు రాంచందర్ రావు, హైదరాబాద్ -
చనిపోయాడనుకున్న వ్యక్తి.. బతికొచ్చాడు!
బషీరాబాద్: చనిపోయాడని ఓ వ్యక్తి అంత్య క్రియలకు బంధువులు అన్ని ఏర్పాట్లు చేసు కున్నారు. మృతదేహాన్ని పొలంలో ఖననం చేసేందుకు సిద్ధమయ్యారు. చివరకు పాడె ఎత్తే సమయానికి చనిపోయాడనుకున్న వ్యక్తి ఇంటి దగ్గర ఆటోలో దిగాడు. దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ విచిత్ర ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నావంద్గీ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ చోరీ చేసిన వ్యక్తి మరణించడంతో...గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప (40) బషీరాబాద్‌లో ఓ నాయకుడి దగ్గర పశువుల కాపరిగా పనిచేస్తుండే వాడు. మూడు రోజు లుగా పనికి వెళ్లలేదు. ఇంట్లోనూ చెప్పకుండా తాండూరు వెళ్లాడు. అక్కడ అడ్డకూలీ పనికి వెళ్లి రాత్రికి తాండూరు రైల్వే స్టేషన్లో పడుకునేవాడు. శుక్రవారం అతడి సెల్‌ఫోన్‌ను రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి దొంగిలించాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వికారాబాద్ రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.మృతుడి దగ్గర లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా రైల్వే పోలీసులు ఎల్లప్ప కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో భార్య ఎములమ్మ, బంధువులు, గ్రామస్తులు ఆదివారం ఉదయం వికా రాబాద్ ఆస్పత్రికి చేరుకున్నారు. తలలేని శరీరంపై పుట్టుమచ్చలు గుర్తుపట్టి తమకు సంబంధించిన వ్యక్తి అని చెప్పడంతో శవాన్ని అప్పగించారు. అంబులెన్సులో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబీకులు, బంధువుల రోదనలతో ఇంట్లో వి షాదం నెలకొంది. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగానే ఎల్లప్ప తాపీగా ఆటోలో వచ్చి ఇంటి వద్ద దిగాడు. దీంతో ఎల్లప్ప సెల్‌ఫోన్ చోరీ చేసిన వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు గుర్తించి మృతదేహాన్ని తిరిగి రైల్వే పోలీసులకు అప్పగించారు. -
హైదరాబాద్: మెట్టుగూడ వద్ద రైలులో మంటలు
హైదరాబాద్, సాక్షి: సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద ఆగి ఉన్న ఓ రైలులో మంటలు చెలరేగాయి. రెండు ఏసీ భోగీల్లోంచి దట్టమైన మంటలు, పొగ చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. ఫైర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నారు. -
కలలు మాని... కళ్ళు తెరవాలి!
ఏడాది గడిచిందో లేదో... సరిగ్గా అదే రకమైన దుర్ఘటన. అవే రకమైన దృశ్యాలు. మళ్ళీ అవే అనునయ విచారాలు, నష్టపరిహారాలు, దర్యాప్తుకు ఆదేశాలు, భద్రతే తమకు ముఖ్యమంటూ సర్కారీ ప్రకటనలు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సీల్డా వెళుతూ ఆగివున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలు గుద్దుకున్న సోమవారం నాటి ప్రమాద దృశ్యాలు, తదనంతర పరిణామాలు చూస్తే సరిగ్గా అలాగే అనిపిస్తుంది. నిరుడు జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, మరో రెండు రైళ్ళు ఢీ కొట్టుకోవడంతో 290 మందికి పైగా మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డ దారుణ ఘటన ఇప్పటికీ మదిలో మెదులుతూనే ఉంది. ఇంతలోనే ఇప్పుడు ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్లో జనం బక్రీద్ హడావిడిలో ఉండగా ఉదయం తొమ్మిది గంటల వేళ జరిగిన తాజా రైలు ప్రమాదం పాలకులు పాఠాలు నేర్చుకోలేదని తేల్చింది. గూడ్స్ పైలట్, కో–పైలట్ సహా పది మంది ప్రాణాలను బలి తీసుకొని, 40కి పైచిలుకు మందిని గాయాలపాలు చేసిన ఈ దుర్ఘటన మన రైల్వే వ్యవస్థలో లోటుపాట్లను మరోసారి బయటపెట్టింది. ప్రమాదం జరగడానికి మూడు గంటల ముందు ఉదయం 5.50 గంటల నుంచే రెండు స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ చెడిపోయిందని వార్తలు వచ్చాయి. సిగ్నల్‌ను పట్టించుకోకుండా గూడ్స్ ట్రైన్ ముందుకు పోవడం వల్లే ప్రమాదం సంభవించిందని రైల్వే బోర్డ్ ఛైర్పర్సన్ జయావర్మ సిన్హా ఉవాచ. కానీ, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయనప్పుడు రెడ్ సిగ్నళ్ళను పట్టించుకోకుండా ముందుకు సాగాల్సిందిగా సర్వసాధారణంగా ఇచ్చే టీఏ 912 మెమోను స్టేషన్ మాస్టర్ ఇవ్వడం వల్లే రైళ్ళు రెండూ ఒకే లైనులో ముందుకు సాగాయట. విభిన్న కథనాలు, వాదనలు, తప్పొప్పులు ఏమైనా అమాయకుల ప్రాణాలు పోవడం విచారకరం. లెక్క తీస్తే 2018–19 నుంచి 2022–23 మధ్య అయిదేళ్ళలో తీవ్ర పర్యవసానాలున్న రైలు ప్రమాదాలు సగటున ఏటా 44 జరిగాయి. దాదాపు 470కి పైగా జరిగిన 2000–01 నాటితో పోలిస్తే ఈ సంఖ్య తగ్గినట్టే కానీ, పెరిగిన సాంకేతికత, పాలకుల ప్రగల్భాలతో పోలిస్తే ఇప్పటికీ ఎక్కువే. ముఖ్యంగా రైళ్ళు ఢీ కొంటున్న ఘటనలు ప్రతి 3.6 నెలలకు ఒకటి జరుగుతున్నాయట. దేశంలోని మొత్తం 18 రైల్వే జోన్లలో దక్షిణ రైల్వే లాంటి ఆరింటిలో మినహా, మిగతా అన్నిటా నిరుడు ఏదో ఒక ప్రమాదం సంభవించింది.రైలు ప్రమాదాలను అరికట్టాలనీ, ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలనీ చాలాకాలంగా చర్చ జరుగుతోంది. రైళ్ళు ఢీకొనే ప్రమాదం లేకుండా చూసేందుకు ప్రయోగాలూ సాగాయి. ప్రమాదాలను నివారించేందుకు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ‘కవచ్’ను మూడు భారతీయ సంస్థలు దేశీయంగా రూపొందించాయి. ఈ ‘కవచ్’ భద్రతా వ్యవస్థ రైళ్ళ వేగాన్ని నియంత్రించడమే కాక, ప్రమాద సూచికలు డ్రైవర్ల దృష్టిని దాటిపోకుండా తోడ్పడుతుంది. మసక మసక చీకటిలోనూ భద్రతను అందిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ‘కవచ్’ను ప్రవేశపెట్టామని పాలకులు చాలా కాలంగా గొప్పలు చెబుతున్నారు. కానీ, భారత రైల్వే వ్యవస్థ దాదాపు లక్ష కిలోమీటర్ల పైచిలుకు పొడవైనది కాగా, దశలవారీగా 1500 కి.మీల మేర మాత్రమే ‘కవచ్’ ఇప్పటికి అందుబాటులోకి వచ్చింది. ఈ నత్తనడక ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వ పట్టింపులేనితనానికి నిదర్శనం. అసలు ఒకప్పటిలా రైల్వేలకూ, రైల్వే శాఖకూ ప్రాధాన్యం ఉందా అంటే అనుమానమే. రైలు సేవల్లో సామాన్యుల హితం కన్నా హంగులు, ఆర్భాటాలు, ఎగువ తరగతి సౌకర్యాలకే పెద్ద పీట వేస్తున్నారు. సౌకర్యాల పేరిట అధిక ఛార్జీలు, వందే భారత్ ౖరైళ్ళు, సుందరీకరణ లాంటివాటి మీదే సర్కారు దృష్టి తప్ప, సాధారణ రైళ్ళ సంగతి పట్టించుకోవట్లేదు. సరిపడా కోచ్‌లు, బెర్తులు కరవన్న మాట అటుంచి, కనీసం కూర్చొనే జాగా కూడా లేక శౌచాలయాల వద్దే ఒకరిపై ఒకరుపడుతున్న జనంతో క్రిక్కిరిసిన రైళ్ళు మన దేశంలో నిత్య దృశ్యాలు. వీటన్నిటి మధ్య భద్రత మాట సరేసరి! గతంలో సాధారణ బడ్జెట్‌కు దీటుగా రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ఉండేది. 1924 నుంచి ఉన్న ఆ రెండు వేర్వేరు బడ్జెట్ల విధానానికి 2017లో బీజేపీ సర్కార్ స్వస్తి పలికింది. ఫలితంగా ఆ తర్వాత రైల్వే శాఖకు వెలుగు తగ్గింది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదికి, అందులోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలకే రైల్వే సౌకర్యాల విస్తరణలో సింహభాగం వడ్డిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఒకప్పటి రైల్వే మంత్రి, బెంగాల్ ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ మాటల్లో చెప్పాలంటే, రైల్వేస్ ఇప్పుడో అనాథ. ఇక, నిరుటి పాలనలో లాగే... కొత్త మోదీ సర్కారులోనూ అశ్వినీ వైష్ణవ్‌కే రైల్వే శాఖ అప్పగించారు. పేరుకు ఆయన రైల్వే మంత్రే కానీ, కీలకమైన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ, సమాచార ప్రసార శాఖ సైతం ఆయన వద్దే ఉన్నాయి. దేనికదే అత్యంత ముఖ్యమైన మూడు శాఖలను వైష్ణవ్ ఒక్కరే నిర్వహించడం భారమే. ఇవన్నీ కాక సోమవారం రైలు ప్రమాదం జరిగిన కొద్ది గంటలకే... ఆయనను రానున్న అసెంబ్లీ ఎన్నికలకై మహారాష్ట్రలో పార్టీ ఎన్నికల కో–ఇన్‌ఛార్జ్‌గా కూడా బీజేపీ నియమించడం మరీ విడ్డూరం. పాలనా ప్రాధాన్యాల పట్ల అలసత్వానికి ఇది మచ్చుతునక. దేశంలో మునుపెన్నడూ జరగనంత ప్రమాదమైన బాలాసోర్ విషాదం తర్వాతా మనం మారలేదు. సీబీఐ దర్యాప్తు చేసి, ఛార్జ్‌షీట్ దాఖలు చేసినా ఆ కేసు ఇంకా కోర్టులోనే మూలుగుతోంది. అందుకే, ఇకనైనా సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునికీకరణ, రైల్వే ప్రయాణ భద్రతను పెంచడం ప్రాధమ్యం కావాలి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ల గురించి రంగుల కలలు చూపిస్తున్న మన పాలకులు తాజా ఘటనతోనైనా క్షేత్రస్థాయి వాస్తవాలపై కళ్ళుతెరవాలి. ఉట్టికెగరలేకున్నా, స్వర్గానికి నిచ్చెన వేస్తామంటే హాస్యాస్పదం. -
బెంగాల్లో రైలు ప్రమాదం.. 10కి చేరిన మృతులు
న్యూఢిల్లీ/కోల్‌కతా/ సిలిగురి: పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం సంభవించిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో, మృతుల సంఖ్య 9 నుంచి 10కి చేరుకుందన్నారు. సీల్డాకు వెళ్తున్న గూడ్స్ రైలు సోమవారం ఉదయం రంగపాణి రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న కాంచనజంగ రైలును వెనుక నుంచి ఢీకొట్టిన విషయం తెల్సిందే.ఘటనలో మృతి చెందిన, గాయాలపాలైన వారిని వదిలేసి ప్రమాదానికి గురవని బోగీలతో 850 మంది ప్రయా ణికులతో సోమవారం మధ్యాహ్నం బయలుదేరిన కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ మంగళవారం వేకువజామున సీల్డాకు చేరుకున్నట్లు ఈస్టర్న్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. సీల్డా నుంచి ప్రయాణికులను వారిని గమ్య స్థానాలకు చేర్చేందుకు 16 బస్సులు, 60 కార్లను ఏర్పాటు చేశామన్నారు.కుమార్తె బర్త్‌డే కోసం వస్తూ...సోమవారం జరిగిన రైలు ప్రమాదం కోల్‌కతాకు చెందిన సృష్టి అనే 11 ఏళ్ల చిన్నారికి తీరని వేదన మిగిల్చింది. ఈమె తండ్రి శుభొజిత్ మాలి(31) ఆఫీసు పని మీద శుక్రవారం సిలిగురి వెళ్లారు. మరికొద్ది రోజులపాటు ఆయన అక్కడే ఉండిపోవాల్సి ఉంది. కానీ, సృష్టి బర్త్‌డే వేడుకలో పాల్గొనేందుకు ముందుగానే సోమవారం బయలుదేరారు. కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కే ముందు సృష్టికి వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఎలాగోలా సమయానికి వచ్చేస్తా.బర్త్‌డే ఘనంగా చేసుకుందామని, కేకు తీసుకొస్తానని కూతురికి మాట ఇచ్చారు. కానీ, విధి మరోలా ఉంది. రైలు ప్రమాదంలో మరణించిన వారిలో శుభొజిత్ కూడా ఉన్నారు. అదే రైలులో ప్రయాణించిన ఆయన స్నేహితుడు ఈ విషాద వార్తను కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో, శుభొజిత్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగింది. ఎప్పుడూ బస్సులోనే ప్రయాణించే శుభొజిత్.. ఈసారి మాత్రం కుమార్తె పుట్టిన రోజు వేడుక జరపాలనే తొందరలో రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారని, ఇదే ఆయన ప్రాణాలు తీసిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి: ఖర్గేదేశంలో రైల్వే వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. మోటారు సైకిల్‌పై కూర్చుని ప్రమాద స్థలికి మంత్రి చేరుకోవడంపై స్పందిస్తూ. అశ్వినీ వైష్ణవ్ రైల్వే మంత్రినా లేక రీల్ మంత్రినా అంటూ ఎద్దేవా చేశారు. -
పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం...ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన గూడ్సు రైలు
న్యూజల్పాయ్గురి/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న గూడ్స్ రైలు రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి అదే ట్రాక్‌పై నిలిచిఉన్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. త్రిపురలోని అగర్తలా నుంచి బెంగాల్‌లోని సీల్డాకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఇందులో ఒక గార్డు కోచ్, రెండు పార్సల్ కోచ్‌లు ఉన్నాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికుల కోచ్‌లకు నష్టం వాటిల్లలేదు. ఉత్తర బెంగాల్లో న్యూజల్పాయ్గురి రైల్వేస్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని రంగపాణి స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. గూడ్సు రైలు లోకో పైలట్, ఎక్స్‌ప్రెస్ రైలు గార్డుతోపాటు ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. రైలు ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రైల్వేశాఖతోపాటు పశ్చిమ బెంగాల్ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. కోచ్‌ల్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.రెడ్ సిగ్నల్ పడినా.. గూడ్సు రైలు లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లే రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో మానవ తప్పిదం ఉండొచ్చని, రెడ్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ లోకో పైలట్ ఆగకుండా ముందుకు దూసుకెళ్లడంతో ఎక్స్‌ప్రెస్ రైలును వెనుకనుంచి ఢీకొట్టినట్లు భావిస్తున్నామని రైల్వే బోర్డు చైర్పర్సన్ జయవర్మ సిన్హా చెప్పారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు చోటుచేసుకున్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఒకే సింగిల్ ట్రాక్‌పై రెండు రైళ్లు అత్యంత సమీపంలోకి వచ్చేలా సిగ్నల్ ఎలా ఇచ్చారన్న దానిపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద తీవ్రతకు కాంచనజంగ్ ఎక్స్‌ప్రెస్ చివరి భాగంలోని మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. రెండు కోచ్‌లు పూర్తిగా పక్కకు ఒరిగిపోగా, మరో కోచ్ గాల్లోకి లేచి అలాగే వేలాడుతోంది. గూడ్సు రైలు ఇంజన్ దానికిందికి చొచ్చుకొచి్చంది. వేలాడుతున్న కోచ్‌ను అధికారులు తొలగించారు. మధ్యాహ్నం 12.40 గంటలకు మిగిలిన కోచ్‌లతో ఎక్స్‌ప్రెస్ రైలు ఘటనా స్థలం నుంచి కోల్‌కతా వైపు ప్రయాణం సాగించింది. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ దర్యాప్తు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించడానికి రైల్వేశాఖ మంత్రి వైష్ణవ్ రంగంలోకి దిగారు. లిఫ్ట్ అడిగి బైక్‌పై ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షల చొప్పున, స్వల్పగాయాలైన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి దిగ్భ్రాంతి సాక్షి, న్యూఢిల్లీ: పశి్చమ బెంగాల్లో జరిగిన ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేíÙయా, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇదంతా మోదీ సర్కారు నిర్వాకం: కాంగ్రెస్ బెంగాల్ రైలు ప్రమాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రైల్వేశాఖను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. మోదీ పదేళ్ల పాలనలో రైల్వేశాఖ తల్లిదండ్రులు లేని అనాథగా మారిందని సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. రైల్వే శాఖ గత వైభవాన్ని కోల్పోయిందన్నారు.ఆ మార్గంలో ‘కవచ్’ లేదు రైళ్లు పరస్పరం ఢీకొట్టకుండా కవచ్ వ్యవస్థను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. అయితే, గౌహతి–ఢిల్లీ మార్గంలో ఈ వ్యవస్థను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. కాంచనజంగ ప్రమాదం జరిగిన ప్రాంతం ఇదే మార్గంలో ఉంది.కొంపముంచిన టీఏ912 లెటర్! కాంచనజంగ రైలు ఘటనలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం వెనుక గూడ్సు రైలు లోకో పైలట్ తప్పిదం లేదని తెలుస్తోంది. రాణిపాత్ర స్టేషన్, ఛత్తర్‌హట్ జంక్షన్ మధ్యలో కాంచనజంగ రైలును గూడ్సు రైలు ఢీకొట్టింది. అయితే, సోమవారం ఉదయం 5.50 గంటల నుంచి ఈ మార్గంలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో రెడ్‌సిగ్నల్ ఉన్నప్పటికీ ముందుకెళ్లాలని లోకో పైలట్‌కు సూచించినట్లు వెల్లడయ్యింది. ఈ మేరకు రైల్వేశాఖ అంతర్గత నివేదిక ఒకటి వెలుగులోకి వచి్చంది. ఈ నివేదిక ప్రకారం.. రాణిపాత్ర స్టేషన్ మాస్టర్ టీఏ912 పేరిట లోకో పైలట్‌కు లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు. రాణిపాత్ర స్టేషన్, ఛత్తర్‌హట్ జంక్షన్ మధ్యలో ఏ సిగ్నల్ పడినా దాటుకొని ముందుకెళ్లాలని పేర్కొన్నారు. అదే ట్రాక్‌పై మరో రైలు లేకపోతే సిగ్నల్‌తో సంబంధం లేకుండా ముందుకెళ్లడానికి టీఏ912 లెటర్ జారీ చేస్తుంటారని రైల్వేవర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన ట్రాక్‌పై అంతకుముందే ఒక రైలు వెళ్లింది. మరో సెక్షన్లోకి ప్రవేశించింది. దాంతో ట్రాక్‌పై రైలు లేదన్న అంచనాతో స్టేషన్ మాస్టర్ టీఏ912 జారీ చేసినట్లు అనుమానిస్తున్నారు. కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 8.27 గంటలకు రంగపాణి స్టేషన్‌ను దాటేసింది. రాణిపాత్ర స్టేషన్, ఛత్తర్‌హట్ జంక్షన్ మధ్యలో ట్రాక్‌పై నిలిచిపోయింది. ఎందుకు నిలిచిందన్నది తెలియడంలేదు. గూడ్సు రైలు ఉదయం 8.42 గంటలకు రంగపాణి స్టేషన్‌ను దాటేసి సరిగ్గా 8.55 గంటలకు కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఏడాది క్రితం జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనను గుర్తుకుతెచి్చంది. -
రైలు ప్రమాదంలో 15కు చేరిన మృతుల సంఖ్య
-
బెంగాల్ రైలు ప్రమాద దుర్ఘటన (ఫొటోలు)
-
రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ ట్వీట్
-
గూడ్స్ రైలును ఢీకొన్న కాంచనజంగ ఎక్స్ ప్రెస్
-
బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం
-
Train Accident: బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా 15 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరో 60 మంది ప్రయాణికులు గాయపడినట్లు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతుండడం.. క్షతగాత్రులకు తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. న్యూ జల్పాయ్గురి వద్ద ఓ గూడ్స్ రైలు కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును ఢీ కొట్టింది. అస్సాం సిల్చార్- కోల్‌కతా సీల్దా మధ్య కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్(13174) నడుస్తుండగా.. ప్రమాదానికి కారణమైన గూడ్స్ అగర్తల నుంచి సీల్దా వస్తోంది. ఈ క్రమంలో.. సోమవారం ఉదయం 9గం. ప్రాంతంలో న్యూ జల్పాయ్గురి రంగపాని-నిజ్బారి స్టేషన్ల మధ్య గూడ్స్, కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. पश्चिम बंगाल में रेल हादसा, डाउन कंचनजंगा एक्सप्रेस से टकराई मालगाड़ी, फिलहाल 6 घायलों की सूचनाअभी तक किसी जनहानि की खबर नहीं, राहत और बचाव के लिए रेलवे दल रवाना...#WestBengal #TrainAccident @IRCTCofficial @RailMinIndia pic.twitter.com/mhsDQpXHTw— Manraj Meena (@ManrajM7) June 17, 2024ప్రమాదం ధాటికి రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఓ బోగీ గాల్లోకి లేచింది. మూడు బోగీల్లోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రమాదంలో గూడ్స్ డ్రైవర్, అసిస్టెంట్ పైలట్.. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ గార్డ్ మరణించినట్లు రైల్వే శాఖ ధృవీకరించింది. అయితే మృతుల వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.Shocked to learn, just now, about a tragic train accident, in Phansidewa area of Darjeeling district. While details are awaited, Kanchenjunga Express has reportedly been hit by a goods train. DM, SP, doctors, ambulances and disaster teams have been rushed to the site for rescue,…— Mamata Banerjee (@MamataOfficial) June 17, 2024మరోవైపు ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనా స్థలానికి వెళ్లారు. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు సోషల్ మీడియా ద్వారా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ ద్వారా స్పందించారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ ప్రమాదం బాధాకరమని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారాయన. ఇంకోవైపు కేంద్రం ప్రమాదంలో మరణించిన వాళ్లకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రైల్వే శాఖ తరఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వాళ్లకు 2.5 లక్షలు, గాయపడిన వాల్లకు రూ.50వేలు ప్రకటించారు మంత్రి అశ్వినీ వైష్ణవ్. Unfortunate accident in NFR zone. Rescue operations going on at war footing. Railways, NDRF and SDRF are working in close coordination. Injured are being shifted to the hospital. Senior officials have reached site.— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 17, 2024ప్రమాదం ఎలా జరిగింది?ప్రమాదం అనంతరం ఆ ప్రాంతమంతా బీతావహ వాతావరణం నెలకొంది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు రావడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే గూడ్స్ రైలు సిగ్నల్‌ను పట్టించుకోకుండా వేగంగా క్రాస్ చేసి వెళ్లిపోయిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే.. ప్రమాదానికి గల కారణంపై రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. -
తాజ్ ఎక్స్ ప్రెస్ లో మంటలు దగ్ధమైన నాలుగు భోగీలు
-
జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం
రాంచీ: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి పరిస్థితుల ఆధారంగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం జంతారా జిల్లా కళాఝారియా రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అసాన్సోల్-ఝాఝా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు వీళ్లను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న వైద్య బృందాలు, అంబులెన్స్‌లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. #Jharkhand: Nearly 12 people have lost their lives in a #trainaccident near #KalijhariyaHalt under #Asansol railway division in #Jamtara district. According to sources, these people have been cut off by a passing Express train between #Asansol and #Jhajha. pic.twitter.com/8Zhi2C2zyK — All India Radio News (@airnewsalerts) February 28, 2024 -
ఘోరం.. పెద్దపల్లిలో రైలు ఢీకొని ఇద్దరి మృతి
సాక్షి, కరీంనగర్: గురువారం పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి రైల్వేస్టేషన్ వద్ద తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతుల వివరాలు.. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది. -
రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత
మాడుగుల రూరల్: ఇటీవల విజయనగరం జిల్లా కంటకాపల్లి సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళ కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు గురువారం అందజేశారు. ప్రమాదంలో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన ముర్రు లక్ష్మి (52) ఆదివారం రాత్రి రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పరామర్శించి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. -
బాధితులకు సత్వర భరోసా
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ఆరిలోవ (విశాఖ తూర్పు): బాధితులకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనితీరు మరోసారి రుజువైంది. జెట్స్పీడ్తో ఆయన తీసుకున్న నిర్ణయాలు విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణనష్టాన్ని కనిష్టస్థాయికి తీసుకురాగలిగాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును సంఘటన స్థలికి పంపించారు. క్షతగాత్రులను త్వరగా ఆస్పత్రికి తరలించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. మిగతా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా బస్సులు ఏర్పాటు చేయించారు. విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్షతగాత్రుల కోసం రెండు వార్డులను సిద్ధం చేశారు. తీవ్ర రక్తస్రావంతో వచి్చనవారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వెనువెంటనే వైద్యులు తగిన చికిత్స చేశారు. దీంతో కొంతమందికి ప్రాణాపాయం తప్పింది. సోమవారం మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ విజయనగరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 23 మంది క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎక్స్‌గ్రేషియాను ప్రకటించడంలోనూ, రెండురోజుల వ్యవధిలోనే వారి చేతికి చెక్కులను అందించడంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవను విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. మానవతా దృక్పథంతో ఎక్స్‌గ్రేషియా.. రైల్వే శాఖ ప్రకటించిన నష్టపరిహారంతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా మంజూరుచేశారు. 13 మంది మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున రూ.1.30 కోట్లు, క్షతగాత్రులకు తీవ్రతను బట్టి రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కులను క్షతగాత్రులకు మంగళవారం, బుధవారం ఇచ్చారు. బుధవారం చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని నాలుగు కుటుంబాలకు మంత్రి బొత్స సత్యనారాయణ, శృంగవరపుకోట నియోజకవర్గం పరిధిలో ఒక కుటుంబానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చెక్కు అందజేశారు. మిగతావారికి గురువారం అందించనున్నారు. విశాఖలో రైలు ప్రమాద బాధితులకు పరిహారం విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో మృతిచెందిన రైల్వేగార్డు మరిపి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని ప్రజాప్రతినిధులు బుధవారం అందించారు. విశాఖపట్నం ఆరిలోవ బాలాజీనగర్‌లో ఉంటున్న ఆయన కుటుంబసభ్యులకు నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి వైఎస్సార్సీపీ నాయకుడు గొలగాని శ్రీనివాస్, అధికారులతో కలిసి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. హెల్త్‌సిటీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్వతీపురం మన్యం జిల్లా ఇందిరాకాలనీకి చెందిన కోలా నానాజీకి రూ. 5 లక్షల చెక్కు ఇచ్చారు. ఇక, కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నల్లా కుమారికి రూ. 5 లక్షలు, రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బి.తేజేశ్వరరావుకు రూ. 2 లక్షల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే వాసుపల్లి గణే‹Ùకుమార్ అందజేశారు. రైలు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి మహారాణిపేట (విశాఖ దక్షిణ): విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముర్రు లక్ష్మి (40) మృతి చెందారు. గాజువాకకు చెందిన ఆమె బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్‌కుమార్ తెలిపారు. కుటుంబంలో ముగ్గురూ ఒకేచోట.. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ వ్యక్తి పేరు జక్కల వెంకటరమణ. ఆ పక్కనున్న బెడ్‌పై ఉన్నవారు అతని భార్య బంగారుతల్లి, చిన్నారి కుమార్తె కోమలి. విశాఖపట్నం గాజువాకకు చెందిన ఆ కుటుంబం విజయనగరం జిల్లా గరివిడిలోని అత్తారింటికి వస్తూ ఈ ప్రమాదం బారినపడ్డారు. తండ్రి, తల్లి, చిన్నబిడ్డ.. ఇలా ముగ్గురు ఒకేచోట గాయాలతో ఉండటం చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చలించిపోయారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బంగారుతల్లికి రూ.10 లక్షలు, వెంకటరమణకు రూ.5 లక్షలు, కోమలికి రూ.2 లక్షలు.. మొత్తం రూ. 17 లక్షలు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. ఆ చెక్కులను మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం అందజేశారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం రైలు ప్రమాదంలో నా భర్త రాము చనిపోయాడని తెలిసి కుప్పకూలిపోయాను. మా కుటుంబానికి ఆ దేవుడే దిక్కు అని కుమిలిపోయాను. అంతటి విషాదంలో ఉన్న మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా నిలబడటంతో కొండంత ధైర్యం వచ్చింది. రూ. 10 లక్షలు ఇచ్చిన ఆయనకు రుణపడి ఉంటాం. వైఎస్సార్ బీమా కింద మరో రూ. 5 లక్షలు సాయం అందుతుందని చెప్పారు. తక్షణ సాయం కింద రూ. 10 వేలు ఇచ్చారు. – మజ్జి శారద, గదబవలస, గరివిడి మండలం, విజయనగరం జిల్లా చెప్పిన వెంటనే సాయమందించారు నా భర్త పిళ్లా నాగరాజు రైలు ప్రమాదంలో చనిపోయారు. ఎలా బతకాలో తెలియక కుటుంబమంతా రోదిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో మా పట్ల ముఖ్యమంత్రి స్పందించిన తీరు మరచిపోం. ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పిన వెంటనే చెక్కు పంపించారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. – పిళ్లా కళావతి, కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా -
రైలు ప్రమాద ఘటన బాధితులకు ఎక్స్‌గ్రేషియా అందజేత
-
AP: రైలు ప్రమాద బాధితులకు చెక్కుల అందజేత
సాక్షి, విజయనగరం: కంటకాపల్లి రైలు ప్రమాద ఘటన తర్వాత సహాయక చర్యలు, బాధితుల చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. ఘటన గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. మంత్రి బొత్సను పంపించి సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షింపజేశారు. ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ వచ్చారు. విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని నేరుగా వెళ్లి మరీ పరామర్శించారాయన. ఈ క్రమంలో వాళ్ల పేదరికానికి ఆయన చలించిపోయారు. మానవత్వంతో మరింత పరిహారం పెంచి.. అందజేయాలని అధికారుల్ని ఆదేశించారు. తాజాగా ఆ పరిహారం బాధితులకు అందింది. బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే నష్టపరిహారం చెక్‌లు అందజేశారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. 10 మందికి రూ. 5 లక్షలు, ముగ్గురుకి రూ. 10లక్షలు, మిగతా వారికి రూ. 2 లక్షలు చొప్పున.. మొత్తం క్షతగాత్రులకు కోటి 32 లక్షలు అందచేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే.. 13 మంది మృతులకు రూ. 10 లక్షలు చొప్పున.. రూ. 2 కోట్ల 62 లక్షలు అందచేశారు. విజయనగరం రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఏపీ ప్రభుత్వం సత్వరమే స్పందించింది. సహాయక చర్యల్లో రైల్వే అధికారులతో సమన్వయం కావాలని ఆదేశిస్తూనే.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబానికి పది లక్షలు, క్షతగాత్రులకు రెండు లక్షలు చొప్పున ప్రకటించారాయన. అయితే.. బాధితుల్లో పేదవాళ్లు ఉండడంతో.. అంగవైకల్యం చెందిన వారికి రూ. 10లక్షలు, కొన్నాళ్ల పాటు మంచానికే పరిమితం అయ్యే వాళ్లకి రూ. 5లక్షలు చొప్పున పరిహారం పెంచి ఇచ్చారు. సంబంధిత వార్త: రైల్వే ప్రమాద బాధితులకు జగనన్న భరోసా -
రైలు ప్రమాద ఘటన ఫోటోలను పరిశీలించిన సీఎం జగన్
-
ట్రైన్ ప్రయాణాలను నమ్మొచ్చా..
-
విజయనగరం జిల్లా రైలు ప్రమాద బాధితులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓదార్పు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
13కు చేరిన మృతులు
ఆరిలోవ(విశాఖతూర్పు)/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/తాటిచెట్లపాలెం(విశాఖఉత్తర): విజయనగరం జిల్లా భీమాలి–ఆలమండ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరింది. మొత్తం 50 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 34 మందిని విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించగా.. మిగిలిన వారిని విశాఖ కేజీహెచ్, రైల్వే, ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ఇదిలా ఉండగా, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన పలాస ప్యాసింజర్‌లో స్పెషల్ గార్డుగా ఉన్న మరిపి శ్రీనివాసరావు(53) ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. విశాఖ ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతిచెందాడు. రైల్వే అధికారులు కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయనకు తల్లితో పాటు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న భార్య అమల, పీజీ చదువుతున్న కుమార్తె హర్షప్రియ, బీటెక్ చదువుతున్న కుమారుడు చంద్రదీప్ ఉన్నారు. మృతిచెందిన లోకో పైలట్ మధుసూదనరావు(ఫైల్), మృతిచెందిన పలాస ప్యాసింజర్ గార్డు శ్రీనివాసరావు(ఫైల్) శ్రీనివాసరావుది పార్వతీపురం కాగా, ఉద్యోగ రీత్యా విశాఖలో స్థిరపడ్డారు. అలాగే, రాయగడ ప్యాసింజరుకు లోకో పైలట్‌గా ఉన్న విశాఖ జిల్లా తంగేడు గ్రామానికి చెందిన శింగంపల్లి మధుసూదనరావు(53) ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య సూర్యలత, ఇద్దరు కుమార్తెలున్నారు. ఉద్యోగరీత్యా మధుసూదనరావు కుటుంబం సహా విశాఖలో ఉంటున్నారు. విశాఖ కేజీహెచ్‌లో ఇద్దరికి శస్త్ర చికిత్స విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడ్డవారిలో నలుగురిని కేజీహెచ్‌కు తరలించగా.. వారిలో ఇద్దరికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన నల్ల కుమారి, విశాఖ జిల్లా గాజువాక దయాల్‌నగర్ ప్రాంతానికి చెందిన ముర్రు లక్ష్మిలకు సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. నల్ల కుమారికి ఆర్థోపెడిక్ వార్డులో శస్త్ర చికిత్స అనంతరం ప్లాస్టిక్ సర్జరీ వార్డుకు తరలించినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. లక్ష్మికి సాయంత్రం అత్యవసరంగా శస్త్ర చికిత్స చేశామన్నారు. శ్రీకాకుళం జిల్లా సింగపురం గ్రామానికి చెందిన మోహిద వరలక్ష్మి, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన గొట్ట కమలమ్మలు చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా, రైలు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్సలు అందించడానికి, పోస్టుమార్టం నిర్వహించడానికి ముగ్గురు ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులను విజయనగరం పంపినట్లు ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చిరాజు తెలిపారు. అలాగే ఆర్థోపెడిక్ వైద్యుడు భగవాన్ను క్షతగాత్రులకు వైద్య సేవలు అందించడానికి విజయనగరం పంపినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్‌కుమార్ చెప్పారు. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడినవారిలో 8మందిని విశాఖ తరలించారు. వీరిలో నలుగురు కేజీహెచ్‌లో, మరొకరు ఆరిలోవ హెల్త్ సిటీలో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురిని రైల్వే హాస్పిటల్లో చేర్పించారు. వీరిలో పలాస పాసింజర్ స్పెషల్ గార్డు మరిపి శ్రీనివాసరావు ఆదివారం రాత్రే మృతిచెందారు. మిగిలిన బి.తేజేశ్వరరావు, పి.శ్రీనివాసరావు రైల్వే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరు కూడా రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఆదివారం విధులు ముగించుకుని గోపాలపట్నం నుంచి పలాస రైలులో తమ సొంత ఊరు శ్రీకాకుళం వెళ్తూ ప్రమాదంలో గాయపడ్డారు. మృతుల వివరాలు 1. కె.రవి (గొడికొమ్ము, జామి మండలం, విజయనగరం జిల్లా) 2. గిడిజాల లక్ష్మి (ఎస్పీ రామచంద్రాపురం, జి.సిగడం మండలం, శ్రీకాకుళం జిల్లా) 3. కరణం అప్పలనాయుడు (కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా) 4. చల్లా సతీష్ (తోటపాలెం, విజయనగరం) 5. శింగంపల్లి మధుసూదనరావు (లోకో పైలట్, ఎన్ఏడీ, విశాఖపట్నం) 6. చింతల కృష్ణమనాయుడు (గ్యాంగ్మన్, కొత్తవలస, విజయనగరం జిల్లా) 7. పిల్లా నాగరాజు (కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా) 8. మరిపి శ్రీనివాసరావు (పలాస ప్యాసింజర్ గార్డ్, ఆరిలోవ, విశాఖపట్నం) 9. టెంకల సుగుణమ్మ (మెట్టవలస, జి.సిగడం మండలం, శ్రీకాకుళం జిల్లా) 10. రెడ్డి సీతంనాయుడు (రెడ్డిపేట, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా) 11. మజ్జి రాము (గదబవలస, గరివిడి మండలం, విజయనగరం జిల్లా) 12. సువ్వారి చిరంజీవి (లోకో పైలట్, కుశాలపురం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా) 13. ఒక మృతదేహం ఆచూకీ తెలియాల్సి ఉంది. రైలు ఒక్కసారిగా కుదుపునకు గురైంది.. నేను విజయనగరం జిల్లా రాజాంలో తృతీయ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నా. రెండు రోజుల సెలవులకు విశాఖ వచ్చి తిరుగు ప్రయాణంలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్లో ఆదివారం సాయంత్రం పలాస ట్రైన్ ఎక్కా. చీపురుపల్లిలో దిగాలి. ఆఖరి చివరి నుంచి రెండో బోగీలో ఉన్నాను. సాయంత్రం వేళలో రైలు ఒక్కసారిగా కుదుపునకు గురైంది. రైల్లోని లగేజ్ షెల్ఫ్‌లో ఉన్న సామాన్లు నాపై పడ్డాయి. దీంతో కంగారుపడ్డాను. ఒక్కసారిగా బోగీ 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోయింది. నేను, నా స్నేహితుడు కలిసి బోగీలోని రాడ్లను పట్టుకుని బయటకు వచ్చేశాం. – వి.అవినాష్, ఇంజినీరింగ్ విద్యార్థి, మునగపాక -
20 గంటల్లోనే రైల్వేట్రాక్ రెడీ!
సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో రైల్వే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రమాదం జరిగిన గంట వ్యవధిలోనే సహాయక చర్యలతో పాటు పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. కేవలం 20 గంటల వ్యవధిలోనే రెండు ట్రాక్‌లలో రైళ్ల రాకపోకల్ని అధికారులు ప్రారంభించారు. వేలాది మంది రైల్వే సిబ్బంది, కార్మికుల సాయంతో అర్థరాత్రి మొదలుకుని.. సోమవారం రాత్రి వరకూ పనుల్ని నిర్వహించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్(డీఆర్ఎం) సౌరభ్ ప్రసాద్ ఘటనా స్థలికి 45 నిమిషాల్లోనే చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అప్పటికే విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు, ఏపీ పోలీసులు.. స్థానికుల సహకారంతో క్షతగాత్రుల్ని వెలికితీసి ఆస్పత్రులకు తరలించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. మరోవైపు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఏఎఫ్ బృందాలు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. అర్థరాత్రి 2.30 గంటలకల్లా.. మృతదేహాల్ని, క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించే ప్రక్రియ పూర్తి చేశారు. ఓ వైపు సహాయక చర్యలు జరుగుతుండగానే.. మరోవైపు నుంచి వాల్తేరు అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. డీఆర్ఎం, సీనియర్ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం విపత్తు నిర్వహణ బృందాలు, ఏజెన్సీల సమన్వయ కృషితో రెస్టొరేషన్ పనుల్ని వేగంగా పూర్తి చేశారు. దెబ్బతిన్న కోచ్‌లను తొలగించడంతో పాటు, పక్కనే ఉన్న ట్రాక్‌లలో ఉన్న గూడ్స్ ట్యాంకర్లను వేరు చేసే ప్రక్రియను తెల్లవారు జామునకల్లా పూర్తి చేశారు. భారీ క్రేన్లు.. వెయ్యి మంది కార్మికులు ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ మనోజ్ శర్మ, సీనియర్ అధికారుల బృంద పర్యవేక్షణలో ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు జోరుగా సాగాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎప్పటికప్పుడు చర్యల్ని సమీక్షించారు. రైల్వే బోర్డు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మెయిన్‌లైన్ పునరుద్ధరణ పనులపై దృష్టిసారించారు. 1000 మందికి పైగా కార్మికులు, సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన సూపర్వైజర్లు ఇందులో భాగస్వాములయ్యారు. రెండు 140 టన్నుల హెవీ డ్యూటీ క్రేన్లు, 15 ఎక్స్కవేటర్లు మిషన్ మోడ్ల ద్వారా ట్రాక్‌లను పునరుద్ధరించారు. కేవలం 19 గంటల వ్యవదిలోనే అప్ అండ్ డౌన్ ట్రాక్లని పునరుద్ధరించారు. మొదటిగా డౌన్‌లైన్‌లో మధ్యాహ్నం 2.42 గంటలకు గూడ్స్‌రైలు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తర్వాత మధ్యాహ్నం 2.55 గంటలకు అప్‌లైన్‌లో భువనేశ్వర్–బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ప్రమాద స్థలిని క్రాస్ చేసింది. మరికొన్ని మరమ్మతులు నిర్వహించి డౌన్‌లైన్‌లో రెండో ట్రైన్‌గా పూరీ–తిరుపతి–బిలాస్పూర్ రైలును అనుమతించారు. కాగా, ప్రమాదం జరిగిన మధ్యలైన్ ట్రాక్‌లోనే విశాఖపట్నం రాయగడ రైలు లోకో.. కూరుకుపోయింది. ట్రాక్‌లో లోతుగా కూరుకున్న ఇంజిన్‌ను తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఏఆర్టీ మెషీన్ తెచ్చి.. జాకీ మాదిరిగా వినియోగించారు. సోమవారం రాత్రి 11 గంటల వరకూ మూడో లైన్ పనులు కొనసాగాయి. తెగిపడిన హెచ్‌టీ లైన్ల విద్యుత్ పునరుద్ధరణ పనులూ పూర్తిచేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రమాద ఘటన విషయం తెలియడంతో ఆదివారం రాత్రి నుంచే ప్రయాణికుల బంధువులు, కుటుంబ సభ్యుల ఆందోళనతో విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని తమ వారి గురించి ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్‌తో పాటు డివిజన్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల జాబితాతో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి బంధువులు, కుటుంబ సభ్యులకు వారి గురించి సమాచారం అందిస్తున్నారు. విజయవాడ డివిజన్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు.. విజయవాడ: 0866–2576924 అనకాపల్లి: 08924–221698 తుని: 08854–252172 సామర్లకోట: 0884–2327010 కాకినాడ టౌన్: 0884–2374227 రాజమండ్రి: 0883–2420541 నిడదవోలు: 0881–3223325 ఏలూరు: 0881–2232267 భీమవరం టౌన్: 0881–6230098 తెనాలి: 0864–4227600 ఒంగోలు: 0859–2280308 నెల్లూరు: 0861–2342028 గూడూరు: 9494178434 -
బాధితులకు భరోసా..
సాక్షి ప్రతినిధి, విజయనగరం/విజయనగరం ఫోర్ట్ : విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కలి్పంచారు. విధి వంచనతో పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతున్న వారికి పెద్ద కొడుకులా అండగా నిలిచి వారి కన్నీరు తుడిచి ఓదార్చారు. రైలు ప్రమాదమైనా సరే... రాష్ట్ర పరిధిలో సంభవించటంతో శనివారం రాత్రి నుంచే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. సీఎం ఆదేశాలతో స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు విషయం తెలుసుకుంటూ సోమవారం ప్రమాద స్థలానికి బయలుదేరారు. అయితే ట్రాక్ పునరుద్ధరణ పనులకు ఆటంకం కలగవచ్చని అధికారులు చెప్పటంతో అక్కడకు వెళ్లకుండా విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ప్రతి ఒక్కరినీ నేరుగా పరామర్శించారు. మానవీయ దృక్పథంతో స్పందించి పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదం పెద్దదే అయినా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి సహకరించటంతో 24 గంటలు తిరక్కముందే ట్రాక్ పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు అధికారులు అనుమతివ్వగలిగామని రైల్వే అధికారులు పేర్కొనటం గమనార్హం. సీఎం సైతం క్షతగాత్రులను, మృతుల కుటుంబీకులను స్వయంగా పరామర్శించి, తాను అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గాయపడిన వారు పూర్తిగా కోలుకునే వరకూ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ధైర్యం చెప్పారు. విజయనగరం జిల్లా అలమండ రైల్వేస్టేషన్ సమీపంలో కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి రెండు పాసింజర్ రైళ్లు ఢీకొనడం తెలిసిందే. విశాఖపట్నం నుంచి బయల్దేరిన విశాఖ–పలాస ప్యాసింజర్ రైలును అదే మార్గంలో కొద్ది నిమిషాల వ్యవధిలో బయల్దేరిన విశాఖ–రాయగడ ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైల్వే సిబ్బంది సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. 50 మంది క్షతగాత్రులయ్యారు. వారిలో 34 మందిని విజయనగరం సర్వజన ఆస్పత్రిలోను, మిగిలిన వారిని ప్రైవేట్ ఆస్పత్రుల్లో హుటాహుటిన చేర్చారు. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ, రైల్వే మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా మానవీయ కోణంలో సకాలంలో స్పందించి ఘటన వివరాలను కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేయటమే కాక రాష్ట్రంలో వివిధ శాఖలను అప్పటికప్పుడు అప్రమత్తం చేసి అర్ధరాత్రి వరకూ పరిస్థితిని సమీక్షించారు. ప్రతి ఒక్కరికీ పరామర్శ.. ఆదివారం అర్ధరాత్రి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారిలో స్వల్ప గాయాలైన వారు కొందరు చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 22 మంది బాధితులకు రెండు వార్డుల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి... అక్కడ రైలు దుర్ఘటనకు సంబంధించిన చిత్రాలను చూశారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి బొత్స సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులు ప్రతి ఒక్కరినీ వారి వద్దకు వెళ్లి పరామర్శించారు. వారికి వైద్యసేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాయాలైన వారికి ఇంకా ఏమైనా మెరుగైన వైద్యం అవసరమా అని వైద్యులను అడిగారు. ఎవరికైనా అవసరమైతే ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. ఒక్కపైసా కూడా వారిపై భారం పడకూడదని, పూర్తి ఉచితంగా వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు స్పష్టంగా చెప్పారు. ఉదారంగా ఎక్స్‌గ్రేషియా.. రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి ప్రకటించారు. క్షతగాత్రుల విషయంలోనూ ఉదారంగా వ్యవహరించారు. స్వల్పగాయాలైన ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. నెలరోజుల కన్నా ఎక్కువ రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స అవసరమైన వారికి.. వైకల్యం కారణంగా ఉపాధి పొందలేని వారికి రూ.5 లక్షల చొప్పున, శాశ్వత వైకల్యం కలిగిన వారికి రూ.10 లక్షల వరకూ ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. దీంతో.. క్షతగాత్రుల్లో ఎవరెవరికి ఎంత ఎక్స్‌గ్రేషియా చెల్లించాలో నిర్ణయించేందుకు డాక్టర్లతో కమిటీ వేసినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. ఈ మొత్తాన్ని మంగళవారం మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా అందిస్తామని చెప్పారు. సీఎం ఏరియల్ సర్వే.. వాస్తవానికి రైళ్లు ఢీకొన్న ప్రమాద స్థలానికి వెళ్లి స్వయంగా పరిశీలించాలని సీఎం జగన్ తొలుత నిర్ణయించారు. అయితే, ట్రాక్ పునరుద్ధరణ పనులు, మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ దృష్ట్యా సందర్శనను రద్దుచేసుకోవాలని రైల్వే అధికారులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన హెలికాప్టర్లో నేరుగా విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాల మైదానానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆసుపత్రిలో క్షతగాత్రులు, మృతుల కుటుంబీకుల పరామర్శ అనంతరం విశాఖకు తిరిగివెళ్తూ ఏరియల్ సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక, ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, బొత్స అప్పలనర్సయ్య, శంభంగి వెంకటచిన అప్పలనాయుడు, జోగారావు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్‌బాబు, రఘురాజు, వరుదు కళ్యాణి, విజయనగరం మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చు లయా యాదవ్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు ఉన్నారు. ఎవరికైనా అవసరమైతే ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించాలి. ఒక్కపైసా కూడా వారిపై భారం పడకూడదు. పూర్తి ఉచితంగా వైద్యసేవలు అందించాలి. క్షతగాత్రుల్లో కొంతమంది ఇంకా షాక్‌లో ఉన్నారు.. పూర్తిగా కోలుకున్నామని వారు సంతృప్తి వ్యక్తంచేసిన తర్వాతే వారిని ఇళ్లకు పంపించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం.. మృతుడి తండ్రి కన్నీళ్లు తుడిచిన సీఎం జగన్ ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురానికి చెందిన లోకో పైలట్ సువ్వారి చిరంజీవి మృతిచెందడంతో ఆయన తండ్రి సన్యాసిరావును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్చారు. సీఎంను చూడగానే ఒక్కసారిగా సన్యాసిరావు బోరున విలపించారు. ‘ఒక్కగానొక్క కొడుకు మృతిచెందాడు.. ఈ వయసులో మాకు ఎవరు దిక్కు’.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. సీఎం వెంటనే ఆయన కన్నీళ్లు తుడుస్తూ.. ‘అధైర్య పడొద్దు.. కుటుంబానికి అండగా ఉంటా’మంటూ ఓదార్చారు. కుటుంబ సభ్యుడిలా ఓదార్చారు.. వైద్యులు బాగా చూస్తున్నారా.. ఏ పనిచేస్తున్నావు.. మీది ఏ గ్రామం... దెబ్బలు ఏమైనా తగిలాయా.. అంటూ కుటుంబ సభ్యుడిలా సీఎం జగన్మోహన్రెడ్డి బాధితులను ఓదార్చారు. వైద్యులు బాగా చూసుకుంటారు, అధైర్య పడొద్దు.. మెరుగైన వైద్య సేవలు అందించమని వైద్యులకు చెప్పానని సీఎం చెప్పారు. విజయనగరం నుంచి విశాఖపట్నం కళాసీ పనికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో నేను గాయపడ్డాను. – కొల్లి ఎర్ని ఆంజనేయులు, బురదపాడు గ్రామం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా ఆప్యాయంగా పలకరించి.. ఓపిగ్గా అంతా విన్నారు.. డాక్టర్లు బాగా చూసుకుంటారు.. ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. అధైర్య పడొద్దని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఆప్యాయంగా పలకరించి నాకు తగిలిన గాయాలు గురించి అడిగారు. నొప్పులు తగ్గాయా, ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించారు. ఓపిగ్గా నేను చెప్పింది అంతా విన్నారు. తాపీ పనికోసం కొత్తవలస వెళ్లి అక్కడ నుంచి మా గ్రామానికి రైలులో వస్తుండగా ప్రమాదంలో గాయపడ్డాను. – గదల మహాలక్ష్మినాయుడు, చుక్కవలస గ్రామం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా ఎంత ఖర్చయినా భరిస్తామన్నారు.. అది చాలు ఆరోగ్యం ఎలా ఉంది.. మా తరఫున అవసరమైన సాయాన్ని అందిస్తాం. వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందించాలని వైద్యులకు ఆదేశాలిచ్చామని సీఎం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, వైద్యానికి ఎంత ఖర్చయినా భరిస్తామని చెప్పారు. అది చాలు. – రెడ్డి రాము, ఎం.అలమండ గ్రామం, దేవరాపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా -
దేవుడి దయతో బయటపడ్డాం
రాయగడ: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దేవుడి దయతో బయటపడ్డామని, అసలు బతుకుతామని అనుకోలేదని ప్రమాదం నుంచి బయటపడిన ఒక కుటుంబం పేర్కొంది. ఇప్పటికీ ప్రమాద సంఘటన తలుచుకుంటే నిద్ర పట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక పయికొవీధిలో నివాసముంటున్న ఒడిశా పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దిలీప్ కుమార్ పాత్రో (41), అతని భార్య సుజాత స్వాయి (40), ఎనిమిదేళ్ల కూతురు సుదీక్ష పాత్రో, మేనకోడలు అనన్య గంతాయిత్ (7), అతని తల్లి సుక్షా కుమారి పాత్రోలు సరదాగా గడపడానికి శనివారం విశాఖపట్నం వెళ్లారు. అనంతరం ఆదివారం విశాఖపట్నం–రాయగడ ప్యాసింజర్ ట్రైన్‌కు తిరుగు ప్రయాణం కోసం రిజర్వేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో విశాఖ–రాయగడ ప్యాసింజర్ ట్రైన్లో బోగీ నంబర్ డీ–1లో తమకు కేటాయించిన బెర్తుల్లో కూర్చున్నారు. అంతలోనే ప్రమాదం ఎంతో సరదాగా రెండు రోజులు గడిపిన విషయాలను కుటుంబమంతా చర్చించుకుంటున్న సమయంలో, ట్రైన్ కంటకాపల్లి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా తాము కూర్చున్న బోగి ఎగిరిపడింది. సుమారు రెండు అడుగుల ఎత్తుకు ఎగరడంతో తామంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డామని దిలీప్ అన్నారు. తమ పిల్లలు పైబెర్తులో ఉండడంతో పైనుంచి కిందికి పడిపోయారు. లగేజీలు చెల్లాచెదురయ్యాయి. ఇంతలో తామ ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురయ్యిందని తెలుసుకున్నామని పాత్రో తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. చుట్టూ చీకటిమయం ప్రమాదం జరిగిన ప్రాంతమంతా చీకటిమయంగా ఉందని ఆయన తెలియజేశారు. బోగి మెయిన్ డోర్ కొద్దిగానే తెరిచి ఉంది. దీంతో అతికష్టం మీద అక్కడకు వెళ్లి చూసేసరికి ప్రయాణికులు పరుగులు తీస్తుండడం కనిపించింది. ఆర్తనాదాలు వినిపించాయి. అరగంట వ్యవధిలో సంఘటన స్థలానికి అంబులెన్స్‌ల సైరన్లు వినిపించాయి. దీంతో భయాందోళనకు గురైన తామంతా కష్టం మీద బోగి నుంచి కిందికు దిగి అరగంట సమయం రైలు ట్రాక్‌పై నడుచుకుంటూ అతికష్టం మీద కంటకాపల్లి రోడ్డుకు చేరుకున్నామన్నారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బస్సు రావడంతో అందరం ఎక్కి విజయనగరం చేరుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఒక ట్యాక్సీ బుక్ చేసుకొని సుమారు రాత్రి మూడు గంటలకు రాయగడ చేరుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ తమ పిల్లలు ఆ భయం నుంచి బయటపడలేదని సుజాత స్వాయి అన్నారు. రైలు ప్రయాణం సురక్షితంగా భావిస్తున్నప్పటికీ, కొద్ది నెలలుగా తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాలను చూస్తే అసలు ప్రయాణించేందుకు ఇష్టపడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆపన్నహస్తం
జామి/లక్కవరపుకోట/శృంగవరపుకోట: విజయనగరం జిల్లా అలమండ రైల్వేస్టేషన్ సమీపంలో కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి రెండు పాసింజర్ రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. విశాఖపట్నం నుంచి బయల్దేరిన విశాఖ–పలాస పాసింజర్ రైలును అదే మార్గంలో కొద్ది నిమిషాల వ్యవధిలో బయల్దేరిన విశాఖ–రాయగడ పాసింజర్ రైలు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఘటనపై స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలతో పాటు క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు ఆపన్నహస్తం అందిస్తున్నా యి. ఓ వైపు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తూనూ... క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. విజయనగరం సర్వజన ఆస్పత్రికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హుటాహుటిన చేరుకుని క్షతగాత్రులను సోమ వారం పరామర్శించారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. కోలుకునేవరకు మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ భీమాళి–అలమండ రైల్వేస్టేషన్ల మధ్య జరిగిన రైలు ప్రమాదంలో మూడు రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నా యి. భారీ క్రేన్లు, ఏఆర్టీ, ఎంఆర్వీ వంటి యూనిట్లను తీసుకొచ్చి 20 గంటల్లో అప్–డౌన్ ట్రాక్‌లను రైల్వే సిబ్బంది పునరుద్ధరించారు. రైల్వే జీఎం మనోజ్శర్మ, డీఆర్ఎం సౌరవ్ప్రసాద్ పనులను పర్యవేక్షించారు. గూడ్స్, డొమెస్టిక్ ట్రైన్ల రాకపోకలు పునరుద్ధరించారు. సహాయక చర్యల్లో ఎస్డీర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్, ఓడీఆర్ఎఫ్, జీఆర్పీ, ఏపీ పోలీస్, ఏపీ ఫైర్, ఆరోగ్యశాఖ బృందాలు తమ సేవలు అందించాయి. ప్రత్యేక బృందాలు ప్రమాద కారణాలను అన్వేషించి, సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నాయి. శిరికిపాలెం వాసుల ఔదార్యం ప్రమాదవార్త తెలిసిన వెంటనే గంట వ్యవధిలో శిరికిపాలెం గ్రామస్తులు స్పందించారు. సెల్ఫోన్లు, టార్చ్లైట్ల వెలుగులో క్షతగాత్రుల తరలింపు, చనిపోయిన వారి మృతదేహాలను వెలికి తీయడంలో వైద్య, పోలీస్ బృందాలకు సహకరించారు. సోమ వారం ఉదయం నుంచి ఘటనాస్థలి వద్దనే పొయ్యిలు ఏర్పాటు చేసి సహాయకులకు వంటలు చేసి వడ్డిస్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని టెలికామ్ సంస్థ ఎండీ రామ్మోహనరావు, ఇండస్ టవర్ విశాఖపట్నం రీజినల్ ఏఓ ఎం.సీతారాం తమ సిబ్బందితో వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నవారికి రూ.30వేలు విలువైన ఎనర్జీ డ్రింక్స్, వాటర్ బాటిళ్లు, శీతలపానీయాలు, బిస్కెట్లు అందజేశారు. ఒడిశా రెవెన్యూ మంత్రి సుధామ్ మరిండి, ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రమాదస్థలిని పరిశీలించారు. సహాయక చర్యలను సమీక్షించారు. ప్రమాదివార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకుని ఎల్.కోట, జామి మండలాల ప్రజాప్రతినిధులను, పార్టీ శ్రేణులను సహాయక చర్యలో నిమగ్నం చేశారు. పైళ్లెన ఐదు నెలలకే... విజయనగరం ఫోర్ట్: తోటపాలేంకు చెందిన చల్లా సతీష్ (29) విశాఖపట్నం సిరిపురంలోని ఓ జ్యూయలరీ దుకాణంలో పనిచేస్తున్నాడు. ప్రతి రోజూ విజయనగరం నుంచి వెళ్లి వస్తున్నాడు. ఆదివారం ఎప్పటి మాదిరి విశాఖపట్నం వెళ్లి రైల్లో తిరిగి వస్తుండగా అలమండ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందాడు. అతనికి ఐదు నెలల కిందట వివాహం అయింది. కొడుకు మృతితో తల్లి రాజ్యలక్ష్మి రోధించిన తీరు కంటతడి పెట్టించింది. కోలుకునేవరకు బాధితులకు చికిత్స క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి బొత్స విజయనగరం అర్బన్: రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిందని, క్షతగాత్రులు కోలుకునేవరకు ఉచిత వైద్యసేవలు అందిస్తుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లా సర్వజన ఆస్పత్రిలో క్షతగాత్రులను సోమవారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రాస్పత్రిలో 29 మందికి వైద్య సేవలు అందుతున్నాయని, ఆరోగ్యం విషమంగా ఉన్న నలుగురుకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలని వైద్యులకు సూచించామన్నారు. ఆరు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు వైద్యు లు అప్పగించారన్నారు. ఆయన వెంట డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్, ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఉన్నారు. ఆశలు తీరకుండానే అనంతలోకాలకు... కొత్తవలస: కొత్తవలస మండలం దెందేరు గ్రామానికి చెందిన చింతల కృష్ణంనాయుడు (34) విజయనగరంలోని రైల్వే శాఖలో గ్యాంగ్‌మన్‌గా పని చేస్తున్నాడు. దెందేరు నుంచి బైక్‌పై కొత్తవలస రైల్వేస్టేషన్‌కు చేరుకొని అక్కడ నుంచి రాయగడ పాసింజర్లో రోజూ రాకపోకలు సాగిస్తుంటాడు. ఆదివారం ఆ రైలు ప్రమాదానికి గురికావడంతో ప్రాణాలు కోల్పా యాడు. పైళ్లెన ఏడాదికే మృతి చెందడంతో భార్య చంద్రకళతో పాటు నెలల చిన్నారి అనాథలుగా మారారు. గిరిజన బాలికకు తీవ్రగాయాలు సీతంపేట: మండలంలోని పెద్దవంగరగూడ గ్రామానికి చెందిన సవర బుజ్జి రైలు ప్రమాదంలో గాయపడింది. విశాఖపట్నంలో నర్సింగ్ చదువుతున్న ఆమె తమ స్వగ్రామానికి విశాఖ–పలాస పాసింజర్లో వెళ్తుండగా ప్రమాదంలో చిక్కుకుంది. కూలి బతుకుల్లో విషాదం చీపురుపల్లి రూరల్(గరివిడి): భవన నిర్మాణపనికి వెళ్లి తిరిగివస్తున్నవారిని రైలు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. కూలి కుటుంబాల్లో విషాదం నింపింది. రైలు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికులైన చీపురుపల్లి పట్టణంలోని రెడ్డిపేటకు చెందిన రెడ్డి సీతంనాయుడు, గరివిడి మండలం గదబవలస గ్రామానికి చెందిన మజ్జి రాము, కాపుశంబాం గ్రామానికి చెందిన కరణం అప్పలనాయుడు, పిల్ల నాగరాజు మృతిచెందారు. సీతంనాయుడు మృతితో భార్య, ఇద్దరు పిల్లలు అనాథలయ్యా రు. అప్పలనాయుడు మృతితో భార్య, ఇద్దరు చిన్నారులు కన్నీటిసంద్రంలో మునిగిపోయా రు. నాగరాజు మృతితో భార్య, బాబు, మజ్జి రాము మృతితో భార్య ఈశ్వరి, కిరణ్, నవ్యశ్రీ అనాథులుగా మారారు. బాధిత కుటుంబాలను మంత్రి విద్యాశాఖమంత్రి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఓదార్చారు. అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. మృతదేహాలను విజయనగరం సర్వజన ఆస్పత్రి నుంచి స్వగ్రామాలకు చేర్చే ఏర్పాట్లు చేశారు. ఏ దిక్కూలేక... జామి: మండలంలోని గొడికొమ్ము గ్రామానికి చెందిన కంచుమార్కి రవి విద్యుత్ పనులు చేస్తూ భార్య కుమారి, ఇద్దరు కుమార్తెలు ప్రసన్న, హరితను పోషిస్తున్నారు. ఆదివారం ఉదయం పనికి వెళ్లే ముందు మటన్ తెచ్చి ఇంటికి ఇచ్చాడు. భర్త వస్తాడని ఎదురుచూసిన భార్య, నాన్న వస్తాడని ఎదురుచూసిన పిల్లలకు ఇకరాడని తెలియడంతో బోరున విలపిస్తున్నారు. ఇంటి పెద్దదిక్కును మృత్యువుకాటేయడంతో విషాదంలో -
సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది?.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైందని ట్వీట్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. రైళ్ల కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఎందుకు విఫలమైందని ప్రశ్నించిన సీఎం.. ఉన్నతస్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధానిని, రైల్వే మంత్రిని కోరారు. ‘‘దేశంలోని అన్ని మార్గాల్లోనూ ఆడిట్ జరగాల్సి ఉంది. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలి. నిన్న జరిగిన రైలు ప్రమాదం తీవ్రంగా బాధించింది. ప్రమాద ఘటన కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. బ్రేకింగ్, హెచ్చరిక వ్యవస్థలు ఎందుకు పనిచేయలేదు?’’ అంటూ ట్విట్టర్లో సీఎం జగన్ ప్రశ్నించారు. The devastating train accident that occurred in Vijayanagaram district last night has caused me great pain. A running train collided with another stationed train, both of which were running in the same direction. This horrifying accident gives rise to certain obvious questions:… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023 విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ట్వీట్ చేశారు. ‘‘వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023 -
బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్
-
రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం జగన్
-
రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. కంటాకపల్లి రైలు ప్రమాద బాధితుల్ని సీఎం జగన్ పరామర్శించారు. తొలుత విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆపై చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. షెడ్యూల్ ప్రకారం ముందుగా ఘటనా స్థలాన్ని పరిశీలించాలని అనుకున్నప్పటికీ.. రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ప్రమాదానికి గురైన బోగీల్ని తొలగిస్తున్న అధికారులు.. ఈ క్రమంలో సీఎం పర్యటనతో పనులు ఆలస్యం కావొచ్చని అధికారులు తెలిపారు. దీంతో ఆయన నేరుగా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. చదవండి: మరీ ఇంత పిచ్చిగానా?.. ప్రజలు గమనిస్తున్నారు బాబూ.. విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023 -
విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో సీఎం జగన్ పరామర్శ..!
-
రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం జగన్
-
రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: బొత్స
-
రైలు ప్రమాద బాధితుల బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: రైలు ప్రమాదంలో బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వ యంత్రాగాన్ని అభినందించారు. ‘‘ఘటన దురదృష్టకరం. బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. వాళ్ల కుటుంబాలకు అండగా ఉంటుంది. ప్రమాదంలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. అలాగే తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ.2 లక్షలు, సాధారణ గాయాలైన వాళ్లకు రూ.50 వేల సాయం అందిస్తాము’’ అని మంత్రి బొత్స తెలిపారు. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిందని, సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొందని అభినందించారు. ఏపీ అధికారులు రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నారని తెలిపారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల పునరుద్ధరణ పనులను కూడా రైల్వే అధికారులు ప్రారంభించారని.. సాయంత్రంలోపే పూర్తవుతాయని మంత్రి బొత్స మీడియాకు వివరించారు. ఆదివారం రాత్రి కంటాకపల్లి వద్ద పలాస-విశాఖ ప్యాసింజర్ రైలును రాయగడ-విశాఖ ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇప్పటిదాకా 13 మంది మృతి చెందగా, 50 మందిదాకా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్.. ఘటనాస్థలానికి వెళ్లాలని, సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి బొత్స సత్యనారాయణను ఆదేశించారు. దీంతో రాత్రి నుంచి ఆయన అక్కడే పరిస్థితిని సమీక్షిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. -
Live: విజయనగరం రైలు ప్రమాద ఘటనాస్థలానికి సీఎం వైఎస్ జగన్
-
రంగంలోకి బాహుబలి...కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
విజయనగరం ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు రద్దు
-
బోగీల కింద మరికొన్ని మృతదేహాలు..పెరుగుతున్న మృతుల సంఖ్య
-
అరుపులు, కేకలు వినిపించాయి..క్షతగాత్రులు చెప్పిన ప్రమాద విషయాలు
-
మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా..
-
విజయనగరం ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, గుంటూరు: కంటాకపల్లి రైలు ప్రమాద బాధితుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. తొలుత విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆపై చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. షెడ్యూల్ ప్రకారం ముందుగా ఘటనా స్థలాన్ని పరిశీలించాలని అనుకున్నప్పటికీ.. రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ప్రమాదానికి గురైన బోగీల్ని తొలగిస్తున్న అధికారులు. ఈ క్రమంలో సీఎం పర్యటనతో పనులు ఆలస్యం కావొచ్చని అధికారులు తెలిపారు. దీంతో ఆయన నేరుగా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుని.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో వున్న హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆపై విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. విజయనగరం జిల్లాలో కంటాకపల్లి వద్ద ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నెమ్మదిగా వెళ్తున్న పలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి వచ్చిన రాయగడ ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సిగ్నల్ లేకపోవడంతో భీమాలి-అలమండ స్టేషన్ల మధ్యలో పలాస ప్యాసింజర్ అత్యంత నెమ్మదిగా వెళ్తోంది. ఆ సమయంలో ఈలోపు వెనుక నుంచి విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ వేగంగా వచ్చి ఢీకొంది. పలాస ప్యాసింజర్‌కు చెందిన గార్డ్ బోగీ ఎగిరి దూరంగా పడింది. దానికి ముందున్న రెండు బోగీలు పక్కకు ఒరిగి, అవతలి ట్రాక్‌పై బొగ్గు లోడ్‌తో ఉన్న గూడ్స్ రైలు ఇంజిన్‌ను ఢీకొని నుజ్జునుజ్జయ్యాయి. రాయగడ ప్యాసింజర్ ఇంజిన్ పూర్తిగా ధ్వంసమైంది. దాని రెండు బోగీలూ పట్టాలు తప్పాయి. ఘటనలో 13 మంది మృతి చెందగా.. 50 మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. అలాగే సీఎం జగన్ సూచనతో మంత్రి బొత్స ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సాయం ప్రకటన కూడా చేశారు సీఎం జగన్. రైలుప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలవారు మరణిస్తే రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు ఘటన నుంచి సీఎం జగన్‌ను ఫోన్ చేసి ఆరా తీసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం.. ఫొటోగ్యాలరీ కోసం క్లిక్ చేయండి -
బాహుబలి క్రేన్ తో బోగీల తొలగింపు..
-
రైలు ప్రమాదం డ్రోన్ విజువల్స్
-
సీఎం జగన్ కు రైల్వే మంత్రి ఫోన్, సహాయక చర్యలు వివరించిన సీఎం
-
Vizianagaram Train Accident: విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం (ఫొటోలు)
-
నుజ్జునుజ్జు అయిన 5 భోగీలు
-
విజయనగరం రైలు ప్రమాదం..ఎలా జరిగిందంటే ?
-
విజయనగరం రైలు ప్రమాదం.. అప్డేట్స్
విజయనగరం రైలు ప్రమాద ఘటన.. సహాయక చర్యల అప్డేట్స్ విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఓ ప్యాసింజర్ రైలు.. ఆగి ఉన్న మరో ప్యాసింజర్ రైలును ఢీ కొట్టింది. ఆపై పక్క ట్రాక్‌లోని గూడ్సుపైకీ దూసుకెళ్లి మరింత బీభత్సం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, 54 మందికి గాయాల అయ్యాయని అధికారులు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతుండగా.. ఈ సాయంత్రం లోపే ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. 17:40 PM సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది?.. ట్వీట్ ద్వారా ప్రశ్నించిన సీఎం జగన్ ►రైళ్ల కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఎందుకు విఫలమైంది? ►ఉన్నతస్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధానిని, రైల్వే మంత్రిని కోరిన సీఎం జగన్ ►దేశంలోని అన్ని మార్గాల్లోనూ ఆడిట్ జరగాల్సి ఉంది ►ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలి ►నిన్న జరిగిన రైలు ప్రమాదం తీవ్రంగా బాధించింది ►ప్రమాద ఘటన కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది ►బ్రేకింగ్, హెచ్చరిక వ్యవస్థలు ఎందుకు పనిచేయలేదు? The devastating train accident that occurred in Vijayanagaram district last night has caused me great pain. A running train collided with another stationed train, both of which were running in the same direction. This horrifying accident gives rise to certain obvious questions:… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023 17:24 PM రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ట్వీట్ ►విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. ►వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ►ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. ►వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. ►వారికి మంచి వైద్యం అందించాలి ► మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలి 16:06 PM సీఎం జగన్ ఏరియల్ వ్యూ ►విజయనగరం: ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ వ్యూ ►విజయనగరం నుంచి విశాఖ వెళ్తూ పరిశీలించిన సీఎం జగన్ 16:05 PM విజయనగరం ప్రమాదస్థలిలో ట్రాక్ టెస్టింగ్ సక్సెస్ ►పునరుద్ధరణ జరిగిన మార్గాల్లో విజయవంతంగా రైళ్లు నడిపిన అధికారులు ►డౌన్‌లైన్‌లో గూడ్స్.. అప్‌లైన్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ పరిశీలన పూర్తి 14:22 PM విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం జగన్ ►ప్రమాద ఘటనకు సంబంధించిన ఫోటోలను పరిశీలించిన సీఎం ►అధికారుల నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం ►ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం ►ప్రమాదంలో గాయపడిన చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్ ►రెండు వార్డుల్లో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరి దగ్గరకూ వెళ్లి పరామర్శించిన సీఎం ►వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం 14:08 PM విజయనగరం చేరుకున్న సీఎం జగన్ ►విజయనగరం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం జగన్ ►విజయనగరం రైల్వే ప్రమాద ఘటన బాధితులకు కాసేపట్లో పరామర్శ ►ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించిన ఫొటోల ప్రదర్శన ►ఘటన గురించి సీఎం జగన్‌కు వివరిస్తున్న అధికారులు ►రైల్వే అధికారుల విజ్ఞప్తితో ఘటనా స్థలికి వెళ్లని సీఎం జగన్ ►నేరుగా ప్రమాద బాధితుల్ని పరామర్శించనున్న సీఎం జగన్ 13:23PM విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ ►విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ ►కాసేపట్లో విజయనగరం ప్రభుత్వాసుపత్రికి ►రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులకు పరామర్శ 12:44PM బాధితుల బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి బొత్స ►రైలు ప్రమాద బాధితులకు ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేవరకు ప్రభుత్వం దే బాధ్యత ►విజయనగరం ప్రమాద ఘటన సహాయక చర్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందన ►బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది ►మృతులు కుటుంబాలకు రూ. 10లక్షల ఆర్థికసాయం ఇస్తాం ►తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ. 2లక్షలు ►సాధారణ గాయాలైనవాళ్లకు రూ. 50 వేల సాయం ►ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది ►రైల్వే అధికార్ల సమన్వయంతో పనిచేస్తున్నాం ►ట్రాక్ పునః నిర్మాణ పనులు కాసేపట్లోనే పూర్తి అవుతాయి 12:30PM సీఎం జగన్ పర్యటనలో మార్పు ►సీఎం జగన్ విజయనగరం పర్యటనలో మార్పు ►కంటకాపల్లి ప్రమాద ఘటన స్థలం వద్ద పర్యటన రద్దు ►రైల్వే అధికారుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం ►ఘటనా స్ధలంలో ప్రమాదానికి గురైన బోగీల్ని తొలగిస్తున్న అధికారులు ►యుద్ద ప్రాతిపదినక ట్రాక్ పునురుద్ధరణ పనులు ►ముఖ్యమంత్రి ఘటనా స్ధలానికి వస్తే... ట్రాక్ పునరుద్ధరణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వెల్లడి ►రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించనున్న సీఎం జగన్ ►నేరుగా పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో వున్న హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్న సీఎం జగన్ ►ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులకు పరామర్శ :::జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి 12:18PM విజయనగరం బయల్దేరిన సీఎం జగన్ ►విజయనగరం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►విశాఖకు.. అక్కడి నుంచి విజయనగరం ప్రమాద స్థలికి ►కాసేపట్లో రైలు ప్రమాద ఘటనా స్థలం పరిశీలన ►గాయపడిన వారిని పరామర్శించనున్న సీఎం జగన్ 12:05PM విజయవాడ డివిజన్లో హెల్ప్‌లైన్ డెస్క్ ►విజయవాడ రైల్వే జంక్షన్ పై రాయగడ రైలు ప్రమాద ప్రభావం ►విజయవాడ నుండి వెళ్ళే పలు రైళ్లు రద్దు ►విజయవాడ మీదుగా విశాఖ వెళ్లే రత్నాచల్, సింహాద్రి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-పూరీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు ►27 రైళ్లు రద్దు, 28రైళ్ళను మళ్లించిన రైల్వే అధికారులు ►విజయవాడ రైల్వే జంక్షన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు ►ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్న హెల్ప్ డెస్క్ ►ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు ►అనకాపల్లి, తుని, సామర్లకోట, కాకినాడ టౌన్, రాజమండ్రి, నిడదవోలు, ఏలూరు, భీమవరం టౌన్, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరుకు సంబంధించి నెంబర్లు ►ప్రమాదానికి సంబంధించిన సమాచారం కోసం అయినా సంప్రదించవచ్చొన్న రైల్వే అధికారులు ►ఇప్పటివరకు తమవాళ్లు లేదా రైలు ప్రమాదంలో ఉన్నట్టు తమకి ఒక్క ఫోన్ ఫోన్ రాలేదంటున్న అధికారులు 11:48AM బాధితులకు మెరుగైన వైద్యం అందుతోంది: సీపీఎం రాఘవులు ►విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి లో రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన సీపీఎం నేత రాఘవులు ►గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందుతోంది.. వైద్యులకు అభినందనలు ►ఒడిశా బాలాసోర్ తరహా ఘటన మళ్లీ పునరావృతం అయ్యింది ►రైల్వే శాఖకు శిక్ష వేయాలి ►మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ 50 లక్షలు పరిహారం ఇవ్వాలి ►క్షతగాత్రులకు 25 లక్షలకు పరిహారం ఇవ్వాలి ►ఆదివారం కాకుండా మిగతా పని దినాల్లో అయితే వందల్లో చనిపోయే వారు ►రైల్వే సిగ్నలింగ్ లో లోపాలు వున్నాయి ►సిబ్బంది కొరత వలనే రైల్వే లో ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయి. 11:29AM కాసేపట్లో విజయనగరానికి సీఎం జగన్ ►కాసేపట్లో విజయనగరం పర్యటనకు సీఎం జగన్ ►విశాఖకు.. అక్కడి నుంచి కంటకాపల్లికి ►రైలు ప్రమాద ఘటనా స్థలం పరిశీలన ►చికిత్స పొందుతున్న వాళ్లకు పరామర్శ ►నేటి ఎస్.ఐ.పీ.బీ సమావేశం త్వరగా ముగించుకున్న సీఎం జగన్ ►పలు పెట్టుబడులు, వివిధ పరిశ్రమల ప్రోత్సాహకాలకు ఆమోదం 11:10AM విజయనగర ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం: ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి ►విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలు ►వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ►కంటకాపల్లి-అలమండ మధ్య నెమ్మదిగా వెళ్తున్న పలాస రైలును ఢీ కొట్టిన రాయగడ రైలు ►విజయనగర రైలు ప్రమాదం మానవ తప్పిదవల్లేనన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆఫీసర్ ►ప్రమాదంపై ఓ మీడియా ఛానెల్తోఈస్ట్ కోస్ట్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ విశ్వజిత్ సాహూ ►రాయగడ ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వల్లే ప్రమాదం జరిగింది ►రెడ్ సిగ్నల్‌ను రాయగడ లోకో పైలట్ పట్టించుకోలేదు ►ఫలితంగానే ఘోర ప్రమాదం సంభవించిందన్న అధికారి సాహూ ►అయితే దర్యాప్తు తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని స్పష్టీకరణ ►ఈ ప్రమాదంలో రాయగడ రైలు లోకో పైలట్ రావు కూడా మృతి 10:26AM చురుగ్గా రైల్ ట్రాక్ పునఃనిర్మాణ పనులు ►విజయనగరం రైల్వే ప్రమాద ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపాదికన చర్యలు ►140 టన్ ల బాహుబలి క్రేన్‌తో ధ్వంసమైన బోగీలు తొలగింపు ►ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ►ట్రాక్ పునఃనిర్మాణ పనులు, బాధితుల సౌకర్యాల పై ఘటనా స్థలం లో సమీక్ష చేసిన ఇంచార్జ్ మంత్రి బూడి ముత్యాల నాయుడు ప్రమాదంలో దెబ్బతిన్న విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తున్న రైల్వే ఎలక్ట్రికల్ సిబ్బంది ►సహాయక చర్యల పై జిల్లా అధికార యంత్రాంగాన్ని అర్ధరాత్రే అప్రమత్తం చేసిన సీఎం జగన్ ►సీఎం ఆదేశాలతో ఘటనా స్థలం వద్ద 40 అంబులెన్సులులు సిద్దం ►గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించిన అధికార్లు ►మృత దేహాలను హుటాహుటిన గుర్తించి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ కి తరలింపు ►ప్రత్యేక వైద్యులను కేటాయించి త్వరితగతిన పోస్టుమార్టం ►బంధువులకు మృతదేహాలు అప్పగించి, వారి గ్రామాలకు ఉచిత రవాణా ఏర్పాటు ►వైద్య సేవలకు సంతృప్తి వ్యక్తం చేస్తున్న బాధితులు ►ఇవాళ మధ్యాన్నం విజయనగరానికి సీఎం జగన్ ►రైలు ప్రమాద ఘటనా స్థలం పరిశీలించి, క్షతగాత్రులకు పరామర్శ 10:23AM క్షతగాత్రులకు మెరుగైన చికిత్స ►రైలు ప్రమాదంలో సహాయ చర్యల్లో వెయ్యి మంది రైల్వే సిబ్బంది ►మంచినీరు మందులు... ఆహర పదార్థాలతో నిన్న రాత్రి.. ఈరోజు ఉదయం విశాఖ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు ►ఐదుగురు విశాఖ వాసులకు విజయనగరం జిజిహెచ్ లో చికిత్స ►విశాఖలోని అపోలో ఒకరు.. కింగ్ జార్జ్ ఆసుపత్రలో మరొకరికి వైద్యం 10:18AM నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి ►విజయనగరం రైలు ప్రమాదంపై నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి ►మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన భువనేశ్వరి 10:12AM రైలు ప్రమాద ఘటనపై రాహుల్ గాంధీ స్పందన ►విజయనగరం రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి ►ఫేస్బుక్లో పోస్ట్ ►మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ►క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రాహుల్ గాంధీ 09:58AM విజయనగర ప్రమాదం.. రాజమండ్రి స్టేషన్లో హెల్ప్‌డెస్క్ ►విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదం ►రాజమండ్రి మెయిన్ రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన రైల్వే అధికారులు ►రద్దయిన, మళ్లించిన రైళ్ళ వివరాలపై ప్రయాణికులకు సమాచారం ఇస్తున్న రైల్వే సిబ్బంది ►ప్రమాద ఘటనలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మృతులు గాని గాయపడిన వారిపై సమాచారం లేదని తెలిపిన రైల్వే అధికారులు 09:40AM విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాదంలో మృతుల పేర్లు రావు, రాయగడ ప్యాసింజర్ లోకో పైలట్, విశాఖపట్నం చింతల కృష్ణం నాయుడు పిల్ల నాగరాజు కంచుభరకి రవి (30), గోడికొమ్ము (గ్రామం), జామి (మండలం), విజయనగరం గిడిజాల లక్ష్మి (35), ఎస్పీ రామచంద్రాపురం, జీ సిగడాం మండలం, శ్రీకాకుళం కరణం అప్పలనాయుడు (45), కాపు సంబాం (గ్రామం), గరివిడి (మండలం), విజయనగరం చల్లా సతీష్ (32), ప్రదీప్ నగర్, విజయనగరం శ్రీనివాస్ టెంకల సుగుణమ్మ రెడ్డి ససీతంనాయుడు మజ్జి రాము ఎం. శ్రీనివాస్ విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు గార్డు ►మరో మృతదేహాం గుర్తించాల్సి ఉంది ►త్వరగతిన విజయనగరం ప్రభుత్వాసుప్రతిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం 09:17AM ►విజయనగరం ఘోర రైలు ప్రమాదం.. 13కి చేరిన మృతుల సంఖ్య 09:04AM బాధితుల్ని తక్షణమే ఆదుకునేలా ఏపీ సర్కార్ చర్యలు ►విజయనగరం రైలు ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాల్ని సత్వరమే ఆదుకునేలా ఏపీ ప్రభుత్వం అన్ని రకాలచర్యలు ►క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ►మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం ప్రకటన ►మృతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం ►తక్షణమే అందేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు ►బాధితులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర రైల్వే మంత్రికి ఫోన్లో వివరించిన సీఎం జగన్ 08:54AM ఘటనాస్థలానికి వెళ్లనున్న సీఎం జగన్ ►విజయనగరం జిల్లా కంటాకపల్లి వద్ద ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం ►ఘటన గురించి తెలియగానే సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ►రైల్వే శాఖ మంత్రితోనూ ఫోన్లో మాట్లాడిన సీఎం జగన్ ►సీఎం జగన్ ఆదేశాలతో ఘటనాస్థలానికి వెళ్లిన మంత్రి బొత్స.. సహాయక చర్యల పర్యవేక్షణ ►నేడు ఘటనా స్థలానికి వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►ప్రత్యేక విమానంలో విశాఖకు.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఘటనాస్థలానికి ►అనంతరం చికిత్స పొందుతున్న క్షతగాత్రులనూ పరామర్శించనున్న సీఎం జగన్ ►క్షతగాత్రుల్లో ఏపీ వాసులే అధికం 08:50AM రైలు ప్రమాదం రీత్యా పలు రైళ్ల రాకపోకలు మళ్లింపు ►చెన్నై-సంత్రగచి(22808) ఎక్స్‌ప్రెస్ ►హైదరాబాద్-షాలిమర్(18046) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ►త్రివేండ్రం-షాలిమర్(22641) ఎక్స్‌ప్రెస్ ►ఆగర్తల-బెంగళూరు(12504)ఎక్స్‌ప్రెస్ ►సంత్రగచీ-తిరుపతి(22855)ఎక్స్‌ప్రెస్ ►షాలీమర్-చెన్నై(12841) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ►ధన్‌బాద్-అలెప్పీ(13351) బొకరో ఎక్స్‌ప్రెస్ ►హతియా-బెంగళూరు(12835)ఎక్స్‌ప్రెస్ ►మంగళూరు-సంత్రగాచీ(22852) ఎక్స్‌ప్రెస్ ►బెంగళూరు-హౌరా(12246) దురంతో ఎక్స్‌ప్రెస్ ►బెంగళూరు-జశిద్ది(22305) ఎక్స్‌ప్రెస్ ►కన్యాకుమారి-హౌరా(22503) ఎక్స్‌ప్రెస్ ►చెన్నై-హౌరా(12840) ఎక్స్‌ప్రెస్ వాస్కోడిగామా-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ 08:35AM ఘటనా స్థలంలో ముమ్మురంగా సహాయ చర్యలు ►రైళ్ల రాకపోకల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికంగా కొనసాగుతున్న పనులు ►ప్రమాదానికి గురైన పలాస పాసింజర్ 11 భోగిలను అలమండ రైల్వే స్టేషన్ కు తరలించిన సిబ్బంది ►ప్రమాదానికి గురైన రాయగడ పాసింజర్ 9 బోగీలను కంటకాపల్లి రైల్వే స్టేషన్ కు తరలించిన రైల్వే సిబ్బంది ►వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్ ప్రకటన ►ఘటనా స్థలం నుంచి దూరంగా వెళ్లాలని.. రైల్వే పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగించవద్దని ప్రజలకు అధికారుల విజ్ఞప్తి 08:21AM కంటకాపల్లి - అలమండ మధ్య జరిగిన జరిగిన రైలు ప్రమాదంతో సోమవారం రద్దైన రైళ్ల వివరాలు ► కోర్బా - విశాఖపట్నం (18517) ఎక్స్‌ప్రెస్ ►పారాదీప్ - విశాఖపట్నం (22809) ఎక్స్‌ప్రెస్ ►రాయగడ - విశాఖపట్నం (08503)ప్యాసింజర్ స్పెషల్ ► పలాస - విశాఖపట్నం (08531) ప్యాసింజర్ స్పెషల్ ► విశాఖపట్నం - గునుపుర్ (08522)ప్యాసింజర్ స్పెషల్ ►గునూపుర్ - విశాఖపట్నం (08521) ప్యాసింజర్ స్పెషల్ ► విజయనగరం - విశాఖపట్నం (07469) మెము స్పెషల్ ► విజయవాడ - విశాఖపట్నం (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం - విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ► గుంటూరు - విశాఖపట్నం (12739) సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ► కాకినాడ - విశాఖపట్నం (17267) మెము ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం - కాకినాడ (17268) మెము ఎక్స్‌ప్రెస్ ► రాజమండ్రి- విశాఖపట్నం (07466) మెము స్పెషల్ ►విశాఖపట్నం - రాజమండ్రీ (07467) మెము స్పెషల్ ►కోరాపుట్ - విశాఖపట్నం (08545) స్పెషల్ ►విశాఖపట్నం - కోరాపుట్ (08546) స్పెషల్ ► పలాస - విశాఖపట్నం (08531) స్పెషల్ ► చెన్నై - పూరి (22860) ఎక్స్‌ప్రెస్ ►రాయగడ - గుంటూరు (17244) ఎక్స్‌ప్రెస్ 08:09AM ట్రైన్ లోకో పైలట్ ఎం ఎస్ రావులు మృతి ►విజయనగరం రైలు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన రాయగడ ట్రైన్ ఇంజన్ ►ఇంజన్లో మృతదేహం.. లోకో పైలట్ ఎంఎస్ రావుగా గుర్తింపు ►తోటి ఉద్యోగి మరణంతో దిగ్భ్రాంతిలో రైల్వే ఉద్యోగులు 07:59AM ఆయా స్టేషన్ల నుంచి బయల్దేరి.. దారి మళ్లిన రైళ్ల వివరాలివే.. ►29న చెన్నై లో బయల్దేరిన చెన్నై - సంత్రగచి (22808) ఎక్స్‌ప్రెస్ ►29న హైదరాబాద్ లో బయల్దేరిన హైదరాబాద్ - శాలిమర్ (18046)ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ►28న త్రివేండ్రం లో బయల్దేరిన త్రివేండ్రం - షాలిమర్ (22641) ఎక్స్‌ప్రెస్ ►28న అగర్తల లో బయల్దేరిన ఆగర్తల - బెంగళూరు (12504) ఎక్స్‌ప్రెస్ ►29న శాలిమార్ లో బయల్దేరిన షాలిమర్- హైదరాబాద్ (18045) ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ►29న సంత్రాగచి లో బయల్దేరిన సంత్రగచీ - తిరుపతి (22855) ఎక్స్‌ప్రెస్ ►29న షాలిమర్ లో బయల్దేరిన షాలిమర్ - చెన్నై (12841) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ►29న చెన్నై లో బయల్దేరిన చెన్నై - షాలిమర్ (12842) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ►29న Dhanbad లో బయల్దేరిన Dhanbad - అలెప్పీ (13351) బొకారో ఎక్స్‌ప్రెస్ ►29న హతియ లో బయల్దేరిన హతియా - బెంగళూరు (12835) ఎక్స్‌ప్రెస్ ►28న మంగుళూరు లో బయల్దేరిన మంగుళూరు - సంత్రగాచి (22852) ఎక్స్‌ప్రెస్ ►29న బెంగళూరు లో బయల్దేరిన bengaluru- హౌరా (12246) దురంతో ఎక్స్‌ప్రెస్ ►29న తిరుపతి లో బయల్దేరిన తిరుపతి - హౌరా (20890) ఎక్స్‌ప్రెస్ ►29న సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన సికింద్రాబాద్- హౌరా (12704) ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ ►29న బెంగళూరు లో బయల్దేరిన బెంగళూరు - హౌరా (12864) ఎక్స్‌ప్రెస్ ►29న బెంగళూరు లో బయల్దేరిన బెంగళూరు - జశిద్ది (22305) ఎక్స్‌ప్రెస్ ►28న కన్యాకుమారి లో బయల్దేరిన కన్యాకుమారి - హౌరా (22503) ఎక్స్‌ప్రెస్ ►29న చెన్నయ్ లో బయల్దేరిన చెన్నయ్ - హౌరా (12840) మెయిల్ ►29 న వాస్కోడగామ లో బయల్దేరిన వాస్కొడగమ - షాలిమార్ (18048) ఎక్స్‌ప్రెస్ లు వయా Kharagpur - ఝార్సుగుడ - రాయ్ పూర్ - విజయవాడ మీదుగా రాకపోకలు ఈ 19 రైళ్లు ఇవాళ (సోమవారం) విశాఖపట్నం మీదుగా నడవవు 07:42AM ►కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందారు ►రైలు ప్రమాదంలో 54 మంది క్షత గాత్రులయ్యారు ►క్షతగాత్రులంతా ఏపీకి చెందినవారే ►క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నాం ►32 మందికి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స ►విశాఖ ఎన్.ఆర్.ఐ. ఆసుపత్రిలో ఒకరిని, మెడికవర్ ఆసుపత్రిలో ఇద్దరిని చేర్పించాం ►నలుగురి పరిస్థితి విషమంగా ఉంది :::విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి 07:40AM విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు నెంబర్లు 0891 2746330, 08912744619 ►ఎయిర్టెల్ 81060 53051 8106053052 ►బీఎస్ఎన్ఎల్ 8500041670 8500041671 07:32AM ►రైలు ప్రమాదం నేపథ్యంలో విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో హెల్ప్ లైన్ ►జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రకటన ►కేజీహెచ్ క్యాజువాలిటీ 8912558494 ►కేజీహెచ్ డాక్టర్ హెల్ప్ లైన్ నెంబర్ 8341483151 ►కేజీహెచ్ కేసు క్వాలిటీ 8688321986 ►ప్రయాణికుల క్షతగాత్రుల వైద్య సహాయం కోసం ఈ ఫోన్లను సంప్రదించాలని సూచన 06:31AM ►ఘటనా స్థలానికి చేరుకున్న బాహుబలి క్రేన్. చెల్లా చెదురు అయిన బోగీలను తొలగించే పనులు మరింత ముమ్మరం 06:02AM ►క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ►రాత్రంతా కొనసాగుతూనే ఉన్న మూడు లైన్ ల ట్రాక్ పనులు, పునరుద్ధరణ పనులు ►అలమండ ప్రాంతంలో భారీ పోలీస్ బందోబస్తు ►మృతుల సంఖ్య, వివరాలని అంచనా వేస్తున్న అధికారులు ►విశాఖ, భువనేశ్వర్ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ ►పదికి చేరిన మృతుల సంఖ్య ►మృతుల సంఖ్య పెరిగే అవకాశం నేడు పలు రైళ్ల రద్దు విజయనగరం రైలు ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు తెలిపారు. కోర్బా-విశాఖపట్నం, పారదీప్-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం-గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్నం, విజయనగరం-విశాఖపట్నం రైళ్లు రద్దయ్యాయి. Bulletin 6-: pic.twitter.com/qr2o319M04 — Ministry of Railways (@RailMinIndia) October 29, 2023 బాధితుల కోసం సహాయక కేంద్రాలు విజయనగరం సమీపంలో జరిగిన రైలుప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించేందుకు రైల్వే, విశాఖ జిల్లా అధికారులు సహాయక కేంద్రాలను (కంట్రోల్ రూం) ఏర్పాటుచేశారు. విశాఖ కేజీహెచ్‌లో, విమ్స్‌లో వైద్యబృందాలను కలెక్టర్ మల్లికార్జున అందుబాటులో ఉంచారు. విశాఖ నుంచి ప్రమాదస్థలికి అంబులెన్సులను పంపారు. బాధితులకు వైద్య సహాయార్థం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటుచేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు విజయనగరం కలెక్టరేట్: 94935 89157 విశాఖ కలెక్టరేట్: 90302 26621, 70361 11169, 08912 590102 కేజీహెచ్: 89125 58494, 83414 83151 వైద్యుడు (24 గంటలు అందుబాటులో ఉంటారు): 83414 83151 అత్యవసర విభాగం వైద్యుడు: 86883 21986 రైల్వే ఆధ్వర్యంలో.. భువనేశ్వర్: 06742301625, 06742301525, 06742303060, 06742303729 (టోల్ ఫ్రీ) వాల్తేరు టెస్ట్ రూం: 89780 80805 సీనియర్ సెక్షన్ ఇంజినీర్ : 89780 80815 వాల్తేరు డివిజన్: 08942286245, 08942286213 అలమండ, కంటకాపల్లి: 89780 81960 విజయనగరం: 08922221206, 08922221202, 89780 80006 శ్రీకాకుళం రోడ్డు: 08942286213, 08922286245 ఏలూరు: 08812232267 సామర్లకోట: 08842327010 రాజమహేంద్రవరం: 08832420541 తుని: 08854252172 విశాఖ రైల్వేస్టేషన్లో..: 08912 746330; 08912 744619; 81060 53051; 81060 53052; 85000 41670; 85000 41671. ప్రమాదం ఎందుకు జరిగింది? విజయనగరం ఘోర ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్‌పై వెనుకనే విశాఖ నుంచి రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరింది. గంట వ్యవధిలోనే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య ఎదురవ్వడంతోనే కంటకాపల్లి నుంచి చాలా నెమ్మదిగా రైలు ట్రాక్‌పై వెళ్లిందని అందులోని ప్రయాణికులు చెబుతున్నారు. ఈలోగా వెనుకనుంచి వచ్చిన రైలు ఢీకొన్నట్లు వివరిస్తున్నారు. కారుచీకట్లు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రమాదం తరువాత సహాయక చర్యలు చేపట్టిన యంత్రాంగం.. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బొగ్గు రవాణా రైలు, ట్యాంకరు రైలును ఆ ప్రాంతం నుంచి తరలించారు. అలాగే పలాస రైలులో ప్రమాదానికి గురైన బోగీలు మినహాయించి మిగిలిన బోగీలను తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను కంటకాపల్లిలో నిలిపివేశారు. ఆయా రైళ్లలో ప్రయాణికులను రోడ్డు మార్గంలో తరలించారు. ప్రమాదానికి సిగ్నల్ సమస్య కారణమా? లేదంటే మానవ తప్పిదమా? అనేది తేలాల్సి ఉంది. ఏం జరిగింది.. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రాయగడ రైల్లోని బోగీలు నుజ్జునుజ్జు కాగా, మరికొన్ని పట్టాలు తప్పాయి. ప్రమాద ధాటికి రైలు ఇంజన్ సహా ఐదు బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. అక్కడే మరో ట్రాక్‌పైనున్న గూడ్సు రైలు బోగీలపైకి అవి దూసుకెళ్లాయి. దీంతో ఇక్కడ భీతావహం నెలకొంది. బాలేశ్వర్ తరహాలోనే.. ఈ ఏడాది జూన్‌లో జరిగిన బాలేశ్వర్ రైలు ప్రమాద సంఘటన మాదిరిగానే ఈ ప్యాసింజర్ రైళ్ల ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. పలాస గార్డు బోగీని రాయగడ ఇంజిను ఢీకొట్టడంతో ఆ రెండు నుజ్జయ్యాయి. ఈ వేగానికి రాయగడ బోగీలు ఏకంగా అదే రైలు ఇంజినుపైకి దూసుకెళ్లాయి. అదే సమయంలో పక్కన గూడ్సు రైలు వెళుతోంది. ప్రమాదం జరిగినప్పుడు రాయగడ రైలుకు చెందిన కొన్ని బోగీలు గూడ్సు రైలును ఢీకొన్నాయి. రెండు ప్యాసింజర్, గూడ్సు రైళ్లలో కలిపి ఐదు బోగీలు నుజ్జయ్యాయి. మృతుల కుటుంబాలకు ప్రధాని సాయం రూ.2 లక్షలు విజయనగర రైలు ప్రమాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from the PMNRF for the next of kin of each deceased due to the train derailment between Alamanda and Kantakapalle section. The injured would be given Rs. 50,000. https://t.co/K9c2cRsePG — PMO India (@PMOIndia) October 29, 2023 ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులందరినీ తరలించినట్లు అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితోనూ ప్రధాని మాట్లాడారని, రైల్వే బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. All injured shifted to hospitals. Ex-gratia compensation disbursement started - ₹10 Lakh in case of death, ₹2.5 Lakh towards grievous and ₹50,000 for minor injuries. — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 29, 2023 సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.రైలుప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలవారు మరణిస్తే రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఘటన గురించి రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌తో ఆదివారం రాత్రి ఆయన ఫోన్లో మాట్లాడారు. ఘటనాస్థలికి మంత్రి బొత్స సత్యనారాయణను పంపామని, ప్రమాద విషయం తెలియగానే సహాయకబృందాలు అక్కడకు చేరుకున్నాయని వివరించారు. సహాయక చర్యల్ని స్థానిక కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారని, క్షతగాత్రుల్ని వివిధ ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. -
సిగ్నల్ కోసమా? పవర్ ప్రాబ్లమా?
సాక్షి, విశాఖపట్నం : 08532 విశాఖ–పలాస రైలు కంటకాపల్లి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకు చినరావుపల్లి దగ్గర నిలిచిపోయింది. ఆ మార్గంలో మొత్తం మూడు లైన్లు ఉండగా.. మధ్యలైన్‌లో ఈ రైలు నిలిపారు. అయితే.. కంటకాపల్లి నుంచి దాని వెనుకే బయలుదేరిన 08504 రైలు అదే మూడో లైన్లోకి వచ్చేసింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. విశాఖ–పలాస రైలును మధ్య లైన్లో ఎందుకు నిలిపారు? ఆలమండ స్టేషన్ నుంచి సిగ్నల్ అందలేదా? లేదా ప్రమాద సమయంలో హైటెన్షన్ వైర్లు తెగిపడి ఉన్నాయా? ప్రమాదం జరగకముందే ఇవి తెగిపడటంవల్ల రైలు నిలిచిపోయిందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. ఒక రైలు ఆగి ఉన్నప్పుడు అదే మార్గంలో మరో రైలు వెళ్లేందుకు అనుమతి ఎలా ఇచ్చారనే కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ లోపంవల్లే వెనుక వస్తున్న రాయగడ రైలు.. మధ్య లైన్లోకి వచ్చినట్లు భావి స్తున్నారు.సిగ్నల్ లేక పలాస రైలును చినరావుపల్లెలో నిలిపినట్లయితే.. ఆ సమాచారాన్ని రాయగడ రైలుకు పంపాలి. అదీ జరగలేదు. పోనీ.. హైటెన్షన్ వైర్లు తెగిపడటంవల్ల నిలిచిపోయినట్లయితే.. ఆ సమాచారం కూడా వెనుక వస్తున్న రైళ్లకు చేర వేయాల్సి ఉంది. ఈ రెండూ జరగకపోవడంవల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా.. మానవ తప్పిదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ రైలువల్లే పెను ప్రమాదం తప్పింది.. సాధారణ రోజుల్లో ఈ 2 రైళ్లు నిరంతరం ప్రయాణికులతో నిండుగా ఉంటాయి. వ్యాపారులు, స్థానికులు, ఏదైనా పని, లేదా వైద్యం.. ఇతర అవసరాల కోసం విశాఖకి ఉదయాన్నే వచ్చి.. పనులన్నీ చూసుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణానికి ఈ రెండు రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. కానీ, ఆదివారం మాత్రం.. ఈ రైళ్లలో అంతగా జనం ఉండరు. దీనికి కారణం.. ఈ రైళ్లు బయలుదేరిన కొద్దిసేపటికే విశాఖపట్నం–విజయనగరం పాసింజర్ మెము రైలు (07468) ఉంటుంది. విజయనగరం వెళ్లే వాళ్లంతా శని, ఆదివారాల్లో ఈ రైలు కోసం ఎక్కువగా ఎదురుచూస్తుంటారు. ఈ రైలు లేకపోతే.. ఇందులో వెళ్లే ప్రయాణికులంతా ఈ 2 రైళ్లనే ఆశ్రయించేవాళ్లు. అప్పుడు ప్రమాద తీవ్రత మరింత పెరిగి ఉండేది. -
ఎక్కడి రైళ్లు అక్కడే
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర)/విశాఖపట్నం: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంకటాపల్లి–ఆలమండ మధ్య ఆదివారం రాత్రి విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక పాసింజర్ రైలును విశాఖ–రాయగడ రైలు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదం కారణంగా వివిధ స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ దుర్ఘటనతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు మాత్రం యథాతథంగా నడుస్తున్నాయి. ప్రమాద వివరాలను తెలియజేసేందుకు ఎక్కడికక్కడ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో హెల్ప్ లైన్ నంబర్ల 0891–2746330/0891–2744619ను ఏర్పాటు చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్, అధికారులు, సిబ్బంది ప్రత్యేక రైలులో ఘటనా స్థలానికి చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 120 టన్నుల, 140 టన్నుల సామర్థ్యం గల క్రేన్లతో జీఆర్పీ, రైల్వే అధికారులు, సిబ్బందితో మరో రెండు ప్రత్యేక రైళ్లు బయల్దేరాయి. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు ఈ ఘటనతో విజయనగరం వైపు వెళ్లాల్సిన, విజయనగరం వైపు నుంచి రావలసిన పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ రైళ్లలో కొన్నింటిని దారి మళ్లించారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్లో చెన్నై సెంట్రల్–హౌరా (12842) కోరమాండల్, యశ్వంత్‌పూర్–పూరీ (22842) గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లను పునరుద్ధరించే వరకు నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో నిలిపివేశారు. రద్దయిన రైళ్లు సోమవారం రాయ్‌పూర్–విశాఖపట్నం–రాయ్‌పూర్ (08527/08528) పాసింజర్ స్పెషల్ రద్దు చేశారు. ఆదివారం రాత్రి విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–కోర్బా ఎక్స్‌ప్రెస్ కూడా రద్దయింది. దారి మళ్లించిన రైళ్లు ఈ దిగువ రైళ్లను ఆదివారం రెగ్యులర్ మార్గం విశాఖపట్నం–విజయవాడ మీదుగా కాకుండా టిట్లాఘడ్–రాయ్‌పూర్–నాగ్‌పూర్–బల్హార్షా–విజయవాడ మీదుగా దారి మళ్లించారు. 28వ తేదీన బారునిలో బయల్దేరిన బారుని–కోయంబత్తూర్ (03357) స్పెషల్ ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన టాటాలో బయల్దేరిన టాటా–ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 29వ తేదీన భువనేశ్వర్‌లో బయల్దేరిన భువనేశ్వర్–ముంబయ్ (11020) కోణార్క్ ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన హౌరాలో బయల్దేరిన హౌరా–సికింద్రాబాద్ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన హౌరాలో బయల్దేరిన హౌరా–బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. గమ్యం కుదించిన రైళ్లు ఇవీ ► 29న సంబల్పూర్లో బయల్దేరిన సంబల్పూర్–నాందేడ్(20809)ఎక్స్‌ప్రెస్ విజయనగరం వరకు నడిచింది. అక్కడ నుండి తిరిగి సంబల్పూర్ చేరుకుంది. ► నెల 29న పూరీలో బయల్దేరిన పూరీ–తిరుపతి (17479) ఎక్స్‌ప్రెస్ బలుగాం వరకు నడిచింది. అక్కడ నుండి తిరిగి పూరీ చేరుకుంది. ► 29న విశాఖపట్నంలో బయల్దేరిన విశాఖపట్నం–విజయనగరం (07468) పెందుర్తి నుండి విశాఖకు చేరుకుంది. ► 28వ తేదీన ముంబైలో బయల్దేరిన ముంబై–భువనేశ్వర్ (11019) కోణార్క్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం వరకు మాత్రమే నడుస్తుంది. ఈ రైలు విశాఖపట్నం నుండి భువనేశ్వర్–ముంబై (11020) రైలుగా ముంబై బయల్దేరుతుంది. ఆర్టీసీ అప్రమత్తం రైళ్ల ప్రమాద ఘటనతో ఆర్టీసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి విజయనగరం నుంచి 10, సింహాచలం నుంచి 5, గాజువాక నుంచి 3, ఎస్.కోట నుంచి 2 బస్సులను పంపించారు. క్షతగాత్రులను ఈ బస్సుల్లో వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరో 5 బస్సులను విజయనగరంలో సిద్ధం చేశారు. పార్వతీపురం, పలాస వైపు వెళ్లే ప్రయాణికులకు, ప్రమాదం వల్ల వివిధ స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం విశాఖ ద్వారకా బస్ స్టేషన్లో సరిపడినన్ని బస్సులను అందుబాటులో ఉంచామని ఆర్టీసీ జోన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.రవికుమార్ ‘సాక్షి’కి చెప్పారు. అలాగే రైల్వే స్టేషన్లో కూడా బస్సులను సిద్ధంగా ఉంచామన్నారు. విశాఖ ద్వారకా బస్ స్టేషన్లో ఇద్దరు అధికారులను నియమించామని, ఘటనా స్థలానికి మరికొందరు అధికారులను పంపించామని తెలిపారు. -
రెండు రైళ్లు ఢీ.. 12 మంది దుర్మరణం
సాక్షి ప్రతినిధి విజయనగరం/జామి/లక్కవరపుకోట/శృంగవరపు కోట/పెందుర్తి/సాక్షి, అమరావతి/కొవ్వూరు: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రెండు రైళ్లు బయల్దేరిన కొద్ది నిమిషాల వ్యవధిలో ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ పెను ప్రమాదంలో 12 మంది మరణించగా.. 32 మంది గాయపడ్డారు. వీరిని విశాఖపట్నం, విజయనగరం ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ఏం జరిగిందో అర్ధమయ్యేలోపే కొన్ని బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో ఒక్కసారిగా అరుపులు, కేకలు, హాహాకారాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఈ హృదయ విదారక ఘటన ఆదివారం సాయంత్రం జామి మండల పరిధిలో జరిగింది. ఈ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. వివరాలివీ.. విశాఖ నుంచి–పలాస వెళ్లే పాసింజర్ రైలు ఆదివారం సా.6.42 గంటలకు కొత్తవలస రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరింది. భీమాళి రైల్వేస్టేషన్ దాటిన తర్వాత అలమండ రైల్వేస్టేషన్ నుంచి సిగ్నల్ రాకపోవడంతో డ్రైవర్ రైలును నిలిపివేశారు. అదే సమయంలో సా.6.52 గంటల ప్రాంతంలో రాయఘడ పాసింజర్ కొత్తవలస నుంచి బయల్దేరింది. వేగంగా వస్తున్న రాయగడ పాసింజర్ అదే ట్రాక్‌పై ముందు వెళ్తున్న పలాస పాసింజర్ రైలును రాత్రి 7 గంటల సమయంలో వెనుక నుంచి భీమాళి–అలమండ రైల్వేస్టేషన్ల మధ్య ఢీకొట్టింది. దీంతో పలాస పాసింజర్ వెనుకనున్న రెండు బోగీలు, వాటిని ఢీకొన్న రాయఘడ పాసింజర్ రైలు ఇంజన్‌తో పాటూ మరో మూడు బోగీలు పలాస రైలు మీద పడి నుజ్జునుజ్జయ్యాయి. అదే సమయంలో కొన్ని బోగీలు పక్క ట్రాక్‌పై ఉన్న గూడ్స్ మీద పడ్డాయి. దీంతో పెను విషాదం అలముకుంది. మృతులు 12 మంది.. ఘటనలో 12 మంది మృతిచెందినట్లు గుర్తించారు. వారి మృతదేహాలను బయటికి తీశారు. నుజ్జునుజ్జయిన బోగీల్లో మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉంది. ఇక బోగీల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మృతుల్లో ఒక లోకో పైలట్ ఉన్నట్లు సమాచారం. 32 మందికి పైగా క్షతగాత్రులను 20 అంబులెన్స్‌ల్లో విజయనగరం, విశాఖల్లో వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. చీకట్లోనే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు.. ప్రమాదం గురించి తెలియగానే క్షణం ఆలస్యం చేయకుండా పోలీసు, వైద్య, రెవెన్యూ, ఇతర శాఖలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆ బృందాలు హుటాహుటిన సహాయక చర్యలను ప్రారంభించాయి. విశాఖ నుంచి ఒక ఎన్డీఆర్ఎఫ్, రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు చేపట్టాయి. అదనంగా విశాఖపట్నం నుంచి మరో ఎన్డీఆర్ఎఫ్, కాకినాడ నుంచి ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దింపారు. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. స్థానికులు కూడా సహకరించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న ఏపీ విపత్తు నిర్వహణ సిబ్బంది హుటాహుటిన ప్రజాప్రతినిధులు, అధికారుల రాక ప్రమాద ఘటన వార్త తెలుసుకున్న వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఎం.దీపికతో పాటూ పలువురు జిల్లా అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. జిల్లా యంత్రాంగానికి మంత్రి బొత్స పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వైద్యశాఖ అప్రమత్తం.. ప్రమాద ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాఖను అప్రమత్తం చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రమాదం గురించి తెలిసిన కొద్ది నిమిషాల్లోనే అప్రమత్తమైన ప్రభుత్వం 108 అంబులెన్సులను ఘటనా స్థలికి తరలించింది. విజయనగరం, అనకాపల్లి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి 30 వరకూ 108 అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్‌కు.. స్వల్పంగా గాయపడ్డ వారిని విజయనగరంతో పాటు, సమీపంలోని ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. బాధితులకు వైద్య సహాయార్థం కేజీహెచ్‌లో హెల్ప్లైన్లు ఏర్పాటుచేశారు. సీఎం జగన్ దిగ్భ్రాంతి ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలుకు ప్రమాదం జరిగినట్లుగా.. పలు బోగీలు పట్టాలు తప్పినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్సులను పంపించాలని, మంచి వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. మరోవైపు.. దుర్ఘటనపై రాష్ట్ర హోం, విపత్తుల నివారణ శాఖ మంత్రి తానేటి వనిత కూడా దిగ్భ్రాంత్రి వ్యక్తంచేసి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ‘సాక్షి’కి చెప్పారు. ముఖ్యమంత్రికి రైల్వే మంత్రి ఫోన్ ఈ ప్రమాదంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం జగన్‌తో ఫోన్లో ఆదివారం రాత్రి మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే తీసుకున్న చర్యలను సీఎం జగన్ ఆయనకు వివరించారు. సహాయ బృందాలను వెంటనే ఘటనా స్థలానికి పంపించామని, క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు సత్వర చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యన్నారాయణ, స్థానిక కలెక్టర్, ఎస్పీ కూడా అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు సరైన వైద్యసేవలు అందించడంపై అధికారులు దృష్టిపెట్టారని, వీరిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్యసేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి చెప్పారు. ఏపీ మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలతో పాటు, క్షతగాత్రులకు సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షలు చొప్పున సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరణించిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటే బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున సహాయం అందించాలన్నారు. రైలు ప్రమాదంపై ప్రధాని విచారం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ విపత్తుల సహాయ నిధి నుంచి రూ.రెండు లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించనున్నట్లు ప్రకటించారు. క్షత్రగాత్రులకు రూ.50,000 చొప్పున సహాయం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. తక్షణమే పరిస్థితిని సమీక్షించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ప్రధాని ఆదేశించారు. ఏం జరిగిందో అర్థంకాలేదు.. పార్వతీపురంలోని మా ఇంటికి వెళ్లేందుకు పెందుర్తిలో రైలెక్కాను. సుమారు గంట తరువాత ఆకస్మాత్తుగా రైలు భారీ కుదుపునకు గురైంది. మా బోగిలో అందరూ చెల్లాచెదురైపోయారు. కాసేపు ఏం జరిగిందో అర్థంకాలేదు. తేరుకునేటప్పటికి నా కాలికి తీవ్ర గాయమైంది. మా అల్లుడు వచ్చి పెందుర్తి ఆసుపత్రిలో చికిత్స చేయించాడు. – వరలక్ష్మి, ప్రమాదంలో గాయపడిన మహిళ వెనుక నుంచి ఢీకొట్టడంవల్లే.. సాక్షి, విశాఖపట్నం/విజయనగరం అర్బన్/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ) : వాల్తేరు డివిజన్ పరిధిలోని విజయనగరం జిల్లా అలమండ సమీపంలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతం భీతావహంగా మారింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు ప్రాథమిక ఎఫ్ఐఆర్ సిద్ధంచేసి రైల్వే మంత్రిత్వ శాఖకు పంపించారు. ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఏఏ రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి? అనే ప్రాథమిక అంశాల్ని అందులో పొందుపరిచారు. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ► ప్రమాదం జరిగిన తీరు: వెనుక నుంచి ఢీకొట్టడంవల్ల.. ► ప్రమాదం జరిగిన సమయం: 29 అక్టోబరు రాత్రి 7 గంటలకు.. ► డివిజన్ : వాల్తేరు రైల్వే డివిజన్ ► ఏ సెక్షన్లో జరిగింది: కంటకాపల్లి–అలమండ డీఎన్ మిడిల్ లైన్లో ► ప్రమాదం జరిగిన ప్రాంతం: 840/27 కి.మీ వద్ద ► ఏఏ రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి: 08532 ఎక్స్‌ప్రెస్, 08504 ఎక్స్‌ప్రెస్ ► సమీప స్టేషన్ నుంచి ఎప్పుడు బయలుదేరాయి: 08532 ఎక్స్‌ప్రెస్ సా. 6.42 గంటలకు బయల్దేరింది.. 08504 ఎక్స్‌ప్రెస్ 6.52 గంటలకు బయలుదేరింది ► ఇతర సమాచారం: యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ కోసం 7.05కి సమాచారం ఇచ్చారు ► 7.07 గంటలకు యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్‌ను (ఏఆర్టీ) ఆర్డర్ చేయగా 7.31 గంటలకు విశాఖ నుంచి బయల్దేరింది. ► 7.10 గంటలకు 120 టన్నుల క్రేన్ బయల్దేరింది ► సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు : వాల్తేరు డివిజన్ డీఆర్ఎం, ఏడీఆర్ఎం(ఆపరేషనల్), ఇతర అధికారులు రైలు ప్రమాదంపై గవర్నర్ విచారం సాక్షి, అమరావతి : విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంపై గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు రాజ్‌భవన్ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. బీజేపీ, జనసేన నేతల దిగ్భ్రాంతి విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి అవసరమైన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకోవాలని ఆమె ఓ ప్రకటనలో కోరారు. బాధితులకు అండగా నిలవాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొద్ది నెలలక్రితం ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద సంఘటనను మరువకముందే మన రాష్ట్రంలో మరో ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఉలిక్కిపడిన విశాఖ
సాక్షి, విశాఖపట్నం : బాలేశ్వర్ ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా.. ఆ మహా విషాదం ఇంకా కళ్లముందే కదులుతోంది. ఇంతలోనే మరో ఘోరం.. మాటలకందని విషాదం.. కళ్లు మూసి తెరిచేలోపు క్షణాల్లో ప్రమాదం జరిగిపోయింది. ఆదివారం రాత్రి విశాఖపట్నం నుంచి బయల్దేరిన పలాస రైలును, వెనుక నుంచి వెళ్లిన విశాఖ–రాయగడ రైలు విజయనగరం జిల్లా చినరావుపల్లి సమీపంలో ఢీకొంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా 30 మందికిపైగా గాయపడ్డారు. విషాద ఘటన గురించి తెలుసుకున్న విశాఖవాసులు ఉలిక్కిపడ్డారు. తమ వారి యోగక్షేమాల కోసం ఆరా తీసేందుకు రైల్వే స్టేషన్‌కు పరుగులు తీశారు. వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు.. ఘటన జరిగిన వెంటనే ప్లాట్‌ఫామ్ నం.1లో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం వచ్చిన వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తూ ఘటనా స్థలంలో ఉన్న రెస్క్యూ బృందానికి సమాచారం అందిస్తున్నారు. వారంతా ఎలా ఉన్నారో తెలుసుకొని తిరిగి అక్కడకు వచ్చినవారికి తెలియజేస్తున్నారు. రైలు ప్రమాదం బాధాకరం రైలు ప్రమాద ఘటనపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, రైల్వే డీఆర్ఎంకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా స్థానిక పార్టీ శ్రేణులతో మాట్లాడి సంఘటన ప్రాంతంలో సత్వర సహాయక చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ తరహా ఘటనలు పునారావృతం కాకుండా సంబంఽధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు ఈ ఘటనతో విజయనగరం వైపు వెళ్లాల్సిన, విజయనగరం వైపు నుంచి రావలసిన పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు రైళ్లు రద్దు కాగా ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించారు. మరికొన్ని రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో నిలిపివేశారు. కేజీహెచ్‌లో ప్రత్యేక బృందాలు ప్రమాద ఘటన తెలుసుకున్న కలెక్టర్ డా.మల్లికార్జున కేజీహెచ్ వైద్యులను అప్రమత్తం చేశారు. కేజీహెచ్ క్యాజువాలిటీలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసి 0891–2558494 నంబర్ని అందుబాటులో ఉంచారు. అదేవిధంగా రైలు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఇద్దరు వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలంటూ ఆదేశించారు. వైద్యులను సంప్రదించేందుకు 8341483151, 9688321986 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 9030226621, 7036111169, 08912590102 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో హెల్ప్ లైన్ నెంబర్ 0891–2746330 / 0891–2744619. రైలు ప్రమాద బాధితురాలికి పెందుర్తిలో చికిత్స పెందుర్తి: రైలు ప్రమాదంలో గాయపడిన రేజేటి వరలక్ష్మి అనే మహిళ పెందుర్తి ప్రభుత్వ సీహెచ్‌సీలో చికిత్స పొందుతుంది. పార్వతీపురానికి చెందిన వరలక్ష్మి పెందుర్తిలోని కుమార్తె ఇంటికి కొద్దిరోజుల క్రితం వచ్చింది. ఆదివారం సాయంత్రం తిరిగి పార్వతీపురం వెళ్లేందుకు పెందుర్తి రైల్వే స్టేషన్లో రాయగడ రైలు ఎక్కింది. ఆ రైలు అలమండ వద్ద ప్రమాదానికి గురైన ఘటనలో వరలక్ష్మి కాలికి తీవ్ర గాయమైంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకుని వరలక్ష్మిని పెందుర్తి సీహెచ్‌సికి తరలించారు. -
రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.దాంతో వెంటనే సహాయక చర్యటు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. కాగా, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఉన్న విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలును పలాస-విశాఖ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయగడ ప్యాసింజర్ చివరి మూడు బోగీలు పట్టాలు తప్పాయి. విజయనగరం: కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం -
విజయనగరం: కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం, ఆరుగురు మృతి
Train accident Updates ►ఘటనా స్థలానికి చేరుకున్న యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్.. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ ►సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ►రాయగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేశారు. ►08912746330, 08912744619, 8106053051, 8106053052, 8500041670, 8500041671లకు సంప్రదించవచ్చు. ►ఘటనాస్థలానికి చేరుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ. ►ఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాద స్థలికి విజయనగరం ఎస్పీ బయల్దేరారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ► రైలు ప్రమాదంలో ఒక బోగీలో చిన్నారులు ఇరుక్కుపోయారు. ఆర్తనాదాల మధ్య ప్రయాణికులు చీకటిలో చిక్కుకుపోయారు. ఎలక్ట్రికల్ సిబ్బంది, రైల్వే సహాయక సిబ్బంది, ఉన్నతాధికారులు ప్రత్యేక రైలులో ఘటనా స్థలికి చేరుకున్నారు. సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది. కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద పట్టాలపై ఉన్న విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలును పలాస-విశాఖ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయగడ ప్యాసింజర్ చివరి నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో అరుగురు మృతిచెందగా, పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా ఓవర్ హెడ్ కేబుల్ తెగడంతో విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలపై నిలిచిపోయింది. ఆగిపోయిన ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సంఘటనా ప్రాంతం అంధకారంగా మారింది. కరెంట్ లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. -
బీహార్ లో పట్టాలు తప్పిన ట్రైన్
-
బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన నార్త్ఈస్ట్ ఎక్స్‌ప్రెస్
పాట్నా: ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాల సంఖ్య క్రమంలో పెరుగుతోంది. తాజాగా బీహార్‌లో మరో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అసోంలోని కామాఖ్యాకు వెళ్తోన్న నార్త్ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు బీహార్‌లోని రఘునాథ్పుర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వివరాల ప్రకారం.. నార్త్ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు బీహార్‌లోని రఘునాథ్పుర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. బుధవారం రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపుగా 21 బోగీలు పట్టాలు తప్పాయని, మూడు బోగీలు పల్టీలు కొట్టినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతిచెందగా.. 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే స్తానిక ఆసుపత్రులకు తరలించారు. #WATCH | Bihar: Visuals from the Raghunathpur station in Buxar, where 21 coaches of the North East Express train derailed last night Restoration work is underway. pic.twitter.com/xcbXyA2MyG — ANI (@ANI) October 12, 2023 రైలు ప్రమాదంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్ఎఫ్కు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖకు సూచించారు. కేంద్ర సహాయక మంత్రి అశ్విని కుమార్ చౌబే కూడా రైలు ప్రమాదంపై స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఘటనాస్థలికి పంపించామని, క్షతగాత్రుల్ని పట్నాలోని ఎయిమ్స్‌కి తరలిస్తామన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. రైలు ప్రమాదం జరగడంతో రైల్వేశాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. పాట్నా: 9771449971, ధన్పూర్: 8905697493, కమాండ్ కంట్రోల్: 7759070004, ఆరా : 8306182542 హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. #WATCH | Bihar: Morning visuals from the Raghunathpur station in Buxar, where 21 coaches of the North East Express train derailed last night 4 people died and several got injured in the incident. pic.twitter.com/aiZZOYpfCc — ANI (@ANI) October 12, 2023 #WATCH | Bihar: Rescue operation by NDRF underway after 21 coaches of the North East Express train derailed near Raghunathpur station in Buxar pic.twitter.com/7mEvv9f6SE — ANI (@ANI) October 11, 2023 #WATCH | North East Express train derailment: Visuals from Primary Health Centre, Brahampur where some of the injured passengers have been admitted As per the General Manager of East Central Railway, 4 people died and several were injured after 21 coaches of the North East… pic.twitter.com/UOAC2FbuaA — ANI (@ANI) October 11, 2023 -
రైలు బోగీలో సిలిండర్ పేలి.. 10 మంది మృతి
చెన్నై: తమిళనాడులోని మధురై రైల్వేస్టేషన్లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న రైలు బోగీ (ప్రైవేటు పార్టీ కోచ్)లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బోగీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో 10 మంది మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఈ ప్రైవేటు పార్టీ కోచ్ ఆగస్టు 17న ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. శుక్రవారం నాగర్‌కోయిల్ జంక్షన్ వద్ద దీన్ని పునలూరు-మధురై ఎక్స్‌ప్రెస్ రైలుకు అటాచ్ చేశారు. నిన్న రాత్రి మదురై రైల్వే స్టేషన్ వద్ద దీన్ని డిటాచ్ చేసి స్టాబ్లింగ్ లైన్లో నిలిపి ఉంచారు. శనివారం తెల్లవారుజామున 5.15 గంటల ప్రాంతంలో రైల్లోకి అక్రమంగా తీసుకొచ్చిన సిలిండర్‌పై టీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలు చేలరేగాయి. చూస్తుండగానే బోగీ అంతా వ్యాపించాయి. మంటలను గుర్తించిన కొంతమంది ప్రయాణికులు వెంటనే బోగీ నుంచి కిందకు దిగారు అని దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బోగీలో 65 మంది ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. மதுரை ரயில் நிலையத்தில் நிறுத்திவைக்கப்பட்டிருந்த ரயிலில் தீ விபத்து; ரயிலில் கேஸ் சிலிண்டர் வைத்து சமைத்தபோது தீப்பற்றியதாக தகவல்#Madurai | #Fire | #Train | #FireAccident | #TrainAccident | #TrainFireAccident pic.twitter.com/Zw8RUdXPMb — PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) August 26, 2023 Fire accident in the train🔥... death toll increases - shocking scenes! All are Rameshwaram Ramanathaswamy Devotees 😢 #Madurai #TrainFire #Fire #FireAccident #Tamilnadu #IndianRailways #accident #Blast # #cylinderblast pic.twitter.com/eZ0DybnzDV — Karthik Artha 𝕏 (@KarthikArtha) August 26, 2023 -
చెంపదెబ్బకి అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడ్డాడు.. తర్వాత..
ముంబై: ముంబైలోని సియోన్ రైల్వే స్టేషన్లో భార్యా భర్తలు ఒక వ్యక్తితో ఘర్షణకు దిగారు. వివాదం కాస్తా పెద్దది కావడంతో రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగి భర్త బలంగా చెంపదెబ్బ కొట్టడంతో ఆ వ్యక్తి అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు. క్షణాల వ్యవధిలో ఆ ట్రాక్‌పైకి వచ్చిన ఓ రైలు ఆ వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ వివరమంతా అక్కడి సీసీటీవీ ఫుటేజిలో స్పష్టంగా రికార్డయ్యింది. పోలీసులు భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సియోన్ రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి 9.15 ప్రాంతంలో భార్యా భర్తలు అవినాష్ మానే(35), శీతల్ మానే(31) అక్కడ ప్లాట్‌ఫారంపై మంఖార్డ్ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోనే మృతుడు దినేష్ రాథోడ్(26) ఆమెను వెనక నుంచి తోశాడని ఆరోపిస్తూ గొడవకు దిగింది. బాధితుడిపై గొడుగుతో కూడా దాడి చేసింది. పక్కనే ఉన్న భర్త కూడా భార్యకు జతకలిసి ఇద్దరూ కలిసి దినేష్ పై దాడి చేశారు. ఈ క్రమంలో అవినాష్ మానే దినేష్ ను బలంగా చెంప దెబ్బ కొట్టడంతో అదుపుతప్పి రైలు పట్టాలపై పడిపోయాడు. దినేష్ ప్లాట్‌ఫారంపైకి తిరిగి ఎక్కే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకపోయింది. చుట్టూ ఉన్నవారు దినేష్ కు సాయం చేద్దామని ముందుకు వచ్చే లోపు రైలు వస్తుండటాన్ని చూసి వారంతా వెనకడుగు వేశారు. రెప్పపాటులో ఆ ట్రాక్ పైకి వచ్చిన రైలు వేగంగా దూసుకొచ్చి దినేష్ పైనుండి వెళ్ళిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే భార్యా భర్తలు అక్కడి నుండి జారుకుని వారి నివాసమైన ధారావికి పారిపోయారు. అక్కడున్న వారు ఇచ్చిన సమాచారంతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మొదట అవినాష్ ను తర్వాత శీతల్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల -
రైలు నుంచి పడి ట్రాన్స్‌జెండర్ దుర్మరణం
జనగాం : రైలు నుంచి జారి పడి ఓ ట్రాన్స్‌జెండర్ దు ర్మరణం చెందిన సంఘటన రఘునాథపల్లి రైల్వేస్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సంగెం మండలం ఎల్గూరుస్టేషన్ తూర్పుతండాకు చెందిన ట్రాన్స్‌జెండర్ బాదావత్ అనిల్ అలియాస్ దివ్య (25) సికింద్రాబాద్ నుంచి శాతవాహన రైలులో కాజీపేటకు వస్తుంది. దివ్య రఘునాథపల్లి రైల్వేస్టేషన్ రెండోప్లాట్‌ఫాంపై చేరుకోగానే నెమ్మదిగా రైలు వెళ్తున్న క్రమంలో కిందికి దిగబో తూ ప్రమాదవశాత్తు కాలుజారి రై లు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అదే రైలులో ప్ర యాణిస్తున్న మృతుడి స్వగ్రామానికి చెందిన బాలు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ ఘటనపై రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్ దాటుతున్న ట్రక్కును ఢీకొట్టిన రైలు..
జకార్తా: ఇండోనేషియాలో రైల్వే గేటు వద్ద రైలు వచ్చే సమయంలో ట్రాక్ దాటేయాలన్న ఉద్దేశ్యంతో పట్టాలు మీదకి దూసుకు వచ్చిన ట్రక్కును పాసింజరు రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. భారీగా మంటలు చెలరేగడంతో రైలులోని ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇండోనేషియాలోని సెమరాంగ్ పట్టణంలో జులై 18న ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలు బ్రంతాస్ 112 వస్తోన్న నేపథ్యంలో ఆపరేటర్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ట్రక్కు డ్రైవర్ అదేమీ పట్టించుకోకుండా ఈలోపే ట్రాక్ దాటేయవచ్చన్న తాపత్రయంలో ముందుకు వెళ్ళాడు. రెప్పపాటులో రైలు వచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. సుమారు 50 మీటర్ల దూరానికి ట్రక్కును ఈడ్చుకుంటూ వెళ్ళగా భారీగా మంటలు కూడా చెలరేగాయి. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారికి గానీ, వీడియోలో చూసినవారికి గానీ ప్రాణనష్టం కూడా భారీగానే జరిగి ఉంటుందనిపించక మానదు. కానీ అదృష్టవశాత్తు ట్రక్కు డ్రైవర్, రైలు లోకో పైలెట్ ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాలేదు సరికదా క్షేమంగా బయటపడ్డారు. కానీ పెద్ద ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో రైలు నుంచి దూకేసిన ఒక ప్రయాణికుడికి మాత్రం గాయాలయ్యాయి. The Brantas 112 Train collided with a truck in the Semarang West Flood Canal in Madukuro, Central Java, Indonesia, resulting in dramatic explosions and massive flames engulfing the area. pic.twitter.com/Fnsg3WTyp1 — Ericssen (@EricssenWen) July 18, 2023 ఇది కూడా చదవండి: పెళ్ళిలో అపశ్రుతి.. భర్తను కాకుండా మామను పెళ్లాడిన వధువు.. -
బ్రేకింగ్: పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్..
-
ఝరపడా జైలుకు నిందితుల తరలింపు
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో అరెస్టయిన ముగ్గురు నిందితుల రిమాండ్ గడువు శుక్రవారంతో ముగిసింది. ఈ ముగ్గురినీ ఝరపడా జైలుకు తరలించారు. ఈనెల 7న స్థానిక ప్రత్యేక సీబీఐ కోర్టు నిందితులకు 5 రోజుల రిమాండ్ విధించింది. కేసు విచారణ మరింత లోతుగా నిర్వహించాల్సి ఉందనే అభ్యర్థనతో దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) న్యాయస్థానాన్ని కోరడంతో ఈనెల 11న కోర్టు రిమాండ్‌ను మరో 4 రోజులు పొడిగించేందుకు అనుమతించింది. ఈ వ్యవధి పూర్తి కావడంతో ముగ్గురు నిందితులు(సీనియర్ సెక్షన్ ఇంజనీర్(సిగ్నల్) అరుణ్‌కుమార్ మహంత, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ మహ్మద్ అమీర్‌ఖాన్, టెక్నీషియన్ పప్పుకుమార్)ను స్థానిక జైలుకు తరలించారు. కేసు తదుపరి విచారణను ఈనెల 27కి కోర్టు వాయిదా వేసినట్లు ప్రకటించింది. జైలుకు తరలించిన వారిని ఈనెల 7న సీబీఐ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. వీరికి వ్యతిరేకంగా ఐిపీసీ సెక్షన్లు 304(మరణానికి కారకులు), 201(సాక్ష్యాధారాల గల్లంతు) ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. నార్త్ సిగ్నల్ గూమ్టీ(స్టేషన్) వద్ద సిగ్నలింగ్ సర్క్యూట్ మార్పులో లోపం కారణంగా ప్రమాదం జరిగింది. ఇది మానవ తప్పిదమని ఆగ్నేయ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్ఎస్) విచారణ నివేదికలో వెల్లడించింది. నలుగురు ఉద్యోగులపై.. బహనాగా బజార్ రైలు దుర్ఘటన ఘటనలో మరో నలుగురు ఉద్యోగులను సీబీఐ దర్యాప్తు బృందం ప్రశ్నిస్తోంది. స్థానిక ఝరపడా జైలు ప్రాంగణంలో ఈ విచారణ కొనసాగుతోంది. వీరిలో ఇద్దరు సిగ్నల్ ఆపరేటర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, స్టేషన్ మాస్టర్ ఉన్నారు. వీరందరినీ రైల్వేశాఖ విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
నిర్లక్ష్యంపై వేటు!
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఏడుగురు ఉద్యోగులను రైల్వేశాఖ తొలగించింది. ఈ ప్రమాదంలో 294మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 1,100 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. వీరిలో ముగ్గురు ప్రస్తుతం సీబీఐ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు ఎస్ఎండ్టీ అధికారులు కూడా ఉన్నారని ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అనీల్‌కుమార్ మిశ్రా తెలిపారు. వీరితో ప్రమాదానికి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన సిబ్బందిగా గుర్తించిన బహనాగా బజార్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, మెయింటైనర్లను సస్పెండు చేసినట్లు సమాచారం. బహనాగా బజార్, బాలాసోర్ రైల్వే స్టేషన్లను సౌత్ఈస్ట్ రైల్వే జీఎం, డీఆర్ఎం బుధవారం ప్రత్యక్షంగా సందర్శించారు. అనంతరం సిబ్బందికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టారు. ఈ అధికారులు బాలాసోర్ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగితో కలిసి గోపీనాథ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా బాలాసోర్–నీలగిరి సెక్షన్‌ను పర్యవేక్షించారు. సీబీఐ అరెస్ట్ చేసిన ముగ్గురు రైల్వే ఉద్యోగులు సీనియర్ సెక్షన్ ఇంజినీర్(సిగ్నల్), అరుణ్‌కుమార్ మహంత, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ మహ్మద్ అమీర్‌ఖాన్, టెక్నీషియన్ పప్పుకుమార్ లను మరో 4 రోజులు రిమాండ్ కొనసాగించారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి లభించింది. అప్రమత్తంగా ఉండి ఉంటే..! ఈ దుర్ఘటన పురస్కరించుకుని ఆగ్నేయ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్ఎస్) సమర్పించిన విచారణ నివేదిక బహనాగా బజార్ స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదానికి సిగ్నలింగ్ సమస్యలతో సహా అనేక మానవ లోపాలను ఎత్తి చూపింది. దీని ఆధారంగా రైల్వేశాఖ అధికారులు.. బాధ్యులుగా భావిస్తున్న వారిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. సీఆర్ఎస్ విచారణ పట్ల పలు రాజకీయ పక్షాలు విశ్వసనీయత ప్రదర్శించిన విషయం తెలిసిందే. రైలు దుర్ఘటనల్లో ఈ వర్గం విచారణ అత్యంత పారదర్శకతతో అనుబంధ లోటుపాటులను పటిష్టంగా ఖరారు చేయగలుగుతుందని పలు వర్గాల్లో నమ్మకం బలపడి ఉంది. సీబీఐ విచారణ నేరపరమైన ప్రమేయాన్ని వెలికి తీయగలుగుతుంది. రైల్వే శాఖా పరమైన అంశాలను రైల్వే భద్రతా కమిషనర్ విచారణ తేటతెల్లం చేస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ విచారణ పూర్తయి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక దాఖలు చేయడం పూర్తయ్యింది. సీఆర్ఎస్ విచారణ మానవ తప్పిదపరమైన లోపాలు ఘోర దుర్ఘటనను ప్రేరేపించాయని స్పష్టం చేసింది. ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అనీల్‌కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ‘ప్రమాదానికి దారితీసిన కారణాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు చేస్తోంది. ఈ వర్గం నివేదిక కోసం వేచి ఉన్నాం. మరోవైపు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు రైల్వే ఉద్యోగుల వ్యతిరేకంగా శాఖాపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. వీరు విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉంటే ప్రమాద నివారణ సాధ్యమయ్యేదని భావిస్తున్న’ట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా విశాఖ–కాశీ వీక్లీ రైలు కొనసాగింపు భువనేశ్వర్: ప్రయాణికుల ఆసక్తి దృష్ట్యా విశాఖపట్నం–బనారస్(కాశీ) మధ్య నడుస్తున్న వీక్లీ ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించినట్లు తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లలో ద్వితీయ శ్రేణి ఎయిర్ కండిషన్–1, తృతీయ శ్రేణి ఎయిర్ కండిషన్–3, స్లీపర్ శ్రేణి–12, సాధారణ శ్రేణి–2, ద్వితీయ శ్రేణి కమ్ లగేజీ, దివ్యాంగుల కోచ్‌లు–2 సౌకర్యం అందుబాటులో ఉంటాయి. ఇది విశాఖపట్నం, బనారస్ స్టేషన్ల మధ్య సింహాచలం, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగుడ, కెసింగ, టిట్లాగఢ్, బొలంగీర్, బర్గడ్ రోడ్, సంబల్పూర్, ఝార్సుగుడ, రౌర్కెలా, హతియా, రాంచీ, మూరి, బర్కకానా, లాతేహర్, డాల్తోగంజ్, గర్వా రోడ్, డెహ్రీ ఆన్ సోన్, ససారాం, భబువా రోడ్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, వారణాసి స్టేషన్లలో ఆగుతుంది. ► 08588 విశాఖపట్నం–బనారస్ వీక్లీ స్పెషల్ రైలు జూలై 19నుంచి ఆగస్టు 30 వరకు ప్రతి బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు బనారస్ చేరుకుంటుంది. ► తిరుగు ప్రయాణంలో 08587 బనారస్–విశాఖపట్నం వీక్లీ స్పెషల్ జూలై 20 నుంచి ఆగస్టు 31 వరకు ప్రతి గురువారం ఉదయం 6 గంటలకు బనారస్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ క్రమంలో ఉభయ దిశల్లో ఈ రైళ్లు 7 సార్లు రవాణా అవుతాయి. ఆలస్యంగా రైళ్లు.. భువనేశ్వర్: దక్షిణాది ప్రాంతాల మధ్య రాకపోకలు చేస్తున్న పలు ప్రయాణికుల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుగు ప్రయాణంలో బయల్దేరాల్సిన స్టేషన్ వేళలను సవరించి, సర్దుబాటు చేసి నడిపిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. బుధవారం షాలీమార్ నుంచి బయల్దేరాల్సిన 12841 అప్ షాలీమార్–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు నిర్థారిత సమయం మధ్యాహ్నం 3.20 గంటలు కాగా సాయంత్రం 5 గంటలకు బయలు దేరుతుందని ప్రకటించారు. బుధవారం రాత్రి 11.55 గంటలకు హౌరా నుంచి బయల్దేరాల్సిన 12839 అప్ హౌరా–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ మెయిల్ గురువారం ఉదయం 5 గంటలకు ఆలస్యంగా బయలు దేరుతుందని ప్రకటించారు. బుధవారం ఉదయం 10.35 గంటలకు బయలుదేరాల్సిన 12864 డౌన్ ఎస్‌వీఎంటీ బెంగుళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్ వేళలు సవరించి మధ్యాహ్నం 1గంటకు ఆలస్యంగా నడిపించినట్లు తెలిపారు. -
Odisha Tragedy: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఏడుగురి సస్పెన్షన్..
ఒడిశా: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో రైల్వే భద్రతా కమీషనర్ నేతృత్వంలో జరుగుతున్న విచారణలో ఘోర ప్రమాదానికి కారణమైన ఏడుగురు అద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దక్షిణ తూర్పు రైల్వే శాఖ. వీరిలో ఇదే కేసులో అంతకు ముందు సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు. ఈ సందర్బంగా దక్షిణ తూర్పు రైల్వే డివిజన్ మేనేజర్ అనిల్ కుమార్ మిశ్రా మీడియా సమావేశాన్ని నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించారు. సస్పెన్షన్ కు గురైన అధికారులు ఏమాత్రం జాగ్రత్త వ్యవహరించి అప్రమత్తంగా ఉన్నా ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని, వారి నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయనన్నారు. మొదట అరెస్టైన ముగ్గురు, 24 గంటల క్రితం అరెస్టైన మరో ఉద్యోగి తోపాటు మరో ముగ్గురుని సస్పెండ్ చేస్తున్నట్లు అనిల్ మిశ్రా తెలిపారు. అంతకు ముందు సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురు ఉద్యోగులు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మహమ్మద్ అమిర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ లకు మరో నాలుగు రోజుల రిమాండ్ పొడిగించాలని సీబీఐ కోరిన విషయం తెలిసిందే. జూన్ 2న బాలాసోర్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 298 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1200 మందికి పైగా గాయపడ్డారు. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ దుర్ఘటనలో ఎందరో దిక్కులేని వారయ్యారు. ఇంకెందరో నిరాశ్రయులయ్యారు. ఇప్పటికింకా 41 మృతదేహాలను గుర్తించడానికి ఎవ్వరూ రాకపోవడం అత్యంత విచారకరం. #OdishaTrainTragedy: Seven Railway staff including the three employees, who were earlier arrested, suspended, informs South-Eastern Railway GM Anil Kumar Mishra #Odisha pic.twitter.com/MbL6jHYNsp — OTV (@otvnews) July 12, 2023 ఇది కూడా చదవండి: కార్మికుడికి రూ.24. 61 లక్షలు టాక్స్ కట్టమంటూ నోటీసులు..? -
‘బాలాసోర్’లా త్వరలో ఘోర రైలు ప్రమాదం!
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని బాలాసోర్‌లో ఇటీవల జరిగిన ఘోర రైల్వే ప్రమాదం వంటిదే ఢిల్లీ–హైదరాబాద్ రైల్వే మార్గంలో జరగబోతోందంటూ ఓ ఆగంతకుడు రాసిన లేఖ కలకలం రేపుతోంది. బాలాసోర్‌లో ఒక గూడ్స్ రైలు, రెండు ప్రయాణికుల రైళ్లు ఢీకొని వందల మంది చనిపోవడం, ఆ ప్రమాదం వెనుక విద్రోహ చర్య కూడా ఉండే అవకాశంపై సీబీఐ దర్యాప్తు జరుగుతుండటం తెలిసిందే. ఈ క్రమంలో అదే తరహా మరో ప్రమాదం జరగబోతోందంటూ నాలుగైదు రోజుల కింద వచ్చిన లేఖతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ–హైదరాబాద్ మార్గంలో సిగ్నలింగ్ వ్యవస్థలను, ట్రాక్ పరిస్థితిని తనిఖీ చేస్తున్నారు. ప్రతి రైలును క్షుణ్నంగా తనిఖీ చేయాలని, సిబ్బంది అంతా జాగ్రత్తగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆదేశించారు. ఇక రైల్వే పోలీసుల ఫిర్యాదు మేరకు సదరు లేఖ ఎక్కడి నుంచి వచ్చిది, ఎవరు రాశారన్నది తేల్చేందుకు రాష్ట్ర పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చదవండి: పెళ్లికి ముందే వరకట్న వేధింపులు.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే.. -
ఒడిశా రైలు ప్రమాదంపై వెలుగులోకి సంచలన విషయాలు
-
రైళ్లకు రక్షణ ‘కవచం’.. కిలోమీటర్‌కు 50 లక్షల వ్యయం.. తేడా వస్తే బ్రేకులే!
సాక్షి, అమరావతి: ఒడిశా రాష్ట్రంలో ఇటీవల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ఘోర ప్రమాదం రైల్వే చరిత్రలో పెద్ద మచ్చే. కవచ్ రక్షణ వ్యవస్థ ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేశారు. రైళ్ల ప్రమాదాల నివారణకు భారత రైల్వే శాఖ రూపొందించిన ఈ కవచ్ వ్యవస్థ ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉంది. దేశవ్యాప్తంగా కవచ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి 15 ఏళ్లు పడుతుందని రైల్వే శాఖ నివేదిక వెల్లడించింది. స్వర్ణ చతుర్భుజి మార్గంలో 2028 నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపింది. స్వర్ణ చతుర్భుజిలోని చెన్నై – హౌరా మార్గంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందున రాష్ట్రంలో మరో ఐదేళ్లలో (2028నాటికి) కవచ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో ‘కవచ్’ సాంకేతిక, మానవ తప్పిదాలతో రెండు రైళ్లు ఒకే సమయంలో ఒకే ట్రాక్ మీదకు వస్తే ఢీకొనకుండా నివారించేందుకు రైల్వే రీసెర్చ్ డిజైన్స్– స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ‘కవచ్’ పేరుతో ఆధునిక రక్షణ వ్యవస్థను రూపొందించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రైల్వే శాఖ రూపొందించిన ఈ వ్యవస్థను ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థకు ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ అందించే అత్యుత్తమ స్థాయి సేఫ్టీ ఇంటెగ్రిటీ లెవెల్ –4 (ఎస్ఐఎల్ 40) సర్టిఫికేషన్ కూడా రావడం విశేషం. దేశంలో రైళ్లు ఢీకొన్న ఘటనల్లో 89 శాతం ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని వెల్లడైంది. దాంతో శాస్త్రీయంగా అధ్యయనం చేసి ‘యాంటీ కొల్లీషన్ పరికరాలను’ రైల్వే శాఖ రూపొందించింది. దీనిని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పరీక్షించగా, పూర్తి సఫలీకృతమైంది. దీంతో ‘కవచ్’ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో కేవలం 1,450 కిలోమీటర్ల మేరే అందుబాటులోకి తెచ్చారు. ఇటీవలి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనతో కవచ్ వ్యవస్థను దేశమంతా దశలవారీగా విస్తరించేందుకు రైల్వే శాఖ ప్రణాళికను రూపొందించింది. అందుకోసం హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ అనే సంస్థతో కలసి కవచ్ ప్రాజెక్టును చేపట్టినట్టు రైల్వే శాఖ తెలిపింది. ఇదీ ప్రణాళిక.. ♦ దేశంలో రైళ్ల రద్దీ అత్యధికంగా ఉండే స్వర్ణ చతుర్భుజి మార్గంలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం కిలోమీటర్‌కు రూ.50 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ♦ స్వర్ణ చతుర్భుజి మార్గంలో మొదటగా ముంబయి–ఢిల్లీ, ఢిల్లీ–హౌరా రూట్లో కవచ్ వ్యవస్థను నెలకొల్పుతారు. ఇప్పటికే రైల్వే శాఖ ఈ పనులు ప్రారంభించింది. ముంబయి – ఢిల్లీ 1,384 కి.మీ., ఢిల్లీ–హౌరా 1,454 కి.మీ. కలిపి మొత్తం 2,838 కి.మీ. మేర ఈ పనులను 2024 డిసెంబర్‌కు పూర్తి చేయాలన్నది లక్ష్యం. ♦ రెండో దశ కింద స్వర్ణ చతుర్భుజిలోని ఇతర మార్గాల్లో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ మీదుగా చెన్నై–హౌరా మార్గంలో కూడా కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. చెన్నై –హౌరా, చెన్నై–బెంగళూరు–ముంబయి మార్గంలో 2024 డిసెంబర్లో పనులు ప్రారంభించి 2028నాటికి పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. ♦ ఆంధ్రప్రదేశ్ గుండా చెన్నై–హౌరా మార్గంలో మొత్తం 1,162 కి.మీ. మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఈ మార్గంలో కవచ్ వ్యవస్థ పనితీరును పర్యవేక్షించేందుకు విజయవాడ, విశాఖపట్నం, కటక్, బాలాసోర్లను ప్రధాన కేంద్రాలుగా గుర్తించారు. ♦ అనంతరం మూడో దశ కింద చెన్నై–ఢిల్లీ మార్గంలో మొత్తం 2,182 కి.మీ. మేర కవచ్ వ్యవస్థను నెలకొల్పుతారు. కవచ్ పనిచేస్తుందిలా.. కవచ్ వ్యవస్థలో భాగంగా రైళ్లలో మైక్రో ప్రాసెసర్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ (జీపీఎస్), యాంటీ కొల్లీషన్ పరికరాలను ఏర్పాటు చేస్తారు. రైల్వే ట్రాక్‌లను కూడా ఈ పరిజ్ఞానంతో అనుసంధానిస్తారు. ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల నుంచి ఈ పరికరాలు సిగ్నల్స్‌ను స్వీకరిస్తాయి. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు ఒకేసారి పొరపాటున వస్తే మోడెమ్ సహాయంతో ఆటోమేటిగ్గా ఆ రెండు రైళ్లకు పరస్పరం సమాచారం చేరుతుంది. ఒక రైలు ప్రయాణిస్తున్న మార్గంలోనే మరో రైలు కూడా ఎదురుగా వస్తుంటే... నిర్ణీత దూరంలో ఉండగానే ఈ పరికరాల ద్వారా గుర్తించొచ్చు. దాంతో వెంటనే రైలులో ఆటోమేటిక్ బ్రేకులు పడి రైలు నిలిచిపోతుంది. ఈ పరికరాలు మానవ తప్పిదాలను కూడా గుర్తించి నివారించేందుకు దోహదపడతాయి. దాంతో రైళ్లు పరస్పరం ఢీకొనకుండా పూర్తిగా నివారించడం సాధ్యపడుతుంది. -
వివాదాలకు చెక్!
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వే స్టేషన్లో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగిన నాలుగు వారాల తర్వాత డీఎన్ఏ పరీక్షల నివేదిక వెల్లడైంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కోసం ఒకరి కంటే ఎక్కువ మంది మందుకు రావడంతో వాస్తవ సంబంధీకుల వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షలకు ఆదేశించిన విషయం తెలిసిందే. 81 మృతదేహాల గుర్తింపు వివాదాస్పదం కావడంతో మొత్తం 88మంది నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించి, ఢిల్లీ లేబరేటరీకి పంపారు. ఈ నివేదిక అందేంత వరకు స్థానిక ఎయిమ్స్‌లోని కంటైనర్లలో ఆయా మృతదేహాలను భద్రపరిచారు. వీటిలో 29మంది పరీక్ష నివేదికలు అందాయని భువనేశ్వర్ నగరపాలక సంస్థ(బీఎంసీ) మేయర్ సులోచన దాస్ శుక్రవారం తెలిపారు. మిగిలిన మృతదేహాల పరీక్ష నివేదికలు త్వరలో చేరుతాయన్నారు. గుర్తించిన 29మంది మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. ఐదుగురు తక్షణమే స్పందించి ఎయిమ్స్‌కు చేరుకున్నారు. గుర్తించిన మృతదేహాలను భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్, రైల్వే, ఒడిశా రవాణాశాఖ, ఎయిమ్స్ అధికారుల సమక్షం లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఇతరులు త్వరలో వస్తారని మేయర్ వివరించారు. ఉచిత సౌకర్యాలు.. మృతదేహాలను స్వగ్రామానికి తీసుకు వెళ్లాలనుకునే కుటుంబ సభ్యులకు ఒడిశా రవాణాశాఖ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. ఎయిమ్స్ ప్రాంగణంలో దాదాపు 10 అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచినట్లు రవాణాశాఖ అధికారి తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరైనా భువనేశ్వర్‌లో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకుంటే, స్థానిక యంత్రాంగం భరత్పూర్, సత్యనగర్ శ్మశానవాటిక లలో వారికి అన్ని ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు. -
పశ్చిమ బెంగాల్ లో రైలు ప్రమాదం
-
ఇలాంటి పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ పెట్టకండి రైలు ఘటనకి దానికి సంబంధం ఏంటీ..
-
కదిలే రైలు ఎక్కబోతుండగా ప్రమాదం
చీరాల రూరల్: మంచినీళ్ల కోసం రైలుదిగిన ప్రయాణికుడు ఆ రైలు కదలడంతో పరుగున వెళ్లి ఎక్కబోతుండగా జారిపడటంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఈఘటన మంగళవారం సాయంత్రం చీరాల రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ సీహెచ్ కొండయ్య వివారల మేరకు.. మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన మహేంద్ర విష్ణుభగత్ అనే వ్యక్తి నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు. రైలు చీరాల రైల్వేస్టేషన్లో కొద్దిసేపు ఆగింది. దీంతో భగత్ మంచినీరు తెచ్చుకునేందుకు రైలుదిగాడు. ఈ క్రమంలో రైలు ప్లాట్‌ఫాం నుంచి బయలు దేరడం గమనించిన అతను పరుగున వెళ్లి రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. అయితే అతని రెండు చేతులు పట్టు తప్పడంతో రైలుకు ప్లాట్‌ఫాంకు మధ్యలోకి వెళ్లిపోయాడు. గమనించిన తోటి ప్రయాణికులు రైలు చైన్ లాగడంతో పాటు ప్లాట్‌ఫాంపై ఉన్న ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు తక్షణమే స్పందించి లోనికి జారిపోతున్న బాధితుడిని ప్లాట్‌ఫాంపైకి లాగి ప్రాణాలు రక్షించారు. అప్పటికే అతని రెండు చేతులు ప్లాట్‌ఫాంకు రైలుబోగికి మధ్యలో ఇరుక్కుపోవడంతో రెండు చేతులు మణికట్టుల వరకు చర్మం ఊడిపోయి తీవ్ర రక్తగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది బాధితుడిని చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఒడిశాలో మరో రైలు ఘటన..ఒక్కసారిగా రాజుకున్న మంటలు
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం ఘటన మరువకు మునుపే మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఒడిశాలోని నువాపాడ జిల్లాలో గురువారం దుర్గ్-పూరి ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు రాచుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. ఐతే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. ఈ మేరకు దుర్గ్ పూరి ఎక్క్‌ప్రెస్ గురువారం సాయంత్రం ఖరియార్ రోడ్ స్టేషన్ చేరుకోగానే రైలు బీ32 కోచ్‌లో పొగలు కమ్ముకున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. బ్రేక్‌లు అసంపూర్తిగా వేయడంతో ఒక్కసారిగి బ్రేడ్ ప్యాడ్‌లో మంటలు చెలరేగాయి. ఐతే ఆ మంటలు బ్రేక్ ప్యాడ్ల వరకే పరిమితం కావడంతో.. ఎటువంటి నష్టం జరగలేదని రైల్వే తెలిపింది. ఈ సమస్య గంటలోపే పరిష్కించబడటంతో రైలు రాత్రి 11 గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరిందని వెల్లడించింది. గత వారం మూడు రైళ్ల ప్రమాదం మరువక మునేపే ఈ అనూహ్య ఘటన జరగడంతో ఒక్కసారిగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. (చదవండి: పట్టాలు తప్పిన ఊటీ టాయ్ ట్రైన్) -
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్ వీడియో
-
శవాలపై సొమ్ము చేస్కుంటున్నా కఠిన మనుషులు
-
రైలు ప్రమాదం నుంచి బయటపడిన నేపాల్ యువకుడు
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అనంతరం చాలామంది ప్రయాణికులు తమ కుటుంబాలకు దూరమయ్యారు. రైలు ప్రమాదంలో గాయపడిన నేపాల్‌కు చెందిన ఒక యువకుడు ఎట్టకేలకు తన తల్లిదండ్రులకు చేరవయ్యాడు. ఆ బాలుడిని రామానంద్ పాశ్వాన్‌గా గుర్తించారు. ఈ యువకుడు కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీలో చికిత్సపొందుతున్నాడు. రామానంద్ తన ముగ్గురు బంధువులతోపాటు కోరమండల్లో ప్రయాణించాడు. మీడియాతో రామానంద్ తండ్రి మాట్లాడుతూ రామానంద్‌తో పాటు తమ ముగ్గురు బంధువులు కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారని, వారు ముగ్గురూ మృతిచెందగా, తమ కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. రైలు ప్రమాదం గురించి తెలియగానే తాను, తన భార్య నేపాల్ నుంచి వచ్చామని,ముందుగా మా ముగ్గురు బంధువుల మృతదేహాలను గుర్తించామన్నారు. తన కుమారుడిని టీవీలో చూసి గుర్తుపట్టి, ఎస్సీబీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నడని తెలుసుకుని వచ్చామన్నారు. రామానంద్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. కాగా ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది మృత్యువాత పడ్డారు. చదవండి: చివరి నిముషంలో ప్రయాణం రద్దు చేసుకుని... -
అనాథ మృతదేహాలను రైల్వేశాఖ ఏం చేస్తుందంటే..
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందగా వెయ్యిమందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఇప్పటివరకూ 202 మృతదేహాలకు శవ పంచనామా పూర్తికాగా, 86 మృతదేహాలకు శవపంచనామా ఇంతవరకూ పూర్తికాలేదు. ఆసుపత్రులలో మృతదేహాలను ఉంచేందుకు స్థలం లేకపోవడంతో వాటిని స్కూళ్లు, కోల్డ్ స్టోరేజీలలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనాథ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం మృతదేహం ఏడు రోజులు దాటిపోతే అత్యంత వేగంగా కుళ్లిపోతుంది. అటువంటప్పుడు గుర్తింపునకు నోచుకోని మృతదేహాలను రైల్వేశాఖ ఏమి చేస్తుందనే ప్రశ్న అందిరి మదిలోనూ మెదులుతుంది. దీనిగురించి రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాభ్ శర్మ మాట్లాడుతూ రైలు ప్రమాదాలు సంభవించినప్పుడు మృతదేహాలను సంరక్షించడం, అనాథ మృతదేహాలుగా ప్రకటించడం, అంతిమ సంస్కారాలు చేయడం రైల్వేశాఖ పరిధిలోకి రాదని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని అన్నారు. అనాథ మృతదేహాలను ఏం చేయాలనే దానిపై ఆయా రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా అనాథ మృతదేహాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోలీసులు ఎటువంటి అనాథ మృతదేహన్ని గుర్తించినా ముందుగా ఈ విషయమై జిల్లా ఎస్పీకి తెలియజేయాలి. తరువాత మృతదేహానికి సంబంధించిన రిపోర్టు తయారుచేసి, ఆ మృతదేహాన్ని గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇందుకోసం ఆ మృతదేహానికి సంబంధించిన ఫొటోను రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లు, ఆసుపత్రులకు పంపాల్సి ఉంటుంది. దీని తరువాతనే ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలా లేదా అనేది అధికారులు నిర్ణయిస్తారు. పోలీసులు అనాథ మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు అనేక పద్ధతులను అనుసరిస్తారు. మృతదేహంపై పుట్టుమచ్చలు, టాటూలు మొదలైనవి ఏమైనా ఉన్నాయేమో గుర్తిస్తారు. అనాథ మృతదేహాలను అత్యధికంగా ఏడు రోజుల పాటు ఎవరైనా గుర్తించేందుకు ఉంచుతారు. ఆ తరువాత కూడా ఎవరూ మృతదేహం కోసం రాకపోయిన పక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అనాథ మృతదేహాల వద్ద ఏదైనా సామాను దొరికితే పోలీసులు వాటిని భద్రపరుస్తారు. చదవండి: 6 రోజులు దాటినా కానరాని అయినవారి మృతదేహాలు -
అయినవారి మృతదేహాల కోసం...
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి 6 రోజులు గడిచింది. బాధితులు ఇంకా తమవారి మృతదేహాల కోసం వెదుకులాట సాగిస్తూనే ఉన్నారు. ఇంకా 100 మృతదేహాలకు శవ పంచనామా పూర్తికాలేదు. దీంతో బాధితులు భువనేశ్వర్ ఎయిమ్స్ వద్ద పడరాని పాట్లు పడుతున్నారు. పలు మృతదేహాలను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో అధికారులు వాటికి డీఎన్ఏ పరీక్షలు చేయించాల్సివస్తోంది. ఇందుకోసం డీఎన్ఏ శాంపిల్స్‌ను భువనేశ్వర్ ఎయిమ్స్ వద్ద సేకరిస్తున్నారు. ఎయిమ్స్‌తోపాటు మరో ఐదు కేంద్రాలలోనూ డీఎన్ఏ శాంపిల్స్ సేకరణ జరుగుతోంది. మీడియాతో ఒక బాధితుడు మాట్లాడుతూ తన కుమారుని మృతదేహాన్ని గుర్తుపట్టినప్పటికీ తమకు దానిని అప్పటించడం లేదని ఆరోపించారు. డీఎన్ఏ రిపోర్టు వచ్చాకనే ఇస్తామంటున్నారని తెలిపారు. తన దగ్గర ప్రస్తుతం తిండికి కూడా ఖర్చులు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు చాలామంది బాధితులు తమ వారి డీఎన్ఏ రిపోర్టులు వచ్చాకనే మృతదేహాలను తీసుకు వెళుతున్నారు. మరికొందరైతే ఇక్కడి పరిస్థితులను చూసి, తమవారి మృతదేహాలు దొరుకుతాయనే ఆశను కూడా వదులుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఒక బాధితుడు ఇప్పటివరకూ తన సోదరుని మృతదేహం లభ్యం కాలేదని, ఇక ఆశ వదులుకొని తిరిగి ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్నానన్నాడు. ఇక్కడ వెదుకులాట సాగిస్తూ మూడు రోజులయ్యింది. అధికారులు డీఎన్ఏ ఇచ్చి వెళ్లిపొమ్మంటున్నారని తెలిపాడు. కాగా ఇప్పటి వరకూ 30 డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్‌ను ప్రభుత్వం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మృతదేహాలను కోల్డ్ రూమ్‌లలో ఉంచారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ప్రమాదంలో మొత్తం 288 మంది మృతి చెందారు. 193 మృతదేహాలను, భువనేశ్వర్ తరలించారు. 94 మృతదేహాలను బాలాసోర్‌లో ఉంచారు. ఒక బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. భువనేశ్వర్ తరలించిన 193 మృతదేహాలలో 110 మృతదేహాలకు శవ పంచనామా పూర్తయ్యింది. ఇంకా 83 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. 200 మంది బాధితులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనలో దాదాపు 1000 మంది గాయపడ్డారు. చదవండి: పశ్చిమ బెంగాల్ యువకుని మృతదేహం బీహార్‌కు.. -
ఒడిశా ప్రమాదం.. రైలు బండి నడిపే వారెక్కడ?
దక్షిణమధ్య రైల్వేలో రోజూ సుమారు 600 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 10 లక్షల మందికిపైగా ప్రయాణం సాగిస్తుంటారు. అన్ని డివిజన్ల పరిధిలో 3,800 వరకు లోకో పైలెట్లు, సహాయ లోకోపైలెట్లు, షంటర్లు పని చేయవలసి ఉండగా ప్రస్తుతం 2384 మంది మాత్రమే ఉన్నారు.1,416 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే కనీసం వెయ్యి మంది అదనంగా ఉండాల్సిన చోట వెయ్యి మందికిపైగా కొరత ఉండడం గమనార్హం. కొంతకాలంగా లోకోపైలెట్ల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో ఉన్నవాళ్లపైనే పనిభారం అధికమవుతోంది. ‘లింక్’ లేని డ్యూటీలు సాధారణంగా ఒక లోకోపైలెట్ తన విధి నిర్వహణలో 8 గంటలు పనిచేసి 6 గంటల విశ్రాంతి తీసుకోవాలి. తరువాత మరో 8 గంటలు పని ఉంటుంది. తిరిగి 6 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. డ్యూటీ ముగిసిన తరువాత 16 గంటల పాటు విశ్రాంతి ఉండాలి. ప్రతి 72 గంటలకు ఒక రోజు సెలవు చొప్పున, ప్రతి 14 రోజులకు ఒక 24 గంటల పూర్తి విశ్రాంతి చొప్పున లోకోపైలెట్ లింక్ (విధి నిర్వహణ) ఉండాలి. ►కానీ ఈ లింక్‌కు పూర్తి విరుద్ధంగా 6 గంటలకు బదులు 4 గంటల విశ్రాంతే లభిస్తోందని లోకోపైలెట్లు అంటున్నారు. వరుసగా రాత్రిళ్లు పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వారానికి ఒకరోజు రాత్రి పూర్తిగా విశ్రాంతి ఉండాలి. కానీ ప్రస్తుతం రాత్రి పూట నిద్రకు నోచని ఎంతోమంది తీవ్ర ఒత్తిళ్ల నడుమ పనిచేస్తున్నారు. ►అనారోగ్యం కారణంగా కూడా సెలవులు లభించడం లేదు. లాలాగూడ రైల్వే ఆసుపత్రి డాక్టర్లు ఫోన్లోనే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. బాగానే ఉన్నావు డ్యూటీకి వెళ్లొచ్చని చెబుతున్నారు.’.. అని సికింద్రాబాద్ డిపోకు చెందిన అసిస్టెంట్ లోకోపైలెట్ ఒకరు చెప్పారు. ‘సేఫ్టీ’ ఎలా.. ►సిగ్నల్స్ కనిపెట్టడం, కాషన్ ఆర్డర్స్‌ను అనుసరించడం, ట్రాక్‌లు మార్చడం, వేగాన్ని అదుపు చేయడం.. ఇలా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇందుకు లోకోపైలెట్లకు ఏకాగ్రత, ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. ►కానీ ప్రతి క్షణం వెంటాడే ఒత్తిడి, నిద్ర లేమి వల్ల రైల్వే మాన్యువల్‌కు విరుద్ధమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నామని రైఅంటున్నారు. ఒత్తిడే ప్రమాదాలకు కారణం? ►తరచూ హెచ్చరిక సిగ్నళ్లను (సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్) సైతం ఉల్లంఘిస్తూ రైలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. రైళ్లు పట్టాలు తప్పే సందర్భాల్లో ఇలాంటి ఒత్తిడే ప్రధాన కారణమవుతున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సికింద్రాబాద్ డిపోలోనూ కొరత దక్షిణమధ్య రైల్వేలోనే కీలకమైన సికింద్రాబాద్ డిపోలో 578 మంది లోకోపైలెట్లు పని చేయవలసి ఉండగా 343 మంది మాత్రమే ఉన్నారు. 235 ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో గూడ్స్ రైళ్లు నడపాల్సిన వాళ్లు ఎక్స్‌ప్రెస్‌లు, మెయిల్ సర్వీసులు నడుపుతున్నారు. షంటర్లు ఎంఎంటీఎస్‌లు, ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నారు. -
రైలు ప్రమాద బాధితులకు ధోనీ రూ.60 కోట్ల సాయం.. ఈ వార్తల్లో నిజమెంత?
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 278 మంది పైగా మరణించారు. అయితే రైలు ప్రమాద బాధితులకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రూ.60 కోట్ల సాయం చేస్తున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అయితే ఇందుకు సంబంధించి ధోని ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, అవన్నీ రూమర్స్ అనే ధోని సన్నిహిత వర్గాలు కొట్టిపారేశారు. మరోవైపు విరాట్ కోహ్లి కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు కూడా నిజం కాదని తేలింది. అయితే మరో టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చహల్ మాత్రం.. బాధిత కుటంబాలకు తన వంతుగా రూ.లక్ష విరాళం అందించాడు. రైలు ప్రమాద బాధితుల సహాయార్థం ముందుకు వచ్చిన "స్కౌట్" గేమింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చహల్ తన సాయాన్ని అందించాడు. మరోవైపు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉచిత విద్యతో పాటు ఫ్రీ బోర్డింగ్ సదుపాయాలు కల్పిస్తానని ఈ నజఫ్ఘడ్ నవాబ్ ప్రకటించాడు. చదవండి: WTC Final 2023: ప్లీజ్.. ఆస్ట్రేలియాను ఓడించండి! నాకు చూడాలని ఉంది: స్వాన్ -
ఒక మృతదేహం కోసం ఐదుగురు వాదన..
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో పలు కుటుంబాలు అయినవారని కోల్పోయాయి. కొంతమంది ఇంటి పెద్దను కోల్పోగా, కొన్ని కుటుంబాల్లో ఎదిగొచ్చిన పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కొందరు తల్లిని కోల్పోగా, మరికొందరు తండ్రిని కోల్పోయారు... ఇలా చాలా జీవితాలు విచ్ఛిన్నమయ్యాయి. అయితే ప్రస్తుతం మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితికి చేరుకోవడంతో అవి ఎవరివనేది తెలుసుకోవడం కష్టతరంగా మారింది. ఈ నేపద్యంలో ఒక మృతదేహం తమవారిదేనంటూ ఐదుగురు వాదనకుదిగడం కనిపించింది. దీంతో వీరి సమస్య పరిష్కారం కోసం డీఎన్ఏ సహాయం తీసుకోనున్నారు. ఈ రైలు ప్రమాదంలో మొత్తం 288 ప్రాణాలు కోల్పోగా, 205 మృతదేహాలకు శవపంచనామా పూర్తయ్యింది. మిగిలిన మృతదేహాలకు ఈ ప్రక్రియ ఇంకా జరగాల్సి ఉంది. ఈ ప్రమాదంలో వెయ్యిమందికిపైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. బాధితుడు మెహమ్మద్ ఇనామ్ ఉల్ హక్ మాట్లాడుతూ తన ఇద్దరు బావలతో పాటు తన సోదరుడు కూడా ఈ రైలు ప్రమాదంలో మృతిచెందాడని, వారి మృతదేహాలను తీసుకువెళ్లేందుకు వచ్చామన్నారు. ఇందుకోసం ఇక్కడ నాలుగు రోజులుగా తిరుగుతున్నామన్నారు. ఏఐఐఎంలో ఒక బావ మృతదేహం లభ్యంకాగా, మరో బావ, సోదరుని మృతదేహం కోసం వెదుకులాట సాగించామన్నారు. తన మరో బావ మృతదేహం లభ్యమైనా, అది తమవారిదేనంటూ ఐదుగురు బాధితులు చెబుతున్నారన్నారు. దీంతో డీఎన్ఏ టెస్టు చేసి, ఆ మృతదేహం ఎవరిదో నిర్ధారించి, ఆ బాధిత కుటుంబానికి అధికారులు అందజేస్తారన్నారు. అయితే ఇందుకోసం మరింత సమయం పడుతుందన్నారు. ఇదిలా ఉండగా రైలు ప్రమాదంలో 12 ఏళ్ల మనుమడిని కోల్పోయిన తాత నిజాముద్దీన్ మాట్లాడుతూ తన మనుమని మృతదేహం లభ్యమైనప్పటికీ ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన కుమారుని, మరో మనుమని మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదన్నారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కేవలం తన ఒక మనుమని మృతదేహాన్ని తీసుకుని వెళుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: బాధితులకు రూ. 2000 నోట్లు! -
బహనాగా బజార్ దుర్ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ
భువనేశ్వర్: రాష్ట్రంలో సంభవించిన ట్రిపుల్ రైలు ప్రమాదం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) మంగళవారం వెల్లడించింది. ఈనెల 2న బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలుకు మధ్య జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడేందుకు సీబీఐకి చెందిన 10మంది సభ్యుల బృందం సోమవారం రాత్రి ఒడిశాకు చేరుకుంది. ఈ మేరకు ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. రైల్వేశాఖ అభ్యర్థన మేరకు, ఒడిశా ప్రభుత్వ సమ్మతితో కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు వర్గం సభ్యులు తెలిపారు. ఈ దుర్ఘటనకు సంబంధించి బాలాసోర్ ప్రభుత్వ రైల్వే పోలీసు(జీఆర్పీఎస్)లో నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేపట్టిందన్నారు. సీఆర్ఎస్ విచారణ.. రైలు దుర్ఘటనలో ప్రాణహాని సంభవించే పరిస్థితుల్లో రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్ఎస్) దర్యాప్తు చేపట్టడం నిబంధన. ఈ నేపథ్యంలో ఇటీవల బహనాఘా బజార్ రైల్వే స్టేషన్లో జరిగిన ట్రిపుల్ రైలు దుర్ఘటనలో మృతులు సంభవించిన ఘటనపై సీఆర్ఎస్ విచారణ కోసం రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో ప్రత్యక్షంగా సందర్శించిన అనుబంధ అధికార, సిబ్బంది వర్గాలతో ముఖాముఖి సంప్రదించింది. ఆదివారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన రైల్వే భద్రతా కమిషనర్ శైలేష్‌కుమార్ పాఠక్.. కొంతమంది వ్యక్తుల వాంగ్మూలం నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఇదో ఉద్దేశపూర్వక ట్యాంపరింగ్ సంఘటనగా ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ రింకేష్రాయ్ మీడియాతో అన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్‌లో మార్పు కారణంగా రైలుప్రమాదం సంభవించిందని.. అయితే ప్రమాదానికి గురైన రైళ్లలో ఒకటైన చైన్నెకి వెళ్లే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్(ఎల్పీ), అసిస్టెంట్ లోకోపైలట్ వివరణ ప్రకారం గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు వెల్లడైందన్నారు. ఈ ఘటనకు వీరివురు ప్రత్యక్ష సాక్షులు. ఈ పరిస్థితుల దృష్ట్యా సిగ్నలింగ్ వ్యవస్థలో ‘ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్‘ ఉండవచ్చని డీఆర్ఎం సందేహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు రైల్వేబోర్డు ఆదివారం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు, పరిసరాలు, నిర్వహణ ఇతరేతర అనుబంధ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని రైల్వేబోర్డు తదుపరి విచారణ, దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు సిఫార్సు చేసినట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం స్పష్టం చేశారు. ఈ ఘటనలో 21 కోచ్‌లు ఢీకొని పట్టాలు తప్పడంతో 288 మృతులు నమోదయ్యాయి. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. సమ్మతించిన రాష్ట్రప్రభుత్వం రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు ఒడిశా ప్రభుత్వం సమ్మతి తెలిపింది. సీబీఐ విచారణకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి సంతకం చేసిన సమ్మతి లేఖ జారీ చేశారు. ఈనెల 2న బహనాగా బజార్లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి దారితీసిన కారణాలపై సీబీఐ విచారణకు ఒడిశా ప్రభుత్వం తర ఫున అదనపు చీఫ్ సెసీ(హోమ్) డీకే సింగ్ సమ్మతి తెలిపారు. ఈ ప్రమాదం యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లోని 2 కోచ్‌లను కూడా ప్రభావితం చేసింది. గుర్తించాల్సినవి.. 83 బహనాగా బజార్ స్టేషన్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్యలో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. మృతుల జాబితా విస్తృత ధ్రువీకరణ, అనుబంధ వర్గాల సమాచారం, ఘటనా స్థలం ఇతరేతర రంగాల్లో 2రౌండ్ల కూబింగ్ నిర్వహించిన అనంతరం 288మరణాలను నిర్థారించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ జెనా మంగళవారం సాయంత్రం వెల్లడించారు. 205 మృతదేహాలను గుర్తించి బంధు వర్గాలకు అప్పగించగా, మరో 83 ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. భువనేశ్వర్‌లో 110, బాలాసోర్‌లో 94, భద్రక్‌లో 1 గుర్తించిన వాటిలో ఉన్నాయి. పలు ప్రాంతాలకు మృత దేహాలను ప్రభుత్వ ఖర్చులతో తరలించారు. అయితే గుర్తించని మృతదేహాల్లో పలు సందర్భాల్లో వివాదం తలెత్తుతోంది. ఒక్కో మృతదేహం కోసం ఒకరి కంటే ఎక్కువ మంది ముందుకు రావడంతో ఈ పరిస్థితి నెలకొంటుంది. వివాదం నుంచి బయట పడేందుకు సందిగ్ధ 83 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అనుబంధ వర్గాల నుంచి సహాయ, సహకారాలు అభ్యర్థించారు. రాష్ట్ర మృతులు 39.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో రాష్ట్రం నుంచి 39మంది ప్రయాణికులు మృతిచెందారు. వీరిలో బాలాసోర్ జిల్లా నుంచి 14, మయూర్భంజ్ 9, భద్రక్ 8, కటక్ 3, జాజ్‌పూర్ 2, ఖుర్దా 2, కెంజొహర్ జిల్లా నుంచి ఒకరు మృతి చెందినట్లు ఖరారు చేశారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటన మేరకు మృతుల కుటుంబీకులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1.95 కోట్ల పరిహారం మంజూరు చేశారు. ఒక్కో మృతుని కుటంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. పరిహారం పొందడం ఇలా.. ఈనెల 2న బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు రైల్వేశాఖ నష్టపరిహారం ప్రకటించింది. వాస్తవ బాధిత, పీడిత వర్గాలు ఈ పరిహారం లబ్ధిదారులు. పరిహారం పొందేందుకు దశలవారీ క్రమ విధానం ఇలా ఉంది. మృతులు, గాయపడిన వారు, గుర్తు తెలియని మృతదేహాల చిత్రాలతో కూడిన వెబ్సైట్ల లింక్‌లను రైల్వేశాఖ విడుదల చేసింది. మృతదేహాలను ఉంచిన ఆస్పత్రులు, చికిత్స పొందుతున్న, గాయపడిన వ్యక్తుల పేర్లు, చిరునామాలను కూడా ఈ సైట్లో పేర్కొంటాయి. రైల్వేశాఖ మృతుల కుటుంబీకులకు రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తుంది. ఈ మొత్తంలో రూ.50వేల నగదు, రూ.9.5 లక్షల చెక్కు అందిస్తారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం పంపిణీ చేస్తారు. మృతుల గుర్తింపు చర్యలు ముమ్మరం కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో మృతుల గుర్తింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. మృతుల బంధువులు, ఆత్మీయులు సులువుగా గుర్తించేందుకు పలు రకాల సన్నాహాలు చేశారు. ఈ చర్యలు అంతంత మాత్రంగా ఫలప్రదమయ్యాయి. ఇదిలా ఉండగా మృతదేహాల కోసం పలువురు ముందుకు రావడంతో పరిస్థితి మరింత బిగుసుకుంది. ఈ నేపథ్యంలో మృతదేహాలను దీర్ఘకాలం తాజాగా ఉంచేందుకు శక్తివంతమైన కంటైనర్లు వంటి సాంకేతిక సదుపాయాలతో మృతుల వివరాలు ప్రదర్శన వంటి సన్నాహాలు చేపట్టారు. వీటిపై వివాదం తలెత్తడంతో మృతులు, బంధువర్గాల డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్థానిక అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ప్రాంగణంలో డీఎన్ఏ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. 10మంది వ్యక్తులు డీఎన్ఏ పరీక్షలకు ముందుకు వచ్చారు. వీరిలో 5మంది పరీక్షలు పూర్తి చేసినట్లు అనుబంధ వర్గాలు తెలిపాయి. సచివాలయ సేవాసంఘం.. బాధితుల సహాయార్థం రాష్ట్ర సచివాలయ సేవాసంఘం రూ. 2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ మేరకు సేవాసంఘం సభ్యుల బృందం ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయంలో సీఎస్ ప్రదీప్ జెనాతో భేటీ అయ్యారు. బాధితులకు సాయం.. రైలు ప్రమాద బాధితుల సహాయార్థం ఒడిశా వెటర్నరీ సర్వీసెస్ అసోసియేషన్ రూ.20 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ జెనాకు దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు. వెబ్‌పోర్టల్ వివరాలు: ► ఘోర ప్రమాదంలో మరణించిన వ్యక్తుల చిత్రాలను https://srcodisha.nic.in వెబ్సైట్లో చూడవచ్చు. ► వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న, గాయపడిన ప్రయాణికుల పేర్లను తెలుసుకునేందుకు https://www.bmc.gov.in ► కటక్ ఎస్సీబీ మెడికల్ కశాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తుల ఫోటోల వివరాలు ఈ క్రింది వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ► https://www.bmc.gov.in/train&accident/ download/Un&identified&person&under&treatment&atSCB&Cuttack.pdf ► ప్రభావిత వర్గలు ప్రటకించిన నష్టపరిహారం పొందేందుకు క్రమ పద్ధతిలో అనుబంధ వర్గాలను సంప్రదించాల్సి ఉంది. ► తొలుత మృతదేహం భద్రపరిచిన ఆస్పత్రిని సంప్రదించాలి. ఈ మేరకు రైల్వేశాఖ జారీ చేసిన జాబితాను పరిగణలోకి తీసుకోవాలి. ► బాధితులతో తమ సంబంధాన్ని ధ్రువీకరించే పత్రాలు దాఖలు చేయాలి. ► అభ్యర్థన మేరకు దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన మేరకు ధ్రువీకరించిన తరువాత మృతదేహాన్ని అప్పగిస్తారు. ► ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులు డిశ్చార్జి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ► తదుపరి పరిహారం పొందేందుకు డిశ్చార్జ్ సర్టిఫికెట్తో పాటు అవసరమైన దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది. ► మృతుల రక్త సంబంధీకులకు మాత్రమే పరిహారం చెల్లిస్తారు. వివాహిత జంట(దంపతులు) విషయంలో భర్త లేదా భార్యకు మాత్రమే పరిహారం ముడుతుంది. రైల్వే సిబ్బంది ప్రస్తావన లేదు: సీబీఐ 288 మంది మృతికి కారణమైన బాలాసోర్ రైలు ప్రమాదంలో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) లోతుగా పరిశీలించినట్లు మంగళవారం తెలిపింది. ఎఫ్ఐఆర్ దాఖలు సమయానికి నిర్దిష్ట రైల్వే ఉద్యోగుల నేరం నిర్థారించలేదు. తదుపరి దర్యాప్తు సమయంలో ఈ అంశం నిర్థారిస్తామని పేర్కొంది. కటక్ ఓపీఎస్ ఎస్డీఆర్పీఓ రంజిత్ నాయక్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్సీబీలో ఎల్ఈడీ ప్రదర్శన కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి ప్రాంగణంలో ఎల్ఈడీ టీవీ ప్రదర్శన ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో హెల్ప్‌డెస్క్, సమాచార కేంద్రాలు పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ గుర్తించని బాధితుల బంధు వర్గాలు ముందుకు వచ్చేందుకు వీలుగా ఆస్పత్రి ఆవరణలో చికిత్స పొందుతున్న వారి ఫొటోలను ఎల్ఈడీ టీవీలో ప్రదర్శిస్తున్నారు. బాధితుల వివరాలతో సమగ్ర జాబితా ఈ ప్రదర్శనలో లభ్యమవుతోంది. -
ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన కేంద్ర దర్యాప్తు సంస్థ
-
కరెంట్ షాక్‌తో 40 మంది మృతి?
భువనేశ్వర్/న్యూఢిల్లీ: ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ఘటనలో ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని తెలుస్తోంది. దుర్ఘటన తాలూకు కొత్త విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత వివరాలను గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) మంగళవారం వెల్లడించింది. ‘ప్రమాదం జరిగినపుడు చెల్లాచెదురుగా పడిన బోగీలు పై నుంచి వెళ్తున్న ఓవర్‌హెడ్ లోటెన్షన్(ఎల్టీ) విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో విద్యుత్ తీగలు తెగి కొన్ని బోగీలపై పడ్డాయి. అప్పటికే ధ్వంసమైన బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులు ఈ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయి ఉంటారు. అందుకే దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు’ అని ఎఫ్ఐఆర్లో నమోదుచేసినట్లు సబ్ ఇన్స్పెక్టర్ పి.కుమార్ నాయర్ చెప్పారు. మార్చురీలో వందకుపైగా మృతదేహాలు రైలు ప్రమాదంలో 278 మంది మరణించగా 177 మంది ప్రయాణికుల మృతదేహాలను వారి బంధువులు గుర్తుపట్టారు. దాంతో ఈ మృతదేహాల అప్పగింత ప్రక్రియ పూర్తయింది. తలలు తెగి, ప్రమాదంలో నుజ్జునుజ్జయి అసలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైన మృతదేహాలను.. తమ వారి ఆచూకీ కోసం మార్చురీకి వచ్చిన వారూ గుర్తించలేకపోతున్నారు. ఘటన జరిగిన తర్వాత మృతదేహాలు రెండు మూడు చోట్లకు సరిగా ప్యాక్చేయకుండానే తరలించిన కారణంగా కొంతమేర కుళ్లి దుర్వాసన వస్తున్నాయి. సీబీఐ దర్యాప్తు షురూ ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ దుర్ఘటన వెనుక కుట్ర కోణం ఉందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు మంగళవారం బాలాసోర్ జిల్లాకు చేరుకున్నారు. బాలాసోర్ రైల్వే పోలీసులు రైల్వే చట్టంలోని ఈ నెల 3న వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సీబీఐ అధికారులు స్వీకరించారు. స్థానిక పోలీసులు నమోదు చేసి కేసును దర్యాప్తు ప్రక్రియలో భాగంగా మళ్లీ రిజిస్టర్ చేసి, దాన్ని సొంత ఎఫ్ఐఆర్గా నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు మొదలుపెట్టారు. ఎల్రక్టానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడం వల్లే రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వేశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. సమగ్ర దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ కార్యకలాపాలపై తమకు కొంత పరిజ్ఞానం ఉందని సీబీఐ అధికారి ఒకరు చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా రైలు సెక్యూరిటీ సిబ్బంది, ఫోరెన్సిక్ నిపుణుల సాయం కూడా తీసుకుంటామని తెలిపారు. జాయింట్ డైరెక్టర్ (స్పెషల్ క్రైమ్) విప్లవ్‌కుమార్ చౌదరి నేతృత్వంలో ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం మంగళవారం మధ్యాహ్నం బహనాగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనాస్థలి, సిగ్నల్ గదిని క్షుణ్నంగా పరిశీలించింది. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, సిబ్బందిని ప్రశ్నించనుంది. -
ఆ దుర్ఘటన మిగిల్చిన కన్నీటి కథలు..తమ వాళ్ల కోసం తల్లడిల్లుతున్న కుటుంబాలు
ఒడిశాలో బాలసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగి నాలుగు రోజులైంది. ఆ ఘటనలో చనిపోయిన వందలాది మందిలో ఇంకా గుర్తించలేని మృతదేహాలు ఎన్నో ఉన్నాయి. మరోవైపు తమవారెక్కడున్నారో తెలియక వెతుకులాటలో కొందరు కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాలకు తీరని శోకం, అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి భార్య, కూతురు ఇదే ప్రమాదం బారిన పడ్డారు. దీంతో అతడు తన భార్య, కూతురు ఆచూకి కోసం ఎంతగానో తపించాడు. చివరికి మార్చురీలో ఎన్నో మృతదేహాలను చూసిన తర్వాత గానీ తన భార్యను గుర్తించలేకపోయాడు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి, ఆ బాధను దిగమింగి కూతురు కోసం వెతకడం ప్రారంభించాడు. ఆమె బతుకుందా లేదా అన్న టెన్షన్‌తో నరకయాతన అనుభవించాడు ఆ వ్యక్తి. చివరికి జిల్లా కలెక్టర్, బాలాసోర్ నివాసితులు సాయంతో కూతురు కోసం భువనేశ్వర్‌కి బయలు దేరాడు ఆ తండ్రి. అలానే పశ్చిమ బెంగాల్‌కి చెందిన మరో తండ్రి హేలారామ్ మాలిక్ తనకు ఈ రైలు ప్రమాదం గురించి తనకు తెలియదని కన్నీటిపర్యంతమయ్యాడు. తన కొడుకు ఫోన్ చేసి తాను తీవ్ర గాయాలతో ఉన్నాని, ప్రమాదం జరిగిందని చెప్పడంతో హుటాహుటినా ఇక్కడకు వచ్చానని చెప్పాడు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఆ ఘటన జరిగిన రాత్రికే వచ్చినా.. కొడుకు ఆచూకి కానరాక ఆ తండ్రి ఎలా తల్లడిల్లాడో వివరించాడు. చివరికి తాను తన కొడుకుని మార్చురీలోనే గుర్తించానని, అపస్మారక స్థితిలో ఉంటే చనిపోయాడనుకుని రెస్క్యూ సిబ్బంది మార్చురీలో ఉంచినట్లు తెలిపాడు హేలారామ్. ప్రస్తుతం అతని కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి ఎన్నో మిరాకిల్ ఘటనలు తోపాటు, కన్నీటిని మిగిల్చిన విషాద కథలు అక్కడ అడుగడుగున కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, వాస్తవానికి కొన్ని మృతదేహాలను వివిధ ప్రాంతాలకు తరలించడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. అధికారులు ఆయా మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తుపట్టాలనే ఉద్దేశంతో వాటిని పర్యవేక్షించడమే గాక గుర్తుపట్టేలా బాధితు కుటుంబ సభ్యులకు సాయం చేస్తున్నారు. ఈ మేరకు బాలాసోర్ జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ దత్తాతత్రేయ భౌసాహెబ్ షిండే మాట్లాడుతూ..తమకు రెండు కంటట్రోల్ రూంలు ఉన్నాయని, మృతదేహం ఉన్న ప్రదేశంతో సంబంధం లేకుండా ఫోన్ చేసి వివరాలు పొందవచ్చు అని పేర్కొన్నారు. కాగా, ఇంకా 101 మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉందని కూడా అధికారులు వెల్లడించారు. (చదవండి: ప్రమాదం జరిగి 4 రోజులు .. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు..) -
ప్రమాదం జరిగి 4 రోజులు .. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు..
ఒడిశాలో వందలాది ప్రాణలు బలిగొన్న మూడు రైళ్ల ప్రమాదం జరిగి ఇన్ని రోజులైన ఇంకా కొన్ని మృతదేహాలు మిగిలిపోయాయని, వాటిని గుర్తించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు తూర్ప మధ్య రైల్వే డివిజన్ రైల్వే మేనేజర్ రింకేశ్ రాయ్ మాట్లాడుతూ..ఈ ఘెర ప్రమాదంలో సుమారు 278 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యిమంది దాక గాయపడ్డారు. ఐతే వారంతా ఒడిశాలోని వివిధ ఆస్పత్రులో చికిత్ప పొందారని, అందులో 900 మంది డిశ్చార్చ్ అయ్యినట్లు తెలిపారు. ఇంకా 200 మంది ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఐతే ప్రమాదంలో మరణించిన 278 మందిలో 101 మృతదేహాలు మిగిలిపోయాయని, వాటిని గుర్తించాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్ అమృత్ కులంగే మాట్లాడుతూ..భువనేశ్వర్‌లో ఉంచిన మొత్తం 193 మృతదేహాలలో 80 మృతదేహాలను గుర్తించామని, 55 మృతదేహాలను బంధువులకు అప్పగించామని చెప్పుకొచ్చారు. కాగా, వాతావరణం దృష్ట్యా మృతదేహాలు త్వరితగతిన పాడేపోవడంతో ఒకటి రెండు రోజులు మాత్రమే బాధితుల బంధువుల కోసం వేచి చూస్తామని అధికారులు చెప్పారు. (చదవండి: కొడుకుని కాపాడాలని అంబులెన్స్‌తో వెళ్తే..శవాగారంలో ఉన్న కొడుకుని చూసి ఆ తండ్రి..) -
పట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
సాక్షి, చైన్నె: చైన్నె నుంచి షాలిమర్ వైపుగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రెండురోజుల అనంతరం పట్టాలెక్కింది. ఈ రైలు మంగళవారం షాలిమర్‌కు చేరుకోనుంది. వివరాలు.. ఒడిశా బాలసోర్ వద్ద శుక్రవారం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు, హౌరా ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొన్న దుర్గటనతో చైన్నె నుంచి అనేక రైళ్ల సేవలు రద్దు చేశారు. ఈ ప్రమాదంలో తమిళులు పెద్దసంఖ్యలో చిక్కుకున్నట్టుగా వచ్చిన సమాచారంతో సహాయక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో తమిళులు ఎవరూ మరణించలేదు. స్వల్పగాయాలతో బయట పడ్డ వాళ్లే అధికం. అందరూ సురక్షితంగా రాష్ట్రానికి వచ్చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశాలో ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించడంతో మళ్లీ రైళ్ల సేవలపై అధికారులు దృష్టి పెట్టారు. దీంతో చైన్నె నుంచి ఉత్తరాది రాష్ట్రాల వైపుగా వెళ్లే పలు రైళ్లు సేవలను సోమవారం పునరుద్ధరించారు. అలాగే రెండురోజులుగా పూర్తిగా నిలుపుదల చేసిన చైన్నె – షాలిమర్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను మళ్లీ ప్రారంభించారు. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలు దేరే సమాచారాన్ని మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పంపించారు. దీంతో ఈ రైలు సోమవారం ఉదయం చైన్నె ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 10.45 గంటలకు బయలు దేరింది. ఈ రైలు విజయవాడ, రాజమండ్రి, విశాఖ పట్నం మీదుగా బాలాసోర్ వైపుగా కోలకతాలోని షాలిమర్‌కు మంగళవారం ఉదయం చేరుకోనుంది. -
ఆ ట్రాక్‌లు సిద్ధం
భువనేశ్వర్: ఒడిశాలో మూడు రైళ్ల ఘోర రైలు ప్రమాదంతో ఛిన్నాభిన్నమైన రైల్వే ట్రాక్‌లను శరవేగంగా పునరుద్ధరిస్తున్నారు. రెండు ప్రధాన ట్రాక్‌లను ఇప్పటికే సిద్ధం చేశారు. వాటిపై తొలుత ఆదివారం రాత్రి వైజాగ్–రూర్కెలా గూడ్సు, అనంతరం సోమవారం ఉదయం వందేభారత్ ప్రయాణించాయి. మూడు రోజులుగా ఘటనా స్థలి వద్దే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతులూపి రైళ్లను స్వాగతించారు. కోరమండల్, హౌరా ఎక్స్‌ప్రెస్‌లు, మరో గూడ్స్ రైలు శుక్రవారం రాత్రి ఒడిశాలోని బహనగా బజార్ స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదానికి గురైన మహా విషాదం 275 మందిని బలి తీసుకోవడం తెలిసిందే. దేశాన్ని కలచివేసిన ఈ ప్రమాదంపై రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ విచారణ ముమ్మరంగా సాగుతోంది. భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కోరమండల్ రైలు డ్రైవర్, అసిస్టెంట్ల స్టేట్మెంట్ను రైల్వే సేఫ్టీ కమిషనర్ (సీఆర్ఎస్) సోమవారం నమోదు చేశారు. డ్రైవర్ కోలుకుని ఐసీయూ నుంచి వార్డుకు మారగా అసిస్టెంట్ తలకు సర్జరీ జరగాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్ల తప్పిదమేమీ లేదని రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించడం, మొత్తం ఉదంతంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేయడం తెలిసిందే. 10మంది సభ్యులతో కూడిన బృందం సోమవారం ఘటనా స్థలిని సందర్శించింది. ఇప్పటిదాకా 170 మృతదేహాలను గుర్తించారు. ఒడిశా ప్రభుత్వం వాటిని ఉచితంగా స్వస్థలాలకు తరలిస్తోంది. ప్రమాదంలో మరణించిన, కాళ్లూ చేతులూ పోగొట్టుకున్న పశ్చిమబెంగాల్ వాసుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. మృతుల సంఖ్య తాజాగా 278కి పెరిగింది. ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్సు ఒడిశాలో సోమవారం మరో రైలు పట్టాలు తప్పింది. బారాఘర్ వద్ద ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన నారో గేజ్ లైన్లో లైమ్లైన్ లోడుతో వెళ్తున్న గూడ్స్ తాలూకు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. డుంగ్రీ లైమ్‌స్టోర్ గనులకు, బారాఘర్ ఏసీసీ సిమెంట్ ప్లాంట్‌కు మధ్య ఉన్న ఈ లైనుతో రైల్వేకు సంబంధం లేదు. చార్లెస్ సంతాపం ప్రమాదంపై బ్రిటన్ రాజు చార్లెస్–3 సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ మేరకు ఆయన సందేశం పంపారు. ఈ దారుణం తనను, రాణిని తీవ్ర షాక్‌కు గురి చేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగా ఢ సానుభూతి తెలిపారు. 1980ల్లో తన ఒడిశా పర్యటన తనకెన్నో తీపి గుర్తులు అందించింద ని గుర్తు చేసుకున్నారు. భారత్‌కు తన హృదయ ంలో ప్రత్యేక స్థానముందని చార్లెస్ తెలిపారు. మోదీకి ఖర్గే లేఖాస్త్రం రైల్వేలను ప్రాథమిక స్థాయి నుంచి బలోపేతం చేయకుండా కేవలం పైపై మెరుగులు దిద్దుతూ వార్తల్లో నిలవడంపైనే ప్రధాని మోదీ దృష్టి పెట్టారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రమాదానికి అసలు కారణాలను బయట పెట్టాలంటూ మోదీకి లేఖ రాశారు. ‘‘నేరాలను దర్యాప్తు చేసే సీబీఐ రైలు ప్రమాదం విషయంలో ఏం చేస్తుంది? సాంకేతిక, వ్యవస్థాగత, రాజకీయ వైఫల్యాలను సీబీఐ నిగ్గుదేల్చగలదా?’’ అని ప్రశ్నించారు. ప్రమాద మార్గంలో ట్రాక్ పునరుద్ధరణ తర్వాత వెళ్తున్న రైళ్లు . శిథిలాలు కన్పించకుండా కట్టిన తెరలు -
సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించాం
-
ఒడిశాలో మరో రైలు ప్రమాదం
-
మహా విషాదం
-
అలా బయటపడ్డారు... సీట్ రిజర్వేషన్ కోసం లాంగ్ జర్నీ టికెట్
తిరుపతి అర్బన్: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. రైళ్లు.. బస్సులు విపరీతమైన రద్దీతో నడుస్తుంటాయి. ముఖ్యంగా రైళ్లలో తక్కువ దూరం ప్రయాణం చేసేవారికి సీట్ రిజర్వేషన్ దొరకడం అంత సులభం కాదు. చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది బెర్త్ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయ్యేందుకు లాంగ్ జర్నీకి టికెట్లు తీసుకుంటుంటారు. తమ గమ్యం రాగానే మధ్యలో దిగేస్తుంటారు. ఇదే ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నుంచి తిరుపతి జిల్లాలో హౌరా ఎక్స్‌ప్రెస్ ఎక్కిన వారిని కాపాడింది. ఈ విషయం గుర్తించడానికి రైల్వే అధికారులకు మూడు రోజులు పట్టింది. ఆదివారం ఉదయం 11 గంటలకు దీనిపై పూర్తి స్పష్టత వచ్చింది. ప్రయాణికులంతా క్షేమంగా ఉండడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తిరుపతి ప్రయాణికులు సురక్షితం తిరుపతి మీదుగా వెళ్లిన హోరా ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి జిల్లా నుంచి 40 మంది ప్రయాణికులు జర్నీ చేశారు.అయితే ఒడిశా రాష్ట్రం బాలాసోర్ సమీపంలోని బహంగ్బాజర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రాంతానికి అవతలి స్టేషన్ హోరాకు తిరుపతి నుంచి 8మంది,రేణిగుంట నుంచి 8మంది,గూడూరు నుంచి ఇద్దరు. మొత్తంగా 18 మంది టికెట్ తీసుకున్నారు. ప్రమాదం జరిగిన స్టేషన్‌కు ముందు స్టేషన్ బాలాసోర్‌కు తిరుపతి నుంచి 10 మంది టికెట్ తీసుకున్నారు.అయితే వీరంతా ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ముందే దిగేసినవారే. టికెట్ తీసుకుంది వీరే.. హోరా స్టేషన్‌కు తిరుపతి నుంచి టికెట్ తీసుకున్న వారిలో అజయ్ కేఆర్,కుమారి ప్రయాంక, కమలాదేవి, ఎం.కుమార్, అనురాగ కుమార్, భూపేంద్ర,యానియా,సోలారింగ్ ఉన్నారు. గూడూరు నుంచి హోరాకు టిక్కెట్ తీసుకున్న వారిలో ఎస్కే దాస్, దూలాల్ ఉన్నారు,రేణిగుంట నుంచి హోరాకు టిక్కెట్ తీసుకున్న వారిలో చంద్రమణి,శాల్వి,తేజా,లీలావతి,రాజా,డీఎస్ సాయి,సూచిట్,సుభామిత్ర ఉన్నారు.మొత్తంగా అంతా సురక్షితంగా ఉండడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు క్షేమం తిరుపతి నుంచి ఒడిశాకు ప్రయా ణం చేసిన వారు సురక్షితంగా ఉన్నారు. టికెట్లు ఒడిశా ప్రాంతానికి తీసుకున్నప్పటికి వారు మన రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో దిగేశారు. దీంతో వారి సమాచారం తెలుసుకోవడం కష్టంగా మారింది. ఏమైనా రైలు ప్రమాద ఘటన దురదృష్టకరం. – సత్యనారాయణ, తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ -
Odisha Train Deaths: మరణాల సంఖ్యపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు..
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య విషయమై సర్వత్రా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఒడిశా ప్రధాన కార్యదర్శి పీకే జెనా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే మీడియా ప్రతినిధులు ఎక్కువగానే ఉన్నారని, అంతా కెమెరాల సమక్షంలోనే జరుగిందని చెప్పారు. ఒడిశా పారదర్శకతనే విశ్విస్తుందని నొక్కి చెప్పారు. వాస్తవానికి రైల్వే మరణాల సంఖ్య 288గా పేర్కొంది. దీన్ని రైల్వే సమాచారం ఆధారంగా వెల్లడించింది. ఐతే బాలాసోర్ జిల్లా కలెక్టర్ ఆదివారం మరణాల సంఖ్యను 275గా ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే మరణాల సంఖ్యను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీని గురించి పీకే జెనా మృతదేహాలను రెండుసార్లు లెక్కించడం వల్ల ఇలా జరిగిందంటూ వివరణ ఇచ్చారు. అలాగే ప్రమాద స్థలంలో మీడియా వ్యక్తుల ప్రవేశంపై నిషేధం కూడా లేదని ప్రధాన కార్యదర్శి తెలిపారు. రెస్క్యూ, పునురుద్ధరణ కార్యకలాపాలు పూర్తిగా ప్రజల సమక్షంలోనే జరిగాయిని చెప్పారు. ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరణాల సంఖ్య గురించి ప్రశ్నించారు. ఆమె ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు 61 మంది మరణించారని, 182 మంది ఆచూకి తెలియలేదని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం నుంచి 182 మంది ఆచూకి తెలయలేదంటే ఆ గణాంకాలు ఎలా నిలుస్తాయి అని నిలదీశారు. ఐతే మమతా బెనర్జీ ఆరోపణలకు సంబంధించిన ప్రశ్నలను స్వీకరించేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిరాకరించారు. కాగా, 275 మృతదేహాలలో 108 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించినట్లు ప్రధాన కార్యదర్శి జెనా తెలిపారు. అలాగే మృతదేహాలను వారి కుటుంబసభ్యులు దహనం చేసేందుకు వీలుగా అన్ని మృతదేహాలను గుర్తించాలని రాష్ట్రం కోరుకుంటుందని జెనా అన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణం దృష్ట్యా అవి త్వరిగతిన పాడేపోతున్నాయని, అందువల్ల చట్టం ప్రకారం రాష్ట్రం గరిష్టంగా మరో రెండు రోజులు మాత్రమే వేచి చూస్తుందని చెప్పారు. (చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: బోగీలో నుంచి పిల్లలను బయటకు విసిరేసి...) -
ఏం జరిగిందో తెలిసే లోగానే బోగీ అంతా రక్తసిక్తం...
మాటలకందని విషాదం.. మనసుల్ని చిదిమేసింది.. ప్రమాదం జరిగి.. 60 గంటలు గడుస్తున్నా.. ఎవరు ఎక్కడున్నారో..? ఎలా ఉన్నారో తెలియని హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. భయానక ఉత్పాతం నుంచి అదృష్టవశాత్తూ బయటపడి.. సొంతూళ్లకు తిరిగివచ్చిన వారంతా.. తమకు పునర్జన్మ లభించిందని చెబుతున్నారు. ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో చిక్కుకొని ఎలాగోలా బయటపడి వచ్చేసినా.. ఇంకా ఆ రాత్రి తమ జీవితాల్లో కాళరాత్రిలా కళ్లముందే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరుగాని ఊరులో ప్రమాదపుటంచుల్లో హాహాకారాల మధ్య జీవనం గడుపుతూ ప్రతి నిమిషం భయం వెంటాడుతున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాయం మరువలేనిదని చెబుతున్నారు. విశాఖ చేరుకున్న పలువురు బాధితుల కన్నీటి కథలివీ.. సాక్షి, విశాఖపట్నం: నగరంలోని జాలరిపేట, వాడపేటల నుంచి ఏడుగురు గత నెల 27న తీర్థయాత్రకు బయల్దేరారు. వీరు తొలుత కాశీ వెళ్లి విశ్వేశ్వరుని, అనంతరం కోల్‌కతాలోని కాళీమాతను దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఈనెల రెండో తేదీన కోల్‌కతాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. వీరిలో ఎస్–1లో ఇద్దరు, ఎస్–4 బోగీలో ఐదుగురు ఉన్నారు. వీరెక్కిన రైలు ఒడిశాలోని బహనగ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగానూ, ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరు ఆదివారం ఉదయం ఓ వాహనంలో విశాఖ చేరుకున్నారు. ప్రమాద బాధితుల్లో ఒకరైన జాలరిపేటకు చెందిన ఎం.సత్యంకు బాధితుల తరఫున ప్రభుత్వం రవాణా ఖర్చుల కింద రూ.30 వేల చెక్కును మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం కలెక్టరేట్లో అందజేశారు. ఈ సందర్భంగా రైలు దుర్ఘటనపై సత్యం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ప్రమాదం జరిగే సమయానికి మేం ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంతలో పెద్ద శబ్దంతో భారీ కుదుపు. క్షణాల్లోనే బోగీలు తిరగబడ్డాయి. అంతా అరుపులు.. కేకలు. ఏం జరిగిందో తెలిసే లోగానే బోగీ అంతా రక్తసిక్తం. చాలామంది చనిపోయారు. మాపైనా చాలా మంది పడిపోయారు. నాతో ఉన్న రాజు, రమణలకు బాగా దెబ్బలు తగిలాయి. నాకు, నా భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. మేం బతుకుతామన్న నమ్మకం లేదు. మాతోటి ప్రయాణికుడు సీహెచ్ రాజు కారుతున్న రక్తాన్ని లెక్క చేయకుండా మమ్మల్ని బతికించాడు. లేదంటే మేమంతా చనిపోయేవాళ్లం. ఆ కలకత్తా కాళీమాతే మమ్మల్ని బతికించింది.’ అని కన్నీటి పర్యంతమవుతూ సత్యం చెప్పాడు. బతికున్నానంటే నమ్మలేకపోతున్నా.. ఒక్కసారిగా కుదుపు వచ్చి పడిపోయాను. నా మీద బ్యాగులు, మనుషులు పడిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాను. కాసేపటి తర్వాత కళ్లు తెరిస్తే.. కొందరు నన్ను మోసుకొంటూ అంబులెన్స్ దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్లు మొత్తం చెక్ చేశారు. అప్పటి వరకు ఏం జరిగిందో.. ఎందుకు పడిపోయానో తెలీదు. పక్కనున్న వాళ్లని అడిగితే.. రైళ్లు గుద్దుకున్నాయని చెప్పారు. కళ్లముందే శవాల గుట్టలు కనిపించాయి. కొందరు తమ వాళ్లు కనిపించక.. రక్తాలతో అటు ఇటు పరుగెడుతున్నారు. నాకు నా కుటుంబం గుర్తొచ్చింది. భయంతో వణికిపోయాను. నా భర్తకి అప్పటికే దెబ్బలు తగిలున్నాయి. ఆయన నా దగ్గరికి వచ్చారు. ఆయన్ని చూడగానే ఊపిరి వచ్చింది. ప్రభుత్వ సహకారంతో ఇక్కడి వచ్చాం. చాలా బాగా తీసుకొచ్చారు. దారిలో భోజనాలు, పళ్ల రసాలు అందిస్తూ.. జాగ్రత్తగా చూసుకుని వైద్యం అందిస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నాం. ఇంత ఘోరం జరిగిందని తలచుకుంటేనే భయం, ఏడుపు వచ్చేస్తున్నాయి. బతికున్నానంటే నమ్మలేకపోతున్నాను. మళ్లీ నా పిల్లల్ని, మనవళ్లని చూస్తామని కలలో కూడా అనుకోలేదు. – భారతి, బుచ్చిరాజుపాలెం, విశాఖపట్నం షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది షాలిమార్‌లో రైలు ఎక్కాను. వైజాగ్‌లో దిగాల్సి ఉంది. నేను దివ్యాంగుల కోచ్‌లో ఉన్నాను. భారీ శబ్ధం వినిపించింది. మా బోగీ.. గూడ్స్ రైలుకు ఇటువైపున పడిపోయింది. అటు పడి ఉంటే.. ఇప్పుడు మాట్లాడేందుకు ఉండేవాడిని కాదేమో. మా బోగీలో నా పక్కన కూర్చున్న వారిలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. అది చూసి నాకు భయం మొదలైంది. నరకం కనిపించింది. అతి కష్టమ్మీద.. బోగీ నుంచి బయటకు వచ్చాను. ఏమి కనిపించ లేదు. చాలా మంది ఏడుపులు, కేకలు వినిపిస్తున్నాయి. నా మొబైల్లో లైట్ వేసి చూశాను. చాలా మంది రక్తంతో అటు ఇటు తిరుగుతున్నారు. బోగీలో అటు ఇటు.. ఎగిరి పడటం వల్ల.. ఒళ్లంతా నొప్పులైపోయాయి. నడవలేని పరిస్థితిలో ఉన్నాను. మెల్లగా ట్రాక్ దాటి.. ఒక మూల కూర్చున్నాను. ఇంతలో కొందరు ఊరి వాళ్లు వచ్చి.. నన్ను అంబులెన్స్ దగ్గరకు తీసుకెళ్లారు. తర్వాత రోజు ఉదయం సీఎం జగన్ మన వైజాగ్ నుంచి మంత్రుల్ని పంపించారని తెలిసింది. తెలుగు వాళ్లందర్ని అక్కడికి తీసుకెళ్లి.. స్పెషల్ ట్రైన్లో వైజాగ్ పంపించారు. ఇక్కడ ట్రీట్మెంట్ బాగా ఉంది. ప్రతి గంటకు డాక్టర్లు వచ్చి.. ఎలా ఉందని అడుగుతున్నారు. నొప్పులు ఇంకా తగ్గలేదు.. రికవరీ అయ్యేందుకు కొంత టైమ్ పడుతుందని డాక్టర్లు చెప్పారు. నా జీవితాంతం ఈ ప్రమాదం నా కళ్లముందే కనిపిస్తుంటుందేమో. వెంటనే ఆదుకొని వైజాగ్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – శంకర్రావు, పాతర్లపల్లి గ్రామం, రణస్థలం, శ్రీకాకుళం ఇలాంటి ఘోరాన్ని ఎవరూ చూడకూడదు ఖరగ్‌పూర్ పెళ్లికి వెళ్లి.. కోరమండల్లో తిరిగి వస్తున్నాం. ఎస్–3 బోగీలో ఉన్నాం. సాయంత్రం చిన్నగా కునుకు తీస్తున్నాను. ఇంతలో ఒక్కసారిగా బండి జర్క్ అయినట్లు అయింది. ఫాస్ట్‌గా ట్రైన్ వెళ్తోంది కదా.. అందుకే అనుకున్నాను. ఒక్క క్షణంలో కింద పడిపోయాను. నాపైన లగేజీలు, పై బెర్త్‌లో ఉన్న ఇద్దరు పడిపోయారు. బోగీలో జనమంతా ముద్దగా పడిపోయాం. పైనున్న ఒక్కొక్కరూ లేచి ఒకరికొకరం సాయం చేసుకుని బయటపడ్డాం. అప్పటికే.. అందరికీ దెబ్బలు తగిలాయి. ఈ క్రమంలో స్పృహ కోల్పోయాను. కాసేపటికి ఎవరో నలుగురు ముఖంపై నీళ్లు చల్లితే దుకాణం వద్ద ఉన్నాను. వాళ్లు నా ప్రాణాలు కాపాడారు. ఏం జరిగిందని అడిగితే.. ఘోరం గురించి చెప్పారు. తల్లడిల్లిపోయాను. నా భార్య కోసం వెతికితే.. ఆమె క్షేమంగా ఇంకో చోట ఉందని చెప్పారు. వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్లమని చెప్పాను. దారిలో వెళ్తుంటే.. శవాలను, గాయపడిన వారిని మోసుకెళ్తున్నారు. అది చూశాక దేవుడా.. ఇలాంటి ఘోరాన్ని ఇంకెవరూ చూడకుండా కాపాడు స్వామీ అని మొక్కుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, బంధువుల సహకారంతో విశాఖ వచ్చేశాను. ఇక్కడ మంచి వైద్యం అందిస్తున్నారు. – మాధవరావు, బుచ్చిరాజుపాలెం -
ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ చీరాల వాసులు
-
డౌన్ లైన్ ట్రాక్ పునరుద్ధరణ..పరుగులు పెట్టిన గూడ్స్ రైలు
-
రైలు ప్రమాదంలో రాష్ట్రవాసులు లేరు
బనశంకరి: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కన్నడిగులు ఎవరూ చిక్కుకోలేదని మంత్రి సంతోష్‌లాడ్ ఫోన్ ద్వారా సీఎం సిద్దరామయ్యకు సమాచారం అందించారు. బహనాగకు వెళ్లిన మంత్రి అక్కడ కన్నడిగుల కోసం ఆరా తీశారు. కన్నడిగులు ఎవరూ ఆసుపత్రుల్లో చేరలేదని సంతోష్‌లాడ్ తెలిపారు. ప్రయాణ వసతి లేక చిక్కుకున్న సుమారు 80 మంది కన్నడిగులను రాష్ట్రానికి రెండు విమానాల ద్వారా ఆదివారం ఉదయం బెంగళూరుకు తరలించారు. 18 మందిని మైసూరుకు పంపారు. మిగిలిన వారు హాసన్, చిక్కమగళూరుకు వెళ్లారు. హోటల్ కార్మికుడు మృతి యశవంతపుర నుంచి కోల్‌కతాకు బయలుదేరిన హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న ప్రయాణికుల్లో బెంగళూరు నుంచి వెళ్తున్న సుమారు 30 మందికి పైగా గాయపడగా వీరిలో ఒకరు మరణించారు. వీరిలో కన్నడిగులు ఎవరూ లేరు. పశ్చిమబెంగాల్ కు చెందిన సాగర్ ఖేరియా (30) మరణించాడు, అతడు బెంగళూరులో హోటల్ కార్మికునిగా పనిచేసేవాడు. సొంతూరికి వెళ్దామని బయల్దేరి ప్రమాదానికి గురయ్యాడు. రైలు సర్వీసులు మళ్లీ ప్రారంభం రైలు ప్రమాదం నేపథ్యంలో రైళ్ల రాకపోకలు నిలిపివేసిన రైల్వేశాఖ మళ్లీ రైలు సంచారానికి అనుమతించింది. బెంగళూరు బయప్పనహళ్లి ఎస్‌వీఎంటీ రైల్వేస్టేషన్ నుంచి మూడు రైళ్లు బయలుదేరాయి. రైలు నంబరు 22305 ఎస్‌వీఎంటీ రైల్వేస్టేషన్ నుంచి జేఎస్‌ఎంఈ జార్ఖండ్‌కు ఆదివారం మధ్యాహ్నం 12.30కు బయలుదేరింది. నంబరు 12864 రైలు బైయప్పనహళ్లి ఎస్‌వీఎంటీ నుంచి హౌరాకు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరింది. -
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ
-
క్షతగాత్రులకు లక్ష...మృతుడి కుటుంబానికి 10 లక్షలు
-
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం
-
ట్రాక్ మరమ్మతులను పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి
-
నిబద్ధతతో వ్యవహరించి.. రాజీనామా చేసిన నాటి రైల్వే మంత్రులు వీరే..
ఒడిశాలోని బాలాసోర్ ఘోర రైలు ప్రమాదం దేశ చరిత్రలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచి త్రీవ విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో వందలాది మంది మృత్యువాత పడగా, వెయ్యిమందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్టవ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం హ్యాష్ ట్యాగ్‌లో ట్రెండింగ్ చేస్తూ.. రాజీనామా చేయాల్సిందే అంటూ పోస్టులు వస్తున్నాయి. అదీగాక అశ్విని వైష్ణవ్ సొంత రాష్టంలోనే ఈ ఘోర రైలు ప్రమాదం జరగడంతో మరింత తీవ్ర స్థాయిలో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు గతంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన నాటి మంత్రులను గుర్తు చేసుకుంటున్నారు. నాటి మంత్రులలో ఉన్న నిబద్ధత, నైతికత ఇప్పుడూ కానరావడం లేదంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐతే గతంలో జరిగిన రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామాలు చేసిన నాటి ముఖ్యమంత్రులు ఎవరంటే... గతంలో రాజీనామ చేసిన రైల్వే మంత్రులు 👉1956లో లాల్ బహదూర్ శాస్త్రీ హయాంలో రెండు రైలు ప్రమాదాలు జరిగాయి. ఆగస్టులో ఉమ్మడి ఏపీలో జరిగిన ప్రమాదంలో 112 మంది మరణించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. దీన్ని నెహ్రూ అంగీకరించలేదు. రెండోసారి అదే ఏడాది నవంబర్‌లో తమిళనాడులో జరిగిన మరో ఘోర ప్రమాదంలో 144 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. దీంతో శాస్త్రీ వెంటనే నెహ్రూకి రాజీనామా సమర్పించడమే గాక వెంటనే ఆమెదించాలని విజ్ఞప్తి చేశారు. ఆ నాడు శాస్త్రీ చేసిన రెండో రాజీనామా ప్రజల దృష్టిని ఆకర్షించింది కూడా. ఇది సాంకేతిక లోపమని రైల్వే బోర్డు బాధ్యత వహించాలని పలువురు నచ్చచెప్పేందుకు చెబుతున్న శాస్త్రీగారు వెనక్కి తగ్గలేదు. ఇక అప్పడు నెహ్రు ఇది తనకు క్లిష్టమైన నిర్ణయం అంటూ ఆయన రాజీనామాను ఆమోదించారు. 1956 :: Resignation Letter of Railway Minister Shri Lal Bahadur Shastri After Ariyalur Train Accident ( Photo - PM Museum ) pic.twitter.com/LuNGxDa88G — indianhistorypics (@IndiaHistorypic) June 2, 2023 👉1999 ఆగస్టులో అసోంలో జరిగిన రైలు ప్రమాదంలో 290 ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో నితీశ్ కుమార్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయన అసోం రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నిష్క్రమణ తర్వాత సరిగ్గా 43 ఏళ్ల తర్వాత రైల్వే మంత్రి నుంచి వచ్చిన రెండవ రాజీనామా ఇది. 👉ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో ఎన్డీయే ప్రభుత్వం హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. 2000వ సంవత్సరంలో రెండు రైలు ప్రమాదాలు జరగడంతో ఆమె నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అయితే అప్పటి ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి ఆమో రాజీనామాను తిరస్కరించారు. 👉2016లో నాలుగు రోజుల వ్యవధిలో కైఫియత్ ఎక్స్‌ప్రెస్, పూరీ-ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ అనే రెండు రైళ్లు పట్టాలు తప్పినందుకు నైతిక బాధ్యత వహిస్తూ 2017 ఆగస్టు 23న రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సురేష్ ప్రభు ప్రతిపాదించారు. కొంత సమయం వేచిచూడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరగా.. ఆ తరువాత కొద్ది నెలల్లోనే ప్రభుత్వానికి రాజీనామా చేశారు. కాన్పూర్ సమీపంలో పాట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ 14 కోచ్‌లు పట్టాలు తప్పడంతో 150 మంది చనిపోయారు. 1999 తర్వాత ఇది అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటి. (చదవండి: లెక్క తేలని మరణాలు!.. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలివే) -
AP: మీ వాళ్ల ఫొటో, వివరాలు వాట్సాప్ చేయండి.. నెంబర్ ఇదే..
సాక్షి, అమరావతి: ఒడిషాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏపీవాసుల వివరాలు, భద్రత కోసం ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో క్షత్రగాత్రుల సమాచారం కోసం విపత్తుల సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ 24/7 కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఇచ్చింది. మిస్సయిన వారి సమాచారం కోసం ఈ 1070, 112, 18004250101 ఫోన్ చేయాలని సూచించింది. అలాగే, 8333905022 నెంబర్‌కు ప్రయాణికుడి ఫొటో, ఇతర వివరాలను వాట్సాప్‌లో పంపించాలని తెలిపింది. అనంతరం, వివరాల ఆధారంగా పోలీసు శాఖతో సమన్వం చేసుకుని బాధితులకు వివరాలు తెలియజేయనున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారని, పద్దుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించిన అనంతరం మంత్రి అమర్నాథ్, ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం ఆదివారం ఉదయం బాలాసోర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో 309 మంది ఏపీకి చెందినవారు ప్రయాణిస్తున్నారు. అలాగే, ఏపీ నుంచి హౌరా వైపు 33 మంది ప్రయాణిస్తున్నారు. ఈ 342 మందిలో 330 మందిని గుర్తించామని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటివరకు 331 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. గుర్తించిన వారిలో 14 మంది క్షతగాత్రులని, వీరిలో 10 మంది రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో, నలుగురు క్షతగాత్రులు జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నారని చెప్పారు. ఇదే బోగీలో ప్రయాణిస్తున్న గురుమూర్తి అనే ఒక వ్యక్తి మాత్రం మరణించారని అమర్నాథ్ వెల్లడించారు. కాగా, ఇంకా గుర్తించవలసిన వారి వివరాల కోసం అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరులో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ లలో తమ వారు కనిపించడం లేదని ఇప్పటివరకు ఎవరూ రాలేదని, ఇప్పటికీ తమ వారి ఆచూకీ కోసం 8333905022 నంబర్ వాట్సాప్‌కు ఆచూకీ లభ్యం కాని వారి ఫోటోలు పంపిస్తే అధికారులు వారి వివరాలు సేకరిస్తారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఇలా ఉండగా రాష్ట్రానికి చెందిన 16 అంబులెన్స్‌లను, 10 మహాప్రస్థానం వాహనాలను భువనేశ్వర్ లో అందుబాటులో ఉంచామని, మరో ఐదు అంబులెన్సులను బాలాసోర్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొంతమందిని భువనేశ్వర్ లోని అపోలో హాస్పిటల్ తరలించామని, ఇద్దరిని విశాఖలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ కు, ఒకరిని విశాఖ ఆరిలోవలోని అపోలోకు తరలించినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: Odisha Accident: కొడుకు శవాన్ని చేతుల్తో మోశా.. -
ఏపీ నుంచి ఒడిశాకు 50 అంబులెన్స్ లు, మెడికల్ టీమ్స్
-
పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికగా చేపట్టిన రైల్వే శాఖ
-
ఒడిశా రైలు ప్రమాదం: శ్రీకాకుళం వాసి మృతి
శ్రీకాకుళం: ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన వ్యక్తి మృతిచెందారు. మండలంలోని జగన్నాధపురానికి చెందిన గురుమూర్తి(60) మృత్యువాత పడ్డారు. నిన్న(శనివారం) జరిగిన రైలు దుర్ఘటనలో గురుమూర్తి యశ్వంత్‌పూర్ రైలులో ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డాడు. ప్రమాద వార్త తెలుసుకున్న గురుమూర్తి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకోగా అక్కడే అతని మృతదేహాన్ని అప్పగించారు. అతనికి ఒడిసాలోనే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. జూట్ కార్మికుడిగా పనిచేసే గురుమూర్తి.. బాలాసోర్‌లో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకూ రైలు ప్రమాదంలో మృత్యువాత పడ్డ వారి సంఖ్య 288కి చేరింది. మరొకవైపు వెయ్యికి మందికి పైగా గాయపడ్డారు. -
దేశ చరిత్రలోనే అతిపెద్ద రైలు ప్రమాదాలు..
-
విజయవాడకు చేరుకున్న రైలు ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు
-
సిగ్నల్ లోపం వల్లే రైలు ప్రమాదం
-
రైలు ప్రమాదాన్ని చూసి భయాందోళనకు గురయ్యా: శ్రీకర్ బాబు
-
రైలు నుంచి బయటకు వచ్చేసరికి చాలా మంది చనిపోయారు: సుకన్య
-
కోరమండల్‌కు కలిసిరాని శుక్రవారం
కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం కలిసిరావడం లేదు. గత 20 ఏళ్లలో ఈ రైలు మూడుసార్లు ప్రమాదానికి గురైంది. అవన్నీ శుక్రవారమే జరిగాయి. పైగా వాటిలో రెండు ప్రమాదాలు ఒడిశాలోనే చోటుచేసుకున్నాయి. హౌరా–చెన్నై మధ్య నడిచే కోరమండల్ మూడుసార్లూ చెన్నై వెళ్తూనే ప్రమాదానికి గురైంది! 2009లో ఒడిశాలోని జైపూర్ వద్ద తొలిసారి ప్రమాదం జరిగింది. అప్పుడు 16 మంది చనిపోయారు. తర్వాత 2022 మార్చిలో నెల్లూరు వద్ద జరిగిన రెండో ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. తాజా ప్రమాదం మూడోది. -
ఒడిశా రైలు ప్రమాదం.. రక్తదానానికి యువత క్యూ
ఒడిశాలో కనీవినీ ఎరుగని రీతిలో రైలు ప్రమాదం జరిగిన సమయంలో నేటి తరం యువత తమలో మానవత్వం ఉందని నిరూపించారు. క్షతగాత్రులతో కిక్కిరిసిపోయిన బాలసోర్ ప్రభుత్వ ఆస్పత్రికి యువతీ యువకులు క్యూ కట్టారు. బాధితులకి అవసరమైన రక్తం తాము ఇస్తామంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఒక జిల్లా ఆస్పత్రికి ఒకేసారి 250 మందికి పైగా క్షతగాత్రులు రావడంతో వారికి చికిత్స ఎలా అందించాలో తెలీక సిబ్బంది తీవ్ర గందరగోళానికి గురయ్యారు. అప్పటికే రైలు ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక యువత ఆస్పత్రికి వచ్చి తమ వంతు ఏదైనా చేస్తామన్నారు. ఈ విషయాన్ని జిల్లా అదనపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మృత్యుంజయ్ మిశ్రా చెప్పారు. ‘‘నేను గత కొన్ని దశాబ్దాలుగా ఈ వృత్తిలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఒకేసారి వందల మంది క్షతగాత్రులకి చికిత్స అందించడం చాలా కష్టంగా మారింది. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి రక్తదానం చేయడానికి రావడం సంభ్రమాశ్చర్యాల్ని కలిగించింది. రాత్రంతా 500 యూనిట్ల రక్తాన్ని సేకరించాం. రక్తం ఇచ్చిన యువతకి ధన్యవాదాలు ’’ అని డాక్టర్ వివరించారు. -
‘కవచ్’ పరిశోధనలకే పదేళ్లు.. అలా జరిగితే ప్రమాదం తప్పేదా?
సాక్షి, హైదరాబాద్: అత్యంత వేగంగా వందే భారత్ రైళ్లను తయారు చేసి, సర్వీసులను పట్టాలెక్కిస్తున్న భారతీయ రైల్వే, ప్రయాణికుల భద్రతలో అత్యంత తీవ్ర నిర్లక్ష్యాన్ని అవలంబిస్తోంది. పరస్పరం రైళ్లు ఢీకొనకుండా కాపాడే వ్యవస్థ విషయంలో నిర్లక్ష్యంతో అమాయక ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రైళ్లపై భరోసాతో వాటిలో ప్రయాణిస్తున్నవారు ప్రమాదాల్లో చిక్కుకొని ప్రాణాలు వదులుతున్నారు. పదేళ్ల జాప్యం.. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా వ్యవస్థను రూపొందించడానికి ప్రయోగాల పేరుతో ఏకంగా పదేళ్ల విలువైన కాలాన్ని రైల్వే అధికారులు హరించారు. కానీ ఇప్పటివరకు ఆ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేలేకపోయారు. ప్రయోగాలకు వేదికైన దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొంత ఏర్పాటు చేసి మిగతా చోట్ల చేతులెత్తేశారు. శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగిన హౌరా–చెన్నై మార్గం దేశంలోనే కీలక రైల్వే లైన్. ఆ మార్గంలో కూడా రైల్వే కవచ్ ఏర్పాటు చేయలేకపోయింది. ఎందుకీ దుస్థితి.. రైల్వే నెట్వర్క్ తక్కువగా ఉండి, ఎక్కువ సంఖ్యలో రైళ్లు తిప్పే మన దేశంలో.. ఎదురెదురుగా వచ్చి రైళ్లు ఢీకొనే పరిస్థితి తరచూ ఉండేది. సిగ్నలింగ్ వైఫల్యమో, మానవ తప్పిదమో.. తరచూ ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా రైళ్లు వచ్చేవి. ప్రమాదాలు నివారించేందుకు విదేశాల నుంచి పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాలనుకున్నా, ఖరీదు ఎక్కువ కావటంతో సొంతంగానే రూపొదించాలని రైల్వే నిర్ణయించింది. అనుబంధ పరిశోధన సంస్థ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)కు బాధ్యతను అప్పగించింది. అది కొంతకాలం ప్రయోగాలు చేసి 2013లో తొలుత రైల్ కొలీజన్ అవాయ్‌డెన్స్ సిస్టం(టీకాస్)ను సిద్ధం చేసింది. ప్రయోగాల కోసం వికారాబాద్–వాడీ–సనత్‌నగర్ సెక్షన్లను ఎంపిక చేశారు. 260 కి.మీటర్లలో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశీలించారు. కవచ్‌గా మార్చి.. ఐదేళ్ల క్రితం దానిని ‘కవచ్’గా మార్చి పరిజ్ఞానాన్ని మరింత అప్‌గ్రేడ్ చేశారు. 2022 ఫిబ్రవరి నాటికి జోన్ పరిధిలో 615 కి.మీ. మేర ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయోగాలు విజయవంతమయ్యాయని, వ్యవస్థను అంబాటులోకి తెస్తామని అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తున్నారు. ఆ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు రైల్వే బోర్డు అనుమతించినా.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. గతేడాది చివరలో ప్రస్తుత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా రైలు లోకో ఇంజిన్‌లో కూర్చుని ప్రయోగాలను పరిశీలించారు. ప్రతి సంవత్సరం 5 వేల కి.మీ. మేర దాన్ని ఏర్పాటు చేసి, దేశమంతటా విస్తరిస్తామని పేర్కొన్నారు. గత సంవత్సరమే ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–హౌరా మార్గాల్లోని 2 వేల కి.మీ.నిడివిలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కిలోమీటర్‌కు రూ.50 లక్షలు.. కవచ్ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయాలంటే కిలోమీటరుకు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు తేల్చారు. ఇది రైల్వేకు పెద్ద భారంగా మారింది. పనులు వేగంగా పూర్తి చేయాలంటే బడ్జెట్ నిధుల్లో సింహభాగం దానికే ఖర్చు చేయాలి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1450 కి.మీ.మేర ఏర్పాటు చేయటం మినహా ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఏమిటీ కవచ్? కవచ్ పరిజ్ఞానం రైలు ఇంజిన్లతోపాటు ట్రాక్ వెంట కొనసాగుతుంది. మధ్యమధ్య ఫ్రీక్వెన్సీ టవర్లు ఏర్పాటు చేస్తారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ప్రత్యేక కవచ్ యంత్రాలను అమరుస్తారు. ట్రాక్‌పై ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఏర్పాటు చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాంతాల్లో 40 మీటర్ల ఎత్తున్న టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్ఫేజెస్లతో అనుసంధానిస్తారు. ఎలా పనిచేస్తుంది? - రైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలనే సూత్రంపై ఇది పనిచేస్తుంది. - దేశంలో రైలు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న సిగ్నల్ జంప్‌ను ఇది అప్రమత్తం చేస్తుంది. నిర్ణీత పరిధిలోపు అదే లైన్లో ఇంకొక రైలు ఉందని గుర్తిస్తే ఆటోమేటిక్‌గా రైలును ఆపేస్తుంది. - సిగ్నల్ దాటేసి వెళ్లడం, వేగంగా ప్రయాణించడం వంటి సందర్భాల్లోనేకాదు దట్టంగా మంచు కమ్ముకున్న అననుకూల వాతావరణంలోనూ పలుమార్లు లైన్–సైడ్ సిగ్నల్స్‌ను ఇస్తూ పైలట్‌కు సాయపడుతుంది. - లెవల్–క్రాసింగ్ వద్ద తనంతట తానుగా విజిల్స్ వేస్తుంది. రైలు నియంత్రణ కోల్పోయిన సందర్భాల్లో ప్రమాదం ఉందంటూ సంబంధిత వ్యవస్థకు తక్షణం హెచ్చరికల ద్వారా సమాచారాన్ని చేరవేస్తుంది. - రైలు బ్రేకు ఫెయిలైనప్పుడు కూడా ఈ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసి రైలును నిలిపివేయగలదు. హారన్ కొట్టాల్సిన చోట కొట్టకున్నా.. ఈ వ్యవస్థ తనంతట తానుగా ఆ పని చేస్తుంది. కొసమెరుపు: దేశీయంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేక చేతులెత్తేస్తున్న రైల్వే శాఖ, ఆ పరిజ్ఞానాన్ని విదేశాలకు విక్రయించేందుకు మాత్రం సిద్ధమని ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్ రైల్వేస్టేషన్.. -
ఆపత్కాలంలో అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం
-
బాలాసోర్ లో క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి అమర్నాథ్
-
ఒడిశా రైలు ప్రమాద ఘటన: ప్రపంచ నేతల దిగ్భ్రాంతి
లండన్/మాస్కో: దుర్ఘటనకు పలు ప్రపంచదేశాల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ఈ విషాద సమయంలో భారత్‌కు అండగా నిలుస్తామని భరోసానిస్తూ సంతాప సందేశాలు పంపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ‘మృతుల కుటుంబాల బాధను మేమూ పంచుకుంటాం. గాయాలపాలైన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అని టెలిగ్రామ్ ద్వారా ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సందేశం పంపారు. ‘విషాదంలో మునిగిన వారు, ప్రధాని మోదీ తరఫున మేం ప్రార్థనలు చేస్తున్నాం’ అంటూ రిషి సునాక్ ఒక ట్వీట్‌చేశారు. ‘ఒడిశా ప్రమాద ఘటనలో భారత్‌కు సంఘీభావంగా నిలుస్తున్నాం’ అని మాక్రాన్ ట్వీట్‌చేశారు. ప్రమాదంలో ఇంతటి ప్రాణనష్టం జరగడంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. జపాన్ ప్రధాని కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ (ప్రచండ) , పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, శ్రీలంక విదేశాంగ మంత్రి, భూటాన్ ప్రధాని షెరింగ్, ఇటలీ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసభ అధ్యక్షుడు కసాబా కొరొసో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ సానుభూతి సందేశాలు పంపించారు. -
వివిధ సంస్థలు.. బాధితులకు సేవలు
కొరాపుట్/భువనేశ్వర్: రైలు దుర్ఘటన జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వెంటనే బాలేశ్వర్, బద్రక్ జిల్లాల యువత స్పందించారు. ఎటువంటి పిలుపు లేకుండానే తమకు తాముగా సాయం అందించేందుకు ముందుకు కదిలారు. బద్రక్, బాలేశ్వర్ జిల్లా కేంద్రాల అస్ప త్రుల వద్దకు చేరుకొని, అవసరమైన క్షతగ్రాతులకు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు క్యూలోనే ఉండి రక్తదానం చేశారు. సుమారు వేయి మంది యువత రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలిచారు. సత్యసాయి భక్తుల సేవలు రైల్వే దుర్ఘటన జరిగిన వెంటనే సత్యసాయి భక్తుల సేవలు మొదలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సత్యసాయి సేవా సమితి అఖిల భారత సమన్వయకర్త నిమిష్ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. వారి సూచనతో సుమారు 70 మంది సత్యసాయి సేవాదళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము తెచ్చిన ట్రాక్టర్ల మీద క్షతగాత్రులు, మృతదేహాలను అస్పత్రులకు తరలించారు. వైద్య సిబ్బంది తగినంతమంది లేకపోవడంతో బాధితులకు తామే సపర్యలు చేసి, ప్రాథమిక చికిత్స అందజేశారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు అందించి, అందరి మన్ననలు పొందారు. 300 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ రైలు దుర్ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు అత్యంత వేగంగా అప్రమత్తం కావడంతో సుమారు 300 ప్రాణాలు నిలిచాయి. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో 9 బృందాలు రంగంలోకి దిగాయి. అత్యంత వేగంగా ప్రాణా పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 300 మందిని ఆస్పత్రులకు తరలించడంతో ప్రాణాపా యం తప్పింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పోలీసు జాగిలాలు తోడ్పాటునందించాయి. -
లూప్ లైనే యమపాశమైంది
న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: అనుమానమే నిజమైంది. లూప్‌లైనే మృత్యుపాశంగా మారింది. మెయిన్ లైన్లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్లైన్లోకి మళ్లడమే దేశమంతటినీ కుదిపేసిన మహా విషాదానికి దారితీసింది. లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును మహా వేగంతో ఢీకొట్టేందుకు, వందలాది మంది దుర్మరణం పాలయ్యేందుకు కారణమైంది. శుక్రవారం ఒడిశాలో మూడు రైళ్లు ఘోర ప్రమాదానికి గురైన పెను విపత్తుపై రైల్వే శాఖ జరిపిన ప్రాథమిక విచారణ ఈ మేరకు తేల్చింది. గూడ్సును ఢీకొన్న వేగానికి ఏకంగా 21 కోరమాండల్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. చెల్లాచెదురై పక్క ట్రాక్‌పై పడిపోయాయి. దానిపై వస్తున్న బెంగళూరు–హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొన్ని పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో కోరడమండల్ గంటలకు 128 కిలోమీటర్లు, హౌరా 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి! దాంతో జంట ప్రమాదాల తీవ్రత ధాటికి పలు బోగీలు తలకిందులయ్యాయి. ఒక ఇంజన్‌తో పాటు బోగీలకు బోగీలే గూడ్స్‌పైకి దూసుకెళ్లాయి. బహనగా బజార్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంపై ప్రాథమిక నివేదికను అధికారులు ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించారు. రైల్వే శాఖ ప్రమాద కారణాన్ని అధికారికంగా వెల్లడించలేదు. విద్రోహ కోణానికీ ఆధారలేవీ ఇప్పటిదాకా లేవని రైల్వే వర్గాలంటున్నాయి. మొత్తం ఉదంతంపై పూర్తిస్థాయి విచారణకు సౌత్ ఈస్టర్న్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ ఎ.ఎం.చౌదరి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. పౌర విమానయాన సంస్థ ఆధ్వర్యంలో పని చేసే రైల్వే సేఫ్టీ కమిషనర్ ఇలాంటి ప్రమాద ఘటనలను దర్యాప్తు చేస్తారు. లూప్‌లైన్ అంటే...? సులువుగా చెప్పాలంటే ఇవి రైల్వే స్టేషన్లలో ఉండే అదనపు రైల్వే లైన్లు. ఒకటికి మించిన ఇంజన్లతో కూడిన భారీ గూడ్సులకు కూడా సరిపోయేలా ఈ లూప్ లైన్లు సాధారణంగా కనీసం 750 మీటర్ల పొడవుంటాయి. ► కారణంపై తలో మాట... ప్రమాద కారణంపై తలో మాట వినిపిస్తున్నారు... ► ఇది కచ్చితంగా సిగ్నలింగ్ వైఫల్యమేనని కొందరంటున్నారు. ► రైల్వే శాఖ వర్గాలు మాత్రం కోరమండల్ నేరుగా లూప్లైన్లోకి వెళ్లి ఆగి ఉన్న గూడ్సును ఢీకొందా, లేక పట్టాలు తప్పి, ఆ క్రమంలో కొన్ని బోగీలు తలకిందులై, మిగతా రైలు లూప్లోన్లోకి మళ్లి గూడ్సును గుద్దిందా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. డ్రైవర్ల తప్పిదం కాదు ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే డ్రైవర్ల తప్పిదం ఏమీ లేనట్టే కనిపిస్తోందని చెన్నై ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ మాజీ జనరల్ మేనేజర్, తొలి వందేభారత్ రైలును రూపొందించిన బృందానికి సారథ్యం వహించిన సుధాన్షు మణి స్పష్టం చేశారు. ‘‘కేవలం ప్రయాణికుల రైలు పట్టాలు తప్పడం మాత్రమే జరిగి ఉంటే దానివన్నీ అత్యాధునిక లింక్ హాఫ్మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లే. అవి ఇలా తిరగబడిపోవడం జరగదు. ఇంతమంది దుర్మరణం పాలయ్యే అవకాశమే ఉండదు’’ అని వివరించారు. ‘‘ప్రమాద సమయంలో కోరమండల్‌కు అది వెళ్లిన లైన్‌పై గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టు డేటా లాగర్లో స్పష్టంగా ఉంది. అంటే డ్రైవర్ సిగ్నళ్లను ఉల్లంఘించడం వంటిదేమీ జరగలేదన్నది స్పష్టం’’ అని ఆయనన్నారు. అంతటి వేగంలో ప్రమాదాన్ని నివారించేందుకు రెండో రైలు (హౌరా) డ్రైవర్ చేయగలిగిందేమీ ఉండదని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు (ట్రాఫిక్) శ్రీప్రకాశ్ అభిప్రాయపడ్డారు. ప్రయాణికుల రైళ్లు వాటంతట అవి పట్టాలు తప్పడం చాలా అరుదని వివరించారు. ప్రమాద సమయంలో... కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటకు 128 కి.మీ. బెంగళూరు–హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటలకు 116 కి.మీ. గూడ్స్ లూప్ లైన్లో ఆగి ఉంది ప్రమాద సమయంలో రెండు రైళ్లలో ప్రయాణికులు 2,700 పై చిలుకు (కోరమాండల్‌లో 1257, హౌరాలో 1039 మంది రిజర్వ్డ్ ప్రయాణికులున్నారు. రెండింటి జనరల్ బోగీల్లో వందలాది మంది ఉంటారని రైల్వే వర్గాలు అధికారికంగానే వెల్లడించాయి) ప్రమాద ప్రాంత విస్తీర్ణం దాదాపు ఒక కిలోమీటర్ -
ఒడిశా రైలు ప్రమాదానికి ముందు ఏం జరిగింది?
ఒడిశా:ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 280 మంది ప్రాణాలు కోల్పోయారు. 900 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే.. ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందో తెలిపే 'రైల్ ట్రాఫిక్ ఛార్ట్' ను రైల్వే ట్రాఫిక్ అధికారులు విడుదల చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ఈ చిత్రంలో పేర్కొన్న విధంగా మూడు రైల్వే లైన్లు వరుసగా ఉన్నాయి. అందులో 'అప్ మెయిన్'గా చూపే రైల్ మార్గంలో షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. దానికి కుడి వైపున ఉన్న 'డౌన్ మెయిన్'లో బెంగళూరు-హవ్డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వెళ్లింది. 'అప్ మెయిన్'లో వెళ్లే కోరమండల్ క్రాసింగ్ పాయింట్ ఉండటంతో పొరపాటున కామన్ లూప్‌లోకి వెళ్లింది. అక్కడే ఉన్న గూడ్స్ రైలును బలంగా ఢీ కొట్టింది. దీంతో కోరమండల్‌లోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న డౌన్ మెయిన్ లైన్లోకి ఎగిరిపడ్డాయి. అదే సమయంలో వేగంగా క్రాస్ అవుతున్న బెంగళూరు-హవ్డా ఎక్స్‌ప్రెస్ రైలు వాటిని ఢీ కొట్టింది. దీంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగింది. అయితే.. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి:Odisha Train Accident: ఓ వైపు రైలు ప్రమాదం.. మరోవైపు.. బస్సు ఛార్జీల పెంపు..! -
ఒడిశా రైలు దుర్ఘటన .. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
'కన్న కొడుకు మృతదేహాన్ని చేతులతో మోస్తూ..' రైలు ప్రమాదంలో కన్నీటి గాథలెన్నో..
ఒడిశా:ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. అయినవారిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఆ మృతదేహాల ముందే విలపిస్తున్నారు. ఇంటి దగ్గర ఉన్నవారికి ఈ ఘటనను ఎలా తెలపాలో తెలియని దయనీయ స్థితిలో మరెందరో ఉన్నారు. తన చేతులతోనే కన్న కొడుకు మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లానని చెప్తూ ఓ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. సుగాలి చెన్నైలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నారు. ఈ రైలు ప్రమాదంలో సుగాలి పెద్ద కుమారుడు సుందర్‌తో పాటు బామ్మర్ధి దిలీప్ కూడా మరణించాడు. తన చిన్న కుమారుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. 'మేమంతా తొమ్మిది మందిమి చెన్నైకి బయలుదేరాము. డబుల్ డ్యూటీ చేస్తేనే నెలకు 17,000 సంపాదిస్తాను. ఊర్లో ఉపాది లేక నా కుమారులను కూడా ఏదైనా ఉద్యోగం చేపించాలని చెన్నైకి తీసుకువస్తున్నాను. కానీ మృత్యువు ప్రమాదం రూపంలో ఎదురైంది. నా కొడుకు మృతదేహాన్ని నా చేతులతోనే మోయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో బాధితులు కుప్పలుగా పడి ఉన్నారు.' అని సుగాలి కన్నీటి పర్యంతమయ్యారు. ఇదీ చదవండి:Odisha Train Accident: నిమిషాల వ్యవధిలోనే.. మూడు రైళ్లు.. తపసి సర్ధార్(22) హౌరా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో వ్యవసాయ కూలీగా ఏడు నెలలు పని చేసి ఇంటికి వెళుతున్న 11 మంది సభ్యుల్లో ఒకరు. ' అంతా గందరగోళం. అరుపులు, ఏడుపులు వినిపించాయి. నా తలకు ముఖంపై గాయాలయ్యాయి. ఇంకా నాలుగు గంటలైతే మా స్టాప్ వచ్చేది. అమ్మను కలిసేవాడిని.' అని విలపించాడు. గోపాల్ మిర్దా(40), అతని భార్య అంజు దేవి జార్ఖండ్ గడ్డా జిల్లాకు చెందినవారు. బెంగళూరులోని నర్సరీలో రెండు నెలలు పని చేసి ఇంటికి వెళుతున్నారు. ' నా కొడుకుని మా అమ్మే చూసుకుంటుంది. ఇటీవల ఆవిడ ఆరోగ్యం బాగుండట్లేదు. అందుకే ఇంటికి వెళ్లి వారిని చూసుకుందామనుకున్నాం. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. కాలుకు తలకు గాయాలయ్యాయి.' అని దుఖంతో చెప్పారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 900 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి:Odisha Train Accident: ఈ పాపం ఎవరిది?..ఇది సాంకేతిక సమస్య లేదా మానవ లోపమా?.. -
రైలు ప్రమాద ఘటనాస్థలాన్ని సందర్శిస్తున్న ప్రధాని మోదీ
-
రైలులో ప్రయాణిస్తున్నారా? దయచేసి ఇలా చేయకండి!