ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అనంతరం చాలామంది ప్రయాణికులు తమ కుటుంబాలకు దూరమయ్యారు. రైలు ప్రమాదంలో గాయపడిన నేపాల్‌కు చెందిన ఒక యువకుడు ఎట్టకేలకు తన తల్లిదండ్రులకు చేరవయ్యాడు.
ఆ బాలుడిని రామానంద్ పాశ్వాన్‌గా గుర్తించారు. ఈ యువకుడు కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీలో చికిత్సపొందుతున్నాడు. రామానంద్ తన ముగ్గురు బంధువులతోపాటు కోరమండల్‌లో ప్రయాణించాడు. మీడియాతో రామానంద్ తండ్రి మాట్లాడుతూ రామానంద్‌తో పాటు తమ ముగ్గురు బంధువులు కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారని, వారు ముగ్గురూ మృతిచెందగా, తమ కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు.
రైలు ప్రమాదం గురించి తెలియగానే తాను, తన భార్య నేపాల్ నుంచి వచ్చామని,ముందుగా మా ముగ్గురు బంధువుల మృతదేహాలను గుర్తించామన్నారు. తన కుమారుడిని టీవీలో చూసి గుర్తుపట్టి, ఎస్‌సీబీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నడని తెలుసుకుని వచ్చామన్నారు. రామానంద్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. కాగా ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment