ఒడిశాలో వందలాది ప్రాణలు బలిగొన్న మూడు రైళ్ల ప్రమాదం జరిగి ఇన్ని రోజులైన ఇంకా కొన్ని మృతదేహాలు మిగిలిపోయాయని, వాటిని గుర్తించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు తూర్ప మధ్య రైల్వే డివిజన్ రైల్వే మేనేజర్ రింకేశ్ రాయ్ మాట్లాడుతూ..ఈ ఘెర ప్రమాదంలో సుమారు 278 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యిమంది దాక గాయపడ్డారు.
ఐతే వారంతా ఒడిశాలోని వివిధ ఆస్పత్రులో చికిత్ప పొందారని, అందులో 900 మంది డిశ్చార్చ్ అయ్యినట్లు తెలిపారు. ఇంకా 200 మంది ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఐతే ప్రమాదంలో మరణించిన 278 మందిలో 101 మృతదేహాలు మిగిలిపోయాయని, వాటిని గుర్తించాల్సి ఉందన్నారు.
ఈ క్రమంలో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్ అమృత్ కులంగే మాట్లాడుతూ..భువనేశ్వర్‌లో ఉంచిన మొత్తం 193 మృతదేహాలలో 80 మృతదేహాలను గుర్తించామని, 55 మృతదేహాలను బంధువులకు అప్పగించామని చెప్పుకొచ్చారు. కాగా, వాతావరణం దృష్ట్యా మృతదేహాలు త్వరితగతిన పాడేపోవడంతో ఒకటి రెండు రోజులు మాత్రమే బాధితుల బంధువుల కోసం వేచి చూస్తామని అధికారులు చెప్పారు.
(చదవండి: కొడుకుని కాపాడాలని అంబులెన్స్‌తో వెళ్తే..శవాగారంలో ఉన్న కొడుకుని చూసి ఆ తండ్రి..)
Comments
Please login to add a commentAdd a comment