
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ దెబ్బకు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సర్కార్ కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆ శివసేన నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా సీఎం ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే.. ఇప్పటికే ట్విట్టర్ ఖాతాలో ఉన్న మంత్రి హోదాను తొలగించారు. ఇదిలా ఉండగా.. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం కేబినెట్ భేటి జరగనుంది. అలాగే, సాయంత్రం 5 గంటలకు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం ఉద్దవ్ థ్రాకే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
महाराष्ट्रातील राजकीय घडामोडींचा प्रवास विधान सभा बरखास्तीचया दिशेने..
— Sanjay Raut (@rautsanjay61) June 22, 2022