రాజకీయ పార్టీలకు భట్టి,జనారెడ్డి బహిరంగ లేఖ | Bhatti Vikramarka And Jana Reddy Open Letter To Political Parties | Sakshi
Sakshi News home page

రాజకీయ పార్టీలకు భట్టి,జనారెడ్డి బహిరంగ లేఖ

Published Wed, Mar 12 2025 7:15 PM | Last Updated on Wed, Mar 12 2025 8:41 PM

Bhatti Vikramarka And Jana Reddy Open Letter To Political Parties

రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖ రాశారు.

సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని..  ప్రతి పార్టీని ఆహ్వానిస్తామని తెలిపారు.

జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని.. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరుకావాలని  భట్టి విక్రమార్క, జానారెడ్డిలు సంయుక్తంగా బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని.. త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామని బహిరంగ లేఖ ద్వారా వారు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement