
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూప్-1 ఫలితాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని టీజీపీఎస్సీ డిమాండ్ చేసింది. లేదంటే పరువునష్టం, క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇకపై ఎటువంటి ఆరోపణలు చేయొద్దని రాకేశ్‌రెడ్డికి టీజీపీఎస్సీ హెచ్చరించింది.