rakesh reddy
-
‘తెలంగాణలో జనసేన, టీడీపీతో పొత్తు బీజేపీకే నష్టం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన, టీడీపీతో పొత్తు కడితే బీజేపీకి నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతుందన్నారు. ఇదే సమయంలో రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలకు పాత ఇనుప సామాను అంటే ఎవరో బాగా తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ సమావేశాల సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియాతో చిట్బాట్ మాట్లాడుతూ.. తెలంగాణలో కూటమి గురించి బీజేపీ హైకమాండ్ ఆలోచన చేయవద్దు. జనసేన, టీడీపీతో కలిసి వెళ్తే బీజేపీ నష్టం జరుగుతుంది. అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఇబ్బంది అవుతుంది. బీఆర్ఎస్ లాంటి పార్టీలకు లబ్ధి జరుగుతోంది. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతోందన్నారు.రాజాసింగ్ కామెంట్స్ స్పందిస్తూ..‘తెలంగాణ ప్రజలకు పాత ఇనుప సామాను అంటే అందరికీ తెలుసు. పార్టీ అంతర్గత వ్యవహారాలు వేదికలపై కాకుండా ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. రాజాసింగ్ తెలంగాణ బీజేపీకి ఆస్తి వంటి నాయకులు. ప్రధాని మోదీకి ఇక్కడ ఏం జరుగుతుందో పిన్ టూ పిన్ రిపోర్ట్ వెళ్తుంది. అధిష్ఠానం అంతా గమనిస్తోంది. పార్టీకి మంచి జరిగేది నలుగురిలో చెప్పాలి.. చెడు జరిగేది అధిష్ఠానం చెవిలో చెప్పాలి.పార్టీ ప్రెసిడెంట్‌గా ఈటల, అరవింద్, రామచందర్ రావు, డీకే అరుణ, రఘునందన్ రావు ఎవరో ఒకరు అవుతారు. అధ్యక్షుడితో పాటు ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు పెడితే బాగుంటుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేకంగా ఇంచార్జ్‌లను పెట్టాలి. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రక్షాళన చేస్తారని వినిపిస్తోంది. అదే జరిగితే కొండా సురేఖ, తుమ్మల, జూపల్లి మంత్రి పదవులు పోతాయి అంటున్నారు అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
‘తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇంకా దొరసాని అహంకారం తగ్గలేదని విమర్శించారు రాకేష్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన రాకేష్ రెడ్డి..‘దొరలు.. దొరసానికి ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు వచ్చింది. కవిత దొర అహంకారం మానుకో. కేసిఆర్..రేవంత్ రెడ్డి హిందూ ద్రోహులు. కుంభమేళాకు ఎందుకు పోలేదో చెప్పాలి. హిందువులను కేసీఆర్..రేవంత్ రెడ్డి అవమానించారు. అందుకే హిందువులు రెండు పార్టీలకు గుణపాఠం చెప్పారు’అని మండిపడ్డారు.కొన్నిరోజుల క్రితం సీఎం రేవంత్ పై రాకేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న కిషన్‌రెడ్డిడ్డికి సీఎం రేవంత్ రాసిన లేఖ దిక్కుమాలినదిగా అభివర్ణించారు రాకేశ్‌రెడ్డి. కిషన్‌రెడ్డిడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్ కు లేదంటూ ధ్వజమెత్తారు.‘ మూడు పార్టీలు మారి.. ఢిల్లీకి కప్పం కట్టి సీఎం కుర్చీ తెచ్చుకున్న వ్యక్తి రేవంత్. పుట్టినప్పుడే కాషాయ జెండాను ముద్దాడిన వ్యక్తి కిషన్‌రెడ్డి.కిషన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్‌కు లేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేసిన ఘనత కిషన్‌రెడ్డిది. నిజాయితీలో మచ్చలేని వ్యక్తి కిషన్‌రెడ్డిడ్డి. రానున్న ఎన్నికల్లో రేవంత్ కు గట్టి సమాధానం చెబుతాం. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ ఏ పార్టీలో ఉంటాడో తెలీదు. రాబార్ట్ వాద్రా కోసం మూసీ ప్రాజెక్టు చేపడితే మేమేందుకు నిధులిస్తాం. అవినీతి ప్రాజెక్టుల తప్ప, ప్రజలకు ఇచ్చిన ఒక్క హమీ కూడా నెరవేర్చడం లేదు. తెలంగాణకు నిధులిచ్చి ఆదుకుంటున్నది కేంద్ర ప్రభుత్వమే’ అని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి తెలిపారు -
‘వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీలో ఉంటాడో తెలీదు’
నిజామాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న కిషన్‌రెడ్డిడ్డికి సీఎం రేవంత్ రాసిన లేఖ దిక్కుమాలినదిగా అభివర్ణించారు రాకేశ్‌రెడ్డి. కిషన్‌రెడ్డిడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్ కు లేదంటూ ధ్వజమెత్తారు.‘ మూడు పార్టీలు మారి.. ఢిల్లీకి కప్పం కట్టి సీఎం కుర్చీ తెచ్చుకున్న వ్యక్తి రేవంత్. పుట్టినప్పుడే కాషాయ జెండాను ముద్దాడిన వ్యక్తి కిషన్‌రెడ్డి. కిషన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్‌కు లేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేసిన ఘనత కిషన్‌రెడ్డిది. నిజాయితీలో మచ్చలేని వ్యక్తి కిషన్‌రెడ్డిడ్డి. రానున్న ఎన్నికల్లో రేవంత్ కు గట్టి సమాధానం చెబుతాం. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ ఏ పార్టీలో ఉంటాడో తెలీదు. రాబార్ట్ వాద్రా కోసం మూసీ ప్రాజెక్టు చేపడితే మేమేందుకు నిధులిస్తాం. అవినీతి ప్రాజెక్టుల తప్ప, ప్రజలకు ఇచ్చిన ఒక్క హమీ కూడా నెరవేర్చడం లేదు. తెలంగాణకు నిధులిచ్చి ఆదుకుంటున్నది కేంద్ర ప్రభుత్వమే’ అని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి తెలిపారు రేవంత్ Vs కిషన్‌రెడ్డి.. బహిరంగ లేఖతో సీఎం కౌంటర్ -
'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. హైప్ విషయంలో తిరుగులేదు కానీ టికెట్ రేట్ల దగ్గరే పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఆర్మూర్ భాజపా ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇప్పుడు ఈ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)'పుష్ప సినిమాలో చూపించిందంతా అబద్ధం. ఎర్రచందనం లక్ష రూపాయలు ఉంటే కోటి రూపాయలు లాగా చూపించారు. దీంతో యూత్ చాలా చెట్లు నరికేశారు. ఇప్పుడు 'పుష్ప 2'కి ఇంకెన్ని నరికేస్తారో? సినిమా వల్ల యువత చెడిపోతోంది. అల్లు అర్జున్, సుకుమార్‌ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి' అని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాయి.ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ అయితే రెచ్చిపోతున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్య కథాంశంతో 'పుష్ప' సినిమాల్ని తీశారు. తొలి భాగం రిలీజైనప్పుడు పలు విమర్శలు వచ్చినప్పటికీ.. ఈ తరహాలో అదీ కూడా ఓ ఎమ్మెల్యే మాట్లాడటం ఇప్పుడు షాకింగ్‌గా ఉంది.(ఇదీ చదవండి: నిఖిల్‌ని ఓడించిన ప్రేరణ.. సారీ చెప్పిన గౌతమ్) -
పొట్టు పొట్టు తిట్టుకున్నరు
-
ఏపీ కాంగ్రెస్‌లో ముదురుతున్న వార్
సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్‌లో వార్ ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. షర్మిళ, మాణిక్యం ఠాకూర్ అవినీతికి పాల్పడ్డారని పద్మశ్రీ, రాకేష్‌రెడ్డి ఆరోపించారు. వాళ్లు చేసిన ఆరోపణలపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది.నోటిసులకు సమాధానం ఇచ్చిన పద్మశ్రీ, రాకేష్ రెడ్డి.. 20వ తేదీన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు షర్మిళ ప్రకటించారని తెలిపారు. అన్ని కమిటీలు రద్దు చేసినప్పుడు క్రమ శిక్షణ కమిటీ కూడా రద్దవుతుందని పద్మశ్రీ, రాకేష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. నోటీసులో పేర్కొన్న విధంగా వివరణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్న ఎవరికి ఇవ్వాలో అయోమయంలో ఉన్నామని నేతలు అంటున్నారు. తాను అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానాలు ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. -
రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి రెండోస్థానంలో నిలిచారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. రాకేశ్‌రెడ్డికి ధైర్యం చెప్పారు. ‘‘ రాకేశ్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలో మీరు సాధ్యమైనంతగా కష్టపడ్డారు. ఫలితాలు ఎప్పుడు కూడా ఆశించినట్లుగా ఉండవు. మీరు దృఢంగా, పాజిటివ్‌గా ఉండండి. ఇదే కష్టాన్ని కొనసాగిద్దాం’’అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.You did your best Rakesh. Results are not always in expected linesStay strong, positive and let’s continue to work hard https://t.co/M6Dkx5Sdnm— KTR (@KTRBRS) June 8, 2024అంతకుముందు రాకేశ్ రెడ్డి తనకు అవకాశమిచ్చిన కేసీఆర్‌కు, తనకు మద్దతుగా ఓటేసిన పట్టభద్రులకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. అందరి అంచనాలకు తగినట్లు భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. ఇప్పుడు మాత్రం అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమించాలన్నారు. పార్టీలోకి వచ్చిన అతితక్కువ సమయంలో తనను గుండెలకు అద్దుకున్న బీఆర్ఎస్ శ్రేణులకు, పార్టీలకు అతీతంగా తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని తెలిపారు.ధన్యవాదాలు 💐🙏వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు @KCRBRSPresident గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏ఈ ఎమ్మెల్సీ…— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) June 8, 2024 ఇక..వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన రాజీనామాతో జరిగిన ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతపండు నవీన్‌కుమార్ (తీన్మార్ మల్లన్న) విజయం సాధించారు. -
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా రాకపోయినప్పటికీ తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు ఉండడంతో ఆయన్నే విజేతగా ప్రకటించారు. గత నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరగ్గా, , నల్లగొండలో ఈ నెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మూడు రోజులపాటు నిరి్వరామంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. రెండోరోజు గురువారం రాత్రి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యతతో రాని మెజారిటీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికీ గెలుపు టార్గెట్ కోటా అయిన 1,55,095 ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో 3,36,013 ఓట్లు పోల్ కాగా, అందులో 3,10,189 ఓట్లు చెల్లుబాటు అయినట్టు అధికారులు ప్రకటించారు. 25,824 ఓట్లు చెల్లలేదు. చెల్లుబాటు అయిన ఓట్లలో సగానికిపైగా అంటే 1,55,095 ఓట్లు గెలుపునకు టార్గెట్ కోటాగా నిర్ణయించారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు 29,697 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులందరికి కలిపి 10,118 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో అత్యధికంగా ఓట్లు వచ్చిన మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి కంటే 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయినా గెలుపు కోటా 1,55,095 ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను గురువారం సాయంత్రం నుంచి లెక్కించారు. రెండు ప్రాధాన్యతలోనూ దక్కని కోటా ఓట్లు రెండో ప్రాధాన్యత ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేసి వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థులకు (ఓటర్లు రెండో ప్రాధాన్యతను ఎవరికి ఇచ్చారో వారికి) కలుపుతూ లెక్కించారు. 48 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,24,899 ఓట్లు , రాకేష్‌రెడ్డికి 1,0,5,524 ఓట్లు , ప్రేమేందర్‌రెడ్డికి 43,096 ఓట్లకు చేరుకున్నారు. అయినా గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో నాలుగోస్థానంలో ఉన్న స్వతంత్ర పాలకూరి అశోక్‌ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారో లెక్కించారు.అప్పటికీ గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాలేదు. దీంతో మూడోస్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయన ఓట్లు లెక్కించారు. అయినా కూడా గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన 52 మంది అభ్యర్థుల్లో 50మందిని ఎలిమినేట్ చేశారు. అందులో ముందుగా నిర్ణయించిన గెలుపు టార్గెట్ ఓట్లు తీన్మార్ మల్లన్న, రాకేశ్‌రెడ్డి లకు రాలేదు. ఎన్నికల సంఘం వివరణకు లేఖ రాసిన ఆర్ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపునకు అవసరమైన టార్గెట్ కోటా ఓట్లు (1,55,095) ఎవరికీ రాకపోవడం, మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించాలా? లేదంటే సమీప ప్రత్యర్థి రాకేశ్‌రెడ్డికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత టార్గెట్ రీచ్ అయ్యే వరకు వేచి ఉండాలా అని, ఎన్నికల సంఘానికి రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ రాశారు. శుక్రవారం అర్థరాత్రి దాటాక ఈసీ నుంచి అత్యధిక ఓట్లు పొందిన అభ్యరి్థని విజేతగా ప్రకటించాలని సమాచారం అందింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటిస్తూ ఆర్ఓ హరిచందన ధ్రువీకరణపత్రం అందజేశారు. -
అధికారులపై ఆరోపణలు సరికాదు
నల్లగొండ: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గట్టెకే పరి స్థితి లేక.. కౌంటింగ్ హా ల్ నుంచి ఉత్త చేతులతో పోవడం ఎందుకని, అధికారుల మీద మట్టిపోసి పోయే పనులు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. గురువారం నల్లగొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిలు ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై, జిల్లా అధికారులపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ ఎన్నికలో రూ.100 కోట్లు ఖర్చుపెట్టి గెలుపొందాలని చేసిన ప్రయత్నం..బోగస్ ఓట్లతో లబ్ధిపొందాలనే కుతంత్రం బెడిసి కొట్టడంతో ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు
నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి ఆరోపించారు. 3వ రౌండ్లో తనకు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అభ్యరి్థకి మెజారిటీ ఉందంటూ ప్రకటించారని, కౌంటింగ్‌పై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. నల్లగొండలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద రాకేష్‌రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ ఏకపక్షంగా చేస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండానే 3వ రౌండ్ లీడ్‌ను ప్రకటించారని చెప్పారు. రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. 3వ రౌండ్ ఫలితాలు అడిగితే బయటకు నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన గెలుపును అడ్డుకునే కుట్ర జరుగుతోందని, మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రౌండ్ ఫలితాలు ప్రకటించే విషయంలో కౌంటింగ్ ఏజెంట్లకు చూపించకుండా ఏకపక్షంగా ప్రకటిస్తున్నారని అన్నారు. అడిగితే అనుమానం నివృత్తి చేయడం లేదని, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తారుమారు జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు. -
ఇంకా తేలని ‘ఎమ్మెల్సీ’ ఫలితం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం రెండో ప్రాధాన్యత ఓట్లతోనే తేలనుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు (1,22,813) వచి్చనా, 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా.. గెలుపునకు సరిపడా ఓట్లు మాత్రం సాధించలేకపోయారు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు సాధించాల్సి ఉంది. దీంతో గురువారం రాత్రి 10 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. గెలుపెవరిదో? హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యతలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 18,565 మాత్రమే ఉంది. తీన్మార్ మల్లన్న గెలవాలంటే రెండో ప్రాధాన్యత ఓట్లలో 32,282 ఓట్లు సాధించాల్సి ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యతలో 1,04,248 ఓట్లు రాగా, ఆయన గెలవాలంటే 50,847 ఓట్లు రెండో ప్రాధాన్యతలో రావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు స్వంతంత్ర అభ్యర్థి అశోక్‌కు కూడా భారీగానే ఓట్లు లభించాయి. మొత్తం 52 మంది అభ్యర్థులలో ఈ నలుగురు అభ్యర్థులకు 3,00,071 ఓట్లు వచ్చాయి.మిగిలిన అభ్యర్థులందరికీ 10,118 ఓట్లు లభించాయి. ఇవన్నీ ఎలిమినేషన్లో క్రమంగా పోనున్నాయి. ఈ ఓట్లను లెక్కించినా గెలుపు టార్గెట్‌ను అభ్యర్థులు చేరుకునే అవకాశం లేదు. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు 29,697 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఆయన్ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించినా గెలుపు కష్టంగానే కనిపిస్తోంది. చివరగా బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తరువాతే ఫలితం వెల్లడి కానుంది. రెండు రోజులుగా కౌంటింగ్ ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం ఓట్లు 4,63,839 కాగా, 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు బ్యాలెట్ పత్రాలను బండిల్స్‌గా కట్టడానికే సరిపోయింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం రాత్రి 9 గంటలకు పూర్తయింది. ఆ తరువాత గెలుపునకు టార్గెట్ 1,55,096 ఓట్లుగా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత శుక్రవారం తుది ఫలితం తేలనుంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.నాలుగు హాళ్లలో 96 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో టేబుల్‌పై వేయి ఓట్ల చొప్పున గురువారం రాత్రి వరకు నాలుగు రౌండ్లలో 3,36,013 ఓట్లను లెక్కించారు. అందులో 3,10,189 ఓట్లు చెల్లినవిగా తేల్చారు. 25,824 చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఈ లెక్కింపు ఒకటో రౌండ్ ఫలితం బుధవారం రాత్రి 12:45 గంటలకు వెలువడగా, రెండో రౌండ్ ఫలితం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడైంది.మూడో రౌండ్ ఫలితం సాయంత్రం 5 గంటలకు వెల్లడించగా, 4వ రౌండ్ ఫలితం రాత్రి 9 గంటలకు వెల్లడైంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల రిటరి్నంగ్ అధికారి దాసరి హరిచందన నేతృత్వంలో సిబ్బందికి మూడు షిప్టులలో వి«ధులు కేటాయించి కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో గోల్ మాల్.. రాకేష్ రెడ్డి సీరియస్
సాక్షి, నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ తీరుపై బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో గోల్మాల్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రం వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. మూడో రౌండ్లో కాంగ్రెస్‌కు మూడు వేలు ఆధిక్యం వస్తే నాలుగు వేలకు పైగా ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారని ఆరోపించారు. తాము అభ్యంతరం చెప్పినా ఆర్వో పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మూడో రౌండ్ నుంచి అనుమానం ఉందని చెప్పినా కనీస స్పందన లేదని దుయ్యబట్టారు.ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తామని చెప్పారు రాకేష్ రెడ్డి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలని కోరారు. రిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అధికారుల తీరు ఫలితాలను తారుమారు చేసేలా ఉందన్నారు. తమ అభ్యంతరాలకు వివరణ ఇచ్చాకే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కంపు జరపాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. తాజాగా మూడో రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. మూడో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) లీడ్‌లో ఉన్నారు. ఆయనకు ఈ రౌండ్లో 4207 ఓట్ల ఆధిక్యత లభించింది.మూడు రౌండ్లు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న కాంగ్రెస్) 1,06,234.. రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్) 87,356.. ప్రేమేందర్ రెడ్డి( బీజేపీ) 34,516.. అశోక్ (స్వతంత్ర) 27,493 ఓట్లు పడ్డాయి. చెల్లిన ఓట్లు 2,64,216 కాగా చెల్లని ఓట్లు 15784గా ఉన్నాయి. ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్న 18878 ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి చేయగా. మరో 48013 ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. -
తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేడు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపిచాలని కోరుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారని, ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో విద్యాభ్యాసం చేశారని తెలిపారు. మేనేజ్మెంట్, ఎకనామిక్స్‌లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయన, అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసి.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారని పేర్కొన్నారు.‘అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డి.. సమకాలీన రాజకీయాంశాలపై, ఆర్థిక స్థితిగతులపై ప్రముఖ వార్తా పత్రికల్లో ఆర్టికల్స్ రాయడమే కాకుండా నవశకానికి నాంది, ప్రగతి రథ చక్రాలు, ఫిస్కల్ ఫెడరలిజం, ద డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తకాలను రచించారు.సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీపై గెస్ట్ లెక్చర్లు కూడా ఇచ్చారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే పేద విద్యార్థుల కోసం రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్ అనే ఫ్రీ కోచింగ్ యాప్‌ను రూపొందించి ఉచితంగా అందజేశారు. హన్మకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారు.టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొని, విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యల, హక్కులపై బలంగా గళం విప్పారు. కరోనా మహమ్మారి సమయంలో, వరంగల్‌లో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలిచి తన వంతు సహాయాన్ని అందించారు. ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఓరుగల్లులో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను, పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, మన జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారుకేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి.. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన చాయిస్. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్న రాకేష్ రెడ్డి గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. పట్టభద్రుల గొంతుకగా నిలుస్తారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు.ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మీ మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డి గారికే వేసి.. వారిని గెలిపించాలని కోరుతున్నాం’అని ట్వీట్లో పేర్కొన్నారు.✊ ఈరోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు💠 ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో… pic.twitter.com/V7KWVFSdpt— KTR (@KTRBRS) May 18, 2024 -
ఇక ‘పట్టభద్రుల’ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఈ నెల 27న జరిగే శాసనమండలి పట్టభద్రుల కోటా ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానం అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి కైవసం చేసుకోవడాన్ని బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ పోలింగ్ ముగిసిన వెంటనే రంగంలోకి దిగింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బుధవారం కీలక భేటీ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశంఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2027 ఏప్రిల్ వరకు అవకాశం ఉన్నా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 27న ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్‌కు కేవలం 12 రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ముమ్మర ప్రచారం నిర్వహించేలా కేటీఆర్ బుధవారం జరిగే భేటీలో దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచార, సమన్వయ బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ప్రచారాన్ని సమన్వయం చేస్తారు. మూడు జిల్లాల్లో సుమారు 4.61 లక్షల మంది పట్టభద్రులైన ఓటర్లు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు, మహిళలు కీలకం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలను లక్ష్యంగా చేసుకుని సాగించాల్సిన ప్రచారంపై బీఆర్ఎస్ వ్యూహాన్ని ఖరారు చేస్తోంది. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు గ్రామాలు, మండలాల వారీగా ఓటర్ల జాబితాను అందజేసి వారితో సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది.లోక్‌సభ పోలింగ్ సరళిపై సమీక్షరెండురోజుల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం కూడా సమీక్షించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్‌ను పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు పార్టీ నేతలు కలిశారు. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా పోలింగ్ సరళిపై ఈ సందర్భంగా ఆయన ఆరా తీశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపారనే కోణంలో చర్చ జరిగింది. కాగా మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమా కేసీఆర్ వ్యక్తం చేసినట్లు నేతలు వెల్లడించారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ‘వరంగల్– ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేరును పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఖరారు చేశారు. సుమారు అరడజను మంది బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశించినా రాకేశ్‌రెడ్డికి అవకాశం దక్కింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన రాకేశ్‌రెడ్డి.. బెంగళూరు, అమెరికాలలో వివిధ కార్పోరేట్ సంస్థల్లో పనిచేశారు. 2013లో బీజేపీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ కుదరకపోవడంతో బీఆర్ఎస్లో చేరారు. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం దక్కింది.పల్లా రాజీనామాతో ఉప ఎన్నికశాసన మండలి ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. దీనికి ఈ నెల 9వ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. బీఆర్ఎస్ నేతలు ఓ.నర్సింహారెడ్డి, డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, పల్లె రవికుమార్, సుందర్ రాజు తదితరులు ఎమ్మెల్సీ టికెట్ ఆశించినా.. రాకేశ్‌రెడ్డికి దక్కింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో 4.61 లక్షల మంది పట్టభద్రులు ఈ ఎన్నికలో ఓటేయనున్నారు. -
బీఆర్ఎస్లోకి రాకేశ్‌రెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కష్టపడి సాధించుకున్న తెలంగాణను మనమే పాలించుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకం అందని ఇల్లు లేదని, ముఖ్యమంత్రిని తమ ఇంటి పెద్దగా యువత భావిస్తోందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు ఏనుగు రాకేశ్‌రెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్ తదితరులు శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు, నీళ్లు వంటి కనీస అవసరాలు కూడా తీర్చలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వరంగల్‌లో మెట్రోను పరుగులు పెట్టిస్తామని కేటీఆర్ హామీఇచ్చారు. రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ అయితే, భవిష్యత్ తెలంగాణ నిర్మాత కేటీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించేందుకు తమ వంతు కృషి చేస్తామని పార్టీలో చేరిన నేతలు ప్రకటించారు. -
రాజ్యంకోసం మహిళ పోరాటం
మోనికా రెడ్డి ప్రధాన పాత్రలో రాకేష్ రెడ్డి యాస దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయింది. సుధ క్రియేషన్స్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అంజిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, షేడ్స్ స్టూడియో ఫౌండర్ దేవీ ప్రసాద్ బలివాడ క్లాప్ ఇచ్చారు. మోనికా రెడ్డి మాట్లాడుతూ– ‘‘పీరియాడిక్ మైథలాజికల్‌గా రూపొందనున్న చిత్రమిది. కథ అంతా నా పాత్ర చుట్టూ తిరుగుతుంది’’ అన్నారు. ‘‘రాజ్యం కోసం ఓ మహిళ ధైర్యసాహసాలతో ఎలా పోరాడింది? అన్నదే ఈ చిత్రం కథాంశం’’ అన్నారు రాకేష్ రెడ్డి యాస. ‘‘నయనతార, అనుష్కగార్లలా మోనికకు మంచి పేరు రావాలి’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భాస్కర్ రెడ్డి. -
మా రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి
-
మారుతున్న సమీకరణలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో కీలకమైన ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ సమీకరణలు మారుతున్నాయి. అంకాపూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త, నైన్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పైడి రాకేష్‌రెడ్డి గురువారం ఢిల్లీలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో పార్టీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్‌ఛుగ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాకేష్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి రేవతిరెడ్డి, కుమార్తె సుచరితరెడ్డి, నియోజకవర్గ నాయకురాలు విజయభారతి ఉన్నారు. పార్టీ కండువా కప్పుకున్న వెంటనే రాకేష్‌రెడ్డి తన ఉద్దేశాన్ని చాటిన తీరు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆర్మూర్ నియోజకవర్గంలో సామాన్యులను బెదిరింపులకు గురిచేస్తూ, బ్లాక్మెయిల్ చేసే తరహా రాజకీయాలకు చరమగీతం పాడే ఉద్దేశంతోనే తాను బీజేపీలో చేరినట్లు చెప్పడం విశేషం. టిప్పర్లతో గుద్ది చంపే తరహా హత్యారాజకీయాలకు తెరదించేందుకే వస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి కానీ బ్లాక్‌మెయిల్‌కు గురిచేసే వ్యవహారాలు కాదన్నారు. అన్ని వర్గాల పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధిస్తే ఒక్క కుటుంబమే లాభం పొందిందన్నారు. పేదలకు మేలు చేసేందుకే బీజేపీలో చేరానన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆదర్శంగా తీసుకుని ముందుకెళతానన్నారు. ఇప్పటికే పేదలకు ఒక్క రూపాయికే కార్పొరేట్ వైద్యం అందిస్తున్నానన్నారు. ఆపదలో ఉన్నవారికి పైడి రాకేశ్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా, ఇతర అన్ని రకాలుగా సహాయం చేస్తున్నామన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో తన ముద్ర వేసుకుంటానన్నారు. ఇప్పటికే ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారన్నారు. రాకేశ్‌రెడ్డి రూ పంలో ఓ కరుడుగట్టిన, కమిట్మెంట్తో కూడిన కార్యకర్తలాగా తనను బీజేపీ పంపుతోందన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ ఆర్మూర్‌లో ఫ్యా క్షన్ రాజకీయాలను కూకటి వేళ్లతో పెకిలిస్తానన్నా రు. గత కొన్నేళ్లుగా పుట్టిన ఊరికి, చుట్టుపక్కల గ్రా మాలకు నిరంతరం సేవ చేస్తున్నానన్నారు. ప్రస్తు తం ఆర్మూర్ నియోజకవర్గంలో హత్యలు, అక్ర మాలు, కబ్జాలు నడుస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి లక్ష్యంగా.. రాకేష్‌రెడ్డి ప్రకటనలు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని లక్ష్యంగా చేస్తుండగా, ఇప్పటికే అందుకు అవసరమైన కార్యాచరణ అమలు చేస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో అందుకు తగినవిధంగా ప్రణాళికలు తయారు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. కల్లెడ సర్పంచ్ దంపతులు లావణ్య, ప్రసాద్‌గౌడ్‌లను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కుట్ర చేసి కేసుల్లో ఇరికించినట్లు ఆరోపణలు, అదేవిధంగా నందిపేట సర్పంచ్ దంపతులు కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం చేసిన విషయమై ఇప్పటికే నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలను రాకేష్‌రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. లక్కంపల్లి మాజీ సర్పంచ్, ప్రస్తుత ఉపసర్పంచ్‌లను హతమార్చేందుకు ఆ గ్రామ సర్పంచ్ భర్త మహేందర్ సుపారీ ఇచ్చిన విషయమై జిల్లాలో సంచలనమైంది. ఎమ్మెల్యే ఇలాంటి వాళ్లను వెనకేసుకురావడం పట్ల రాకేష్‌రెడ్డి ప్రస్తావించారు.రాకేష్‌రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రతిఒక్కరితో కలిసేలా ప్లాన్ చేసుకోగా, స్థానిక ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతుండడంతో సమీకరణలు మారనున్నట్లు వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పకడ్బందీగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్‌కు షాక్.. రేవంత్‌పై ఆరోపణలతో బీజేపీలో చేరిక
సాక్షి, న్యూఢిల్లీ: కేసీఆర్ కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కేసీఆర్ చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గుర్తుమీద గెలిచినవాళ్లు కేసీఆర్ పంచన చేరి అసెంబ్లీలో కూర్చుంటున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్త పైడి రాకేష్‌రెడ్డికి తన నివాసంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో తరుణ్‌ఛుగ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ, తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని, కేసీఆర్ అవినీతిపాలనను మోదీ నేతృత్వంలో అంతమొందిస్తామన్నారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో బీజేపీ ప్రజల సంపూర్ణ మద్దతుతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కవిత కేసీఆర్ మాట వినకుండా.. ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ, కవిత కేసీఆర్ మాట వినకుండా నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని.. మెదక్‌కు పారిపోవద్దని కోరారు. కేసీఆర్ ఆమెను మెదక్ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఒక బీమారి అయితే దానికి వాక్సిన్ బీజేపీ అని వ్యాఖ్యానించారు. కర్నాటకలో ఫలితాలు, తెలంగాణలో ఏ మాత్రం ప్రభావం చూపించవని.. పక్క ఇంట్లో బిర్యానీ వండితే మన కడుపు నిండుతుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అర్వింద్ చెప్పారు రౌడీల రాజ్యంలా రాష్ట్రం: రాకేష్‌రెడ్డి అమరవీరుల త్యాగాల తెలంగాణ ఇది కాదని, రౌడీల రాజ్యంలా రాష్ట్రం ఉందని బీజేపీలో చేరిన పారిశ్రామికవేత్త పైడి రాకే‹Ùరెడ్డి మండిపడ్డారు. మోదీ నాయకత్వం నచ్చే బీజేపీలో చేరానని, కార్యకర్తగా ఉంటూనే పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చినా మోసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అన్యాయాలు, అక్రమాలు ఎదుర్కొంటామని, టిప్పర్లను అడ్డుకోవడమే తన కర్తవ్యమని తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం ఇది: సీఎం కేసీఆర్ -
రాజకీయ అరంగేట్రం చేయనున్న అంకాపూర్ రాకేష్ రెడ్డి
-
బీజేపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
-
నాంపల్లి కోర్టు సంచలన తీర్పు..రాకేష్‌రెడ్డికి జీవిత ఖైదు!
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక వేత్త చిగురుపాటి జైరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చిన నాంపల్లి కోర్టు... తాజాగా అతనికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని నాంపల్లి కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కాగా.. 2019 జనవరి 31న జయరాం దారణహత్యకు గురైన సంగతి తెలిసింది. ఆయనను రాకేష్ రెడ్డి హత్య చేసి.. తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే చివరికి నాలుగేళ్లుగా విచారణ తరువాత ఈ కేసులో న్యాయస్థానం 11 మంది నిందితులపై కేసు కొట్టివేయడంతో పాటు రాకేష్ రెడ్డిని దోషిగా పరిగణిస్తూ అతనికి శిక్ష ఖరారు చేసింది. -
పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు.. రాకేష్‌రెడ్డిని దోషిగా తేల్చిన కోర్టు..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చింది. ఈనెల 9న శిక్షను ఖరారు చేయనుంది. 2019 జనవరి 31న జయరాం దారణహత్యకు గురయ్యారు. ఈయనను హత్య చేసిన రాకేష్ రెడ్డి.. తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. జయరాం మృతదేహాన్ని విజయవాడలోని నందిగామ రహదారిపై వాహనంలో ఉంచారు. నాలుగేళ్లుగా విచారణ సాగుతున్న ఈ కేసులో 11 మంది నిందితులపై కేసు కొట్టివేసింది న్యాయస్థానం. రాకేష్ రెడ్డే కుట్ర చేసి జయరాంను హత్యచేసినట్లు నిర్ధరించి అతడ్ని దోషిగా తేల్చింది. ఏసీపీ మల్లారెడ్డితో పాటు మరో ఇద్దరు సీఐలను నిర్దోషులుగా ప్రకటించింది. మొత్తం 73 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ -
'దామిని విల్లా' సినిమా స్టిల్స్
-
‘అర్జున్ రెడ్డి’ని మించేలా!
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన నిర్మాత రాకేష్ రెడ్డి మరో సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రకటన తిరుమల నుంచి చేశారు. రచయిత చిన్న కృష్ణ ఈ సినిమాకు కథ అందిస్తున్నట్టుగా తెలిపారు. అర్జున్ రెడ్డిని మించే కథను చిన్న కృష్ణ అందించినట్టుగా తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న రాకేష్ రెడ్డి, వచ్చేనెలలో హీరో, దర్శకులను ప్రకటిస్తామన్నారు. గురువారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రాకేష్ రెడ్డి, చిన్నికృష్ణలు ఈ ప్రకటన చేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో రాకేష్ రెడ్డి ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్లు కూడా భారీగా రావటంతో తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. -
త్వరలో కేసీఆర్, జయలిలత బయోపిక్‌లు
సాక్షి బెంగళూరు: ‘రామ్‌గోపాల్‌వర్మ ఉన్నది ఉన్నట్లుగా సినిమాల్లో చూపించే వ్యక్తి. సినిమాల్లో వాస్తవాలు చూపించడంలో తనకు తానే సాటి. త్వరలోనే కేసీఆర్, జయలలిత జీవిత చరిత్రల ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో సినిమాలు సిద్ధం చేస్తాం’ అని లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి అన్నారు. ప్రేక్షకులు ఆనందంతో ఇంటికి వెళ్లాలి.. కానీ అసంతృప్తిగా కాదని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన రాకేశ్‌రెడ్డి వ్యాపార రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. పలమనేరు నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా పని చేశారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ వ్యాపారాల్లో ఉన్నారు. రెండు పడవల ప్రయాణం వద్దని వ్యాపారాల మీద దృష్టిపెట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. వివరాలు.. చిన్ననాటి నుంచే ఆసక్తి ♦ బాల్యం నుంచి సినిమాలపై ఆసక్తి ఉంది. ఆరంభంలోనే అదిరిపోయే సినిమా నిర్మించాలని భావించాను. ఈ క్రమంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా వాస్తవాలను జనాలను చూపిస్తే బాగుంటుంది అనిపించింది. ఫలితంగా పాత పరిచయాల నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మతో కలిసి లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ గురించి చర్చించాం. వాస్తవాలను తెరకెక్కించాలంటే రామ్‌గోపాల్‌వర్మతోనే సాధ్యం. ♦ నిర్మాతలతో చాలా చక్కగా ప్రవర్తించే వ్యక్తి రామ్‌గోపాల్‌వర్మ. నిర్మాతల బాధలను అర్థం చేసుకునే వ్యక్తి వర్మ. మా బ్యానర్లో వచ్చే మరో రెండు సినిమాలు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలోనే కొనసాగిస్తాం. తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత కథలను ఎంచుకున్నాం. ♦ ట్రైలర్ విడుదల సమయంలోనే ఆదరించారు. బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో.. అదే తరహాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా హైప్ క్రియేట్ అయింది. ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. -
బీజేపీ గెలుపును జీర్ణించుకోలేని టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపును టీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి అన్నారు. నాలుగు ఎంపీ స్థానాలను బీజేపీ గెలిచిందని, అయితే దీనిపై కేటీఆర్ విడ్డూరంగా మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు స్పీడ్ బ్రేకర్ అంటున్నారని, కానీ అది స్పీడ్ బ్రేకర్ కాదని, కారుకు యాక్సిడెంట్ అయిందన్నారు. ఓటమి నుంచి గుణపాఠం బీజేపీ నేర్చుకుంది కాబట్టే 300కు పైగా ఎంపీ సీట్లు గెలిచిందని తెలిపారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడ్రసే గల్లంతైందన్నారు. కాంగ్రెస్ నాయకులు నాలుగైదు వేల ఓట్లతో గెలిస్తే బీజేపీ నాయకులు భారీ మెజారిటీతో గెలిచారని తెలిపారు. రాష్ట్రాన్ని త్వరలో కాషాయ వర్ణంగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ చెల్లని రూపాయి కాదని, బీజేపీ ఎప్పుడైనా ఎక్కడైనా చెల్లుతుందని పేర్కొన్నారు. కేటీఆర్ ట్విట్టర్ లీడర్‌గా వెలుగొందుతున్నారే తప్ప.. ప్రజల లీడర్‌గా లేరని ఎద్దేవా చేశారు. -
తెలంగాణలో ఆర్థిక సంక్షోభం:రాకేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిపోయిందని, ఈ విషయాన్ని చర్చించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం కట్టాల్సిన బకాయిలే రూ.35 వేల కోట్లకు అంటే రికార్డు స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. భగీరథలోనే రూ.10 వేల కోట్ల బకాయిలున్నాయని, ఇక ఇరిగేషన్ శాఖలో మరొక రూ.10 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయి ఉన్నట్లు చెప్పారు. ‘ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఆర్థిక పరిస్థితి మీద వివరణ ఇవ్వాలి. దీన్ని సరిచేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి’ అని రాకేశ్ డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితిపై అఖిలపక్షం: చాడ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి చేసిన ప్రకటన వాస్తవాలను కప్పిపుచ్చేదిగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి అవాస్తవ ప్రకటనను తమ పార్టీ ఖండిస్తోందని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్థికస్థితి గురించి పారదర్శకంగా వ్యవహరించాలి అనుకుంటే ఆర్థిక నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తే ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు పనులను ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలకు గౌరవ వేతనాలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని చాడ డిమాండ్ చేశారు. -
వర్మ ప్రెస్‌మీట్ నిరాకరణపై నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను మీడియా సమావేశం ని ర్వహించకుండా అడ్డుకోవడంపై ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, విజయవాడ పోలీస్ కమి షనర్, విజయవాడలోని ఐలాపురం, నోవాటెల్ హోటళ్ల జనరల్ మేనేజర్లకు భారత ప్రెస్‌కౌన్సి ల్ (పీసీఐ) నోటీసులు జారీ చేసింది. 15 రోజు ల్లోగా దీనిపై రాతపూర్వక సమాధానమివ్వాల ని పీసీఐ కార్యదర్శి అనుపమా భట్నాటర్ ఆదేశించారు. గత నెల 26న విజయవాడలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్‌రెడ్డి తదితరులను మీడియా సమావేశం నిర్వహించకుండా అడ్డుకోవడంపై ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజే యూ) సీనియర్ నాయకుడు, పీసీఐ మాజీ సభ్యుడు కె.అమర్నాథ్ పీసీఐకి ఫిర్యాదు చేశారు. పీసీఐ చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించినట్లు కార్య దర్శి అనుపమా తెలియజేశారన్నారు. ఇది భా వప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కల్పించడంతో పాటు ముందుస్తు సెన్సార్ షిప్ (ప్రీ సెన్సార్ షిప్) విధించినట్టుగా భావించాల్సి ఉంటుంద ని నోటీసుల్లో పీసీఐ పేర్కొన్నట్లు అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి దర్శకుడు, నిర్మాతలు మీడియా సమావేశం నిర్వహించకుండా అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికార పార్టీ, పోలీసుల ఒత్తిళ్ల కారణంగానే మీడియా సమావేశం నిర్వహించేందుకు హాలు బుక్ చేయడానికి కూడా రెండు హోటళ్లు నిరాకరించాయని అమర్నాథ్ తెలిపారు. -
ఏడాది పాటు జైల్లోనే రాకేష్ రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. జయరాం హత్యతోపాటు నగరంలో గత మూడేళ్లుగా బెదిరింపులు, భూకబ్జాలకు పాల్పడటంతో జూబ్లీహిల్స్ పోలీసులు పీడీయాక్ట్ అమలు చేశారు. పీడీ యాక్ట్‌కు సంబంధించి అన్ని కేసుల వివరాలు, శాస్త్రీయ ఆధారాలు ప్రతిపాదిత నివేదికలో జతపర్చారు. ఇటీవలే రాకేశ్‌రెడ్డితోపాటు మరో ఏడుగురు నిందితులపై పోలీసులు నాంపల్లిలోని 17వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 70 మంది సాక్షులను విచారించిన పోలీసులు 388 పేజీల చార్జిషీట్ రూపొందించారు. శాస్త్రీయ ఆధారాలతోపాటు ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి సేకరించిన రిపోర్టును కూడా చార్జిషీట్‌తోపాటు జతపర్చారు. రాకేశ్‌రెడ్డితోపాటు ఆధారాలు తారుమారు చేసేందుకు సహకరించిన ఆయన అనుచరులు శ్రీనివాస్, సినీ నటుడు సూర్యప్రసాద్, కిషోర్, విశాల్, నాగేశ్, అంజిరెడ్డి, సుభాష్‌రెడ్డిలపై చార్జిషీట్ దాఖలైంది. ఈ ఏడాది జనవరి 30న చిగురుపాటి జయరాంను జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి హనీట్రాప్ చేసిన రాకేశ్‌రెడ్డి రోడ్ నం.10లోని తన ఇంటికి రప్పించి 31వ తేదీన ఉదయం 11.30 గంటలకు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆధారాలు తారుమారు చేసి ప్రమాదవశాత్తు మరణించినట్లుగా చిత్రీకరించే నిమిత్తం ముగ్గురు పోలీసు అధికారుల సలహాలు తీసుకొని జయరాం కారులోనే హైదరాబాద్ నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరి అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో నందిగామ శివార్లకు చేరుకున్నాడు. మృతదేహాన్ని అక్కడే పడేసి బస్సులో అదే రాత్రి జూబ్లీహిల్స్‌కు వచ్చి ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం కుత్బుల్లాపూర్ చింతల్‌లోని తన ఇంటికి వెళ్లాడు. పక్కా ఆధారాలు సేకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డిని ఫిబ్రవరి 7న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసులో మరింత సమాచారం, పురోగతి కోసం ఫిబ్రవరి 13 నుంచి 26వ తేదీ వరకు రాకేశ్‌రెడ్డిని కస్టడీకి తీసుకొని సమాచారాన్ని క్రోడీకరించారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాకేష్ రెడ్డిపై పీడీయాక్ట్ నమోదుతో మరో ఏడాదిపాటూ జైల్లోనే ఉండనున్నాడు. -
బీఎన్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం
బంజారాహిల్స్: ప్రవాసాంధ్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగించడమే కాకుండా జయరాంతో సెటిల్మెంట్ చేసుకునేందుకు పలుమార్లు రాకేష్‌రెడ్డి నివాసానికి వెళ్లిన మాజీ టీడీపీ నేత బీఎన్ రెడ్డి అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే బీఎన్ రెడ్డి పేరుతో రాకేష్‌రెడ్డిపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో జూబ్లీహిల్స్ పోలీసులు నమోదు చేశారు. జనవరి 31న జయరాం జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని రాకేష్‌రెడ్డి నివాసంలో హత్యకు గురైన విషయం విదితమే. అంతకుముందు రెండు రోజులు బీఎన్ రెడ్డి అక్కడికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య జరిగిన రోజు ఉదయం కూడా బీఎన్ రెడ్డి ఆ ఇంటికి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు అతడిని దర్యాప్తు అధికారి, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తన కార్యాలయంలో విచారించారు. ఇప్పటికే బీఎన్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. చార్జిషీట్లో బీఎన్ రెడ్డి పేరును చేర్చిన నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాకేష్‌రెడ్డితో సెటిల్మెంట్ చేసుకోవాల్సిందిగా జయరాంపై ఒత్తిడి తేవాలని హత్యకు కొద్ది రోజుల ముందు రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు బీఎన్ రెడ్డి నిందితుడు రాకేష్‌రెడ్డిని తీసుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా బీఎన్ రెడ్డి గత నెలలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. -
కిల్లర్ రాకేష్ రెడ్డే!
-
రాకేశే హంతకుడు
సాక్షి,హైదరాబాద్: ప్రవాసాంధ్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు కె.రాకేశ్‌రెడ్డితోపాటు మరో ఏడుగురు నిందితులపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లిలోని 17వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 70 మంది సాక్షులను విచారించిన పోలీసులు 388 పేజీల చార్జిషీట్ రూపొందించారు. శాస్త్రీయ ఆధారాలతోపాటు ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి సేకరించిన రిపోర్టును కూడా చార్జిషీట్‌తోపాటు జతపర్చారు. రాకేశ్‌రెడ్డితోపాటు ఆధారాలు తారుమారు చేసేందుకు సహకరించిన ఆయన అనుచరులు శ్రీనివాస్, సినీ నటుడు సూర్యప్రసాద్, కిషోర్, విశాల్, నాగేశ్, అంజిరెడ్డి, సుభాష్‌రెడ్డిలపై చార్జిషీట్ దాఖలైంది. ఈ ఏడాది జనవరి 30న చిగురుపాటి జయరాంను జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి హనీట్రాప్ చేసిన రాకేశ్‌రెడ్డి రోడ్ నం.10లోని తన ఇంటికి రప్పించి 31వ తేదీన ఉదయం 11.30 గంటలకు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆధారాలు తారుమారు చేసి ప్రమాదవశాత్తు మరణించినట్లుగా చిత్రీకరించే నిమిత్తం ముగ్గురు పోలీసు అధికారుల సలహాలు తీసుకొని జయరాం కారులోనే హైదరాబాద్ నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరి అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో నందిగామ శివార్లకు చేరుకున్నాడు. మృతదేహాన్ని అక్కడే పడేసి బస్సులో అదే రాత్రి జూబ్లీహిల్స్‌కు వచ్చి ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం కుత్బుల్లాపూర్ చింతల్‌లోని తన ఇంటికి వెళ్లాడు. పక్కా ఆధారాలు సేకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డిని ఫిబ్రవరి 7న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసులో మరింత సమాచారం, పురోగతి కోసం ఫిబ్రవరి 13 నుంచి 26వ తేదీ వరకు రాకేశ్‌రెడ్డిని కస్టడీకి తీసుకొని సమాచారాన్ని క్రోడీకరించారు. ప్రస్తుతం రాకేశ్‌రెడ్డితోపాటు మిగతా ఏడుగురు నిందితులు జైలులో ఉన్నారు. వీరిపై అదనపు చార్జిషీట్ దాఖలు చేయడం ద్వారా పోలీసులు కేసును పటిష్టం చేసే దిశలో ఉన్నారు. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకుడి పేరును కూడా అదనపు చార్జ్‌షీటులో చేర్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ కేసులో తీవ్ర వివాదాస్పదమైన రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పోలీసు అధికారుల పేర్లు తొలి చార్జిషీట్లో చేర్చలేదని సమాచారం. రాకేశ్‌పై పీడీ అస్త్రం.. జయరాం హత్యతోపాటు నగరంలో గత మూడేళ్లుగా బెదిరింపులు, భూకబ్జాలకు పాల్పడుతూ రౌడీయిజంతో రెచ్చిపోతున్న రాకేశ్‌రెడ్డిపై పీడీ అస్త్రం ప్రయోగించేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు కమిటీకి నివేదిక అందజేశారు. పీడీ యాక్ట్‌కు సంబంధించి అన్ని కేసుల వివరాలు, శాస్త్రీయ ఆధారాలు ప్రతిపాదిత నివేదికలో జతపర్చారు. -
లక్ష్మీస్ ఎన్టీఆర్.. రేపే విడుదల
తిరుపతి తుడా /సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చనిపోయేముందు, చివరి జీవితంతో చోటు చేసుకున్న ఒడిదుడుకుల సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రాష్ట్రంలో మే 1న బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి పూజలు నిర్వహించి పలమనేరులోని మంజునాథ థియేటర్లో బుధవారం ఉదయం 9.47 గంటలకు చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్ర దర్శకులు రామ్‌గోపాల్ వర్మ, నటీ నటులు హాజరుకానున్నారని నిర్మాత రాకేష్‌రెడ్డి సాక్షికి తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల అయితే ఎన్నికల్లో తమకు తీవ్ర నష్టం కలుగుతుందని భావించిన టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించగా ఎన్నికల వరకు చిత్రాన్ని ఏపీలో విడుదల చేయరాదని న్యాయస్థానం ఆదేశాలు జరీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలింగ్ ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా మే 1న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి నిర్ణయించారు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌కు దగ్గరకావడానికి గల కారణాలు, రాజకీయంగా నమ్మిన వారే ఆయనను మోసం చేయడం, పార్టీని లాక్కుని వెన్నుపోటు పొడవడంతో మానసిక బాధతో ఆయన అనారోగ్యం పాలవ్వడం, మృతి చెందే సమయంలో ఆయన పడ్డ క్షోభను రామ్‌గోపాల్ వర్మ ఈ చిత్రంలో చక్కగా తెరకెక్కించారు. భావవ్యక్తీకరణకు అడ్డుపడిన ఆపద్ధర్మ సీఎం : విజయచందర్ విజయవాడలో రామ్‌గోపాల్‌వర్మ విలేకరుల సమావేశం పెట్టకుండా ఎందుకు అడ్డుకున్నారు, ఆయన చేసిన తప్పేమిటి? అని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచార విభాగం ఏపీ సమన్వయకర్త టీఎస్ విజయచందర్ ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకూడదా... మరి సెన్సార్ బోర్డు ఉన్నదెందుకు? అని నిలదీశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రాష్ట్రంలో చంద్రబాబునాయుడు కాల రాస్తున్నారని, భావవ్యక్తీకరణకు కూడా అడ్డుపడుతున్నారని ఆక్షేపించారు. రాంగోపాల్‌వర్మను అడ్డుకున్న విధంగానే భవిష్యత్‌లో చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ను ఏపీలోకి రాకుండా అడ్డుకోవచ్చా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సినీ డైరెక్టర్ విజయవాడలో ప్రెస్ మీట్ కూడా పెట్టలేని పరిస్థితులలో మన ప్రజాస్వామ్యం ఉందని ఆవేదన చెందారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సెన్సారు బోర్డు క్లీన్ చిట్ ఇచ్చిందని, ఎన్నికల సంఘంతో పాటు కోర్టులు కూడా అనుమతి ఇచ్చాయని గుర్తు చేశారు. మరి అలాంటి చిత్రానికి చంద్రబాబు అడ్డుపడటం దేనికి? అని నిలదీశారు. చంద్రబాబు వ్యవహారాలు చూస్తుంటే ఆయన మనో నిబ్బరం కోల్పోయినట్లు కనిపిస్తోందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ పాలన కావాలని ప్రజలంతా భావిస్తున్నారని, మే 23న వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలవబోతోందని తెలిపారు. రాంగోపాల్ వర్మను అడ్డుకోవడం తగదు: సీపీఎం మధు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించకుండా పోలీసులు అడ్డుకోవడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. సినిమాపై సెన్సార్ బోర్డు, న్యాయస్థానాలు ఆంక్షలను విధించలేదని అయినా శాంతి భద్రతలు, ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి పోలీసులు ఆయన్ను అడ్డుకోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. చంద్రబాబు గారూ...! రాంగోపాల్‌వర్మ చేసిన తప్పేంటి...? ట్విట్టర్లో ప్రశ్నించిన వైఎస్ జగన్ సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: విజయవాడలో విలేకరుల సమావేశం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉందని, పోలీసులను బంట్రోతుల కన్నా అధ్వానంగా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ‘ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?’ అని జగన్ సూటిగా ప్రశ్నించారు. నిజాన్ని దాచలేరన్న విషయం చంద్రబాబు గ్రహించడం లేదు జగన్ గారూ: రామ్‌గోపాల్ వర్మ నిజాన్ని ఎప్పటికీ దాచలేమన్న విషయాన్ని ఈ వయసులోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రహించలేక పోతున్నారని ప్రఖ్యాత దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు గారూ... రామ్‌గోపాల్ వర్మ చేసిన తప్పేంటి?’ అంటూ వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌కు వర్మ ప్రతి స్పందించారు. ‘జగన్ గారూ... నిజాన్ని దాచలేరన్న విషయాన్ని చంద్రబాబు ఈ వయసులో కూడా గ్రహించలేక పోతున్నందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. -
సుప్రీంకోర్టు ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రేక్ వేయడంపై ఆ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చిత్రం విడుదలపై ఆంక్షలు విధించడాన్ని అత్యవసర విచారణ చేపట్టాలని నిర్మాత తరుఫు న్యాయవాది సుధాకర్ రెడ్డి దాఖలు పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టలేమని కోర్టు తెలిపింది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే. చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల చేయకుండా ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సినిమా ప్రివ్యూను న్యాయమూర్తులు చూశాక, తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్మాత రాకేశ్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఏపీలో చిత్రం ఖచ్చితంగా విడుదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
మరోసారి ఎన్టీఆర్‌గారికి వెన్నుపోటు పొడిచారు
‘‘ఎన్టీ రామారావుగారికి మరొక్కసారి వెన్నుపోటు జరిగింది. ఎందుకంటే.. అప్పట్లో ‘సింహగర్జన’ సభ పెట్టుకోకుండా ఆయన్ను మానసిక క్షోభకు గురి చేసి చంపేశారు. ఇవాళ ఆయన మీద తీసిన సినిమా రిలీజ్ కానివ్వకుండా కుట్ర చేసి మళ్లీ వెన్నుపోటు పొడిచారు. ఆ రోజు రామారావుగారికి సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. ఆయన కుటుంబం, పార్టీ కార్యకర్తలు అందరూ వెన్నుపోటు పొడిచారు. కానీ ఇవాళ మేమందరం రాజ్యాంగ హక్కుల ద్వారా ఆయన సినిమా రిలీజ్ చేయిస్తాం. మాకు కచ్చితంగా విజయం దక్కుతుంది అనుకుంటున్నాను. ఎన్టీఆర్‌గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి ముఖ్యపాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీర్’. ఏ జీవి, ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి, దీప్తీ బాలగిరి నిర్మించారు. ఈ చిత్రం నిన్న ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని ప్రాంతాల్లో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఏపీలో రిలీజ్ ఆపమని హై కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక్కప్రాంతం మినహా సినిమా రిలీజ్‌ని ఆపడమనేది కరెక్ట్ కాదు. ఏ దర్శకుడైనా సినిమా తీసేది ప్రేక్షకుడికి చూపించడానికే. కొందరు చూడటానికి వీలు లేదు అని చెప్పడం అన్యాయమే కదా? అందరికీ సినిమా చూడాలనే కోరిక ఉంది. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో చూడకూడదంటే ఎలా? ఒక్కచోట రిలీజ్ అయితే అన్నిచోట్లా సినిమా రిలీజ్ అయినట్టే. సోషల్ మీడియా వల్ల మొత్తం తెలిసిపోతుంది. సినిమాను ఆపాలనుకుని ప్రయత్నిస్తే వాళ్లకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ►ఓ డెమోక్రటిక్ కంట్రీలో రియలిస్టిక్ మూవీ తీసినప్పుడు మీరు చూడకూడదని ఆపేయడం కరెక్ట్ కాదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా అనుకున్నప్పుడు ఈ సినిమాను నిర్మించిన రాకేష్ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని నాకు తెలియదు. ఒకవేళ తెలిసుంటే సినిమా తీయనని చెప్పడం లేదు. ఈ సినిమా వైసీపీకి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ల మనిషిని ఎందుకు నిర్మాతగా పెడతారు. ఆ డబ్బేదో నాకే ఇస్తారు కదా? లేకపోతే ఊరూ పేరూ లేని వాళ్లతో తీయిస్తారు. సినిమాలో ఉన్న నిజానిజాలు బయటకు రాకూడదన్నది వాళ్ల భయం తప్పితే ఎవరు తీశారన్నది సమస్యే కాదు. ►ఎన్టీఆర్‌గారి జీవితంలో జరిగిన కథ అందరికీ తెలుసు. ఆ సంఘటనలను ఏ విధంగా చూపించాలా అనే ఎగై్జట్‌మెంట్‌తో ఈ మూవీ స్టార్ట్ చేశాను. ఎన్టీఆర్‌గారు చక్రవర్తిలా బతికారు. వైస్రాయ్ ఘటన జరిగినప్పటి నుంచి చనిపోయేవరకు ఆయన పడ్డ మానసిక వేదనకు నేను బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ►డెమోక్రసీలో ఉన్నప్పుడు మన అభిప్రాయాలను చెప్పే హక్కు మనందరికీ ఉంది. ఈ మధ్య ‘పద్మావత్’, ఉడ్తా పంజాబ్’ సినిమా సమయాల్లో సుప్రీమ్ కోర్టు ఓ జడ్జిమెంట్ ఇచ్చింది. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చాక ఆ సినిమాను ఆపే హక్కు ఎవ్వరికీ లేదు అన్నది దాని సారాంశం. కానీ ఊహించని విధంగా మా సినిమా రిలీజ్‌పై స్టే రావడం సర్ప్రైజ్. సాధారణంగా కోర్టులు నిష్పక్షపాతంగా ఉంటాయి. కోర్టుపై ఒత్తిడి ఎవరు తెచ్చి ఉంటారో మనందరికీ తెలుసు. నేను పేర్లు చెప్పకపోవడం ధైర్యం లేకపోవడం కాదు. నేను చెప్పినా చెప్పకపోయినా దీని వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు కాబట్టి. ►కోర్టువాళ్లు ఆదేశించిన విషయాన్ని గౌరవిస్తూ సినిమాను ఆపేశాం. వేరే కోర్టును ఆశ్రయించడానికి మన రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది. నిర్మాత రాకేశ్ రెడ్డిగారు ఆ పనిలో ఉన్నారు. వీలున్నంత త్వరగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో కూడా విడుదలయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నాం. అందరికీ సినిమాను ఒకేసారి చూపించాలనుకుంటాం. కుదరకపోతే వాళ్లు అప్పుడూ గెలిచిట్టే, ఇప్పుడూ గెలిచినట్టే. ప్రేక్షకుడు నిజం తెలుసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పడానికి, రిలీజ్ అయిన థియేటర్స్‌లో వస్తున్న రెస్పాన్స్, హౌస్‌ఫుల్ బోర్డ్సే నిదర్శనం. ఎన్టీఆర్‌గారి జీవితం తుది దశలో ఏం జరిగిందో తెలుసు కోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. నిజం ఇవాళ బయటకు వచ్చింది. కొందరికి ఇవాళ తెలుస్తుంది. కొందరికి రేపు. కానీ అందరికీ కచ్చితంగా తెలుస్తుంది. దర్శకుడిగా మనం ఎలాంటి కథ చెబుతున్నాం అన్న విషయాన్ని బట్టి సీరియస్‌నెస్ వస్తుంది. నేను చెబుతున్నది ఎంతో చరిత్ర కలిగి ఉన్న రామారావుగారి కథ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో లక్ష్మీ పార్వతిగారికి, ఎన్టీఆర్‌గారికి మధ్య ఉన్న అనుబంధం ఏంటి? ఆ బంధాన్ని ఉపయోగించుకొని కొందరు రాజకీయ కుట్ర ఎలా నడిపించారు? ఆయన్ను ఎలాంటి మానసిక క్షోభకు గురి చేశారు? అనే అంశాలను చూపించాం. శేఖర్‌కపూర్ తీసిన ‘బాండిట్ క్వీన్’ సెన్సార్ సమస్యలు ఎదుర్కొంది. సెన్సార్ వాళ్లు చాలా కట్స్ చెప్పారు. ఆ తర్వాత రివైజింగ్ కమిటీకు వెళ్తే వాళ్లు సినిమా బ్యాన్ చేయాలన్నారు. దాన్ని దాటి పైదానికి వెళ్తే ఒక్క కట్ కూడా లేకుండా రిలీజ్ చేసుకోండి అని చెప్పారు. మూడు కమిటీలు. మూడు భిన్న అభిప్రాయాలు. సినిమా రిలీజ్ అయింది. మళ్లీ ఎవరో కేస్ వేశారు. కేసు సుప్రీమ్ కోర్టుకు వెళ్లింది. కోర్టు సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పింది. ►నిజం అనే దానికి ప్రత్యేకమైన అర్థం లేదు. సరైన వీడియో ప్రూఫ్ లేనప్పుడు నిజాన్ని నిర్ధారించలేం. ఆ సమయంలో నేనూ లేను, మీరూ లేరు. 25 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇది. అప్పుడు ఉన్నవాళ్లను అడిగినా కూడా వాళ్లకు అనుకూలంగానే చెబుతారు. నిజం అనేది నమ్మేట్టుగా ఉండాలి. ఒకవేళ కాదు అంటే ఆల్టర్నేటివ్ ఏంటి అనేది చెప్పగలగాలి. అలా చెబితే మీ సినిమా మీరు తీసుకోండి. నేను రీసెర్చ్ చేసి, అందులో తెలుసుకున్న నిజాలను మనస్ఫూర్తిగా నమ్మి తీసిన సినిమా ఇది. ►హై కోర్టు కౌన్ కిస్కా వాళ్ల మాటలు వినదు కదా. స్టే ఎత్తేయడానికి సుప్రీమ్ కోర్టుకు వెళ్లాం. ప్రాసెస్‌లో ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని జోస్యం చెప్పలేను. ఎందుకంటే నేను కోర్టు నడపను, ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రినీ కాదు. ప్రధాన మంత్రిని కూడా కాదు. ఫైట్ చేస్తాం. ►ప్రతీ సినిమాకో సీజన్ ఉంటుంది. సంక్రాంతి, సమ్మర్, దసరా ఇలా. మా సినిమాలో పొలిటికల్ క్యారెక్టర్స్ ఉండటం వల్ల సినిమాకు హైప్ తీసుకురావడానికి ఎలెక్షన్ టైమ్ ఎంచుకున్నాం తప్పితే ప్రేక్షకులను ప్రేరేపించాలనే ఉద్దేశమే లేదు. ►సినిమా ఓ ఎమోషన్ తీసుకొస్తుంది. అది చూసి ఇలా జరిగిందా? అని నమ్మితే మీకు అంతకుముందు ఆ నాయకుల మీద ఉన్న ఇంప్రెషన్ పోవచ్చు. ఎన్నికల ముఖ్య ఉద్దేశం నమ్మకమే. సినిమా వల్ల ఆ ప్రభావం కొంత పడొచ్చు. ఎంత పడుతుంది, ఏ రేంజ్లో పడుతుందో చెప్పలేను. సినిమాకు వస్తున్న స్పందన పట్ల 100 శాతం సంతృప్తి చెందాను. ‘ఎన్టీఆర్‌గారికి నిజమైన వారసుడు మీరే’ అని నాకు ఎవరో ఓ మెసేజ్ పంపారు. అదే నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్. ఈ సినిమాను కథకుడిగా తీశా. సినిమా డబ్బుతో కూడుకున్నది కాబట్టి వ్యాపారంగానే తీశాను. రాజకీయంగా మాత్రం తీయలేదు. నిర్మాత రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘ఇవాళ తెలుగువారందరికీ శుభదినం. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్లకు బ్లాక్ డే. ఈ సినిమా ఏపీలో రిలీజ్ కాదని మేం ఎవ్వరూ ఊహించలేదు. వర్మగారి దమ్ము, ధైర్యాలు అందరికీ తెలిసిందే. సినిమాలో నిజం ఉంది కాబట్టే వాళ్లు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. న్యాయం గెలుస్తుంది. కొందరు స్వలాభం కోసం ఇలా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. బడ్జెట్ ఎంత? వచ్చే డబ్బెంత? అని కాదు. వెయ్యి కోట్లకు సరి పడా పేరు వచ్చింది. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. ఎన్నికల అధికారికి వివరించాం
సాక్షి, అమరావతి: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని సన్నివేశాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వివరించినట్లు చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి తెలిపారు. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా సినిమా ఉందంటూ ఫిర్యాదులు అందటంతో ఎన్నికల కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని రాకేష్ రెడ్డికి నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల అధికారికి వివరణ ఇచ్చేందుకుగాను రాకేష్‌రెడ్డి సోమవారం సచివాలయం వచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక పార్టీ పరంగా...ఒక వ్యక్తి గురించి పర్సనల్‌గా టార్గెట్ చేశారా అని ఎన్నికల సంఘం తనని అడిగిందని చెప్పారు. సినిమాలో పసుపు జెండాలు వాడాము తప్ప.. ఎక్కడా పార్టీ గుర్తులు వాడలేదని తాను బదులిచ్చినట్లు వివరించారు. తన వివరణపై ఎన్నికల అధికారి ద్వివేది సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో సంఘటనలు అడిగి తెలుసుకున్న అనంతరం విడుదలకు ఈసీ పచ్చజెండా ఊపినట్లు తెలిపారు. రిలీజ్ తర్వాత కూడా ఏవైనా అభ్యంతరాలు ఉంటే వివరణ ఇస్తామని కూడా చెప్పామన్నారు. 29న సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వైఎస్ జగన్‌కు, మాకు బంధుత్వం లేదని ఆయన మా పార్టీ అధినేత మాత్రమే అని స్పష్టం చేశారు. లక్ష్మీపార్వతి రాసిన పుస్తకం ఆధారంగా సినిమా నిర్మించామని తెలిపారు. కాగా, సినిమా విడుదలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, న్యాయ సలహా తీసుకుని తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఎన్నికల అధికారి ద్వివేది తెలిపారు. -
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు లైన్ క్లియర్
సాక్షి, అమరావతి : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని సన్నివేశాలను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వివరించామని ఆ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి తెలిపారు. తన వివరణపై సీఈవో ద్వివేది సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి రాసిన పుస్తకం, వాస్తవ పరిస్థితుల ఆధారంగా సినిమా తీశామన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా...రాజకీయ పార్టీలను, వ్యక్తులను కించపరిచే విధంగా తీశారన్న ఆరోపణలల్లో వాస్తవం లేదన్నారు. పసుపు జెండాలను తప్ప, పార్టీలను చూపించలేదన్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తామన్నారు. సెన్సార్స్ క్లియరెన్స్ కూడా వచ్చిందని నిర్మాత రాకేష్ రెడ్డి తెలిపారు. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఉందంటూ ఈసీకి ఫిర్యాదులు అందటం, చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నిర్మాత రాకేష్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు (సోమవారం) ఎన్నికల సంఘం ఎదుట వ్యక్తిగతంగా హాజరు అయ్యారు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై వస్తున్న అభ్యంతరాలపై చిత్ర నిర్మాత ఎంసీఎంసీ కమిటీ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు. అయితే అంతకు ముందు రాకేష్ రెడ్డి తనకు వచ్చిన నోటీసులపై వాట్సాప్ ద్వారా సమాధానం ఇచ్చారు. దీనికి సంతృప్తి చెందిన ఈసీ... వ్యక్తిగతంగా కమిటీ ఎదుట హాజురు కావాలని స్పష్టం చేసింది. దీంతో రాకేశ్ రెడ్డి ఈసీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. -
శిఖా చౌదరికి ఎలాంటి సంబంధం లేదు...
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో అరెస్ట్ అయిన ముగ్గురుని జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ జయరాం హత్యకేసులో వీరి పాత్ర గురించి వివరించారు. జయరామ్‌ను హత్య చేసిన అనంతరం టీడీపీ మంత్రులకు రాకేష్ రెడ్డి ఫోన్ చేసినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. అయితే వారి ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నామన్నారు. రాకేష్ రెడ్డి ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తామని.. మరో 15 రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామన్నారు. కాగా మొత్తం ఈ కేసులో ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్ట్ చేశారు. (ఏపీకి చెందిన ఎవరా మంత్రి!?) చీటింగ్ కింద కేసు నమోదు ‘జయరామ్ హత్యకేసులో సూర్య, కిషోర్, అంజిరెడ్డిలు కీలక పాత్ర పోషించారు. కిషోర్ అనే వ్యక్తి హానీ ట్రాప్ చేసి జయరాంను రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చారు. వీణ అనే అమ్మాయి పేరు చెప్పి జయరామ్‌ను తీసుకరావాలని సూర్య, కిషోర్‌లకి రాకేష్ రెడ్డి ఆదేశించాడు. దీంతో జయరాంను రాకేష్ రెడ్డిని ఇంటికి తీసుకెళ్లారు. వీరిపై చీటింగ్ కేసు నమోదు చేశాము. హత్య విషయం ముందే తెలిసినా పోలీసులకు అంజిరెడ్డి సమాచారం ఇవ్వలేదు. అంతేకాకుండా రాకేష్ రెడ్డి జయరాం వద్ద బలవంతంగా సంతకాలు తీసుకున్న పత్రాలను అంజిరెడ్డి తీసుకెళ్లాడు. శిఖా చౌదరికీ ఈ హత్యకేసుతో ఎలాంటి సంబంధంలేదు. ఆంధ్ర రాజకీయ నాయకులకి రాకేష్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. పోలీసు అధికారులు, రాజకీయం నాయకుల పేర్లు చెప్పి అందరినీ బయపెట్టడం రాకేష్ రెడ్డికి అలవాటు’అంటూ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. (జయరాం హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్) మమ్మల్ని వాడుకొని మోసం చేశాడు జయరాం హత్యకేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని ఆర్టిస్టు సూర్య గురువారం మీడియాకు తెలిపారు. కిషోర్‌తో తనకు ఐదేళ్ల నుంచి మంచి స్నేహితుడని, తాను చెప్పడం వల్లే కిషోర్ తనతో రాకేష్ రెడ్డి ఇంటికి వచ్చాడని పేర్కొన్నారు. అంతకముందు రాకేష్ రెడ్డిని ఐదు సార్లు కలిశానన్నారు. తమను వాడుకొని రాకేష్ రెడ్డి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. -
జయరామ్‌ను హనీట్రాప్ చేయలేదు
-
జయరాం హత్య కేసులో సినీనటుడు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సినీనటుడు సూర్యప్రసాద్, కిశోర్, సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయరాం హత్య విషయం ముందే తెల్సినా అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, హత్యకు పరోక్షంగా సూర్య, కిషోర్ సహకరించడంపై విచారణ చేపట్టారు. ఈ ముగ్గురిని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. -
అందుకే రాకేష్‌రెడ్డిని కలిశా: నటుడు
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటుడు సూర్యప్రసాద్ తెలిపారు. హానీ ట్రాప్ చేసి జయరామ్‌ను తీసుకొచ్చారనేది అవాస్తవమని ‘సాక్షి’ టీవీతో చెప్పారు. జనవరి 28 నుండి 31 వరకు రాకేష్ రెడ్డి ఫోన్ కాల్ లిస్ట్‌లో తన నంబర్ ఎక్కువగా ఉండటం కారణంగానే తనను పోలీసులు విచారణకు పిలిచారని చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్నిటికి తాను సమాధానం చెప్పానన్నారు. రాకేష్ రెడ్డితో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమేనని, తన సినిమా ప్రమోషన్ కోసమే అతడిని కలిసినట్టు వెల్లడించారు. (జయరాం హత్య జరగ్గానే ఏపీ మంత్రికి రాకేష్ ఫోన్) ఇప్పటివరకు శిఖా చౌదరిని తాను చూడలేదు, మాట్లాడలేదన్నారు. జయరామ్ హత్య జరిగిన విషయం మీడియాలో చూసి తాను షాక్ అయ్యానన్నారు. హానీ ట్రాప్‌లో తాను ఉన్నాను అన్నప్పుడు బాధ కలిగించిందన్నారు. ‘మీ భర్త హత్య కేసులో నా ప్రేమయం లేదు నమ్మండి’ అంటూ జయరామ్ భార్య పద్మశ్రీని వేడుకున్నారు. తాను నటించిన ‘కలియుగ’ సినిమా ప్రమోషన్ కోసం డబ్బులు సమకూరుస్తాను అంటేనే నేను రాకేష్ రెడ్డిని నమ్మినట్టు చెప్పారు. పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచిన సహకరిస్తానని సూర్య అన్నారు. రాకేష్ రెడ్డిని చట్టపరంగా శిక్షించాలని కోరాడు. (రాకేష్ రెడ్డి అక్రమాలు ఇంతంత కాదయా) -
ఎవరా ఏపీ మంత్రి!?
సాక్షి, అమరావతి : పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తులో తీగలాగితే పెద్దల డొంక కదులుతోంది. ఈ కేసులో నిందితుడు రాకేష్ విచారణలో విస్తుగొలిపే నిజాలు వెల్లడిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణాలోని పలువురు పోలీసుల మెడకు చుట్టుకున్న రాకేష్ వ్యవహారం తాజాగా ఏపీలోని టీడీపీ నేతలతో ఉన్న లింకులూ వెలుగుచూస్తున్నాయి. జయరాంను హత్య చేసిన తాను దాని నుంచి బయటపడేందుకు ఏపీలోని ఓ మంత్రి సహాయాన్ని పొందేందుకు ప్రయత్నించానని, అందుకు ఆ మంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం ఫోన్లో కోరినట్టు పోలీసు విచారణలో రాకేష్ వెల్లడించినట్టు తెలిసింది. దీంతో ఏపీకి చెందిన ఆ మంత్రి ఎవరన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి నందిగామలో జయరాం మృతదేహం కనుగొన్నప్పుడే టీడీపీ నేతలు కేసును రాకేష్‌రెడ్డి అరెస్టుకే పరిమితం చేసేలా కృష్ణాజిల్లా పోలీసులపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు బలంగా వచ్చాయి. కేసు నుంచి బయటపడేందుకే మంత్రికి ఫోన్ జయరాం హత్యకేసులో తెలంగాణ టీడీపీ నేత బీఎన్‌రెడ్డి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాకేష్ కాల్‌లిస్ట్‌ను పోలీసులు పరిశీలించడంతో ఏపీ మంత్రి ఫోన్ నెంబర్‌కు మాట్లాడిన విషయం బయటపడింది. ఏపీ మంత్రికి ఎందుకు కాల్ చేశావని అడిగితే ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆయన ఏమైనా సహాయం చేయగలరేమో నేరుగా కలిసి మాట్లాడేందుకు అపాయింట్మెంట్ అడిగినట్టు రాకేష్‌రెడ్డి విచారణలో వెల్లడించినట్టు తేలింది. కాగా, రాకేష్‌రెడ్డి.. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నట్టు ఇటీవల ఫొటోలు చక్కర్లు కొట్టాయి. ఉన్నతస్థాయి పైరవీలకు అధికార టీడీపీ నేతల పరపతిని వాడుకున్నాడని కూడా తెలుస్తోంది. మరోవైపు.. నందిగామ పోలీసులు ఏ మంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తారు? అన్న దానిపైనా పోలీసులు కన్నేశారు. నిందితుడికి ఎంత సాన్నిహిత్యం లేకుంటే ఆ మంత్రికి నేరుగా ఫోన్‌చేసి అపాయింట్మెంట్ అడుగుతాడనే ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాక, సెక్రటేరియేట్‌కు రా కలుద్దామని మంత్రి చెప్పారంటే వారి మధ్య పరిచయం ఎంత బలంగా ఉందో అన్న దానిపైనా విచారణాధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ‘బెదిరించి ప్లాట్లు రాయించుకున్నాడు’ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన రాకేష్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం మరో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ కాలనీకి చెందిన ప్రముఖ రియల్ఎస్టేట్ వ్యాపారి, ప్రగతి రిసార్ట్స్ చైర్మన్ జీబీకే రావు, అతని బావమరిది బాబూరావుకు మధ్య బళ్లారిలోని ఫ్యాక్టరీకి సంబంధించి ఆర్థిక విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2017 డిసెంబర్లో రాకేష్ రెడ్డి, బాబూరావుతో పాటు మరికొందరు అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1లోని ప్రగతి రిసార్ట్స్ ప్రధాన కార్యాలయానికి వచ్చాడు. రూ.7.50 కోట్లకు సంబంధించి సెటిల్మెంట్ చేసుకోవాలంటూ లేనిపక్షంలో తన చేతులకు పనిచెప్పాల్సి ఉంటుందని రాకేష్ రెడ్డి జీబీకే రావును బెదిరించాడు. అంతేకాకుండా అతడి భార్యను కిడ్నాప్ చేసేందుకు పథకం పన్నిన రాకేష్ రెడ్డి ఆయన భార్యను గుర్తుపట్ట లేక ఓ మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని గుర్తించి రెండు గంటల్లో వదిలేశారు. అనంతరం జిబీకే రావు కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడు. తనకు పోలీస్ ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలు, ఏపీ మంత్రులతో సంబంధాలు ఉన్నాయని తాను ఏం చేసినా ఎవ్వరూ అడిగేవారు లేరని హెచ్చరించాడు. వారిముందే ఏపీకి చెందిన కొందరు మంత్రులు, సిటీలోని కొందరు పోలీస్ అధికారులతో మాట్లాడినట్లు నటించాడు. తనకు వారంతా అండగా ఉన్నారని విషయం సెటిల్ చేసుకోవాలని బెదిరించాడు. అంతేగాక చిలుకూరు సమీపంలోని ప్రగతి రిసార్ట్స్‌కు చెందిన 16వేల గజాల ప్లాట్లను తన పేరుపై రాయించుకోవడమేగాక జీబీకే రావు భార్య, కుమారుడి బెదిరించి వారితో బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు. డబ్బులు ఇచ్చి పత్రాలు తీసుకెళ్లాలని హెచ్చరించాడు. తాజాగా జయరామ్ హత్యకేసులో రాకేష్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులకు ఈ పత్రాలు లభ్యమయ్యాయి. సదరు ప్లాట్లను వేరొకరికి విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దీనిపై ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జయరామ్ హత్యకేసులో రాకేష్ రెడ్డి నిందితుడని తేలడంతో ఈ వ్యవహారంపై జీబీకే రావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాకేష్ రెడ్డి, బాబూరావు తదితరులు తమ కుటుంబ సభ్యులను బెదిరించడమే కాకుండా ప్లాట్లకోసం సంతకం చేయించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు రాకేష్ రెడ్డి బాబూరావు తదితరులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ వార్తల్లో నిజంలేదు
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరో కొన్నారంటూ ఆన్లైన్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని, అవన్నీ కేవలం పుకార్లే అని నిర్మాతలు కొట్టిపారేశారు. ‘‘ఎవరికి, ఎంత ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు రామ్‌గోపాల్ వర్మ, రాకేష్ రెడ్డిలు త్వరలోనే తెలియజేస్తారు. మా చిత్రాన్ని ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ‘‘మా సినిమా ట్రైలర్, ఓ పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ స్పందన చూస్తుంటే సినిమా క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆర్జీవీ యూట్యూబ్ చానల్లోనే కోటిమందికిపైగా చూశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ‘నీ ఉనికి...’ పాటని 30 లక్షల మందికిపైగా చూశారు. వీటన్నిటినీ చూస్తుంటే మా సినిమాకి థియేటర్లలో జనాలు బ్రహ్మరథం పట్టడం ఖాయం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: రమ్మీ, సంగీతం: కళ్యాణ్ కోడూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సూర్య చౌదరి. -
పక్కాపధకం ప్రకారమే జయరాం హత్య
-
జయరాం హత్య కేసులో మరో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టు అయినవారిలో ఎస్ఆర్నగర్ బాపూనగర్‌కు చెందిన రౌడీషీటర్ నేనావత్ నగేష్ అలియాస్ సింగ్ అలియాస్ బాబుసింగ్(35), ఆయన మేనల్లుడు విస్లావత్ విశాల్(20), సుభాష్‌చంద్రారెడ్డి(26) ఉన్నారు. మంగళవారం ఇక్కడ దర్యాప్తు అధికారి కేఎస్ రావుతో కలసి వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. జయరాంను హత్య చేయాలని ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి ముందుగానే పథకం వేసుకొని గత నెల 29న ఎస్ఆర్నగర్ బాపూనగర్‌కు చెందిన రౌడీషీటర్ నేనావత్ నగేష్ అలియాస్ సింగ్ అలియాస్ బాబుసింగ్‌ను తన ఇంటికి పిలిపించాడు. ఇందుకోసం నగేష్ తన మేనల్లుడు విస్లావత్ విశాల్(20)ని రాకేశ్‌రెడ్డికి పరిచయం చేశాడు. రాకేశ్‌రెడ్డి దిండుతో జయరాం ముఖంపై ఒత్తిపెట్టి ఊపిరాడకుండా చేయగా విశాల్ చేతులను గట్టిగా పట్టుకున్నాడు. పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించిన ఘటనను నగేష్ వీడియో తీశాడు. మహబూబ్‌నగర్ జిల్లా న్యూటౌన్ శేషాద్రినగర్‌కు చెందిన లక్ష్మిరెడ్డి సుభాష్‌చంద్రారెడ్డి(26) అల్వాల్ పంచశీల్కాలనీలోని హైటెన్షన్ రోడ్డులో ఉంటున్నాడు. బీటెక్ చదువుకున్న సుభాష్‌చంద్రారెడ్డి ఆఫీస్ అసిస్టెంట్‌గా రాకేశ్‌రెడ్డితో కలసి ఉంటున్నాడు. సుభాష్‌చంద్రారెడ్డి సిమ్‌నే రాకేశ్‌రెడ్డి తన వ్యక్తిగత కార్యకలాపాలకు వాడుతున్నాడు. అదే ఫోన్‌తో వీడియోలను సుభాష్చంద్రారెడ్డికి పంపించాడు. ఈ ముగ్గురు జయరాం హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. జయరాంను బెదిరించి ఆయన ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ చేశారు. ఆ తర్వాతనే చంపేద్దామనుకున్నారు. హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్ వద్ద బెదిరించి తెప్పించిన డబ్బులతోపాటు సంతకాలు చేసిన కొన్ని డాక్యుమెంట్లను తీసుకున్నారు. హత్యకు ముందు ఒక ఇన్స్పెక్టర్, ఆ తర్వాత మరో ఇన్స్పెక్టర్ సలహాలను రాకేశ్‌రెడ్డి తీసుకున్నాడు. ఈ హత్య కేసులో ఐదుగురు పోలీసు అధికారులను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాసులు, రాంబాబులతోపాటు మరో వ్యక్తి వివరణ తీసుకున్నారు. శిఖాచౌదరిని ఏడు గంటలపాటు విచారించగా, జయరాం హత్య కేసులో ప్రత్యక్షంగా తన పాత్ర ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదు. రూ.1.3 కోట్లు శిఖా కోసం తాను ఖర్చు చేసినట్లు రాకేశ్‌రెడ్డి చెప్పగా అలాంటిదేమీ లేదని శిఖా కొట్టిపారేసింది. శిఖాచౌదరి స్నేహితుడు సంతోష్ ద్వారా రాకేశ్‌రెడ్డి పరిచయమయ్యాడు. జయరాం హత్యకేసులో టీడీపీ నేత బీఎన్‌రెడ్డి పాత్రపై ఇంకా విచారిస్తున్నారు. జయరాం హత్య కేసులో శిఖాకు సంబంధముందా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. -
‘జయరాంను హత్య చేస్తూ వీడియో తీశారు’
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విశాల్, నగేశ్, సుభాష్ చంద్రారెడ్డిలను అరెస్టు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. జయరాం హత్య కేసు విచారణపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జయరాం హత్య జరిగిన సమయంలో విశాల్ అనే వ్యక్తి రాకేష్‌తోనే ఉన్నారని చెప్పారు. హత్య చేసే సమయంలో నగేష్ అనే వ్యక్తి మొబైల్లో వీడియో తీశారని.. ఆ దృశ్యాలను సేకరించామని డీసీపీ తెలిపారు. జయరాంను రాకేష్ హత్య చేస్తున్న ఫోటోలను, వీడియోను సుభాష్‌కు పంపారని చెప్పారు. సుభాష్ చంద్రారెడ్డి అనే వ్యక్తి రాకేష్ రెడ్డి స్నేహితుడని, అతని నుంచి మర్డర్‌కు సంబంధించిన వస్తువులను స్వాదీనం చేసుకున్నామన్నారు. పథకం ప్రకారమే జయరాంను కిడ్నాప్ చేసి హత్య చేశారని చెప్పారు. జయరాంను బెదిరించి కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకొని అనంతరం హత్య చేశారని చేశారని వివరించారు. హత్య చేసిన తర్వాత రాకేష్ రెడ్డి ఒక్కరే జయరాం డెడ్ బాడీని తీసుకెళ్లారన్నారు. జయరాంను చిత్రహింసలకు గురిచేసి ఖాళీ బాండు పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని వెల్లడించారు. ఈ హత్యకు సంబంధించి రాకేశ్‌రెడ్డిని పూర్తిగా విచారించామని.. శిఖా చౌదరిపై ఆయన ఎలాంటి ఆరోపణలు చేయలేదని తెలిపారు. ఈ హత్య జరిగిన విషయాన్ని శిఖా చౌదరికి కారు డ్రైవర్ ఫోన్ ద్వారా తెలిపాడన్నారు. జయరాం ఇంట్లోకి అక్రమంగా చొరబడి, డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారనే ఫిర్యాదుపై శిఖా చౌదరిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుందన్నారు. జయరాం హత్య కేసులో పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయంపై విచారణ కొనసాగుతుందన్నారు. ఐదు మంది పోలీసులకు నోటీసులు ఇచ్చామని, వారిని విచారిస్తామని వెల్లడించారు. (జయరామ్ హత్యకేసు; తెరపైకి కొత్త వ్యక్తి) -
జయరామ్ హత్యకేసు; తెరపైకి కొత్త వ్యక్తి
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో మరో కొత్త వ్యక్తి తెరపైకి వచ్చారు. సుభాష్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. జయరామ్ హత్య అనంతరం సుభాష్ రెడ్డి కి రాకేశ్‌రెడ్డి ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. నగేష్, విశాల్, సుభాష్ రెడ్డిలను పోలీసులు రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. శిఖా చౌదరిపై మరోసారి ఫిర్యాదు జయరాం హత్యకు గురైన తర్వాత ఆయన ఇంట్లో నుంచి శిఖా చౌదరి కీలక పత్రాలు తీసుకెళ్లినట్టు ఆయన భార్య పద్మశ్రీ మరోసారి ఫిర్యాదు చేశారు. తాను అమెరికాకు వెళ్లిపోవడంతో తన తండ్రి పిచ్చయ్య చౌదరితో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. శిఖా చౌదరిపై ఆరోపణలకు సంబంధించిన కొన్ని ఆధారాలను పోలీసులకు ఆయన సమర్పించారు. ఫిర్యాదు ఆధారంగా శిఖా చౌదరిపై కేసు నమోదు చేయనున్నారు. కొనసాగుతున్న దర్యాప్తు కాగా, ఈ కేసులో ఇప్పటివరకు100 మందిని పోలీసులు విచారించించారు. నిందితుడితో టచ్‌లో ఉన్న పోలీసు అధికారులపై ఇప్పటికే బదిలీ వేటు వేశారు. మరోవైపు రెండో రోజు కూడా టీడీపీ నాయకుడు బిఎన్ రెడ్డిని పోలీసులు విచారించారు. (‘జయరాం కేసు’లో విచారణకు హాజరైన టీడీపీ నేత) -
‘జయరాం కేసు’లో విచారణకు హాజరైన టీడీపీ నేత
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డితో సన్నిహిత సంబం ధాలున్నాయన్న వాటిపై ఆరా తీసేందు కు, ఇద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు నడిచాయన్నదాన్ని తెలుసుకునేందుకు నగర టీడీపీ సీనియర్ నేత, తెలంగాణ టీడీపీ టీఎన్టీయూసీ అధ్యక్షుడు బీఎన్.రెడ్డిని ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి, బంజారాహిల్స్ ఏసీపీ కె.ఎస్.రావు కార్యాలయంలో గంటన్నరపాటు బీఎన్.రెడ్డిని విచారించిన పోలీసులు రాకేష్‌రెడ్డి ఎలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం,అతడిని రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు తీసుకెళ్లడానికి గల కారణాలేంటి అన్న మూడు అంశాలపైనే విచారణ చేశారు. ఇరవై రోజుల కిందట బీఎన్.రెడ్డి తన స్నేహితుడు రాకేశ్‌రెడ్డిని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ సీఐ రాంబాబుతో గంటపాటు మంతనాలు జరిపారు. రాంబాబు తనకు బాగా తెలుసునని ఏ పనై నా చేసిపెడతాడంటూ బీఎన్.రెడ్డి నమ్మించడం తో రాకేశ్‌రెడ్డి తన కారులోనే రాయదుర్గం పీఎస్‌కు అతనితో వెళ్లాడు. జయరాం సెటిల్మెంట్లో తనకు సహకరించాలని రాకేశ్‌రెడ్డి సీఐ రాంబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవలి విచారణ లో రాంబాబు ఇదే విషయాన్ని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్‌కు తెలియజేశారు. దీంతో బీఎన్.రెడ్డిని విచారణకు హాజరుకావాలని శుక్రవా రం రాత్రి ఫోన్ చేయగా ఆయన ఆదివారం విచారణకు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తాను ఖైరతాబాద్ టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా అప్పుడు రాకేశ్‌రెడ్డి పరిచయం అయ్యాడని ఆయన కూడా టీడీపీ నేత కావడంతో పలుమార్లు మాట్లాడినట్లు, అంతకుమించి తమ మధ్య ఏమీలేదని బీఎన్.రెడ్డి పోలీసులకు తెలిపారు. మొత్తానికి ఈ కేసులో పలువురు టీడీపీ నేతలు కూడా ఉన్నారని తెలుస్తోంది. -
ముగిసిన రాకేశ్‌రెడ్డి పోలీసు కస్టడీ
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాంను హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డితో పాటు డ్రైవర్ శ్రీనివాస్ పోలీసు కస్టడీ శనివారం ముగిసింది. బంజారాహిల్స్ ఏసీపీ కె.ఎస్.రావుతోపాటు వెస్ట్‌జోన్ డీసీపీ ఎఆర్.శ్రీనివాస్ నిందితులను 8 రోజులపాటు విచారించారు. శనివారం వీరిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరితో పాటు రౌడీషీటర్ నగేష్, అతని అల్లుడు విశాల్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీరితో పాటు ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాసులు, రాంబాబును కూడా విచారించారు. జయరాంను హత్య చేశాక సీఐ రాంబాబు ఇచ్చిన సమాచారంతో జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి 2 సార్లు రాకేశ్‌తో మాట్లాడినట్లు తేలింది. ఏసీపీ మల్లారెడ్డి విచారణ సందర్భంగా.. బంజారాహిల్స్ సీఐ గోవిందరెడ్డి తనకు రాకేశ్‌ను పరిచయం చేశా రంటూ పోలీసులకు చెప్పారు. దీంతో గోవిందరెడ్డి, హరిశ్చంద్రారెడ్డిని సీసీఎస్‌కు అటాచ్ చేస్తూ శుక్రవా రం ఉత్తర్వులిచ్చారు. జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యా దు మేరకు శిఖా చౌదరి, ఆమె పని మనిషి, వాచ్మెన్ల నుంచి సమాచారం సేకరించారు. సినీనటుడు సూర్య ప్రసాద్‌ను విచారించారు. ఇక రాకేశ్ మిత్రులు నాగ వెంకటేష్, శంకర్, సింగ్‌లను విచారించాలని భావిస్తు న్నారు. రాకేశ్‌తో సన్నిహిత సంబంధాలున్న ఓ నేత ను కూడా ఆదివారం విచారించే అవకాశముంది. -
బయటపడుతున్న రాకేష్‌రెడ్డి అక్రమాలు
-
రాకేష్ రెడ్డి అక్రమాలు ఇంతంత కాదయా
హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యలో ప్రధాన సూత్రధారి రాకేష్‌రెడ్డి అక్రమాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. కస్టడీలో భాగంగా రాకేష్ రెడ్డిని విచారిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులకు ఆశ్చర్యపోయే రీతిలో అతడి అక్రమ లీలలు తెలుస్తున్నాయి. బెదిరింపులు, కబ్జాలు, హత్యలతో గత ఏడాదిన్నర కాలంగా అటు పోలీసులతోను, ఇటు అధికారులతోను సంబంధాలు పెట్టుకొని రాకేష్ రెడ్డి ఇష్టారాజ్యంగా కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. జయరాంను హత్య చేసిన తర్వాత రాకేష్‌రెడ్డి ఏసీపీ మల్లారెడ్డి, రాయదుర్గం ఇన్స్పెక్టర్ రాంబాబు, నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న ఘటనలో ఆ ముగ్గురినీ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా రాకేష్‌రెడ్డితో సంబంధాలున్నట్లు కాల్‌డేటాలో తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు చింతల్, కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన శ్రీధర్, రాజేశ్ అనే ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను గురువారం విచారించారు. రాకేష్‌రెడ్డితో వారికి ఎలాంటి సంబంధాలున్నాయి? ఎప్పటి నుంచి పరిచయం అన్నదానిపై ఆరా తీశారు. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో అక్రమాలు, కబ్జాలకు పాల్పడినట్లు తెలిసింది. వీటిపై కూడా ఆరా తీసినట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణకు సంతోష్‌రావు కూడా.. అనంతరం శిఖా చౌదరి సన్నిహితుడు సంతోష్‌రావు అలియాస్ శ్రీకాంత్‌రెడ్డిని కూడా పోలీసులు విచారించారు. జయరాం గత నెల 31న హత్యకు గురికాగా అదేరోజు రాత్రి శిఖా చౌదరి తన స్నేహితుడు సంతోష్‌రావుతో అనంతగిరి ప్రాంతానికి నైట్‌రైడింగ్‌కు వెళ్ళినట్లు చెప్పడంతో వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు సంతోష్‌రావును పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఆమెతో ఎలాంటి సంబంధాలున్నాయి? ఎప్పటి నుంచి సంబంధాలున్నాయి? జయరాం హత్య జరిగిన విషయం ఎప్పుడు తెలిసింది? హత్య జరిగిన తర్వాత శిఖా చౌదరిని కలిశారా అన్న కోణంలో విచారణ జరిగింది. వీరిద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు ఉండేవన్న దానిపై కూడా ఆరా తీశారు. అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులను, ఇటు సంతోష్‌రావును వేర్వేరుగా నాలుగు గంటల పాటు విచారించారు. శుక్ర, శని వారాల్లో కూడా ఇంకో 30 మంది వరకు విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరందరికీ పోలీసులు ఫోన్లు చేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. రాకేష్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలున్న పలువురు రాజకీయ నాయకులు కూడా విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
జయరాం కేసు: రౌడీషీటర్ల అరెస్ట్‌కు రంగం సిద్ధం
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసుతో సంబంధం ఉన్న నగేష్, విశాల్ అనే ఇద్దరు రౌడీ షీటర్ల అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. జయరాం హత్యకేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితులకు ఆరో రోజు కస్టడీ విచారణ ముగిసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పాటు ఆయనతో సంబంధాలున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను పోలీసులు సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. జయరాం హత్యకు ముందు 48 గంటలు, తర్వాత 48 గంటలు రాకేష్ రెడ్డితో టచ్‌లో ఉన్నవారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో మరో నిందితురాలు శ్రిఖా చౌదరీ స్టేట్మెంట్ను పోలీసులు మరోసారి రికార్డు చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో సుమారు 60 మందిని పోలీసులు విచారించారు. శనివారం అనుమానం ఉన్న మరి కొద్ది మందిని కూడా విచారిస్తామని పోలీసులు వెల్లడించారు. జయరాంను చంపిందెవరో తెలిసిపోయింది..! నగేశ్ సాయంతో రాకేష్ రెడ్డి భారీ స్కెచ్ -
ఖాకీ, ఖద్దరు ప్రమేయంపై ఆరా!
హైదరాబాద్: ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరామ్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు రెండో అంకానికి తెరలేపారు. ఇప్పటి వరకు రాకేశ్‌రెడ్డి వ్యవహారం, హత్య జరిగిన తీరు, ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వారి వివరాలు ఆరా తీశారు. ఇక నుంచి రాకేశ్‌రెడ్డికి సహకరించినట్లు, అతడితో సంబంధాలు నెరపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాకీలు, ‘ఖద్దరు’పై దృష్టి పెట్టారు. ప్రాథమికంగా ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట, రాయదుర్గం ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, రాంబాబుల్ని దర్యాప్తు అధికారి కె.శ్రీనివాసరావు బుధవారం విచారించారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు పోలీసు అధికారుల్నీ త్వరలో విచారించే అవకాశం ఉందని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. రాకేశ్‌రెడ్డితో కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని త్వరలో వారినీ విచారణకు పిలవాలని భావిస్తున్నారు. మల్లారెడ్డితో పాటు శ్రీనివాసులు, రాంబాబుల్ని పోలీసులు బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటల పాటు విచారించారు. హత్య జరగక ముందు, జరిగిన తర్వాత రాకేశ్‌రెడ్డి చేసిన ఫోన్‌కాల్స్ ఆధారంగా విచారణ జరిగింది. గొడవ విషయాన్నే చెప్పాడు... మల్లారెడ్డి తన వాంగ్మూలంలో.. ‘రాకేశ్‌రెడ్డి ఫోన్ చేసినప్పుడు స్నేహితుల మధ్య గొడవ విషయాన్ని చెప్పాడు. అతడు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోయా. ఈ నేపథ్యంలో మిస్డ్‌కాల్ చూసుకుని నేనే చేశా’అని పేర్కొన్నారని తెలిసింది. హత్య చేసిన రోజు రాకేశ్ తన వద్దకు వచ్చాడని, అయితే తాను ఆ సమయంలో పోలీసుస్టేషన్లో లేనని శ్రీనివాసులు తెలిపారు. తాను ఓ కూల్చివేత వద్ద ఉంటే రాకేశ్ అక్కడకొచ్చి కలిశాడని, కారు దూరంగా ఆపడంతో అందులో శవం ఉందన్న విషయం తాను గుర్తించలేదని పేర్కొన్నట్లు తెలిసింది. రాంబాబు సైతం రాకేశ్ తనతో మాట్లాడిన విషయం వాస్తవమే అని అంగీకరించినప్పటికీ హత్య విషయం చెప్పలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. వీరి వాంగ్మూలాల్లోని వాస్తవాలను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. అవసరాన్ని బట్టి మరోసారి వీరిని పిలిచి విచారించాలని, వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాకేశ్ నుంచి ఫోన్ అందుకున్న రాంబాబు మరో ఇన్స్పెక్టర్కు ఫోన్ చేశారని, ఆయన కూడా రాకేశ్‌కు కాల్ చేసి మాట్లాడారని తెలుస్తోంది. అయితే విషయాన్ని ధ్రువీకరించిన పోలీసులు మరో ఇద్దరు పోలీసుల్ని విచారించనున్నారని మాత్రం చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, మరో నేత.. జయరామ్ భార్య పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదులోని ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని వారు అంటున్నారు. రాకేశ్... జయరామ్‌ను హత్య చేసిన విషయం మీడియాలో వచ్చేంత వరకు తమకు తెలియదని విచారణ నేపథ్యంలో ముగ్గురు పోలీసు అధికారులు పేర్కొన్నట్లు డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. హత్య జరిగిన తర్వాత రాజకీయ నేతలతో రాకేశ్‌రెడ్డి మాట్లాడిన డాటాను కూడా సేకరించిన పోలీసులు ఆ వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మాజీ ఎమ్మెల్యేని, మరో రాజకీయ నాయకుడిని ప్రశ్నించాలని యోచిస్తున్నారు. జయరామ్ హత్యలో సినీ నటుడు సూర్య ప్రసాద్ పాత్ర ఉన్నట్లు స్పష్టమైతే చర్యలు తప్పవని పేర్కొంటున్నారు. అతడు కేవలం జయరామ్‌ను మభ్యపెట్టి రాకేశ్ వద్దకు తీసుకొచ్చినట్లు తెలుస్తోందని, భవిష్యత్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా చర్యలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. శిఖా చౌదరి, జయరామ్ బ్యాంకు స్టేట్మెంట్లను బట్టి వారి మధ్య రూ.లక్షల్లో లావాదేవీలు నడిచినట్లు గుర్తించారు. జయరామ్ తన అకౌంట్ నుంచి నేరుగా శిఖా చౌదరి అకౌంట్‌కు డబ్బులు పంపినట్లు తేల్చారు. -
‘పోలీసుల పాత్ర ఉంటే వారిపై చర్యలు’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్యకేసులో పోలీసుల పాత్ర ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ ఎఆర్ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్‌లను తప్పించటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. విచారణ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. కేసుతో సంబంధం ఉన్న అధికారులనుంచి అన్ని విషయాలు తెలుసుకున్నట్లు వెల్లడించారు. హత్య జరగకముందు జరిగిన తరువాత కాల్ డేటా ఆధారంగా వారిని ప్రశ్నించినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాకేశ్ రెడ్డి.. స్నేహితుల మధ్య గొడవ విషయాన్ని మాత్రమే ఫోన్ కాల్లో చెప్పినట్లు ఏసీపీ తెలిపాడు. రాకేశ్ రెడ్డి.. మల్లారెడ్డికి కాల్ చేస్తే మొదట లిఫ్ట్ చెయ్యలేదు. తరువాత మిస్డ్ కాల్స్ చూసుకొని మల్లారెడ్డి రాకేశ్ రెడ్డికి కాల్ చేశాడు. నటుడు సూర్య ప్రసాద్ మభ్య పెట్టి జయరాంను రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చాడు. రాకేష్‌తో టచ్‌లో ఉన్న మరి కొంత మంది పోలీస్ ఉన్నతాధికారులను కూడా విచారణకి పిలుస్తాం. జయరామ్ భార్య పద్మ శ్రీతో మేము టచ్‌లో ఉన్నాము. ఆమెకు ఉన్న అనుమానాలను తీర్చుతాము. రాయదుర్గం సీఐ ఫోన్ కాల్ తరువాత జూబ్లీహిల్స్ పోలీసులకు రాకేశ్ ఫోన్ చేశాడు. రాకేశ్ రెడ్డికి టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయనేది వాస్తవం. అన్ని పార్టీల నేతలతో రాకేశ్ టచ్‌లో ఉన్నాడు. హత్య జరిగిన తరువాత రాజకీయ నేతలలెరితోనూ రాకేశ్ మాట్లాడలేదు. 53 ఎకరాల భూమిలో 6 ఎకరాలు రాకేశ్ రెడ్డి కబ్జా చెయ్యాలని ప్రయత్నం చేశాడని’ వెల్లడించారు. -
‘పోలీసుల పాత్ర ఉంటే వారిపై చర్యలు’
-
రాకేష్ రెడ్డి నా దగ్గరకొచ్చి మాట్లాడాడు: సీఐ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులు బుధవారం విచారణకు హాజరు అయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్ ఇవాళ విచారణకు వచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి ...జయరామ్ హత్యకు ముందు, అనంతరం పోలీస్ అధికారులతో ఫోన్లలో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ఓ పోలీస్ అధికారి నిందితుడికి సలహా ఇవ్వడంపై విచారణ అధికారులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. మొదట జయరామ్ కేసును పరిచయమున్న పోలీసు అధికారుల సాయంతో రాకేష్ రెడ్డి పోలీస్ స్టేషన్లోనే సెటిల్ చేద్దామనుకున్నప్పటికీ.. అది కుదరకపోవడంతో జూబ్లీహిల్స్‌లో తన ఇంట్లోనే హత్య చేశాడు. మరోవైపు కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావు మంగళవారం నిందితులతో క్రైమ్ రీ–కన్స్ట్రక్షన్ నిర్వహించారు. (స్టేషన్లోనే సెటిల్ చేద్దామనుకుని!) రాకేష్ రెడ్డి నా దగ్గరకొచ్చి మాట్లాడాడు: సీఐ శ్రీనివాస్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ శ్రీనివాస్... రాకేష్ రెడ్డి తన దగ్గరకు వచ్చి మాట్లాడినట్లు అంగీకరించారు. అయితే జయరామ్ హత్య విషయం తనతో చెప్పలేదని అన్నారు. గతంలో ఉన్న పరిచయంతోనే రాకేష్ రెడ్డి తన దగ్గరకు వచ్చాడని, అయితే తాను తర్వాత మాట్లాడతానని చెప్పడంతో వెళ్లిపోయినట్లు సీఐ తెలిపారు. ఆ తర్వాత తనతో చాలాసార్లు ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. -
స్టేషన్లోనే సెటిల్ చేద్దామనుకుని!
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్యకు ముందు ఓ అధికారి, తర్వాత మరో అధికారితో రాకేష్‌రెడ్డి సంభాషించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇన్స్పెక్టర్ హోదాల్లో ఉన్న ఈ ఇద్దరితోపాటు మరో ఏసీపీని పిలిచి విచారించాలని నిర్ణయించారు. బుధ, గురువారాల్లో ఈ విచారణ జరనగనుందని సమాచారం. మొదట జయరామ్ కేసును పరిచయమున్న పోలీసు అధికారుల సాయంతో స్టేషన్లోనే సెటిల్ చేద్దామనుకున్నప్పటికీ.. అది కుదరకపోవడంతో జూబ్లీహిల్స్‌లో తన ఇంట్లోనే రాకేష్ హత్యచేశాడని తెలిసింది. మరోవైపు, కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావు మంగళవారం నిందితులతో క్రైమ్ రీ–కన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఇందులో భాగంగా నిందితులను జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 లోని రాకేష్ ఇంటి నుంచి నందిగామ వరకు తీసుకువెళ్లి వచ్చారు. జయరామ్‌ను వీణా పేరుతో ‘హనీట్రాప్’ చేసిన రాకేష్.. ఆయన్ను బంధించడానికి సహకరించాల్సిందిగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో పనిచేస్తున్న అధికారిని సంప్రదించాడు. జయరామ్‌ను తీసుకొచ్చి పోలీసుస్టేషన్లోనే ఉంచాలని, ఆపై డబ్బు వసూలుతోపాటు పత్రాలపై సంతకాలు తీసుకుందామని అన్నాడు. అయితే అలా చేయడం తనకు ఇబ్బందికరంగా మారుతుందని ఆ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి చెప్పాడు. దీంతో తానే రంగంలోకి దిగిన రాకేష్ గత నెల 30న జయరామ్‌ను జూబ్లీహిల్స్ క్లబ్ వరకు రప్పించి తన ఇంటికి వచ్చేలా ప్లాన్ వేశాడు. రెండ్రోజులపాటు బంధించి! ఆహారం, మద్యం అందిస్తూ రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉంచాడు. తొలుత కొన్ని ఖాళీ రూ.100 స్టాంప్ పేపర్లపై బలవంతంగా జయరామ్‌తో సంతకాలు చేయించుకున్న రాకేష్.. ఆపై బలవంతపు వసూలుకు ప్రయత్నించాడు. జయరామ్‌తో అనేక మందికి ఫోన్లు చేయించి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు వీలున్నంత పంపాల్సిందిగా చెప్పించాడు. చివరకు ఒకరు రూ.6 లక్షలు పంపడంతో తన అనుచరుడిని దస్పల్లా హోటల్‌కు పంపి ఆ మొత్తం రిసీవ్ చేసుకున్నాడు. ఈ డబ్బును తన ఇంట్లో తానే జయరామ్‌కు ఇస్తున్నట్లు నటిస్తూ విశాల్‌తో వీడియో రికార్డింగ్ చేయించాడు. జయరామ్ తన దగ్గర అప్పు తీసుకున్నాడని చెప్పేందుకు ఆధారంగా ఉంటుందనే ఈ వీడియా ప్లాన్ వేశాడు. ఆ సమయంలోనూ సైబరాబాద్ ఇన్స్పెక్టర్కు కాల్ చేసిన రాకేష్.. ఆ ఫోన్ జయరామ్‌కు ఇచ్చి మాట్లా డించాడు. అప్పుడు మాట్లాడిన సదరు పోలీసు అధికారి.. రాకేష్ ఇవ్వాల్సిన, అతడు కోరిన మొత్తం ఇవ్వాలంటూ జయరామ్‌ను హెచ్చరించాడు. హైదరాబాద్ టు నందిగామ హత్య చేశాక జయరాం శవాన్ని ఆయన కారులోనే పెట్టుకుని నల్ల కుంట పోలీసుస్టేషన్‌కు రాకేష్ వెళ్లాడు. తనకు పరిచయస్తుడైన ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుకు ఫోన్ చేశాడు. తాను ఆంధ్రమహిళా సభ ఆస్పత్రి వద్ద ఉన్నానంటూ చెప్పడంతో అక్కడకు వెళ్లిన రాకేష్ కారు దూరంగా ఆపి ఇన్స్పెక్టర్ను కలిశాడు. హత్య విషయం ఆయనకు చెప్పగా.. దాన్ని అతిగా మద్యం సేవించడంతో జరిగిన రోడ్డు ప్రమాదంగా మార్చాలని సూచించాడు. హైదరాబాద్ లేదా చుట్టుపక్కల అలా చేస్తే సీసీటీవీలు ఇతర ఆధారాలతో పోలీసులు పట్టుకుంటారని, ఏపీకి తీసుకువెళ్లి సీన్ క్రియేట్ చేయమని సలహా ఇచ్చాడు. దీంతో రాకేష్ విజయవాడ వైపు బయలుదేరాడు. మధ్యలో రాకేష్‌కు ఏసీపీ మల్లారెడ్డి ఫోన్ చేశాడు. ఆదిభట్లలో ఉన్న ఓ ల్యాండ్ వివాదం నేపథ్యంలో వీరికి పరిచయం ఉంది. ఆపై నందిగామ వరకు వెళ్లి ఓ బార్లో బీరు బాటిళ్లు కొని ఐతవరంలో రోడ్డు కిందకు కారు వదిలేసి వెనక్కు వచ్చేశాడు. గతంలో రాకేష్ ఇంట్లో క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ నిర్వహించిన పోలీసులు మంగళవారం అక్కడినుంచి నల్లకుంటకు, నందిగామ, ఐతవరం వరకు వెళ్లి ఈ ప్రక్రియ చేసి వచ్చారు. వీరి వెంట నిందితులు సైతం ఉన్నారు. విచారణలో నింది తులు చెప్పిన వివరాలు, రీ–కన్స్ట్రక్షన్లో గుర్తించినవి ఒకేలా ఉన్నాయ ని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్ని మరో 2రోజుల్లో పిలిచి విచారించాలని నిర్ణయించారు. -
జయరాం హత్య కేసులో పోలీసుల పాత్రపై విచారణ
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని తన ప్లాట్‌లో గత నెల 31న కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాంను హత్య చేసిన అనంతరం నిందితుడు రాకేష్‌రెడ్డి ఐదుగురు పోలీసు అధికారులతో మాట్లాడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ తెలిపారు. సదరు అధికారులను విచారిస్తామని ఏ పరిస్థితుల్లో వారు మాట్లాడాల్సి వచ్చిందో విశ్లేషించేందుకు కాల్‌డేటాను పరిశీలించనున్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా నిందితులు రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్, రౌడీషీటర్ నగేష్, అతడి అల్లుడు విశాల్, సినీ నటుడు సూర్యలను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం కేసు పురోగతిని వెల్లడించారు. పోలీసు అధికారుల ప్రమేయంపై త్వరలోనే విచారణ చేపడతామన్నారు. గత నాలుగు రోజులుగా ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని విచారించామని, బ్యాంకు, ఇతర డాక్యుమెంట్లు పరిశీలించినట్లు తెలిపారు. రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌లతోపాటు రౌడీషీటర్ నగేష్, అతని అల్లుడు విశాల్ నిందితులుగా ఉన్నారన్నారు. రాకేష్‌రెడ్డి, జయరాంకు డబ్బులు ఇచ్చాడనే విషయంపై స్పష్టత రాలేదన్నారు. ఇప్పటి వరకు 50 మందిని విచారించామని, పద్మశ్రీ ఫిర్యాదుపై కూడా విచారణ జరుగుతుందన్నారు. జయరాం, షికా చౌదరి మధ్య కొన్ని బ్యాంకు లావాదేవీలు జరిగాయని, అయితే హత్యతో వాటికి సంబంధం ఉన్నట్లు చెప్పలేమన్నారు. రాకేష్‌రెడ్డి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడని అతడికి ఇప్పటి వరకు బ్యాంకు అకౌంట్ లేదని అన్నీ నగదు లావాదేవీలు చేసినట్లు డీసీపీ పేర్కొన్నాడు. -
రాకేశ్‌రెడ్డికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు
సాక్షి, బంజారాహిల్స్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డికి ఇప్పటివరకు సొంత బ్యాంక్ అకౌంట్ కూడా లేదని, ఇప్పటివరకు అన్ని క్యాష్ లావాదేవీలు మాత్రమే చేశాడని, అతను గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం విలేకరులకు తెలిపారు. గత నాలుగు రోజుల నుంచి చాలామందిని విచారించామని, పలువురి బ్యాంకు ఖాత్యాలు, ఇతర పత్రాలను పరిశీలించామని ఈ కేసులో రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌తో పాటు రౌడీషీటర్ నగేష్, అతని అల్లుడు విశాల్ ప్రేమయం ఉందని విచారణలో తేలిందని తెలిపారు. పోలీస్ అధికారుల ప్రమేయంపైనా త్వరలోనే విచారణ జరుపుతామని వెల్లడించారు. రాకేశ్ రెడ్డి జయరామ్‌కు డబ్బులు ఇచ్చాడా? అనే విషయంపై స్పష్టత రాలేదని, ఇప్పటివరకు 50 మందికిపైగా విచారించామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డి గతంలో పోలీసులతో మంతనాలు జరిపిన విషయం వాస్తవమేనని ఏఆర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. హత్య జరిగిన తరువాత ఐదుగురు పోలీసులతో రాకేశ్ మాట్లాడాడని తెలిపారు. ఈ వ్యవహారంలో ఇబ్రహీపట్నం సీఐ, నల్లకుంట ఎస్సైలను విచారిస్తామని తెలిపారు. జయరామ్ భార్య పద్మశ్రీ ఫిర్యాదుపై కూడా విచారణ జరుగుతోందని, జయరాం, శిఖా చౌదరి మధ్య కొన్ని బ్యాంక్ లావాదేవీలు జరిగాయని తెలిపారు. కానీ ఆయన హత్యకు ఈ లావాదేవీలతో సంబంధం ఉన్నట్లు ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ కేసులో ఇంకెవరికైనా ప్రమేయముందా? అనేదానిపై కాల్‌డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
జయరామ్‌ను హత్యచేస్తూ వీడియో!
సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేసు విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా నిందితుడు రాకేష్ రెడ్డిలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. పక్కా పథకం ప్రకారమే జయరామ్‌ను హతమార్చినట్లు ఇప్పటికే నిర్థారణకు వచ్చిన పోలీసులు...అందుకు సంబంధించి ఓ వీడియోను స్వాధీనం చేసుకున్నారు. జయరామ్ హత్యకు ముందు ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకాలు చేయిస్తున్నప్పడు, హత్య చేస్తున్నప్పడు నిందితుడు తన సెల్‌ఫోన్‌తో వీడియో తీసినట్లు గుర్తించిన పోలీసులు... ఆ సమయంలో రౌడీ షీటర్ నగేష్, అతడి మేనల్లుడు విశాల్ కూడా ఘటనా స్థలంలోనే ఉన్నట్లు సమాచారం. కాగా ఏ పని చేసినా రాకేష్ రెడ్డికి వీడియో తీసే అలవాటు ఉండటంతో ...ఇప్పుడు ఆ వీడియోనే అతడి కష్టాలు తెచ్చిపెట్టింది. మరోవైపు ఈ కేసులో నిందితుడు రాకేష్ రెడ్డికి పోలీస్ అధికారుల మధ్య సంబంధాలపై కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నం ఏపీసీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్‌కు ఇప్పటికే నోటీసులు అందాయి. వీరిని బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో పోలీసులు విచారణ చేయనున్నారు. అలాగే ఈ కేసులో అయిదుగురి ప్రమేయం ఉన్నట్లు ఓ నిర్థారణకు వచ్చిన పోలీసులు ఓ వైపు సంబంధించి అనుమానితులను విచారిస్తూనే మరోవైపు రాకేష్‌రెడ్డి కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన రోజు, ఆ తెల్లవారి, అంతకుముందు వారం రోజులు ఎవరెవరికి ఫోన్లు చేశారనే వివరాలను సేకరిస్తున్నారు. హత్య ఘటన కంటే ముందు వారం రోజులు, ఆ తర్వాత రెండు రోజులు చేసిన మొత్తం 300 పైగా కాల్స్ వివరాలను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఎనిమిది రోజుల కస్టడీలో పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని, కేసులో పురోగతి కనిపిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. -
జయరామ్ హత్యకేసు: వెలుగు చూస్తున్న ఆసక్తికర విషయాలు
-
అతడి ఇంట్లో శవాన్ని చూసి పారిపోయారు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. శనివారం ఈ హత్యకేసుకు సంబంధించి మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్లకు చెందిన ఓ కౌన్సిలర్ భర్తని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అంజిరెడ్డి, శ్రీను, రాములు అనే వ్యక్తులు రాకేష్‌రెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాకేష్ రెడ్డి తనకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అంజిరెడ్డి వెల్లడించాడు. రాకేష్ రెడ్డి.. జయరాంను హత్య చేసిన తర్వాత అంజిరెడ్డిని ఇంటికి పిలిపించాడని, రాకేష్ ఇంట్లో జయరాం మృతదేహాన్ని చూసిన అంజిరెడ్డి, అతని మిత్రులు అక్కడినుంచి పారిపోయినట్లు పోలీసు విచారణలో తేలింది. హత్య జరిగిన విషయాన్ని గోప్యంగా ఉంచిన కారణంగా అంజిరెడ్డి, అతని మిత్రులను పోలీసులు విచారిస్తున్నారు. జయరాం హత్యకేసు ప్రధాన నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను జూబ్లీహిల్స్ పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను నాంపల్లి కోర్టు మరోసారి 8 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. పోలీసులు నిందితులను చంచల్ గూడ జైలునుంచి బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించనున్నారు. -
టీడీపీ కీలక నేతలతో రాకేష్‌కు సన్నిహిత సంబంధాలు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి కస్టడీని నాంపల్లి కోర్టు పొడిగించింది. ఈ కేసు విచారణలో భాగంగా రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్ కస్టడీ ముగియడంతో పోలీసులు శనివారం వారిని కోర్టులో హాజరుపర్చారు. నిందితులిద్దరిని మరో ఎనిమిది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు రాకేష్ రెడ్డి అక్రమాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, పోలీసు అధికారులతో పాటు, రౌడీ షీటర్‌తో ఉన్న సంబంధాలు ఇలా ఎన్నో కీలక విషయాలు వెలుగు చూశాయని పోలీసులు ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారణ చేయడం కోసం రాకేష్ రెడ్డి కస్టడీని పొడగించాల్సిందిగా పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అందుకు కోర్టు అనుమతినిస్తూ ఫిబ్రవరి 23 వరకు రాకేష్ రెడ్డితో పాటు అతడి డ్రైవర్ శ్రీనివాస్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు టీడీపీ కీలక నేతలతో రాకేష్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్ నగర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో రాకేష్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలిసిందన్నారు పోలీసు అధికారులు. ఈ క్రమంలో పదవులు, సీట్లు ఇప్పిస్తానంటూ పలువురు నాయకులతో రాకేష్ రెడ్డి బేరసారాలు జరిపాడని.. భారీగా నగదు చేతులు మారినట్లు గుర్తించామన్నారు. రాకేష్ వ్యవహారం బయటకు రావడంతో తమకు న్యాయం చేయాలంటూ ఆశ్రయిస్తున్నవారి సంఖ్య పెరిగిందని పోలీసులు తెలిపారు. -
కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం రాకేష్..!
సాక్షి, హైదరాబాద్: నగరశివార్లలోని టెట్రాన్ కంపెనీసహా ఖాయిలాపడ్డ పరిశ్రమల భూముల్ని కబ్జా చేయడానికే జయరాం హత్యకు రాకేష్‌రెడ్డి కుట్ర చేసినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ విషయాన్ని ఆఖరి నిమిషం వరకు ఇతర నిందితులకూ తెలియకుండా రాకేష్ గోప్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. వీణ పేరుతో ‘హనీట్రాప్’చేసి జయరాంను జూబ్లీహిల్స్ క్లబ్ వద్దకు రాకేష్ రెడ్డి రప్పించాడు. అక్కడి నుంచి అతడిని జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని ఇంటికి తీసుకొచ్చింది మాత్రం కిషోర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ అని తెలుస్తోంది. రాకేష్ రెడ్డితో పాటు నిందితులు శ్రీనివాస్, నగేష్, విశాల్‌ల పాత్రపై ఇప్పటికే స్పష్టత వచ్చినప్పటికీ జూనియర్ ఆర్టిస్ట్ సూర్య, రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీను, రామ్‌ల పాత్రపై లోతుగా ఆరా తీస్తున్నారు. జయరాం భార్య పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదు, విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా శిఖా చౌదరిపై చోరీ కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. లోతుగా విచారించడం కోసం రాకేష్, శ్రీనివాస్‌ల కస్టడీ గడువును మరో మూడు రోజులు పొడిగించాల్సిందిగా కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 15 ఎకరాల భూమిపై కన్నేసి! జయరాం,అతడి భార్య పద్మశ్రీ ప్రవాస భారతీయులుగా ఉండటం, కంపెనీల వ్యవహారాలు చక్కబెట్టడంలో శిఖా చౌదరి విఫలం కావడంతో టెట్రాన్తో పాటు మరో కంపెనీ సైతం లాకౌట్లోకి వెళ్లాయి. కంపెనీలు పని చేయకపోయినా అవి విస్తరించి ఉన్న దాదాపు 15 ఎకరాల స్థలాలు అత్యంత ఖరీదైనవిగా మారిపోయాయి. వీరి నేపథ్యం మొత్తం తెలిసిన రాకేష్ రెడ్డి ఆ భూముల్ని కబ్జా చేయాలని భావించాడు. దానికి మార్గాలు అన్వేషిస్తున్న నేపథ్యంలోనే ఇతడికి జయరాం అమెరికా నుంచి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయనతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకుని చంపేస్తేనే తన పథకం పారుతుందని భావించిన రాకేష్.. జనవరి చివరి వారంలోనే హత్యకు కుట్రపన్నాడు. అయితే ఈ విషయాన్ని ఆఖరి నిమిషం వరకు ఎవరికీ చెప్పలేదు. జయరామ్ వ్యవహారశైలి తెలిసిన రాకేష్‌రెడ్డి కొత్త సిమ్‌కార్డు తీసుకుని వీణ పేరుతో జయరాంను ‘జై’అని పిలుస్తూ చాటింగ్ చేయడం మొదలెట్టాడు. వీరి మధ్య మొత్తం 170 చాటింగ్స్ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ ఒక మాట చెప్పి బుక్కయ్యారు జయరాంను నిర్భంధించాలని కుట్రపన్నిన రాకేష్.. వీణా పేరుతో జనవరి 30న లంచ్‌కు పిలిచాడు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌కు వస్తే అక్కడ నుంచి కలిసి వెళ్దామంటూ వాట్సాప్ సందేశం పెట్టాడు. అతడు రావడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో రౌడీషీటర్ నగేష్‌ను రమ్మని పిలిచాడు. ఓ వ్యక్తిని నిర్భంధించి డబ్బు వసూలు చేద్దామని అతడితో చెప్పాడు. నగేష్ తన సమీప బంధువు విశాల్‌కు ఫోన్‌చేసి నీ లైఫ్ సెటిల్ చేస్తానంటూ తనతో కలుపుకున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ సూర్యకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా రాకేష్‌తో పరిచయం ఉంది. గత నెల 30న రాకేష్‌ను కలిసేందుకు వచ్చిన సూర్య.. తనతోపాటు స్నేహితుడైన అసిస్టెంట్ డైరెక్టర్ కిషోర్‌ను తీసుకువచ్చాడు. దీంతో నగేష్, విశాల్‌లను ఇంట్లోనే ఉంచిన రాకేష్.. వీరిద్దరినీ తీసుకుని బయలుదేరాడు. జూబ్లీహిల్స్ క్లబ్ వరకు వచ్చిన తర్వాత జయరాం కారు నెంబర్ కిషోర్‌కు చెప్పి అతడిని అక్కడ దింపేశాడు. అందులో జై అనే వ్యక్తి వస్తారని, అతడిని వీణ మేడం డ్రైవర్ని అంటూ పరిచయం చేసుకుని, అతడి కారులోనే తన ఇంటికి తీసుకురమ్మని రాకేష్ చెప్పడంతో కిషోర్ అలానే చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత సూర్య, కిషోర్‌లు కింది నుంచే వెళ్లిపోగా.. రాకేష్ సహా మిగిలిన ఇద్దరూ జయరాంను ఇంటి పై భాగంలో ఉన్న గదిలోకి తీసుకువెళ్లి నిర్భంధించారు. హత్య చేస్తారనే విషయం సూర్య, కిషోర్‌లకు తెలియకపోయినా వీణ డ్రైవర్ అంటూ ఒకరు అబద్దం చెప్పగా.. మరొకరు సహకరించారు. దీంతో వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలకు సంబంధించి న్యాయసలహా తీసుకుంటున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు శవాన్ని చూసినా చెప్పక పోవడంతో తొలుత కొన్ని ఖాళీ రూ.100 స్టాంప్ పేపర్లపై బలవంతంగా జయరామ్‌తో సంతకాలు చేయించుకున్న రాకేష్‌రెడ్డి.. ఆపై బలవంతపు వసూలుకు ప్రయత్నించాడు. జయరాంతో అనేక మందికి ఫోన్లు చేయించి రూ.10లక్షల నుంచి కోటి వరకు వీలున్నంత పంపాల్సిందిగా చెప్పించాడు. చివరకు ఒకరు రూ.6 లక్షలు పంపడంతో తన అనుచరుడిని దస్పల్లా హోటల్‌కు పంపి ఆ మొత్తం రిసీవ్ చేసుకున్నాడు. మరుసటి రోజు జయరాంను చంపేద్దామని రాకేష్ అనడంతో.. నగేష్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. తర్వాత విశాల్, రాకేష్‌లు దిండుతో ముఖంపై నొక్కి జయరాంను హత్య చేశారు. మృతదేహం ఇంట్లో ఉండగానే రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీను, రామ్‌లు రాకేష్‌రెడ్డి వద్దకు వచ్చారు. తనకు ఇవ్వాల్సిన రూ.10లక్షలు అడగటం కోసం అంజిరెడ్డి మిగిలిన ఇద్దరినీ వెంట పెట్టుకుని వచ్చాడు. మృతదేహాన్ని చూసిన ఈ ముగ్గురూ భయపడి పారిపోయారు. ఈ విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, సమాచారం ఇవ్వకపోవడం తెలిసిన నేరాన్ని దాచి పెట్టడం కిందికి వస్తుంది. ఇది కూడా నేరమే కావడంతో వీరి విషయంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై దర్యాప్తు అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఓ స్థలానికి సంబంధించి రాకేష్‌కు అంజిరెడ్డి రూ.10లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ల్యాండ్ డీల్ సెటిల్ కాకపోవడంతో తన డబ్బు ఇవ్వాల్సిందిగా అతడు రాకేష్‌పై ఒత్తిడి చేస్తూ అతడి ఇంటికి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ను బయటే కలిశాడు తన వాచ్మెన్/డ్రైవర్ శ్రీనివాస్‌తో క్రైమ్ సీన్‌ను శుభ్రం చేయించిన రాకేష్.. శవాన్ని జయరాం కారులోనే పెట్టుకుని బయలుదేరాడు. నల్లకుంట పోలీసుస్టేషన్ వరకు వెళ్లిన ఇతడు ఫోన్ ద్వారా ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును సంప్రదించాడు. చింతల్ లో వీరిద్దని నివాసాలు సమీపంలోనే కావడంలో ఒకరితో మరొకరికి పరిచయముంది. ఆ సమయంతో ఇన్స్పెక్టర్ వేరే ప్రాంతంలో ఉన్నానని చెప్పడంతో అక్కడకు వెళ్లిన రాకేష్ కారును దూరంగా ఆపి దగ్గరకు వెళ్లాడు. ఆపై హత్య విషయం ఆయనకు చెప్పగా.. తప్పతాగి జరిగిన ప్రమాదంగా చిత్రీకరిం చాలని సీఐ సూచించారు. హైదరాబాద్ చుట్టు పక్కల అలా చేస్తే సీసీ కెమెరాలు ఇతర ఆధారాలతో పోలీసులు పట్టుకుంటారని.. ఏపీకి వెళ్లి సీన్ క్రియేట్ చేయాలని చెప్పాడు. దీంతో రాకేష్ విజయవాడ వైపు బయలుదేరాడు. దారి మధ్యలో ఉండగా రాకేష్‌కు ఏసీపీ మల్లారెడ్డి ఫోన్ చేశాడు (ఆదిభట్లలో ఉన్న ఓ ల్యాండ్ వివాదంలో వీరికి పరిచయం ఏర్పడింది). దీంతో హత్యతోపాటు.. సీన్ క్రియేట్ చేసేందుకు ఓ స్నేహితుడు సాయం చేశారంటూ మల్లారెడ్డికి రాకేష్ వివరించారు. ఆపై నందిగామలో బీరు కొని.. ఐతవరంలో రోడ్డు కిందకు కారును తోసి రాకేష్ వెనక్కు వచ్చేశాడు. ఆ డబ్బుపై పొంతనలేని కథనాలు జయరాం హత్య కేసులో నందిగామ పోలీ సుల విచారణలో రాకేష్ రూ.4.17 కోట్ల ఆర్థిక లావాదేవీలను తెరపైకి తెచ్చాడు. ఇందులో రూ.80 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా పంపానన్నాడు. అక్కడి పోలీసులు అది వాస్తవమేనని ధ్రువీకరిం చారు. హత్యలోనూ రాకేష్, శ్రీనివాస్‌ల పాత్ర మాత్రమే ఉందని తేల్చేశారు. కేసు హైదరాబాద్‌కు బదిలీ అయ్యాక బంజారాహిల్స్ ఏసీపీ నేతృత్వంలో జరిగిన విచారణలో ఇతరుల పాత్ర ఉన్నట్లు తేలింది. జయరాంకు ఇచ్చిన డబ్బుపై రాకేష్ స్పష్టత ఇవ్వలేదు. తొలుత ఈ మొత్తాన్ని అంజిరెడ్డి సమక్షంలో ఇచ్చానని చెప్పాడు. అంజిరెడ్డి సమక్షంలో రాకేష్‌ను విచారించగా ఇది అబద్ధమని తేలింది. ఆ తర్వాత అమెరికాలో ఉన్న ఓ వ్యక్తి ఖాతా నుంచి జయరాం అమెరికా ఖాతాకు బదిలీ చేయించానని అన్నాడు. ఈ హత్యలో శిఖాచౌదరి పాత్రలేదని నిర్ధారించారు. జయరాం మరణవార్త విన్న వెంటనే ఆయన ఇంటికి వెళ్లి తన ప్రాజెక్టు కాగితాలు తీసుకున్నా నని ఆమె అంగీకరిస్తున్నారు. దీనిపై జయరాం భార్య పద్మశ్రీ ఓ ఫిర్యాదూ ఇచ్చారు. ఈ పరి ణామాల నేపథ్యంలో శిఖాచౌదరిపై చోరీ కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. -
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో కొత్త డ్రామా తెర మీదకు తెచ్చాడు. తాను అక్రమాల ద్వారా సంపాదించిన డబ్బు ఖర్చు చేయించడమే కాకుండా, పెళ్లికి నిరాకరించిన జయరామ్ మేనకోడలు శిఖా చౌదరిపై కోపంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో తవ్వినకొద్ది కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ హత్యకేసులో రాకేష్ రెడ్డితో పాటు డ్రైవర్ శ్రీనివాస్, విశాల్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. శిఖా చౌదరి బ్రేకప్ చెప్పడంతో.. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...‘శిఖా చౌదరి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతోపాటు, రాకేష్ రెడ్డికి బ్రేకప్ చెప్పి దూరం పెట్టడంతో అతడు కోపం పెంచుకున్నాడు. దీంతో శిఖా చౌదరికి ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆమెపై ఒత్తిడి పెంచాడు. అంతేకాకుండా ఆమెకు జయరామ్ బహుమతిగా ఇచ్చిన కారును రాకేష్ రెడ్డి తీసుకు వెళ్లాడు. ఈ విషయాన్ని శిఖా చౌదరి తన మేనమామకు చెప్పడంతో ఆ డబ్బులు తాను ఇస్తానని జయరామ్ హామీ ఇచ్చి, కారు తిరిగి శిఖాకు ఇప్పించాడు. ఆ తర్వాత జయరామ్‌ను డబ్బులు అడిగితే సరిగా స్పందించకపోవడంతో ఎలాగైనా ఆ డబ్బులు వసూలు చేయడానికి రాకేష్ రెడ్డి పథకం వేశాడు. దీంతో జయరామ్ కుటుంబంతో పాటు, ఆయన ఆస్తులపై రెక్కీ నిర్వహించాడు. ఎలాగైనా జయరామ్‌ను బెదిరించి ఆస్తి కొట్టేసి, ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యేందుకు పక్కాగా స్కెచ్ వేశాడు. హనీ ట్రాప్‌తో పక్కా స్కెచ్ ఇందుకోసం జయరామ్ అమెరికా నుంచి రాగానే రాకేశ్ రెడ్డి ‘హనీ ట్రాప్‘ చేసి, ఇంటికి వచ్చేలా ప్లాన్ చేశాడు. ఇందుకోసం అతడు తన డ్రైవర్ శ్రీనివాస్, రౌడీ షీటర్ నగేష్, అతడి మేనల్లుడు విశాల్, జూనియర్ ఆర్టిస్ట్ సూర్యప్రసాద్ సాయం తీసుకున్నాడు. జయరామ్‌ను 19 గంటల పాటు తన ఇంట్లో నిర్భందించాడు. ఆ సమయంలో డబ్బులు అడగగా...జయరామ్ రూ.6 లక్షలు సమకూర్చాడు. తనను వదిలిపెడితే రూ.10 కోట్లు ఇస్తానని జయరామ్ ఆఫర్ చేసినా రాకేష్ రెడ్డి నిరాకరించాడు. అంతేకాకుండా నిన్ను చంపితే నాకు రూ.100 కోట్లు వస్తాయంటూ... అతడితో ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకుని దారుణంగా హతమార్చాడు. ఈ హత్యకు డ్రైవర్ శ్రీనివాస్‌తో పాటు విశాల్ కూడా సహరించాడు. ఆ తర్వాత హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని కారులో కృష్ణాజిల్లా నందిగామకు వెళ్లాడు. ఆ తర్వాత కారు అక్కడే వదిలేసి తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు. విశాల్ లైఫ్ సెటిల్ చేస్తానంటూ.. రాకేష్ రెడ్డి తాను చేస్తున్న అక్రమ దందాలకు రౌడీ షీటర్ నగేష్ సాయం తీసుకునేవాడు. ఆ నేపథ్యంలో అతడి మేనల్లుడు విశాల్‌తో పరిచయం అయింది. నీ లైఫ్ సెటిల్ చేస్తానంటూ ఆశచూపించిన రాకేష్ రెడ్డి... జయరామ్ హత్యకు విశాల్ సాయం తీసుకున్నాడు. అంతేకాకుండా హత్య కేసులో నీ పేరు రాకుండా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చాడు. జయరామ్ హత్య తర్వాత ఆస్తులను లిటిగేషన్ చేస్తామని, అతడి భార్య పద్మశ్రీతో సెటిల్మెంట్ చేసుకుందామని విశాల్ ఆశ చూపించిన రాకేష్ చిట్టచివరికి పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. ఆది నుంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న ఈ ఎపిసోడ్లో జయరామ్ హత్యకు శిఖా చౌదరి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
పథకం ప్రకారం రప్పించి, బంధించి..!
-
పథకం ప్రకారమే జయరామ్ హత్య
-
దిండుతో నొక్కి చంపేశారు!
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరామ్ హత్య పక్కా పథకం ప్రకారం జరిగిందేనని పోలీసులు తేల్చారు. హత్యచేయాలన్న ఉద్దేశంతోనే ‘హనీ ట్రాప్’ద్వారా పిలిపించిన రాకేష్‌రెడ్డి తదితరులు కొన్ని బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకుని ఆపై దిండుతో ముఖంపై నొక్కి హతమార్చారని తెలిసింది. దాదాపు 11 మంది పోలీసులతో సంబంధాలు కలిగి ఉన్న రాకేష్‌రెడ్డి వారితో పాటు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి అనేక మందిని బెదిరించి డబ్బు కాజేసినట్లు, మోసాలకు పాల్పడినట్లు తేలింది. గురువారం సికింద్రాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే బాధితుడు బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, జయరామ్ హత్య కేసుకు సంబంధించి మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. గురువారం సాయంత్రానికి రాకేష్, శ్రీనివాస్‌లతో పాటు విశాల్, రౌడీషీటర్ నగేష్‌ల పాత్రలపై ఆధారాలు లభించాయని తెలిసింది. మరోపక్క ఈ కేసులో శిఖాచౌదరిని దాదాపు 7 గంటల పాటు విచారించిన పోలీసులు.. రాత్రి 8 గంటలకు ఆమెను విడిచిపెట్టారు. అసలు జయరాంకు డబ్బు ఇచ్చాడా? ఈ ఘటనకు ప్రధాన కారణం రాకేష్‌రెడ్డి, జయరామ్ మధ్య ఉన్న ఆర్ధిక వివాదాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తేల్చారు. 2016–18 మధ్య రాకేష్ పలు దఫాల్లో జయరామ్‌కు రూ.4.17 కోట్లు ఇచ్చాడని, ఇందులో రూ.80లక్షలు ఒకసారి, 40లక్షలను రెండుసార్లు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేశాడని వెల్లడించారు. ఇదే విషయాన్ని నిందితుల అరెస్టు నేపథ్యంలో విడుదల చేసి అధికారిక ప్రెస్‌నోట్‌లోనూ పొందుపరిచారు. అయితే కేసు జూబ్లీహిల్స్‌కు బదిలీ అయిన తర్వాత నిందితులను విచారిస్తున్న హైదరాబాద్ పోలీసులకు ఈ ఆర్థికలావాదేవీలకు సంబంధించి ఆధారాలేవీ లభించలేదు. దీంతో గురువారం శిఖా చౌదరిని సైతం పోలీసుస్టేషన్‌కు పిలిపించిన పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీలపై ప్రాథమిక ఆధారాలు సైతం లభించకపోవడం, రాకేష్ సరైన వివరాలు వెల్లడించకపోవడంతో పోలీసులు జయరామ్ బ్యాంకు లావాదేవీలను విశ్లేషించారు. వీటిలో కూడా ఎక్కడా ఆ స్థాయిలో లావాదేవీలు లేవని భావిస్తున్నారు. దీంతో హత్య వెనుక మరేదైనా కారణం ఉందా? లేక జయరాం ఆస్తిని కాజేయడానికి బెదిరిస్తూ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దిండుతో ముఖంపై ఒత్తి పెట్టడంతో! రాకేష్ రెడ్డి తదితరులు గత 31వ తేదీ ఆర్థిక లావాదేవీల విషయమై జయరామ్‌తో వాగ్వాదానికి దిగారు. ఓ దశలో వీరు జయరామ్‌పై దాడి చేయడంతో ఆయన కూర్చున్న ప్రాంతంలోనే పడిపోయారు. అనంతరం దిండుతో జయరామ్ ముఖంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. తర్వాత మృతదేహాన్ని శ్రీనివాస్ సాయంతో జయరామ్ కారులోకి మార్చి రాకేష్ ఒక్కడే దాదాపు 5గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ 11 మంది పోలీసులతో మాట్లాడాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం రాకేష్ ఇంట్లో క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ చేశారు. కస్టడీలో ఉన్న నిందితులతో పాటు కొత్తగా పట్టుకున్న వారినీ తీసుకువెళ్లి క్లూస్ టీమ్ సమక్షంలో దీన్ని చేపట్టారు. ఈ తతంగం దాదాపు 40 నిమిషాలు జరిగింది. మరోపక్క రాకేష్ రెడ్డి బ్యాంక్ అకౌంట్‌ను స్తంభింపజేసిన అధికారులు సెల్ఫోన్లు, రెండు కార్లను, ఇంటిని సైతం సీజ్ చేశారు. జయరామ్ హత్య కేసులో శిఖాచౌదరితోపాటు మరో నలుగురిని విచారించామని పోలీసులు తెలిపారు. జయరామ్ కంపెనీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నామని, కొన్ని పత్రాలు కూడా తెప్పించి పరిశీలించామన్నారు. నాలుగున్నర కోట్లు జయరామ్‌కి అప్పు ఇచ్చే స్థోమత రాకేశ్‌కు ఉందా? అన్న కోణంలోనూ విచారణ జరుగుతోందన్నారు. అవసరమైతే శిఖాచౌదరిని మరింత లోతుగా విచారిస్తామన్నారు. పలువురు పోలీసు అధికారులపై కూడా ఆరోపణలున్నాని వీటినీ పరిశీలిస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కోస్టల్ బ్యాంకు ఉద్యోగులను కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం రప్పించి, బంధించి..! ఏపీ పోలీసుల విచారణలో రాకేష్‌రెడ్డి ఈ హత్య జరిగిన తీరును వివరిస్తూ.. అనుకోని పరిస్థితుల్లో జరిగిన పెనుగులాటతో జయరామ్ చనిపోయాడని, తనతో పాటు తన వాచ్‌మన్ శ్రీనివాస్‌కు మాత్రమే ఇందు లో ప్రమేయం ఉందని చెప్పాడు. దీన్నే అధికారులు కూడా నిర్ధారించారు. అయితే తెలంగాణ విచారణలో అనేక కొత్త విషయా లు బయటకొస్తున్నాయి. జయరామ్‌ను ‘హనీ ట్రాప్’ చేయడం కోసం రాకేష్‌రెడ్డి తన స్నేహితుడైన జూనియర్ ఆర్టిస్ట్ సూర్యను వినియోగించుకున్నాడని వెల్లడైంది. అతడి తో గత నెల 29 రాత్రి జయరామ్‌కు ఫోన్ చేయించిన రాకేష్.. ఓ యువతి విషయం చర్చించేలా చేశాడు. దీంతో మరుసటి రోజు జయరామ్ స్వయంగా ఆ జూనియర్ ఆర్టిస్ట్ కు కాల్ చేశారు. దీంతో జయరాంను తీసు కుని తన ఇంటికి రావాల్సిందిగా ఆర్టిస్ట్‌కు రాకేశ్ సూచించాడు. జయరాంను ఇంటికి తీసుకొచ్చే సమయానికే.. రాకేష్ ఇంట్లో వాచ్‌మన్ శ్రీనివాస్‌తోపాటు ఎస్సార్‌నగర్ రౌడీషీటర్ నగేష్, విశాల్ అనే మరో వ్యక్తి ఉన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ అక్కడ నుంచి వెళ్లిపోగా.. మిగిలిన వారు జయరామ్‌ను బలవంతంగా లోపలకు తీసుకువెళ్లారు. 30, 31 తేదీల్లో జయరామ్‌ను ఆ ఇంట్లోనే నిర్బంధించి డ బ్బు కోసం అనేక మందికి ఫోన్లు చేయిం చారు. బలవంతంగా 10 ఖాళీ బాండ్ పేపర్ల పై సంతకాలు చేయించుకున్నారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల కోసం సిరిసిల్లకు చెందిన గడ్డం శ్రీను, అంజిరెడ్డి, చొక్కారామ్లు రాకేశ్ ఇంటికి వచ్చారు. అక్కడ వీరికి జయరామ్ తారసపడినా.. ఏమీ మాట్లాడలేదని తెలిసింది. పోలీసులు గురువారం సూర్యను అదుపులోకి తీసుకుని విచారించారు. -
ఇప్పుడు అవన్నీ చెప్పలేను : శిఖా చౌదరి
సాక్షి, హైదరాబాద్ : ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీల కోసమే ఈ హత్య జరిగిందని అందరూ భావించినప్పటికీ.... రాకేష్ రెడ్డి ఒక్క రూపాయి కూడా జయరామ్‌కి ఇవ్వలేదని పోలీసుల విచారణలో తేలింది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాం మేనకోడలు శిఖా చౌదరిని గురువారం పోలీసులు విచారించారు. ఏసీపీ కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు శిఖాను ప్రశ్నించారు. శిఖా ఆర్థిక లావాదేవీలు, విలాసవంతమైన జీవితంపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా రాకేష్‌రెడ్డితో శిఖా పరిచయం, జయరాం భార్య పద్మశ్రీ చేసిన ఆరోపణలపై శిఖా చౌదరిని ప్రశ్నించినట్లు సమాచారం. కాగా విచారణ అనంతరం శిఖా చౌదరి మీడియాతో మాట్లాడారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పినట్లు తెలిపారు. అవసరమైన సమయంలో మళ్లీ తప్పకుండా మీడియా ఎదుటకు వస్తానని, ప్రస్తుతం విచారణలో అడిగిన విషయాలు చెప్పలేనని పేర్కొన్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని వ్యాఖ్యానించారు. ఇక జయరాం హత్యలో కమెడియన్ సూర్యప్రసాద్ అలియాస్ డుంబు కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. మంచి అమ్మాయి ఉందంటూ అతడే జయరాంను రాకేష్ ఇంటికి తీసుకువెళ్లినట్లుగా సమాచారం. ఇక రాకేష్‌తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న 30 మందిని పోలీసులు విచారించారు. -
బయటపడుతున్నా రాకేష్ రెడ్డి లీలలు
-
‘శిఖా చౌదరిని పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పాడు’
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో రాకేష్ అరెస్టు కావడంతో అతడి బాధితులు వెలుగులోకి వస్తున్నారు. ఎస్సార్ నగర్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే రియల్టర్ దగ్గర రాకేష్‌రెడ్డి కోటీ యాభై లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. అప్పు తిరిగి చెల్లించమని అడిగితే పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడేవాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అదే విధంగా అప్పు ఎగ్గొట్టేందుకు రాకేష్‌రెడ్డి అమ్మాయిలను ఎరవేసే ప్రయత్నాలు చేస్తాడని వెల్లడించాడు. ‘శిఖా చౌదరిని పెళ్లి చేసుకుంటున్నా అంటూ చెప్పుకుని తిరిగేవాడు. జయరాంకు అప్పు ఇచ్చే స్థోమత రాకేష్‌కు లేదు. అతడి వద్ద నాలాంటి బాధితులు చాలా మందే ఉన్నారు. చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసేవాడు. నా దగ్గర కోటిన్నర తీసుకున్నాడు ’ అని సాక్షి టీవీతో రాజ్‌కుమార్ పేర్కొన్నాడు. కాగా జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి ద్వారా అతడికి స్నేహితుడైన రాకేష్... జయరామ్ ఆస్తిపై కన్నేసి అతడిని హత్య చేసిన సంగతి తెలిసిందే. రాకేష్ రెడ్డితో పాటు హైదరాబాద్‌కు చెందిన రౌడీ షీటర్ నగేశ్ కూడా జయరాం హత్యలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
నగేశ్ సాయంతో రాకేష్ రెడ్డి భారీ స్కెచ్
-
నగేశ్ సాయంతో రాకేష్ రెడ్డి భారీ స్కెచ్
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్యకేసులో తవ్విన కొద్ది అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పాటు హైదరాబాద్‌కు చెందిన రౌడీ షీటర్ నగేశ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. జయరామ్‌ను హత్య చేసిన రోజు ఘటనా స్థలంలో నగేశ్ ఉండటమే కాకుండా హత్యకు సహకరించినట్లు సమాచారం. అలాగే జయరామ్‌ను ట్రాప్ చేసేందుకు అమ్మాయి పేరుతో రాకేష్ రెడ్డితో పాటు నగేశ్ కూడా వాట్సాప్ చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే జయరామ్‌ను బయటకు రప్పించి, కిడ్నాప్ చేయడమే కాకుండా, అతడితో తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయ్యాయి. ఇప్పటికే నగేశ్‌పై ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ రౌడీ షీటర్ కేసు నమోదైంది. గత కొంతకాలంగా రాకేష్ రెడ్డి...నగేశ్‌తో కలిసి దందాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. (జయరాం హత్య కేసులో సంచలన నిజాలు...) ఇక జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి పరిచయమయ్యాక ఆమె ద్వారా రాకేష్‌కు జయరాం స్నేహితుడు అయ్యాడు. ఈ నేపథ్యంలో జయరామ్ ఆస్తిపై కన్నేసిన రాకేష్...ఎలాగైనా ఆస్తిని చేజిక్కించుకోవాలని భారీ స్కెచ్ వేశాడు. అందుకోసం నగేశ్ సహకారం కూడా తీసుకున్నాడు. పోలీసులు తమ విచారణలో భాగంగా నగేశ్‌తో పాటు సిరిసిల్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంజిరెడ్డి, చొక్కారామ్‌లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. జయరామ్ హత్యకు ముందు, ఆ తర్వాత రాకేష్ రెడ్డి వీరితో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. మరోవైపు నిందితుడు రాకేష్ రెడ్డి నివాసంలో పోలీసులు ఇవాళ తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 10లోని రాకేష్ నివాసంలో పోలీసులు.. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే హత్య జరిగిన ప్రాంతంలో నిందితుల వాంగ్ములం నమోదు చేశారు. రాకేష్ రెడ్డి నివాసంతో పాటు, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన రోజు రాకేష్ ఇంటికి పలువురు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు కృష్ణాజిల్లా నందిగామ టోల్ గేట్ వద్ద సీసీ ఫుటేజ్‌ను సేకరించారు. -
ఏసీపీ కార్యాలయానికి శిఖా చౌదరి
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై, వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న జయరాం మేనకోడలు శిఖా చౌదరిని కూడా గురువారం పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు ఏసీపీ కార్యాలయంలో విచారణ కొనసాగనుంది. కాగా మొదటి రోజు విచారణలో భాగంగా ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న 30 మందిని పోలీసులు విచారించారు. ఇందులో భాగంగా సినీ నటుడు, కమెడియన్ సూర్య ప్రసాద్ అలియాస్ డుంబును కూడా విచారించినట్లు తెలుస్తోంది. (జయరాం హత్య కేసులో సంచలన నిజాలు...) సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు జయరాం హత్యకు ముందు రాకేష్ రెడ్డి రోజు జరిపిన కాల్ లిస్టు ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన నాడు రాకేష్‌రెడ్డి ఇంట్లో జరిగిన సీన్‌ను రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. కాగా ఈ విచారణలో సీసీ కెమెరాలు కీలకంగా మారనున్నాయి. ఇక ఈ కేసులో శిఖా చౌదరి పాత్రపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపనున్నారు. -
పక్కా ప్లాన్‌తో జయరామ్‌ను ట్రాప్ చేసా
-
జయరాం హత్య కేసులో సంచలన నిజాలు...
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్యకేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి పాటు మరో నిందితుడు శ్రీనివాస్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు..వారి నుంచి కీలక విషయాలు రాబట్టారు. ఇప్పటివరకూ ఆర్థిక లావాదేవీల కోసమే ఈ హత్య జరిగిందని అందరూ భావించినప్పటికీ.... రాకేష్ రెడ్డి ఒక్క రూపాయి కూడా జయరామ్‌కి ఇవ్వలేదని పోలీసుల విచారణలో తేలింది. బెదిరింపులతో జయరామ్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలన్న పథకంతోనే అతడిని రాకేష్ రెడ్డి ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులను నిందితుడు రంగంలోకి దింపి, వాళ్లు తనకు అప్పుగా డబ్బు ఇచ్చినట్లు రాకేష్ రెడ్డి సాక్ష్యాలు సృష్టించాడు. అంతేకాకుండా జయరామ్ హత్యకు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు సహరించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చింతల్ రౌడీ షీటర్‌తో పాటు మొత్తం ఏడుగురు వ్యక్తులను వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా జయరామ్‌ను హత్య చేసిన తర్వాత కొన్ని గంటలపాటు శవాన్ని కారులో వేసుకుని నగరంలోనే రాకేష్ సంచరించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో అతడు 11మంది పోలీస్ అధికారులతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హత్య అనంతరం వారితో అతడు ఫోన్లో మాట్లాడినట్లు విచారణలో వెల్లడి కాగా, వారిలో నలుగురు డీఎస్పీలు, నలుగురు ఇన్స్పెక్టర్లు కూడా ఉన్నారు. దీంతో పోలీస్ అధికారుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఈ కేసులో మరో అనుమానితురాలిగా ఉన్న జయరామ్ మేనకోడలు శిఖా చౌదరికీ నోటీసులు జారీ చేసిన పోలీసులు నిన్న ఆమెను బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి పిలిపించి, మహిళా పోలీసుల సహకారంతో ఇద్దరు నిందితులతో కలిపి విచారించారు. -
పథకం ప్రకారం రప్పించి...
-
నోట్లో బీరు పోసి.. ప్రమాదంగా చిత్రీకరించు!
సాక్షి, హైదరాబాద్: ‘‘శవం నోట్లో మద్యం పోసి, ప్రమాదంగా చిత్రీకరించు. ఈ క్రైమ్ సీన్ ఆంధ్రప్రదేశ్‌కు మారిస్తే మంచిది. కారులో శవాన్ని తీసుకుని ఒక్కడివే వెళ్లు. టోల్గేట్ల వద్ద, మద్యం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు’’– కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసు నిందితుడు రాకేష్‌రెడ్డికి పోలీసు అధికారులు ఇచ్చిన సూచనలివి. జయరామ్ గతనెల 31న జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని రాకేష్ ఇంట్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాకేష్‌తోపాటు మరో నిందితుడు శ్రీనివాస్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్నారు. తొలిరోజు బుధవారం వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, దర్యాప్తు అధికారిగా కె.శ్రీనివాసరావు జరిపిన విచారణలో పలు కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. జయరామ్‌ను హత్య చేసిన తర్వాత కొన్ని గంటల పాటు శవాన్ని కారులో వేసుకుని నగరంలోనే సంచరించినట్లు వెల్లడైంది. పథకం ప్రకారం రప్పించి... గతంలో జయరామ్‌పై కేసు నమోదు కావడంతో ఆయన కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆర్థిక అవసరాల నిమిత్తం తన మేనకోడలు శిఖా చౌదరికి సన్నిహితుడైన రాకేష్ నుంచి మూడు దఫాల్లో రూ.4.17 కోట్లు అప్పుగా తీసుకున్నారు. వడ్డీతో కలిపి మొత్తం రూ.6 కోట్లు గతేడాది అక్టోబర్‌లో ఇవ్వాల్సి ఉండగా జయరామ్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో గతనెల 29న జయరామ్ నగరానికి వచ్చినట్టు తెలియడంతో ఫోన్ ద్వారా ఆయన్ను సంప్రదించేందుకు రాకేష్ ప్రయత్నించి విఫలమయ్యాడు. ఉద్దేశపూర్వకంగానే జయరామ్ తనను పట్టించుకోవట్లేదని భావించి, ఆయన్ను ట్రాప్ చేయడానికి ఓ కొత్త సిమ్‌కార్డు తీసుకుని వీణ పేరుతో చాటింగ్ చేశాడు. తర్వాత పథకం ప్రకారం గతనెల 30న జయరామ్‌ను ఒంటరిగా తన ఇంటికి రప్పించి నిర్బంధించాడు. ఆ మరుసటి రోజు వరకు అక్కడే ఉంచాడు. 31న మధ్యాహ్నం డబ్బు విషయంలో జరిగిన గొడవ నేపథ్యంలో రాకేష్ దాడి చేయడంతో జయరామ్ ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వాచ్‌మన్ శ్రీనివాస్ సహకారంతో శవాన్ని కారులో ఎక్కించుకుని సాయంత్రం వరకు నగరంలోని అనేక ప్రాంతాల్లో తిరిగాడు. తన స్నేహితుడైన ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును కలవడానికి నల్లకుంట ఠాణాకు వెళ్లిన రాకేష్.. శవం ఉన్న కారుతో అక్కడే దాదాపు 40 నిమిషాలు వేచి చూశాడు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో ఆయనతోపాటు ఏసీపీ మల్లారెడ్డిని సంప్రదించాడు. వీరిద్దరూ ఇచ్చిన సలహా మేరకు ఈ హత్యను డ్రంక్ అండ్ డ్రైవింగ్ నేపథ్యంలో జరిగిన ప్రమాదంగా చిత్రీకరించాలని పథకం వేశాడు. ఏసీపీ, ఇన్స్పెక్టర్ ఇచ్చిన సలహాల మేరకు జయరామ్ శవం నోట్లో, వస్త్రాల పైనా మద్యం పోయడంతో పాటు ఆయన కారులో, చేతుల్లో మద్యం సీసాలు ఉంచాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే తాను విజయవాడ వస్తున్నట్లు జయరామ్ తన ఉద్యోగులకు సమాచారం ఇచ్చాడన్న సంగతి తెలుసుకున్న రాకేష్.. అదే విషయాన్ని ఈ ఖాకీలకు చెప్పాడు. దీంతో క్రైమ్ సీన్‌ను ఏపీకి మారిస్తే మంచిదని వారు సలహా ఇవ్వడంతో మృతదేహం ఉన్న కారును తీసుకుని విజయవాడ వైపు బయలుదేరాడు. మద్యం ఖరీదు చేయడానికి, కారుతో సహా శవాన్ని వదిలేయడానికి అనువైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ నందిగామ వరకు వెళ్లాడు. 31వ తేదీ రాత్రి 10.30 గంటల ప్రాంతంలో నందిగామ పాతబస్టాండ్ వద్ద ఉన్న విజయబార్కు వెళ్లి మద్యం బాటిళ్లు కావాలని కోరాడు. వారు మద్యం ఇవ్వడానికి నిరాకరించడంతో బీరు సీసాలు కొనుగోలు చేసుకుని తిరిగి కారులో బయలుదేరాడు. ఐతవరం వద్దకు చేరుకున్న తర్వాత వాహనాన్ని రోడ్డు పక్కగా ఆపి, వెనుక సీట్లో ఉన్న మృతదేహాన్ని డ్రైవింగ్ సీటులోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో శవం నోట్లో, వస్త్రాలపై బీరు పోసి.. జయరామ్ చేతిలో బీరు సీసా పెట్టాడు. అనంతరం కారును రోడ్డు మార్జిన్ కంటే కిందికి తీసుకెళ్లి వదిలేశాడు. అక్కడ నుంచి బస్సులో తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు. ఆ డబ్బుపై పోలీసుల ఆరా... ఈ కేసులో మరో అనుమానితురాలిగా ఉన్న జయరామ్ మేనకోడలు శిఖా చౌదరికీ నోటీసులు జారీ చేసిన పోలీసులు బుధవారం ఆమెను బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి పిలిపించారు. మహిళా పోలీసుల సహకారంతో ఇద్దరు నిందితులతో కలిపి ఆమెను విచారించారు. దర్యాప్తు అధికారులు ప్రధానంగా రూ.4.17 కోట్ల విషయాన్ని కూపీ లాగుతున్నారు. ఆ నగదు ఎవరిది? ఎక్కడ నుంచి తీసుకొచ్చారు తదితర అంశాలు ఆరా తీస్తున్నారు. భారీ మొత్తం కావడంతో దీనిపై ఆదాయపుపన్ను శాఖ అధికారులకూ సమాచారం ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే ఈ హత్యలో శిఖా చౌదరి పాత్ర ఏమైనా ఉందా? అనే అంశాన్నీ ఆరా తీస్తున్నారు. రాకేష్ వెల్లడించిన అంశాలు, కాల్ డేటాలో లభించిన ఆధారాలను పరిగణలోకి తీసుకుంటున్న పోలీసులు ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఏసీపీ మల్లారెడ్డిలకూ నోటీసులు జారీ చేసి విచారించాలని నిర్ణయించారు. హత్య తర్వాత ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుతో 13 సార్లు, ఏసీపీ మల్లారెడ్డితో 29 సార్లు సంభాషించినట్లు రాకేష్ కాల్ రికార్డుల ద్వారా వెల్లడైంది. గురు, శుక్రవారాల్లోనూ రాకేష్, శ్రీనివాస్‌లు తమ కస్టడీలో ఉండనుండటంతో ఆ సమయంలోనే ఇద్దరు ఖాకీలను విచారించాలని యోచిస్తున్నారు. -
కీలక విషయాలు వెల్లడించిన రాకేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్యకేసు విచారణను హైదరాబాద్ పోలీసులు వేగవంతం చేశారు. కోర్టు ఆదేశాలతో ఈ కేసులో నిందితులుగా ఉన్న రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. డబ్బుల కోసమే జయరామ్‌ను ఇంటికి పిలిచి నిర్భంధించినట్టు రాకేశ్ పోలీసులకు తెలిపాడు. జయరామ్‌ను వేధిస్తే డబ్బులు వసూలు అవుతాయని భావించి.. అందరికీ ఫోన్ కాల్స్ చేపించానని చెప్పాడు. జనవరి 31వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు జయరామ్‌ను కొట్టడంతో.. అతను మృతి చెందినట్టు ఒప్పుకున్నాడు. హత్య చేసిన తర్వాత జయరామ్ మృతదేహాన్ని కారులో ఉంచుకుని హైదరాబాద్‌లో తిరిగానని తెలిపాడు. హత్య జరిగిన తర్వాత ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో 29 సార్లు మాట్లాడినట్టు.. అదే రోజు నల్లకుంట సీఐ శ్రీనివాస్‌కు 13 సార్లు ఫోన్ చేసినట్టు పేర్కొన్నాడు. బీర్ బాటిల్స్ కోని దాన్ని జయరామ్ ఒంటిపై, మూతిపై పోసి.. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకున్నట్టు చెప్పాడు. -
పోలీసుల కస్టడీలో రాకేష్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులోని నిందితులను మూడురోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను రెండు వారాలపాటు కస్టడీలోకి అనుమతించాలని కోరుతూ నాంపల్లి కోర్టు జడ్జి ముందు జూబ్లీహిల్స్ పోలీసులు హాజరుపరిచారు. విచారించిన కోర్టు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు పోలీసులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌ల కస్టడీలోకి తీసుకుంటారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితులను విచారించనున్నారు. -
నగరానికి జయరామ్ కేసు నిందితులు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం పీటీ వారెంట్‌పై నందిగామ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. జయరామ్ హత్య గత నెల 31న జూబ్లీహిల్స్‌లోని రాకేష్‌రెడ్డి ఇంట్లో జరిగింది. దీనికి సంబంధించి నందిగామ పోలీసులు రాకేష్‌తో పాటు వాచ్‌మన్ శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేశారు. పెనుగులాట, పిడిగుద్దులతో ఈ దారుణం జరిగిందని తేల్చారు. ఆపై గత గురువారం ఈ కేసు హైదరాబాద్‌కు బదిలీ కావడంతో జూబ్లీహిల్స్ ఠాణాలో రీ–రిజిస్టర్ చేశారు. నిందితుల్ని సైతం తమకు అప్పగించాలని కోరుతూ నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ తీసుకుని నందిగామ వెళ్లిన బృందం రెండు రోజులు వేచి చూసింది. ఎట్టకేలకు సోమవారం నందిగామ జైలులో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు నిందితుల్ని హైదరాబాద్ తీసుకువచ్చారు. వీరిని ఎల్బీ నగర్‌లోని న్యాయమూర్తి ఇంట్లో ఆయన ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. జయరామ్ హత్యలో శిఖా చౌదరితో పాటు ఇతరుల పాత్ర, పోలీసు అధికారులైన ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల ప్రమేయాలు తెలియాలంటే నిందితుల్ని విచారించాల్సి ఉంది. దీంతో పాటు ఈ కేసులో బయటకు రాకుండా ఉండిపోయిన వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి, జయరామ్ భార్య పద్మశ్రీ చేసిన ఆరోపణలపైన కూడా లోతైన విచారణ అవసరమని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
జయరాం హత్య కేసు.. రహస్య ప్రాంతంలో విచారణ
సాక్షి, హైదరాబాద్ : వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పని మనిషి, వాచ్ మెన్, స్నేహితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. శిఖా చౌదరి, జయరాం మధ్య ఉన్న సంబంధాల పై విచారణ సాగినట్లు సమాచారం. ఓ రహస్య ప్రాంతంలో వీరందరినీ పోలీసులు విచారించారు. త్వరలోనే శిఖా చౌదరికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉంది. మరోవైపు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లని నాంపల్లి కోర్టు జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యడీషియల్ రిమాండ్ విధించింది. వీరిద్దరిని చంచల్ గూడ జైలుకు తరలించారు. రేపు పోలీసులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌ల కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. నిందితులిద్దరిపై వారం రోజుల కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. -
మళ్లీ అదే మాట చెప్పిన జయరాం భార్య
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విచారణలో భాగంగా బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాసరావు శుక్రవారం జయరాం భార్య పద్మశ్రీ వాంగ్మూలం తీసుకున్నారు. తన భర్త హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర ఉందని ఆమె పునరుద్ఘాటించారు. (శిఖా చౌదరి ప్లాన్, రాకేష్ రెడ్డి యాక్షన్) మరోవైపు శిఖా చౌదరికి త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి, మరో నిందితుడు శ్రీనివాస్‌లను తమకు అప్పగించాలని జూబ్లీహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో రేపు ఇద్దరు నిందితులను హైదరాబాద్ తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఇద్దరిని తమ కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులిద్దరితో క్రైమ్ సీన్ రీ కంస్ట్రక్షన్ చేయనున్నారు. తనకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం జయరాంను తానే హత్య చేశానని రాకేశ్‌రెడ్డి తమ విచారణలో ఒప్పుకున్నట్టు ఏపీ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. జయరాం భార్య పద్మశ్రీ విజ్ఞప్తి మేరకు ఈ కేసు దర్యాప్తుకు తెలంగాణ పోలీసులకు అప్పగించారు. -
జయరామ్ హత్య కేసు మొదట్నుంచి మళ్లీ!
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసు ఆంధ్ర ప్రదేశ్‌లోని నందిగామ పోలీసుల నుంచి తెలంగాణలోని హైదరాబాద్ పోలీసులకు బదిలీ అయింది. ఈ ఫైల్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయానికి చేరుకోవడంతో గురు వారం కొత్వాల్ అంజనీకుమార్ వెస్ట్‌జోన్ పోలీసులతో సమీక్షించారు. నేరస్థలం జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని రాకేష్‌రెడ్డి నివాసంలో కావడంతో కేసును ప్రాథమికంగా అక్కడి పోలీసులకే అప్పగించనున్నారు. ఈ కేసులో ఉన్న అనేక అనుమానాల నివృత్తి కోసం ఆది నుంచీ దర్యాప్తు చేయాలని సిటీ పోలీసులు నిర్ణయించారు. నాటకీయ పరిణామాలపై దృష్టి.. కృష్ణాజిల్లా నందిగామలో ఈ నెల 1న జయ రామ్ మృతదేహం లభించిన నాటి నుంచి ఏపీ పోలీసుల దర్యాప్తులో అనేక నాటకీయ పరి ణామాలు చోటు చేసుకున్నాయి. జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి ప్రధాన అనుమానితురాలు అనే వార్తలు తొలుత వెలువడ్డాయి. అయితే మంగళవారం రాకేష్‌రెడ్డి, వాచ్‌మన్ శ్రీనివాస్రెడ్డిల్ని మాత్రమే నిందితులుగా ప్రక టిస్తూ అరెస్టు చేశారు. శిఖాను గుట్టుచప్పుడు కాకుండా ఏపీ నుంచి హైదరాబాద్‌కు పంపిం చేశారు. వీటిపై దృష్టి పెట్టనున్న సిటీ పోలీసులు శిఖా చౌదరినీ విచారించాలని భావిస్తున్నారు. గత నెల 31న శిఖా జయరామ్ ఇంట్లోకి బల వంతంగా ప్రవేశించి బీరువాలో నుంచి విలువైన పత్రాలు, భూమి పత్రాలు తీసుకువెళ్లినట్లు హతుడి భార్య పద్మశ్రీ ఆరోపించారు. దీనిపై ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిఖాను ప్రశ్నించే సమయంలో వీటి గుట్టు విప్పాలని నగర పోలీసులు నిర్ణయించారు. కాపాడటానికే ఆ కారణాలా? జయరామ్ హత్య కేసుకు చెందిన వివరాలు వెల్లడిం చిన కృష్ణాజిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి.. జయరామ్ రాకేష్‌రెడ్డి నుంచి తీసుకున్న రూ.4.17 కోట్ల కోసమే ఈ హత్య జరిగినట్లు తెలిపారు. దీని పైనా సిటీ పోలీసులు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. రాకేష్‌కు ‘చినబాబు’తో సహా తెలుగుదేశం పార్టీలోని అనేక మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు వెలువడ్డాయి. దీంతో రాకేష్‌ను పరోక్షంగా, ఇతరులను ప్రత్యక్షంగా కాపాడ టానికే ఈ కారణాలు చెప్పారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. వీటి నివృత్తికి నిందితుల్ని కస్టడీలోకి తీసుకోనున్నారు. దీనికోసం జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైన తర్వాత నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ తీసుకోనున్నారు. ఆపై నిందితుల్ని ఏపీ జైలు నుంచి తీసుకువచ్చి ఇక్కడి ప్రక్రియలు పూర్తిచేసుకొని వారిద్దరినీ విచారించాలని నిర్ణయించారు. కీలకంగా మారనున్న ‘రీ–కన్స్ట్రక్షన్’... జయరామ్ హత్య కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు చేపట్టనున్న క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ ప్రక్రియ కీలకం కానుంది. రాకేష్ ఇంట్లో అనేక అంశాలు పరిశీలించ నున్నారు. ఆపై గొడవ జరిగిన తీరు, మృతదేహాన్ని కారులోకి వాచ్‌మన్ సాయంతో తరలించిన తీరు సహా నందిగామ వరకు జరిగిన పరిణామాలను సరిచూస్తారు. ఈలోపే పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్ సేకరించడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. దసపల్లా గుట్టు విప్పాలని నిర్ణయం.. జయరామ్ హత్యకు మూలాలు దసపల్లా హోటల్లోనూ ఉన్నాయి. గత నెల 29, 30, 31 తేదీల్లో దసపల్లా హోటల్లో జయరామ్‌కు చెందిన కీలక పరిణామాలు జరిగాయి. ఆ రోజు అక్కడ సమావేశమైనవారిలో హతుడు, నిందితుడు, మరికొందరు ఉన్నారని తెలుస్తోంది. తెల్లచొక్కా ధరించిన ఓ వ్యక్తి సీసీఫుటేజీలో కనిపించినా ఏపీ పోలీసుల దర్యాప్తులో ఈ వివరాలు బయటకు రాలేదు. 31న జయరామ్‌కు ఓ వ్యక్తి రూ.6 లక్షలు అక్కడకు తెచ్చి ఇచ్చారు. అతనెవరు.. దాన్ని తీసుకున్న ఓ యువతి ఎవరు? అనేదీ తేలాల్సి ఉంది. హోటల్లో గది ఎవరి పేరిట బుక్ అయి ఉంది? అనే వివరాలు పోలీసులు తెలుసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 44 నుంచి రాకేష్‌రెడ్డి ఇంటి వరకు సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించి ఆ రోజు జయరామ్ ఎన్ని గంటలకు వెళ్లారు, మృత దేహాన్ని కారులో ఏ సమయంలో బయటికి తీసుకొచ్చారు? అనే అంశాలు తెలుసుకోనున్నారు. శిఖా చౌదరికి ఆ హత్యతో సంబంధం ఉంది: పద్మశ్రీ ఆంధ్రా పోలీసుల విచారణ సరిగ్గాలేదనే తన భర్త జయరామ్ హత్యకేసును తెలంగాణ పోలీసులకు అప్పగించాలని ఫిర్యాదు చేసానని పద్మశ్రీ వెల్ల డిం చారు. గురువారం ఆమె జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లోని తన నివాసంలో మీడియాతో మాట్లా డారు. ఈరోజు తమ పెళ్లిరోజని, గతంలో తన భర్తతో ఉన్న అనుబంధం తలచుకొని కుమిలి పోయానని వెల్లడించారు. ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించు కోలేకపోతున్నానని, ఇంకా తన పిల్లలు తేరుకోలేదన్నారు. జయ రామ్ మర ణిస్తే ఘటనాస్థలానికి వెళ్లకుండా శిఖాచౌదరి తమ ఇంటికి ఎం దుకు వచ్చిందని, తమతో ఎలాంటి సంబంధం లేనివాళ్లతో ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. ఈ విష యాన్ని తెలంగాణ పోలీ సులు, ప్రభుత్వం విచా రణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. శిఖాచౌదరికి ఈ కేసుతో సంబంధం లేదని చెప్పడం అన్యాయ మన్నారు. 2014లో శిఖా తమ కుటుంబంలోకి వచ్చింద న్నారు. ఆమె కుటుంబం మొత్తానికి జయరామ్ హత్యలో భాగముందన్నారు. కొన్ని ఒత్తిడులకు లొంగి రాకేష్‌రెడ్డిపై కేసును రుద్దారన్నారు. రాకేష్ ఎవరో తనకు తెలియదనీ, ఆయనకు ఇవ్వాల్సిన డబ్బుల గూర్చీ తెలీదన్నారు. శిఖాకు ఎవరు సహకరిస్తున్నారో తేల్చాలని కోరారు. ఎక్స్‌ప్రెస్ టీవీలో శిఖాకు అంతపెద్ద హోదా ఇవ్వడం సరికాదని తానే తొలగించానన్నారు. దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్ ఏసీపీ జయరామ్ హత్య కేసు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావును నియమించాం. గురువారం కృష్ణా జిల్లా ఎస్పీ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక మెసెంజర్ కేసు ఫైల్ తీసుకువచ్చి అప్పగించాడు. జూబ్లీహిల్స్ ఠాణాలో రీ–రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభిస్తాం. ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చిన జయరామ్ భార్య పద్మశ్రీ తెలంగాణ, హైదరాబాద్ పోలీసులపై తనకు అపారమైన నమ్మకం ఉందని అన్నారు. దీన్ని నిలబెట్టుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేసి వీలైనంత త్వరలో పూర్తి చేస్తాం. – అంజనీకుమార్, హైదరాబాద్ కొత్వాల్ ఖాకీల పాత్రపైనా సమగ్రంగా... జయరామ్ హత్య ఎపిసోడ్లో హైదరాబాద్‌లో పని చేస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీని వాసులు, రాచకొండకు చెందిన ఏసీపీ మల్లారెడ్డిల పాత్ర తీవ్ర సంచలనం సృష్టిం చింది. జయరామ్ మృతదేహం తరలింపునకు గాను తాను వారిద్దరికీ ఫోన్లు చేశానని, వారిచ్చిన సలహాల మేరకే వ్యవహరించానని రాకేష్‌రెడ్డి ఏపీ పోలీసుల విచారణలో వెల్లడించాడు. అంతే కాకుండా ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు నల్లకుంట స్టేషనులో ఉన్నప్పుడే మృతదేహం తరలిస్తున్న కారును రాకేష్ అక్కడకు తీసుకువెళ్లాడని, బయటే ఉండి ఆయనకు ఫోన్ చేశాడని తెలుస్తోంది. అయితే వీటిని ఇద్దరు అధికారులు ఖండిస్తున్నారు. ఈ వివరాల ఆరా కోసం అవసరమైతే వారిద్దరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. -
హత్య వెనుక శిఖా చౌదరి ప్రమేయం ఉంది
-
శిఖా చౌదరే చేయించింది: జయరాం భార్య
సాక్షి, హైదరాబాద్: తన భర్త హత్య వెనుక శిఖా చౌదరి ప్రమేయం ఉందని ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శిఖా ప్రమేయం లేకుంటే తన భర్త చనిపోయేవారు కాదని అన్నారు. తమ ఆస్తులు లాక్కునేందుకే ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయిందని ఆమె ఆరోపించారు. ఆమె వ్యవహారం చూసి తన భర్తకు ప్రాణహాని ఉందని ఐదేళ్ల క్రితమే భయపడినట్టు వెల్లడించారు. హత్యకు ప్లాన్ చేసింది శిఖాయేనని స్పష్టం చేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయన్నారు. పేద అమ్మాయి అయిన శిఖా చౌదరి నేడు బిఎండబ్ల్యూ కారులో ఎలా తిరుగుతోందని ప్రశ్నించారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిందని, డబ్బు కోసం ఆమె ఎంతకైనా తెగిస్తుందని మండిపడ్డారు. అలాంటి అమ్మాయి తమ ఇంట్లో ఉండటం దురదృష్టమన్నారు. జయరాం చనిపోయిన కబురు తెలిసినా తర్వాత నందిగామ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. జయరాం ఇంటికి వెళ్లి పలు కీలక పత్రాలు, విలువైన వస్తువులు తీసుకుపోయిందని ఆరోపించారు. ఎక్స్‌ప్రెస్ టీవీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాతే ఆ చానల్ నాశమైందన్నారు. (శిఖా ప్రియుడే హంతకుడు) రాకేష్ రెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. జయరాంకు రాకేష్‌రెడ్డి నాలుగున్నర కోట్ల రూపాయలు ఇచ్చారనడంతో వాస్తవం లేదని చెప్పారు. శిఖా చౌదరికే చెక్ పవర్ ఉందని వెల్లడించారు. తన భర్త అంత్యక్రియలకు ఆయన తరపు దగ్గర బంధువులు ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయరాంకు మహిళలతో సంబంధాలున్నాయని వింటుంటే బాధగా ఉందని పద్మశ్రీ అన్నారు. తన భర్తతో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. (ఎవరీ రాకేష్ రెడ్డి..?) -
జయరాం కేసు తెలంగాణకు బదిలీ
సాక్షి, అమరావతి బ్యూరో: వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పథకం ప్రకారం జయరాంను ఇంటికి రప్పించి హత్య చేసిన రాకేష్‌రెడ్డి.. ఆ తర్వాత ఇద్దరు తెలంగాణ పోలీసు అధికారుల సలహా మేరకు మృతదేహాన్ని ఏపీకి తీసుకొచ్చి ప్రమాద ఘటనగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఈ çఘట న వెలుగులోకి వచ్చిన వెంటనే ఆయన మేన కోడలు శిఖాచౌదరి చుట్టే కేసు తిరిగింది. కేసు నుంచి శిఖాను బయటపడేసేందుకు ఏపీలోని కొందరు టీడీపీ నేతలు యత్నిస్తున్నారనే ప్రచా రం జరిగింది. చివరకు రాకేశ్ నిందితుడని నందిగామ పోలీసులు పేర్కొనగా.. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని జయరాం భార్య పద్మశ్రీ చెప్పడంతో కేసు మరో కీలక మలుపు తిరిగింది. అన్నీ అనుమానాలే..? అమెరికా పౌరసత్వమున్న జయరాంకు వందల కోట్ల ఆస్తులున్నాయి. ఆ స్థాయి వ్యక్తి రాకేష్ వద్ద రూ. 4.17 కోట్లు ఎందుకు అప్పుగా తీసుకున్నాడన్న అంశం ప్రశ్నగా మిగిలిపోయింది. శిఖాని పెళ్లిచేసుకోవాలని భావించిన రాకేష్ కేవలం డబ్బు కోసమే జయరాంను హత్య చేశాడా? జయరాంను హత్య చేశాక ఆ సమాచారం శిఖాకి చెప్పలేదా? హత్య విషయాన్ని తెలంగాణ పోలీ సులకు చెబితే వారెందుకు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు? శిఖా పాత్రపై అనేక ఆరోపణలు వెల్లువెత్తినా.. ఏపీ పోలీసులు ఎందు కు నిర్లక్ష్యం చేశారు? అంటూ పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నందిగామ పోలీసులు హైదరాబాద్‌లో రాకేష్, జయరాం నివాసాల్లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. జయరాం కాల్‌డేటా ఆయన ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరితో కలిశారు? అన్న కోణం లోనూ ఆధారాలు సేకరించారు. హత్యానేరాన్ని అంగీకరిస్తూ రాకేష్ వాగ్మూలంలో ఇచ్చిన సమా చారానికి, పోలీసులు సేకరించిన ఆధారాలకు ఎక్కడ పొంతన లేదని తెలుస్తోంది. సాంకేతికంగానూ సాక్ష్యాల సేకరణ కష్టంగా మారిందని, ఈ సా«క్ష్యాలతో కేసు నిలబడదని, నేరస్తులు తప్పించుకుంటారని నిపుణులు చెబుతున్నారు. కేసులో సాంకేతికంగా సాక్ష్యాలను సేకరించాల్సి ఉందని జిల్లా ఎస్పీ త్రిపాఠి పేర్కొనడం నిపుణుల వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. నిందితులకు రిమాండ్ జయరాం హత్య కేసులో నిందితు లైన కవకుంట్ల రాకేష్, దున్నే శ్రీనివాస్‌లను నందిగామ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చామని ఎస్హెచ్ఓ వెంకటరమణ తెలిపారు. నిందితులకు 20వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. కేసు తెలంగాణతో ముడిపడడం వల్లే బదిలీ: ఏపీ ప్రభుత్వం సాక్షి, అమరావతి: చిగురుపాటి జయరాం హత్య కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని, కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులకు పద్మశ్రీ ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం కేసును తెలంగాణకు అప్పగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. కేసు వ్యవహారాలన్నీ తెలంగాణతో ముడిపడడంతో కేసుపై ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. -
తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలి
-
ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదు
హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆమె ఫిర్యాదు చేశారు. గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్‌లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారని, ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. తన భర్తకు విషమిచ్చారని తొలుత అన్నారని, ఆ తర్వాత కొట్టారని, ఇంకోసారి బీరుసీసా కథ అల్లారని.. ఇలా ఏపీ పోలీసులు రోజుకో డ్రామాతో కేసును నీరుగార్చారని మండిపడ్డారు. తన భర్త పోస్టుమార్టం నివేదిక కావాలని గత నాలుగు రోజులుగా నందిగామ పోలీసులను కోరుతున్నా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ హత్య జరిగినందున, ఇక్కడి పోలీసులే దర్యాప్తు జరిపి నిందితులకు శిక్ష వేసి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ హత్య కేసులో తన భర్త మేనకోడలు శిఖాచౌదరి పాత్ర ఉన్నా, కొంతమంది వ్యక్తులు ఆమెను తప్పించారని ఆరోపించారు. తన భర్త హత్య కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తుతోనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని నమ్ముతున్నానని స్పష్టం చేశారు. ఒక్క మనిషి ప్రాణం ఖరీదు రూ.6 లక్షలు, రూ.80 లక్షలు, రూ.నాలుగు కోట్లు, ఒక డాలరా అంటూ కన్నీటిపర్యంతమ య్యారు. మేనమామ చనిపోయాడని తెలిస్తే శిఖాచౌదరి ఘటనాస్థలికి వెళ్లకుండా తమ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి బీరువాలోని విలువైన పత్రాలు తీసుకెళ్లడమే అనుమానాలకు తావిస్తోందని పద్మశ్రీ పేర్కొన్నారు. కేసు నుంచి శిఖా చౌదరిని తప్పించేందుకు ఏపీలోని కొన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు వచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. హత్య హైదరాబాద్‌లో జరిగితే కేసును ఏపీలో దర్యాప్తు చేయడమేంటో తనకు అర్థం కావడంలేదన్నారు. అందుకే తనకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. 30 ఏళ్ల తమ వైవాహిక జీవితం ఆనందకరంగా ఉండేదని, తన భర్త హత్యతో ఇద్దరు పిల్లలు తండ్రి లేని వారయ్యారని, తమ కుటుంబం రోడ్డున పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పద్మశ్రీ ఫిర్యాదు స్వీకరించిన అనంతరం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీహరిచంద్రరెడ్డి.. ఆమెను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై వేటు పడింది. ఈయనను అంబర్‌పేటలోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్(సీఏఆర్) హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం బాధ్యతల్ని వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణకు అప్పగించారు. జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్‌రెడ్డికి మృతదేహం తరలింపునకు సంబంధించి సలహాలిచ్చినట్లు నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుతో పాటు మల్లారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. శ్రీనివాసులును సోమ వారమే బదిలీ చేసిన విషయం విదితమే. రాకేష్, మల్లారెడ్డి మధ్య సెల్‌ఫోన్ సంభాషణలు జరిగాయని, జయరామ్ హత్య జరిగిన తర్వాతే ఈ కాల్స్ చేసుకున్నట్లు నందిగామ పోలీసులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి పూర్తి నివేదిక వచ్చాక మల్లారెడ్డి, శ్రీనివాసులుపై విచారణ చేపట్టనున్నారు. ఆదిభట్లలో కేసుతో పరిచయం... కొంగరకలాన్ సమీపంలోని తన భూమి హద్దు రాళ్లు, కడ్డీలను తొలగించి ఆక్రమించుకునేందుకు ప్రయ త్నించారని రాజేందర్‌రెడ్డి జూన్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడిగా జితేందర్ రెడ్డి, రెండో నిందితుడిగా రాకేష్‌రెడ్డిని ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసు విచారణ సమయంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో రాకేష్‌రెడ్డికి పరిచయం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యంతో తరచూ ఫోన్‌కాల్ చేసే రాకేష్‌రెడ్డి జయరామ్ హత్య తర్వాత కూడా మల్లారెడ్డితో ఫోన్లో టచ్‌లో ఉన్నట్లు తేలింది. జయరామ్ హత్య కేసులో ఏపీ పోలీసులు అరెస్టు చేసిన రాకేష్‌రెడ్డి చెప్పిన వాంగ్మూలం ప్రకారం కూడా మల్లారెడ్డి పేరు వినిపించడంతో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బదిలీ వేటు వేశారు. 2012లో పోలీసు విభాగంలోకి అడుగుపెట్టిన మల్లారెడ్డి పెద్దపల్లి, ఉట్నూరు, ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లోనూ వివాదాస్పదుడిగా ముద్రపడిన మల్లారెడ్డి బడా కేసులను సెటిల్ చేశారనే ఆరోపణలున్నాయి. పాత కేసులో పరిచయంతోనే ఫోన్ కాల్... రాకేష్‌రెడ్డి పాత కేసులో నిందితుడిగా ఉండటంతో ఏర్పడిన పరిచయంతోనే ఫోన్‌కాల్ చేశాడని ఏసీపీ మల్లారెడ్డి వివరిస్తున్నారు. తన ఇంట్లో ఇద్దరు కొట్టుకున్నారని, ఒకరికి గాయాలయ్యాయని ఫోన్ చేసి చెప్పాడన్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. వారు చెప్పిన ప్రకారం నడుచుకోమని చెప్పానని మల్లారెడ్డి మీడియాకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ తతంగం జరిగింది ఈ నెల 1వ తేదీ కాగా... మంగళవారం వరకు ఆయన మిన్నకుండిపోయారు. ఆయనపై ఆరోపణలు మొదలైన తర్వాత తప్పించుకునేందుకే కొత్త వాదన వినిపిస్తున్నారని ఏపీ పోలీసులు అంటున్నారు. ఆయన చెబుతున్న విషయాలు వాస్తవమైతే శనివారం నుంచి రాకేష్ పేరు మీడియాలో వస్తోందని, జయరామ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని తెలిసీ ఫోన్ కాల్స్ విషయం నందిగామ పోలీసులకు గాని, స్థానిక పోలీసులకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును జయరామ్ హత్య కేసులో అనుమానితులుగా చేర్చి విచారించే అవకాశం ఉంది. -
శిఖా ప్రియుడే హంతకుడు
సాక్షి, అమరావతి: చిగురుపాటి జయరామ్ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బును వసూలు చేసే క్రమంలో జయరామ్‌ను రాకేష్ హత్య చేశాడని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. ఐదు రోజులుగా 10 బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యకు సహకరించిన రాకేష్ వాచ్‌మన్ శ్రీనివాస్‌రెడ్డిని రెండో నిందితుడిగా పేర్కొన్నారు. అతన్ని కూడా మంగళవారం నందిగామ పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం ఆ వివరాలను నందిగామ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ త్రిపాఠి మీడియాకు వెల్లడించారు. జయరామ్‌తో పరిచయం.. శిఖాచౌదరి ప్రియుడు హైదరాబాద్‌లో సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. కుత్బుల్లాపూర్‌లో ఉన్న జయరామ్‌కు చెందిన టెట్రాన్ పాలీమర్స్ కంపెనీలో 2015లో లాకౌట్ సమస్య వచ్చింది. కార్మికులు, యాజమాన్యాల మధ్య తలెత్తిన సమస్యలో శిఖా ప్రియుడు తలదూర్చాడు. ఆ సమయంలో జయరామ్ అతడికి పరిచయమయ్యా డు. ఈ క్రమంలో జయరామ్ 2016లో అవసరం నిమిత్తం శిఖా ప్రియుడి నుంచి పలు దఫాలుగా రూ.4.17 కోట్లు అప్పు తీసుకున్నాడు. డబ్బు చెల్లించాలని శిఖా ప్రియుడు డిమాండ్ చేయడంతో.. రూ. 4.17 కోట్లకు గాను వడ్డీతో కలిపి రూ.6 కోట్లు 2018, అక్టోబర్ నాటికి ఇస్తానని జయరామ్ ఒప్పందం చేసుకున్నాడు. తరువాత గడువు తీరినా తిరిగి డబ్బులు చెల్లించలేదు. అందమైన అమ్మాయి పేరిట వల.. చిగురుపాటి జయరామ్ ఈ ఏడాది జనవరి 29న అమెరికా నుంచి ఫార్మా కంపెనీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చాడు. అదే రోజు రాత్రి తన మేనకోడలు శిఖా ఇంటికి వచ్చాడు. ఈ విషయం అపార్ట్ మెంట్ మేనేజర్ ద్వారా తెలుసుకున్న శిఖా ప్రియుడు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు. జయరామ్ బలహీనతల గురించి పక్కాగా తెలుసుకున్న రాకేష్ వీణా పేరుతో సిమ్‌కార్డు తీసుకుని అతనితో వాట్సాప్ చాటింగ్ చేశాడు. డీపీగా ఓ అందమైన అమ్మాయి ఫొటో పెట్టాడు. హాయ్.. హల్లో.. నుంచి మొదలుపెట్టి వలపు వలవేసి జయరామ్‌ను గత నెల 30న రోడ్డు నంబర్ 10లోని తన ఇంటికి రప్పించుకున్నాడు. విజయవాడకు మృతదేహం తరలింపు... మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్న శిఖా ప్రియుడికి.. అదేరోజు రాత్రి జయరామ్ విజయవాడ వెళ్లాలనుకున్నాడని తెలుసు. కేసు నుంచి బయటపడటానికి హైదరాబాద్ నల్లకుంట సీఐ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిలకు సలహా కోసం ఫోన్లు చేశాడు. వారి సలహా మేరకు ప్రమాద ఘటనగా చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడు. వాచ్‌మన్ సా యంతో మృతదేహాన్ని జయరామ్‌కు చెందిన కారు (ఏపీ16ఈజీ0620)లో వేసుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరి నందిగామ సమీపంలోని ఐతవరం శివారుకు చేరుకున్నాడు. అక్కడ జాతీయ రహదారి రోడ్డు మార్జిన్‌కు దిగువలో కారును దింపేసి.. తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. 2018లో శిఖాచౌదరితో పరిచయం.. జయరామ్ 2018లో అమెరికా నుంచి నిందితుడికి ఫోన్ చేసి ‘టెట్రాన్ కంపెనీలో గొడవలున్నాయి. వాటిని కొంచెం పరిష్కరించు.. నీకు నా మేనకోడలు శిఖా ఫోన్ చేస్తుంది అటెండ్ అవ్వు’అన్నాడు. ఆ సమయంలోనే శిఖాతో ఇతనికి పరిచయం ఏర్పడింది. ఈ కేసు ఇప్పటితో ముగిసిపోలేదు: త్రిపాఠి ‘పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారం మేరకే ప్రధాన నిందితుడు రాకేష్‌తోపాటు అతనికి సహకరించిన వాచ్‌మన్ శ్రీనివాస్‌పై 302, 419, 342, 346, 348, 312, 201, 202 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఈ కేసులో అనుమానాలున్నాయి. మరింత లోతుగా దర్యాప్తు చేస్తాం. సమగ్రంగా విచారించాక మరిన్ని అరెస్టులుండొచ్చు. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే కేసును బదిలీ చేసే అంశాన్ని పరిశీలిస్తాం. బంధించి.. చిత్రహింసలకు గురిచేసి.. ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత జయరామ్‌ను శిఖాచౌదరి ప్రియుడు బంధించాడు. డబ్బులు ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి చేశాడు. నెలకు రూ.50 లక్షల చొప్పున చెల్లిస్తానని బతిమిలాడినా ఒప్పకోలేదు. చివరకు కోస్టల్ బ్యాంక్‌లో పనిచేసిన మాజీ మేనేజర్ రూ.6 లక్షలు శిఖా ప్రియుడి స్నేహితుడు రాజశేఖర్‌కు దస్పల్లా హోటల్లో అందజేశాడు. రూ.6 కోట్ల అప్పుకుగానూ రూ.6 లక్షలు ఇవ్వడమేంటంటూ జయరామ్‌తో గొడవ పడ్డాడు. అతడిపై ముష్టిఘాతాలకు దిగాడు. ఆ దెబ్బలకు ముక్కు, నోటి నుంచి రక్తం కారుతూ సోఫాపై పడిన జయరామ్‌ను ఊపిరాడకుండా చేశాడు. ఆ సమయంలో జయరామ్ కదలకుండా వాచ్‌మన్ శ్రీనివాస్‌రెడ్డి కాళ్లు పట్టుకున్నాడు. పిడిగుద్దులు కురిపించడంతో జయరామ్ 31వ తేదీ ఉదయం 11–12 గంటల మధ్య మృతి చెందాడు. -
‘చినబాబు’కు సన్నిహితుడే.. రాకేష్!
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో నిందితుడైన కౌకుంట్ల రాకేష్‌రెడ్డిలో రాజకీయ కోణం కూడా వెలుగుచూస్తోంది. కుత్బుల్లాపూర్‌లో నివాసముంటున్న సమయంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన రాకేష్ ఆ పార్టీ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారనే చర్చ సాగుతోంది. కుత్బుల్లాపూర్‌లో ఉంటున్న సమయంలోనే రాజకీయ నాయకుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేయడం దగ్గరి నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ నాయకుడి(చినబాబు)తో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకునేంత వరకు రాకేష్ రాకెట్ వేగంతో వెళ్లిపోయాడని టీడీపీ వర్గాలే అంటున్నాయి. ఎంతగా అంటే ఏపీ యువనేతకు సన్నిహితుడైన ఓ వ్యక్తి ద్వారా లాబీయింగ్‌తో యువనేతకు దగ్గరయిన రాకేష్ ఆయన సెక్యూరిటీ, వ్యక్తిగత సిబ్బందితో సంబంధాలు పెట్టుకుని యువనేతతో అపాయింట్మెంట్లు ఇప్పించే స్థాయికి వెళ్లిపోయారని ట్రస్ట్ భవన్ వర్గాలంటున్నాయి. మరో విశేషమేమిటంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వెళ్లే వీఐపీలకు అతిథి మర్యాదలు కల్పించడంలో కూడా రాకేష్ దిట్ట అని తెలుస్తోంది. తనకున్న పలుకుబడి ద్వారా ఎల్–2లో ఉన్న పేర్లను కూడా ఎల్–1 జాబితాలో చేర్చి అత్యధిక ప్రాధాన్యమిచ్చే దర్శన ఏర్పాట్లు చేస్తారని చెబుతున్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, మంత్రులు వ్యక్తిగతంగా వెళ్లినప్పుడు మాత్రమే వారిని ఎల్–1 జాబితాలో చేర్చే టీటీడీ అధికారులు.. రాకేష్ చెప్పాడంటే ఎల్–1 జాబితాలో చేర్చేవారనే ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణ ముఖ్య నేతతో టచ్‌లో.. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా రాకేష్ సత్సంబంధాలు కొనసాగించాడు. అప్పట్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ దగ్గరి నుంచి ఆ పార్టీకి రాష్ట్రస్థాయిలో ఉన్న ముఖ్య నాయకుడి వరకు దూసుకెళ్లిపోయాడని, టికెట్లు ఇప్పిస్తానని చెప్పి గత ఎన్నికల సందర్భంగా కుత్బుల్లాపూర్‌కు చెందిన ముగ్గురు నాయకులను ఆ ముఖ్య నాయకుడి వద్దకు తీసుకెళ్లాడని అంటున్నారు. వీరిని ఏపీకి చెందిన యువనేతకు కూడా కలిపించాడనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణకు చెందిన ముఖ్య నాయకుడి ఇంటికి తరచూ రాకేష్ వెళుతుండేవాడని, గత ఎన్నికల్లో టికెట్ల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేశాడని తెలుస్తోంది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు రాజకీయ సంబంధాలు పెట్టుకున్న రాకేష్ కొందరు ముఖ్యమైన నాయకులు, మరికొందరు రాజకీయ నాయకుల కుమారులతో సన్నిహితంగా ఉండేవాడని సమాచారం. రాజకీయ నాయకుల కుమారులు తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు రాకేష్‌ను ఉపయోగించుకున్నారని తెలుస్తోంది. కొందరు నేతలు రాకేష్ ప్రలోభాలకు ఆకర్షితులై అతనితో సంబంధాలు కొనసాగించగా, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన మరికొందరు నేతలు మాత్రం దూరం పెట్టారని సమాచారం. ఎయిర్‌పోర్టులోనూ వీఐపీ ట్రీట్మెంట్... నాలుగేళ్ల క్రితం రాకేష్‌రెడ్డి కుత్బుల్లాపూర్ నుంచి మకాం మార్చి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శిఖా చౌదరితో ఉంటున్నాడు. ఇదే విషయంపై అతని తల్లిదండ్రులు పద్మ, శ్రీనివాస్‌రెడ్డి 2017లో జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల క్రితం నుంచే అతని లైఫ్స్టైల్లో పూర్తి మార్పులొచ్చినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాకేష్ తరచూ గోవా, శ్రీలంక, సింగపూర్ దేశాలకు సన్నిహిత మిత్రులు, టీడీపీ నాయకులతో వెళ్లే సమయాల్లో ప్రోటోకాల్ సిబ్బంది సైతం అతనికి అన్ని సేవలు చేసే వారని, అందుకు ఏపీ సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని సమాచారం. హత్యానంతరం ఒక నేతతో సంభాషణ చినబాబుకు, ఆయన ప్రత్యేక అధికారికి అన్నీ తానై వ్యవహరించిన రాకేష్‌పై 2016లో కూకట్‌పల్లిలో ఓ హోటల్ యజమానిని డబ్బుకోసం బెదిరించిన కేసుతో పాటు 2017లో తమను పట్టించుకోవటం లేదంటూ ఆయన తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. పెద్దబాబు, చిన్నబాబుతో సన్నిహిత సంబంధాలున్న రాకేష్‌రెడ్డికి, తెలంగాణలో పార్టీ ముఖ్యనేతతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్నారై జయరామ్‌ను హత్య చేసిన అనంతరం రాకేష్ పలువురు పోలీస్ అధికారులతో పాటు హైదరాబాద్‌లోని టీడీపీ ముఖ్యనేతతో చాలా సేపు ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. క్యాసినో కోసం ఎందాకైనా.. రాకేష్‌రెడ్డికి క్యాసినో అంటే ఎంతో ఇష్టం. దీని కోసం ఎందాకైనా.. ఎప్పుడైనా.. సిద్ధంగా ఉంటాడని ఆయనతో కలసి క్యాసినో పార్టీలో పాల్గొన్న మిత్రులు చెబుతున్నారు. ఎన్ని లక్షలు నష్టపోయినా సరే అందులో మజానే వేరంటూ ఎంజాయ్ చేసేవాడని పేర్కొంటున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ ఇతనికి బీరు మాత్రమే తాగడం అలవాటు. ఆ అలవాటుతోనే నందిగామలో ఓ బార్ నుంచి బీరు బాటిల్ తీసుకువెళ్తూ సీసీ ఫుటేజీకి చిక్కాడు. కాస్ట్లీ లైఫ్‌తో ఎంజాయ్... తొలుత ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న రాకేష్‌రెడ్డి గత నాలుగేళ్లలో ఆర్థికంగా బాగా ఎదిగిపోయాడని, కొత్త పరిచయాలు ఏర్పడ్డాయని సమాచారం. ఆ కోవలోనే శిఖా చౌదరి సైతం పరిచయమైనట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కుత్బుల్లాపూర్‌కు వచ్చినప్పుడల్లా ఖరీదైన కార్లలో వచ్చి పోలీస్, రాజకీయ నాయకులకు పార్టీలు ఇచ్చి వెళ్లేవాడని తెలిసింది. -
చంద్రబాబు మెప్పు కోసమే వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మెప్పు పొందడానికే ఆ పార్టీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తమ సినిమాపై పిటిషన్ దాఖలు చేశారని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేశ్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం పేరుతో రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపారు. తమ చిత్రంలోని ‘దగా..దగా.. కుట్ర’ పాటను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్‌ను దించేయడానికి ముందే శ్రీశ్రీ రాశారని వివరించారు. ఈ పాటలో చూపినవన్నీ కూడా ప్రజాబాహుళ్యంలో ఉన్నవేనని, చంద్రబాబునాయుడు వెన్నుపోటుదారుడని ఎన్టీఆరే స్వయంగా చెప్పారని తెలిపారు. లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఈ వ్యవహారంలో పుస్తకాలు కూడా రాశారని ఆయన వివరించారు. పాటపై అభ్యంతరాలుంటే సినిమాటోగ్రఫీ చట్టం కింద ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలోని ‘దగా.. దగా.. కుట్ర’ పాటను యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా నుంచి తొలగించేలా చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డిని ఆదేశించాలని కోరుతూ టీడీపీ పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు నిర్మాత రాకేశ్‌రెడ్డి తన వాదన వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేశారు. సినిమా వల్ల తమకు వ్యక్తిగతంగా హాని జరుగుతుందని భావించిన వ్యక్తే కోర్టుకు రావాలి తప్ప, అతని తరఫున మరొకరు వచ్చేందుకు వీల్లేదని పేర్కొన్నారు. ఈ పాట వల్ల నష్టం కలుగుతుందనుకుంటే వారు సివిల్ సూట్ లేదా పరువు నష్టం కేసు దాఖలు చేసుకోవచ్చునని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని భారీ జరిమానాతో కొట్టేయాలని ఆయన కోర్టును కోరారు. -
మీడియా ముందుకు జయరాం హత్య కేసు నిందితులు
సాక్షి, నందిగామ: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి అని కృష్ణా జిల్లా పోలీసులు ధ్రువీకరించారు. డబ్బు కోసమే జయరాంను హింసించి చంపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. రాకేష్‌రెడ్డితో పాటు అతడికి సహకరించిన వాచ్‌మన్ శ్రీనివాస్‌ను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి మాట్లాడుతూ... ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి నేరం అంగీకరించాడని తెలిపారు. జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర లేదని చెప్పారు. ఆమె వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు. నిందితుడి వాంగ్మూలానికే పోలీసులు పరిమితం అయ్యారు. ఇప్పటివరకు బయటకు వచ్చిన వివరాలనే పోలీసులు వెల్లడించారు. తాను అప్పుగా ఇచ్చిన డబ్బును రాబట్టుకునేందుకే జయరాంను రాకేష్‌రెడ్డి హత్య చేసినట్టు తెలిపారు. తనకు రావాల్సిన డబ్బు రాబట్టుకునేందుకు రీనా అమ్మాయి పేరుతో జయరాంను ఇంటికి పిలిపించుకుని హింసించడంతో ఆయన చనిపోయినట్టు వెల్లడించారు. రాకేష్‌రెడ్డితో శిఖా చౌదరికి ప్రస్తుతం ఎటువంటి సంబంధాలు లేవన్నారు. శిఖా చౌదరి, రాకేష్‌రెడ్డి కలిసి దుబాయ్ ఎందుకు వెళ్లారన్న దానిపై సమాధానం లేదు. సాంకేతిక ఆధారాలు సంపాదించలేదని చెప్పి తుస్‌మనిపించారు. కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని దర్యాప్తు కొనసాగుతోందని ముక్తాయించారు. ఈ కేసును హైదరాబాద్ పోలీసులకు అప్పగిస్తారా అని ప్రశ్నించగా.. న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ జవాబిచ్చారు. పోలీసుల దర్యాప్తు లోపభూయిష్టంగా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూత్రధారులను కాపాడటానికి పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిడులు వచ్చినట్టు తెలుస్తోంది. శిఖా చౌదరిని కాపాడటానికి పోలీసులు ప్రయత్నించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ దర్యాప్తులో శిఖా చౌదరి ఏం చెప్పిందనేది పోలీసులు వెల్లడించలేదు. ఆమె పేరు ఎత్తితేనే పోలీసు ఉన్నతాధికారులు మీడియాపై ఎదురు దాడి చేశారు. ఎప్పుడు ఏం చెప్పాలో తమకు తెలుసు అంటూ హుంకరించారు. హైదరాబాద్‌లో హత్య చేస్తే నందిగామ వరకు మృతదేహాన్ని ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. నిందితుడు చెప్పిన విషయాన్నే బయటపెట్టారు తప్పా, తామేమి విచారించారో వెల్లడించలేదు. తెలంగాణకు చెందిన ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్‌లతో రాకేష్‌రెడ్డి మాట్లాడినట్టు గుర్తించామని.. వీరిద్దరిపై న్యాయసలహా తీసుకుని ముందుకు వెళతామని కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు. ఈరోజు జరిగిన మీడియా సమావేశం చూస్తే పోలీసులు ఈ కేసులో చాలా బాధ్యతరహితంగా వ్యహరించినట్టు కనబడుతోందన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు బదులేది? ♦ జయరాంను రాకేష్‌రెడ్డి ఒక్కడే ఎలా బంధించగలిగాడు? ♦ జయరాంను నిర్బంధించినప్పుడు రాకేష్ పాటు ఎవరున్నారు? ♦ శిఖా చౌదరి పాత్ర లేదనడానికి రుజువులు ఎందుకు చూపలేదు? ♦ శిఖా చౌదరి, రాకేష్‌రెడ్డి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ♦ జయరాం విజయవాడ వెళ్లాలనుకున్నట్టు రాకేష్‌కు ఎలా తెలిసింది? ♦ శిఖా చౌదరిపై జయరాం భార్య చేసిన ఆరోపణల మాటేంటి? ♦ వందల కోట్ల వ్యాపారాలు చేసే జయరాం రూ. 4 కోట్ల అప్పు తీర్చలేకపోయారా? ♦ పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఏముంది? ♦ జయరాం మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి నందిగామకు రాకేష్ ఒక్కడే ఎలా తీసుకురాగలిగాడు? ♦ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఎస్పీ, డీఎస్పీ ఎందుకు జవాబివ్వలేదు? -
మీడియా ముందుకు జయరాం హత్య కేసు నిందితులు
-
రాకేష్ రెడ్ది వెనుక పెద్ద నేర చరిత్ర
-
తవ్వేకొద్ది బయటపడుతున్న రాకేశ్ అక్రమాల చిట్టా
జీడిమెట్ల/భాగ్యనగర్‌కాలనీ: ఆర్థిక లావాదేవీ నేపథ్యంలో హత్యకు గురైన జయరామ్ కేసులో రాకేష్‌రెడ్డి ప్రధాన నిందితుడని తేలడంతో కుత్బుల్లాపూర్‌లో కలకలం రేగింది. వివాదాస్పదుడిగా ముద్రపడిన రాకేష్ రెడ్డిపై గతంలో కూకట్పల్లి, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. టీడీపీ నాయకుల వెంట తిరుగుతూ అటు ఏపీ సీఎం చంద్రబాబు, అతడి తనయుడు లోకేష్ పేర్లు చెప్పుకుని హైదరాబాద్‌లో పలు సెటిల్మెంట్లకు పాల్పడినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నేతలకు టికెట్లు ఇప్పించడం మొదలు, ప్రచారంలో సైతం అన్నీ తానై వ్యవహరించాడు. కుత్బుల్లాపూర్‌లో జరిగిన బహిరంగ సభల్లో ఏపీ సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో రాకేష్‌రెడ్డిని పొగడడం విశేషం. తల్లిదండ్రులపైనే దాడి.. తమ కుమారుడు ఇంటికి రావడం లేదని రాకేష్‌రెడ్డి తల్లిదండ్రులు పద్మ, శ్రీనివాస్‌రెడ్డి 2017 ఫిబ్రవరిలో అతని స్నేహితుడు రాజేందర్‌రెడ్డికి ఫోన్ చేసి అడిగారు. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన రాకేష్‌రెడ్డి తల్లిదండ్రులను అసభ్యంగా దూషించడమేగాక, దాడి చేయడంతో పాటు చంపుతానని బెదిరించాడు. దీంతో తమ కుమారుడి నుంచి తమకు ప్రాణహాని ఉందని పద్మ, శ్రీనివాస్‌రెడ్డి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా 225/2017 నంబర్‌తో కేసు నమోదైంది. ఎమ్మెల్యే పేరు చెప్పుకుని.... రాకేష్ రెడ్డి గతంలో కూకట్‌పల్లిలోనూ పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. చింతల్‌కు చెందిన చౌడవరం మహేష్ కుమార్‌తో కలిసి అతను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేరు చెప్పి సుమారు ఆరు ఇండస్ట్రీలు, గ్రీన్ బావార్చి హోటల్, వస్త్ర దుకాణాల్లో రూ. 12.55 లక్షలు వసూలు చేశాడు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అనుచరుడిగా చెప్పుకుంటూ భాగ్యనగర్ కాలనీలోని గ్రీన్ బావార్చి రెస్టారెంట్ యజమానిని బెదిరించి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. దీంతో ఎమ్మెల్యేకు సమీప బంధువైన రెస్టారెంట్ యజమాని భాస్కర్‌రావు కృష్ణారావుకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపాడు. ఎమ్మెల్యే సూచనమేరకు భాస్కర్‌రావు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రాకేష్ రెడ్డిని రిమాండ్‌కు తరలించారు. -
రహస్య ప్రాంతానికి శిఖా చౌదరి తరలింపు..!
సాక్షి, విజయవాడ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ (55) హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జయరామ్‌ను శిఖాచౌదరి ప్రియుడు రాకేష్‌రెడ్డే చంపాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే, జయరామ్ హత్యకేసులో శిఖా పాత్రే లేదంటూ గత నాలుగు రోజులుగా చెప్తున్న నందిగామ పోలీసులు ఆమెను సర్కిల్ కార్యాలయంలో ఉంచి అత్యంత గోప్యత పాటించారు. అక్కడికి ఉన్నతాధికారులు తప్ప ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గత రాత్రి అర్ధరాత్రి మీడియా కళ్లుగప్పిన పోలీసులు శిఖాను రహస్య ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఆమెకు ముసుగు వేసి హైదరాబాద్‌వైపు తీసుకెళ్లినట్టుగా సమాచారం. (పిడిగుద్దులు గుద్దాను.. చనిపోయాడు!) తెల్లవారితే జయరాం హత్య కేసులో మీడియా సమావేశం ఉందని చెప్పిన పోలీసులు అర్ధరాత్రి సమయంలో శిఖా చౌదరిని రహస్య ప్రాంతానికి తరలించడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురయిన జయరామ్ భార్య పద్మశ్రీ.. మేనకోడలు శిఖాచౌదరిపై సంచలన ఆరోపణలు చేశారు. శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్ అంటూ దుయ్యబట్టారు. తన అక్క నుంచే ప్రాణహాని ఉందని గతంలో తనకు జయరాం చెప్పారన్నారు. ఆయన భారత్‌కు వచ్చాక ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని ఆమె వాపోయారు. వ్యాపార లావాదేవీల సమావేశం నిమిత్తమే అమెరికా నుంచి భారత్‌కు వచ్చారని పద్మశ్రీ తెలిపారు. -
రాకేష్‌కు ఖాకీల సాయం!
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్ రెడ్డికి ఇద్దరు ఖాకీలు సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్‌కు చెందిన ఓ ఏసీపీ, హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లు పరోక్షంగా ఈ హత్యకు సహకరించానే వార్తలు వినబడుతున్నాయి. వీరిలో ఓ అధికారి రాకేష్ ఇంటి సమీపంలోనే ఉంటారని సమాచారం. జయరామ్‌ను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఏం చేయాలనేదానిపై ఆ పోలీసు అధికారి రాకేష్‌ను సలహా ఇచ్చారని సమాచారం. ఆయన సలహా మేరకే రాకేష్ మృతదేహాన్ని కారులో వేసుకుని వెళ్లి నందిగామ శివార్లలో యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని సమాచారం. మరోపక్క జయరామ్‌ను ఎలా ట్రాప్ చేయాలనే అంశంలో.. మరో పోలీసు అధికారి రాకేష్‌కు సలహా ఇచ్చినట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఐదుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కొత్వాల్ అంజనీకుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎస్‌లో పని చేస్తున్న కె.మురళీధర్‌ను నల్లకుంట ఇన్స్పెక్టర్గా నియమిస్తూ అక్కడున్న ఎస్.శ్రీనివాసులును ప్రాధాన్యం లేని, లూప్ లైన్ పోస్టింగ్‌గా భావించే ప్రధాన కంట్రోల్ రూమ్‌కు మార్చారు. బి.అనురాధ, ఎం.రామారావు, ఎల్.రాములులను ఫలక్‌నుమ, భవానీనగర్, మంగళ్‌హాట్ ఠాణాలకు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లుగా నియమించారు. అయితే ఈ బదిలీలకు కారణాలపై నగర పోలీసు కమిషనర్‌ను ‘సాక్షి’సంప్రదించగా.. కేవలం పాలనా పరమైన కారణాలతోనే ట్రాన్స్ఫర్స్ చేశామని, ఎలాంటి ప్రత్యేక కారణాలు లేవని అన్నారు. జయరామ్ హత్యలో పోలీసుల పాత్ర పైనా, ఆ కేసు హైదరాబాద్‌కు బదిలీ పైనా ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఆయన పేర్కొన్నారు. కాగా, పోలీసుల పాత్రపై అటు ఏపీ, ఇటు తెలంగాణ పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
పిడిగుద్దులు గుద్దాను.. చనిపోయాడు!
సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి : సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. అతడిని శిఖాచౌదరి ప్రియుడే చంపాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న శిఖాచౌదరి ప్రియుడు రాకేష్‌రెడ్డి నేరచరిత్రపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇతడిపై కూకట్పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా హత్యకు గురయిన జయరామ్ భార్య పద్మశ్రీ.. మేనకోడలు శిఖాచౌదరిపై సంచలన ఆరోపణలు చేశారు. శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్ అంటూ దుయ్యబట్టారు. తన అక్క నుంచే ప్రాణహాని ఉందని గతంలో తనకు జయరాం చెప్పారన్నారు. ఆయన భారత్‌కు వచ్చాక ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని ఆమె వాపోయారు. వ్యాపార లావాదేవీల సమావేశం నిమిత్తమే అమెరికా నుంచి భారత్‌కు వచ్చారని పద్మశ్రీ తెలిపారు. రెండేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు ఎన్నారై జయరామ్‌ను శిఖాచౌదరి ప్రియుడే హత్య చేశాడని నిర్ధారణకు వచ్చిన కృష్ణాజిల్లా పోలీసులు.. అసలు హత్యకు దారితీసిన కారణాలేంటి? ఎలా చేశాడు? ఎవరు సహకరించారు? అనే విషయాలు అతడి నుంచి రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. విచారణలో పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. ‘జయరామ్‌కు మెదక్‌లో టెక్ట్రాన్ పాలీలెన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఉద్యోగులు జీతం అందక గొడవ చేస్తున్న సమయంలో రెండేళ్ల కిందట నా వద్ద రూ. 4.50 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఆ సమయంలోనే జయరామ్ మేనకోడలు శిఖాచౌదరి పరిచయం అయింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ బంధం బలపడడంతో ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆమె కోసం నేను చాలా డబ్బు ఖర్చు పెట్టా. శిఖా చౌదరిని వదిలేయాలని జయరామ్ నన్ను కోరాడు. నాకు ఇవ్వాల్సిన 4.50 కోట్లతో పాటు శిఖాకి ఖర్చు పెట్టిన కోటి రూపాయలు ఇస్తే వదిలేస్తానని చెప్పాను. అందుకు సరే అన్న జయరామ్ ఇప్పటి వరకూ పైసా ఇవ్వలేదు. జనవరి 29న జయరామ్ అమెరికా నుంచి వచ్చినట్లు తెలిసి డబ్బులు అడగడానికి వెళ్లా. నాపైనా ఒత్తిడి ఉంది. ఎంత అడిగినా జయరామ్ డబ్బులు ఇవ్వకపోయే సరికి తీవ్రస్థాయిలో బెదిరించాను. దీంతో 31వ తేదీన ఉదయం అతడు ఒంటరిగా మా ఇంటికి వచ్చాడు. నా ఇంట్లో నుంచే పలువురికి జయరాం ఫోన్ చేసి డబ్బు సర్దుబాటు చేయమని కోరాడు. చివరకు కోస్టల్ బ్యాంక్‌లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి ద్వారా రూ. 6 లక్షలు నా స్నేహితులకు అందజేశాడు. రూ.5.5 కోట్లకు గానూ కేవలం 6 లక్షలు ఇవ్వడమేంటని జయరామ్‌తో వాదనకు దిగాను. అది తీవ్రస్థాయికి చేరింది. దాంతో జయరాంపై పిడిగుద్దులు గుద్దాను. జయరామ్ హార్ట్ పేషెంట్ కావడంతో ఆ దెబ్బలకే చనిపోయాడు. అప్పుడు ఏంచేయాలో తెలియక మృతదేహాన్ని సాయంత్రం వరకు ఇంట్లో ఉంచుకుని అనంతరం కారులో తీసుకెళ్లి నందిగామ సమీపంలోని ఐతవరం వద్ద కారు వెనుక సీటులో ఉన్న అతడిని బయటకు తీసి స్టీరింగ్ సీటులో కూర్చోపెట్టే ప్రయత్నం చేశా. అది కుదరకపోవడంతో అతడి చేతిలో బీరు సీసా ఉంచి.. మరో బీర్‌ను రోడ్డుపై పడేశా.. అక్కడి నుంచి నేను బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేశా.’అని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. నిందితుడు రాకేశ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(ఫైల్) శిఖాచౌదరి ప్రియుడి నేర చరిత్రపై ఆరా.. చిగురుపాటి జయరామ్ హత్యకేసులో నిందితుడు శిఖాచౌదరి ప్రియుడి నేరచరిత్రపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు నమ్మలేని నిజాలు వెల్లడవుతున్నాయి. గతంలో ఓ హీరోయిన్ వ్యభిచారం కేసులో అతడు పట్టుబడినట్లు గుర్తించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.80 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కూకట్పల్లి పోలీసుస్టేషన్లో అతడిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో అనేక మోసాలు, దందాల్లో అతడి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతోనూ సత్సంబంధాలున్నాయని తెలుస్తోంది. గత ఎన్నికల్లో టికెట్లు ఇప్పించే విషయంలోనూ భారీ లాబీయింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కుమారుడినంటూ సినిమా ఆరిస్టులతో పరిచయాలు.. హీరోయిన్లతో పార్టీలు పెట్టి పనులు చక్కదిద్దడంలో అతడు దిట్టని తెలుస్తోంది. ఇదిలా ఉండగా..శిఖాచౌదరి స్నేహంతో తమ కుమారుడు ఇంటికి రావడమే మానేశాడని, ఆమె పరిచయంతోనే అతడిలో మార్పు వచ్చిందని రాకేష్‌రెడ్డి తండ్రి చెబుతున్నారు. గతంలో అతడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని, జయరాం కేసులో తన కుమారుడిని అనవసరంగా ఇరికిస్తున్నారని ఆయన మీడియా వద్ద వాపోయారు. ఇంత దూరం ఎందుకురావాల్సి వచ్చింది? కోపంతో జయరామ్‌ను చంపేసిన చాలా గంటలపాటు మృతదేహాన్ని తన ఇంట్లోనే ఉంచుకున్నానని, ఆ తర్వాత మృతదేహాన్ని నందిగామ తీసుకొచ్చి.. ప్రమాదంగా చిత్రికరించి బస్ ఎక్కి వెళ్లిపోయానని శిఖాచౌదరి ప్రియుడు విచారణలో పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అప్పటికే నేరాలు చేయడంలో ఆరితేరిన అతడు ఇంతదూరం ప్రయాణించి సీసీ టీవీ నిఘా ఉండే టోల్గేట్లు దాటుకుంటూ నందిగామ సమీపంలోని ఐతవరం వరకు ఎందుకు రావాల్సి వచ్చిందన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది. ఒకవేళ జయరామ్ మృతి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించదలచుకుంటే హైదరాబాద్ శివారు దాటగానే ఆ పనిచేసి ఉండవచ్చు. కానీ నింపాదిగా కారులో ప్రయాణం చేసి నందిగామ వచ్చాక రాత్రి 10.20–10.41 నిమిషాల మధ్య పాతబస్టాండు సమీపంలోని విజయా బార్లో రెండు బీర్లు కొనుగోలు చేసినట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. ఇంత ఘోరంగా చంపుతారనుకోలేదు: పద్మశ్రీ తన భర్త హత్య కేసులో అతని తరఫు బంధువులపైనే అనుమానాలున్నాయని జయరామ్ భార్య పద్మశ్రీ ఆరోపించారు. కేసు విచారణలో భాగంగా ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసినట్లు సమాచారం. 2016 నుంచి ప్రాణాపాయం ఉందని జయరామ్ తనతో చెప్పేవారని తెలిపారు. సొంత అక్కతోనే ప్రాణహాని ఉందని జయరామ్ చెప్పేవారని పద్మశ్రీ వెల్లడించారు. మేనకోడలు శిఖా చౌదరి ప్రమే యం ఎక్కువ అవ్వడంతో ఆమెను చానల్ బాధ్యతల నుంచి తప్పించినట్లు పోలీసులకు చెప్పారు. అమెరికా నుంచి భారత్‌కు వచ్చాక ఇంత ఘోరంగా చంపుతారని ఊహించలేదని పద్మశ్రీ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. జయరామ్ హత్య కేసులో ఎవర్ని తప్పించేది లేదు: డీజీపీ కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ఎవరిని తప్పించే అవకాశంలేదని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. జయరామ్ హత్య కేసులో కీలక వ్యక్తులను కృష్ణా జిల్లా పోలీసులు తప్పిస్తున్నారనే ఆరోపణలను పలువురు మీడియా ప్రతినిధులు సోమవారం డీజీపీ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ కేసులో నిందితులు అందర్నీ కచ్చితంగా అరెస్టు చేస్తామని వెల్లడించారు. జయరామ్ హత్య కేసులో విచారణ దాదాపు పూర్తి అయ్యిందని అన్నారు. కేసు విచారణకు ఆరు బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. జయరాంను హైదరాబాద్ లో హత్య చేసి కృష్ణా జిల్లాకు తీసుకొచ్చినట్టు తేలిందన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కృష్ణా జిల్లా పోలీసులు త్వరలోనే మీడియాకు వెల్లడిస్తారని డీజీపీ తెలిపారు. -
రాకేష్‌రెడ్డి తండ్రి స్పందన..
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని రాకేష్‌రెడ్డి తండ్రి ధ్రువీకరించారు. అతడిపై ఎటువంటి కేసులు లేవని చెప్పారు. ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో తన కుమారుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాకేష్ హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నామన్నారు. శిఖా చౌదరి పరిచమైన తర్వాతే తమ కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని కోరారు. (ఎవరీ రాకేష్ రెడ్డి..?) ‘మా అబ్బాయి చాలా మంచోడు. సాయం చేస్తాడు కానీ ప్రాణాలు తీసే రకం కాదు. శిఖా చౌదరి పరిచయం కాకముందు మా దగ్గరే ఉండేవాడు. ఆమె పరిచయం అయిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఇంటికి రావడం కూడా మానేశాడు. ఆమె ఎప్పుడు పరిచయం అయిందో మాకు తెలియదు. శిఖాను నేనెప్పుడూ చూడలేదు. గతంలో మోసం కేసులో అన్యాయంగా అరెస్ట్ చేశారు. జయరాం హత్య కేసులో కావాలనే ఇరికించారు. అసలు అతడికి సంబంధమే లేదు. ఆర్థికంగా మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. జయరాం ఎవరో మాకు తెలియదు. పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయాల’ని రాకేష్ తండ్రి అన్నారు. సీసీకెమెరాకు చిక్కాడు! రాకేష్‌రెడ్డి మద్యం కొనుగోలు చేసిన వీడియో పోలీసులకు లభించింది. కృష్ణా జిల్లా నందిగామలోని విజయా బార్లో రెండు బీరు బాటిళ్లు కొనుగోలు చేసి వెళుతున్న రాకేష్‌రెడ్డి సీసీకెమెరాకు చిక్కాడు. జయరాం మృతదేహం లభ్యమైన కారులోనూ మద్యం సీసాలు లభ్యమైనమైన సంగతి తెలిసింది. మద్యం మత్తులో కారు ప్రమదానికి గురైన జయరాం మృతి చెందినట్టుగా సీన్ క్రియేట్ చేయడానికి రాకేష్ విఫలయత్నం చేసినట్టు పోలీసులు గుర్తించారు. -
బయటపడుతున్న రాకేష్ నేరచరిత్ర
-
బయటపడుతున్న రాకేష్ లీలలు
సాక్షి, హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి నేరచరిత్రపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో అతడిపై పలు కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. గతంలో ఓ టాప్ హీరోయిన్‌తో వ్యభిచారం చేయించిన కేసులో అతడు పట్టుబడినట్టు గుర్తించారు. యువతులతో హైటెక్ వ్యభిచార ముఠా నడిపినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం కూకట్పల్లి ఎమ్మెల్యే పేరుతో బెదిరించి ఓ వ్యక్తి 80 లక్షలు వసూలు చేసిన కేసులో రాకేష్ అరెస్టైనట్టు తెలిసింది. ఓ రాజకీయ పార్టీతో సన్నిహితంగా ఉన్న అతడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మందికి టిక్కెట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. మాయామాటలతో మోసాలు పాల్పడటం అతడి నైజమని వెల్లడైంది. అనేక మోసాలు, దందాలు సాగించినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. జూబ్లీహిల్స్‌లోని ఓ విలాసవంతమైన ఇంట్లో అతడు అద్దెకు ఉంటున్నాడు. ఈ ఇంట్లోనే జయరాంను నిర్బంధించినట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం రాకేష్ నివాసం ఉంటున్న ఇంట్లో సోదాలు జరిపారు. అయితే రాకేష్ విలాసవంతమైన జీవితం చూసే శిఖా చౌదరి అతడి మాయలో పడినట్టు తెలుస్తోంది. జయరాంకు రాకేష్ రెడ్డి రూ. 4.5 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి అప్పుగా ఇచ్చాడనేది తెలియాల్సివుంది. జయరాంను రాకేష్ హత్య చేశాడా, లేదా అనేది వెల్లడి కాలేదు. దర్యాప్తు దాదాపు ముగిసిందని, నిందితులను త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని కృష్ణా జిల్లా డీఎస్పీ బోస్ తెలిపారు. (మిస్టరీ వీడినట్లే.. నా?) -
కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో రాకేశ్, శిఖా
కంచికచర్ల (కృష్ణా జిల్లా): ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. జయరామ్ మేనకోడలు శ్రిఖా చౌదరి, ఆమె చెల్లెలు మనీషా, రాకేశ్ రెడ్డిలను కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డీఎస్పీ బోస్ ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో శిఖా చౌదరి పాత్ర ఏంటనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జయరాం భార్య పద్మశ్రీతో ఫోన్లో పోలీసులు మాట్లాడారు. (జయరామ్‌తోఉన్నదెవరు?) జయరాం ఒంటిపై తీవ్రమైన గాయాలు లేకపోవడంతో ఆయనకు సైనైడ్ ఇచ్చారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పరీక్ష కోసం విశ్రా శాంపిల్‌ను హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. జయరాంకు అనేక వివాదాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్లోని సీసీటీవీ ఫుటేజీని తీసుకున్నామని పోలీసులు తెలిపారు. టోల్గేట్ వద్ద రికార్డైన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా జయరామ్ పక్కన మరో వ్యక్తి ఉన్నట్టు తేలిందన్నారు. ఈ కేసులో టీడీపీ ఎంపీ తమ్ముడి కుమారుడి హస్తం ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అతడిని కూడా విచారించాలని భావిస్తున్నారు. జయరామ్ చనిపోయిన తర్వాత రాకేశ్‌తో కలిసి శిఖా ఆయన ఇంటి వెళ్లి కీలక పత్రాల కోసం గంటసేపు గాలించినట్టు తేలింది. బెడ్రూం తాళాలు ఇచ్చేందుకు నిరాకరించిన జయరామ్ వ్యక్తిగత సిబ్బందిపై వీరిద్దరూ దాడి చేసినట్టు సమాచారం. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జయరామ్ ఇంట్లోకి చొరబడినట్టు తెలుస్తోంది. (జయరామ్ హత్యకేసులో కొత్త కోణం) కాగా, అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న జయరామ్ కుటుంబీకులు ఇంకా హైదరాబాద్ చేరుకోకపోవడంతో అంత్యక్రియలు ఆలస్యంకానున్నాయి. మంచు తుఫాన్ కారణంగా అమెరికాలో విమాన సేవలు నిలిచిపోవడంతో జయరామ్ కుటుంబీకుల రాక ఆలస్యం కానుంది. -
కాంగ్రెస్‌ది దివాలాకోరు రాజకీయం: రాకేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పెట్రో ల్, డీజల్ ధరల పెరుగుదలకు కారణమైన కాంగ్రెస్ పార్టీనే భారత్ బంద్‌కు పిలుపునిచ్చి దివాలాకోరు రాజకీయం చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్న మాట వాస్తవమేనని, అయితే దీనికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వాస్తవాలు ప్రజలకు తెలుసు కాబట్టే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపును ప్రజలు బొంద పెట్టారని అన్నారు. యూపీఏ ప్రభుత్వం బాధ్య త లేకుండా రూ.1,50,000 కోట్ల విలువ గల బాండ్లు విడుదల చేయడం వల్ల ఈరోజు మోదీ ప్రభుత్వం రూ.50,000 కోట్ల వడ్డీతో కలిపి మొత్తం 2 లక్షల కోట్ల రూపాయల అప్పును చెల్లించాల్సి వస్తోందన్నారు. -
విల్లాలో ఏం జరిగింది?
శ్రీ తిరుమల మూవీ మేకర్స్‌పై రాకేష్ రెడ్డి దర్శకత్వంలో పోలా రావు దండెం, ప్రతాప్ దండెం నిర్మిస్తోన్న హారర్ చిత్రం ‘దామిని విల్లా’ ఆదిత్యా ఓం, రేఖా బోజ్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘హారర్ చిత్రాల్లో కొత్త ట్రెండ్ సష్టించే చిత్రంగా ‘దామిని విల్లా’ నిలుస్తుందన్న నమ్మకం ఉంది. ఇంతవరకు సిల్వర్ స్క్రీన్ పై రాని ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. దామిని విల్లాలో ఏం జరిగింది? అనేదే చిత్రం. నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రమోద్ కుమార్ పరిసర్ల; కెమెరా: శ్రీనివాస్ సబ్బి, ఎడిటింగ్: ఎమ్కేయస్ మనోజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ యాదవ్, నిర్మాతలు: పోలా రావు దండెం, ప్రతాప్ దండెం, రచన–దర్శకత్వం: రాకేష్ రెడ్డి. -
లక్ష్మీస్ ఎన్టీఆర్ పై వర్మ ప్రకటన
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రానికి తెరతీశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమాను ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేసిన వర్మ, తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరులో సినిమాను అధికారికంగా ప్రకటించారు. నిర్మాత రాకేష్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేశారు. 2018లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు. అక్టోబర్ నాటికి సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాంటిదన్న వర్మ, తమ సినిమాలో కేవలం ఒక అధ్యాయాన్ని మాత్రమే చూపిస్తామని తెలిపారు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి సినిమా మొదలవుతుందని తెలిపారు. ఈ సినిమా కన్నా ముందు నిర్మాత రాకేష్ రెడ్డితో ఎలాంటి పరిచయం లేదన్న వర్మ, బాలకృష్ణ నిర్మించే ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వంలో వహించే అవకాశం లేదని అన్నారు. ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదని త్వరలోనే కీలక పాత్రధారులను ప్రకటిస్తామని తెలిపారు. తను కేవలం తనకు తెలిసిన ఎన్టీఆర్ జీవితాన్ని మాత్రమే చూపిస్తానని సినిమాలో ఎలాంటి రాజకీయ కోణం ఉండదని తెలిపారు. -
మైనర్‌పై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: నగర శివారులో దారుణం జరిగింది. మాయమాటలు చెప్పి మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. మన్సురాబాద్‌లోని ఆదిత్య నగర్‌కు చెందిన రాకేష్ రెడ్డి(19) ఇంటి పక్కనే ఉంటున్న ఓ మైనర్ బాలికతో చనువుగా ఉండేవాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
‘మంత్రులకు నేను చెప్పిందే వేదం’
ఇదీ మోసగాడు రాకేష్‌రెడ్డి మాట తీరు కుత్బుల్లాపూర్: ‘‘మంత్రులకు నేను చెప్పిందే వేదం. ఏం చెప్తే అదే చేస్తారు.... ఎంపీలు... ఎమ్మెల్యేలు నాకు క్లోజ్.. హీరోయిన్సా.. వారి సంగతి నాకు వదిలేయ్’’.. అంటూ ఇతరులను ఇట్టే బుట్టలో వేసుకోవడం రాకేష్‌రెడ్డి నైజం.. టీడీపీ తెలుగు యువత నేతగా కుత్బుల్లాపూర్‌లో వెలుగు వెలిగిన రాకేష్‌రెడ్డి గురువారం కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేడీగా మారిన విషయంపై ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇతను గత మూడేళ్లుగా టీడీపీలో తిరుగుతూ కీలక నేతల కుమారులతో స్నేహం చూస్తూ వారిని ఆకట్టుకునేలా వ్యవహరించేవాడని తెలిసింది. జల్సాలకు అలవాటుపడిన రాకేష్‌రెడ్డి క్రికెట్ బెట్టింగ్స్ కాసేవాడు. బుకీలకు ఫోన్ల ద్వారా బెట్టింగ్‌లు చెప్పేవాడు. గెలిస్తే వెళ్లి డబ్బు తీసుకొనేవాడు.. ఓడితే మాత్రం బుకీలకు చుక్కలు చూపెట్టేవాడు. బూకీలు నిలదీస్తే మాజీ మంత్రుల కుమారుల పేర్లు చెప్పి తప్పించుకునే వాడు. మొదట స్నేహం.. ఆపై ద్రోహం రాకేష్‌రెడ్డి వ్యవహార శైలి మొదటి నుంచీ వివాదాస్పదమే. ఎవరి వద్దా పట్టుమని నమ్మకంగా పది రోజులు కూడా ఉండడు. వారి వద్దకు వచ్చే ప్రముఖల నుంచి ఫోన్ నెంబర్లు తీసుకుంటాడు. తర్వాత వారికి ఫోన్ చేసి బెదిరించి డబ్బు గుంజుతాడు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వద్ద కొన్ని రోజులు నమ్మకంగా ఉన్న రాకేష్‌రెడ్డి వ్యవహార శైలిని గుర్తించి వెంటనే అతన్ని పక్కకు తప్పించారు. అక్కడి నుంచి మకాం మార్చిన ఇతను నగరానికి చెందిన ఇద్దరు మాజీ హోం మంత్రుల కుమారులతో సన్నిహితంగా ఉంటూ వారిని కూడా ఇదే తరహాలో మోసం చేయడంతో వారు తరిమి కొట్టారు. చివరి ప్రయత్నంగా ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి డబ్బు వసూలు చేస్తూ పోలీసులకు అడ్డంగా చిక్కాడు. అప్పులు చేసి గోవాలో ఎంజాయ్... రాకేష్‌రెడ్డి టీడీపీ తెలుగు యువత నాయకుడిగా తనకు తానే ప్రకటించుకుని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొనేవాడు. టీడీపీ నాయకుడిగా తనను నమ్మినవారి వద్ద సుమారు రూ. 2 కోట్లు వసూలు చేసిన రాకేశ్‌రెడ్డి వారికి దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అప్పు తీసుకున్న డబ్బుతో గోవాలో జల్సాలు చేస్తున్నాడు. ఈనెల 3వ వారంలో రాకేష్‌రెడ్డిపై ఫిర్యాదులందగా పోలీసులు ఆరా తీయగా గోవాలో ఉన్నట్టు తెలిసింది. ఈనెల 16న నగరానికి వచ్చిన రాకేష్‌రెడ్డిని క్రైం పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పెద్ద ఎత్తున వ్యాపారులను, ఇతరులను బెదిరించి రూ. 12 లక్షలు వసూలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే అతను చెప్పిన దానికంటే ఎక్కువ మొత్తమే వసూలు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఏదేమైనా టీడీపీ నాయకులతో తిరుగుతూ జల్సాలు చేసిన రాకేష్‌రెడ్డి పోలీసులకు పట్టుబడటంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలు కంగుతిన్నారు. -
నిన్న హీరో.. నేడు కేడీ
ఎమ్మెల్యేల పేర్లు చెప్పి వసూళ్లు ఇద్దరి అరెస్టు భాగ్యనగర్ కాలనీ: ఎమ్మెల్యేల పేర్లు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లు ఏకంగా ఓ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు నుంచే డబ్బు వసూలుకు యత్నించి దొరికిపోయారు. గురువారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏసీపీ భుజంగరావు తెలిపిన వివరాల ప్రకారం... షాపూర్‌నగర్‌కు చెందిన కవకుట్ల రాకేష్‌రెడ్డి (28) వ్యాపారి. ఇతను చింతల్‌కు చెందిన చౌడవరం మహేష్‌కుమార్ (38)తో కలిసి ప్రజాప్రతినిధుల పేర్లను వాడుకొని సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. ఆరు నెలలుగా వీరిద్దరూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుల పేర్లు చెప్పి పార్టీ ఫండ్ అంటూ ఆరు పరిశ్రమలు, షాపింగ్ మాల్స్‌తో పాటు వస్త్ర దుకాణాల్లో రూ. 12.55 లక్షలు వసూలు చేశారు. అయితే వీరు ఈనెల 22న భాగ్యనగర్‌కాలనీలోని గ్రీన్ బవార్చీ హోటల్ యజమాని భాస్కర్‌రావుకు ఫోన్ చేసి ఎమ్మెల్యే మనుషులమని, పార్టీ ఫండ్ కింద రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా మరుసటి రోజు కేపీహెచ్‌బీలోని కళానికేతన్ యజమానికి ఫోన్ చేసి రూ. 50 వేలు డిమాండ్ చేశారు. ఇలా వెలుగులోకి... గ్రీన్ బవార్చీ హోటల్ యజమాని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సొంత అన్న కొడుకు కావడంతో అక్రమ దందా విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. ఆయన సూచన మేరకు హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల ఫోన్ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తాము ఎవరెవరి వద్ద డబ్బు డిమాండ్ చేశామో నిందితులు వెల్లడించారు. వారి వద్ద నుంచి పోలీసులు రూ. 1.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో కూకట్పల్లి సీఐ పురుషోత్తం, అడిషనల్ సీఐ సురేందర్‌గౌడ్, ఎస్ఐ క్రాంతికుమార్ పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్: పోలీసులకు చిక్కిన రాకేష్‌రెడ్డి ఆది నుంచి వివాదాస్పదుడిగానే ముద్ర పడ్డా డు. అందరి దృష్టిలో పడేందుకు టీడీపీ నేత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కుత్బుల్లాపూర్‌లో హల్చల్ చేస్తుండేవాడు. ఎవరు కలిసినా ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రుల పేర్లు, సినీ హీరోలు, హీరోయిన్ల పేర్లు చెప్పి తనకు క్లోజ్ అన్నట్లుగా నమ్మించేవాడు. కొన్ని సందర్భాల్లో అక్కడికక్కడే వారిలో ఫోన్లో మాట్లాడి ఆకట్టుకునేవాడు. ఇలా అందరి దృష్టిలో ‘ హీరో’ గా ఉన్న రాకేష్‌రెడ్డి ఒక్కసారిగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో నిందితుడిగా ప్రత్యక్షం కావడం చర్చానీయాంశంగా మారింది. చాలా రోజులుగా కని పించకుండా రాకేష్‌రెడ్డి కేవలం రాత్రిపూటనే తన నివాసానికి వచ్చి వెళ్తుండేవాడని తెలిసింది. ఇటీవలే టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, దేవేందర్‌గౌడ్ తనయుడు తూళ్లు వీరేందర్‌గౌడ్‌ల పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ దర్శనమిచ్చాడు. నమ్మిన వారిని నట్టేట ముంచి వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడమే హాబీగా మార్చుకున్నాడు. ఎప్పుడూ బిజీ బిజీగా ఉన్నట్లుగా స్థానికులకు బిల్డప్ ఇస్తూ లక్షల్లో డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వారిని ఇంటి చుట్టూ తిప్పించుకుని చుక్కలు చూపిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువగా వీఐపీలు, వీవీఐపీలతో ఫొటోలు దిగి వాటిని వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రచారం చేసుకునేవాడు. ఎవరైనా ఫోన్ చేస్తే ఫలానా ముఖ్యనేత.. వద్ద ఉన్నానంటూ నటించేవాడు. చింతల్ ప్రాంతానికి చెందిన మహేశ్‌తో కలిసి బెదిరింపులకు పాల్పడుతుండగా పోలీసులకు చిక్కారు. -
మా ఇద్దరిదీ ఒకే ఆలోచన
నంద్యాల, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డికీ, తనకు ఒకే ఆలోచనలు ఉన్నాయని ఆ పార్టీ నేత, ఎంపీ ఎస్పీవెరైడ్డి అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఇరువురం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని సత్యసాయిసేవా సమితిలో డాక్టర్ జూపల్లె రాకేష్‌రెడ్డి అమలు చేస్తున్న వైఎస్ఆర్ అభయ బీమా పథకాన్ని భూమా నాగిరెడ్డి, ఎస్పీవెరైడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రైతులు, పేదప్రజలపై భూమాకు ఎంతో అభిమానం ఉందన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. తనకు కూడా ఇలాంటి ఆలోచనలే ఉన్నాయని పేర్కొన్నారు. తామిద్దరి కలయికతో నంద్యాలలో నూతన రాజకీయ శకం ఆరంభమైందన్నారు. జూపల్లె సేవా సమితి నిర్వహిస్తున్న బీమా పథకం తనకెంతో ఆనందం కలిగిస్తున్నదన్నారు. ఈ పథకాన్ని సంపూర్ణంగా రాకేష్‌రెడ్డి అమలు చేయగలరనే ఆశాభావాన్ని ఎస్పీవై రెడ్డి వ్యక్తం చేశారు. కష్టాల నుంచి విముక్తి అయ్యే రోజు త్వరలో రానున్నదని భూమానాగిరెడ్డి అన్నారు. పేదల సమస్యలు తెలిసిన తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ముందుకొచ్చే ప్రతి ఒక్కరినీ భుజంతట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ నిర్మాణంలో కార్మికులు, పేదల పాత్ర అనిర్వచనీయమైందన్నారు. పనుల్లో ఉన్నప్పుడు ప్రమాదాలకు గురై వారు మృత్యువాతకు గురవుతున్నారని.. అలాంటి వారికి బీమా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నంద్యాల పట్టణంలో ఎలాంటి స్వార్థం లేకుండా ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలను ఆదుకుంటున్నారని.. వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. బీమా పథకం నిర్వహకుడు డాక్టర్ రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ..మొదటి విడతలో వెయ్యి మందికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్కరికి లక్ష రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. దశలవారీగా దీనిని అమలు చేస్తామని వివరించారు. సమావేశంలో గురురాఘవేంద్ర కోచంగ్ సెంటర్ అధినేత దస్తగిరి రెడ్డి, తెలుగుగంగ డీఈ చిన్నపురెడ్డి, నవనంది రోటరీక్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జూపల్లె సేవా సంస్థ గౌరవాధ్యక్షుడు స్వామిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.