సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపును టీఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి అన్నారు. నాలుగు ఎంపీ స్థానాలను బీజేపీ గెలిచిందని, అయితే దీనిపై కేటీఆర్ విడ్డూరంగా మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ నాయకులు స్పీడ్ బ్రేకర్ అంటున్నారని, కానీ అది స్పీడ్ బ్రేకర్ కాదని, కారుకు యాక్సిడెంట్ అయిందన్నారు.
ఓటమి నుంచి గుణపాఠం బీజేపీ నేర్చుకుంది కాబట్టే 300కు పైగా ఎంపీ సీట్లు గెలిచిందని తెలిపారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడ్రసే గల్లంతైందన్నారు. కాంగ్రెస్ నాయకులు నాలుగైదు వేల ఓట్లతో గెలిస్తే బీజేపీ నాయకులు భారీ మెజారిటీతో గెలిచారని తెలిపారు. రాష్ట్రాన్ని త్వరలో కాషాయ వర్ణంగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ చెల్లని రూపాయి కాదని, బీజేపీ ఎప్పుడైనా ఎక్కడైనా చెల్లుతుందని పేర్కొన్నారు. కేటీఆర్ ట్విట్టర్ లీడర్‌గా వెలుగొందుతున్నారే తప్ప.. ప్రజల లీడర్‌గా లేరని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment