
సాక్షి, హైదరాబాద్: పెట్రో ల్, డీజల్ ధరల పెరుగుదలకు కారణమైన కాంగ్రెస్ పార్టీనే భారత్ బంద్‌కు పిలుపునిచ్చి దివాలాకోరు రాజకీయం చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్న మాట వాస్తవమేనని, అయితే దీనికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు.
సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వాస్తవాలు ప్రజలకు తెలుసు కాబట్టే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపును ప్రజలు బొంద పెట్టారని అన్నారు. యూపీఏ ప్రభుత్వం బాధ్య త లేకుండా రూ.1,50,000 కోట్ల విలువ గల బాండ్లు విడుదల చేయడం వల్ల ఈరోజు మోదీ ప్రభుత్వం రూ.50,000 కోట్ల వడ్డీతో కలిపి మొత్తం 2 లక్షల కోట్ల రూపాయల అప్పును చెల్లించాల్సి వస్తోందన్నారు.