![Chigurupati Jayaram Case Nampally Court LIfe Imprisonment Rakesh Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/9/Untitled-2.jpg.webp?itok=GXyBBvCA)
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక వేత్త చిగురుపాటి జైరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చిన నాంపల్లి కోర్టు... తాజాగా అతనికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని నాంపల్లి కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
కాగా.. 2019 జనవరి 31న జయరాం దారణహత్యకు గురైన సంగతి తెలిసింది. ఆయనను రాకేష్ రెడ్డి హత్య చేసి.. తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే చివరికి నాలుగేళ్లుగా విచారణ తరువాత ఈ కేసులో న్యాయస్థానం 11 మంది నిందితులపై కేసు కొట్టివేయడంతో పాటు రాకేష్ రెడ్డిని దోషిగా పరిగణిస్తూ అతనికి శిక్ష ఖరారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment