ప్రవాసాంధ్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు కె.రాకేశ్‌రెడ్డితోపాటు మరో ఏడుగురు నిందితులపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లిలోని 17వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 70 మంది సాక్షులను విచారించిన పోలీసులు 388 పేజీల చార్జిషీట్ రూపొందించారు.