పోలీసులు, కూటమి నేతలు కుమ్మక్కు: కాసు మహేష్‌రెడ్డి | Ysrcp Leader Kasu Mahesh Reddy Fires At Tdp Leaders | Sakshi
Sakshi News home page

పిడుగురాళ్లలో అరాచకం.. పోలీసులు, కూటమి నేతలు కుమ్మక్కు: కాసు మహేష్‌రెడ్డి

Published Tue, Feb 4 2025 9:08 AM | Last Updated on Tue, Feb 4 2025 12:39 PM

Ysrcp Leader Kasu Mahesh Reddy Fires At Tdp Leaders

పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీ నేతలు మండిపడుతున్నారు.

సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీ నేతలు మండిపడుతున్నారు. పిడుగురాళ్ల పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు కాగా, గతంలో 33 వార్డులను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. ఒక కౌన్సిలర్‌ను టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ చనిపోవడంతో ఆ స్థానానికి ఎన్నికల నిర్వహించడానికి నోటిఫికేషన్ వెలువడింది. నిన్న(సోమవారం) వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళనివ్వకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ నామినేషన్ కూడా దాఖలు చేయనివ్వకుండా టీడీపీ రౌడీలు అడ్డుకున్నారు. దీంతో ఈరోజుకు వైఎస్‌ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు టీడీపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.

కిడ్నాప్ చేసిన కౌన్సిలర్లు ను విడిచిపెట్టకపోతే టీడీపీ కుట్రపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ, పోలీసులు, కూటమి నాయకులు కుమ్మక్కైపోయారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీకి చెందిన పదిమంది కౌన్సిలర్లను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన  టీడీపీ నాయకులకు పోలీసులు అండగా ఉన్నారు. పిడుగురాళ్లలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. కిడ్నాప్ పైన కొంతమంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ఇంటి నుంచి పోలీసులే తీసుకువెళ్లారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు పోలీసులు తీసుకువెళ్లి  టీడీపీ నేతలకు అప్పగించారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకం నడుస్తోంది’’ అని కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement