చెల‌రేగిన డికాక్‌.. రాజ‌స్తాన్‌పై కేకేఆర్ ఘ‌న విజ‌యం | IPL 2025: Kolkata knight riders vs Rajasthan royals live updates and highlights | Sakshi
Sakshi News home page

IPL 2025 RR vs KKR: చెల‌రేగిన డికాక్‌.. రాజ‌స్తాన్‌పై కేకేఆర్ ఘ‌న విజ‌యం

Published Wed, Mar 26 2025 7:03 PM | Last Updated on Wed, Mar 26 2025 11:11 PM

IPL 2025: Kolkata knight riders vs Rajasthan royals live updates and highlights

KKR vs RR Live Updates And Highlights: 

రాజ‌స్తాన్‌పై కేకేఆర్ ఘ‌న విజ‌యం
గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజ‌యం సాధించింది. 152 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్‌.. 17.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. కోల్‌క‌తా విజ‌యంలో క్వింట‌న్ డికాక్ కీల‌క పాత్ర పోషించాడు. ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన డికాక్ ఆఖ‌రి వ‌ర‌కు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు.

 61 బంతులు ఎదుర్కొన్న డికాక్‌.. 8ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 97 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అత‌డితో పాటు ర‌ఘువంశీ(22), ర‌హానే(18) ప‌రుగుల‌తో రాణించారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో హ‌స‌రంగా ఒక్క‌డే ఓ వికెట్ సాధించ‌గా.. మ‌రో వికెట్ ర‌నౌట్ రూపంలో వ‌చ్చింది. 

16 ఓవ‌ర్ల‌కు కేకేఆర్ స్కోర్‌: 125/2
16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ రెండు వికెట్ల న‌ష్టానికి 125 ప‌రుగులు చేసింది. క్రీజులో డికాక్‌(79), ర‌ఘువంశీ(20) ప‌రుగుల‌తో ఉన్నారు.

10 ఓవ‌ర్ల‌కు కేకేఆర్ స్కోర్‌: 70/0
10 ఓవ‌ర్లు ముగిసేస‌రికి కేకేఆర్ వికెట్ న‌ష్టానికి 70 ప‌రుగులు చేసింది. క్రీజులో డికాక్‌(45), ర‌హానే(18) ఉన్నారు.
5 ఓవ‌ర్ల‌కు కేకేఆర్ స్కోర్‌: 35/0
5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ వికెట్ న‌ష్టపోకుండా 35 ప‌రుగులు చేసింది. క్రీజులో క్వింట‌న్ డికాక్‌(30), మొయిన్ అలీ(4) ఉన్నారు.

రాణించిన కేకేఆర్ బౌల‌ర్లు.. 
గౌహ‌తి వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌డ‌బ‌డ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగులు చేసింది. రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో ధ్రువ్ జురెల్‌(33) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. య‌శ‌స్వి జైశ్వాల్‌(29), రియాన్ ప‌రాగ్‌(25) ప‌రుగుల‌తో రాణించారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో వైభ‌వ్ ఆరోరా, హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, మొయిన్ అలీ త‌లా రెండు వికెట్లు సాధించారు.

17 ఓవ‌ర్ల‌కు రాజ‌స్తాన్ స్కోర్‌: 123/6
17 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 6 వికెట్ల న‌ష్టానికి 123 ప‌రుగులు చేసింది. క్రీజులో ధ్రువ్ జురెల్‌(32), హెట్‌మైర్‌(2) ప‌రుగుల‌తో ఉన్నారు.

పీక‌ల్లోతు క‌ష్టాల్లో రాజ‌స్తాన్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌డ‌బ‌డుతోంది. కేవ‌లం 82 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి రాజ‌స్తాన్ క‌ష్టాల్లో ప‌డింది. కేకేఆర్ స్పిన్న‌ర్లు రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెడుతున్నారు. ప్ర‌స్తుతం క్రీజులో ధ్రువ్ జురెల్‌, శుభ‌మ్ దూబే ఉన్నారు.

రాజ‌స్తాన్ మూడో వికెట్ డౌన్‌
య‌శ‌స్వీ  జైశ్వాల్ రూపంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 29 ప‌రుగులు చేసిన జైశ్వాల్‌.. మెయిన్ అలీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 9 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 71/3

రాజ‌స్తాన్ రెండో వికెట్ డౌన్‌..
రియాన్ ప‌రాగ్ రూపంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 25 ప‌రుగులు చేసిన ప‌రాగ్‌.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి నితీష్ రాణా వ‌చ్చాడు. 8 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 67/2

రాజస్తాన్ తొలి వికెట్ డౌన్‌..
సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన సంజూ శాంసన్‌.. వైభవ్ అరోరా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 4 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 34/1

2 ఓవ‌ర్ల‌కు రాజ‌స్తాన్ స్కోర్‌: 14/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ రెండో ఓవ‌ర్ ముగిసే స‌రికి వికెట్ న‌ష్ట‌పోకుండా 14 ప‌రుగులు చేసింది. క్రీజులో య‌శ‌స్వి జైశ్వాల్‌(7), సంజూ శాంస‌న్‌(7) ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో సెకెండ్ రౌండ్ మొద‌లైంది. రెండో రౌండ్ తొలి మ్యాచ్‌లో గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి.  ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్‌ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌కు కేకేఆర్ స్టార్ ప్లేయ‌ర్ సునీల్ నరైన్ గాయం కార‌ణంగా దూర‌మ‌య్యాడు. అత‌డి స్దానంలో మెయిన్ అలీ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. మ‌రోవైపు రాజ‌స్తాన్ తుది జ‌ట్టులోకి ఫ‌రూఖీ స్ధానంలో హ‌స‌రంగా వ‌చ్చాడు.

తుది జ‌ట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: క్వింటన్ డి కాక్ (వికెట్ కీప‌ర్‌), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్‌), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్‌), ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement