
ఐపీఎల్ తాజా సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సేవలు లభించేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత జనవరిలో ఆ్రస్టేలియా పర్యటన నుంచి వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. వేగంగా కోలుకుంటున్న బుమ్రా ఐపీఎల్‌లో కనీసం మరో రెండు మ్యాచ్‌లు ముంబై జట్టుకు దూరంగా ఉండనున్నాడు.
బుమ్రాకు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించిన తర్వాత... బీసీసీఐ మెడికల్ టీమ్ బుమ్రా ఫిట్‌నెస్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తేనే అతను ఐపీఎల్‌లో ఆడతాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించాకే మళ్లీ మైదానంలో అడుగు పెట్టాలని బుమ్రా భావిస్తున్నాడు. వచ్చే జూన్‌లో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో భారత్ పర్యటించనుంది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో బుమ్రా పునరాగమనంపై తొందరపడకూడదని బీసీసీఐ భావిస్తోంది. ముంబై తరఫున బుమ్రా ఆడలేకపోతుండటంతో... సత్యనారాయణ రాజు, విఘ్నేశ్, అశ్వని కుమార్‌లాంటి యువ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది