
ఐపీఎల్-2025 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. పేలవ ఫామ్ కారణంగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
రోహిత్ ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. అతడు ఇంకా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2025లో బుమ్రా ఆడేది అనుమానమే మారింది.
బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. ఒకవేళ రోహిత్, బుమ్రా దూరమైతే.. ఇంగ్లండ్ పర్యటనలో భారత కెప్టెన్‌గా ఎవరు బాధ్యతలు చేపడాతరన్న ప్రశ్న అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. ఈ క్రమంలో రోహిత్, బుమ్రా బ్యాకప్‌గా శుబ్‌మన్ గిల్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కాగా గిల్ ప్రస్తుతం వన్డేల్లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అదేవిధంగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక భారత క్రికెట్ జట్టు ఏడాది జూన్ 20న ఇంగ్లాండ్ పర్యటనను ప్రారంభిస్తుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది.
తదుపరి నాలుగు టెస్ట్‌లు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, కెన్నింగ్టన్ ఓవల్ వేదికలపై జరగనున్నాయి. అంతకంటే ముందు భారత-ఎ జట్టు రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్-2025 చివరి వారంలో ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.
చదవండి: సీఎస్‌కే బౌలర్ ‘ఓవరాక్షన్’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ