షాహీన్‌ అఫ్రిది ప్రపంచ రికార్డు.. | Shaheen Afridi Joins Malinga, Southee For Rare World Record | Sakshi
Sakshi News home page

PAK vs SA: షాహీన్‌ అఫ్రిది ప్రపంచ రికార్డు..

Published Wed, Dec 11 2024 11:24 AM | Last Updated on Wed, Dec 11 2024 12:44 PM

Shaheen Afridi Joins Malinga, Southee For Rare World Record

డ‌ర్బ‌న్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టీ20లో 11 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్ ప‌రాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓడిన‌ప్ప‌ట‌కి ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ షాహీన్ షా అఫ్రిది అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 22 ప‌రుగులిచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ పీట‌ర్‌ను ఔట్ చేయ‌డంతో అఫ్రిది వందో టీ20 వికెట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్ర‌మంలో ఓ అరుదైన ఘ‌న‌త‌ను ఈ పాకిస్తానీ స్పీడ్ స్టార్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

ఆల్ ఫార్మాట్ల‌లో 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన నాలుగో ప్లేయ‌ర్‌గా అఫ్రిది రికార్డుల‌కెక్కాడు. అఫ్రిది ఇప్ప‌టివ‌ర‌కు టెస్టుల్లో 116 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వ‌న్డేల్లో 112, టీ20ల్లో 100 వికెట్లు సాధించాడు. ఈ అరుదైన ఫీట్ న‌మోదు చేసిన జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేస‌ర్ టిమ్ సౌథీ అగ్ర‌స్ధానంలో ఉన్నాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తానీ కూడా అఫ్రిదినే కావడం గమనార్హం.

👉మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్లు వీరే

బౌలర్‌టెస్టు వికెట్లువన్డే వికెట్లుటీ20 వికెట్లు
టిమ్‌ సౌథీ(న్యూజిలాండ్‌)389221164
షకీబ్‌ అల్‌హసన్‌(బంగ్లాదేశ్‌)246317149
లసిత్‌ మలింగ(శ్రీలంక)101338107
షాహీన్‌ అఫ్రిది(పాక్‌)116112100

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement