
గాలే వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసీస్ (Australia) వికెట్‌కీపర్ బ్యాటర్ ఆలెక్స్ క్యారీ (Alex Carey) శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బరిలోకి దిగిన క్యారీ.. 117 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో కెరీర్‌లో రెండో టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. క్యారీ తన సెంచరీ మార్కును బౌండరీతో చేరుకున్నాడు. క్యారీ తన తొలి టెస్ట్ సెంచరీని 2022 బాక్సింగ్ డే టెస్ట్‌లో సాధించాడు.
MOST TEST HUNDREDS IN ASIA BY WICKET-KEEPER BATTERS FROM AUSTRALIA:
Adam Gilchrist - 4
Alex Carey - 1* pic.twitter.com/E7yGUofiiB— Johns. (@CricCrazyJohns) February 7, 2025
ఈ మ్యాచ్‌లో క్యారీకి ముందు స్టీవ్ స్మిత్ (Steve Smith) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్మిత్‌కు టెస్ట్‌ల్లో ఇది 36వ శతకం. స్మిత్, క్యారీ సెంచరీలతో కదంతొక్కడంతో ఆసీస్ ఆధిక్యంలోకి వెళ్లింది. 74 ఓవర్ల అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్కోర్ 309/3గా ఉంది. క్యారీ (123), స్మిత్ (115) సెంచరీల అనంతరం అదే జోరుతో ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
కాగా, రెండు టెస్ట్ మ్యాచ్‌లు, రెండు వన్డేల సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.
టెస్ట్ సిరీస్ అనంతరం ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్‌కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆసీస్.. ఇంగ్లండ్‌తో తలపడుతుంది.